Siddipeta |ఆంధ్రప్రభ బ్రోచర్ ను విడుదల చేసిన నరసింహారెడ్డి
Siddipeta | ఆంధ్రప్రభ బ్రోచర్ ను విడుదల చేసిన నరసింహారెడ్డి Siddipeta |
న్యూఢిల్లీని మరోసారి శీతాకాలపు పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో కంటిచూపు తగ్గుతోంది. ఆస్పత్రులు నిండిపోతున్నాయి. జనాలకు ఊపిరి సలపడం లేదు. వాయు నాణ్యత సూచిక ప్రమాద స్థాయిలో ఉంది. ఫలితంగా పాఠశాలలు మూసివేయాల్సి వస్తోంది. రాజధాని నివాసితులకు ఏటా శ్వాసకు ఇబ్బంది, ఊపిరాడకపోవడం ఓ భయంకరమైన ఆచారంగా మారింది. రాజధానిలో పిల్లలు ఇప్పుడు స్వచ్ఛమైన గాలి తెలియక పొగమంచును రూచిచూస్తూ పెరుగుతున్నారు.శీతాకాలం అంటే చలి మాత్రమేకాక తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతుందని వృద్ధులు అంటున్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం అత్యవసర చర్యల గురించి చర్చిస్తుంది. కానీ, నిర్లక్ష్యం. తాత్కాలిక ఆలోచనే తప్ప, వాయుకాలుష్య నియంత్రణకు కఠినమైన, శాశ్వత చర్యలు తక్కువ. అయితే ఈసారి సమస్య కేవలం ఢిల్లీకే పరిమితం కావడంలేదు. మైదానాలకు దూరంగా -ఈశాన్య ప్రాంతంలో వాయు కాలుష్య భూతం విస్తరించిన వాస్తవాలు కలవరపెడుతున్నాయి. సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సిఆర్‌ఇఎ) చేసిన కొత్త శాటిలైట్ ఆధారిత ఎంపి 2.5 అంచనా దిగ్భాంతి కలిగించే వాస్తవాన్ని వెల్లడించింది. అసోంలోని 11 జిల్లాలు ఇప్పుడు దేశంలోని 50 అత్యంత కలుషిత జిల్లాలలో ఉన్నాయి. ఈ సంఖ్య ఢిల్లీకి సమానం. మరీ ఆందోళన కలిగించే అంశం అసోం లోని 34 జిల్లాలు 2024లో జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాలను దారుణంగా అధిగమించాయి. కాలుష్యం తీవ్రతే కాదు అది కొనసాగడం విధాన రూపకర్తలను ఇబ్బందిపెడుతోంది. భారతదేశంలో ఎక్కువ భాగం వర్షాకాలంలో వాయు కాలుష్యం ప్రక్షాళన జరుగుతుంది, అసోంలో వర్షాకాలంలో కూడా పిఎం 2.5 నిబంధనలను 21 జిల్లాలు ఉల్లంఘించినట్లు రికార్డయింది. త్రిపురలో కూడా ఆరు జిల్లాలలో కాలుష్యం పెచ్చుపెరిగింది. ఇవి ఎపిసోడిక్ స్పైక్‌లను కాక, నిర్మాణాత్మక క్షీణతను సూచిస్తున్నాయి. భారతదేశంలో చక్కటి పర్యావరణానికి పెట్టింది పేరైన ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దీర్ఘకాలిక వాయు కాలుష్య ఇబ్బందుల జోన్లోకి మారిపోయింది. ఈ మార్పు అభివృద్ధి కారణం గా వచ్చిన అనివార్య పరిణామంగా చెప్పలేం, కానీ ఈ గణాంకాలను తోసిపుచ్చలేం కదా. దశాబ్దాలుగా ఈశాన్య రాష్ట్రాలు చక్కటి వర్షపాతం, దట్టమైన అటవీ విస్తీర్ణం, తక్కువ పట్టణీకరణ, పరిమితంగా పారిశ్రామికీకరణ కారణంగా స్వచ్ఛమైన గాలిని అనుభవిస్తూ వచ్చాయి. అయితే నేడు శీతాకాలం, వేసవి, వర్షాకాలం అన్న తేడా లేకుండా దేశంలో ఎక్కువ కాలుష్య ఐదు రాష్ట్రాలలో అసోం, త్రిపుర ఉండడం దురదృష్టకరం. ఇందుకు ప్రధాన కారణం పర్యావరణ రక్షణ చర్యలు లోపించడం, అభివృద్ధి విస్తరణ విషయాలపై నియంత్రణ పేలవంగా ఉండడం, పర్యావరణ సమతుల్యతపట్ల తీవ్ర నిర్లక్ష్యం. చట్టబద్ధమైన ముందస్తు అనుమతుల లేకుండా కార్యకలాపాలు ప్రారంభించే పరిశ్రమలకు ఫోస్ట్ ఫాక్టో పర్యావరణ అనుమతులను అనుమతించడం ద్వారా న్యాయస్థానం తీసుకున్న తిరోగమన చర్యవల్ల ఈ డైనమిక్స్ బయటపడుతున్నాయి. పోస్ట్- ఫాక్టో పర్యావరణ అనుమతులను నిషేధించే 2025 వనశక్తి తీర్పును సుప్రీం కోర్టు ఈ మధ్య ఉపసంహరించుకోవడం భారతదేశ పర్యావరణ న్యాయశాస్త్రానికి ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బ. పెట్టుబడులు రావాల్సిన అవసరం, ఆర్థిక పరిగణన నేపథ్యంలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన పరిశ్రమలు తరువాత పర్యావరణ పరమైన అనుమతులు కోరవచ్చునని కోర్టు పేర్కొంది. కానీ, ఇది పర్యావరణ నియంత్రణ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఇందుకు ముందు పరిస్థితి అంచనాలు, ప్రజా సంప్రదింపులు వంటి జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పు ఫలితంగా ఉల్లంఘనలు పెరుగుతాయి. పునరాలోచన తర్వాత తీర్పు అక్రమనిర్మాణాలను చట్టబద్ధం చేస్తుంది. వ్యాపార అవసరాలకోసం పర్యావరణానికి హాని జరిగినా ఆమోదించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ఈ తీర్పు ఆర్టికల్ 21 కింద పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం విషయంలో రాజ్యాంగ హక్కును దెబ్బతీస్తుందనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో పర్యావరణ దౌర్బల్యం తీవ్రంగా ఉంటుంది. నియంత్రణ, పర్యవేక్షణ తక్కువే. అందువల్ల మరింత శ్రద్ధ అవసరం. ఈ విస్తృత జాతీయ సందర్భంలోనే సిఆర్ ఇఎ నివేదికను అర్థం చేసుకోవాలి. అసోంలో గాలి నాణ్యత క్షీణత కు కారణం స్థానిక పాలనా యంత్రాంగ వైఫల్యమే కాదు. ఇది పర్యావరణ పరంగా విస్తృత కోతకు సంకేతం. బ్రహ్మపుత్ర వ్యాలీలో థర్మల్ పవర్ నుంచి, పెట్రో కెమికల్స్ వరకూ, సిమెంటు ఫ్యాక్టరీల నుంచి చమురు శుద్ధి కర్మాగారాల వరకూ పలు పరిశ్రమలు విస్తరించడం ప్రధాన కారణం. కఠినమైన నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఉద్గారాలు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్నాయి. ఆధునిక జిగ్‌జాగ్ టెక్నాలజీ, ఉద్గార ఫిల్టర్లు లేకుండా పనిచేసే ఇటుక బట్టీల కారణంగా, మొరిగావ్, నాగావ్, టిన్సుకియా, బొంగైగావ్ వంటి పట్టణాల చుట్టూ దట్టమైన కాలుష్య వలయం ఏర్పడుతోంది. గ్రామీణ జీవనోపాధిలో భాగమైన బయోమాస్‌కు తోడు ఇప్పుడు పట్టణ చెత్త దగ్ధం, ఏడాది పొడవునా సాగే నిర్మాణ పనుల కారణంగా కాలుష్యం మరీ మితిమీరుతోంది. అసోం పట్టణ ప్రాంతాలలో వాహనాల సంఖ్య గణనీయంగా పరిగింది. రోడ్ల విస్తరణ, హైవేల నిర్మాణం, నదీతీర అభిృవృద్ధితో నియంత్రణ లేని ధూళి పెరిగిపోతోంది. ఈశాన్య ప్రాంతం కాలుష్య కేంద్రంగా మారడానికి ఇవే కారణాలని పూర్తిగా చెప్పలేం. బంగ్లాదేశ్, ఉత్తర బెంగాల్ నుంచి సరిహద్దు ఏరో సోల్స్ అసోం బేసిన్ లాంటి ప్రాంతాలలోకి ఎక్కువగా చొచ్చుకువస్తాయి. ఇక్కడి తేమ, తక్కువ గాలి ప్రసరణ కారణంగా కాలుష్య కారకాలు చిక్కుకుంటాయి. అడవుల