SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

17    C
... ...View News by News Source

జాతరే జాతర..

మనతెలంగాణ/ వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రతి రెండేళ్లకోసారి నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే మేడారం మహాజాతర సంబురానికి సర్వం సిద్ధమైంది. మహాజాతర కోసం మేడారం ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటినుంచి నాలుగు రోజులపాటు మేడారంలో మహాజాతర జరగనున్నది. జాతర తొలిఘట్టంలో భాగంగా బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తారు. ఇప్పటికే కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు, ఏటూరునాగరం మండలం కొం డాయి నుంచి బయలుదేరిన గోవిందరాజులు కూడా బు ధవారమే చేరుకుంటారు. ఇక్కడినుంచి మొదలయ్యే మహాజాతరలో ఈనెల 29న రెండవరోజైన గురువారం సాయంత్రం మహాఘట్టానికి తెర లేవనున్నది. ఈనెల 30వ తేదీన తల్లులు ఇద్దరు కూడా గద్దెలపై కొలువై ఉండడంతో భక్తజనం తమ మొక్కులను చెల్లించుకుంటారు. నాలుగవ రోజైన శనివారం సాయంత్రం దేవతలు వారివారి ప్రాంతాలకు తిరుగుముఖం పట్టడంతో జాతర ముగుస్తుంది.కొత్తగా...సరికొత్తగా...మంత్రి సీతక్క చొర వ..సీఎం నిధులుఈసారి మహాజాతర కొత్తగా, సరికొత్తగా భక్తులకు కనువిందు చేస్తున్నది. శాశ్వత నిర్మాణాల పేరిట ఆధునీకరించడంతో మేడారం ధగధగలాడుతున్నది. ఈసారి మేడారం జాతర కోసం మంత్రి సీతక్క చొరవతో సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు. సుమారు 150 కోట్లతో పనులు చేపట్టడంతో మేడారం కొత్త శోభను సంతరించుకున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా మేడారంలోనే కేబినెట్ సమావేశం నిర్వహించడం, కొత్తగా పనులు చేపట్టడంతో జాతరపై భక్తుల్లో ఆసక్తి, అంచనాలు పెరిగిపోయాయి. 1944 నుంచి ప్రభుత్వం జాతరను నిర్వహిస్తున్నా, 1967లో దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకున్నది. 1998లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. అప్పటినుంచి భక్తులు భారీగా పెరగడంతో జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ పెరిగింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 150 కోట్లు కేటాయించి జాతరను ఆధునీకరించడంతో మైలురాయిగా నిలవనున్నది. మంత్రి సీతక్క జాతరలోనే తిష్ట వేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. మహాజాతరకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాతరను 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించింది. వివిధ శాఖలకు చెందిన 42 వేల 27 మంది ఉద్యోగులను జాతర విధులకు నియమించింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఎఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.జాతరలో తప్పిపోతున్న భక్తులను సులువుగా గుర్తించేందుకు వీలుగా ఈసారి జియోట్యాగ్ బెస్ట్ మిస్సింగ్ పర్సన్ ట్రాకింగ్ సిస్టమ్ ను తీసుకువచ్చారు. అలాగే పాత నేరస్థులను గుర్తించేందుకు ఆసుపత్రి ఏరియా, పార్కింగ్ ప్రాంతాల్లో ఫేస్ రికగ్నైజింగ్ కోసం టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అనుమానితులను గుర్తించేందుకు వీలుగా రియల్ టైమ్ అలెర్ట్ సిస్టమ్ సిద్ధం చేశారు. ఇదేకాకుండా జాతరలో 450 సీసీ కెమెరాలు, 20 డిస్ ప్లే ప్యానెల్స్, క్లౌడ్ కౌంటింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతరకు వెళ్ళే దారిలో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఔట్ పోస్ట్ ఏర్పాటుచేశారు. వీటితో పాటుగా మొబైల్ పెట్రోలింగ్ టీమ్ లు, మఫ్టీ టీమ్ లు ఉన్నాయి. జాతరలో విధుల నిర్వహణకు 13వేల మందిని కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్పీ, డీసీపీ, ఎసిపిలకు కూడా డ్యూటీలు వేశారు.ఆర్టీసీ ప్రాంగణం దాకా వచ్చి వెళ్లలేని భక్తుల కోసం ఇంటికే బస్సు పంపే ఏర్పాట్లు చేసింది. ఎక్కడైనా 30 మంది భక్తులు ఉన్నట్లయితే అక్కడికి ఆర్టీసీ బస్సును పంపించనున్నారు. మేడారం ప్రసాదాన్ని భక్తులకు ఇంటికే అందించేందుకు వీలుగా కార్గో సర్వీస్ అందిస్తున్నది. ఇదే కాకుండా మహా జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులను తరలించేందుకు వీలుగా 4 వేల బస్సులను ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి 20 లక్షల మందికి జాతరకు తరలించేందుకు లక్ష్యం పెట్టుకుంది. 50 పడకల ఆసుపత్రి...30 హెల్త్ క్యాంపులు జాతరలో వైద్య సేవల కోసం 50 పడకల ఆసుపత్రి..30 హెల్త్ క్యాంపులు ఏర్పాటుచేశారు. వైద్య సేవలు అందించేందుకు 5192 మంది మెడికల్, పారా మెడికల్ సిబ్బందిని నియమించారు. పెద్దఎత్తున వచ్చే భక్తజనం తర్వాత జాతర పరిసరాల్లో వ్యాధులు ప్రబలకుండా పది మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తొలిసారి వాట్సాప్ సేవలు జాతరలో తొలిసారిగా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన 76589 12300 నెంబర్ కు మెసేజ్ పంపితే రూట్ మ్యాప్, ట్రాపిక్, వసతులు, దర్శనం చేసుకునే వివరాలు లభించనున్నాయి. నెట్ వర్క్ ఇబ్బందులు తలెత్తకుండా 27 శాశ్వత టవర్లు, 33 తాత్కాలిక టవర్లు, 450 హై ప్రీక్వెన్స్ టవర్ల ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా కోసం 196 ట్రాన్స్ ఫార్మర్స్, 28 డీజిల్ జనరేటర్లను ఏర్పాటుచేశారు. జోరుగా ముందస్తు మొక్కలుదాదాపు రెండు నెలల నుంచే మేడారానికి భక్తుల తాకిడి ఎదురైంది. ప్రతి ఆదివారం మేడారంలో 2 నుంచి 5 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని 24 గంటల పాటు దర్శనాలకు అనుమతించారు. ముందస్తు మొక్కల్లో భాగంగా ఇప్పటికే 50 లక్షలకు పైగా భక్తులు మొక్కలు చెల్లించుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మన తెలంగాణ 28 Jan 2026 6:20 am

వలసవాద విధానంపై నిరసనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ పని చేసినా అతిగానే ఉంటుంది. లేడికి లేచిందే పరుగన్నట్లు ఆలోచన రావడమే తరువాయి వెనకాముందూ ఆలోచించకుండా దానిని అమలు చేసేందుకు ఆయన చేపట్టే చర్యలతో తల బొప్పి కట్టిన సంఘటనలు ఈ ఏడాది కాలంలో అనేకం. అలాంటి వాటిలో అక్రమ వలసదారులను గుర్తించి, వారిని స్వదేశాలకు తిప్పి పంపించే ప్రక్రియ ఒకటి. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగానే రెండోసారి అధికారంలోకి వచ్చిన వెనుపెంటనే ఆయన అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు. వారి చేతులకు బేడీలు వేసి, సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న చిత్రాలను పత్రికలు ప్రచురించడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు భగ్గుమన్నారు. దీంతో నాలుక కరచుకున్న ట్రంప్ మహాశయుడు స్వచ్ఛందంగా తమ దేశం వీడి వెళ్లిపోయేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. అది అంతగా సత్ఫలితాలనివ్వని కారణంగా, తాజాగా మరిన్ని కఠిన చర్యలకు తెర తీశారు. అక్రమంగా తమ దేశంలో తిష్ఠ వేసుకుని కూర్చున్నవారిని గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించారు. పోలీసుల సహాయంతో ఇల్లిల్లూ తనిఖీ చేసి, అక్రమ వలసదారుల్ని పట్టి బంధించి, స్వదేశాలకు తిప్పి పంపడం ఈ ఏజెంట్ల పని. తాజాగా మిన్నెపొలిస్ నగరంలో ఇమిగ్రేషన్ సోదాలు జరుపుతుండగా అలెక్స్ ప్రెట్టీ అనే 37 ఏళ్ల వ్యక్తి తుపాకీ చూపి బెదిరించాడనే నెపంతో అతనిపై ఎనిమిదిమంది ఏజెంట్లు దాడి చేసి, నేలకు అదిమిపెట్టి, అతనినుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా కాల్పులు జరిపి అతని ప్రాణాలు తీశారు. గత పది రోజుల్లో ఇది రెండో సంఘటన. విచిత్రమేమిటంటే, పౌరులు లైసెన్సుడు తుపాకీతో బహిరంగంగా తిరిగేందుకు స్థానిక చట్టాలు అనుమతిస్తున్నాయి. పైపెచ్చు హతుడికి ఎలాంటి నేరచరిత్రా లేకపోవడం గమనార్హం. ఉత్తిపుణ్యాన ఒక అమాయకుడి ఉసురు తీసిన పోలీసులపై స్థానికులు మండిపడుతున్నారు. తమ నగరంనుంచి ఇమిగ్రేషన్ ఏజెంట్లు వెనక్కు వెళ్లిపోవాలంటూ వారు ఆందోళనలు ప్రారంభించారు. ట్రంప్ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అమెరికాకు అక్రమ వలసలు ఆగడం లేదన్నది వాస్తవం. ఇప్పటికీ అగ్రరాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించేవారి సంఖ్య లక్షల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది ఇలా అమెరికాకు దొడ్డిదారిన వెళ్లివారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలని యుఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. వీరిలో భారతీయులూ ఉన్నారు. గత ఏడాది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ దాదాపు 24 వేల మంది భారతీయులు అరెస్టయ్యారు. ఒక అంచనా ప్రకారం ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడు సరిహద్దుల వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అమెరికాకు అక్రమ మార్గాల్లో వలస వస్తున్న వారిలో మెక్సికో, ఎల్ సాల్వడార్ లనుంచి చొరబడేవారి సంఖ్యే ఎక్కువ. అగ్రరాజ్యంలో సగటున ఇంటికొకరు చొప్పున ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా నివాసం ఉంటున్నట్లు అంచనా. అమెరికా దేశ జనాభాలో అక్రమ వలసదారుల సంఖ్య ఐదు శాతమని అధికారిక గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. అరిజోనా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల సంఖ్య మరీ ఎక్కువ. ఏ దేశానికైనా అక్రమ వలసదారులు గుదిబండలా మారతారనడంలో సందేహం లేదు. భారత్ కూడా బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాలనుంచి ఇలాంటి బెడదను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దేశపౌరుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతీయడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థకు కూడా చేటు తెచ్చే అక్రమ వలసదారుల్ని గుర్తించి, వెనక్కు పంపివేయడంలో ఎవరికీ అభ్యంతరం ఉండనక్కరలేదు. అయితే, అందుకు అనుసరించే విధానాలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా లేకపోతే ఏ జరుగుతుందో చెప్పేందుకు తాజాగా మిన్నెపొలిస్‌లో జరిగిన సంఘటనే ఉదాహరణ. అక్రమ వలసదారులను వెనక్కు పంపాలంటూ ఎలుగెత్తిన ప్రజానీకమే, ప్రభుత్వం అనుసరిస్తున్న దమననీతిని ఖండిస్తూ ఇప్పుడు ఆందోళనలకు దిగుతోంది. ట్రంప్ నిర్ణయాలను ఆమోదించేవారి సంఖ్య ఆ దేశంలో క్రమేణా తగ్గుతూ వస్తోంది. అక్రమ వలసదారులపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించేవారి సంఖ్య 53 శాతంగా ఉండటం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో దూకుడుగా ముందుకు వెళ్తున్న ట్రంప్, తన వలసవాద విధానాన్ని మరింత పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా రూపొందించుకోవలసిన సమయమిది. లేనిపక్షంలో ఇంటాబయటా మరింత అభాసుపాలు కాక తప్పదు.

