SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

... ...View News by News Source

6,6,6,6,6,6.. మంత్రి గారి బౌలింగ్‌‌లో సిక్సర్ల మోత మోగించిన పాక్ బ్యాటర్

మంత్రి గారు బౌలింగ్ చేస్తున్నారంటే ఎవరైనా ఆచితూచి ఆడతారు. కానీ పాకిస్థాన్ బ్యాటర్ మాత్రం స్పోర్ట్స్ మినిస్టర్ బౌలింగ్‌లో చెడుగుడు ఆడుకున్నాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాది సత్తా చాటాడు. అలాగనీ ఆ స్పోర్ట్స్ మినిస్టర్‌కు బౌలింగ్ రాదనుకోకండి. అతడు పాకిస్థాన్ తరఫున రెండు వరల్డ్ కప్‌లలో ఆడిన పేసర్. ఆ బౌలర్ పేరు వహాబ్ రియాజ్ కాగా... సిక్స్‌ల మోత మోగించిన ఆ బ్యాటర్ ఇఫ్తిఖార్ అహ్మద్.

సమయం 5 Feb 2023 9:30 pm

50 ఏళ్లొచ్చినా మారని తీరు.. వినోద్ కాంబ్లీపై కేసు పెట్టిన భార్య.. మాజీ క్రికెటర్‌కు నోటీసులు

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కాంబ్లీ తనను తిట్టాడని, కొట్టాడని ఆరోపిస్తూ అతడి భార్య ఆండ్రియా ముంబైలోని బాంద్రా పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. ఆమె ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కాంబ్లీకి నోటీసులు జారీ చేశారు. స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని సూచించారు. తనకు బీసీసీఐ ఇచ్చే పెన్షన్ సరిపోవడం లేదని.. తనకు కోచ్ ఉద్యోగం కావాలని ఆ మధ్య కాంబ్లీ ముంబై క్రికెట్ సంఘాన్ని కోరాడు.

సమయం 5 Feb 2023 5:23 pm

IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురు దెబ్బ.. కీలక పేసర్ ఔట్..!

భారత్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుగా గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే మిచెల్ స్టార్క్ తొలి టెస్టుకు దూరంగా కాగా.. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సైతం నాగ్‌పూర్ టెస్టుకు దూరం కానున్న సంగతి తెలిసిందే. పేసర్ జోష్ హేజిల్‌వుడ్ సైతం బోర్డర గావస్కర్ ట్రోఫీలోని తొలి రెండు టెస్టులకు దూరం కానున్నాడని తెలుస్తోంది. దీంతో హేజిల్‌వుడ్ స్థానంలో బోలాండ్ బరిలోకి దిగనున్నాడు. భారత్, ఆసీస్ మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది.

సమయం 5 Feb 2023 2:44 pm

షాహిద్ అఫ్రిది కుమార్తెతో పేసర్ షాహీన్ అఫ్రిది వివాహం.. ‘కూతురు’ గురించి ఎమోషనల్ పోస్టు

Shaheen Shah Afridi Marriage: పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది వివాహం మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కుమార్తెతో జరిగింది. కరాచీలో జరిగిన ఈ వివాహ వేడుకలో క్రికెటర్లు మెరిశారు. పెళ్లి అనంతరం షాహిద్ అఫ్రిది తన కుమార్తె గురించి భావోద్వేగ ట్వీట్ చేశాడు. షాహిద్ అఫ్రిది.. షాహీన్‌తో తన కూతురు వివాహాన్ని గత ఏడాదే ప్రకటించాడు. షాహీన్ స్వయానా షాహిద్ అఫ్రిది మేనల్లుడే కావడం గమనార్హం. కొత్త జంట #AnShaheen ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది.

సమయం 4 Feb 2023 5:42 pm

రంజీలో ముగిసిన ఆంధ్రా పోరాటం.. లక్ కలిసొచ్చినా.. క్వార్టర్స్‌లో ఓటమితో ఇంటి ముఖం

రంజీ ట్రోఫీలో ఆంధ్రా పోరాటం ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడటంతోపాటు మంచి ఆధిక్యం సాధించిన ఆంధ్రా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓటమి పాలైంది. హనుమ విహారీకి మణికట్టు ఫ్రాక్చర్ కావడం జట్టును దెబ్బతీసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆంధ్రా 93 పరుగులకే ఆలౌట్ కాగా.. మొదటి ఇన్నింగ్స్‌లో 151 పరుగులు తక్కువ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 245 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.

సమయం 3 Feb 2023 10:34 pm

IND vs AUS: భారత్‌పై గెలుపే లక్ష్యంగా.. ‘డుప్లికేట్ అశ్విన్‌’ బౌలింగ్‌లో ఆసీస్ బ్యాటర్ల ప్రాక్టీస్

IND vs AUS: 2004 నుంచి భారత గడ్డ మీద టెస్ట్ సిరీస్ గెలవలేకపోయిన ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా బోర్డర్ గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఏ ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకోవద్దని భావిస్తోంది. బెంగళూరులో ప్రాక్టీస్ కోసం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లను రూపొందించడంతోపాటు రవిచంద్రన్ అశ్విన్ రూపంలో ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడం కోసం అతడి డూప్లికేట్ మహీశ్ పిథియా బౌలింగ్‌లో సాధన చేస్తోంది.

సమయం 3 Feb 2023 8:12 pm

భారత్‌తో తొలి టెస్టుకు ముందు ఆసీస్‌కు షాక్

భారత్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ నాగ్‌పూర్ టెస్టుకు దూరం కానున్నాడు. దీంతో ఆసీస్‌ అదనపు బౌలింగ్ ఆప్షన్‌ను కోల్పోనుంది. గ్రీన్ ఒకవేళ ఆడినా బౌలింగ్ చేసే అవకాశం లేదు. సౌతాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో గాయపడిన గ్రీన్ ఇంకా కోలేకోలేదు.

సమయం 3 Feb 2023 2:45 pm

మళ్లీ వస్తున్నా.. దినేశ్ కార్తీక్ ఆసక్తికర ట్వీట్

టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ గురువారం ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు మ్యాచ్ ఆడాను.. మళ్లీ ఇదే జరుగుతోంది అంటూ నర్మగర్భంగా ట్వీట్ చేశాడు. దీంతో కార్తీక్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో కామెంటేటర్‌గా పని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

సమయం 2 Feb 2023 9:39 pm

‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’.. హైదరాబాద్ క్రికెటర్‌పై రవీంద్ర జడేజా ప్రశంసలు!

టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా హైదరాబాద్ యువ క్రికెటర్‌పై ప్రశంసలు గుప్పించాడు. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటూ తిలక్ వర్మను ఆకాశానికెత్తాడు. గత ఐపీఎల్ సీజన్లో ముంబై తరఫున ఆడిన తిలక్ సత్తా చాటిన సంగతి తెలిసిందే.

సమయం 2 Feb 2023 6:11 pm

కోహ్లి వారసుడు దొరికేశాడు.. విరాట్‌ను తలపిస్తోన్న యువ క్రికెటర్!

భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే మూడు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ చేసిన గిల్.. మూడు ఫార్మాట్లలోనూ శతకం బాదిన ఐదో భారత క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకూ రైనా, రోహిత్, రాహుల్, కోహ్లి మాత్రమే మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేశారు. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా గిల్ నిలిచాడు.

సమయం 2 Feb 2023 1:42 pm

గిల్ అజేయ శతకం.. సత్తా చాటిన హార్దిక్.. భారత్ చరిత్రలోనే అతిపెద్ద విజయం

సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20లో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్ శుభ్‌మన్ గిల్ అజేయ శతకానికి.. హార్దిక్ పాండ్య కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన తోడు కావడంతో 166 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌కు టీ20ల్లో పరుగుల పరంగా ఇదే భారీ విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కివీస్ బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు.