నరికివేత, తగులపడుతున్న అడవులు, క్వారీయింగ్, నదీగర్భంలో అక్రమ మైనింగ్ ప్రకృతిని దెబ్బ తీస్తున్నాయి. జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, లీనియర్ మౌలిక సదుపాయాలు, రైల్వే డబ్లింగ్, సరిహద్దురోడ్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, ఐదేళ్లుగా విస్తరించాయి. తరచుగా సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనాలను దాటవేస్తున్నాయి. పోస్ట్ ఫ్యాక్టో అనుమతులు ఇప్పుడు చట్టబద్ధం కావడంతో అనుమతులు పొందాలనే షరతు లేదు. దాంతో ఈశాన్య పర్యావరణానికి ముఖ్యంగా పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు, పర్యావరణ రంగాలనుంచి అన్నివైపులనుంచి ఒత్తిడి తప్పడం లేదు. దారుణం ఏమిటంటే, ఈ ప్రాంతం పర్యావరణ ప్రాముఖ్యత ఈ ప్రాంత నివాసితులకు స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తోంది. ఈశాన్య ప్రాంతం ప్రపంచం లోని గొప్ప జీవవైవిధ్య హాట్‌స్పాట్ లలో ఒకటి. దాని అడవులు వర్షప్రాంతాన్ని నియంత్రిస్తాయి. నదీ వ్యవస్థలను స్థిరీకరిస్తాయి. మరో చోట లేని అరుదైన జాతులను సంరక్షిస్తాయి. గిరిజనులు, స్వదేశీ సమాజాలు శతాబ్దాలుగా స్థిరమైన భూనిర్వహణ సంరక్షకులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ పర్యావరణ ఆస్తుల నష్టం ప్రాంతీయపరమైన నష్టమేకాదు ఇది జాతీయ నష్టం. కలుషితమైన ఈశాన్యం అంటే అస్థిర రుతుపవాలు, అస్థిర వరదలు, మొత్తం భారత ఉప ఖండానికి ఎక్కువ నష్టం కలిగించే పరిస్థితి. బ్రహ్మపుత్ర లోయ ఇబ్బందిపడినప్పుడు దిగువ మైదానాలకు ఇబ్బందులు తప్పవు.భారతదేశ పర్యావరణ భవిష్యత్‌కు హానికరమే. సంక్షోభాన్ని గుర్తిండమే కాదు, దేశంలో పర్యావరణ పరిరక్షణకు రూపొందించిన విధానాలను పునర్నిర్వచించడం ఎదుట ఉన్న సవాల్. కాలుష్య నియంత్రణ బోర్డులను స్వతంత్ర శాస్త్రీయ సామర్థ్యంతో బలోపేతం చేయడం, చట్టబద్ధమైన అధికారాలతో ఈశాన్య పర్యావరణ పరిరక్షణ అథారిటీ ఏర్పాటు చేయడం, ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టును ప్రారంభించలేరనే సూత్రాన్ని పునరుద్ధరించడంవంటి చర్యలు ముఖ్యం. జిల్లా స్థాయి క్లీన్ -ఎయిర్ యాక్షన్ ప్లాన్‌ను తప్పనిసరి చేయాలి. శాటిలైట్ ఆధారిత హాట్‌స్పాట్ గుర్తింపునకు సంబంధించి మార్గనిర్దేశం చేయాలి. ఇటుక బట్టీలను ఆధునీకరించడమో, మూసివేయడమే చేయాలి. పరిశ్రమలు నిరంతర ఉద్గారాల పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. డేటా అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో జనాలకు స్వచ్ఛమైన ఇంధనం అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్మాణ కార్యక్రమాలనూ కఠినంగా నియంత్రించాలి. మున్సిపల్ సంస్కరణల ద్వారా చెత్త తగులపెట్టకుండా నియంత్రించాలి. అడవులు, చిత్తడి నేలలు, గిరిజన భూముల రక్షణ కూడా కీలకం. అటవీ సంరక్షణ చట్టాలను నీరుగార్చడం, అటవీ భూమి విషయంలో స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో ఈశాన్య ప్రాంతంలో విస్తారమైన భూభాగాలు రక్షణాత్మక చట్టాల కింద లేకుండాపోయాయి. ప్రభుత్వం నోటీఫై చేసిన అడవుల మాదిరిగానే, కమ్యూనిటీ నిర్వహణ అడవులకు రక్షణ కల్పించే చట్టాలను బలోపేతం చేయాలి. వాతావరణ మార్పులు తీవ్రతరం అవుతున్నందువల్ల, కఠినమైన పర్యావరణ, అంచనాలు లేకుండా మైనింగ్, నదుల తవ్వకానికి కానీ, రోడ్ల విస్తరణకు కానీ అనుమతించరాదు. ఇందుకోసం అడవులను పణంగా పెట్టకూడదు. కాలుష్య నియంత్రణకు ప్రాంతీయ సహకారం అవసరం, కాలుష్యం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితం కాదు. ఈశాన్యం లోని అసోం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్ ఉమ్మడి కాలుష్య నియంత్రణకు గట్టి సమన్వయంతో కృషి చేయాలి. బయోమాస్ దగ్ధం, కార్చిచ్చు, అడవులలో మంటల నియంత్రణ, పొరుగు దేశాలతో సరిహద్దులలో పారిశ్రామిక ఉద్గారాలపై ఉమ్మడి ప్రొటోకాల్ మున్ముందు చాలా అవసరం. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా పొగమంచు సంక్షోభం ఓ హెచ్చరిక. కానీ ఈశాన్య ప్రాంతంలో ఏడాది పొడవునా పెరుగుతున్న కాలుష్యం మరింత తీవ్రమైనదిగా చూడాలి. ఒకప్పుడు రుతుపవన అడవులు, నదీ గాలులతో కూడిన ప్రాంతం విషపూరితంగా తయారైంది.దేశవ్యాప్తంగా పర్యావరణ పతనాన్ని అరికట్టగలమా. కోట్లాది సంవత్సరాలుగా పరిరక్షించుకుంటున్న సహజమైన వారసత్వ సంపదను పరిరక్షించుకోగలమా అన్నది మనం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది. స్పష్టమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందితే, దానికి చెల్లించే మూల్యం గాలి నాణ్యత ఇండెక్స్ లేదా అస్పత్రిలో చేరిన వారి సంఖ్యతో లెక్కించలేం. ఇది భారత వాతావరణ భద్రత, దాని జీవవైవిధ్యం, అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పనకు సంబంధించి రాజ్యాంగం ప్రసాదించిన హామీ అమలుపై భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
Makthal |వైభవంగా అయ్యప్పస్వామి కలశ ఊరేగింపు
Makthal | వైభవంగా అయ్యప్పస్వామి కలశ ఊరేగింపు అయ్యప్ప స్వాముల కలశ ఊరేగింపుMakthal
Telagnana : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఫుల్లు ఖుషీ.. కారణమేంటో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లబ్దిదారులు భారీ ఊరట చెందుతున్నారు
Exclusive: NTR gives Clarity to Koratala Siva
There has been a debate going on social media about Devara 2 from a long time. Tollywood is also speculating about the lineup of NTR which clearly hints that Devara 2 is shelved. But NTR is clear about the project and Koratala Siva has completed the scriptwork of Devara 2 and is eagerly waiting for […] The post Exclusive: NTR gives Clarity to Koratala Siva appeared first on Telugu360 .
Bengaluru : నాటుకోడి కూరతో సిద్ధరామయ్యకు బ్రేక్ ఫాస్ట్
నేడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంటికి వెళ్లారు
హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది.