మన తెలంగాణ 28 Jan 2026 6:10 am

అసమానతల లోకంలో సామాన్యుడి వెతలు

ఈ మధ్యనే స్విట్జర్లాండ్ దావోస్‌లో 55 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అధ్యక్షులు, ప్రధానులు, మంత్రులు, ప్రతినిధులు, అధికారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే 24 దేశాలకు చెందిన 400 మంది ప్రముఖ కుబేరులు (సూపర్ రిచ్) ‘గెలవాల్సిన సమయం మన భవిష్యత్తును తిరిగి పొందాలి. దావోస్‌లోని నాయకులారా- అత్యంత సంపన్నులపై అధిక పన్నులు విధించండి’ (టైం టు విన్- వి మస్ట్ విన్ అవర్ ఫ్యూచర్ - లీడర్స్ ఎట్ దావోస్- టాక్స్ ద సూపర్ రిచ్) అనే శీర్షికతో ప్రపంచ ఆర్థిక వేదికపై ఉన్న నాయకులకు లేఖ రాశారు. ఈ లేఖపై అబి గేల్ డిస్నీ (వాల్ట్ డిస్నీ మనవరాలు), హాలీవుడ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో నటించిన మార్క్ రఫాలో (బ్రూస్ బ్యానర్/హల్క్ పాత్రధారి) వంటి మహామహులు సంతకాలు చేశారు. వీరిని మానవతావాద కోటీశ్వరులు/ దేశభక్తి కలిగిన కోటీశ్వరులు (పేట్రియాటిక్ మిలియనీర్స్) అంటారు. అమెరికాలో సైతం దేశభక్తి కలిగిన అత్యంత కోటీశ్వరులు వీరిలాగే తమపై అధిక పన్నులు వేయాలని గత కొంతకాలంగా కోరుకుంటున్నారు. నిజానికి మాతృదేశంలో వివిధ రకాల వనరులు ఉపయోగించుకొని సంపద పోగేసిన తరువాత పన్నుల రూపంలో గాని, ప్రభుత్వ పరంగా గాని కాస్తంత ఇబ్బంది కలిగిన పరాయి దేశాలకు పారిపోతున్నారు. భారతదేశం లో గత పది సంవత్సరాల (2014- 2024) నుండి ఇంచుమించు 23,000 మందికి పైగా సుసంపన్నలు (హై నెట్ వర్త్ ఇండివిడియల్స్) పన్ను సడలింపుల కోసం, పెట్టుబడి అవకాశాల కోసం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం సంపదతో సహా ఇతర అనుకూల దేశాలకు వెళ్లిపోయారు. 3500 మంది సుసంపన్నులు ఒక్క 2025 సంవత్సరంలో మన దేశాన్ని వదిలి వెళ్లారు. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), సింగపూర్, మాల్డా, స్పెయిన్, పోర్చుగల్, అమెరికా, ఇటలీ, సైప్రస్ లాంటి దేశాలకు వెళ్తున్నారు. 2019- 2024 వరకు సుమారు 10 లక్షలకు పైగా ప్రజలు మన దేశ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలలో స్థిరపడ్డారు. ఉదాహరణకు సుసంపన్న వినోద్ అదానీ సైప్రస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. సుసంపన్నుల వలసల పరంగా భారతదేశం అగ్రస్థానంలో ఉన్న దేశాల సరసన ఉన్నట్లు ‘హెన్లి ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్’ నివేదిక తెలియజేస్తున్నది. అమెరికాలో సైతం కొందరు సుసంపన్నులు తమపై అధిక టాక్స్ విధించాలని కోరుతున్నారు, ఆ అమెరికా సుసంపన్నుల స్ఫూర్తితో యునైటెడ్ కింగ్డమ్, కెనడా సుసంపన్నులు కూడా ‘పేట్రియాటిక్ మిలియనీర్స్’ పేరిట సంస్థను ఏర్పాటు చేసుకొని నిధులు సేకరించి ఇదే తరహలో పనిచేసే ‘మిలియన్ ఇయర్స్ ఫర్ హ్యుమానిటీ’, పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే ‘ఆక్స్‌ఫామ్‘ అనే సంస్థతో కలిసి తమ వంతు సహాయం చేస్తున్నారు. దావోస్ సుసంపన్నుల లేఖ సారాంశం ఏంటంటే ‘సాంకేతికంగా ప్రపంచ ప్రజలమైన మనమెంత అభివృద్ధి చెంది అనుసంధానమై ఉన్నప్పటికీ ఆర్థిక అసమానతల కారణంగా గతంలో ఎన్నడు లేనంతగా విడిపోయి ఉన్నాం’, ప్రపంచవ్యాప్తంగా కేవలం 1% సంపన్న వర్గాల చేతుల్లో ఉన్న సంపద, 95% ప్రజల చేతిలో ఉండాల్సిన సంపదకంటే ఎక్కువ ఉన్నది. సుసంపన్న కుబేరులకు పేదలకు మధ్య ఆర్థిక అంతరాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి, అభివృద్ధితోపాటు పర్యావరణ విధ్వంసం కూడా శరవేగంగా జరుగుతున్నది, పత్రికా స్వేచ్ఛను హరించి, ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేసే/ నిలబెట్టే/ కూల్చే స్థాయిలో గుప్పెడు మంది అపర కుబేరులు ఉన్నారు. ప్రజాస్వామ్యాలు ప్రమాదపుటంచుల్లో ఉన్నాయని ఇలాంటి విపరీత ధోరణులకు మాలాంటి సుసంపన్నులే కారణమని తెలిపారు. మంచి భవిష్యత్తు, మంచి సమాజాలు, మంచి ప్రజాస్వామ్యాలు, మంచి పర్యావరణం తిరిగి రావాలంటే 2026లో మేము సూచిస్తున్న పరిష్కారం ఒక్కటే అత్యంత సంపన్నులపై అత్యధిక పన్నులు వేయడం అన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారిని పేదలుగా నిర్ధారించింది. ఐక్యరాజ్యసమితి 2024 నివేదిక ప్రకారం 700 కోట్ల ప్రపంచ జనాభాకు గాను సుమారు 110 కోట్ల మంది తీవ్రమైన బహుముఖ పేదరికంలో ఉన్నారు. ఇందులో రేపటి ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించగలిగే యువత 50% పైగా 18 సంవత్సరాల లోపు వారు ఉన్నారు. ప్రపంచ పేదలలో 83% మంది ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి దక్షిణ ప్రాంతం, దక్షిణాసియా దేశాలలో ఉన్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో పేదలు ఎక్కువ ఉన్నారు. పేదల పరంగా చూసినప్పుడు సుమారు 23.4 కోట్లమంది పేదలతో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నది. 1991లో ప్రముఖ అమెరికా పత్రిక కథనం ప్రకారం దేశంలో కేవలం ఒకే ఒక్క బిలియనీర్ ఉండేవాడు. 1991 తరువాత నాటి ప్రధాని పివి నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల కావచ్చు లేదా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్‌పిజి) వల్ల కావచ్చు నేడు బిలియనీర్ల సంఖ్య 162కు చేరింది. అదే సమయంలో ధనికులు పేదల మద్య నింగి నేలకున్నంత వ్యత్యాసం ఏర్పడ్డది. ఆర్థిక సంస్కరణలు దేశాభివృద్ధి పరంగా సత్ఫలితాలను ఇవ్వవచ్చు. కానీ పేదలను బాగుపరచడంలో మాత్రం ఉపయోగపడినట్లు కనబడడం లేదు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు, బడాబాబులు బాగుపడి దేశ ఆదాయం పెరగడం వల్ల ఆర్థికంగా భారత్ ముందుకి వెళ్తున్నట్లు కనిపించినప్పటికీ పేదవారు మరింత వెనక్కి వెళుతున్నట్టు తెలుస్తుంది. సంస్కరణల ప్రయోజనాలు అందరికీ అందక కొందరికి అందడంవల్ల సంస్కరణల ఫలితాలు పొందిన వాళ్లు పన్ను విధానంలో ఉన్న లోపాలను ఆసరా చేసుకుని పన్ను ఎగ్గొట్టడం వల్ల దేశసంపదకు నష్టం వాటిల్లుతున్నది. ఫలితంగా సామాన్య ప్రజానీకానికి ప్రయోజనం చేకూర్చే సంక్షేమ పథకాలపై ప్రభావం పడడం వలన ప్రభుత్వ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరుకోలేకపోతున్నాయి. కొన్ని సార్లు పాలక, అధికార వర్గాలు సంపన్నులకు లబ్ధి చేకూర్చే విధానాలు అలంబించడం, సహజ వనరులను దోచిపెట్టడం, పర్యావరణ ప్రభావాలను లెక్కచేయకుండా వనరులు తోడుకోవడానికి అనుమతులు ఇవ్వడం లాంటి విధానాలతో సామాన్య ప్రజానీకానికే భరించలేని సమస్యలు వస్తున్నాయి. సామాన్య ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను అందించినట్లయితే చాలావరకు అసమానతలు తగ్గడానికి అవకాశం ఉంది. పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు సరైన ప్రభుత్వ వైద్యం అందక ప్రైవేటు వైద్యానికి వెళ్లి లక్షలకు లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు. ఫలితంగా ఆదాయం లేని పేదలు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో నాణ్యమైన విద్యను అందిస్తే పేదలు వారి పిల్లలను అప్పులు చేసి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు పంపేవాళ్లు కారు. కానీ నేటి పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య అందకపోతే మన పిల్లలు వెనుకబడిపోతారని భావనతో అప్పులు చేసి మరీ ప్రైవేటు విద్యను ఆశ్రయించి తిప్పలు పడుతున్నారు. చివరికి అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు కూడా ఉన్నారు. నిజానికి మన దేశం వ్యవసాయాధారిత దేశం కానీ ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, వ్యవసాయానికి చేసిన అప్పులు తీరక ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి, రైతులను ఆదుకొని, పంట రుణాలు ఇచ్చి, గిట్టుబాటు ధరలు కల్పిస్తే రైతే రాజు. ఆర్థిక వ్యవస్థలలో నిగూఢంగా ఉన్న లోపాలను సవరించి ఆర్థిక ప్రయోజనాలు అందరికీ అందేటట్లు చేసి సమసమాజ భారతాన్ని నిర్మించాలి. లేనియెడల అసమానతలు పెరిగిపోతాయి. కొన్ని నివేదికలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం 2028 నాటికి భారత్‌లో 4,03,000 మంది సంపన్నులు అవుతారట. ఫలితంగా దేశ ప్రతిష్ట పెరుగుతుంది. కానీ పేదవారు సైతం బాగుపడితేనే దేశప్రతిష్ట మసకబారదు. మనకంటే చిన్నదేశాలు సైతం ప్రజలలో అసమానతలు లేకుండా ఉన్నాయి. కారణం దేశ సంపద అందరికీ చేరే విధంగా ఉన్న ఆర్థిక సంస్కరణలు, పాలకుల నిబద్ధత, అక్కడున్న మెరుగైన ఉపాధి అవకాశాలు, విద్య, వైద్య సదుపాయాలు, ప్రజల చైతన్యం. మన దేశప్రజలు కూడా ప్రలోభాలకు లోను కాకుండా బాధ్యతాయుత ప్రభుత్వాలను ఎన్నుకొని, సరియైన పాలన ద్వారా దేశ భవిష్యత్తును నిర్మించుకొని తరువాత తరాలవారికి ఆదర్శవంతంగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉన్నది. ఆర్థికంగా ఎదిగిన పారిశ్రామికవేత్తలు, బడాబాబులు ఈ దేశంలో చదువుకొని, ఈ దేశవనరులు ఉపయోగించుకొని, ఈ నేల గాలి పీల్చి పరాయి దేశానికి పోయి పరాయి వారిని బాగుపరిచే కంటే స్వదేశంలోని తోటి వారికి తోడ్పాటు అందించి దేశాభివృద్ధికి పాటుపడి మాతృభూమి రుణం తీర్చుకుంటే అంతకంటే కావలసింది ఇంకేముంటుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికకు వచ్చిన సంపన్నులు ఆలోచించినట్లుగా మన దేశ సంపన్నులు కూడా ఆలోచించాలని కోరుకుంటూ. కావలి చెన్నయ్య 90004 81768

మన తెలంగాణ 28 Jan 2026 6:00 am

28th jan 2026 |నేటి పంచాంగం

28th jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు

ప్రభ న్యూస్ 28 Jan 2026 6:00 am

వనదేవతల జనజాతర

ఇసుక వేస్తే రాలనంత జనం, మేడారం ఒక కుగ్రామం. కాని నేడు రెండు నుండి మూడు కోట్ల మంది ప్రజలను ఒక దగ్గరకు రప్పించే జనజాతర. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. సమ్మక్క సారలమ్మ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూజరుల సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది మండమేలిగే పండగ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పూజారులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కి.మీ దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండకోనల మధ్య ఈ చరిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా, కేవలం తెలంగాణలోనేగాక భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. ‘దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర’గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. 13వ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం జరిపించారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు, మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు ‘పగిడిద్దరాజు’ కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలుతీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపుధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్టదగ్గర పసుపు, కుంకుమలుగల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటినుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణెరూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి గద్దెల స్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు, ఏటేటా జనం పెరుగుతుండడంతో జాతరను కొండకింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకు వస్తారు. ఈసారి మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం రూ. 150 కోట్లను కేటాయించింది. కేంద్రం ప్రభుత్వం కూడా 3 కోట్ల 70 లక్షలు విడుదల చేసింది. తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి మేడారంలోనే బసచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రపుటల్లోకి ఎక్కారు. మంత్రులు కూడా సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం, జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి సీతక్క ఇక్కడే ఉండి జాతర విజయవంతం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ పలుమార్లు మేడారం సందర్శించి అభివృద్ధి పనులు వేగిరం చేశారు. న్యూజిలాండ్ దేశం నుండి వచ్చిన ఆదివాసీలు హాకా నృత్యం చేసి అందరినీ ఉత్తేజపరిచారు. గత రెండు నెలల ముందు నుండే వేలాది మంది భక్తులు మేడారం జాతరకి వచ్చి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. పిల్లలకు పుట్టువెంట్రుకలు తీసారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేడారంలో బస్‌స్టాండ్ ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుండి భక్తులు మేడారం వచ్చేలా నాలుగు వేల బస్‌లను నడుపనుంది. వేరే జిల్లాల డిపోల బస్సులు మేడారం కి వస్తున్నాయి. పోలీసు శాఖ కూడా 20 వేలమందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నది. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా సులభంగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారంలో ఇప్పటికే అన్ని స్టాల్స్ వెలిసాయి. అన్ని నిత్యావసర వస్తువులు ధరలు కొండెక్కాయి. వాటర్ బాటిల్స్‌కు రూ. 50 చొప్పున, కొబ్బరికాయ 70 రూపాయల చొప్పున, బెల్లం, కోళ్లు, మేకల, గొర్రెల రేట్లు అమాంతం పెంచారు. పెరిగిన ధరలు తగ్గించేలా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలి. జాతరను విజయవంతం చేసి జాతర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాం. కామిడి సతీష్ రెడ్డి 98484 45134

మన తెలంగాణ 28 Jan 2026 5:50 am

మీరు చూస్తున్నది నిజమేనా?