సమయం 1 Feb 2023 10:22 pm

శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ సెంచరీ.. నిర్ణాయక టీ20లో భారత్ భారీ స్కోరు

India Vs New Zealand 3rd T20: సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్లు చెలరేగి ఆడారు. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం ఉంచారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేశారు.

సమయం 1 Feb 2023 8:45 pm

సూర్య గోల్డెన్ ఛాన్స్‌కు గిల్ అడ్డు తగులుతున్నాడా..?

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో సూర్య, గిల్‌లలో ఒకరిని ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది.

సమయం 1 Feb 2023 4:35 pm

హ్యాట్సాఫ్ హనుమ విహారీ.. మణికట్టు ఫ్రాక్చరైనా ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసిన ఆంధ్రా కెప్టెన్

ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారీ మరోసారి తెగువను ప్రదర్శించాడు. రంజీ క్వార్టర్స్ తొలి రోజు అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో మణికట్టు ఫ్రాక్చర్ కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విహారీ.. రెండో రోజు చివరి బ్యాటర్‌గా క్రీజ్‌లోకి వచ్చాడు. ఎడమ చేతి మణికట్టు ఫ్రాక్చర్ కారణంగా ఆ చేత్తో బ్యాటును పట్టుకోలేకపోవడంతో లెఫ్ట్ హ్యాండర్‌గా మారిన ఆంధ్రా కెప్టెన్ .. కుడి చేత్తోనే బ్యాటింగ్ చేసి మధ్యప్రదేశ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.

సమయం 1 Feb 2023 2:45 pm

సెంచరీతో అదరగొట్టిన రిక్కీ భుయ్.. రంజీ క్వార్టర్ ఫైనల్లో పటిష్ట స్థితిలో ఆంధ్రా

రంజీ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రా జట్టు అదరగొడుతోంది. 58 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ హనుమ విహారి మణికట్టు గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినప్పటికీ.. రిక్కీ భుయ్, కరణ్ షిండే అదరగొట్టే ప్రదర్శనతో ఆంధ్రా పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. రిక్కీ భుయ్ శతకంతో అజేయంగా నిలవగా.. షిండే సెంచరీకి కొద్ది దూరంలో నిలిచాడు.

సమయం 31 Jan 2023 7:26 pm

Ranji Trophy: 9వ స్థానంలో వచ్చి సెంచరీ.. రికార్డ్ క్రియేట్ చేసిన సౌరాష్ట్ర క్రికెటర్

Parth Bhut: రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనద్కత్, ఛతేశ్వర్ పుజారా లాంటి సీనియర్లు లేకుండా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో పంజాబ్‌తో తలపడుతోన్న సౌరాష్ట్ర 147 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పార్థ్ భుయ్ అజేయ శతకం బాదడంతో కోలుకున్న సౌరాష్ట్ర 303 పరుగులు చేయగలిగింది. టాప్-8 బ్యాటర్లు 147 రన్స్ చేేయగా.. చివరి వరుస ముగ్గురు బ్యాటర్లు 156 రన్స్ జోడించడం గమనార్హం.

సమయం 31 Jan 2023 5:35 pm

పీక్స్‌కు చేరిన పాకిస్థాన్ క్రియేటివిటీ.. ప్రపంచంలోనే తొలి ‘ఆన్‌లైన్’ హెడ్ కోచ్‌‌..!

ఆన్‌లైన్ మీటింగ్‌ల గురించి విని ఉంటారు.. ఆన్‌లైన్ క్లాసుల గురించి విని ఉంటారు.. ఆన్‌లైన్ పెళ్లిళ్ల గురించి కూడా విని ఉంటారు. మరీ ఎప్పుడైనా ఆన్‌లైన్ హెడ్ కోచ్ గురించి విన్నారా..? అది కూడా ఓ జాతీయ జట్టుకి..? ఆన్‌లైన్ కోచ్ ఏంటి బాబు అనుకుంటున్నారా..? ప్రపంచ క్రికెట్లో ఇలాంటి ఆలోచన రావడం బహుశా ఇదే తొలిసారేమో. మీకు మాత్రం ఎలా తెలుస్తుంది లేండీ. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇలాంటి వింత ఆలోచనల్లో ఉంది.

సమయం 30 Jan 2023 10:12 pm

Gongadi Trisha: కూతురి ఆట కోసం.. నాలుగెకరాల పొలం, జిమ్‌ అమ్మేసిన త్రిష తండ్రి

Gongadi Trisha: భారత అండర్-19 జట్టు తరఫున టీ20 వరల్డ్ కప్ ఆడిన తెలుగమ్మాయి గొంగడి త్రిష. తన కూతుర్ని క్రికెటర్‌గా తీర్చిదిద్దడం కోసం త్రిష తండ్రి రామిరెడ్డి ఎంతో కష్టపడ్డారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకున్నారు. తన ఉద్యోగాన్ని వదిలేసి.. ఆస్తులు అమ్ముకొని సొంతూరైన భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. తండ్రి తన కోసం చేసిన త్యాగాలను మరిపిస్తూ.. టీ20 వరల్డ్ కప్‌లో త్రిష సత్తా చాటింది.

సమయం 30 Jan 2023 8:12 pm

Murali Vijay: రిటైర్మెంట్ ప్రకటించిన మురళీ విజయ్.. టెస్టుల్లో ఓవర్సీస్ హీరో..!

భారత వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విజయ్.. తనకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌లకు ధన్యవాదాలు తెలిపాడు. 2008లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన విజయ్.. చివరి టెస్టును ఆ దేశంపైనే ఆడటం గమనార్హం. 61 టెస్టులు ఆడిన విజయ్ 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 3982 రన్స్ చేశాడు.

సమయం 30 Jan 2023 5:12 pm

ఇంగ్లాండ్‌ను నేలకు దింపిన సౌతాఫ్రికా.. డూ ఆర్ డై సిరీస్‌‌లో అదరగొట్టిన సఫారీలు..!

వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే ప్రతి మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న దక్షిణాఫ్రికా.. 2019 వన్డే వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌ను ఓడించిన సఫారీ జట్టు మూడో మ్యాచ్‌లోనూ ఓడిస్తే.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతోపాటు.. వరల్డ్ కప్ డైరెక్ట్ క్వాలిఫికేషన్‌ దిశగా ముందడుగేస్తుంది. రెండో వన్డేలో ఇంగ్లాండ్ 342 పరుగులు చేసిప్పటికీ.. సౌతాఫ్రికా అలవోకగా లక్ష్యాన్ని చేధించడం గమనార్హం.

సమయం 30 Jan 2023 4:15 pm

అండర్ 19 వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ నజరానా.. ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో..

U19 అమ్మాయిల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సత్తా చాటింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆరంభ టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ‘స్పెషల్ విక్టరీ’ సాధించిన భారత అమ్మాయిలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. విశ్వవిజేతగా నిలిచిన షఫాలీ వర్మ సేనకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. రూ.5 కోట్ల నగదు బహుమానాన్ని అందిస్తామని తెలిపింది.

సమయం 30 Jan 2023 3:02 pm

లక్నో స్టేడియంలో లో స్కోరింగ్ థ్రిల్లర్‌.. భారత్‌ను గెలిపించిన సూర్య, హార్దిక్

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లో స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.5వ ఓవర్లో విజయం సాధించింది. స్పిన్నర్లకు సహకరించిన పిచ్ మీద ఇరు జట్ల బ్యాటర్లు పరుగులు చేయడానికి చెమటోడ్చారు. సూర్య ఈ మ్యాచ్‌లో ఒకే ఒక బౌండరీ బాదడం విశేషం.

సమయం 29 Jan 2023 10:43 pm

U19 టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత అమ్మాయిలు.. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై ఘన విజయం..

వరల్డ్ కప్ గెలవాలన్న బీసీసీఐ కలను భారత అమ్మాయిలు నెరవేర్చారు. తొలిసారి నిర్వహిస్తోన్న అండర్ 19 అమ్మాయిల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. టాస్ గెలిచిన కెప్టెన్ షఫాలీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ 68 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.1 ఓవర్లో లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకుంది.