Ditva Cyclone : దిత్వాతో వానలు దంచేస్తాయట.. ముంపు ఇక్కడేనట
దిత్వా తుపాను బలహీనపడినప్పటికీ దాని ప్రభావం మూడు రోజులుంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది
సంక్లిష్టతలను దాటితేనే సంకల్ప సిద్ధి
తెలంగాణ రాష్ట్రరాజకీయాలలో 2023 ఎన్నికలు ఒక మలుపు, మార్పు, మానసిక వాతావరణంలోని ఓ అల్లకల్లోల క్షణం. పది సంవత్సరాలపాటు సాగిన బిఆర్ఎస్ పాలన తరువాత ప్రజలు కోరుకున్న కొత్త తెలంగాణ, పారదర్శక పాలన, సంక్షేమం -సంస్కరణల కలయిక అనే ఆత్రుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది. ఆరు హామీల ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల్లో ఆశాభావాన్ని పెంచిన ఈ ప్రభుత్వం మొదటి రోజునుండే నిర్ణయాల వేగాన్ని, పరిపాలనా తీరు మారుస్తామనేదాన్ని ప్రదర్శించింది. అయితే శాసనసభలో గెలుపు ఒకటి, పరిపాలనా గడపలో అడుగుపెట్టిన తరువాత ఎదురయ్యే ఆర్థిక వాస్తవాలు, వ్యవస్థల సంక్లిష్టత, విభాగాల అంతర్గత గందరగోళం, అధికారులు- మంత్రుల మధ్య సమన్వయ లోపం, పెద్ద ఎత్తున పెరిగిన అప్పు భారాలు-వివిధ దిశల్లో ప్రభుత్వాన్ని పరీక్షించిన రెండు సంవత్సరాలు ఇవి. సంకల్పం స్పష్టంగా ఉన్నా, అమలులో ఎదురైన సంక్లిష్టత పాలనకు ప్రత్యేక స్వరూపాన్ని ఇచ్చిన కాలమిది. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందించడం రాజకీయంగా పెద్దగా ప్రశంసించబడింది. రోజుకు సగటున 25- 28 లక్షల మహిళలు ఈ సేవను వినియోగిస్తున్నారని రవాణా శాఖ వివరాలు చెబుతున్నప్పటికీ, టిఎస్ ఆర్టిసిపై నెలకు రూ. 250- నుంచి రూ. 280 కోట్లు వరకు అదనపు భారం పడుతోంది. అప్పటికే రూ. 7,000 కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న సంస్థకు ఈ పథకం ఆర్థిక రీతిలో తీవ్రమైన ఒత్తిడిని కలిగించింది. సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ పథకం ప్రతిబింబించినా, దీర్ఘకాలంలో దీనిని నిలబెట్టే మార్గం, చెల్లింపుల సమయపాలన రాష్ట్ర ఖజానాకు కఠిన పరీక్ష. ఇటువంటి సంక్షేమం వినిపించే శబ్దం ప్రజాపక్ష పాలనను సూచించినప్పటికీ, ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్యం మాత్రం రోజుకు సగం కోట్ల రూపాయల బరువును మోయాల్సి వచ్చింది. ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిన నిర్ణయం మరింత ఆదరణ పొందినా, దీనివల్ల రాష్ట్ర ఖర్చులు సంవత్సరానికి అదనంగా రూ. 1,500- 2,000 కోట్లకు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు గమనిస్తున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది 30% -40% వరకు ఖాళీలతో పనిచేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఆసుపత్రులే వైద్యంలో ప్రధాన ఆశ్రయం కావడం ప్రభుత్వ బిల్లులను పెంచుతోంది. ప్రజల ప్రయోజనానికి తీసుకున్న నిర్ణయాలు తక్షణ ఉపశమనం ఇస్తున్నప్పటికీ, ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగం ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు మొత్తం రూ. 32,000 కోట్లకు చేరాయి. మాఫీని దశలవారీగా చేసే ప్రయత్నాలు ప్రారంభమైనా పూర్తి అమలు కాలేకపోయాయి. ధాన్యం కొనుగోళ్లలో చెల్లింపుల జాప్యం, ఎండలతో పాడైపోయిన పంటలకు పరిహారం ఆలస్యం, మార్కెట్ ధరల్లో మార్పులు రైతుల నిరాశను పెంచాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలపై ప్రభుత్వం చేసిన విమర్శలు సాంకేతిక పరిశీలనకు దారితీశాయి. పంపింగ్ స్టేషన్లు తరచూ నిలిచిపోవడం, వ్యయ అధికరణలపై వివాదాలు సాగునీటిపరంగా రైతులకు ఇబ్బందులు కలిగించాయి. నీటిపారుదలే తెలంగాణ రైతు ఆత్మ విశ్వాసానికి పునాది అయిన సందర్భంలో ఈ అంశాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు మోపాయి. విద్యా రంగంలో ప్రభుత్వానికి ఎదురైన సంక్షోభం మరింత లోతుగానే ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 800 కోట్లకు పైగా పెరగడంతో ప్రైవేట్ కళాశాలలు నిరసన వ్యక్తం చేస్తూ మూడు రోజుల బంద్‌కు దిగడం విద్యార్థుల్లో అనిశ్చితిని సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యం, సిబ్బంది కొరత, మధ్యాహ్న భోజనం, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో నెమ్మదిగా సాగినా ప్రగతిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ రెండు సంవత్సరాల్లో అత్యంత క్లిష్ట దృశ్యం రాష్ట్ర ఆర్థిక స్థితి. రాష్ట్ర అప్పు మొత్తం రూ. 3.8- రూ. 4 లక్షల కోట్ల మధ్య తిరుగుతూ ఉండగా ఏటా వడ్డీ చెల్లింపులకు మాత్రమే రూ. 25,000 కోట్లకు పైగా ఖర్చవుతోంది. రెవెన్యూ వృద్ధి రేటు 7-9% మధ్య ఉంటే ప్రభుత్వ ఖర్చులు 15% కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. పూర్వప్రభుత్వంలో ప్రారంభమైన భారీప్రాజెక్టుల నిర్వహణ వ్యయం, విద్యుత్ సంస్థల అప్పులు, పెన్షన్ భారం, కేంద్ర నిధులలో వచ్చిన తగ్గుదల-కలగలిపి-రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా, అసమతులంగా మార్చాయి. ఆదాయం పెంచే కొత్త మార్గాల కోసం ప్రభుత్వం మద్యపాన ఆదాయంపై దృష్టి పెట్టినప్పటికీ, సామాజిక దృష్టిలో ఇది పెద్ద విమర్శలకే దారి తీసింది. మరో వైపు ప్రభుత్వం-, అధికార యంత్రాంగం మధ్య సహకారం కొన్నిసార్లు సరిగా పనిచేయలేదు. ముఖ్య శాఖల్లో అధికారులు తరచు బదిలీలు, మంత్రుల ఆదేశాలు అమలులో ఆలస్యం, ఫైళ్ల నిల్వ, ప్రధాన కార్యాలయం- శాఖల మధ్య కమ్యూనికేషన్ లోపాలు పాలన నెమ్మదించే ప్రధాన కారణాలు అయ్యాయి. కొందరు మంత్రులు ప్రజా వేదికలపై అధికారులు తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం, కొందరు అధికారుల నిర్ణయాలు రాజకీయ వివాదాలకు దారితీయడం పాలనా లోపాలను బహిర్గతం చేశాయి. సంక్షేమం, -అభివృద్ధి-, ఆర్థిక నియంత్రణ అనే మూడు అక్షాంశాలలో సమతుల్యత సాధించడంలో ప్రభుత్వం ఇంకా కృషి చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు రాజకీయ మార్పు కోసం ఇచ్చిన ఓటు ఇప్పుడు ఫలితాల రూపంలో కనబడాలని ఆశిస్తున్నారు. మూడవ సంవత్సరంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే పాలన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. - రామకిష్టయ్య సంగనభట్ల, 9440595494
Telangana : నేడు నామినేషన్ల దాఖలకు చివరి గడువు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది
Tej 2026 |మరో క్రేజీ మూవీకి తేజ్ గ్రీన్ సిగ్నల్..
Tej 2026 |మరో క్రేజీ మూవీకి తేజ్ గ్రీన్ సిగ్నల్.. Tej 2026
Eluru |విద్యార్థుల.. అర్ధరాత్రి గొడవ..
Eluru | విద్యార్థుల.. అర్ధరాత్రి గొడవ.. Eluru, ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు
OTT Platforms’ New Guidelines for Producers
The Digital Platforms are now dictating rules and they are finalizing the release dates of several Indian films. The producers have no other options and they have surrendered to the OTT platforms as they are able to recover a major budget through the digital deals. With a number of films in making, the digital platforms […] The post OTT Platforms’ New Guidelines for Producers appeared first on Telugu360 .
Reservoir |గ్రామస్తుల ఆందోళన..
Reservoir | గ్రామస్తుల ఆందోళన.. Reservoir, ఏర్పేడు, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా
Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గట్టిగానే షాక్.. ఇక కొనడం కష్టమే
. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగింది
చంద్రబాబుకు మద్యం కేసులో విముక్తి #Chandrababu #ACBCourt #CID #AndhraPradesh #LegalUpdate
నంద్యాలలో యువకుడి హత్య.. మరొకరికి గాయాలు
హైదరాబాద్: నంద్యాల జిల్లా హరిజన పేటలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు కత్తితో యువకుడిని పొడిచి చంపారు. మరో యువకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మృతుడు కొమ్ము పెద్దన్న(26)గా గుర్తించారు.