డిజిటల్ తెరపై కనిపించే ప్రతిదీ సత్యమేనన్న భావన నేటి సమాజంలో వేగంగా వ్యాపిస్తోంది. ఒక వీడియో వైరల్ అవుతుందంటే అది నిజమేనని, లక్షలాది చందాదారులున్నారంటే అది విశ్వసనీయతకు ముద్రనని భావించే పరిస్థితి ఏర్పడింది. అయితే అల్గోరిథంల ఆధారంగా నడిచే డిజిటల్ ప్రపంచంలో సంఖ్యలు ఆకర్షణీయంగా కనిపించినంత మాత్రాన వాటి వెనుక ఉన్న వాస్తవం కూడా అంతే బలంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. సమాచార విప్లవం ప్రజలకు అవగాహన పెంచుతున్నప్పటికీ, అదే సమయంలో అప్రమత్తత లేకపోతే అవాస్తవాలకూ అవకాశం కల్పిస్తోంది. అందువల్ల మనం స్వీకరిస్తున్న సమాచారాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించడం నేటి అత్యవసర అవసరంగా మారింది. భారతదేశంలో యూట్యూబ్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్నది అన్నది నిర్వివాద సత్యం. కోట్లాది మంది ఈ వేదికను వార్తలు, వినోదం, అభిప్రాయాల కోసం వినియోగిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు, సంగీత సంస్థలు భారీ సంఖ్యలో చందాదారులతో ముందంజలో ఉన్నాయి. అయితే చందాదారుల సంఖ్యకు, వాస్తవంగా వీడియోలను నిరంతరం వీక్షించే వారి సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉంటుందని అనేక డిజిటల్ విశ్లేషణలు సూచిస్తున్నాయి. అందువల్ల కేవలం గణాంకాల ఆధారంగా ఒక వ్యక్తి లేదా వేదిక ప్రభావాన్ని అంచనా వేయడం సరైన ప్రమాణం కాదన్న అభిప్రాయం బలపడుతోంది. నాణ్యమైన కంటెంట్, విశ్వసనీయత, వీక్షకులతో ఏర్పడే అనుబంధమే దీర్ఘకాలిక ప్రభావానికి కీలకంగా మారుతోంది. డిజిటల్ మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తిని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం సమాచార సాంకేతిక నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజా శాంతి, జాతీయ భద్రతకు భంగం కలిగించే కంటెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం సంబంధిత సంస్థలకు ఉంది. గత కొన్నేళ్లలో నిబంధనలను ఉల్లంఘించిన పలు డిజిటల్ ఛానళ్లపై చర్యలు తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. ఇది డిజిటల్ మీడియా రంగం పూర్తిగా నియంత్రణల వెలుపల కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాబట్టి కంటెంట్ సృష్టించే వారు చట్టపరమైన పరిమితులను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం మరింత పెరిగింది. యూట్యూబ్ వంటి వేదికల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా చట్టబద్ధమైన, వృత్తిపరమైన ఆదాయంగానే పరిగణిస్తారన్న అవగాహన క్రమంగా పెరుగుతోంది. సంబంధిత పన్ను నిబంధనల ప్రకారం కొన్ని రకాల డిజిటల్ ఆదాయాలపై పన్ను బాధ్యత ఉంటుంది. ఇది డిజిటల్ కంటెంట్ రంగాన్ని క్రమబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో భాగంగా నిలబెడుతోంది. సరైన లెక్కల నిర్వహణ, పారదర్శక ఆర్థిక వ్యవహారాలు క్రియేటర్లకు దీర్ఘకాలిక భద్రతను అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. చట్టబద్ధంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే ఈ రంగంలో స్థిరమైన ఉపాధి సాధ్యమవుతుందన్న వాస్తవం ఇక్కడ స్పష్టమవుతోంది. కృత్రిమ మేధ ఆధారిత వీడియోలు, ధ్రువీకరణ లేని సమాచారం, సంచలనాత్మక శీర్షికలు సమాజంపై ప్రతికూల ప్రభావంచూపే ప్రమాదం ఉంది. అధిక వీక్షణల కోసం బాధ్యతా రాహిత్యంగా రూపొందించే కంటెంట్ వ్యక్తిగత జీవితాలపైనా, సామాజిక శాంతిపైనా ప్రభావం చూపవచ్చు. ఈ పరిస్థితుల్లో సమాచారాన్ని అందించే క్రియేటర్ల నైతిక బాధ్యతతో పాటు, దాన్ని స్వీకరించే వీక్షకుల విజ్ఞత కూడా సమానంగా అవసరం. డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకోవడం ద్వారానే తప్పుడు సమాచార ప్రభావాన్ని తగ్గించవచ్చు. డిజిటల్ వేదికలు సమాజ మార్పుకు శక్తివంతమైన సాధనాలుగా ఎదిగాయి. అయితే అవి సత్యం, బాధ్యత, చట్టపరమైన అవగాహనతో నడిచినప్పుడే నిలకడగా ఉంటాయి. కాపీ రైట్, మేధో సంపత్తి హక్కులను గౌరవిస్తూ స్వంత సృజనాత్మకతతో రూపొందిన కంటెంట్‌కే దీర్ఘకాలిక గుర్తింపు లభిస్తుంది. మనం చూస్తున్నది నిజమా కాదా అన్న ప్రశ్నకు సమాధానం వెతకడమే నేటి డిజిటల్ యుగంలో అత్యవసరమైన సామాజిక బాధ్యత. వాస్తవాలను గౌరవిస్తూ, చట్టబద్ధంగా సాగే డిజిటల్ ప్రయాణమే దేశ అభివృద్ధికి నిజమైన తోడ్పాటునందిస్తుంది.  ఫిరోజ్ ఖాన్ 96404 66464

మన తెలంగాణ 28 Jan 2026 5:40 am

ఎంపీ సంతోష్‌పై సిట్ ప్రశ్నల వర్షం

` ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ బీఆరఎస్ ఎంపీని సుదీర్ఘంగా విచారించిన అధికారులు హైదరాబాద్(జనంసాక్షి):ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు హైదరాబాద్ …

జనం సాక్షి 28 Jan 2026 5:06 am

మహాఘట్టానికి వేళాయె

` నేటినుంచే మేడారం జాతర ` పగిడిద్దరాజు, జంపన్నలను చేర్చే ఘట్టం ప్రారంభం ` భారీగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం ` జాతర కోసం మీడియా …

జనం సాక్షి 28 Jan 2026 5:05 am

అమెరికా లేకపోతే ఐరోపాకు రక్షణే లేదు

` నాటో చీఫ్ హెచ్చరికలు న్యూయార్క్(జనంసాక్షి):గ్రీన్‌లాండ్ వ్యవహారంలో ఐరోపా కూటమి, అమెరికాల మధ్య విభేదాలు తలెత్తిన వేళ.. నాటో చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం మద్దతు …

జనం సాక్షి 28 Jan 2026 5:04 am

భారత్`ఈయూ ట్రేడ్ డీల్ పచ్చజెండా

` ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం ` ప్రధాని మోదీ ప్రకటన న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత్`ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. …

జనం సాక్షి 28 Jan 2026 5:03 am

సింగరేణి టెండర్లపై సీబీఐ విచారణ జరపాలి

` గవర్నర్ జోక్యం చేసుకోవాలి ` సంస్థలో కుంభకోణాన్ని అడ్డుకోవాలి.. ` గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి): సింగరేణిలో బొగ్గు స్కామ్‌పై సమగ్ర …

జనం సాక్షి 28 Jan 2026 5:02 am

పురపోరుకు మోగిన నగారా

` మోగిన తెలంగాణ మున్సిపల్ నగారా ` ఫిబ్రవరి 11న పోలింగ్…12 అవసరమైతే రీపోలింగ్ ` ఫిబ్రవరి 13న కౌంటింగ్ ..అదేరోజు ఫలితం వెల్లడి ` 16న …

జనం సాక్షి 28 Jan 2026 5:01 am

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మం గళవారం నాడు ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. బడ్జెట్ సమావేశాల్లో విబి- జి రా మ్-జి చట్టంతో పాటు, ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ )పై చర్చలు జరపాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను ప్రభుత్వం ఆరంభంలోనే తిరస్కరించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కిరణ్ రిజిజు ఈ రెండు అంశాలపై ఇప్పటికే ఉభయసభలు చర్చించాయని, మళ్లీ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేద ని అఖిలపక్షం సమావేశంలో స్పష్టం చేశారు. బడ్జె ట్ సమావేశాలలో ప్రభుత్వం ఏ అంశాలను సభలో ప్రవేశ పెడుతుందో ఆ విషయాలను తమకు ముం దుగా తెలుపక పోవడం పట్ల కాంగ్రెస్‌కు చెందిన జై రామ్ రమేశ్, సిపిఐ(ఎం)కు చెందిన జాన్ బ్రిట్టాస్, ఇతర సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీనికి తాను త్వరలో ఆ సమాచారం అందజేస్తానని మంత్రి తెలిపారు. బడ్జెట్ సమావేశాలలో సర్, ఎం జిఎన్‌ఆర్‌ఇజిఏ పథకం స్థానే తెచ్చిన విబి-జి-రామ్‌జి చట్టం, భా రతదేశంపై అమెరికా విధించిన సుంకాలు, విదేశాం గ విధానానికి సంబంధించిన విషయాలు, వాయు కాలుష్యం సమస్య, ఆర్థిక వ్యవస్థ స్థితి, స్కూల్ వయ స్సు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం వంటి పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యులు చర్చించాలని కోరిన ట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విపక్ష ఎంపీలు అ నేక అంశాలను లేవనెత్తారని, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చ సందర్భంగా, బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఈ అంశాలను లేవనెత్తవచ్చునని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి అన్నారు. 2026 కొత్తసంవత్సరంలో ఇది మొదటి సమావేశం. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రభుత్వం ఏ అంశాలను చేపడుతుందో ఆ జాబితా ను తాను ప్రతిపక్ష సభ్యులకు అందజేస్తానని ఆయ న తెలిపారు. సమావేశాలు సజావుగా నడపడంపై ప్రభుత్వం దృష్టి ఉందని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ న్‌పై చర్చ జరగాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్ర స్తావిస్తూ, గతంలో ఉభయసభల్లో విసృ్తతంగా చ ర్చించామని, మళ్లీ చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సభ్యులు ఏవైనా సమస్యలు ఉంటే లేవనెత్తాలి కానీ, గొడవలు జరగకూడదని రిజిజు వి జ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు గా ప్రజా సమస్యలను ప్రస్తావించి, చర్చిద్దాం. ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు వినియోగించుకుం టూ, ఇతర పార్టీలు చెప్పేది వినాల్సిన బాధ్యత కూ డా మనకు ఉందని, అందువల్ల సభ్యులు సజావుగా బడ్జెట్ సమావేశాలు సాగేలా సహకరించాలని విజ్ఞ ప్తి చేస్తున్నానని కిరణ్ రిజిజు తెలిపారు. 

మన తెలంగాణ 28 Jan 2026 5:00 am

సింగరేణి స్కామ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కుంభకోణా న్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వెల్లడించారు. సింగరేణి బొగ్గు స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీ సుకోవాలని కోరుతూ మంగళవారం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ నేతలు లోక్‌భవన్‌లో గవర్న ర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం లోక్‌భవన్ బయట మాజీ మంత్రి హరీష్‌రావు, బిఆర్‌ఎస్ ముఖ్యనేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. సింగరేణి కుంభకోణంపై, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద దర్యాప్తు చేయాలని కోరుతూ గవర్నర్‌ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చినట్లు చెప్పారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతికి సంబంధించి ఆధారాలతో సహా తమ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందని విమర్శించారు. ఈ కుంభకోణాన్ని పూర్తిస్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతా ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం మాట్లాడటమే కాదు, ఆధారాలతో సహా మరి పూర్తిస్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశామని తెలిపారు. సింగరేణి కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్‌ను దృష్టి మళ్లించడానికి సిట్ విచారణ పేరిట ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నారని మండిపడ్డారు. సిఎం అంటే కోల్ మాఫియా.. సిఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సిఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందని కెటిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తాము ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదని విమర్శించారు. ఈ విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతూ, విదేశాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.సిఎం ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఏ పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ ఫోజులు కొడతా ఉన్నారని విమర్శించారు.ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తదో ఒకసారి సిఎం కూడా ఆలోచించుకోవాలని సూచించారు. పది కోట్ల సింగరేణి నిధులు దుర్వినియోగం చేసి సిఎం ఫుట్ బాల్ ఆటకి వినియోగించుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలతో సిఎం ఎలాగో ఫుట్ బాల్ ఆడుతున్నారని.. కానీ, సింగరేణి సంస్థతో కూడా ఫుట్ బాల్ ఆడుతూ పది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఆ సంస్థకి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఒక్క స్కామ్‌కి సంబంధించి అన్ని ఆధారాలు బయటపెడితే కూడా ఇప్పటివరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదని విమర్శించారు. సైట్ విజిట్ సర్టిఫికేషన్ ఇక్కడే ఎందుకు..? దేశంలో ఏ బొగ్గు గనిలోలేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ ఇక్కడే ఎందుకని కెటిఆర్ ప్రశ్నించారు. టెండర్ల విషయంలో గతంలో సైట్ విజిట్ సర్టిఫికేషన్ అంటే సైట్ మీదకి వెళ్లినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి అని పేర్కొన్నారు. పారదర్శకతకు పాతరవేసి ఆ నిబంధన ఎందుకు పెట్టినారని నిలదీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం లేదని విమర్శించారు. 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధన కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసి ఉంటే, అప్పుడు ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. టెండర్ చేశారు.. మళ్ళీ ఆ టెండర్ వెంటనే రద్దు చేశారని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలల్లో ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు..ఎన్ని ఈమెయిల్స్ వచ్చాయి..ఎన్ని సర్టిఫికెట్లు సింగరేణి సంస్థ జారీ చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని తాము డిమండ్ చేస్తే ఇప్పటివరకు సమాధానం లేదని అన్నారు. కొంతమందికే ఆ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు.. మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు..? అని అడిగారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో రింగ్ మాస్టర్ సిఎం బావమరిది సృజన్ రెడ్డినా..కాదా.. స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సోదరులు దోచుకున్నది సరిపోక ఆయన బావమరిదికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీ పేరుతో హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడల్లోని రూ.5 లక్షల కోట్ల విలువైన 9,200 ఎకరాల భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బెదిరించి, రింగు చేసి, కాంట్రాక్టర్లను ఒక రింగు చేసి ఇవాళ ప్రజా ధనాన్ని వారికి కావాల్సిన వారికి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి కాలరీస్ అనే సంస్థలో 51 శాతం తెలంగాణ ప్రభుత్వానిది అయితే, 49 శాతం కేంద్ర ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కల్పించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆదేశాలివ్వాలని గవర్నర్‌ను కోరినట్లు పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై విచారణకు సిబిఐకి ఇస్తారా...లేక సిట్టింగ్ జడ్జికి ఇస్తారా.. మీ ఇష్టం ఇష్టం అని చెప్పారు. ప్రజా ధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థను, సోలార్ పవర్‌లో కుంభకోణం, సింగరేణి ఓబి గనుల్లో కుంభకోణాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ప్రజాధానాన్ని కొల్లగొట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని గవర్నర్‌ను కోరామని కెటిఆర్ అన్నారు.