సమయం 29 Jan 2023 7:46 pm

Lucknow T20I: టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్.. భారత జట్టులో ఒక మార్పు

లక్నో టీ20లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ గ్రౌండ్‌లో ఇంతకు ముందు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడంతో శాంట్నర్ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. రాంచీ టీ20లో ఆడిన జట్టుతోనే న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతోంది. మరోవైపు భారత్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ను భారత్ బరిలోకి దింపుతోంది.

సమయం 29 Jan 2023 6:49 pm

ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం

Australia Open విజేతగా సెర్బియా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ నిలిచాడు. ఫైనల్లో స్టెఫనోస్ సిట్సిపాస్‌ను 6-3, 7-6, 7-6 తేడాతో ఓడించాడు. దీంతో పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా నాదల్ రికార్డును సమం చేశాడు.

సమయం 29 Jan 2023 5:49 pm

‘మూడేళ్లలో తొలి సెంచరీ’.. బ్రాడ్ కాస్టర్‌పై రోహిత్ ఆగ్రహం.. కెప్టెన్‌కు అండగా అశ్విన్

ఇటీవల న్యూజిలాండ్‌పై రోహిత్ శర్మ సెంచరీ చేశాక అతడి అభిమానులు సంబరాలు చేసుకోగా.. బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మాత్రం.. మూడేళ్లలో హిట్ మ్యాన్‌కు ఇదే తొలి సెంచరీ అంటూ గణాంకాలను బయటపెట్టింది. ఈ విషయమై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మూడేళ్లలో తొలి సెంచరీ అని చెప్పారు గానీ.. ఈ మూడేళ్లలో తాను ఆడింది 12 వన్డేలు అనే విషయాన్ని ఎందుకు చెప్పలేదంటూ బ్రాడ్ కాస్టర్ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.

సమయం 29 Jan 2023 3:09 pm

IND W vs ENG W: వరల్డ్ కప్ ట్రోఫీకి అడుగు దూరంలో అమ్మాయిలు.. ఇంగ్లాండ్‌తో కాసేపట్లో ఫైనల్

తొలిసారి జరుగుతోన్న అమ్మాయిల అండర్ 19 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన భారత అమ్మాయిలు.. మరి కాసేపట్లో ఇంగ్లాండ్‌తో తుది పోరులో తలపడనున్నారు. షఫాలీ వర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ఇంగ్లాండ్ ఫైనల్ చేరుకుంది.

సమయం 29 Jan 2023 12:08 pm

IND vs NZ Preview: భారత జట్టులో రెండు మార్పులు..?

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఊహించని రీతిలో ఓటమిపాలైన భారత్.. నేడు లక్నో వేదికగా రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. తొలి టీ20లో అర్షదీప్ సింగ్ చివరి ఓవర్లో 27 పరుగులు ఇవ్వడం టీమిండియాకు, టాప్ ఆర్డర్ విఫలం కావడం ప్రతికూలంగా మారింది. దీంతో రెండో టీ20లో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు లక్నో టీ20 కోసం న్యూజిలాండ్ అదే జట్టుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

సమయం 29 Jan 2023 10:51 am

వాషింగ్టన్ సుందర్ పోరాటం వృథా.. తొలి టీ20లో భారత్ ఓటమి

Ranchi T20: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా పోరాడినా ఫలితం దక్కలేదు. బంతితో, బ్యాట్‌తో రాణించిన వాషింగ్టన్ సుందర్ తన ఆటతో ఆకట్టుకోవడం ఈ మ్యాచ్ వివేషం.

సమయం 27 Jan 2023 10:43 pm

First T20: భారత్‌కు 177 పరుగుల లక్ష్యం నిర్దేశించిన కివీస్

రాంచీలో జరుగుతున్న తొలి టీ20లో భారత్‌కు 177 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది న్యూజిలాండ్. ఓపెనర్లు ఆ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చినా.. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో మధ్యలో స్కోరు బోర్డు వేగం తగ్గింది. ఒక దశలో 200 పరుగులు చేసేలా కనిపించిన జట్టు చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది.

సమయం 27 Jan 2023 8:51 pm

మిరాకిల్.. రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్ చేరిన ఆంధ్రా.. కెప్టెన్ కూడా ఊహించని రీతిలో..!

రంజీ ట్రోఫీలో మిరాకిల్ లాంటి సంఘటన ఇది. మహారాష్ట్ర, ముంబై మధ్య జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. దీంతో అసోంపై ఇన్నింగ్స్ 95 పరుగుల తేడాతో గెలిచి బోనస్ పాయింట్ సాధించిన ఆంధ్రా.. క్వార్టర్ ఫైనల్ చేరింది. అదే గ్రూప్‌లో ఉన్న మహారాష్ట్ర, ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించాయి. తమ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరుతుందని ఆంధ్రా కెప్టెన్ హనుమ విహారీ కూడా అనుకోలేదు.

సమయం 27 Jan 2023 7:32 pm

IND vs NZ: తొలి టీ20లో టాస్ గెలిచిన హార్దిక్.. రిస్క్ తీసుకొని కెప్టెన్.. భారత జట్టు ఇదే..

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ఆ జట్టుతో టీ20ల్లో తలపడుతోంది. రాంచీ వేదికగా జరుగుతోన్న తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఛేజింగ్ సమయంలో మంచు ప్రభావంతో బౌలర్లకు గ్రిప్ దొరకదనే ఉద్దేశంతో హార్దిక్ పాండ్య మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

సమయం 27 Jan 2023 6:49 pm

T20 U19 వరల్డ్ కప్‌ ఫైనల్ చేరిన భారత అమ్మాయిలు.. సెమీస్‌లో కివీస్‌పై ఘన విజయం

తొలిసారి జరుగుతోన్న అండర్ 19 అమ్మాయిల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ అదరగొట్టే ప్రదర్శన చేసింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ముందుగా బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయగా.. ఓపెనర్ శ్వేత అజేయ అర్ధ శతకం సాధించడంతో.. భారత్ ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది.

సమయం 27 Jan 2023 5:05 pm

ఇక్కడే మొదలుపెట్టా.. ఇక్కడే ముగించా.. సానియా మీర్జా భావోద్వేగం

సానియా మీర్జా.. భారతీయులకు టెన్నిస్ ఆటలోని మాధుర్యాన్ని పరిచయం చేసిన పేరు. ఆరేళ్లకే టెన్నిస్ ఆడటం మొదలుపెట్టిన సానియా.. తాను పెరిగిన హైదరాబాద్ పేరును ప్రపంచం మొత్తం తెలిసేలా చేసింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన సానియా.. తన కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్‌ను ఓటమితో ముగించింది. ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ఓటమి అనంతరం సానియా భావోద్వేగానికి లోనైంది. మెల్‌బోర్న్‌లోనే తన గ్రాండ్ స్లామ్ ప్రయాణం ప్రారంభమై.. ఇక్కడే ముగిసిందని తెలిపింది.

సమయం 27 Jan 2023 4:24 pm

సైన్యంలో చేరాలనే కల.. అదనపు మార్కుల కోసం బ్యాట్ చేతపట్టి.. క్రికెటర్‌గా మారిన జితేశ్ శర్మ

శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం సెలక్టర్లు వికెట్ కీపర్ బ్యాటర్‌గా విదర్భ ఆటగాడు జితేశ్ శర్మను టీమిండియాకు ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం కూడా అతణ్ని ఎంపిక చేశారు. కాగా తనకు మొదట్లో క్రికెట్ అంటే ఇష్టం ఉండేది కాదని.. ఫుట్ బాల్ ఆడేవాడినని తెలిపాడు. మహారాాష్ట్రలో ఉన్న ఓ నిబంధన కారణంగా టెన్త్ ఎగ్జామ్స్‌లో అదనంగా 4 శాతం మార్కులు పొందడం కోసం క్రికెట్ ఆడటం మొదలుపెట్టానన్నాడు.

