చిరు డ్యాన్స్ అదుర్స్.. ‘హుక్ స్టెప్’ వీడియో సాంగ్ రిలీజ్..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మన శంకరవర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ వింటేజ్ చిరూని చూశామని సంబరపడిపోయారు. అంతేకాక.. ఈ సినిమాలో అందరినీ మెప్పించిన మరో అంశం ‘హుక్ స్టెప్’ సాంగ్. ఈ పాటలో చిరు ఈ వయస్సులో కూడా డ్యాన్స్ ఇరగదీశారు. దీంతో సినిమా రిలీజ్‌కి ముందే పాటకి మంచి హైప్ వచ్చింది. సోషల్‌మీడియాలో చాలా మంది ఈ పాటపై రీల్స్ చేసి పోస్ట్ చేశారు. ఇక సినిమా విడుదల తర్వాత అందరూ హుక్ స్టెప్ సాంగ్‌కి ఫిదా అయిపోయారు. అయితే తాజాగా ఈ పాట పూర్తి వీడియో సాంగ్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఈ పాటని ఆట సందీప్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారు. ఇక సినిమా విషయానికొస్తే.. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.350 కోట్లు వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించారు.
నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు
పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలని ఆదేశంఅన్ని స్కూళ్లలో పరిశుభ్రమైన టాయిలెట్లు తప్పనిసరి అని సూచన నెలసరి ఆరోగ్యం అనేది మహిళల ప్రాథమిక హక్కు అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో ఇది అంతర్భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పాఠశాలల్లో నెలసరి పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడం బాలికల విద్యాహక్కుకు, ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తోందని స్పష్టం చేసింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు […] The post నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు appeared first on Visalaandhra .
Fire Accident |లారీ దగ్ధం.. ఒకరు సజీవదహనం
Fire Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అగ్నిప్రమాదంలో లారీ దగ్ధమై
6,020 people |చిన్నారులకు రిస్ట్ బ్యాండ్
6,020 people | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మేడారం సమ్మక్క- సారలమ్మ
Ketepalli | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని నల్గొండ జిల్లా నాంపల్లి
sammakka |భక్తుల నరకయాతన
sammakka | భక్తుల నరకయాతన sammakka | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : రెండు
విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్ధం.. వ్యక్తి మృతి
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి సమీపంలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ తోటలోకి కొబ్బరికాయల కోతకు 18 మంది కూలీలు లారీలో వచ్చారు. కాయలు కోస్తుండగా.. అక్కడే కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు లారీకి తగిలాయి. దీంతో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మృతుడు మల్లికార్జున దేహం పూర్తిగా కాలిపోయింది. అతడు కొబ్బరికాయల అమ్మకంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తాడని పోలీసులు తెలిపారు.
Media conference |సిట్ పేరిట కుట్రలు..
Media conference | సిట్ పేరిట కుట్రలు.. Media conference | వెబ్
Legendary Director making his Comeback
Legendary director Singeetam Srinivasa Rao who has directed several classics in Telugu cinema is making his comeback. He directed sixty films across multiple genres and languages including Telugu, Kannada, Tamil, Hindi, and English. The 94-year-old director is all set to direct his 61st film and it will be bankrolled by Vyjayanthi Movies. Some of his […] The post Legendary Director making his Comeback appeared first on Telugu360 .
Medaram |ముగింపు దశకు మేడారం జాతర
Medaram |ముగింపు దశకు మేడారం జాతర Medaram |వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : మేడారం
US government |మరోసారి షట్‌డౌన్..
US government | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికా ప్రభుత్వం మరోసారి
మేడారం జాతరలో బస్సు అద్దాలు పగలగొట్టిన భక్తులు #Medaram #RTC #Telangana #Congress #PublicAnger
టీ20 ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ బౌలర్ దూరం
త్వరలో ప్రారంభం కానున్న 2026 టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ టీ20 ప్రపంచ కప్ కు దూరమయ్యాడు. ఈ టోర్నమెంట్ కోసం తమ తాత్కాలిక జట్టును ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించిందనే విషయం తెలిసిందే. శనివారం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల తుది జట్టులో కమిన్స్ తోపాటు తాత్కాలిక జట్టులో ఉన్న మాట్ షార్ట్‌కు చోటు దక్కలేదు. ఇక, సీనియర్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ను కూడా పక్కనపెట్టారు. కమిన్స్ స్థానంలో బెన్ డ్వార్షుయిస్ను తీసుకున్నారు. మాట్ షార్ట్ స్థానంలో మాట్ రెన్షాను ఎంపిక చేశారు. కాగా, ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 17న టోర్నీ ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కనోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
సైకిల్ కు ఓటు వేశారు..అభివృద్ధి చేసి చూపించాం: చంద్రబాబు
అమరావతి: నూతన చరిత్రకు కుప్పం నుంచి శ్రీకారం చుట్టామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గిన్నిస్ రికార్డు వచ్చిందని కాదు.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు సిఎం పర్యటించారు. డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్ల పంపిణీ చేశారు. శివపురం నుంచి తులసినాయనపల్లి ప్రజావేదిక వరకు ఈ-సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తులసినాయనపల్లి ప్రజావేదిక లో ప్రసంగించారు. కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారని, ఇంటిపై ఉత్పత్తియ్యే విద్యుత్ తోనే సైకిల్ కు ఛార్జింగ్ చేసుకోవచ్చునని తెలియజేశారు. ఈ సూపర్ సైకిల్.. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా దూసుకెళ్తుందని, సైకిల్ కు ఓటు వేశారు.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని అన్నారు. తప్పులు చేసిన వాళ్లకు నిద్ర రాదు.. వాళ్లు చేసిన తప్పులే వెంటాడుతుంటాయని, నిద్ర చాలా ముఖ్యం.. మంచి చేస్తే సుఖంగా నిద్రపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. శరీరానికి కొంత వ్యాయామం కూడా అవసరమని, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటానని అనునిత్యం నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తుంటానని చెప్పారు. గురువారం మధ్యాహ్నం 12 నుంచి శుక్రవారం మ.12 వరకు 5,555 ఈ సైకిళ్లు విక్రయించామని అన్నారు. రూ.35 వేల విలువైన సైకిల్ ను రాయితీపై రూ.24 వేలకు విక్రయం చేశామని అన్నారు. రాష్ట్ర ఆదాయం పెరగాలి.. పేదవాళ్లకు అందాలి.. అని.. పేదవాళ్ల జీవన ప్రమాణాలు పెరిగి ఆనందంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఒక సంకల్పంతో సూపర్ సిక్స్ ను.. సూపర్ హిట్ చేశామని, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Ys Jagan : జగన్ చేయించిన సర్వేలో ఆశ్చర్యకరమైన విషాయాలు... అవేంటో తెలుసా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ సారి అధికారంలోకి రావడం మాత్రం ఖాయమన్న ధీమాలో ఉన్నారు.
మనిషా?.. మృగమా?.. తల్లిదండ్రులు, సోదరిని హత్య చేసి..
బెంగళూరు: ఓ వ్యక్తి తన కన్న తల్లిదండ్రులతోపాటు సొంత సోదరిని దారుణంగా హత్య చేశాడు. ఈ భయంకరమైన కుటుంబ మారణహోమం కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని విజయనగర్ జిల్లాలో జనవరి 27(మంగళవారం)న ఈ దారుణ సంఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కొత్తూరులో అద్దె ఇంట్లో నివాసముంటున్న తన తల్లిదండ్రులు భీమ్రాజ్, జయలక్ష్మి, సోదరి అమృతను అక్షయ్ కుమార్ అనే వ్యక్తి.. హత్య చేసి, వారి మృతదేహాలను అద్దె ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత బెంగళూరుకు పారిపోయిన నిందితుడు అక్షయ్.. తన మీద అనుమానం రాకుండా.. తల్లిదండ్రులు, సోదరి కనిపించకుండా పోయారని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదును చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అమృతకు ఒక యువకుడితో ఉన్న ప్రేమ సంబంధంపై కుటుంబంలో వివాదం తలెత్తింది. అమృత ప్రేమను అక్షయ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే, తల్లిదండ్రులు అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించగా.. కోపంతో రెచ్చిపోయిన అక్షయ్.. ముగ్గురినీ హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మృతదేహాలను పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించడానికి ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించేందుకు, సంఘటనల క్రమాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
KCR |నేతలు, న్యాయవాదులతో కేసీఆర్ సమాలోచనలు
KCR | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ
సిల్వర్ ఢమాల్ రూ. లక్షకు పైగా తగ్గుదల #SilverCrash #BullionMarket #Commodity #NewDelhi
February 2026 OTT Releases: రాజా సాబ్ నుంచి ది బ్లఫ్ వరకు పూర్తి జాబితా
ఫిబ్రవరి 2026లో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఆహా ఓటీటీలలో విడుదలయ్యే తెలుగు, హిందీ, తమిళ్ మూవీస్, వెబ్ సిరీస్ పూర్తి జాబితా, స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి. సంక్రాంతి సందడి థియేటర్లలో ముగిశాక, ఇప్పుడు అసలైన ‘డిజిటల్’ విందు మొదలుకానుంది. ఫిబ్రవరి 2026లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు భారీ చిత్రాలతో సిద్ధమయ్యాయి. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి ప్రియాంక చోప్రా గ్లోబల్ యాక్షన్ మూవీ ‘ది బ్లఫ్’ వరకు అన్నీ ఈ నెలలోనే మీ స్క్రీన్‌పైకి […] The post February 2026 OTT Releases: రాజా సాబ్ నుంచి ది బ్లఫ్ వరకు పూర్తి జాబితా appeared first on Dear Urban .