మన తెలంగాణ 28 Jan 2026 4:30 am

సంతోష్‌పై సిట్ ప్రశ్నల వర్షం

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ రాజ్యసభ్య సభ్యులు, బిఆర్‌ఎస్ కీలక నేత జోగినపల్లి సంతోష్ రావును సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) విచారించింది. మంగళవారం మధ్యాహ్నాం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు. మధ్యాహ్నం 3 గంటలకు సంతోష్‌రావు జుబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ విచారణలో ప్రధానంగా పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబి చీఫ్‌గా నియమించడానికి కారణం ఏమిటి? ఇది ఎవరి నిర్ణయమని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రభాకర్‌రావు బృందానికి తరచు ఫోన్ ట్యాపిం గ్ చేయాల్సిన నంబర్లు అందాయని వాటిని పంపించడంలో ఎవరి ప్రమేయం ఉందని ఆరా తీసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ చేసిన పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నంబర్ల జాబితా సంతో ష్‌రావుకు చూపించి వాటిని ట్యాప్ చేయమని చెప్పింది ఎవరు? అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో హరీష్ రావు, కెటిఆర్‌ను ఇప్పటికే ఏడు గంటల పాటు సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ అధికారులు తదుపరి ఎవరికి నోటిసులు ఇచ్చి పిలువనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇంతటితో సిట్ విచారణ ముగించి చార్జిషీటు దాఖలు చేస్తారా? లేక మరి కొందరని విచారిస్తారా? అనేది సర్వత్రా ఉత్కంఠత రేపుతోంది.

మన తెలంగాణ 28 Jan 2026 3:30 am

బుధవారం రాశి ఫలాలు (28-01-2026)

మేషం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృషభం వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మిధునం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాల నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. మిత్రులతో ఆర్థిక విషయంలో విబేధాలు కలుగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. కర్కాటకం భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున నష్టాలు భర్తీ అవుతాయి. సింహం సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. బందు మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. స్థిరస్తి వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది. కన్య ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది. చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. తుల వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు అధికమౌతాయి. వృశ్చికం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘ కాలిక వివాదాల నుండి బయట పడతారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనస్సు కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మకరం ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభం నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. మీనం విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.  

మన తెలంగాణ 28 Jan 2026 12:20 am

మోగిన పుర నగారా

. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. 11న పోలింగ్… 16న కౌంటింగ్ విశాలాంధ్ర – హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల కోలాహలం మొదలయింది. తెలంగాణా మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదలయింది. 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదుని తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందని, 31 న నామినేషన్ల పరిశీలన […] The post మోగిన పుర నగారా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:46 pm

కొత్తగూడెం కార్పొరేషన్‌పై సీపీఐ పట్టు

. 50, 43 డివిజన్ల నుంచి 110 కుటుంబాలు పార్టీలో చేరిక. అభివద్ధికి ప్రజల సహకరిస్తే కార్పొరేషన్ సీపీఐ కైవసం: జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా విశాలాంధ్ర – కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో సీపీఐ రోజు రోజుకు పట్టు సాధిస్తోంది. మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చడంలో విజయం సాధించిన స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై ప్రజల్లో అభివృద్ధి ప్రదాతగా నమ్మకం పెరిగింది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీపీఐలో చేరికలు భారీగా పెరిగాయి. గడిచిన మునిసిపల్ ఎన్నికల్లో […] The post కొత్తగూడెం కార్పొరేషన్‌పై సీపీఐ పట్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:42 pm

అత్యుత్తమ సేవలే లక్ష్యంగారెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు

. కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు. నేడు పఠాన్‌చెరువులో ఇంటిగ్రేటెడ్ భవనానికి శంకుస్థాపన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా అత్యుత్తమ సేవలు అందిం చాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత పదేళ్లలో ఆనాటి పాలకుల స్వార్థపూరిత నిర్ణయాల వల్ల రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. […] The post అత్యుత్తమ సేవలే లక్ష్యంగారెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:40 pm

సింగరేణి కార్మికులసంక్షేమానికి పెద్దపీట

. అధికారులతో సమానంగా కార్మికులకు సౌకర్యాలు. ఉద్యోగుల పేరు మార్పుల సమస్యకు పరిష్కారం. కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విశాలాంధ్ర-హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా ప్రభుత్వం అధ్వర్యంలో సింగరేణి కార్మికుల కోసం తాజాగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సింగరేణి ఉద్యోగుల […] The post సింగరేణి కార్మికులసంక్షేమానికి పెద్దపీట appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:38 pm

స్తంభించిన బ్యాంకు సేవలు

వారానికి ఐదు పనిదినాల సాధనకు నిర్విరామ పోరు: యూఎఫ్‌బీయూ విశాలాంధ్ర – హైదరాబాద్ : బ్యాంకు ఉద్యోగుల” వారానికి ఐదు రోజుల పని విధానం సాధించేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తామని ఏఐబీఈఏ కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. ఐదు రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు బ్యాంక్ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్ కోఠిలోని […] The post స్తంభించిన బ్యాంకు సేవలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:35 pm

నిందితుల ఆస్తులు వేలం వేయరాదా?

న్యూదిల్లీ: యాసిడ్ దాడుల కేసుల్లో నిందితుల ఆస్తులు వేలం వేసి బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలంటూ రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. జీవితాంతం చికిత్స, పునరావాసం కోసం బాధితులకు ఇస్తున్న పరిహారం (రూ.3 లక్షలు) అక్కరకు రాదని పేర్కొంది. మెరుగైన చర్యలు అవసరమని సూచించింది. ఇలాంటి నేరాలను నివారించేందుకు అసాధారణ శిక్షలు విధించాలని, చట్టంలో మార్పులు చేయాలని యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ పిల్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతత్వ ధర్మాసనం […] The post నిందితుల ఆస్తులు వేలం వేయరాదా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:28 pm

ఆ దేశాలకు ఇండిగో సర్వీసులు రద్దు

న్యూదిల్లీ: ఇరాన్‌లో ఉద్రిక్తతలతో సెంట్రల్ ఆసియాకు ఇండిగో విమాన సేవలు రద్దు అయ్యాయి. ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఒక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 11 వరకు తబిలిసి (జార్జియా), అల్మాటీ (కజకిస్థాన్), బకు (అజర్ బైజాన్), తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్ )కు తమ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణాల దష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అసౌకర్యానికి చింతిస్తున్నామని వెల్లడించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ప్రధానమని […] The post ఆ దేశాలకు ఇండిగో సర్వీసులు రద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:23 pm

ఔటర్ రింగ్ రోడ్ పై కారు దగ్ధం..

ఔటర్ రింగ్ రోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అకాడమీ వద్ద కారు దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. కారు ముందు భాగం నుంచి మంటలను గమనించిన డ్రైవర్ కారును పక్కకు ఆపి కిందకు దిగి  పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. తుక్కుగూడ నుంచి నార్సింగి వస్తున్న నిఖిల్ అనే వ్యక్తి అప్ప జంక్షన్ సమీపంలోకి రాగానే కారు లో నుంచి పొగలు రావడాని గమనించాడు. సమాచారం మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే కారు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 27 Jan 2026 11:22 pm

బడ్జెట్ హల్వా సిద్ధం

న్యూదిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు వేళయ్యింది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. దీంతో సంప్రదాయం ప్రకారం బడ్జెట్ హల్వా సిద్ధమైంది. ఈ వేడుక ఆర్థిక శాఖ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌధరీ పాల్గొన్నారు. ఆర్థిక శాఖ పరిధిలోని అన్ని విభాగాల కార్యదర్శులు, బడ్జెట్ రూపకల్పనలో భాగమైన అధికారులు హాజరయ్యారు. అనంతరం సీతారామన్ బడ్జెట్ ప్రతుల ముద్రణ, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం […] The post బడ్జెట్ హల్వా సిద్ధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:19 pm

మహా ఆర్థిక బంధం

. ట్రంప్ హెచ్చరికలు బేఖాతర్. భారత్`ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు. చారిత్రక ఒప్పందం: మోదీ. కొత్త శిఖరాలకు సహకారం: కోస్టా. ఇటు నైపుణ్యం, అటు టెక్నాలజీతో అద్భుత ఫలితాలు: ఉర్సులా న్యూదిల్లీ: భారత్-ఈయూ (యురోపియన్ యూనియన్) మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స’గా చర్చించుకుంటున్నారని నేతలు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్, […] The post మహా ఆర్థిక బంధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:15 pm

బ్యాంకు ఉద్యోగుల రణభేరి

. స్తంభించిన బ్యాంకు సేవలు. దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు, ధర్నాలు. ఐదు రోజుల పని దినాలు అమలు చేయాల్సిందే. ఒప్పందం అమలు చేయకుంటే ఆందోళన ఉధతం. హెచ్చరించిన బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నేతలు. సమ్మెకు సంఘీభావం తెలిపిన ఏఐటీయూసీ. నిర్లక్ష్యం దుర్మార్గం: రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వారానికి ఐదు రోజుల పని దినాలు ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం రాష్ట్రంలో చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె […] The post బ్యాంకు ఉద్యోగుల రణభేరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:10 pm

ఉపాధి హామీ, ఎస్ఐఆర్, యూజీసీపైచర్చించాల్సిందే

అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షం డిమాండ్బడ్జెట్‌పైనే దృష్టి పెట్టాలి: ప్రభుత్వం న్యూదిల్లీ: ఎంజీఎనఆరఈజీఏ తిరిగి అమలుతో పాటు ఎసఐఆర్, యూజీసీ నిబంధనలపై పార్లమెంటులో చర్చించాలని మంగళవారం అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వ ప్రతినిధులు ససేమిరా అన్నారు. బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. దీంతో సంప్రదాయం ప్రకారం ఒక రోజు ముందు అఖిలపక్షం భేటీ అయింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. అధికార`విపక్ష కీలక నేతలు హాజరయ్యారు. ప్రతిపక్ష సభ్యుల […] The post ఉపాధి హామీ, ఎస్ఐఆర్, యూజీసీపైచర్చించాల్సిందే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:06 pm

శరవవేగంగా ’ఉస్తాద్ భగత్ సింగ్’ నిర్మాణాంతర కార్యక్రమాలు

తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ’ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. తన శక్తివంతమైన రచన, మాస్ మెచ్చే సంభాషణలకు పేరుగాంచిన హరీష్ శంకర్ ను అభిమానులు ముద్దుగా ’కల్ట్ కెప్టెన్’ అని పిలుస్తారు. ఆ పేరుకి తగ్గట్టుగానే ’ఉస్తాద్ భగత్ సింగ్’ను కల్ట్ చిత్రంగా మలచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సినిమా అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లేలా.. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే, ప్రేక్షకుల చేత ఈలలు వేయించే సంభాషణలకు ఈ చిత్రం హామీ ఇస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇది అభిమానులలో, సినీ ప్రేమికులలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది. ’గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం కావడంతో ’ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ’దేఖ్ లేంగే సాలా’ గీతం శ్రోతలను ఉర్రూతలూగించింది. ’ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

మన తెలంగాణ 27 Jan 2026 11:01 pm

ఏపీ సెట్స్ ఎప్ప్పుడు?