Tirumala : తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. నేడు దర్శనం సులువుగానే
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది.
ఏలూరు వైద్య కళశాలలో ర్యాగింగ్ కలకలం
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది.
Bigg Boss Telugu 9: Sharp Nominations and Strategic Targeting
The latest nomination episode in Bigg Boss Telugu 9 unfolded with intense arguments, emotional outbursts and strategic gameplay. What began as light-hearted camaraderie quickly spiraled into a heated exchange as housemates confronted each other’s motives, loyalties and intentions. Immanuel vs Ritu and Pavan: Unresolved Conflicts Resurface Before nominations began, Immanuel and Ritu shared a brief […] The post Bigg Boss Telugu 9: Sharp Nominations and Strategic Targeting appeared first on Telugu360 .
తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీ రో, హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ క్రై మ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్. బ్లాక్ బస్ట ర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజ ల్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భం గా జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమం లో హీరో వెంకటేష్ పెద్దపాలెం మాట్లాడుతూ “దర్శకుడు పళని... రాజమౌళి స్టై ల్లో ఈ మూవీని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూ డా బోర్ కొట్టించుకుండా సినిమాను తీశారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాహుబలి పళని, రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్, అపర్ణ మల్లిక్, హీనా సోని, సాగర్ వేలూరు పాల్గొన్నారు.
Exclusive: Dil Raju approaches Trivikram for Pawan Kalyan
Powerstar Pawan Kalyan has taken a break from films and he is focused on AP politics. He will take a bunch of new films from the end of 2026 or during early 2027. He has commitments for producers Ram Talluri and TG Vishwa Prasad for now. He has taken a big advance from KVN Productions. […] The post Exclusive: Dil Raju approaches Trivikram for Pawan Kalyan appeared first on Telugu360 .
Weather Report : మరో మూడు నెలలు చలితీవ్రత మామూలుగా ఉండదట
ఈ ఏడాది మూడు నెలల పాటు దేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. బేబీ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ‘90s’ వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ “తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల హీరో లండన్ కి వెళ్తే.. అక్కడ ఏం జరిగింది? ప్రేమ కథ ఏంటి? వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. తెలుగులో పూర్తిస్థాయిలో రొమాంటిక్ కామెడీ సినిమాలు పెద్దగా రావడం లేదు. ఆ లోటుని భర్తీ చేసేలా ఎపిక్ సినిమా ఉంటుంది”అని అన్నారు. దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. “ఇదొక మధ్యతరగతి యువకుడి ప్రేమ కథ. సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కరూ తమని తాము ఊహించుకుంటారు”అని తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ అని ఎందుకు పెట్టామంటే.. ఇది మొదటి భాగం. దీనికి కొనసాగింపు కూడా ఉంటుంది. ఒక మంచి సినిమా చేశాము”అని తెలియజేశారు. ఈ వేడుకలో కథానాయిక వైష్ణవి చైతన్య పాల్గొన్నారు.
Cyclone | తుఫాను షెల్టర్లు.. Cyclone, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం పార్లమెంట్
Tamilnadu : తమిళనాడు ఊపేస్తున్న దిత్వా
తమిళనాడులో దిత్వా తుపాను విధ్వంసం సృష్టిస్తోంది
రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే.. #Tollywood #Celebrities #Samantha #CinemaBuzz
Farmers | ఆందోళనలో అన్నదాతలు.. Farmers, బంటుమిల్లి, ఆంధ్రప్రభ : వాతావరణ మార్పుల
నెల్లూరు లేడీ డాన్ పై తిరగబడిన స్థానికులు
నెల్లూరులో లేడీ డాన్ అరవ కామాక్షి నివాసాన్ని స్థానికులు ధ్వంసం చేశారు.
స్పెయిన్‌కే అందాలనిట్ట, అద్దిన ఓ పూల బుట్టా..
మాస్ మహారాజా రవితేజ.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ’భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో అలరించబోతున్నారు . ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్ , డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. అద్భుతమైన టైటిల్ గ్లింప్స్ తర్వాత మేకర్స్ ఇప్పుడు ఫుట్‌ట్యాపింగ్ ట్రాక్ బెల్లాబెల్లాతో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. మాస్-ను ఆకట్టుకునే చార్ట్‌బస్టర్‌లను అందించడంలో పాపులరైన భీమ్స్ సిసిరోలియో, జానపద సంగీతంతో కూడిన ఫుట్‌ట్యాపింగ్ నంబర్‌తో ఆకట్టుకున్నారు.‘స్పెయిన్‌కే అందాలనిట్ట, అద్దిన ఓ పూల బుట్టా... వీధుల్లో పోతుంటే అట్టా వార్తల్లో రాయాలి చిట్టా’ అంటూ సురేష్ గంగుల రాసిన లిరిక్స్‌లో వైబ్ అదిరిపోయింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కట్టిపడేసింది. రవితేజ, ఆషికా రంగనాథ్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ రిఫ్రెషింగ్, ఎలక్ట్రిక్‌గా అనిపిస్తుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి 2026 సంక్రాంతికి విడుదల కానుంది. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ “చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందులో నా క్యారెక్టర్ పేరు బాలమణి. అందరికీ ఈ పాట నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంకా అద్భుతమైన పాట లు ఉన్నాయి. మాస్ మహారాజా అంటే ఎనర్జీ. అదే ఎనర్జీ సంక్రాంతితో చూడబోతున్నాం”అని అన్నారు. హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ “మంచి కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. రవితేజ ఎనర్జీ మ్యాచ్ చేయడం అంత సులభం కాదు. ఆయన అద్భుతమైన డ్యాన్సర్”అని తెలిపారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ “భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి”అని పేర్కొన్నారు.
పండుగలా ఎమ్మెల్యే పెన్షన్ పంపిణీ
పండుగలా ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ విశాలాంధ్ర – సీతానగరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో సోమవారం రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణఆధ్వర్యంలో పలు గ్రామాల్లో స్వయంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. దీనిలో భాగంగా బొబ్బిల్లంక, జాలిమూడి, కాటవరం, రఘుదేవపురం, చినకొండేపూడి గ్రామాల్లో కూటమి పార్టీ నాయకులతో కలిసి పౌజ్ నూతన పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ […] The post పండుగలా ఎమ్మెల్యే పెన్షన్ పంపిణీ appeared first on Visalaandhra .
ప్రధాన రహదారి పై చట్టవిరుద్ధ రోడ్డుబ్లాకుల పై చర్యలు తీసుకోవాలి అడ్వకేట్ సూరెడ్డి శివ కుమార్ విశాలాంధ్ర – సీతానగరం: సీతానగరం, రాజమహేంద్రవరం ప్రధాన రహదారి పై చట్టవిరుద్ధంగా రోడ్డుబ్లాకుల పై అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ లో వంగలపూడి గ్రామానికి చెందిన అడ్వకేట్ సూరెడ్డి శివ కుమార్ అర్జీ సమర్పించారు. అలాగే మండలంలో మండల ప్రజా పరిషత్, రెవెన్యూ కార్యాలయలలో కూడా అర్జీ సమర్పించారు. ఈ […] The post చట్టవిరుద్ధ రోడ్డుబ్లాకు appeared first on Visalaandhra .
India Vs South Africa : భారత్ అభిమానులూ బేఫికర్... వచ్చేస్తున్నాడోచ్
ఆల్ రౌండర్ లో జట్టులోకి వస్తున్నాడు. ఇన్నాళ్లూ టీం ఇండియాలో హార్ధిక్ పాండ్యా లేని లోటు కనిపిస్తుంది
Hyderabad : నేడు గాంధీభవన్ కు రేవంత్ రెడ్డి
నేడు గాంధీ భవన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు
విశాలాంధ్ర – కొవ్వూరు : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కొవ్వూరు పట్టణ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్స్ హెల్త్ ఆశ సిబ్బంది ఏఎన్ఎంలు పట్టణ ప్రజలు ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ముందుగా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టి అనంతరంప్రభుత్వ ఆసుపత్రి నుండి స్థానిక విజయ విహరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎయిడ్స్ సంక్రమ మార్గాలు నివారణ చర్యలు […] The post ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ appeared first on Visalaandhra .
Hyderabad : జీహెచ్ఎంసీ విస్తరణకు గవర్నర్ ఓకే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ విస్తరణకు సంబంధించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు
Ustaad Bhagat Singh |ఉస్తాద్ స్టెప్ అదిరిందిగా..