బిఆర్ఎస్ అవినీతినే కాంగ్రెస్ కొనసాగిస్తోంది: రామచందర్ రావు
హైదరాబాద్: పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. మున్సిపాలిటీల్లో అసలు పరిపాలనే లేదని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అవినీతినే కాంగ్రెస్ కొనసాగిస్తోందని, ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోటీ చేస్తున్నామని, తెలంగాణలో బిజెపికి ఆదరణ పెరుగుతోందని.. తొలిసారి మొత్తం మున్సిపాలిటీల్లో బరిలోకి దిగుతున్నామని రామచందర్ తెలియజేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకే గూటి పక్షులు.. వాటి విధానాలు ఒక్కటేనని ఎద్దేవా చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వచ్చిన రూ.250 కోట్లు ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు. గుజరాత్ సిఎంగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కూడా గతంలో సిట్ విచారణకు హాజరయ్యారని, సిట్ విచారణ తర్వాత కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక్కటవుతాయని రామచందర్ రావు పేర్కొన్నారు.
Andhra Pradesh Government Moves Toward Cancelling Bharathi Cement Limestone Leases
The Andhra Pradesh government is preparing for a major and politically sensitive decision that could have wide ramifications. The state is moving closer to cancelling limestone mining leases held by Bharathi Cements, a company linked to the family of former Chief Minister Y S Jagan Mohan Reddy. What began as a routine notice from the […] The post Andhra Pradesh Government Moves Toward Cancelling Bharathi Cement Limestone Leases appeared first on Telugu360 .
కుప్పకూలిన బంగారం, వెండి.. భారీగా పతనమైన ధరలు
ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర ఒక్కరోజులో 594 డాలర్లు (11%) క్షీణించి 4732 డాలర్లకు, వెండి ధర 36 డాలర్లు (32%) పతనమై 78 డాలర్లకు పరిమితం అయ్యాయి. ఫలితంగా రాత్రి 11.55 గంటలకు హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ.21,860 పైగా తగ్గి రూ.1,57,840కు, […] The post కుప్పకూలిన బంగారం, వెండి.. భారీగా పతనమైన ధరలు appeared first on Visalaandhra .
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : వడియావత్ సువర్ణ దేవేందర్
బిఆర్ఎస్ పార్టీ 2 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు కల్వకుర్తి (జనంసాక్షి) : కల్వకుర్తి మున్సిపల్ 2 వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ …
అంటార్కిటికాలో హైదరాబాద్ మహిళ అరుదైన రికార్డు #Antarctica #Hyderabad #WomenAchievers #Inspiration
Jana Sena : మరక అంట కూడదనుకుంటే.. మౌనమే మంచిదా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నింటికీ దూరంగా ఉంటే మేలు అని భావిస్తున్నట్లుంది.
The long-running water disputes between Andhra Pradesh and Telangana flared up again at the first meeting of the Central government–appointed committee held in New Delhi. The flashpoint was Andhra Pradesh’s proposal to include the Polavaram–Nallamala Sagar project in the agenda. Telangana made it clear that the proposal would not be accepted under any circumstances. According […] The post Polavaram–Nallamala Sagar Triggers Sharp Andhra–Telangana Clash at First Central Water Committee Meet appeared first on Telugu360 .
AP | విగ్రహావిష్కరణ.. AP | గుంటూరు మెడికల్, ఆంధ్రప్రభ : గుంటూరు
Former MLA |మేడారంలో మాజీ ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు
Former MLA | కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క
రాష్ట్ర ప్రభుత్వ పథకాలే.. కాంగ్రెస్ గెలుపుకు శ్రీరామరక్ష
రాష్ట్ర ప్రభుత్వ పథకాలే.. కాంగ్రెస్ గెలుపుకు శ్రీరామరక్ష చేవెళ్ల, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి రేవంత్
సూర్యకు రావాల్సినంత క్రెడిట్ ఇవ్వడం లేదు: ఇర్ఫాన్ పఠాన్
టి-20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి భారత జట్టును విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఓ వైపు జట్టు విజయాల బాటలో నడుస్తుంటే సూర్య మాత్రం ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి-20 సిరీస్‌లో మాత్రం సూర్య తిరిగి పుంజుకున్నాడు. రెండు, మూడు టి-20ల్లో హాఫ్ సెంచరీలు చేసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో త్వరలో ప్రారంభమయ్యే టి-20 ప్రపంచకప్‌లో సూర్య కెప్టెన్‌గా రాణించడం మాత్రమే కాదు.. బ్యాట్‌తోనూ విరుచుకుపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సూర్య కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకు కెప్టెన్‌గా రావాల్సిన క్రెడిట్ ఇవ్వడం లేదని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. సూర్య కెప్టెన్సీ స్టైల్లో రోహిత్ శర్మ ఛాయలు కనిపిస్తున్నాయని అన్నాడు. ‘‘సూర్యకు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డు ఉంది. టి-20 ఫార్మాట్లో కెప్టెన్‌గా అతడి విజయాల శాతం 84. ఇది చాలా ఎక్కువ. కానీ, మనం సూర్యకుమార్ యాదవ్‌కు ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వడం లేదు. అతడు బౌలర్ల కెప్టెన్. అతడిలో రోహిత్ శర్మ ఛాయలున్నాయి. అతడు బౌలర్లపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. జట్టు కోసం సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు’’ అని పఠాన్ పేర్కొన్నాడు. ఇక సూర్య 2025లో అతడి స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు. గత సంవత్సరంలో 21 ఇన్నింగ్స్‌లో కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ‘‘సూర్య సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. కెప్టెన్‌గా అతడు కచ్చితంగా ప్రపంచకప్ ఆడుతాడు. కానీ బ్యాటర్‌గా సూర్య పరుగులు రాబట్టాల్సి ఉంది. అది అతడికి ఎంతో కీలకం’’ అని అన్నాడు.
మహారాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ #Maharashtra #SunetraPawar #NCP #Politics
The incident |భార్య గొంతు కోసి…
The incident | భార్య గొంతు కోసి… The incident | వెబ్
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేత
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ పట్టణం లోని నిరుపేద కుటుంబానికి చెందిన
17వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా..
17వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా.. పరకాల, ఆంధ్రప్రభ : పూర్వ అనుభవంతో
tragic incident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఫ్లైఓవర్ డివైడర్ ను
SIP Investment అంటే ఏమిటి? చిన్న మొత్తాలతో కోటీశ్వరులు ఎలా అవుతారు?
SIP Investment అంటే ఏమిటి? నెలకు చిన్న మొత్తంతో ప్రారంభించి కోటీశ్వరులు ఎలా అవ్వాలో ఈ కథనంలో తెలుసుకోండి. Power of Compounding, SIP ప్రయోజనాలపై పూర్తి అవగాహన పొందండి. ధనవంతులు అవ్వడం అనేది కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉండదు, అది సరైన ‘ఆర్థిక క్రమశిక్షణ’ మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది స్టాక్ మార్కెట్ అంటే జూదం అని, అక్కడ డబ్బులు పోతాయని భయపడుతుంటారు. కానీ, సామాన్యుడు కూడా సురక్షితంగా, పద్ధతి ప్రకారం సంపదను సృష్టించుకునే […] The post SIP Investment అంటే ఏమిటి? చిన్న మొత్తాలతో కోటీశ్వరులు ఎలా అవుతారు? appeared first on Dear Urban .
మా ప్రాణాలు పోతున్నాయి కాపాడండి.. బాధితుడి కాల్ రికార్డింగ్
నాంపల్లి ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాద ఘటనలో చిక్కుకున్న బాధితుడి కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది
మేడారం జాతరలో భారీగా ట్రాఫిక్ జామ్…. గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు
నేటితో ముగియనున్న మహా జాతరమేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం నిండు జాతర కావడంతో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది. అయితే, ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఏర్పాట్లు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా భారీ ట్రాఫిక్ జామ్‌తో నరకయాతన అనుభవిస్తున్నారు.దర్శనం ముగించుకుని తిరుగుపయనమైన భక్తుల వాహనాలతో మేడారం మార్గాలు నిండిపోయాయి. తాడ్వాయి – […] The post మేడారం జాతరలో భారీగా ట్రాఫిక్ జామ్…. గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు appeared first on Visalaandhra .