సమయం 27 Jan 2023 2:44 pm

రాహుల్ ఈజ్ బ్యాక్.. కసరత్తులు మొదలుపెట్టిన కొత్త పెళ్లి కొడుకు

కొత్త పెళ్లి కొడుకు కేఎల్ రాహుల్ జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే సన్నద్ధతను ప్రారంభించాడు. ఫిబ్రవరి 9న తొలి టెస్టు నాగ్‌పూర్ వేదికగా ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 2న భారత జట్టు ముంబైలో సన్నాహక క్యాంప్ మొదలుపెట్టనున్నారు.

సమయం 27 Jan 2023 1:29 pm

స్నేహితురాలిని పెళ్లాడిన అక్షర్ పటేల్.. క్రికెటర్ కంటే అతడి భార్య ఏజ్‌లో అంత పెద్దదా?

భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తన స్నేహితురాలైన మేహాను పెళ్లాడాడు. గురువారం వడోదరలో వీరి వివాహం ఘనంగా జరిగింది. అక్షర్ భార్య అయిన మేహా డైటిషియన్ అండ్ న్యూట్రీషియనిస్టుగా పని చేస్తున్నారు. గత ఏడాదే అక్షర్ పటేల్ పుట్టిన రోజున వీరి నిశ్చితార్ధం జరిగింది. దీంతో అక్షర్ పేరును ఆమె చేతిపై టాటూ వేయించుకున్నారు. ఫిబ్రవరి 9న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరగనుండటంతో.. అక్షర్ అంతకు ముందే జట్టుతో చేరనున్నాడు.

సమయం 27 Jan 2023 12:33 pm

నేను వరల్డ్ నంబర్ 1.. కోహ్లి కూడా నా వెనుకే: పాకిస్థాన్ ఓపెనర్

ప్రస్తుత తరం క్రికెట్లో శతకాల మొనగాడు విరాట్ కోహ్లి. సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా కోహ్లి కొనసాగుతున్నాడు. వన్డేల్లోనే కోహ్లి 46 సెంచరీలతో సచిన్ 49 శతకాల రికార్డ్‌కు అతి చేరువలో ఉన్నాడు. కానీ సెంచరీలు చేయడం కోహ్లి కంటే తానే మిన్న అంటున్నాడు ఓ పాకిస్థానీ క్రికెటర్. 50 ఓవర్ల ఫార్మాట్లో సెంచరీలు త్వరగా చేయడంలో విరాట్ కూడా నా వెనుకే అంటున్నాడు ఖుర్రం మజుందార్.

సమయం 26 Jan 2023 9:44 pm

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి ఓపెనర్ ఔట్.. బీసీసీఐ అసంతృప్తి!

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు భారత్‌కు గాయం రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మణికట్టు నొప్పి కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడని తెలుస్తోంది. కివీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పి కారణంగా వైదొలిగిన సంగతి తెలిసిందే.

సమయం 26 Jan 2023 6:24 pm

రవీంద్ర జడేజా ఈజ్ బ్యాక్.. కమ్ బ్యాక్ మ్యాచ్‌లో సత్తా చాటిన ఆల్‌రౌండర్

కమ్ బ్యాక్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటాడు. 53 పరుగులకే 7 వికెట్లు పడగొట్టి తమిళనాడును వణికించాడు. జడేజా దెబ్బకు సెకండ్ ఇన్నింగ్స్‌లో తమిళనాడు 133 పరుగులకే ఆలౌటయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులు చేసిన తమిళనాడు.. సౌరాష్ట్రను 192 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో చివరి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర ముందు 266 పరుగుల లక్ష్యం ఉంది. జడేజా బ్యాాట్‌తోనూ రాణిస్తే.. సౌరాష్ట్ర గెలిచే అవకాశం ఉంది.

సమయం 26 Jan 2023 5:18 pm

బాబర్ ఆజమ్ జాక్ పాట్.. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా పాకిస్థాన్ కెప్టెన్

ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022గా బాబర్ ఆజమ్ ఎంపికయ్యాడు. గత ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ సర్ గ్యారీ‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 2022లో అన్ని ఫార్మాట్లు కలిపి 44 మ్యాచ్‌లు ఆడిన బాబర్ 54కిపైగా యావరేజ్‌తతో 2598 పరుగులు చేశాడు. గత ఏడాది 2 వేలకుపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు బాబర్ కావడం గమనార్హం. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గానూ బాబర్ నిలిచాడు.

సమయం 26 Jan 2023 4:17 pm

కేఎల్ రాహుల్-అతియా దంపతులకు రూ.60 కోట్ల విలువైన గిఫ్ట్‌లు.. ట్యాక్స్ కట్టాల్సి వస్తుందా..?

బాలీవుడ్ నటి అతియా శెట్టిని టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ దక్షిణాది సంప్రదాయం ప్రకారం జనవరి 23న పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త దంపతులకు కళ్లు చెదిరే గిఫ్ట్‌లు వచ్చాయి. అతియా తండ్రి సునీల్ శెట్టి రూ.50 కోట్ల విలువైన ఫ్లాట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వగా.. విరాట్ కోహ్లి రూ.2 కోట్లకుపైగా విలువైన బీఎండబ్ల్యూ కారును, మహేంద్ర సింగ్ ధోనీ రూ.80 లక్షల విలువైన కవాసకీ నింజా బైక్‌ను బహూకరించారని తెలుస్తోంది.

సమయం 26 Jan 2023 3:35 pm

ICC టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా బెన్ స్టోక్స్.. వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా బాబర్ ఆజమ్

టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022గా సూర్యకుమార్ యాదవ్‌ పేరును ప్రకటించిన ఐసీసీ.. వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ఎంపిక చేసింది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు బాబర్‌ను, టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు స్టోక్స్‌ను కెప్టెన్లుగా ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సమయం 26 Jan 2023 2:36 pm

U19 Women’s T20WC: వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత్

U19 Womens T20WC: భారత అమ్మాయిలు అండర్-19 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరారు. టీమిండియాతోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ చేరుకున్నాయి. శుక్రవారం జరగనున్న తొలి సెమీస్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అదే రోజు జరగనున్న రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆదివారం సాయంత్రం ఫైనల్ జరగనుంది.

సమయం 25 Jan 2023 10:22 pm

IPL 2023 Schedule: ఏప్రిల్ 1న ఐపీఎల్ ప్రారంభం.. మే 28న ఫైనల్!

IPL 2023 Schedule: ఐపీఎల్ 2023 ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. మే 28న ఫైనల్ జరగనుంది. ఇంతకు ముందు జూన్ మొదటి వారంలో ఫైనల్ నిర్వహించాలని భావించగా.. జూన్ మొదటి వారంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుండటంతో.. ఓ వారం ముందే ఐపీఎల్ ఫైనల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

సమయం 25 Jan 2023 9:15 pm

గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. క్లార్క్ చేజారిన బంపర్ ఆఫర్.. బీసీసీఐ వద్దనడంతో.. పాక్ ఆఫర్..!

గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ క్లార్క్‌కు ఖరీదైన వ్యవహారంలా మారింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో కామెంటేటర్‌గా పని చేసే అవకాశాన్ని కోల్పోయిన అతడు పెద్ద మొత్తంలో సంపాదనను పోగొట్టుకున్నాడు. అంతే కాకుండా ఇప్పటి వరకూ అనేక బ్రాండ్లకు అతడు ప్రచారకర్తగా వ్యవహరిస్తుండగా.. కొన్ని సంస్థలు అతడితో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాయి. కాగా భారత్ పర్యటనకు క్లార్క్ దూరం కాగానే పాకిస్థాన్ మాత్రం అతడికి స్వాగతం పలికింది.