Ustaad Bhagat Singh | ఉస్తాద్ స్టెప్ అదిరిందిగా.. Ustaad Bhagat Singh,
విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు పట్టణంలో ఎబిఎన్ పిఆర్ ఆర్ కళాశాలలో సోమవారం ఘనంగా గీత జయంతి వేడుకలు జరిగాయి. కురుక్షేత్ర యుద్ధంలో నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు జీవిత తత్వశాస్త్రం, కర్మ, మోక్షం వంటి విషయాలను వివరించి, కర్తవ్య నిర్వహణకు మార్గనిర్దేశం చేసిన రోజు ఈ రోజు అని, ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకి, సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా […] The post ఘనంగా గీత జయంతి వేడుకలు appeared first on Visalaandhra .
పందులు బాబోయ్ పందులు.. పట్టపగలే పాఠశాలలో దూరుతున్న వైనం..ఇలా ఉంటే పుష్కరాలు నిర్వహణ ఎలా.. విశాలాంధ్ర-కొవ్వూరు : పందుల బాబోయ్ పందులు.. కుక్కల స్వైర విహారం.. ఇటువంటి మాటలు జిల్లాలో చాలా పట్టణాల్లోనూ.. గ్రామాల్లోనూ తరచూ వినిపిస్తున్నాయి. అయితే రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కొవ్వూరులో మాత్రం పందులు ఏకంగా పాఠశాలలకు దూరి బెంచీల కింద నివాసాలు ఏర్పరచుకుంటున్నాయి. కొవ్వూరులో చాలా కార్పొరేట్ పాఠశాలలు బహుళ అంతస్తులు భవనాల్లో నడుస్తుండగా పెద్ద సమస్య రావడం లేదు కానీ నేల […] The post పందులు బాబోయ్ పందులు appeared first on Visalaandhra .
Tirumala | నకిలీ సీఐ అరెస్ట్.. Tirumala, తిరుపతి జిల్లా, భాకరాపేట :
చెదురు మదుర జల్లులతో రైతులు ఆందోళన – అన్ని గ్రామాలలో కాలాల్లోనే ధాన్యం విశాలాంధ్ర – సీతానగరం: తుపాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం చెదురు మదుర జల్లుల పడ్డాయి. గత కొన్ని రోజులుగా వరిలో పి ఎల్ రకం కోతలు జోరుగా సాగుతున్నాయని. వీటిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయించేందుకు రైతులు ధాన్యాన్ని అందుబాటులో ఉన్న కాలీ ప్రదేశాల్లో ఎండబెడుతున్నారు. అయితే దిత్యా తుపాన్ ప్రభావంతో కొన్ని చోట్ల జల్లులు పడుతుండడంతో రైతులు కాలాల్లో […] The post రైతులు ఆందోళన appeared first on Visalaandhra .
AP Rains | ఏపీలో వర్షాలు.. AP Rains, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
Epic |డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న దేవరకొండ..
Epic | డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న దేవరకొండ.. Epic, ఆంధ్రప్రభ వెబ్
పాలమూరు ప్రాజెక్టులు పదేళ్లు పడావు
మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి : గత పాలకుల నిర్లక్ష్యంతోనే నారాయణపేట జిల్లాలోని మక్తల్ వెనుకబాటుకు గురైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మక్తల్‌లో సోమవారం పలు అభివృద్ధి పనులను మంత్రి వాకిటి శ్రీహరి, పలువురు సహచర మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. మక్తల్‌లో రూ.250 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్, నారాయణపేట నుంచి మక్త ల్, జూరాలపై వంతెన రోడ్డుతో పాటు మొ త్తం రూ.1,200కోట్ల అభివృద్ధి పనులకు శం కుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసి న బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తోందని, ఈ రెండేళ్ల విజయోత్సవ సభను మొదట మక్తల్‌లో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. పాలమూరు ప్రజలు అరిగోస పడుతున్నా ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే ఈసారి పాలమూరు జిల్లా ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో ఈ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు సీఎం అయ్యారని, ఆ తర్వాత 75 ఏళ్లలో పాలమూరు జిల్లా నుంచి ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదని, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రాష్ట్ర సీఎంగా మీ బిడ్డకు అవకాశం వచ్చిందని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు అన్ని పూర్తిచేసే బాధ్యత తనదని అన్నారు. ఇప్పటికే నారాయణపేటమక్తల్కొడంగల్ ప్రాజెక్టు, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టులు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అందుకే ప్రజా పాలన వారోత్సవాలు ఇక్కడి నుంచి మొదలుపెట్టామని చెప్పారు. కొందరు కుట్రపూరితంగా నారాయణపేట, మక్తల్, కొడంగల్ ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏదీ ఆగదని చేశారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన ఏ రైతుకు కూడా అన్యాయం చేయబోమని, ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. మాయగాళ్లు మాటలు విని ప్రాజెక్టులు, అభివృద్ధిని అడ్డుకోవద్దని రైతులను కోరారు. ఎంత ఖర్చయినా సరే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ ప్రధాన అంశాలుగా తీసుకున్నట్లు చెప్పారు. కేవలం వలసలే పాలమూరు బిడ్డలను విద్యకు దూరం చేశాయని, అందువల్ల జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరు చేశామని తెలిపారు. ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలతో చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని త్వరలో అభివృద్ధి దశలో తీసుకెళ్తామని తెలిపారు. రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లను మీ గ్రామాలను అభివృద్ధి చేసే వ్యక్తులనే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆ అప్పులు కడుతూనే సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. అభివృద్దికి అడ్డుపడేవాళ్లను స్థానిక ఎన్నికల్లో గెలిపించొద్దని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి జరగదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి బడా పారిశ్రామికవేత్తలు ఆస్తకి చూపుతున్నా రు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ గ్రూప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఫుడ్లింక్ ఎఫ్అండ్బీ హోల్డింగ్స్ కంపెనీలు ఈ నెల 8, 9 తేదీల్లో సదస్సుకు హాజరై ప్రభుత్వం తో ఎంఓయూ కుదుర్చుకుంటామని పే ర్కొన్నాయి. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఫ్యూచర్ సి టీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లో బల్ సమ్మిట్‌లో దేశ, విదేశాల నుంచి పె ట్టుబడుదారులు పాల్గొని రాష్ట్రంలో భారీ గా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించా రు. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ గ్రూప్ తె లంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండగా ఈ సంస్థకు చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ నైట్ సఫారీని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఫుడ్లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ కంపెనీ రూ.3వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో మూడు హోటళ్లు నిర్మించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుండగా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకోనున్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ‘హిల్ట్’ పాలసీ పే రిట రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ‘తెర’ లేపినందున, వెంటనే ‘హిల్ట్’ను నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా బిజెపి రాష్ట్ర నాయకులు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్వర్యంలో పార్టీ నా యకులు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. గతంలో హైదరాబాద్‌లో పరిశ్రమలకు కేటాయించిన విలువైన భూములను ‘హైదరాబా ద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ (హిల్ట్) పేరిట రియల్ ఎస్టేట్ భూములకు కేటాయించే ప్రయత్నం చేస్తున్నదని రాంచందర రావు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించారు. కాబట్టి దీనిని నిలి పి వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా ఆయన గవర్నర్‌ను కోరారు. అనంత రం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని సుమారు తొమ్మిది వేల ఎకరాల విలువైన పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ‘హిల్ట్’ పాలసీతో అవినీతికి దారి తీస్తుందని ఆరోపించారు. ఎస్ఆర్వో రేట్లలో ముప్పై శాతం మాత్రమే చెల్లించి భూములను మార్చుకునే విధానం వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాసంపదను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ విధానం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని, రైతులకూ తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిల్ట్ పాలసీ ద్వారా ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తున్నదని గవర్నర్‌కు వివరించామని ఆయన తెలిపారు. గతంలో పరిశ్రమలకు ప్రభుత్వం తక్కువ ధరలకు కేటాయించి, ప్రోత్సహించిందని ఆయన చెప్పారు. కాగా ఇప్పటి మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, సబ్-రిజిస్ట్రార్ (ఎస్ఆర్వో) రేట్లు అసలు మార్కెట్ విలువలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. ఇటీవల హైదరాబాద్ పరిసరాల్లో ఒక సంస్థ ఒక్క ఎకరాన్ని నూటా యభై కోట్ల రూపాయల వరకు కొనుగోలు చేసిందంటే ఇలా భూములు నిజమైన మార్కెట్ ధరల ఆకాశాన్ని తాకుతున్న సమయంలో హిల్ట్ పాలసీ ప్రకారం పరిశ్రమల భూములను కేవలం ఎస్ఆర్వో రేట్లలో ముప్పై శాతం మాత్రమే చెల్లించి కన్వర్ట్ చేసుకునే అనుమతి ఇవ్వడం అనుమానాలకు దారి తీస్తోందని రాంచందర్ రావు అన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల లో సిసిఐ విధించిన నిబంధనలతో ఏర్పడిన ప్రతిష్టంభనలు ఎట్టకేలకు తొలగాయిని రా ష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. సిసిఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విధించిన కొత్త నిబంధనల కారణంగా కొనుగోళ్లకు అనుమతులు లభించని జి న్నింగ్ మిల్లులలో కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిసిఐతో జరిపిన చర్చలు ఫలించాయన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ నోటిఫై చేసిన మొత్తం 330 జిన్నింగ్ మిల్లుల్లో సోమవారం నుండి పత్తి కొనుగోళ్లు చురుగ్గా కొనసాగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. సిసిఐ కొత్త నిబంధనల కా రణంగా అనుమతులు లభించకపోవడంతో జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ గతంలో సమ్మెకు దిగింది. దీనివల్ల రైతులు తాము పండించిన పత్తిని అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి తుమ్మల స్వయంగా చొరవ చూపారు. ఆయన కేం ద్ర మంత్రులతో పాటు సిసిఐ సిఎండితో ప్రత్యేక చొరవ తీసుకుని వివరణాత్మక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సానుకూల స్పందన రావడంతో, 330 మిల్లుల్లో కొనుగోళ్లకు అనుమతులు లభించాయి. సమస్య పరిష్కారంలో మంత్రి తుమ్మల చూపిన వేగవంతమైన చర్యలకు, చొరవకు జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులకు, మిల్లుల కార్మికులకు ఉపశమనం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సిసిఐ రాష్ట్రంలో రూ. 3,201 కోట్లతో మొత్తం 4.03 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించిందని మంత్రి తుమ్మల వెల్లడించారు.