Gold and Silver Prices : నేడు కూడా భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో భారీగా బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి
Andhra Pradesh : ఆటలాడుకోవడానికి ఆపదమొక్కులు వాడే దొరికాడా?
ఆంధ్రప్రదేశ్ లో ఫ్లెక్సీల రాజకీయం రగడగా మారింది.
9 year old | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అనుమానాస్పద స్థితిలో
మున్సిపల్ ఎన్నికలు.. వారికే బీఫాం ఇవ్వండి: సిఎం రేవంత్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం ముగిసింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సిఎం రేవంత్.. శనివారం మున్సిపల్ ఎన్నికలపై పిసిసి చీఫ్ మహేష్‌గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో ఆయన జామ్ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు సిఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. నాయకులు తమకు నచ్చిన వాళ్లకు కాకుండా ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు బీఫాం ఇవ్వండని సిఎం చెప్పారు. సమష్టిగా పని చేస్తే విజయం సాధిస్తామని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రుజువు చేశాయని తెలిపారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో కలిసి పనిచేసి విజయం సాధించాం. మున్సిపల్ ఎన్నికల్లో కూడా నాయకులు అంతా కలిసి పని చేసి అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఇప్పుడే చైర్మన్, మేయర్లను ప్రకటించకండి. సామాజిక సమీకరణాల ప్రకారం చైర్మన్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది అని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
BJP | విజయం మనందరి గెలుపు BJP | మంచిర్యాల, ఆంధ్రప్రభ :
మేడారం జాతరలో బస్సులు లేక భక్తుల తీవ్ర ఇబ్బందులు #Medaram #Jathara #TSRTC #Devotees
తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
-మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి విశాలాంధ్ర- విజయనగరం టౌన్: దేవుని పేరుతో రాజకీయం చేయడం ఆయనకే చెందిందని, తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకే దక్కిందని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో గల తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూగత కొంతకాలంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై సాగుతున్న వివాదానికి సిట్ […] The post తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి appeared first on Visalaandhra .
Parakala |ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి..
Parakala | ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి.. Parakala | పరకాల, ఆంధ్రప్రభ :
The Flower |లింగాకారంలో అరుదైన పుష్పం..
The Flower | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ అనంతగిరి అడవి ప్రాంతంలో
Rishab Shetty’s Demand irks Telugu Producers
Kannada actor Rishab Shetty emerged as a Superstar with the Kantara franchise. He directed and played the lead role and both the films are blockbusters. The makers made big profits and Rishab Shetty shared the profits along with Hombale Films. The actor is rushed with offers and he has signed two Telugu films. He is […] The post Rishab Shetty’s Demand irks Telugu Producers appeared first on Telugu360 .
Awareness |రోడ్డు భద్రతపై అవగాహన
Awareness | నేరడిగొండ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని రెయిన్బో పబ్లిక్ పాఠశాలలో
Utnoor | 108 లో గర్భిణీ మహిళా ప్రసవం
Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గిరిజన
ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
ఏపీలో వేగవంతంగా ఫింఛన్ల పంపిణీ .. లబ్దిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిగుడిపల్లి మండలం బెగ్గిలపల్లె లో జరిగిన పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వేగవంతంగా జరుగుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ఈ రోజు ఉదయం నుంచి లబ్దిదారుల ఇళ్ల వద్దనే […] The post ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ appeared first on Visalaandhra .
తెలంగాణ సాధకుడు కెసిఆర్ పై ఈ దుర్మార్గపు వైఖరి ఏంది?: కెటిఆర్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోప్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైరయ్యారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? అంటూ మండిపడ్డారు. సిట్ నోటీసులపై ఆయన స్పందిస్తూ.. ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. స్వయంగా కెసిఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు అని కెటిఆర్ అన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలంటూ రెండు రోజుల క్రితం సిట్ అధికారులు కెసిఆర్ కు నోటీసులు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న పార్టీ కార్యక్రమాల వల్ల తాను హాజరుకాలేనని.. జూబ్లీహిల్స్ లోని నందినగర్ లో కాకుండా తాను ప్రస్తుతం నివాసం ఉంటున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తనను విచారించాలని కోరుతూ కెసిఆర్ సిట్ కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన సిట్.. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నాం మూడు గంటలకు నందినగర్ ఆయన నివాసంలోనే విచారిస్తామని తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మరోసారి నోటీసులు అందించేందుకు నందినగర్‌లో ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు వాటిని అంటించారు.
పెంపుడు కుక్క దాడి.. మెడకు 50 కుట్లు #Crime #Bengaluru #DogAttack #PublicSafety
నెల్లూరు జిల్లా వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మైనింగ్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు
నామినేషన్లను సజావుగా సాగే విధంగా చూడాలి
ఎన్నికల ప్రవర్తన నియమావాళిని పాటించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ జనం సాక్షి 31 …
Hyderabad : కోఠిలో కాల్పులపై ఘటన ఇలా?
కోఠి లో జరిగిన కాల్పుల ఘటనపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడారు.
మంగపేట, మేడారం జనవరి 31 (జనంసాక్షి)మేడారంలో విఐపి గేట్ లో నుండి భక్తులు సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునే మార్గంలో పోలీస్ లు …
చర్లపల్లిలో విషాదం.. రైలుకింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
హైదరాబాద్: రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన చర్లపల్లిలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ డౌన్ లైన్ లో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి, పి.విజయ, పి.చేతన రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Jammu Kashmir |పాక్ డ్రోన్ కలకలం
Jammu Kashmir | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో
రెండో రోజు కొనసాగుతున్న ఏసిబి సోదాలు
–భారీగా బయటపడుతున్న అవకతవకలు విశాలాంధ్ర – కడియం : కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ ఈ లక్ష్మి కూడా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమె పై పలు పత్రికల్లో రక రకాల ఆరోపణలతో కూడిన కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం ఎసిబి డిఎస్పి కిషోర్ కుమార్, ఆయన సిబ్బందితో కలిసి రెండవ రోజైన శుక్రవారం కూడా సొదాలు కొనసాగించారు. ఈ […] The post రెండో రోజు కొనసాగుతున్న ఏసిబి సోదాలు appeared first on Visalaandhra .
HEAVY | ట్రాఫిక్ జామ్ HEAVY | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ :
బంగ్లాదేశ్‌తో భారత్ దౌత్యం కుదిరేనా?
భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు ప్రస్తుతం సరిగ్గా లేకపోయినా ఆ దేశంతో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోంది. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఇటీవల భారతీయ హిందూ మతవ్యక్తులు కొందరు బంగ్లాదేశ్ మతోన్మాదుల దాడులకు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో అంటే ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే కొత్త ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ బాధ్యతలు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో బంగ్లాదేశ్ నుంచి బహిష్కృతురాలైన ‘ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా గత వారం బంగ్లాదేశ్ పాలక వర్గానికి వ్యతిరేకంగా చేసిన ప్రసంగం బంగ్లాదేశ్ భారత్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ఆటంకం కలిగించే పరిస్థితి ఎదురైంది. షేక్ హసీనా మహమ్మద్ యూనస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. యూనస్ ఒక ‘హంతక ఫాసిస్ట్’ అని ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి అక్కడ యువతను రెచ్చగొట్టి ఏ విధంగా ఆందోళనలు లేవదీశారో వివరిస్తూ ప్రసంగించారు. బంగ్లాదేశ్ బయటశక్తుల పన్నాగం వల్ల తన ప్రభుత్వం కూలిపోయిందని వివరించారు. మైనారిటీ వర్గాలకు చెందిన వారిపై దాడులను అరికట్టడంలో యూనస్ ప్రభుత్వం వైఫల్యం బాగా కనిపిస్తోంది. శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. యూనస్ సామర్థంపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో సంబంధాలను పటిష్ట పర్చుకోడానికి భారత్ ప్రయత్నిస్తుండడం వ్యర్థమన్న వాదనలు వస్తున్నాయి. అయినా సరే ఈ విషయంలో కొత్త మార్గాలను భారత్ అనుసరించక తప్పదన్న ఆలోచన తెరపైకి వస్తోంది. అందువల్ల బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు భారత్ నిరీక్షించక తప్పదని తెలుస్తోంది. బంగ్లాదేశ్ గత ఎన్నికల్లో బిఎన్‌పి పోటీ నుంచి విరమించి హసీనాకు అవకాశం కల్పించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగా లేవు. పోటీ చేయడానికి ఇప్పుడు అందరికీ అవకాశం కలగకపోవచ్చు. విద్యార్థులు, అతివాద వర్గాలు లేరని ప్రతి బంధకాలుగా ఉన్నారు. అయితే ఎన్నికల్లో సరైన తీర్పు వచ్చి నూతన ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావంతో భారత్ ఉంటోంది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ టీమ్ గత ఏడాది నుంచి భారత్‌కు దూరంగా ఉండడం భౌగోళిక రాజకీయ వివాదాలకు దారితీస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్ శ్రీలంక మధ్య టి 20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో పర్యటించకూడదని బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకోవడం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. బంగ్లాదేశ్ ఎన్నికలు కొన్ని వారాల్లో జరగనున్న తరుణంలో మాజీ ఢాకా పోలీస్ కమిషనర్, మరో ఇద్దరు పోలీస్ అధికారులపై సోమవారం (26126) స్పెషల్ బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం సంచలనం కలిగిస్తోంది. 2024లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లకు హసీనా ప్రభుత్వమే కారణమని ఆరోపణలు రావడంతో ఆ ప్రభుత్వంలో పని చేసిన ఈ పోలీస్ ఆఫీసర్లను బాధ్యులుగా నేరారోపణ చేస్తూ ఈ మరణ శిక్షపడింది. జస్టిస్ మొహమ్మద్ గొలం మోర్టుజా మొజుందార్ నేతృత్వం లోని ముగ్గురు జడ్డీలతో కూడిన ప్యానెల్ ఈ మరణ శిక్ష విధించింది. మాజీ ఢాకా మెట్రో పాలిటన్ పోలీస్ (డిఎంపి) కమిషనర్ హబీబుర్ రెహ్మాన్, మాజీ డిఎంసి జాయింట్ కమిషనర్ సుదీప్ కుమార్ చక్రవర్తి, అడిషనల్ డెఫ్యూటీ కమిషనర్ మొహమ్మద్ అఖ్తరువ్ ఇస్లాం ఈ మరణ శిక్షను ఎదుర్కోనున్నారు. బంగ్లాదేశ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ఐసిబిబిడి) విధించిన రెండో మరణ శిక్ష ఇది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఈ ట్రిబ్యునల్ ఇంతకు ముందు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అలాగే అప్పటి హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమల్‌పై కూడా ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది. అంతేకాదు. ఢాకా అసిస్టెంట పోలీస్ కమిషనర్ మొహమ్మద్ ఇమ్రూల్కు ఆరేళ్లు జైలు శిక్ష, ఇన్స్పెక్టర్ అర్షాద్ హోస్సయన్ హు నాలుగేళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు సుజోన్ హోస్సయన్, ఇమాజ్ హోస్సయన్, నసిరుక ఇస్లామ్‌కు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. వీరిలో కొందరు పరారీలో ఉన్నారు. గత నవంబర్ లోనే హసీనాకు మరణ శిక్ష పడినా భారత్‌లో ఆమె తలదాచుకోవడంతో ఇంకా శిక్ష అమలు కాక పెండింగ్‌లో ఉంది. ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరుతోంది. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ యూనస్‌ను ‘హంతక ఫాసిస్ట్’ అని తీవ్రంగా హసీనా విమర్శిస్తూ ప్రసంగించిన టేపు ఇప్పుడు విడుదలై అనేక వివాదాలకు దారి తీయడమే కాక, బంగ్లాదేశ్‌ను మరింత రెచ్చగొడుతోంది. ఈ ప్రసంగం హసీనా చేయడానికి భారత్ ఎలా అవకాశం కల్పించిందని బంగ్లాదేశ్ ప్రశ్నిస్తోంది. ఇవన్నీ భారత్ పై బంగ్లాదేశ్ వ్యతిరేకతను మరింత పెంచే సంకేతాలు అందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో దౌత్య సంబంధాలు కుదుర్చుకోడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు నెరవేరుతాయా అన్న అనుమానం కలుగుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశంలో హిందూ మైనార్టీ వర్గాలపై చెలరేగుతున్న దాడులను కూడా బంగ్లాదేశ్ అరికట్టడానికి గట్టిగా ప్రయత్నించవలసి ఉంది. ఎన్నికలు పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేలా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలి. అంతవరకు బంగ్లాదేశ్‌లో శాంతి వాతావరణం నెలకొనదు. భారత్‌కు దౌత్యపరమైన సంబంధాలు సాగించే అవకాశం కలగదు.
ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి
ఉపాధిని దెబ్బ కొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించండి: సిఐటియు విశాలాంధ్ర ధర్మవరం: గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దించాలని, ఉపాధిని దెబ్బ కొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎస్‌హెచ్ భాష సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, సిపిఎం పట్టణ కార్యదర్శి మారుతి మాట్లాడుతూ తొలుత ధర్మవరం మండలం గొట్లూరు, గ్రామంలో సిఐటియు, సిపిఎం, ఆధ్వర్యంలో, జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా, మహాత్మా గాంధీ […] The post ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి appeared first on Visalaandhra .
3 people |రైలు కింద పడి ముగ్గురు ఆత్మహత్య
3 people | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రైలు కింద ఒకే
Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