. విద్యార్థుల ఎదురు చూపు. గత ఏడాది ప్రవేశాల జాప్యం. సకాలంలో విడుదల చేయాలని వినతులు. ప్రైవేట్ వర్సిటీలలో ప్రవేశాల జాతర విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కోర్సుల్లో చేరాలనుకునే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) క్యాలెండరు కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచఈ) నేతత్వంలో షెడ్యూలు విడుదలకు ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు పూర్తయినట్లు తెలిసింది. ఇటీవల ఉన్నత విద్యామండలి అధికారులు […] The post ఏపీ సెట్స్ ఎప్ప్పుడు? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:01 pm

భారత్`ఈయూ ఎఫ్‌టీఏలో కీలక అంశాలు

2026 చివరికి అమల్లోకి ఒప్పందం న్యూదిల్లీ: భారత్`27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందా(ఎఫ్‌టీఏ)నికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియల పూర్తికి, ఒప్పందం డాక్యుమెంట్లను ఐరోపా దేశాల 24 అధికారిక భాషల్లోకి అనువాదం చేయించడానికి దాదాపు 6 మాసాల సమయం పట్టనుంది. 2026 చివరికల్లా ఒప్పందంపై భారత్, ఈయూ లాంఛనంగా సంతకాలు చేస్తాయి. 2027లో మొదటి రెండు నెలల్లోగా ఎఫ్‌టీఏపై భారత ప్రభుత్వ మంత్రిమండలి, ఐరోపా పార్లమెంటు ఆమోదముద్ర వేస్తాయి. ఆ […] The post భారత్`ఈయూ ఎఫ్‌టీఏలో కీలక అంశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 10:54 pm

సమరోత్సాహంతో భారత్.. నేడు విశాఖలో కివీస్‌తో పోరు

విశాఖపట్నం: హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా బుధవారం విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే నాలుగో టి20 మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా ఈసారి కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడైన ప్రదర్శన చేస్తున్న భారత్ క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఇషాన్ కిషన్ కూడా దూకుడు మీద ఉన్నాడు. భారత్ విజయాల్లో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషిస్తున్నారు. కిందటి మ్యాచ్‌లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ కళ్లు చెదిరే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ చెలరేగితే కివీస్ బౌలర్లకు మరోసారి ఇబ్బందులు ఖాయం. ఇషాన్ కిషన్ కూడా జోరుమీదున్నాడు. అతను కూడా విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచుల్లోనూ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. విశాఖలోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని తహతహలాడుతున్నాడు. హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రింకు సింగ్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి తదితరులతో బౌలింగ్ కూడా బాగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు న్యూజిలాండ్ కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని లక్షంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగానే ఉన్నా కివీస్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. ఈసారైన గెలుస్తుందా లేదా వేచి చూడాల్సిందే.

మన తెలంగాణ 27 Jan 2026 10:39 pm

లాసెట్, ఇసెట్ షెడ్యూల్ విడుదల

 రాష్ట్రంలో న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించే టిజిలాసెట్, పిజిఎల్‌సెట్, లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిజిఇసెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. లాసెట్, ఇసెట్ నిర్వహణకు మంగళవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఆయా సెట్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయా సెట్ల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు పురుషోత్తం, మమమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఒయు వైస్ ఛాన్స్‌లర్ మొలుగరం కుమార్, లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మి, ఇసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. లాసెట్, ఇసెట్ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. లాసెట్ ప్రవేశ పరీక్షకు ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి,10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి ఆలస్యం రుసుం లేకుండా దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 1 చివరి తేదీ. మే 18వ తేదీన ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2 వరకు మూడేళ్ల ఎల్‌ఎల్‌బి, సాయంత్రం 4 నుంచి 5.30 వరకు ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష జరుగనున్నది. అలాగే లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిజి ఇసెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 5న నోటిఫికేషన్ విడుదల చేసి, 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 18 వరకు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 15న ఇసెట్ పరీక్ష జరుగనున్నది. టిజి లాసెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ తేదీ : ఫిబ్రవరి 8 అన్‌లైన్ దరఖాస్తులు : ఫిబ్రవరి 10 నుంచి ఏప్రిల్ 1 వరకు(ఆలస్య రుసుం లేకుండా) పరీక్ష తేదీ : మే 18 టిజి ఇసెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 5 ఆన్‌లైన్ దరఖాస్తులు : ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 18 వరకు (అలస్య రుసుం లేకుండా) పరీక్ష : మే 15

మన తెలంగాణ 27 Jan 2026 10:30 pm

సంబంధాలతో మార్పు కోసం బ్రిటన్ ప్రధాని చైనా వైపు

లండన్: అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో చైనాతో సంబంధాలను మెరుగుపరచేందుకు ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ చైనాకు వెళుతున్నారు. బుధవారం నుంచి ఆయన బీజింగ్, షాంఘైలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్, ప్రధాని లి కియాంగ్ లను కలుసుకుని చర్చలు జరుపుతారు. బ్రిటన్ చైనీస్ టెక్నాలజీ, పెట్టుబడిని కోరుతూ, బ్రిటన్ ఆర్థిక సేవలు, కార్లు, స్కాచ్ విస్కీ చైనాకు అందించేందుకు సిద్ధమైంది. బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్ తో పాటు, బ్రిటీష్ వాణిజ్య వ్యవహారాల శాఖమంత్రి పీటర్ కైల్ పలువురు కార్పొరేట్ చీఫ్ లు ఈ పర్యటనలో పాల్గొంటారు. బ్రిటీష్ ప్రధాని చైనా పర్యటన వల్ల దేశంలో చైనా వ్యతిరేకుల నుంచి నిరసన వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆగ్రహించే అవకాశం, మిత్రపక్షం అన్నది కూడా చూడకుండా అధికంగా సుంకాలు విధించే ప్రమాదం ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలు వల్ల నెలకొన్న అస్తవ్యస్థ నేపథ్యంలో అటు చైనా, ఇటు బ్రిటన్ కూడా స్థిరమైన సంబంధాలకోసం చూస్తున్నాయి.

మన తెలంగాణ 27 Jan 2026 10:26 pm

సిఎం అంటే కోల్ మాఫియా: కెటిఆర్

సిఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సిఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందని కెటిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తాము ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదని విమర్శించారు. ఈ విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతూ, విదేశాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.సిఎం ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఏ పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ ఫోజులు కొడతా ఉన్నారని విమర్శించారు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తదో ఒకసారి సిఎం కూడా ఆలోచించుకోవాలని సూచించారు. పది కోట్ల సింగరేణి నిధులు దుర్వినియోగం చేసి సిఎం ఫుట్ బాల్ ఆటకి వినియోగించుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలతో సిఎం ఎలాగో ఫుట్ బాల్ ఆడుతున్నారని.. కానీ, సింగరేణి సంస్థతో కూడా ఫుట్ బాల్ ఆడుతూ పది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఆ సంస్థకి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఒక్క స్కామ్‌కి సంబంధించి అన్ని ఆధారాలు బయటపెడితే కూడా ఇప్పటివరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదని విమర్శించారు.

మన తెలంగాణ 27 Jan 2026 10:25 pm

రాష్ట్రంలో ఐదుగురు డిఎస్పిలు బదిలీ

రాష్ట్ర పోలీస్ శాఖలో ఐదుగురు డిఎస్పిలు బదిలీ చేస్తున్నట్లు డిజిపి బి.శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పోలీస్ అకాడమీ స్టాండ్స్ డిఎస్పి, ఇల్లందు ఎస్‌డిపిఓగా విధులు నిర్వహిస్తోన్న ఎస్.సారంగపాణి వైరా ఏసిపిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలో డిఎస్పిగా ఉన్న పద్మనాభుల శ్రీనివాస్ జిహెచ్‌ఎంసి అదనపు ఎస్పిగా, ఇంటెలిజెన్స్ డిఎస్పిగా విధులు నిర్వహిస్తున్న యు. వెంకన్నబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎస్‌డిపిఓగా, సైబరాబాద్ ఎస్‌బి ఏసిపిగా ఉన్న బి. ప్రకాష్ నిజామాబాద్ ఏసిపిగా బదిలీ చేశారు. నిజామబాద్ ఏసిపిగా ఉన్న ప్రకాష్‌ను డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

మన తెలంగాణ 27 Jan 2026 10:22 pm

సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడు ఆత్మహత్య

తిమ్మాపూర్ మండలం కొత్తపెల్లి గ్రామంలోని స్మశాన వాటిక వద్ద సోమవారం రామంచ గ్రామానికి చెందిన నాగేల్లి వెంకటేష్ రెడ్డి(29) అనే యువకుడు తన చావుకు కుటుంబ సభ్యులే కారణమంటూ కంటతడి పెట్టించి సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్య. చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన నాగేల్లి వెంకటేష్ రెడ్డి కి రెండు నెలల క్రితమే మనీషా అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన కుటుంబ సభ్యులు అయిన అన్నదమ్ములతో కలిసి చిన్న ముల్కనూర్ గ్రామంలో లక్షల పెట్టుబడి పెట్టి మహాదేవ్ సూపర్ మార్కెట్ ను నడిపిస్తున్నారు. సూపర్ మార్కెట్ ఆర్థిక లావాదేవీలలో తన తోడ బుట్టిన అన్నదమ్ములే మోసం చేయడం,తన తల్లిదండ్రులు,అన్నదమ్ములు తనను తన భార్యను అవమానపరిచి,ఆర్థికంగా దెబ్బతీసి వెలివేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన నాగేల్లి వెంకటేష్ రెడ్డి నేను చనిపోయిన తనను నమ్ముకున్న భార్యకు న్యాయం చేయాలని వేడు కుంటూ సెల్ఫీ వీడియో తీసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న హృదయ విధాకరమైన ఘటన కంట తడి పెట్టించింది. నా మరణానికి నా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములే కారణమని, నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్యకు న్యాయం చేయని బ్రతుకు నాకు ఎందుకు అని భావించి, నేను పురుగుల మందు త్రాగి చచ్చిపోతున్నా, నీవు మంచిగా బ్రతకమని భార్యను ఓదారుస్తూ, నా భార్య అమాయకురాలు అని వేడుకొంటూ..నేను చనిపోయిన తదనంతరము భార్యకు నా కుటుంబ సభ్యుల నుండి కనీసం 10 లక్షల రూపాయలు ఇప్పించాలని ఎస్‌ఐకి వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి,చనిపోతున్నా అని తన భార్యకు తెలియజేసి,పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే భార్య తన తోటి స్నేహి తులు ఘటన స్థలానికి వెళ్లి చూసే సరికి నాగేల్లి వెంకటేష్ రెడ్డి అపస్మారక స్థితిలో కింద పడి ఉండగా, వెంటనే కరీంనగర్ లోని ప్రవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మంగళ వారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్న ట్టు ఎల్‌ఎండి ఎస్‌ఐ తెలిపారు.

మన తెలంగాణ 27 Jan 2026 10:17 pm

ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం..

హైదరాబాద్: ట్రేడింగ్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని చెప్పి నగరానికి చెందిన బాధితుడి వద్ద నుంచి సైబర్ నేరస్థులు రూ.45లక్షలు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని నల్లకుంటకు చెందిన వ్యక్తి(52)కి ఫేస్‌బుక్‌లో ఇన్వెస్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న ప్రకటనను చూశాడు. దానిపై క్లిక్ చేయడంతో స్టడీ సర్కిల్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లోకి వెళ్లాడు. ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్న వారు ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ టెక్నిక్స్ టీచింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అందులో ఉన్న వారి పోస్టింగ్‌లు నమ్మిన బాధితుడు వారు చెప్పినట్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. దాని ద్వారా ముందుగా రూ.50వేలు పెట్టుబడిగా పెట్టాడు. సైబర్ నేరస్థులు ప్రొఫెసర్ ముఖుల్ కొచ్చారు, అతడి అసిస్టెంట్ పేరుతో బాధితుడితో మాట్లాడారు. వచ్చే ఐసిఐసిఐ ప్రుడేన్షియల్, గ్లోబల్ ఓసియన్ లాజిస్టిక్స్ ఐపిఓలో పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పారు. సైబర్ నేరస్థుల మాటలు నమ్మిన బాధితుడు రూ.45,01,017 పెట్టుబడిపెట్టాడు. వాటికి రూ.6,19,49,304 లాభాలు వచ్చాయని చూపించారు. వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా అనుమతి ఇవ్వలేదు. వెంటనే సైబర్ నేరస్థులను సంప్రదించగా మరింత పెట్టుబడిపెట్టాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 27 Jan 2026 10:03 pm

U19 World Cup.. యువ భారత్ ఘన విజయం

బులవయో: జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్19 ప్రపంచకప్‌లో యువ భారత జట్టు వరుస విజయాలతో అదరగొడుతోంది. మంగళవారం జింబాబ్వేతో జరిగిన సూపర్ సిక్స్ (గ్రూప్2) మ్యాచ్‌లో భారత్ 204 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరును సాధించింది. విహాన్ మల్హోత్రా అద్భుతసెంచరీతో చెలరేగి పోయాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన విహాన్ 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్లు అరోన్ జార్జ్ (23), వైభవ్ సూర్యవంశీ (52) జట్టుకు శుభారంభం అందించారు. చెలరేగి ఆడిన వైభవ్ 30 బంతుల్లోనే 4 సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో 52 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 61 పరుగులు సాధించాడు. ఖిలాన్ పటేల్ 12 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. దీంతో భారత్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత లక్షఛేదనకు దిగిన జింబాబ్వే యువ జట్టు 37.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. కియాన్ (37), లిరాయ్ (62), టటెండా (29) పరుగులు రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో మోహన్, అయుష్ మాత్రె మూడేసివికెట్లను పడగొట్టారు.

మన తెలంగాణ 27 Jan 2026 9:26 pm

మెగాస్టార్ మూవీకి రికార్డు కలెక్షన్స్..