సమయం 25 Jan 2023 7:51 pm

ICC టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్యకుమార్ యాదవ్.. తొలి భారత క్రికెటర్‌గా ఘనత

ICC టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా సూర్య రికార్డ్ క్రియేట్ చేశాడు. గత ఏడాది 31 టీ20లు ఆడిన సూర్య 9 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీల సాయంతో 1164 పరుగులు చేశాడు. టీ20ల్లో సూర్య సగటు 46కిపైగా ఉండటం గమనార్హం. గత ఏడాది పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన సూర్య టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.

సమయం 25 Jan 2023 5:14 pm

వారెవ్వా గిల్.. కోహ్లిని వెనక్కి నెట్టిన యువ సంచలనం.. అగ్రస్థానం దిశగా అడుగులు!

ICC ODI Rankings: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 360 పరుగులు బాదిన శుభ్‌మన్ గిల్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఏకంగా 20 స్థానాాలు ఎగబాకాడు. తొలిసారి టాప్-10లోకి ఎంట్రీ ఇచ్చిన గిల్.. విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి ఆరో స్థానానికి చేరుకున్నాడు. కివీస్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 8వ స్థానానికి చేరుకున్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

సమయం 25 Jan 2023 4:34 pm

ICC Rankings: వన్డేల్లో నంబర్ 1 బౌలర్‌గా సిరాజ్.. చరిత్ర సృష్టించిన హైదరాబాదీ!

ICC Rankingsలో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. వరుసగా రెండు సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేయడంతో ర్యాంకింగ్స్‌లో పైపైకి ఎగబాకారు. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో నంబర్ వన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు భారత్ తరఫున ఐదుగురు మాత్రమే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా నిలిచారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు మూడో స్థానంలో ఉన్న సిరాజ్... రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

సమయం 25 Jan 2023 3:52 pm

‘వారిద్దరూ ఔటయ్యేంత వరకు క్రీజ్‌లోనే ఉండు’.. గిల్‌‌కు రాహుల్ ద్రావిడ్ సలహా..

2023లో శుభ్‌మన్ గిల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. చివరి నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలు బాదిన గిల్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనే 360 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటికే 3 సెంచరీలు చేసిన గిల్.. భారత క్రికెట్ ఆశాకిరణంలా మారాడు. గిల్‌‌ను చిన్నతనం నుంచి చూస్తోన్న రాహుల్ ద్రావిడ్.. యువ క్రికెటర్ ఆటతీరులో చాలా మార్పు వచ్చిందని తెలిపారు.

సమయం 25 Jan 2023 2:27 pm

భారత బ్యాటర్ల దెబ్బకు.. కివీస్ బౌలర్ ‘సెంచరీ’.. డఫీ ఖాతాలో చెత్త రికార్డ్..!

ఇండోర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. భారత్ తరఫున రోహిత్, గిల్ సెంచరీలు చేయగా.. కివీస్ డెవాన్ కాన్వే (100 బంతుల్లో 138) సైతం సెంచరీ చేశాడు. మరి నాలుగో సెంచరీ ఎవరిది అనుకుంటున్నారా..? అది కూడా న్యూజిలాండ్ ఆటగాడిదే. కివీస్ బౌలర్ జాకబ్ డఫే... 10 ఓవర్లలో 100 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. కివీస్ తరఫున వన్డేల్లో 100కిపైగా రన్స్ ఇచ్చిన మూడో బౌలర్ డఫీ కావడం గమనార్హం.

సమయం 25 Jan 2023 1:23 pm

వన్డేల్లో అగ్రస్థానానికి భారత్.. ఇప్పటికే టీ20ల్లో నంబర్ 1, టెస్టుల్లోనూ ‘టాప్’లోకి వెళ్లొచ్చిలా..!

వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా భారత గడ్డ మీద అడుగుపెట్టిన న్యూజిలాండ్ 0-3 తేడాతో వన్డే సిరీస్‌లో వైట్ వాష్‌కు గురి కావడంతో నాలుగో స్థానానికి పడిపోయింది. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ 50 ఓవర్ల ఫార్మాట్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటికే టీ20ల్లో నంబర్ 1 టీమ్‌గా ఉన్న భారత్.. టెస్టుల్లోనూ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాను 2-0 తేడాతో ఓడిస్తే.. ఒకేసారి మూడు ఫార్మాట్లలో నంబర్ 1గా నిలుస్తుంది.

సమయం 24 Jan 2023 10:02 pm

కివీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్.. వన్డేల్లో అగ్రస్థానానికి రోహిత్ సేన

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్ అదరగొట్టే ప్రదర్శన చేసింది. వరుసగా మూడు వన్డేల్లో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతోపాటు.. వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇండోర్ వన్డేలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సమయం 24 Jan 2023 9:20 pm

భార్యకు నెలకు రూ.1.30 లక్షల భరణం చెల్లించాలి.. పేసర్ షమీకి కోర్టు ఆదేశం

Mohammed Shami Wife: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి కోర్టులో చుక్కెదురైంది. అతడి మాజీ భార్య హసీన్ జహాన్‌కు నెలకు రూ. 1.30 లక్షల చొప్పున భరణం చెల్లించాలని కోల్‌కతా కోర్టు తీర్పు చెప్పింది. అయితే, అది చాలా తక్కువ మొత్తం అంటూ హసీన్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

సమయం 24 Jan 2023 7:39 pm

గిల్, రోహిత్ శతకాలు.. ఆఖర్లో హార్దిక్ మెరుపులు.. కివీస్ ముందు భారీ లక్ష్యం

ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఓపెనర్లు గిల్, రోహిత్ సెంచరీలు బాదడంతో ఓ దశలో 450కిపైగా రన్స్ చేసేలా కనిపించిన టీమిండియా.. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. కానీ చివర్లో హార్దిక్ పాండ్య మెరుపులు మెరిపించడంతో భారత్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా ఓపెనర్ల దెబ్బకు కివీస్ బౌలర్ డఫే వంద పరుగులు ఇచ్చుకున్నాడు.

సమయం 24 Jan 2023 5:23 pm

జస్ట్ ఒక్క పరుగు.. బాబర్ అరుదైన రికార్డ్‌ను బ్రేక్ చేసే ఛాన్స్ మిస్సయిన గిల్..!

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 208 పరుగులు చేసిన గిల్.. రెండో వన్డేలో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో వన్డేలో 112 రన్స్ చేసిన భారత ఓపెనర్ మూడు వన్డేల సిరీస్‌లో 360 పరుగులు చేశాడు. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రికార్డును సమం చేశాడు. బాబర్ 2016లో వెస్టిండీస్‌పై వరుసగా మూడు సెంచరీలు చేసి 360 పరుగులు చేశాడు.

సమయం 24 Jan 2023 4:18 pm

న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. శతకాలతో గిల్, రోహిత్ విధ్వంసం.. కెప్టెన్ ‘సిక్స్‌ల’ రికార్డ్!

ఇండోర్ వన్డేలో భారత ఓపెనర్లు సెంచరీలతో చెలరేగారు. 9 ఫోర్లు 6 సిక్సలు బాదిన రోహిత్ 83 బంతుల్లో సెంచరీ చేయగా.. 13 ఫోర్లు, 4 సిక్సులతో శుభ్‌మన్ గిల్ 72 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ 26.1 ఓవర్లలోనే 212 పరుగులు జోడించారు. రోహిత్‌కు వన్డేల్లో 2020 జనవరి 19న తర్వాత ఇదే తొలి శతకం కావడం గమనార్హం. అద్భుత ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు ఈ ఏడాది ఇది మూడో సెంచరీ.

సమయం 24 Jan 2023 3:38 pm

ICC ODI Team 2022: కెప్టెన్‌గా బాబర్ ఆజమ్.. భారత్ నుంచి ఇద్దరికి చోటు

ICC ODI Team 2022: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నేతృత్వంలో ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022ను ప్రకటించింది. ఈ జట్టులో భారత్ నుంచి శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్‌లకు చోటు దక్కింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ నుంచి కూడా ఇద్దరేసి చొప్పున ఆటగాళ్లకు ఐసీసీ చోటు కల్పించింది. జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్ల నుంచి ఒక్కరు చొప్పున ఐసీసీ వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా ఆటగాళ్లకు అవకాశం లభించలేదు.