చరిత్ర ఒకోసారి చిత్రమైన మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు అనూహ్యమైనవి. ఆ విధంగా జరిగినపుడు ప్రపంచం దిగ్భ్రాంతి చెందుతుంది. అందుకు కారణాలేమిటో, వాటి ప్రభావాలు ఏమిటో అవగతమయ్యేందుకు తగినంత కాలం తీసుకుంటుంది. అటువంటి ఒక చిత్రమైన మలుపును మనమిపుడు చూస్తున్నాము. అది, అమెరికా యూరప్‌ల మధ్య తలెత్తిన తీవ్రమైన విభేదాలు. ఉభయులు సుమారు 80 సంవత్సరాల పాటు కలిసి ప్రయాణం చేసారు. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలం (1939 45) నుంచి, అంతకు ముందు కూడా ఇరువురూ సామ్రాజ్యవాదులు, వలస పాలకులు అయినా, ఆ యుద్ధం ఒక కీలక ఘట్టం కావటంతో పరస్పరం సన్నిహితమయారు. బ్రెట్టన్ వుడ్స్ చర్చలు (1944), ప్రపంచ బ్యాంకు (1944), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (1945)తో ఆరంభించి ప్రపంచ వాణిజ్య సంస్థ (1995) వరకు ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేసారు. మరొక వైపు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా ‘నాటో’ (1949) పేరిట సైనిక కూటమిని నెలకొల్పారు. ఇతరత్రా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితిని కూడా తమ చెప్పు చేతలో పెట్టుకున్నారు. వీటన్నింటిని సాధనాలుగా మార్చుకుని ప్రపంచాన్ని ఉమ్మడిగా దోపిడీ చేసారు. సోవియెట్ యూనియన్ కొంత కాలం ఒక ప్రత్యామ్నాయంగా నిలిచినా 1991లో పతనం కావటం వారికి బాగా కలిసి వచ్చింది. 21వ శతాబ్దం మొదలైన సుమారు పదేళ్ల నుంచి రష్యా తిరిగి పుంజుకోవటం మొదలైనా, అంతకన్న ముఖ్యంగా చైనా వేగంగా బలపడినా అవి ఒక సవాలుగానైతే మారాయి గాని ఈ రెండు శక్తులను నిలువరించగల దశ ఇంకా రాలేదు. బహుళ ధ్రువ ప్రపంచ ఆకాంక్షలు, అందుకోసం బ్రిక్స్ మొదలైన రూపాలలో ప్రయత్నాలు ఆశాజనకంగానే కనిపించసాగాయి గాని, అవి ఈ రెండు శక్తులను కలవరపరచినా ఇంకా భయపెట్టే స్థాయికి ఎదగలేదు. దీనంతటి సారాంశం ఏమంటే, అమెరికా యూరప్‌ల కూటమి ఆధిపత్యం మరికొంత కాలం కొనసాగటమన్నమాట. ఇటువంటి పరిస్థితుల మధ్య అమెరికా యూరప్‌ల విభేదాలన్నవి ఎంత విచిత్రమైన మలుపు అవుతుందో ఊహించవచ్చు. వారి మధ్య ఇంకా తెగతెంపుల స్థితి అయితే ఇంకా రాలేదు గాని, పరస్పరం దూరం కావటం రోజు రోజుకు కొనసాగుతున్నది. అదే సమయంలో ఒకటి గుర్తుంచుకోవాలి. ఇద్దరిదీ పాశ్చాత్య ప్రపంచం. ఉభయులూ సామ్రాజ్యవాదులు. తక్కిన ప్రపంచంపై ఆధిపత్యం నెరపుతూ అక్కడి వనరులు, మార్కెట్లను, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను తమ గుప్పిట ఉంచుకోవటంలోనే వారి మనుగడ ఆధారపడి ఉంటుంది. అంతేకాదు. తమను కాదనే దేశాలపై సైనిక బలం ఉపయోగిస్తూ వచ్చిన వారు, అందుకోసమే ‘నాటో’ కూటమిని కొనసాగిస్తున్న వారు, ఆ అవకాశాలను చేజేతులా వదలుకోరు. అందువల్ల, అటువంటి ప్రమాదాన్ని నిరోధించేందుకు రానున్న కాలంలో తిరిగి రాజీపడి ఒకటి కాబోరని ఎంతమాత్రం చెప్పలేము. అదే సమయంలో ఇటీవల కాలపు విభేదాలను తక్కువ చేసి చూడలేము. వాటి తీరుతెన్నులను జాగ్రత్తగా గమనించటం అవసరం. ఈ కొత్త పరిస్థితికి ఆరంభం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా రెండవసారి ఎన్నిక కావటం నుంచి జరిగింది. అమెరికాను తిరిగి గొప్పది చేయాలి (మేక్ అమెరికా గ్రేట్ అగైన్), అమెరికా పస్ట్ నినాదాలతో అధికారానికి వచ్చిన ఆయన గత ఏడాదిగా తీసుకుంటూ వస్తున్న చర్యలు, కొంతకాలంగా బలహీన పడుతున్న తమ దేశానికి అవసరమేమో గాని, (దానిపైనా అమెరికాలోనే సందేహాలు మొదలుయ్యాయి) యూరప్‌తో విభేదాలకు మాత్రం కారణం కాసాగాయి. ఆయనకన్న ముందటి అధ్యక్షులు యూరప్‌కు, తక్కిన ప్రపంచానికి మధ్య తేడా చూసేవారు. కాని ట్రంప్ అందరి వలెనే వారిపై కూడా భారీ సుంకాలు విధించారు. ఉక్రెయిన్ యుద్ధం మొత్తం యూరప్‌కే ముప్పు కాగలదని వారు ఆందోళన చెందుతుండగా, రష్యాకు అనుకూలంగా మాట్లాడసాగారు. నాటో ఏర్పడింది ఉమ్మడి రక్షణకు కాగా, సైనిక బడ్జెట్లను రెట్టింపు చేసి మీ రక్షణ మీరు చూసుకోండని చెప్పారు. యూరప్‌లో అత్యధికం ఉదారవాద ప్రజాస్వామిక దేశాలు కాగా, అందుకు వ్యతిరేకమైన మితవాద పార్టీలను బహిరంగంగా బలపరచారు. గత నవంబర్‌లో ప్రకటించిన జాతీయ భద్రతా వ్యూహ పత్రంలోనైతే, అసలు యూరోపియన్ నాగరికతలే అంతర్థానమయే పరిస్థితి వచ్చిందంటూ అవమానపరచారు. ఇవన్నీ చాలవన్నట్లు, కెనడాను బలప్రయోగంతోనైనా అమెరికాకు 51వ రాష్ట్రంగా (ప్రస్తుత రాష్ట్రాలు 50) మార్చగలమని, గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ తమకు స్వాధీనపరచకుంటే సైన్యాన్ని పంపి 51వ రాష్ట్రం చేసుకోగలమని ప్రకటించి పరస్పర సంబంధాలను మరింత విషమింప జేసారు. అమెరికా యూరప్ సంబంధాలు ఇటువంటి మలుపు తీసుకోవటానికి ఏకైక కారణం ట్రంప్ వ్యవహారశైలి అన్నది కనిపిస్తున్నదే. గమనించదగినదేమంటే, అటువంటి కూటమికి రష్యా, చైనాల నుంచిగాని, ఇతరత్రా బహుళ ధ్రువ ప్రపంచ నినాదాల నుంచి గాని ప్రమాదం ఏర్పడుతున్నదనుకుంటే, తెలివిగా వ్యవహరిస్తూ, తమ కూటమితో మరింత సఖ్యతను పెంపొదిస్తూ, ఆ ప్రమాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి. ఆ మేరకు కొత్త విధానాలను రూపొందించుకోవాలి. కాని, ట్రంప్ ఒక భిన్నమైన వ్యక్తిత్వం కలవాడు అయినందున అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పరిస్థితిని మరింత విషమింపజేసుకుంటున్నారు. స్వయంగా అమెరికాకు, యూరప్‌కు కూడా. ఇది తనకెంత అర్థమవుతున్నదో తెలియటం లేదు గాని, యూరోపియన్ నాయకులకు మాత్రం బాగానే అవుతున్నది. అందుకు ఈ నెల 1923 తేదీలలో జరిగిన దావోస్ సమావేశాలు బాగా అద్దం పట్టాయి. సమావేశాలకు ముందు వారాలలోనే గ్రీన్లాండ్ విషయం తీవ్రరూపం తీసుకుంది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ట్రంప్ అపహరించిన తీరుతో తక్కిన ప్రపంచంతో పాటు నిర్ఘాంతపోయి ఉన్న యూరప్‌లో, ఆయన గ్రీన్లాండ్ గురించి చేస్తుండిన ప్రకటనలు తీవ్ర వ్యతిరేకతలను సృష్టించాయి. అమెరికా అధ్యక్షునికి ఆ విషయం తెలిసి కూడా దావోస్‌కు అదే వైఖరి చూపుతూ వెళ్లారు. పైగా, గ్రీన్లాండ్ సమీపాన అంటార్కిటికా సముద్రంలో రష్యా, చైనా యుద్ధనౌకలు సంచరిస్తున్నాయని, ఆ ప్రాంతంలో వారు సముద్ర గర్భం నుంచి విలువైన ఖనిజ సంపదను మైనింగ్ చేస్తున్నారని ఆరోపించటం మొదలుపెట్టారు. కాని అవేవీ నిజం కాదని గ్రీన్లాండ్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్ కొట్టివేసాయి. ఇదంతా దావోస్ సమావేశాలలో ముదిరి పాకానబడి కనిపించింది. అది ఏ విధంగానో అర్థం కావాలంటే ట్రంప్ కన్న ఎక్కువగా వివిధ యూరోపియన్ నాయకుల ప్రసంగాలను గమనించాలి. ఎందుకంటే, ఈ పరిణామాల వల్ల ఎక్కువ ఆందోళన చెందుతున్నది వారే గనుక. ట్రంప్ తీరును పలు యూరోపియన్ దేశాలు విడివిడిగానే గాక, మొత్తం 27 దేశాల ఉమ్మడి వేదిక అయిన యురోపియన్ యూనియన్ సైతం ఖండించింది. వారిలో అతి తీవ్రంగా విమర్శించింది డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌లతో పాటు కెనడా ప్రధాని మార్క్ కార్నీ కాగా, అమెరికాకు అత్యంత విధేయుడని భావించే బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం అరమరికలు లేకుండా తప్పుపట్టారు. ఒక నాటో దేశమైన డెన్మార్క్పైనే బలప్రయోగం జరిపి వారి ప్రాంతాన్ని గాని, కెనడాను గాని ఆక్రమించగలమనటం వారందరికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దావోస్ కన్న ముందు రోజులలోనే కనిపించిన ఈ స్థితి అక్కడ అందరూ ముఖాముఖిన ఎదురుపడటంతో మరింత తీవ్రంగా మారింది. పైగా అక్కడ ట్రంప్, బలప్రయోగం లేకుండా తమకు ఏదీ లభించదని, తాము ఆ చర్యకు దిగితే తమ నెవరూ ఆపలేరని హెచ్చరించారు. ఒక స్థాయిలో ఇదంతా జరుగుతుండగా మరొక స్థాయిలో ఇంతే గమనార్హమైన పరిణామాలు మొదలయ్యాయి. యూరప్ ఇక ఆర్థికంగా, రక్షణ రీత్యా కూడా తన దారి తాను చూసుకుని స్వతంత్రంగా మారి అమెరికాపై ఆధారపడటం మానుకోవలసి రావచ్చునని సాక్షాత్తూ ఆ యూనియన్ కమిషనర్ ఉర్పులా ప్రకటించగా, అమెరికా నమ్మదగ్గ భాగస్వామికాదని, చైనా ఆధారపడదగినది అని ప్రకటిస్తూ కెనడా ప్రధాని తదితరులు చైనా వెళ్లి ఒప్పందాలు చేసుకోవటం మొదలు పెట్టారు. అమెరికాయూరప్ 80 ఏళ్ల సంబంధాలలో ఇవేవీ సాధారణమైన మార్పులు కావు. - టంకశాల అశోక్ (దూరదృష్టి) (రచయిత సీనియర్ సంపాదకులు)
gunfire |రూ.6లక్షలు ఎత్తుకెళ్లారు
gunfire | రూ.6లక్షలు ఎత్తుకెళ్లారు gunfire | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ :
బుల్లితెర నటులతో రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం
–వినూత్న ప్రచారం చేసిన పోలీసులు విశాలాంధ్ర- అనంతపురం టౌన్: రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా అనంతపురం జిల్లాలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో బుల్లితెర నటులతో కలిసి రోడ్డు భద్రతపై శనివారం విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ సూచనలతో స్థానిక క్లాక్ టవర్ సెంటర్ వద్ద బుల్లితెర నటులు సుస్మిత, ప్రభాకర్ , పవన్ సాయి, అనిల్ , శ్రీరాం, ప్రొడ్యూసర్ నటుడు శివకుమార్ తదితరులు రోడ్డు […] The post బుల్లితెర నటులతో రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం appeared first on Visalaandhra .