మెగాస్టార్ చిరంజీవి పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు బుక్‌మైషోలో, ప్రపంచవ్యాప్త వసూళ్లలో సంచలనాత్మక మైలురాళ్లను సాధించింది. మన శంకరవరప్రసాద్ గారు బుక్‌మైషోలో ఆల్‌టైమ్ నంబర్ 1 రీజినల్ ఫిల్మ్ గా నిలిచింది. 15వ రోజుకే 3.6 మిలియన్ టికెట్లు అమ్ముడై, ఇప్పటివరకు రికార్డు కలిగిన సంక్రాంతికి వస్తున్నాం (3.5 మిలియన్)ను అధిగమించింది. ఈ ఘనతను సాధించిన ఫాస్టెస్ట్ రీజినల్ ఫిల్మ్‌గా ‘మన శంకరవరప్రసాద్ గారు’ రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 15 రోజుల్లో రూ.358 కోట్లకు పైగా వసూలు చేసి రీజినల్ ఇండస్ట్రీ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఉత్తర అమెరికాలో ఈ చిత్రం 3.5 మిలియన్ డాలర్ల మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే భారీ రికార్డులు నమోదు అవుతున్నాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని అత్యున్నతంగా నిర్మించారు.

మన తెలంగాణ 27 Jan 2026 9:17 pm

హైదరాబాద్ లో గ్లోబల్ కాపబిటిలి సెంటర్ ప్రారంభించిన వెస్ట్రన్ యూనియన్

హైదరాబాద్: HCLTech సహకారంతో భారతదేశం, హైదరాబాద్ లో తమ గ్లోబల్ కాపబిటిలి సెంటర్ ప్రారంభోత్సవాన్ని ద వెస్ట్రన్ యూనియన్ కంపెనీ (NYSE: WU) ఈరోజు ప్రకటించింది. ఈ ఆధునిక సౌకర్యం AI- ఆధ్వర్యంలోని ఆవిష్కరణ, ప్లాట్ ఫాం ఆపరేటింగ్ మోడల్ మరియు ఇంజనీరింగ్ శ్రేష్టత ద్వారా వెస్ట్రన్ యూనియన్ యొక్క పరివర్తనను వేగవంతం చేయడానికి రూపొందించబడింది, ఇది రెండు కంపెనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని శక్తివంతం చేస్తుంది. సెంటర్ ను, HCLTech CEO మరియు మేనేజింగ్ డైరెక్టర్ విజయ కుమార్, మరియు రెండు సంస్థలకు చెందిన సీనియర్ నాయకులతో కలిసి వెస్ట్రన్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ మరియు CEO, డెవిన్ మెక్ గ్రనహన్ ప్రారంభించారు. పూణె టెక్ సెంటర్ తో పాటు, GCC టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు ఆపరేషన్స్ కోసం అంతర్జాతీయ వేదికగా పని చేస్తుంది. ఆధునిక చెల్లింపుల మౌళిక సదుపాయాలను ప్రోత్సహిస్తుంది, డిజిటల్ వినియోగదారుల అనుభవాలను మెరుగుపరుస్తుంది మరియు ప్రపంచ స్థాయికి చెందిన సామర్థ్యాలను రూపొందిస్తుంది. సెంటర్ AI Force™ సహా HCLTech యొక్క AI పవర్డ్ పరిష్కారాలను ఉపయోగిస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వెస్ట్రన్ యూనియన్ ప్రెసిడెంట్ మరియు CEO డెవిన్ మెక్ గ్రనహన్ ఇలా అన్నారు, “ ఈ సెంటర్ వెస్ట్రన్ యూనియన్ వారి పరివర్తనా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను మరియు భారతదేశంలో విస్తరణను సూచిస్తుంది. HCLTechతో మా వ్యూహాత్మకమైన భాగస్వామ్యం ద్వారా, చెల్లింపులకు మించి, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కస్టమర్లకు సజావుగా, సురక్షితమైన అనుభవాలను అందించడానికి మేము లోతైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఆధునిక AI సామర్థ్యాలతో కలుపుతున్నాము. ” సి. విజయకుమార్, HCLTech CEO & MD, ఇలా అన్నారు, “ వెస్ట్రన్ యూనియన్ తో మా విలువైన భాగస్వామ్యంలో ఈ మైలురాయి గణనీయమైన ముందడుగును సూచిస్తోంది. ఇది ఆర్థిక సేవలు మరియు GCCల కోసం వ్యాపారం మరియు టెక్నాలజీ పరివర్తను వేగవంతం చేయడంలో HCLTech యొక్క శక్తివంతమైన డిజిటల్, క్లౌడ్ మరియు AI సామర్థ్యాలను సూచిస్తోంది. కలిసికట్టుగా మేము వెస్ట్రన్ యూనియన్ యొక్క బియాండ్ స్ట్రాటజి (వ్యూహానికి మించి)కి అనుగుణంగా నిర్దిష్టమైన, కొలవదగిన ఫలితాలను అందించడం, డిజిటల్-ఫస్ట్ వ్యాపార మోడల్ ను అభివృద్ధి చేయడం, చెల్లింపులకు మించి వినియోగదారు సేవలను విస్తరించడం మరియు ఆధునిక తరానికి చెందిన చెల్లింపుల మౌళికసదుపాయాలను నవీకరించడంపై దృష్టి కేంద్రీకరించాము.”

మన తెలంగాణ 27 Jan 2026 9:10 pm

Will Jana Nayagan makers Compromise with CBFC?

Jana Nayagan is the last attempt of Vijay as an actor as he decided to take a full time career in Tamil politics. Jana Nayagan is made on a budget of Rs 500 crores and the film is stuck with censor hurdles. The film’s grand release during Sankranthi season has been put on hold and […] The post Will Jana Nayagan makers Compromise with CBFC? appeared first on Telugu360 .

తెలుగు 360 27 Jan 2026 9:00 pm

జిల్లాలో తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

క్లోరినేషన్ క్లీనింగ్ టెస్టులు సకాలంలో చేయండి కలెక్టర్ జి. లక్ష్మీశ.విశాలాంధ్ర`విజయవాడ: జిల్లా వ్యాప్తంగా రక్షిత తాగునీటి సరఫరా పై నిరంతర పర్యవేక్షణ చేయాలని క్లోరినేషన్ క్లీనింగ్ బైలాజికల్ టెస్టులు నిర్వహించిన అనంతరం మాత్రమే తాగునీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణ సురక్షిత మంచినీటి సరఫరా గ్రామీణ నీటి సరఫరా పథకాల పనుల ప్రగతి పై మంగళవారం ఆయన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా […] The post జిల్లాలో తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 8:59 pm

తారకరామ ఎత్తిపోతల పథకంపై తీవ్ర నిర్లక్ష్యం

రైతులు నష్టపోతున్న పట్టించుకోని ప్రభుత్వం తక్షణమే రూ.5కోట్లు కేటాయించి నిర్వహణ పనులు చేపట్టాలి రైతు సంఘాల నేతలు డిమాండ్ విశాలాంధ్రవిజయవాడ: వేలాది ఎకరాలకు సాగునీరు అందించే తారకరామ ఎత్తిపోతల పథకం గత 10సంవత్సరాల నుంచి ఎటువంటి మరమ్మతులు నోచుకోకపోవడం దారుణమని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. అమరావతి రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ పథకం మరమత్తులకు, మెయింటినెన్స్ కు నిధులు లేవని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నం, జి.కొండూరు,విజయవాడ రూరల్ […] The post తారకరామ ఎత్తిపోతల పథకంపై తీవ్ర నిర్లక్ష్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 8:52 pm

మా తండ్రి, తాత గోవాలోనే పుట్టారు: యురోపియన్ కౌన్సిల్ చీఫ్

న్యూఢిల్లీ: భారతదేశం- యురోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం ప్రకటన సందర్భంగా అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయి డా కోస్టా... భారతదేశంలోని గోవాతో నాకు చక్కటి అనుబంధం ఉంది. నా తండ్రి, తాతా గోవాలో పుట్టిన వాళ్లే.. అంటూ భారతదేశంతో తనకు గల అనుబంధాన్ని వివరిస్తూ తన ఓసిఐ కార్డు తీసి చూపారు. ఇయు అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ప్రధాని నరేంద్రమోదీ లను ఆశ్చర్యానికి గురిచేస్తూ, కోస్టా తన గోవా అనుబంధాన్ని వివరించారు. గతంలో పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవాలో ఆంటోనియో కోస్టా తండ్రి పుట్టి పెరిగారు. గోవా విముక్తి తర్వాత ఆయన 18 ఏళ్ల వయస్సులో పోర్చుగల్ కు వలస వెళ్లారు. ఆంటోనియో కోస్టా తన చిన్నప్పటి కొంకణి పేరు బాబుష్ అని మంగళవారం ఉమ్మడి సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం యురోపియన్ కౌన్సిల్ చైర్మన్ అయినా, తాను కూడా విదేశీ భారతీయ పౌరుడినే అని తన జేబులోంచి ఓసిఐ కార్డును చూపుతూ కోస్టా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన 1015 నుంచి 2024 వరకూ పోర్చుగీస్ ప్రధానమంత్రిగా పని చేశారు. పోర్చుగీస్ ప్రధాని హోదాలో 2017లో భారతదేశంలో పర్యటించినప్పుడు గోవాలో తమ పూర్వీకులు ఉన్న ఇళ్లను కూడా సందర్శించారు. అప్పుడు కవి, రచయిత అయిన తన తండ్రి ఓర్లాండో కోస్టా రాసిన నాటకం ఆంగ్ల అనువాదాన్ని విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కోస్టా 1961లో నిస్బన్ లో జన్మించినా, తల్లిదండ్రులతో కలిసి తన టీనేజ్ లో గోవాను సందర్శించినట్లు చెప్పారు. తన తా మార్గోవాలో పుట్టి ఎక్కువకాలం అక్కడే జీవించారన్నారు. తన తండ్రి లిస్బన్ వెళ్లినా గోవాను మరచిపోలేదని, గోవా పై రచనలు చేసేవారని పేర్కొన్నారు. గోవా లోని మార్గావ్ లో అబాదే ఫారియా రోడ్ లో 200 ఏళ్లనాటి తన పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉందని, తమ బంధువుల కుటుంబాలు ఇప్పటికీ అక్కడ నివసిస్తున్నట్లు తెలిపారు. 2017లో తాను ఆ ఇంటిని చూసి, తన కుటుంబసభ్యులతో మాట్లాడిన విషయం గుర్తు చేసుకున్నారు. 64 ఏళ్ల కోస్టా కు గోవా వారసత్వం, ప్రశాంచ చర్చల శైలి కారణంగా ఆయనను లిస్బన్ గాంధీ అని పిలుస్తారు. కోస్టా ప్రస్తుతం బ్రస్సెల్స్ నుంచి ఇయు కౌన్సిల్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నా...ఆయన ప్రసంగంలో గోవా ఓ భాగం అయింది.

మన తెలంగాణ 27 Jan 2026 8:50 pm

మే నుంచి ‘దేవర 2’

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం దేవర. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధా ఆర్ట్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించారు. భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ ‘దేవర 2’ అసలు ఉందా లేదా అంటూ ఎన్నెన్నో రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. కానీ ఫైనల్‌గా వాటి అన్నింటికి సమాధానం వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ దేవర 1కి కొనసాగింపుగా దేవర 2 ప్రకటించారు కానీ ఇది ఆలస్యమవుతూ వచ్చింది. కానీ తాజాగా నిర్మాతలలో ఒకరైన యువసుధా ఆర్ట్ అధినేత మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాపై అప్‌డేట్ అందించారు. దేవర 2 షూటింగ్ ఈ ఏడాది మే నుంచి మొదలు కానుందని, వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అవుతుందని తెలియజేశారు. దీంతో అభిమానులు ఎంతో సంతోషపడిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్... ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో పూర్తి చేసే అవకాశం ఉంది. ఆతర్వాత మే నుంచి దేవర 2 షూటింగ్ మొదలు కానుందట.

మన తెలంగాణ 27 Jan 2026 8:33 pm

గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్‌ కలకలం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్ట్

హైదరాబాద్‌: డ్రగ్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ పట్టబడుతునే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసినా.. డ్రగ్స్ పెడ్లర్లు తమ దందాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలిలో మాదాపూర్‌ ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎండిఎంఎ డ్రగ్స్‌ విక్రయిస్తున్న సాయికిరణ్ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తోపాటు మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చి విక్రయిస్తుండగా ముగ్గురిని అందుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

మన తెలంగాణ 27 Jan 2026 8:22 pm

సిఎం రేవంత్‌రెడ్డికి సంతోష్ గూఢచారి : కవిత సంచలన వ్యాఖ్యలు

ఉద్యమకారులకు ఉద్యమనేతను దూరం చేసిందే సంతోష్‌రావు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డికి సంతోష్‌రావు గూఢచారి అని విమర్శిస్తూ ఆయన పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.సంతోష్‌రావు వల్లే గద్దర్‌లాంటి వాళ్లు ప్రగతిభవన్ గేట్ బయట ఉండాల్సి వచ్చిందని, ఈటల రాజేందర్‌ను బిఆర్‌ఎస్ సస్పెండ్‌కు కారణం కూడా ఆయనని ఆరోపించారు. ఉద్యమకారులను, పేద ప్రజలకు కేసీఆర్‌ను దూరం చేశారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి అనుకూలంగా కెటిఆర్, హరీష్ రావులు ట్వీట్‌లు పెట్టడాన్ని బిఆర్‌ఎస్ కేడర్ గమనించాలన్నారు. సిట్ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కవిత డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 27 Jan 2026 8:21 pm

Madaram |మేడారం జాత‌ర సంద‌ర్భంగా….