సమయం 24 Jan 2023 2:08 pm

IND vs NZ: మూడో వన్డేలో టాస్ గెలిచిన కివీస్.. భారత జట్టులో రెండు మార్పులు

IND vs NZ: భారత్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం భారత్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్‌లను జట్టులోకి తీసుకుంది. కివీస్ సైతం తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తుంది.

సమయం 24 Jan 2023 1:20 pm

IND vs NZ Preview: కివీస్‌తో మూడో వన్డే.. గెలిస్తే అగ్రస్థానంలోకి టీమిండియా

IND vs NZ Preview: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండోర్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా మూడో వన్డేలోనూ విజయం సాధిస్తే.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంతోపాటు వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

సమయం 23 Jan 2023 10:29 pm

ఇషాన్ కిషన్ పిల్ల చేష్ట.. ఐసీసీ సీరియస్ వార్నింగ్.. కొద్దిలో బతికిపోయిన వికెట్ కీపర్!

టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కాస్తలో 4 వన్డేల సస్పెషన్ నుంచి తప్పించుకున్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగినత తొలి వన్డేలో అంపైర్‌ను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్న యువ వికెట్ కీపర్‌ను ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ హెచ్చరికతో వదిలేశాడు. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత ఇషాన్ కిషన్ ఉద్దేశపూర్వకంగా తన గ్లోవ్స్‌తో బెయిల్స్‌ను కిందపడేసి అప్పీల్ చేశాడు.

సమయం 23 Jan 2023 9:09 pm

ఘనంగా కేఎల్ రాహుల్ పెళ్లి.. అది మాత్రం ఐపీఎల్ తర్వాతే..!

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ప్రియురాలు అతియా శెట్టిని పెళ్లాడాడు. ఖండాలాలోని సునీల్ శెట్టి బంగ్లాలో జనవరి 23న సాయంత్రం 4 గంటల సమయంలో వీరి పెళ్లి జరగనుంది. కానీ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం జూన్‌లోనే జరగనుంది. ఐపీఎల్ ముగిశాక రిసెప్షన్ నిర్వహిస్తామని సునీల్ శెట్టి తెలిపారు. రాహుల్ బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో రాహుల్ పాల్గొననున్నాడు.

సమయం 23 Jan 2023 8:05 pm

ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022 ప్రకటన.. భారత్‌ నుంచి కోహ్లి, సూర్య సహా ముగ్గురికి చోటు!

ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022ను ప్రకటించింది. ఇంగ్లాండ్‌కు టీ20 వరల్డ్ కప్‌ను అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో ఈ జట్టును ప్రకటించారు. గత ఏడాది సెమీస్‌లోనే టీ20 వరల్డ్ కప్‌‌లో పోరాటాన్ని ముగించిన భారత్ నుంచి అత్యధికంగా ముగ్గురు ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు లభించింది. పాక్ నుంచి ఇద్దరికి చోటు దక్కగా.. ఇంగ్లాండ్ నుంచి ఇద్దరు, న్యూజిలాండ్, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్ నుంచి ఒక్కరు చొప్పున ఈ జట్టులో ఉన్నారు.

సమయం 23 Jan 2023 6:19 pm

అంబటి రాయుణ్ని పక్కనబెట్టడం వెనుక వారి పాత్ర.. సునీల్ గావస్కర్ పరోక్ష వ్యాఖ్యలు!

గత వన్డే వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించినప్పుడు.. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడి పేరు ఆ జాబితాలో కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. త్రీ డీ ప్లేయర్ అనే కారణంతో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. ఆ ఏడాది ఐపీఎల్ సమయంలో విదేశీ కామెంటేటర్లు.. విజయ్ శంకర్‌ వరల్డ్ కప్‌లో ఆడాాలంటూ చేసిన వ్యాఖ్యలు జట్టు ఎంపికను సైతం ప్రభావితం చేశాయని.. దాని ఫలితమే ఇలాం జరిగిందని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు.

సమయం 23 Jan 2023 3:36 pm

ఉజ్జయినీ ఆలయంలో.. రిషబ్ పంత్ కోసం భారత క్రికెటర్ల ప్రార్థనలు..

న్యూజిలాండ్‌తో మూడో వన్డే ఆడటం కోసం మధ్యప్రదేశ్ చేరుకున్న భారత క్రికెటర్లు ప్రముఖ ఉజ్జయినీ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. సోమవారం తెల్లవారుజామున భస్మ హారతి కార్యక్రమంలో సూర్య, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము పంత్ గురించి ప్రార్థించామని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పంత్ త్వరగా కోలుకోవాలని.. అతడు తిరిగి జట్టులోకి చేరాలని కోరుకున్నట్లు తెలిపాడు.

సమయం 23 Jan 2023 2:38 pm

పోరాడి ఓడిన భారత్.. హాకీ వరల్డ్ కప్ నుంచి ఔట్

Hockey World Cup 2023: ఇండియా హాకీ వరల్డ్ కప్ ట్రోఫీ ఆశలు ముగిశాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఓటమి పాలై హాకీ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. భారత జట్టు ఓడినా.. చివరి వరకూ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఆట మొదటి అర్ధభాగం వరకూ 3 - 1తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. చివరికి షూటౌట్‌లో ఓటమి పాలవడం భారత అభిమానులకు మింగుడుపడటం లేదు.

సమయం 22 Jan 2023 11:44 pm

సచిన్ కుమారుడి కంటే నేనే అదృష్టవంతుణ్ని: సర్ఫరాజ్ ఖాన్

Arjun Tendulkar: ఇండియన్ క్రికెట్‌లో కొన్ని రోజులుగా సర్ఫరాజ్ ఖాన్ పేరు మార్మోగుతోంది. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఈ యువ ఆటగాడిని భారత జట్టుకు ఎప్పుడు ఎంపిక చేస్తారంటూ క్రికెట్ అభిమానులు సెలక్టర్లను నిలదీస్తున్నారు. సర్ఫరాజ్ కసిగా సెంచరీల మీద సెంచరీలు బాదుతూ బీసీసీఐని తన ఆటతోనే నిలదీస్తున్నాడు. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌తో పోలుస్తూ సర్ఫరాజ్ జీవితం గురించి అతడి తండ్రి చెప్పిన మాటలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి.

సమయం 22 Jan 2023 8:17 pm

ఉమేశ్ యాదవ్‌ను మోసం చేసిన మేనేజర్.. స్నేహితుడని చేరదీస్తే.. నమ్మకద్రోహం!

భారత క్రికెటర్ ఉమేశ్ యాదవ్ తన మాజీ మేనేజర్ చేతిలో మోసపోయాడు. భూమి కొనుగోలు కోసం రూ.44 లక్షలు ఇస్తే.. సదరు మేనేజర్ తెలివిగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. భూమిని తన పేరు మీదకు మార్చమన్నా మార్చకపోగా.. డబ్బులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో చేసేదేం లేక క్రికెటర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశాడు. సదరు మేనేజర్ ఉమేశ్‌కు స్నేహితుడు కావడం గమనార్హం. జాబ్ లేని అతణ్ని ఉమేశ్ మేనేజర్‌గా పెట్టుకున్నాడు.

సమయం 21 Jan 2023 10:38 pm

BBL: బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన స్టీవ్ స్మిత్.. ఆస్ట్రేలియాకు కొత్త ఆప్షన్..!

బిగ్ బాష్ లీగ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతోన్న స్టీవ్ స్మిత్ వరుస సెంచరీలతో సత్తా చాటుతున్నాడు. గురువారం అడిలైడ్ స్ట్రైకర్స్‌పై సెంచరీ చేసిన స్మిత్.. శనివారం సిడ్నీ థండర్‌పై శతకం నమోదు చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ అతడు 56 బంతుల్లోనే సెంచరీ చేయడం గమనార్హం. శనివారం నాటి మ్యాాచ్‌లో స్మిత్ 66 బంతుల్లో 125 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో సిక్సర్స్ జట్టు 19 ఓవర్లలో 187 పరుగులు చేసింది.