AP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా
వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి
-వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్ ధర్మవరం పట్టణంలోని 10వ వార్డులో శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ పెనుజూరు నాగరాజు అధ్యక్షతన చాంద్ బాషా, అమీర్ బాషా, జిలాన్ బాషా, సాదిక్ ఆధ్వర్యంలో వైయస్సార్సీపి పార్టీ సంస్థాగత నిర్మాణంలో బాగంగా పార్టీ కోర్ కమిటీతో పాటు వివిధ అనుబంధ విభాగాలలో నియామకం చేశారు. వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి […] The post వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి appeared first on Visalaandhra .
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
-ఏపీ రైతు సంఘండి మాండ్ విశాలాంధ్ర బ్యూరో–నెల్లూరు : ఫిబ్రవరి 15వ తేదీ నుండి రబి ధాన్యం పంట మార్కెట్లోకి వస్తుందని వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే యూరియా అవసరం ఎక్కువగా ఉంటుందని అందువల్ల అధికారులు యూరియా పంపిణీలు జరుగుతున్న కొన్ని తప్పిదాలను సరిదిద్దాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామకోటయ్య భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రమణయ్య మాట్లాడుతూ జిల్లాలో రబి […] The post ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి appeared first on Visalaandhra .
జీవవైవిధ్యంలో ‘జీబ్రా’ని రక్షించుకోలేమా!
జీవజాతుల్లో ప్రతి జీవికి ఒక ప్రాధాన్యం ఉంటుంది. జీవవైవిధ్య పరిరక్షణలో అన్నిజీవులు తమతమ పాత్రను నిర్వహిస్తాయి. భూగోళంపై 8 మిలియన్లకు పైగా వృక్ష జంతు జీవరాసులు ఉండవచ్చని, వాటిలో దాదాపు 2 మిలియన్ల జీవరాశులను శాస్త్రజ్ఞులు గుర్తించారని తెలుస్తున్నది. జంతుశాస్త్ర జాబితాలో ఉన్న అత్యల్ప సూక్ష్మజీవుల నుంచి అతి పెద్ద బ్లూ వేల్ వరకు అన్ని జంతువులకు ఒక్కో ప్రత్యేకత ఉన్నది. మానవ తప్పిదాలతో ఈ జీవుల మనుగడకు వందల ఏండ్లు నుంచి విఘాతం కలిగినట్లు అయితే వాటి సంఖ్య క్రమంగా తగ్గుతూ చివరకు అంతరించిపోయిన జంతువుల జాబితాలోకి చేరుతాయి. ఇలా ఇప్పటి వరకు అంతరించిపోయిన జీవుల సంఖ్య వేలల్లో ఉండవచ్చని, నేటికీ దాదాపు 905 జీవులు అంతరించిపోవడం జరిగిందని రుజువు చేయబడింది. మరి కొన్ని అరుదైన జీవజాతులు అంతరించడానికి ఎంతో సమయం పట్టదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవజాతులు అంతరిస్తూ పోతే, జీవవైవిధ్యం దెబ్బతిని చివరికి మనిషి మనుగడ కూడా ప్రశ్నార్ధకంగా కావడంతోపాటు, మనిషి జాతి కూడా అంతరించే అవకాశాలు లేకపోలేదు. ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఒక ప్రత్యేక జంతువు జీబ్రా అని పిలుస్తున్నాం. నేటి ఆధునిక మానవుడి అతి తెలివి వల్ల జీబ్రాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు, ఒక రకమైన జీబ్రాలు అంతరించే దుస్థితికి చేరాయని జంతు ప్రేమికులు, శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. రోడ్ల వెంట జీబ్రా క్రాసింగ్స్ ఉండడం మనం చూస్తున్నాం. జీబ్రా జాతులను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రతి ఏటా 31 జనవరి రోజున అంతర్జాతీయ జీబ్రాల దినం పాటించుట జరుగుతున్నది. అంతర్జాతీయ జీబ్రాల దినం -2026 ఇతివృత్తంగా ‘స్ర్టైఫ్స్ దట్ యునైట్ (ఏకం చేసే చారలు) అనబడే అంశాన్ని తీసుకున్నారు. భూగోళంపై ఉన్న విలక్షణ జంతువులుగా జీబ్రాలను గుర్తించారు. నలుపు, తెలుపు చారతో ప్రత్యేకంగా కనిపించే జీబ్రాలు గడ్డిని మేస్తూ అటవీ పర్వత ప్రాంతాల్లో నివసిస్తుంటాయి.కెన్యా, నమీబియా, అంగో లా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో కనిపించే జీబ్రాల సంఖ్య మానవ తప్పిదాలతో క్రమంగా తగ్గుతున్నట్లు గమనించారు. మానవ ప్రమేయంతో జీబ్రాల నివాస ప్రాంతాలను అక్రమించడం, మాంసం/చర్మం కోసం వాటిని వేటాడడం, జంతువుల మధ్య మనుగడ పోటీ పెరగడం, జీబ్రాల సంచరించే దారులను మూసివేయడం, కొన్ని ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాలు నెలకొనడం, అవగాహన లోపం లాంటి కారణాలతో వాటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే ‘ఖ్వగ్గా’ అనబడే జీబ్రా జాతి 19వ శతాబ్దంలోనే అంతరించిపోయింది. నేడు మైదాన ప్రాంత, పర్వత ప్రాంత, గ్రేవీ అనే మూడు రకాల జీబ్రా జాతులు కనిపిస్తున్నాయి. వీటిలో పెద్దగా కనిపించే గ్రేవీ జాతి జీబ్రాలు అంతరించే అంచున ఉన్నట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.నలుపు, తెలుపు చారలు కలిగిన జీబ్రాలు విలక్షణంగా కనిపిస్తూ తమ ప్రత్యేకతలను ప్రదర్శిస్తాయి. ఒక్కో జీబ్రా చారలు ఒక్కో రకంగా మానవ హస్తరేఖల వలే ఉండడం విశేషం. ఈ చారల సహాయంతోనే అడవిల్లో తమ వెంటపడే సింహాలు, హైనాలు లాంటి మాంసాహార జంతువులకు కనబడకుండా తప్పించుకోగలుగుతున్నాయి. జీబ్రాలు గంటకు 65 కి.మీ దూరం ప్రయాణించగలవు. ఇవి అటవీ ప్రాంతాల్లో గుంపులుగా జీవిస్తూ, గడ్డిని తింటూ విత్తనాలను ఇతర ప్రాంతాలకు వెదజల్లుతూ జీవవ్యవస్థ ఆరోగ్యానికి దోహదపడుతున్నాయి.అంతర్జాతీయ జీబ్రాల దినం వేదికగా జీబ్రాల సంరక్షణ చర్యలు, వాటి ప్రాధాన్యం, జీవ వైవిధ్య అవసరాన్ని వివరించడం, జీబ్రా చారలు కలిగిన వస్త్రాలు ధరించడం, వేటల నిషేధ చట్టాలను పటిష్టంగా అమలు పరచడం, విద్యాలయాల్లో పోటీల నిర్వహణ, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం సముచితంగా ఉంటుంది. జీబ్రా జాతుల మనుగడ కొనసాగే విధంగా ప్రపంచ మానవాళి కృషి చేయాలని కోరుకుందాం. - డాక్టర్. బుర్ర మధుసూదన్ రెడ్డి 9949700037
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు..
పసిడి, సిల్వర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. గతవారం రోజులుగా ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. పసిడి ఒక్కరోజే 10 శాతం తగ్గింది. దీంతో ఒక్కరోజులోనే తులం బంగారం ధర దాదాపు 20 వేల రూపాయలు తగ్గింది. ధరలు పడిపోయిన అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.1,60,580కు దిగి రాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల(తులం) గోల్డ్ ధర రూ.1,47,200కు చేరుకుంది. ఇక, వెండి ధర ఏకంగా లక్ష రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 3,50,000కు పడిపోయింది.
Photos : Anaganaga oka Raju Blockbuster Celebrations
The post Photos : Anaganaga oka Raju Blockbuster Celebrations appeared first on Telugu360 .
Bank of India |రుణాలు రీ షెడ్యూల్ చేసుకోవాలి..