‘మహా’నగరం ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల వి లీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్, అర్బన్ డవలప్ మెంట్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. జీహెచ్ఎంసీలో 7 ము న్సిపల్ కార్పొరేషన్లు, 20మున్సిపాలిటీలను వి లీనం చేయాలని ఈ నెల 25న జరిగిన మం త్రివర్గ సమావేశంలో ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతోపాటు విలీనం అంశాన్ని ఈ నెల 25న జరిగిన జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించారు. కాగా దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభు త్వం నుంచి గవర్నర్‌కు ఆర్డినెన్స్‌ను పంపించడంతో ఆయన ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ ఫైల్ లోక్ భవన్ నుంచి న్యాయ శాఖకు వ చ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌కు సం బంధించిన గెజిట్ విడుదల చేయనుంది. విలీ న పక్రియలో భాగంగా 27 మున్సిపాలిటీల ఆ స్తులను హ్యాండ్ ఓవర్, వంటి అంశాలను గు ర్తించి గెజిట్‌లో ప్రభుత్వం వివరిస్తుందని అధికార వర్గాల సమాచారం.
హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వర్ష (16) హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన మధుసూదన్ రెడ్డి కూతురైన వర్ష సోమవారం సాయంత్రం హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్ నిర్వాహకుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు .
మంగళవారం రాశి ఫలాలు (02-12-2025)
మేషం వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. రాజకీయ వర్గాల వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృషభం స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. మిధునం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. కర్కాటకం భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సానుకూలమవుతాయి. సింహం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కన్య చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తుల ఆధ్యాత్మక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలను ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వృశ్చికం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ధనస్సు చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను లభిస్తాయి. మకరం ముఖ్యమైన పనులు మందగిస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. కుంభం ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఇంటా బయట కొందరు మాటలు మానసికంగా కలచి వేస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మీనం ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికమవుతాయి.
02 DEC 2025 Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
వెల్దండ, ఆంధ్రప్రభ : కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి
కొత్తగూడెంలో దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ వర్సిటీ
దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన జిల్లాల బాటలో మంగళవారం సిఎం కొత్తగూడెం జిల్లాకు రానున్నారు. ఖనిజాలకు పుట్టినిల్లు అయిన సింగరేణి ఇలాకాలో కొత్తగూడెంలోని మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేసి ప్రారంభించబోతున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాలు, విభాగాల ఏర్పాట్లు, ఆతిథ్య సదుపాయాలు, భద్రత, సభాస్థలి ఏర్పాట్లు, రవాణా నిర్వహణ వంటి అంశాలను శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. తెలంగాణలో తొలి భూవిజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని మంగళవారం ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. సిఎం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం ఏరియాను విద్యారంగం అనుసంధానంతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణకే మణిహారంగా మారనుంది. సింగరేణి ఇలవేల్పు కొత్తగూడెం లో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ ఖ్యాతి మరింతగా పెరగనుంది .జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకత సిఎంకి ప్రతిపాదన చేసి పట్టుబట్టి మంజూరు చేయించి అచరణలోకి తీసుకొచ్చారు. తుమ్మల ప్రతిపాదనకు రేవంత్ సానుకూలంగా స్పందించి వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీనికి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతూ తెలంగాణ క్యాబినెట్ చారిత్రక నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లయింది. పారిశ్రామిక అభివృద్ధితో విద్యను అనుసంధానం చేయాలనే ఆలోచనతోనే ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ ఆవిర్భవించింది. దేశంలోనే మైనింగ్ ఇంజినీరింగ్ లో రెండో కాలేజ్ గా ఉమ్మడి రాష్ట్రంలో మొదటి మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజ్ గా 1957 లో స్థాపించారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో జియాలజీ, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ., .ఎన్విరాన్ మెంట్ సైన్స్, ఇండస్ట్రియల్ సైన్స్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రాక్టికల్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైన్స్...మినరల్స్ ...ఫారెస్ట్ గోదావరి నది ఉండటంతో పరిశోధన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో మైన్ ఇంజినీర్లు ఎన్విరాన్మెంట్ ఇంజినీర్లు దేశానికి అందించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని మంత్రి తుమ్మల విశ్వాసంతో ఉన్నారు.
మార్కెట్లోకి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ11+
న్యూఢిల్లీ : సామ్సంగ్ ఇండియా తాజాగా గెలాక్సీ ట్యాబ్ ఎ11+ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ట్యాబ్ ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. 11 అంగుళాల డిస్ప్లే, మెటల్ డిజైన్, డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్లు, 8 ఎంపి బ్యాక్ కెమెరా, 5 ఎంపి ఫ్రంట్ కెమెరాతో పనితీరు, వినోదానికి అనువుగా దీనిని రూపొందించారు. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్, సామ్సంగ్ నోట్స్‌లో సాల్వ్ మ్యాథ్ వంటి ఎఐ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రతిరోజూ జీవనాన్ని మెరుగుపరచే ఆవిష్కరణలు సంస్థ లక్ష్యం అని సామ్సంగ్ ఇండియా ఎంఎక్స్ డైరెక్టర్ సాగ్నిక్ సేన్ అన్నారు.
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన బాబాపూర్ గ్రామ
నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి
హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో బిఎస్సి నర్సింగ్ చదువుతున్న ఓ యువతిపై కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజిఎం ఆస్పత్రిలో చేర్చగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిది జనగాం జిల్లా, జఫర్ఘడ్ మండలం అని తెలిసింది. కాజీపేట ఎసిపి, పోలీసులు బాధితురాలితో మాట్లాడి విచారణ చేపట్టారు.