సమయం 21 Jan 2023 9:44 pm

చేతిలో బంతి.. పక్కనే స్టంప్స్.. రనౌట్ చేయలేకపోయిన పాకిస్థాన్ వికెట్ కీపర్

చేతిలో బంతి ఉంది.. వికెట్లు పక్కనే ఉన్నాయి.. బ్యాటర్ కొద్ది దూరంలో ఉంది. ఇలాాంటి పరిస్థితుల్లో ఎవరైనా తేలిగ్గా రనౌట్ చేస్తారు. కానీ పాకిస్థానీ వికెట్ కీపర్ మాత్రం బంతిని అందుకున్నంత వేగంగా వికెట్లను పడగొట్టలేకపోయింది. వికెట్ల దగ్గరకు వెళ్లి.. చేతిని కింద పెట్టి మళ్లీ తేరుకొని స్టంప్స్‌ను గిరాటేసింది. ఈలోగా బ్యాటర్ క్రీజ్‌లోకి చేరుకొని రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆస్ట్రేలియా, పాక్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సమయం 21 Jan 2023 8:55 pm

రాయ్‌పూర్‌ వన్డేలో అదరగొట్టిన భారత్.. కివీస్‌పై ఘనవిజయం.. 20 ఓవర్లలోనే గెలుపు!

హైదరాబాద్ వన్డేలో 349 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడానికి చెమటోడ్చిన భారత్.. రాయ్‌పూర్ వన్డేలో మాత్రం ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. బౌలర్లు కివీస్‌ను 108 పరుగులకే ఆలౌట్ చేయగా.. తర్వాత బ్యాటర్లు స్వల్ప లక్ష్యాన్ని ఊదేశారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించగా.. శుభ్‌మన్ గిల్ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరి వన్డే మంగళవారం జరగనుంది.

సమయం 21 Jan 2023 6:38 pm

టాస్ గెలిచాక రోహిత్ శర్మ కన్ఫ్యూజన్.. కోహ్లి ఎప్పుడో చెప్పాడు గానీ మరీ ఇలానా..!

రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో వన్డేలో టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. బ్యాటింగ్ ఎంచుకోవాలా లేదా బౌలింగ్ ఎంచుకోవాలా అనే విషయాన్ని మర్చిపోయాడు. కాసేపు ఆలోచించాక బౌలింగ్ ఎంచుకుంటున్నట్లు తెలిపాడు. రోహిత్ ఇలా చేయడం చూసి కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్‌తోపాటు.. వెనుక కొద్ది దూరంలో ఉన్న యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్ నవ్వుకున్నారు. రోహిత్ బ్రెయిన్ ఫేడ్ మూమెంట్ పాక్ కెప్టెన్ జావెద్ మియాందాద్ పాత టాస్ సీన్‌ను గుర్తుకు తెచ్చింది.

సమయం 21 Jan 2023 5:54 pm

IND vs NZ: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. కివీస్ 108 పరుగులకే ఆలౌట్

రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ స్టేడియంలో జరుగుతోన్న తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. 108 పరుగులకే కివీస్‌ను కుప్పకూల్చారు. తొలి ఓవర్లోనే వికెట్ తీసి శుభారంభం ఇచ్చిన మహ్మద్ షమీ.. 3 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్య 3 మెయిడిన్ ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. స్పిన్నర్లు సుందర్, కుల్దీప్ న్యూజిలాండ్ తోకను కత్తిరించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఫిలిప్స్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

సమయం 21 Jan 2023 4:23 pm

ఐసీసీని దోచేసిన కేటుగాళ్లు.. ఆన్‌లైన్ ఫ్రాడ్ ద్వారా రూ.20 కోట్లు చోరీ!

సైబర్ నేరగాళ్లు ఏకంగా ఐసీసీనే మోసం చేశారు. దుబాయ్‌లోని ఐసీసీ హెడ్ క్వార్టర్స్ నుంచి 2.5 మిలియన్ డాలర్లను కాజేశారు. బిజినెస్ ఇ-మెయిల్ కాంప్రమైజ్ ద్వారా కేటుగాళ్లు కాజేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ మోసం విషయమై ఇప్పటి వరకూ ఐసీసీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

సమయం 21 Jan 2023 2:55 pm

Raipur ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ.. ఇరు జట్లదీ ఒకే స్ట్రాటజీ!

Raipur ODI: రాయ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ నిర్వహించడానికి సన్నద్ధం అవుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపాడు. హైదరాబాద్ వన్డేలో బరిలోకి దిగిన ఆటగాళ్లతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఆడుతున్నాయి.

సమయం 21 Jan 2023 1:29 pm

IND vs NZ Preview: కొత్త స్టేడియంలో కింగ్ ఎవరు..? రోహిత్ సేన ముందున్న సవాళ్లివే..!

IND vs NZ Preview: హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో గెలిచిన భారత్.. రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ మినహా మిగతా బ్యాటర్లెవరూ రాణించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బౌలర్లు మధ్య ఓవర్లలో చేతులెత్తేయడం కంగారు పెట్టిస్తోంది. మిగతా బ్యాటర్లు సత్తా చాటడంతోపాటు.. బౌలర్లు మధ్య ఓవర్లలోనూ రాణిస్తే.. భారత్‌కు తిరుగుండదు. రెండో వన్డేలోనూ భారత్ అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

సమయం 20 Jan 2023 10:45 pm

రిషబ్ పంత్ ఐపీఎల్‌లో ఆడలేకపోయినా.. డగౌట్లో నా పక్కన కూర్చోబెట్టుకుంటా: రిక్కీ పాంటింగ్

డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఐపీఎల్ 2023లో ఆడే అవకాశాల్లేవు. ఇప్పటికీ హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతోన్న రిషబ్ పంత్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఫోన్లో మాట్లాడారు. పంత్ ఐపీఎల్ ఆడేందుకు ఫిట్‌గా ఉండకపోవచ్చన్న ఆయన.. అయినా సరే పంత్ తన పక్కన డగౌట్లో కూర్చోవాలని కోరుకున్నారు. పంత్ లాంటి ఆటగాళ్లు అంత తేలిగ్గా దొరకరన్న పాంటింగ్.. ఓ కెప్టెన్‌గా అతడు తమకు అవసరమన్నారు.

సమయం 20 Jan 2023 9:55 pm

W-IPL: ఫ్రాంచైజీ రేసులో తెలుగు కంపెనీ.. పోటీలో 30కిపైగా సంస్థలు.. బీసీసీఐకి కాసుల వర్షం!

ప్రపంచ క్రికెట్లో అతిపెద్ద లీగ్‌గా ఐపీఎల్‌ ఉండగా.. రెండో స్థానాన్ని మహిళల ఐపీఎల్ ఆక్రమించుకోనుంది. తొలి ఏడాది ఐదు ఫ్రాంచైజీలతో లీగ్ నిర్వహించనుండగా.. ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికి 30కిపైగా సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే మీడియా హక్కులు భారీ ధరకు అమ్ముడుపోవడంతో ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికి కంపెనీలు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసే అవకాశం ఉంది. దీంతో బీసీసీఐకి కాసుల వర్షం కురవనుంది. తెలుగు సంస్థ జీఎంఆర్‌తోపాటు స్నాక్స్ కంపెనీ హల్దీరామ్స్ సైతం ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి ఆసక్తిగా ఉంది.