Bank of India | రుణాలు రీ షెడ్యూల్ చేసుకోవాలి.. Bank of
గద్దర్ ఒక సామాజిక ప్రళయం, ఆయన ఆట, పాట, మాట సమాజ చైతన్యంలో మరో ప్రళయం. సమసమాజ నిర్మాణం కోసం అణగారిన వర్గాలను వివక్ష, అసమానతుల నుండి ఆత్మగౌరవ కోసం నిరంతరం పాటుపడిన మహానుభావుడు ప్రజాయుద్ధనౌక ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. చిన్ననాటి నుండి గ్రామీణ ప్రాంతంలోని యాస భాషతో బుర్రకథలు, కథలు, పాటలు పద్యాలతో పల్లె జనాన్ని మెప్పించి వారి అభిమానం సంపాదించిన గద్దర్ అలియాస్ గుమ్మడి విట్టల్ రావు ప్రైమరీ స్థాయి నుండి ఎన్ని అష్టకష్టాలు ఉన్నా చదువులతోపాటు తన పాటలను కూడా మోసుకోని వచ్చిన గద్దర్ ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌లో చేరినప్పటి నుండి అప్పుడే ప్రారంభమైన నక్సల్బరి ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యాడు. వీటితోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలో పేదల ఇండ్ల కోసం జరుగుతున్న భూ పోరాటంలో హైకోర్టు న్యాయవాది జి ఎం అంజయ్య లాంటి వారితో పరిచయం ఏర్పడి బస్తీల్లో తిరిగి ప్రజాచైతన్యం చేయడానికి కృషి చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్ళారు అప్పటినుండి ఆయన తన ఇంజినీరింగ్ చదువును మానివేసి ప్రజా ఉద్యమాల పైన మొగ్గు చూపారు. 1972లో జరిగిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో పాల్గొన్నారు. 1979లో వచ్చిన మాభూమి సినిమాలో బండెనుక బండి గట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాం సర్కరోడా గోల్కొండ కోట కింద గోరి కడతం కొడుకో అనే పాట ఒక సంచలనం, చైతన్యం. ఒకవైపు సికింద్రాబాద్ మారేడుపల్లిలోని కెనరా బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూనే ప్రజా ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు. కళాశాల సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యంపైన పాటలు రాసి గ్రామగ్రామాన బుర్రకథలు నాటకాలు వేసి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పేవారు. ఈ సందర్భంగా ఆయన గమనించిన కుల వివక్ష, అంటరానితనాన్ని గమనించి తిరుగుబాటు చేయాలని అటువైపు అడుగులు వేసి పాటలు రాశారు. భారత దేశం భాగ్యసీమరా! పాడిపంటలకు కుదవలేదు! ఎప్పుడు ఎండని జీవనదులు ఉండి సకల సంపదలు కలిగిన దేశంలో కరువెట్లుంది నాయన, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అనే పాట. చాలా ప్రాచుర్యం పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపాటు భారతదేశంతో ప్రపంచ దేశాల దృష్టిని మరలించిన గద్దర్ ప్రపంచ వాగ్గేయకారుడయ్యారు. 1990లో వరంగల్‌లో నిర్వహించిన రైతు కూలి మహాసభ ఒక చరిత్ర భారతదేశవ్యాప్తంగా ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌వార్ పార్టీ ప్రాబల్యం అధికంగా ఉన్న సమయంలో రైతు కూలీల రైతుల సమస్యల పైన వరంగల్ జిల్లా ఏనుమాముల వ్యవసాయం మార్కెట్ 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ చరిత్రాత్మకం వామపక్ష నక్సలైట్ ఉద్యమాల్లో భారీ సభగా చరిత్రకారులు చెబుతున్నారు. గుమ్మడి విట్టల్ రావు అలియాస్ గద్దర్ స్వగ్రామం మెదక్ జిల్లా, తూప్రాన్ పట్టణం. తండ్రి శేషయ్య తల్లి లచ్చుమమ్మలకుకు 31 జనవరి 1949న జన్మించారు. ఇద్దరు సోదరులు ముగ్గురు సోదరిమణులున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నిర్బంధం జరుగుతున్న క్రమంలో ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు చర్చలు ప్రారంభమైనాయి. 1997 జనవరి ప్రాంతంలో భువనగిరిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకో ఎన్కౌంటర్లు పెరిగిపోవడంతో ప్రజల నుండి పూర్తిగా వ్యతిరేకత ఇలాంటి సమయంలో పౌర సమాజం నుండి ప్రభుత్వానికి డిమాండ్ వచ్చింది పీపుల్స్ వార్, జనశక్తి వామపక్ష గ్రూపులతో చర్చలు జరిపి శాంతి నెలకొల్పాలని కమిటీ ఏర్పడింది. ప్రతినిధులుగా ఎస్ఆర్ శంకరన్, హైకోర్టు ఎడ్యుకేట్ బొజ్జ తారకం, ఆచార్య హరగోపాల్, వరవరరావు, గద్దర్లు ఉన్నారు.ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో వామపక్ష భావాలు కలిగిన వారందరూ గద్దర్ సారథ్యంలో ప్రజాఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. కానీ ప్రజాఫ్రంట్ ఎన్నికల్లో పాల్గొనమని చెప్పడంతో మద్దతుదారులంతా వెనక్కి వెళ్లారు. రాజ్యాంగ రక్షణ కోసమని గద్దర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను భార్య విమల, కుమారుడు జీవిసూర్య కేంద్రతో కలిసి ఢిల్లీలో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గద్దర్ తో చర్చలు జరిపిన పిదప ఇంద్రవెల్లి నుండి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆనాటి సిఎల్పి నాయకుడు నేటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు.ఈ మేరకు గద్దర్ ఆదిలాబాద్‌లో జరిగిన ప్రారంభ సభలో ఆయన పాల్గొన్నారు. పాదయాత్ర ముగింపు సమావేశానికి కూడా రెండు రోజుల ముందుగానే ఆయన ఖమ్మం చేరుకొని ముగింపు సమావేశం హాజరయ్యారు. కానీ అప్పటికి ఆయన అనారోగ్యానికి గురికావడంతో కేవలం రాహుల్ గాంధీని కలిసి అభినందించి స్టేజి నుంచి దిగిపోయారు. అప్పటికి అనారోగ్యానికి గురైన ఆయన ఖమ్మం నుండి వచ్చి హైదరాబాదులో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఒకవైపు పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతునిస్తూనే తనకు కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలని గద్దర్ ప్రజా పార్టీని రిజిస్టర్ చేయించారు. గద్దర్‌కు సినిమాలతో విడదీయరాని అనుబంధం ఉంది. మాభూమి సినిమాలో బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే వస్తావురో నైజాం సర్కరోడా! పాట 1980 దశకంలో సామాజిక విప్లవం ఆలోచింపజేసింది. ఆర్ నారాయణమూర్తి తీసిన ఒరేరిక్షా సినిమాలో రాసిన ‘మల్లెచెట్టుకు పందిరి వోలె’, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ అనే పాట మరో సంచలనం. ఇలా సినిమా రంగం ప్రవేశం చేసిన గద్దర్ నారాయణమూర్తి దర్శకుడు శంకర్, మోహన్ బాబు సినిమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సూచనలు, సలహాలు ఇస్తూనే అనేక పాటలు రాశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న క్రమంలో జై బోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా! పోరు తెలంగాణ! అంటూ గర్జించారు. చివరన చిరంజీవితో గాడ్ ఫాదర్ లో నటించారు. ఇంకా విడుదల కానీ ఇండియా ఫైల్స్‌లో! బానిస లారా లేండి రా! బానిస బతుకులు వద్దురా!! అంటూ మరో చైతన్య గీతం నటించి పాడారు. అసమానతలు నెలకొన్న ప్రతిసారీ తన పాటలు చైతన్యంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజాన్ని జాగృతం చేశారు. ఒరే రిక్షా సినిమాకు, జై బోలో తెలంగాణ సినిమాకు రెండు పర్యాయాలు నంది అవార్డులు వచ్చిన ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఖమ్మంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సమావేశం కు హాజరైన నాటి నుండి అనారోగ్యానికి గురైన 20 జులై 2023న అపోలో స్పెక్ట్రమ్ ఆస్పత్రిలో చేరారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనకు గుండెకు సంబంధించిన ఆపరేషన్ ఆగస్టు 3 న నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత ఆరోగ్య సమస్యలు రావడంతో 6 ఆగస్టు తుది శ్వాస వదిలారు. ఏ పోలీసు తూటాలకు ప్రజల కోసం ఎదురొడ్డి నిలబడ్డ గద్దర్‌కు అదే పోలీసులు ఆఖరున సెల్యూట్ చేసి గౌరవించారు. ఆయనే ప్రజాయుద్ధ నౌక గద్దర్. - అస శ్రీరాములు 94400 37196
Rajamouli’s Biggest Challenge for Varanasi
SS Rajamouli’s next big film Varanasi is announced for April 7th, 2027 release. The film features Mahesh Babu, Priyanka Chopra and Prithviraj Sukumaran playing the lead roles. Rajamouli is in plans to complete the entire filming before Dasara this year. He takes a long time for the post-production work. Varanasi got one of the best […] The post Rajamouli’s Biggest Challenge for Varanasi appeared first on Telugu360 .