ఢిల్లీ కాలుష్య కేవలం రైతులదే అంటే ఎట్లా ?: సుప్రీంకోర్టు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి రైతులనే నిందించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంట వ్యర్థాల దగ్ధం వల్లనే ఢిల్లీలో వాయు నాణ్యత దెబ్బ తిందనే వాదనను తోసిపుచ్చింది. వాయు కాలుష్యం అంశాన్ని కేవలం శీతాకాలంలోనే చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం సోమవారం తెలిపింది. వాయు కాలుష్యం అనేది తీవ్ర సంక్షోభం దీనిపై నిరంతర పర్యవేక్షణ , జాగ్రత్త చర్యలు అవసరం అని జస్టిస్ జాయ్‌మాలా బాగ్చీ సహ సభ్యులుగా ఉన్న ధర్మాసనం తెలిపింది. కాలుష్య సమస్యను రాజకీయం చేయరాదని స్పష్టం చేశారు. పంజాబ్ , హర్యానా సరిహద్దులలో పంట వ్యర్థాల దహనంతోనే దేశ రాజధానిలో కాలుష్య తీవ్రత పెరిగిందని ఢిల్లీ ప్రభుత్వం వాదిస్తోంది. వాయు కాలుష్య సమస్యపై చాలా కాలంగా సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. కాలాన్ని బట్టి ఏర్పడే సమస్యగా వాయు కాలుష్యాన్ని లెక్కలోకి తీసుకుంటే చిక్కులు తప్పవని హెచ్చరించారు. రైతులు పంట వ్యర్థాలను ఎందుకు పొలాల కళ్లాల తరువాత తగులబెట్టాల్సి వస్తోంది? వీటిని సకాలంలో సరైన రీతిలో నిర్మూలించేందుకు సరైన యంత్రాలు, ఏర్పాట్లు వారి వద్ద ఉన్నాయా? అనేది విశ్లేషించుకోవల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. వాయు కాలుష్య సమస్య గురించి కనీసం నెలకు రెండు సార్లు అయినా సమీక్ష జరగాలి. స్వల్పకాలిక దీర్ఘకాలిక పరిష్కారాలను ఈ క్రమంలో కనుగొనాల్సి ఉంటుందని బెంచ్ అభిప్రాయపడింది. ప్రభుత్వాలు పార్టీల రాజకీయాల కోణంలో, అహంకార ధోరణితో ఈ విషయాన్ని చూడటానికి వీల్లేదని తెలిపారు. కోవిడ్ దశలో ఢిల్లీలో వాయుకాలుష్యం తక్కువగా ఉంది. అప్పుడు కూడా ఈ సమయంలోనే పంట వ్యర్థాల దగ్థం జరిగింది. కానీ అప్పుడు ప్రజలు పొగచూరని , నిర్మలమైన ఆకాశం చూడగలిగారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదని, దీనిని బట్టి చూస్తే వాయుకాలుష్యానికి కారణం వేరే ఉందని తెలుస్తోందని చీప్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. పరోక్షంగా ఆయన ఇదంతా కూడా వాహన కాలుష్యంతో తలెత్తిన విషమ పరీక్ష అని విశ్లేషించారు. ఈ కోర్టులో రైతులను నిందించడం తరచూ జరుగుతోంది. అయితే వారి తరఫున వాదనలు విన్పించడానికి అరుదుగా హాజరీలు ఉంటాయని సిజెఐ వ్యాఖ్యానించారు. తాము కేసు విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నామని ఆ లోగా వాయు ప్రమాణాల నిర్వహణ కమిషన్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇతర సంబంధిత పక్షాలు కాలుష్య నివారణకు తీసుకుని తీరాల్సిన విషయాలను స్పష్టం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసుకు సంబంధించి ప్రభుత్వ సంస్థల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్యర్య భటి హాజరయ్యారు. పంట వ్యర్థాల దగ్ధం, వాహన కాలుష్యం, భవన నిర్మాణ రంగ ధుమ్మూ ధూళి, రోడ్ల దుమ్ము , సేంద్రీయ వ్యర్థాల దహనం వంటి పలు కారణాలు ఉన్నాయని చెప్పారు. దీనితో ఏకీభవించని ధర్మాసనం ఇదంతా కాదు తమకు ఈ విషయంపై వారంలో తగు నివేదిక అందించాలని ఆదేశించి, విచారణను వాయిదా వేశారు. అశాస్త్రీయ పట్టణ నగర అభివృద్ధి , యాంత్రీకరణలు వంటివి వాయు నాణ్యత క్షీణతకు దారితీస్తున్నాయని ధర్మాసనం తెలిపింది.
ఆంధ్రప్రభ, బాపట్ల కలెక్టరేట్ : దిత్వా తుఫాన్ ప్రభావ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా
కర్నూలు బ్యూరో ఆంధ్రప్రభ : రూ.40,000 లంచం తీసుకుంటున్న దేవనకొండ మండలం నల్లచెలిమల
వరుణ్ సందేశ్ నటించిన తొలి ఓటీటీ తెలుగు వెబ్ సీరిస్ ’నయనం’. డిసెంబర్ 19 నుండి ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్ వెబ్ సీరిస్ ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్త్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించబోతున్నారు. ’నయనం’ వెబ్ సీరిస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఒరిజినల్లో ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ’‘నటుడిగా నాకు ఇది సరికొత్త ప్రయాణం. ఇప్పటి వరకూ చేయనటువంటి విభిన్నమైన పాత్రలో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నాను”అని అన్నారు.
హానీ ట్రాప్‌లో చిక్కుకున్న యువకుడు
హానీ ట్రాప్ చేసి యువకుడి వద్ద నుంచి సైబర్ నేరస్థులు రూ.1.02లక్షలు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని యాకత్‌పురకు చెందిన యువకుడు(20) టెలీగ్రాంలో వచ్చిన మెసేజ్‌కు స్పందించాడు. మహిళ పేరుతో ఛాటింగ్ చేసిన సైబర్ నేరస్థులు సెక్స్‌వల్ సర్వీస్ అందిస్తామని చెప్పారు. యువతి ఫొటోతో సైబర్ నేరస్థులు ఛాటింగ్ చేయడంతో నిజమని నమ్మిన యువకుడు వారు చెప్పినట్లు చేశాడు. యువతిని హోటల్‌కు పంపిస్తామని చెప్పారు. దానికి ముందుగా అడ్వాన్స్ బుకింగ్, సర్వీస్ సెక్యూరిటీ, రూమ్ రిజర్వేషన్ కోసం ముందుగానే డబ్బులు చెల్లించాలని చెప్పారు. దానికి అంగీకరించిన యువకుడు యూపిఐ ద్వారా రూ.1,02,093 ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత బాధితుడు అబిడ్స్‌లోని హోటల్‌కు వెళ్లి ఎంక్వైరీ చేయగా ఎవరూ రాలేదు. వెంటనే టెలిగ్రాంలో సంప్రదించగా సైబర్ నేరస్థులు వెంటనే రూ.10వేలు పంపించాలని బ్లాక మెయిల్ చేశారు. దీంతో తాను సైబర్ నేరస్థుల చేతుల్లో మోసపోయానని గ్రహించాడు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 2న చెన్నైలో జరిగే శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ఇగ్నిషన్ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. జర్నలిస్ట్ శోమా చౌదరి ఆధ్వర్యంలో ఐటీసీ గ్రాండ్ చోళా వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ‘రిబూటింగ్ ది రిపబ్లిక్’ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై కేటీఆర్ తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ వేదికపై జాతీయ రాజకీయాలకు సంబంధించిన పలు కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది.
అన్యమతస్త ఉద్యోగులపై నివేదిక….
తిరుపతి ప్రతినిధి , ఆంధ్రప్రభ : టీటీడీలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు
విరాట్ బ్యాటింగ్ అద్భుతం: కుల్దీప్ యాదవ్
సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో చిరస్మరణీయ సెంచరీ సాధించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై అతని సహచరుడు కుల్దీప్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ చూసి తామంత ఎంతో ఆనందానికి గురయ్యమన్నాడు. కోహ్లి ఇన్నింగ్స్‌ను గమనిస్తే అతను గాడిలో పడినట్టేనని పేర్కొన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడన్నాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచేందుకు ఇది దోహదం చేస్తుందన్నాడు. తాను కెరీర్ ఆరంభించినప్పుడూ విరాట్ వరుస సెంచరీలతో చెలరేగి పోయేవాడన్నాడు. రాంచిలో అతను ఆడిన ఇన్నింగ్స్ ఒకప్పటి విరాట్‌ను తలపించిందని కుల్దీప్ అభిప్రాయపడ్డాడు. తనలాంటి ఎంతో మంది క్రికెటర్లకు కోహ్లినే స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు.
శ్రీరంగనాథుడికి పట్టువస్త్రాల సమర్పణ
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని
ప్రతి స్టార్ట్ఫోన్లో సంచార్ సాథీ యాప్
ప్మార్ట్ ఫోన్లలో సైబర్ నేరాల నియంత్రణ , ఫోన్ల చోరీల ఆటకట్టుకు సంబంధిత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు వెలువరించింది. ఫోన్ల తయారీదార్లు ఇకపై తయారు చేసే ప్రతి ఫోన్లోనూ సైబర్ సెఫ్టీ యాప్ ఏర్పాటు అత్యవసరంగా చేయాలని ఆదేశించారు. ఈ ఏర్పాటును సంచార్ సాథీ అని వ్యవహరిస్తారు. దీని ఏర్పాటుకు సంబంధించి ఫోన్ల తయారీ కంపెనీలకు ఉత్తర్వులు వెలువరించారు. ఫోన్ల వినియోగదార్లు తమ ఫోన్ల నుంచి ఈ యాప్‌ను ఏ విధంగా కూడా తొలగించడానికి వీల్లేకుండా సరైన అమరిక ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్న దశలో, విద్యావంతులు కూడా ఎంతో నష్టపోతున్న కాలంలో స్మార్ట్ఫోన్లలో ఇటువంటి సైబర్ నేరాల చెక్ ఏర్పాటు అవసరం అని ఆయా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తరఫున అంతర్గత ఆదేశాలు వెలువడినట్లు ఆయా కంపెనీల ద్వారా వెల్లడైంది. సాధారణంగా ఎక్కువగా సైబర్ నేరాలు సెల్ఫోన్ల సాంకేతికను వాడుకుంటూ నేరగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ దశలో సెల్ఫోన్లలోనే వీటిని నియంత్రించే ఏర్పాటు అవసరం అనే విషయం సాంకేతిక నిపుణుల ద్వారా గ్రహించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ చర్యకు దిగింది. తొలిగించడానికి వీల్లేని , ప్రభుత్వ పరిధిలోని సైబర్ సెక్యూరిటీ యాప్ ఏర్పాటు విషయంలో ప్రైవేటు కంపెనీలు స్పందన తెలియలేదు. యాపిల్ , శామ్సంగ్ ఇతర కంపెనీలు ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫోన్ల మార్కెట్‌గా భారతదేశం నిలిచింది. ఇప్పటికే 1.2 బిలియన్ ఫోన్లవాడకం దార్లు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జనవరిలో విడుదల చేసిన ఈ యాప్‌తో వినియోగదార్లు పోగొట్టుకున్న ఏడు లక్షలకు పైగా ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌లోనే అరలక్ష వరకూ రికవరీ అయ్యాయి.
ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు..
ఆంధ్రప్రభ, తిరుపతి : ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ విశిష్ట సేవలు
కంచికచర్ల, ఆంధ్రప్రభ : అటవీ ప్రాంతాల్లోని అలుగు కంచికచర్ల పట్టణంలో సంచరిస్తుండటంతో పలువురు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్టపరిధిలో పరిష్కరించి
Akhanda Haindavam: Spiritual Anthem
The countdown has begun for the theatrical release of Nata Simham Nandamuri Balakrishna’s highly anticipated flick Akhanda 2. Directed by Boyapati Sreenu, the movie will hit the screens in 4 more days on December 5th. The makers have intensified the promotional activities, and they have released lyrical video of Akhanda Haindavam song. Music director S […] The post Akhanda Haindavam: Spiritual Anthem appeared first on Telugu360 .
Chandrababu | మనమే టాప్ ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : దేశంలో ఏ
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : అర్జీదారులు సంతృప్తి పొందేలా ప్రజా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో
ఆంధ్రప్రభ, విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి
Eluru |కిడ్నీ బాధితురాలి ఇంటికి ..
Eluru | కిడ్నీ బాధితురాలి ఇంటికి .. ఏలూరు/ఉంగుటూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో
ఆంధ్రప్రభ, ఆరిలోవ విశాఖపట్నం : విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ విశాఖపట్నం
విజయవాడలో మెగా పాస్‌పోర్ట్ మేళా
ఆంధ్రప్రభ, విజయవాడ : త్వరలో నిర్వహిస్తున్న మెగా పాస్‌పోర్ట్ మేళను సద్వినియోగం చేసుకోవాలని
బ్లైండ్ క్రికెటర్ కు అపూర్వ స్వాగతం..
ఆంధ్రప్రభ విజయవాడ : కొలంబోలో ఇటీవల జరిగిన తొలి మహిళా ప్రపంచ బ్లైండ్
కనీస వేతనాలు చెల్లించని సంస్థలపై చర్యలు..
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రైవేట్ వ్యాపార సంస్థలు
తీర్మానం ఉంది అందుకే చెల్లించాం..
శావల్యాపురం, ఆంధ్రప్రభ : పొట్లూరు గ్రామంలో అభివృద్ధి పనులకు పంచాయతీ తీర్మానం ప్రకారమే
ఎయిడ్స్ పట్ల అప్రమత్తత అవసరం..
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : హెచ్ఐవి, ఎయిడ్స్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన
ఆంధ్రప్రభ, విజయవాడ : ఈ నెల 2వ తేదీ మంగళవారం మైలవరం నియోజకవర్గస్థాయి
కౌలు రైతు వీరన్నది ఆత్మహత్య కాదు..ప్రభుత్వం చేసిన హత్యే: హరీష్ రావు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగుతూ పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనమని అన్నారు. వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Photos : Anand Deverakonda’s Epic Movie First Look launch
The post Photos : Anand Deverakonda’s Epic Movie First Look launch appeared first on Telugu360 .
ఆంధ్రప్రభ, విజయవాడ (కార్పొరేషన్) : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
కర్నూలు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఆదోని ప్రాంతంలో మండల విభజనపై రాజకీయ–పాలనాత్మక
సామాజిక పెన్షన్ పెంపు చంద్రబాబుతోనే సాధ్యం..
విశాలాంధ్ర-తాడిపత్రి: సామాజిక పెన్షన్ పెంపు చంద్రబాబు తోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ 268 బూత్ ఇంచార్జ్ బిఎల్ఎ కె.చిన్నబాబు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 35వ వార్డు నందలపాడు ఎస్సీ కాలనీ నందు బూత్ ఇన్చార్జి కె.చిన్నబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కె.చిన్నబాబు మాట్లాడుతూ నందలపాడు ఎస్సీ కాలనీ నందు సుజాత అనే మహిళకు భర్త చనిపోయిన రెండు నెలలకే పెన్షన్ మంజూరు హర్షణీయమన్నారు. మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి […] The post సామాజిక పెన్షన్ పెంపు చంద్రబాబుతోనే సాధ్యం.. appeared first on Visalaandhra .
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నిరంజన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరులో తట్ట మన్ను తీయలే, చూసుకోని ముర్వ చెప్పుకుని ఏడ్వ అన్నట్లుంది పాలమూరు పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చేసింది ఏం లేదని అన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. శంకుస్థాపనలు తప్ప రెండేళ్లలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలకు ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించయారు. పదేళ్లలో కేసీఆర్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3.48 లక్షల కోట్లు తద్వారా చేసిన అభివృద్ధి, గణాంకాలు కండ్ల ముందు ఉన్నాయని చెప్పారు. కేవలం రెండేళ్లలో కార్పోరేషన్ రుణాలు కాకుండానే రూ.2.50 లక్షల కోట్లు అప్పుచేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంజన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారు, అభివృద్ధి పనులు పక్కనపెట్టారని, రైతులను గాలికి వదిలి పంటలను వాటి కర్మానికి వదిలేశారని మండిపడ్డారు. బోనస్ అని బోగస్ మాటలు చెప్పి బ్రోకర్ల అవతారం ఎత్తారని అన్నారు. తెలంగాణ రైజింగ్ అంటూ అప్పులు తెస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ రెవెన్యూ 25 శాతం వరకు పెరిగిందని, అయితే కాంగ్రెస్ పాలన పుణ్యాన ఈ ఏడాది - 0.76 శాతానికి పడిపోయిందని విమర్శించారు. అడ్డగోలు అప్పులు చేసి అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తూ రైజింగ్ అంటూ పొంకనాలు కొట్టడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.
ఎన్నికల సంఘం సిఎంపై కేసు నమోదు చేయాలి: హరీశ్
హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఎం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుంటే ఎస్ఇసి ఏం చేస్తుందని ప్రశ్నించారు. శుంకుస్థాపన చేసే ప్రాజెక్టులు, రోడ్లు గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడవా? అని నిలదీశారు. ఎన్నికల సంఘం వెంటనే సమీక్షించి సిఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక విద్యుత్ శాఖ గురించి మాట్లాడుతూ.. ‘‘విద్యుత్‌శాఖను మొత్తం ఎపి అధికారులతో నింపుతున్నారు. కీలకమైన బాధ్యతల్లో ఆంధ్ర అధికారులను నియమిస్తున్నారు. ప్రభుత్వాన్ని తెలంగాణ వారు నడుపుతున్నారా? వెనకుండి ఎపి వాళ్లు నడుపుతున్నారా? ఎపి అధికారులు, అవినీతితో రాష్ట్ర విద్యుత్ రంగం అస్తవ్యస్థమవుతోంది. తక్కువ ధరకే ఎన్టిపిసి విద్యుత్ ఇస్తుంటే.. కొత్త ప్లాంట్లు ఎందుకు? కమీషన్ల కోసమే కొత్త పవర్ప్లాంట్లు చేపడుతున్నారు. ఈ విషయంలో చర్చ పెడితే ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొత్తగా చేపట్టే మూడు ప్లాంట్లకు రూ.45 వేల కోట్లు అవుతుంది. పైసా ఖర్ఛు లేకుండా ఎన్టిపిసి విద్యుత్ ఇస్తుంటే.. ఇన్ని వేల కోట్లు ఎందుకు?’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు.
సుజనా ఫౌండేషన్ కు కలెక్టర్ అభినందన
ఆంధ్రప్రభ భవానీపురం : విజయవాడ పశ్చిమ లోని జి.ఎన్.ఆర్.ఎంసి ప్రభుత్వ పాఠశాలలోనీ విద్యార్థులకు

24 C