Madaram | మేడారం జాత‌ర సంద‌ర్భంగా…. Madaram | మేడారం, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 27 Jan 2026 8:16 pm

‘మున్సి’ పోల్స్‌లో కాంగ్రెస్-బిజెపి మధ్యే పోటీ: మహేష్‌కుమార్ గౌడ్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-బిజెపి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, బిఆర్‌ఎస్ పని ఖతం అయ్యిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాలపై ఏఐసిసి ముఖ్య నేతలతో చర్చించేందుకు సోమవారం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.రాష్ట్రంలో బిజెపి ఎన్ని పోరాటాలు చేసినా అధికారంలోకి రాలేదన్నారు. కర్నాటక, తెలంగాణలో బిజెపికి మనుగడ ఉండబోదని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ పని కూడా అయిపోయిందని, రకరకాల కేసులతో ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారని అన్నారు. ప్రజలు ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సోషల్ మీడియాను పట్టుకుని పాకులాడుతున్నారని ఆయన విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తమ పార్టీ సునాయసంగా కైవసం చేసుకుంటుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. బిసిలకు యాబైకి పైగా స్థానాల్లో టిక్కెట్లు ఇవ్వాలని వస్తున్న డిమాండ్ గురించి ప్రశ్నించగా, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు. నైనీ-కోల్ కుంభకోణం గురించి ప్రశ్నించగా, ఇదంతా మీడియా సృష్టేనని ఆయన దాట వేశారు. తాను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పుడు కూడా నైనీ-కోల్ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. నిజామాబాద్‌లో బిఆర్‌ఎస్ ఉనికి పూర్తిగా కోల్పోయిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్-బిజెపి మధ్యే పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని ఆయన చెప్పారు. అదేవిధంగా మహిళా అధ్యక్షురాలిని కూడా నియమించాల్సి ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత కొత్తగా పార్టీని స్థాపించి పోటీ చేసే ఆలోచనలో ఉందని అన్నారు. కాంగ్రెస్‌లో కవితను చేర్చుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా, ఆ ఆలోచన తమకు లేదన్నారు. తనకు ఉన్న సమాచారం మేరకు కవిత పార్టీ స్థాపించబోతున్నారని అన్నారు. --==--

మన తెలంగాణ 27 Jan 2026 8:08 pm

Warangal |ఇప్పగూడెం చింతగట్టు జాతరకు సర్వం సిద్ధం

Warangal | ఇప్పగూడెం చింతగట్టు జాతరకు సర్వం సిద్ధం Warangal | స్టేషన్

ప్రభ న్యూస్ 27 Jan 2026 8:05 pm

Temple |ఆధ్యాత్మిక దైవచింతన అలవర్చుకోవాలి

Temple | ఆధ్యాత్మిక దైవచింతన అలవర్చుకోవాలి Temple | ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:53 pm

Jana Sena’s Credibility Put to Test as Disturbing Allegations Rock the Party

Barely hours after the Jana Sena Party issued a firm statement calling for restraint and responsibility in public discourse, the party has been jolted by a controversy of its own. A fresh serious allegation against one of its MLAs has triggered sharp political reactions and uncomfortable questions. The accusations are against Arava Sreedhar, the sitting […] The post Jana Sena’s Credibility Put to Test as Disturbing Allegations Rock the Party appeared first on Telugu360 .

తెలుగు 360 27 Jan 2026 7:47 pm

MLA |రేపటి నుంచే మున్సిపల్ ‘నామినేషన్ల’ జాతర!

MLA | రేపటి నుంచే మున్సిపల్ ‘నామినేషన్ల’ జాతర! MLA | బెల్లంపల్లి

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:44 pm

Nominations |నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు ఏర్పాటు

Nominations | నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు ఏర్పాటు Nominations | భీమ్‌గల్‌

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:37 pm

Electricity |మేడారం జాతరకు విద్యుత్ శాఖ సర్వం సిద్ధం

Electricity | మేడారం జాతరకు విద్యుత్ శాఖ సర్వం సిద్ధం Electricity |

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:32 pm

Vijay Devarakonda |రణబాలి ఎలా ఉండబోతుందో తెలుసా..?

Vijay Devarakonda | రణబాలి ఎలా ఉండబోతుందో తెలుసా..? Vijay Devarakonda |

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:30 pm

Cricket |రాష్ట్రస్థాయి క్రికెట్ బహుమతుల ప్రధానోత్సవం

Cricket | రాష్ట్రస్థాయి క్రికెట్ బహుమతుల ప్రధానోత్సవం Cricket | దంతాలపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:22 pm

అత్యాచారం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తూ మేడ్చల్ ఒకటవ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్, మహేంద్ర నగర్ కాలనీకి చెందిన బిట్ల వెంకట్ సాయి (28)కి స్థానికంగా ఉంటున్న యువతిని నాలుగేళ్లు ప్రేమించాడు. వివాహం చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. జనవరి 30,2017న నిందితుడు యువతితో గొడవపెట్టుకుని వివాహం చేసుకోనని చెప్పాడు. దీంతో బాధితురాలు మూడు అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. యువతి తల్లి 2017 ఫిబ్రవరి 8 న బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు తనను లైంగికంగా వేధించడమే కాకుండా తన ఫోటోలు బయటపెడతానని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను హత్య చేస్తానని బెదిరించాడని పోలీసులకు తెలిపింది. దర్యాప్తు చేసిన పోలీసులు సాక్షాలను సేకరించి కోర్టుకు సమర్పించడంతో వాటిని పరిశీలించిన కుషాయిగూడలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఒకటవ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బి. తిరుపతి నిందితుడిని దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు.

మన తెలంగాణ 27 Jan 2026 7:21 pm

20th Ward |మౌనం వీడిన ‘బొర్రా’ కుటుంబం.. వైరా మున్సిపల్ ఎన్నికలో ఉమాదేవి ఎంట్రీ!

20th Ward | వైరా మున్సిపల్ ఎన్నికలో బొర్రా ఉమాదేవి దరఖాస్తుచైర్మన్ రేసులోకి

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:17 pm

water |శాశ్వత మంచినీటి సమస్య ప‌రిష్కారం…

water | శాశ్వత మంచినీటి సమస్య ప‌రిష్కారం… water | చిట్యాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:16 pm

మేడారంకు బయల్దేరిన పగిడిద్దరాజు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్కసారలమ్మ మహా జాతరలో తొలి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. వన దేవతల జాతర ప్రారంభానికి సంకేతంగా సమ్మక్క భర్త పగిడిద్ద రాజు మేడారం గద్దెనెక్కేందుకు ముస్తాయ్యారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ గ్రామంలో పగిడిద్దరాజును వరుడిగా అలంకరించేందుకు పెనక వంశీయులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. నేడు పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేయనున్నారు. పూనుగొండ్లనుంచి బయలుదేరిన పగిడిద్దరాజు సుమారు 70నుంచి 80 కిలోమీటర్ల అటవీమార్గంలో కాలినడకన బయలుదేరి మేడారం చేరుకోనున్నారు. పగిడిద్దరాజు మేడారం గద్దెపై కొలువు దీరిన వెంటనే మహా జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో వారంముందు నుంచే గ్రామమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పగిడిద్దరాజు ఆలయానికి రంగువేసి గద్దెను సుందరంగా అలంకరించారు. ఇళ్ల ముందు ముగ్గులు, తోరణాలతో గ్రామం నిండా భక్తి పరిమళం వెల్లివిరుస్తోంది. పగిడిద్దరాజు గద్దెనెక్కిన తరువాతే జాతర జోరు పగిడిద్దరాజు మేడారం గద్దెపై కొలువు దీరిన వెంటనే మహా జారతకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లవుతుంది. ఆయన గద్దెనెక్కిన తరువాతే జాతర జోరు పెరుగుతుంది. అనంతరం సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చే ఘట్టం జరుగుతుంది. ఈవిధంగా వన దేవతల జాతర కీలక మలుపు పగిడిద్దరాజుతోనే ప్రారంభమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ధనసరి అనసూయ మేడారం బయలుదేరనున్న పగిడిద్దరాజు బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెలకు చేరే సమయానికి పగిడిద్దరాజు కొలువుదీరనున్నారు. ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలకు మంత్రి సీతక్క డోలు, సన్నాయి వాయిద్యాల మధ్య మహిళలతో నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేసి నూతన వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ రేగ కల్యాణి, మేడారం ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఇర్ప సుకన్య, స్టేట్ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, కొత్తగూడ, గంగారం మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, పలు గ్రామాల సర్పంచులు, మండల నాయకులు పూజారులు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 27 Jan 2026 7:16 pm

బెంగళూరులో హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్‌పో 2026

హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్‌పో 2026 ఎడిషన్ అక్టోబర్ 1 నుంచి 3 వరకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (BIEC) లో నిర్వహించబడుతుంది. ఈసారి ఎక్స్‌పో పరిధి మరింత విస్తరించనుండగా, భారతదేశంలోని విస్తృత వ్యవసాయ రంగంతో మరింత ప్రత్యక్షంగా అనుసంధానమయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ట్రేడ్ ఫెయిర్‌ను మెస్సే మ్యూనిచెన్ ఇండియా, బెంగళూరులో ఉన్న హార్టీకనెక్ట్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంగా సహ-ఆయోజనం చేస్తుంది. ప్రారంభంలో అంతర్జాతీయ స్థాయి ఉద్యానవన కేంద్రిత ట్రేడ్ ఫెయిర్‌గా స్థాపితమైన హార్టీకనెక్ట్ ఇండియా, ఇప్పుడు పంట రంగాల మధ్య పెరుగుతున్న సమన్వయాన్ని ప్రతిబింబిస్తోంది. నిర్వాహకుల ప్రకారం, రక్షిత సాగు వ్యవస్థలు, ప్రిసిషన్ నీటిపారుదల, వాతావరణాన్ని తట్టుకునే ఇన్‌పుట్లు మరియు పంటతర్వాత మౌలిక సదుపాయాలు వంటి సాంకేతికతలు మొదట ఉద్యానవనంలో వినియోగించబడ్డాయి; ఇప్పుడు అవే ఫీల్డ్ క్రాప్స్ మరియు మిశ్రమ వ్యవసాయ విధానాల్లో కూడా విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. మెస్సే మ్యూనిచెన్ ఇండియా సీఈఓ మరియు మెస్సే మ్యూనిచెన్ అధ్యక్షుడు (భారత్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా) భూపిందర్ సింగ్ అన్నారు.“ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన వ్యవస్థను ప్రాంతీయ బలాలతో అనుసంధానిస్తుంది. కర్ణాటక మరియు దక్షిణ భారతదేశం ఫ్లోరికల్చర్, ప్రిసిషన్ ఫార్మింగ్ మరియు ఎగుమతుల కోసం ఉత్పత్తిలో ఉద్యానవన వ్యాపారానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. హార్టీకనెక్ట్ ఈ బలాల ఆధారంగా వ్యాపారానికి కొత్త అవకాశాలు ఏర్పడే వేదికను అందిస్తుంది.” హార్టీకనెక్ట్ గ్లోబల్ సభ్యుడు మరియు ఫ్లోరెన్స్ ఫ్లోరా చైర్మన్ ఎస్.కే. గుట్గుటియా అన్నారు..“రంగం ఎలా అభివృద్ధి చెందుతోందో దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. ఉద్యానవనంలో ముందుగా స్వీకరించిన ఆధునిక సాంకేతికతలు ఇప్పుడు మొత్తం వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి, ఆ మార్పునే ఈ ప్రదర్శన ప్రతిబింబిస్తుంది.” 2026 ఎడిషన్‌లో రక్షిత సాగు, స్మార్ట్ నీటిపారుదల, వాతావరణాన్ని తట్టుకునే ఇన్‌పుట్లు మరియు పంటతర్వాత నిర్వహణ వంటి ప్రధాన అభివృద్ధి రంగాలపై దృష్టి ఉంటుంది. ఇవి దేశీయ సరఫరా గొలుసు మరియు వ్యవసాయ ఎగుమతుల రెండింటికీ ఎంతో కీలకమైనవి.

మన తెలంగాణ 27 Jan 2026 7:10 pm

Drugs |డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడ‌దాం….