ASR |ప్లాస్టిక్ ప్లేట్ లలో భోజనం చేస్తే..
ASR | ప్లాస్టిక్ ప్లేట్ లలో భోజనం చేస్తే.. ASR, నర్సంపేట, క్రైం,
మహా డిప్యూటీ సిఎంగా అజిత్ పవర్ భార్య?
ముంబై: విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణంతో మహారాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. అజిత్ మరణంతో రాష్ట్ర డిప్యూటీ సిఎం పోస్ట్ ఖాలీ ఏర్పడింది. అయితే, ఈ పదవిని అజిత్ భార్య సునేత్ర పవార్ కు ఇవ్వనున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం సునేత్ర పవార్.. రాష్ట్ర డిప్యూటీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమానికి ముందు, ఎన్‌సిపి శాసనసభ పక్ష సమావేశం జరగాల్సి ఉంది. అదే సమయంలో ఎన్‌సిపిలోని రెండు వర్గాల పునరేకీకరణపై చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. కాగా, అజిత్ పవార్ సతీమణి సునేత్ర ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె డిప్యూటీ సిఎం పదవిని చేపడితే.. రాజ్యసభ స్థానానికి కుమారుడు పార్థ్ పవార్‌ను పంపించే అవకాశం ఉన్నట్లు ఎన్‌సిపి వర్గాల చెబుతున్నాయి.
School Bus |పసిప్రాణాలతో చెలగాటం..
School Bus | పసిప్రాణాలతో చెలగాటం.. School Bus, సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ
India vs Newzealand : నేడు భారత్ - న్యూజిలాండ్ చివరి టీ20 మ్యాచ్
భారత్ - న్యూజిలాండ్ టీ 20 లో ఐదో మ్యాచ్ నేడు తిరువనంతపురంలో జరగనుంది
Medaram : నేటితో మేడారం మహా జాతర ముగింపు
నేటితో మేడారం మహా జాతర ముగియనుంది
తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి మేడారం మహాజాతరకు వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజుల జాతర అనంతరం తిరుగుప్రయాణం కోసం భక్తులు అవస్తలు పడుతున్నారు. జాతరకు భక్తులను చేర్చిన రాష్ట్ర ఆర్టీసి.. తిరిగి తరలింపులో విఫలమైంది. మేడరంలో బస్సుల కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఎదురుచూసినా.. ఆర్టీసి బస్సులు అందుబాటులో లేకుండా పోయాయి. హైదరాబాద్, హనుమకొండ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో.. వేలాదిమంది ప్రయాణికులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. బస్సులు లేకపోవడంతో భక్తుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి బస్సులు లేక చంటి బిడ్డ తల్లులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులపై మండిపడుతున్నారు. ఇంత ఇబ్బంది పడుతున్నా.. పట్టించుకోకుండా అధికారులు అందుబాటులో లేకుండా పోయారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వాహనాలతో మేడారం రోడ్లు జామ్ అయిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడటంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులకు, అధికారులకు మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
Revanth Reddy : మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ సమీక్ష
మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష చేశారు
Municipal Elections |తాజా మాజీ కౌన్సిరల్లు దూరం..?
Municipal Elections | తాజా మాజీ కౌన్సిరల్లు దూరం..? Municipal Elections, మోత్కూర్,
‘శ్రీనివాస మంగాపురం’లో మంగగా...
‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీనివా స మంగాపురం’ కు దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్ బాబుల వారసత్వాన్ని కొనసాగిస్తూ, జయ కృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ కూడా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. సక్సెస్ ఫుల్ నిర్మాత అశ్విని దత్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తుండగా, ‘చందమామ కథలు’ బ్యానర్ పై నిర్మాత పి కిరణ్ దీనిని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం నుంచి రాషా థడానీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమెను ‘మంగ’ పాత్రలో పరిచయం చేశారు. సాంప్రదాయ దుస్తులలో రాషా అద్భుతంగా కనిపిస్తోంది.
Weather Report : దంచికొట్టనున్న ఎండలు.. కాచుకోమంటున్న సూరీడు
ఎండలు దంచి కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పగటి వేళలో ఉష్ణోగ్రతలు పెరిగాయి
ఆకట్టుకుంటున్న వింగ్స్ ఇండియా షో
హైదరాబాద్ లో జరుగుతున్న ఆకట్టుకుంటున్న వింగ్స్ ఇండియా షో అలరిస్తుంది
పెద్దగా వినోదాన్ని అందించలేకపోయిన చిత్రం
‘పెళ్ళిచూపులు’తో దర్శకుడిగా మెప్పించిన తరుణ్ భాస్కర్.. ఆ తర్వాత నటుడిగానూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పుడతను హీరోగా చేసిన సినిమా.. ‘ఓం శాంతి శాంతి శాంతిః’. హీరోయిన్ ఈషా రెబ్బాతో కలిసి అతను మలయాళ హిట్ ’జయ జయ జయ జయహే’ చిత్రానికి రీమేక్‌గా సజీవ్ దర్శకత్వంలో ఈ సినిమా చేశాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందు కు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. కథ: ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) గోదావరి ప్రాంతంలో చేపల చెరువులు నడిపే కుర్రాడు. అతడికి ముక్కుమీద కోపం. అలాంటి వ్యక్తితో జీవితం మీద ఎన్నో ఆశలు ఉన్న ప్రశాంతికి (ఈషా రెబ్బా) పెళ్లవుతుంది. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్నా ఓంకార్.. తర్వాత తన నిజ స్వరూపం చూపిస్తాడు. చిన్న చిన్న విషయాలకు ప్రశాంతిని కొట్టడం మొదలుపెడతాడు. పైగా ఆమె కోరుకున్నట్లుగా చదువుకోనివ్వడు. కొంత కాలం మౌనంగా ఈ హింసను.. బాధను భరించిన ప్రశాంతి.. తర్వాత తిరగబడుతుంది. ఈ క్రమంలో ఆమె ఏం చేసింది.. ప్రశాంతిపై ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకున్న ఓంకార్ ఏం చేశాడు.. చివరికి వీరి కాపురం ఏ తీరానికి చేరింది అన్నది మిగతా కథ. కథనం, విశ్లేషణ: ఈ రీమేక్ చిత్రం కథలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా గోదావరి నేపథ్యాన్ని తీసుకుని దానికి అనుగుణంగా స్వల్పమైన మార్పులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఒరిజినల్లో ఉన్న భావోద్వేగాలు, ఆప్యాయతలు ఈ చిత్రంలో లోపించాయి. ఈ సినిమాలోని వినోదం ఒక మోస్తారు స్థాయిని మించలేకపోయింది. కథ లో చేసిన మార్పులు.. కొత్తగా జోడించిన సన్నివేశాలు అనుకున్నంతగా కిక్ ఇవ్వలేకపోయాయి. ’ఓం శాంతి శాంతి శాంతి’: కాలక్షేపం సినిమాలా అనిపిస్తుందే తప్ప బలమైన ముద్ర వేయలేకపోయింది. మాతృకతో పోలికల సంగతి పక్క న పెట్టి.. మామూలుగా చూస్తే ’ఓం శాంతి శాంతి శాంతి’లో స్టోరీ చాలా సింపుల్. పురుషాధిక్యతకు మారు పేరైన అబ్బా యి.. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయికి పెళ్లి జరిగే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. గోదావరి ప్రాంత మనుషుల వ్యవహారం.. అక్కడి యాస.. హీరో చేసే చేపల వ్యాపారం నేపథ్యంలో ప్రథమార్ధంలో భలే సరదాగా డైలాగులు రాసుకున్నారు. వాటి ద్వారా వినోదం పండింది. ఇక హీరోయిన్ను హీరో కొట్టడం, ఆ తర్వాత హీరోయిన్ చేసే కౌంటర్ ఎటాక్ సీన్లు కూడా బాగున్నాయి. కానీ ఆ తర్వాతే కథనం అనుకున్నంత ఊపుతో సాగలేదు. కథలో చెప్పుకోదగ్గ మలుపులు లేకపోవడం.. మరీ నెమ్మదిగా సాగే సీన్లు ద్వితీయార్ధాన్ని బోరుగా మార్చేశాయి. ముగింపు సన్నివేశాలు కూడా ఓ మోస్తరుగా అనిపిస్తాయంతే. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా వినోదాన్ని అందించలేకపోయింది.
Police |రోడ్డు ప్రమాదాల నివారణ కోసం..
Police | రోడ్డు ప్రమాదాల నివారణ కోసం.. Police, మచిలీపట్నం, ఆంధ్రప్రభ :

27 C