Drugs | డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడ‌దాం…. Drugs | కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:06 pm

దివ్యాంగుల సంక్షేమానికి వంద కోట్లు వెచ్చించాం: భట్టి విక్రమార్క

దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం పదేళ్ళలో చేయలేని పనులని, ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే చేసిందని, అందులో భాగంగానే ఈ రెండేళ్లలో దివ్యాంగుల కోసం 100 కోట్ల రూపాయలు వెచ్చించిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బుధవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చదువుకుంటున్న దివ్యాంగులకు ఐపాడ్లు, కంప్యూటర్లు ట్యాబ్స్ ప్రజా ప్రభుత్వం అందిస్తోందన్నారు. తమది ప్రజల గురించి ఆలోచన చేసే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వమన్నారు. దివ్యాంగులకు ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామని, వారికి అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందన్నారు. దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారిని కూడా సమాజంలో మనతోపాటు ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దివ్యాంగుల గురించి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. దివ్యాంగులు కూడా అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. సమాజంలో ఇతరులకన్నా ఎక్కువ అవకాశాలను, ఆసరాను దివ్యాంగులకు మనం అందించాలన్నారు. అంగవైకల్యంతో ఉన్నామన్న బాధ వారికి రాకుండా వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఈ ఆలోచన దిశగానే ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా పి. శ్రీజ, ఇర్రిగేషన్ ఎస్‌ఇ వాసంతి, విద్యుత్ ఎస్‌ఇ శ్రీనివాస చారి, ఆర్ అండ్ ఎస్‌ఇ యాకుబ్, జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారావు, వ్యవసాయ శాఖ ఏడి విజయ చందర్, మధిర తహసీల్దార్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 27 Jan 2026 7:06 pm

భారతదేశం- ఈయూ మధ్య మదర్ ఆప్ ఆల్ డీల్స్

ఇరోపియన్ యూనియన్ మంగళవారం గొప్ప స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం చుట్టాయి. దీనిని అన్ని ఒప్పందాల తల్లిగా ఉభయపక్షాల నేతలు అభివర్ణించారు.ప్రధాని నరేంద్రమోదీ, యురోపియన్ యూనియన్ అగ్ర నాయకత్వం కల్లోల ప్రపంచ క్రమంలో భారతదేశం, ఇయు మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు విసృ్తత రంగాలకు విస్తరించే వాణిజ్యం, రక్షణ పరమైన ఎజెండాతో కూడిన ఒప్పందాన్ని ఆవిష్కరించారు.ప్రధాని నరేంద్రమోదీ ఈయు నాయకులు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆంటోనియో కోస్టాలకు శిఖరాగ్రసమావేశాలకు చక్కటి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇరు పక్షాలనేతలు రెండు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఒకటి భద్రత, రక్షణ పరమైన ఒప్పందం కాగా, మరొకటి యురోపియన్ యూనియన్ దేశాలలో భారతీయ సాంకేతిక ప్రతిభ విస్తరణకు సంబంధించినది. నియమాల ఆధారంగా గొప్ప దార్శనికతతో కూడిన ఒప్పందం ఇది.భారతదేశం, 27 దేశాల కూటమి రానున్న ఐదేళ్లలో ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక ఎజెండా అమలుకు సిద్ధమయ్యాయి. సమగ్ర వాణిజ్య ఒప్పందం చర్చల ముగింపు నేపథ్యంలో 13 కీలక ఒప్పందాలను ధ్రువీకరించాయి. ప్రధాని మోదీ తన ప్రారంభోపన్యాసంలో ప్రపంచ వ్యవస్థ గొప్పగందరగోళంలో ఉన్న సందర్భంలో భారతదేశం, ఇయూ మధ్య భాగస్వామ్యం అంతర్జాతీయ వ్యవస్థ స్థిరీకరణకు, బలోపేతానికి దోహదపడుతుందని అన్నారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా ఒప్పందం సాకారమైందని ఆయన అన్నారు. భారతీయ రైతులు, చిన్నపరిశ్రమలకు యురోపియన్ మార్కెట్ అందుబాటులో ఉండేలా ఇది వీలుకల్పిస్తుంది, తయారీ, సేవా రంగాలలో కొత్త అవకాశాలు సృష్టిస్తుందని మోదీ ఒక మీడియా ప్రకటనలో తెలిపారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశం, యురోపియన్ యూనియన్ మధ్య పెట్టుబడులు పెంచడంతో పాటు కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు సృష్టిస్తుందని మోదీ అన్నారు. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు.. ఇరు పక్షాల పురోభివృద్ధికి కొత్త బ్లూప్రింట్ అన్నారు మోదీ. ఇరుపక్షాలు చర్చలు ప్రారంభించిన 18 ఏళ్ల తర్వాత సమగ్ర వాణిజ్య ఒప్పందం రూపుదిద్దుకుంది. విపులంగా చర్చల అనంతరం ఇరు పక్షాలు ధృవీకరించిన అనంతరం అధికారికంగా ఒప్పందంపై సంతకాలకు కనీసం మరో ఆరు నెలలు పట్టవచ్చు. మెగా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యురోపియన్ యూనియన్ అధ్యక్షురాలు వాన్ డెర్ లేయన్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశం,ఇయు భాగస్వామ్యం ప్రపంచ సవాళ్లకు దీటైన సమాధానాన్ని బలమైన సందేశాన్ని పంపుతుందని ఆమె ఆకాంక్షించారు. యూరప్, అమెరికా మధ్య సంబంధాలలో పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయన్నారు. భారతదేశం, ఇయు - మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ - సాధించాయి. ఈ మెగా ఒప్పందంతో 200 కోట్ల ప్రజల మార్కెట్ ను సృష్టిస్తున్నాం అని ఆమె అన్నారు. ఇది రెండు ప్రపంచ దిగ్గజాలు రచించిన కథ. ప్రపంచంలో రెండో, నాల్గో అతి పెద్ద ఆర్థికవ్యవస్థలు - విన్ -విన్ - పద్ధతిలో భాగస్వామ్యాన్ని ఎంచుకుని, ప్రపంచానికి ఇస్తున్న బలమైన సందేశం ఇది అని వాన్ డెర్ లేయన్ అన్నారు. ఇయు,ఒక కూటమిగా భారతీయ ఉత్పత్తులకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25లో ఇరు పక్షాల మధ్య వాణిజ్యం 136 బిలియన్ అమెరికా డాలర్లమేరకు జరిగింది. దీనిలో ఎగుమతులు 76 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 60 బిలియన్ డాలర్లు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టిఏ) వల్ల భారతీయ నైపుణ్యాలు, సేవలు, యూరప్ సాంకేతికత, మూలధనం ఆవిష్కరణలతో ఎంతో రెట్లు వాణిజ్యం పెరుగుతుందన్నారు.వాణిజ్యం ఎన్నోరెట్లు పెరిగే క్రమంలో ఇయు వ్యూహాత్మకంగా ఇతరులపై ఆధారపడడం తగ్గిస్తామని, పరోక్షంగా అమెరికా , ట్రంప్ సుంకాలను, పాలనా విధానాలను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. రక్షణ భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, యూరప్, భారతదేశం ఒకదానికొకటి నమ్మకమైన భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమెచెప్పారు.ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్యాలు మొట్టమొదటి భద్రత, రక్షణ భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి అని ఆమె ప్రకటించారు.యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు కోస్టా తన వ్యాఖ్యలలో రెండు పక్షాలు సంతకాలు చేసి కీలక ఒప్పందాలు నియమాలు ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేస్తాయన్నారు. మంగళవారం కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగి ఉందని అన్నారు. భవిష్యత్ లో యురోపియన్ యూనియన్, భారతదేశాలు పరస్పర శ్రేయస్సు కోసం కృషి చేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ప్రపంచ సమస్యలపై సమగ్ర చర్చ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా ఉక్రెయిన్, పశ్చిమాసియా, ఇండో - ఫసిఫిక్ పరిస్థితితో సహా అనేక ప్రపంచ సమస్యలపై ఉరు పక్షాలు వివరంగా చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతర్జాతీయ నిబంధనల పట్ల గౌరవం తమ ఉమ్మడి ప్రాధాన్యత అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ సంస్థల సంస్కరణలు అవసరమని ఏకగ్రీవంగా తాము అంగీకరించినట్లు మోదీ తెలిపారు. ఉక్రెయిన్ పై యూరప్ దీర్ఘకాల వైఖరిని యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు పునరుద్ఘాటించారు.

మన తెలంగాణ 27 Jan 2026 6:58 pm

Yadadri |జేఏసీ జిల్లా అధ్యక్షునిగా గోపినాధ్

Yadadri | జేఏసీ జిల్లా అధ్యక్షునిగా గోపినాధ్ Yadadri | మోత్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:54 pm

Video : Sri Chidambaram Garu Movie Team Interview

The post Video : Sri Chidambaram Garu Movie Team Interview appeared first on Telugu360 .

తెలుగు 360 27 Jan 2026 6:51 pm

students |విద్యార్థులకు ట్రాక్ సూట్స్ అందజేత…

students | విద్యార్థులకు ట్రాక్ సూట్స్ అందజేత… students | జన్నారం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:47 pm

నగరంలో బ్యాంక్‌లు బంద్.. ఇబ్బంది పడ్డ ఖాతాదారులు

దేశ వ్యాప్త బ్యాంక్ సమ్మెల్లో భాగంలో నగరంలోని పలు బ్యాంకులు మూత పడ్డాయి. వారానికి 5 రోజులు పని వేతనాల పెంపు, పెన్షన్ సంస్కరణలు, 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం పూర్తిగా అమలు కావాలని వారు బ్యాంక్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణకు నిరసగనగా ఆటోమిషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై వస్తున్న ముప్పు, పని ఒత్తిడి తగ్గించాలని ,మెరుగైన వర్కింగ్ కండిషన్స్ ఉండాలని సిబ్బంది కొరత తీర్చాలని, పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్దరించడ లేదా మెరుగైన పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. బ్యాంక్‌ల సమ్మె కారణంగా ఖాతాదారులు ఇబ్బంది పడినప్పటికి ఏటిఎం, యుపిఐ వంటి సాధారణ సేవలుపని చేశాయి. కానీ కౌంటర్ సేవలు ( క్యాష్ డిపాజిట్, విత్‌డ్రా ,డ్రాఫ్ట్‌లు, లోన్ ప్రాసెసింగ్)లు మాత్రం జరగలేదు. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వ్యాపారులు, పెన్షన్ దారులు, విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు.

మన తెలంగాణ 27 Jan 2026 6:44 pm

workers |గ్రామ పంచాయతీ కార్మికులకు దుస్తుల‌ పంపిణీ…

workers | గ్రామ పంచాయతీ కార్మికులకు దుస్తుల‌ పంపిణీ… workers | వాంకిడి,

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:35 pm

Nominations |రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ

Nominations | రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ Nominations | మోత్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:21 pm

Madaram |సమ్మక్క తల్లి అంగరక్షకురాలు గట్టమ్మ తల్లి

Madaram | సమ్మక్క తల్లి అంగరక్షకురాలు గట్టమ్మ తల్లి Madaram | మేడారం

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:15 pm

చిన్నారిపై వీధికుక్క దాడి.. ముఖంపై గాయాలు

హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని శ్రీనివాస్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో మల్లికార్జున్, రేవతిల కుమార్తె శార్వి (4) ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు చిన్నారిని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని కాకపోతే శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో నమోదయ్యాయి. 

మన తెలంగాణ 27 Jan 2026 6:11 pm

ఏపీలో ఉద్యమానికి శ్రీకారం : వైఎస్ షర్మిల

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి భేటీ అయ్యారు.

తెలుగు పోస్ట్ 27 Jan 2026 6:09 pm

Development |మురికి కాలువను జేసీబీతో తొలగింపు

Development | మురికి కాలువను జేసీబీతో తొలగింపు Development | రెంజల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:08 pm

TG |పీడీఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా….

TG | పీడీఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా…. TG |ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:00 pm

Rudrur |డిఎంహెచ్వో ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ…

Rudrur | డిఎంహెచ్వో ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ… Rudrur | రుద్రూర్,

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:58 pm

Award |ఉత్తమ అవార్డు గ్రహీతకు సన్మానం…

Award | ఉత్తమ అవార్డు గ్రహీతకు సన్మానం… Award | జైనూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:56 pm

Diarrhea |డయేరియా కేసులు కలక‌లం…

Diarrhea | డయేరియా కేసులు కలక‌లం… Diarrhea | మోతె, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:52 pm

AP |సిక్కోలు బృందానికి డిల్లీలో సన్మానం…

AP | సిక్కోలు బృందానికి డిల్లీలో సన్మానం… AP | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:48 pm

Adilabad |నూతన ఎస్ ఐ, ఏఎస్ ఐలకు సన్మానం…

Adilabad | నూతన ఎస్ ఐ, ఏఎస్ ఐలకు సన్మానం… Adilabad |

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:46 pm

TG |మంచిర్యాల మున్సిపల్ కురుక్షేత్రం..

TG | మంచిర్యాల మున్సిపల్ కురుక్షేత్రం.. TG | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:45 pm

అలరించిన అన్నమాచార్య కీర్తనలు

విశాలాంధ్ర ధర్మవరం; పుట్టపర్తి లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ , రామలాలిత్యా వారి శిష్య బృందం కలిసి అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. వీరితోపాటు శిష్యులు లీలా, ముత్యభావన, లాస్య, ధ్రువ శ్రీ వారు కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు. వీటిని తినిపించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ పిల్లలకు బహుమతులతో పాటు గురువులను ఘనంగా […] The post అలరించిన అన్నమాచార్య కీర్తనలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 5:38 pm

49 బంతుల్లో శతకం.. విండీస్ క్రికెటర్ విధ్వంసం..

వరల్డ్ లెజండ్స్ ప్రొ టి-20 లీగ్ ఘనంగా ప్రారంభమైంది. భారత్‌లో ఈ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ప్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్‌గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పుఱె పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి. కాగా, ఈ లీగ్‌లో 10 రోజుల పాటు 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. లీగ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్ తలపడ్డాయి. ప్రారంభ మ్యాచ్‌లో విండీస్ విధ్వంసకర ఆటగాడు చాడ్విక్ వాల్టన్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని వారియర్స్ జట్టు సునాయాసంగా చేధించింది. వాల్టన్ 62 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సులతో 128 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో 16.3 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచింది.

మన తెలంగాణ 27 Jan 2026 5:33 pm

Municipal Elections Set the Political Pulse Racing in Telangana

The State Election Commission has announced the schedule for elections to seven municipal corporations and 116 municipalities across the state. With this announcement, the Model Code of Conduct has come into effect. State Election Commissioner Rani Kumudini held a detailed review meeting with district collectors, SPs, and police commissioners to assess preparedness. Soon after the […] The post Municipal Elections Set the Political Pulse Racing in Telangana appeared first on Telugu360 .

తెలుగు 360 27 Jan 2026 5:29 pm

పవన్ తనయుడు అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట

పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌పై డీప్‌ఫేక్ సినిమాఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన అనుమతి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో రూపొందించిన డీప్‌ఫేక్ సినిమాపై అకీరా దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం స్టే విధించింది. ఈ సినిమాను వెంటనే అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.తన పేరు, ఫొటోలు, స్వరం, వ్యక్తిత్వాన్ని వాడుకుని […] The post పవన్ తనయుడు అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 5:29 pm

TG |పరకాల మున్సిపాలిటీకి చేరిన పోలింగ్ బాక్స్

TG | పరకాల మున్సిపాలిటీకి చేరిన పోలింగ్ బాక్స్ TG | పరకాల,

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:28 pm