సమయం 20 Jan 2023 9:04 pm

‘కావ్య మారన్‌‌ నన్ను పెళ్లి చేసుకుంటావా?’.. ప్రేక్షకుడి నుంచి ఊహించని ప్రపోజల్

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌ల్లో కనిపిస్తూ.. దేశవ్యాప్తంగా అందరికీ పరిచయమైన కావ్య మారన్.. ఇప్పుడు సౌతాఫ్రికా టీ20 లీగ్ ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఎస్ఏ20 లీగ్‌లో తన ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఆడే మ్యాచ్‌లను చూసేందుకు వెళ్తున్న కావ్య మారన్‌కు ఓ సౌతాఫ్రికా అభిమాని పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. కావ్యా మారన్ నన్ను పెళ్లి చేసుకుంటావా..? అని రాసిన ప్లకార్డును ప్రదర్శించాడు. కాసేపట్లో ఇది వైరల్ అయ్యింది.

సమయం 20 Jan 2023 1:49 pm

హైదరాబాద్ వన్డేలో ఊచకోత.. ఓవర్ నైట్‌లో రెట్టింపైన బ్రాస్‌వెల్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు!

భారత్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకెల్ బ్రాస్‌వెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. శాంట్నర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 162 పరుగులు జోడించిన బ్రాస్‌వెల్.. ఆఖరి ఓవర్ వరకూ కివీస్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఎల్బీ కావడంతో న్యూజిలాండ్ 337 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన బ్రాస్‌వెల్ ఫాలోవర్లు ఓవర్‌నైట్‌లోనే రెట్టింపయ్యారు.

సమయం 19 Jan 2023 7:24 pm

Ranji Trophy: గుజరాత్‌పై విదర్భ సంచలన విజయం.. ఆస్ట్రేలియాకు డేంజర్ బెల్స్..!

రంజీ ట్రోఫీలో మరో రికార్డ్ బద్దలైంది. 73 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న విదర్భ జట్టు రంజీల్లో అత్యల్ప లక్ష్యాన్ని కాపాడుకొని విజయం సాధించిన జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులకే ఆలౌట్ అయిన విదర్భ.. మూడో ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేసిన గుజరాత్.. నాలుగో ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేయలేకపోయింది. విదర్భ బౌలర్లు విజృంభించంతో 54 రన్స్‌కే ఆలౌటయ్యింది.

సమయం 19 Jan 2023 6:46 pm

‘వీడు ఇంకెప్పుడు నేర్చుకుంటాడు’.. శుభ్‌మన్ గిల్‌ను తిట్టిన తండ్రి..!

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో మెరిశాడు. యువ క్రికెటర్ ద్విశతకం బాదడానికి.. ఎలాంటి పొరబాట్లకు తావివ్వకుండా ఆడటానికి అతడి తండ్రి ఇటీవల చేసిన విమర్శలే కారణమయ్యాయి. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేసిన గిల్ 34వ ఓవర్లో ఔట్ కావడం అతడి తండ్రిని అసంతృప్తికి గురి చేసింది. ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు.. డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సమయం 19 Jan 2023 5:53 pm

‘నేస్తమా.. నీతో కలిసి మరోసారి ఆడాలని ఉంది’..

2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హషీమ్ ఆమ్లా.. తాజాగా కౌంటీల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా తన సహచరుడి గురించి ఏబీ డివిలియర్స్ ఏమోషనల్ పోస్టు చేశాడు. ఆమ్లా గురించి ఎంత చెప్పినా తక్కువేనన్న ఏబీడీ.. అతడిపై ఓ పుస్తకం రాయగలనన్నాడు. ఓ సోదరుడిలా ఆమ్లా తనకెప్పుడూ అండగా నిలిచాడని.. అతడితో కలిసి మరోసారి బ్యాటింగ్ చేయాలని ఉందంటూ మనసులోని కోరికను అక్షర రూపంలో వ్యక్తపరిచాడు.

సమయం 19 Jan 2023 3:43 pm

మణికొండలో కోహ్లి యాడ్ షూట్.. ఒక్క ప్రకటన కోసం విరాట్ తీసుకునే డబ్బుతో లైఫ్ సెటిల్ అయిపోద్ది!

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడటం కోసం హైదరాబాద్ వచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మణికొండలో సందడి చేశాడు. ఓ జిమ్‌లో షూటింగ్ కోసం కోహ్లి మణికొండ వెళ్లాడు. విరాట్ కారు దిగుతోన్న వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే కోహ్లి చిన్నారులతో కలిసి ఫొటోలు దిగాడు. మిగతా భారత క్రికెటర్లు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోలు మ్యాచ్‌కు ముందు వైరల్ అయ్యాయి.

సమయం 19 Jan 2023 2:22 pm

మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులు..! జంతర్ మంతర్‌లో రెజ్లర్ల ఆందోళన.. కేంద్రం సీరియస్..!

దేశానికి పతకాలు తెచ్చిన రెజ్లర్లు రోడ్డెక్కారు. మహిళా రెజ్లర్లపై ట్రైనర్లు, ఫెడరేషన్ అధ్యక్షుడు సైతం లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఈ ఆరోపణలు చేయగా.. ఆమెకు మద్దతుగా భారీ సంఖ్యలో రెజ్లర్లు ఆందోళన చేపడుతున్నారు. దీంతో కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. రెజ్లర్ల ఆందోళన విషయంలో 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐని ఆదేశించింది. కాగా తాను ఏ తప్పూ చేయలేదని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తెలిపారు.

సమయం 19 Jan 2023 1:27 pm

Shubman Gill: ‘ఇషాన్‌‌ను బూతులు తిట్టాను.. మేం రోజూ కొట్టుకుంటాం’

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్‌ను రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ‘200’ క్లబ్‌లోకి ఆహ్వానించారు. అనంతరం గిల్ మాట్లాడుతూ... మ్యాచ్‌కు ముందు ఇషాన్ తనను పడుకోనీయలేదన్నాడు. ఫుల్ వాల్యూమ్‌తో టీవీ చూస్తూ చిరాకు తెప్పించాడని.. దీంతో నేను తనను తిట్టానని గిల్ చెప్పాడు. అయినా సరే ఇది నా రూమ్ కాాబట్టి నాకు నచ్చినట్టు చేస్తానని ఇషాన్ చెప్పాడన్నాడు. దీంతో రోహిత్ కలగజేసుకొని వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నాడు.

సమయం 19 Jan 2023 12:09 pm

శార్దుల్ యార్కర్‌కు సమాధానం లేని బ్రాస్‌వెల్.. ఐపీఎల్ ఫైనల్‌‌ను గుర్తు చేసిన ‘లార్డ్’!

Shardul Thakur: హైదరాబాద్ వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసినప్పటికీ.. బ్రాస్‌‌వెల్ భయపెట్టాడు. అలవోకగా ఫోర్లు, సిక్సులు బాదిన న్యూజిలాండ్ బ్యాటర్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను లాగేసుకునేలా కనిపించాడు. ఆఖరి ఓవర్లో అద్భుతమైన యార్కర్‌తో బ్రాస్‌వెల్‌ను ఎల్బీ చేసిన శార్దుల్ ఠాకూర్ టీమిండియాను గెలిపించాడు. కోహ్లి సలహాతో తాను యార్కర్‌ సంధించానని మ్యాచ్ అనంతరం శార్దుల్ తెలిపాడు. 2019 ఐపీఎల్ ఫైనల్లో ఇదే వేదికపై మలింగ వేసిన చివరి ఓవర్ ఆఖరి బంతికి శార్దుల్ ఎల్బీగా ఔటయ్యాడు.

సమయం 19 Jan 2023 8:52 am

అమ్మ చూస్తుండగా.. అదరగొట్టిన సిరాజ్.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన హైదరాబాదీ..!

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సత్తా చాటాడు. పవర్ ప్లేలోనే వికెట్ తీసి భారత్‌కు శుభారంభం ఇచ్చిన సిరాజ్.. మ్యాచ్ చూడటానికి వచ్చిన కుటుంబ సభ్యులను ఖుషీ చేశాడు. న్యూజిలాండ్ విజయం దిశగా సాగుతున్న సమయంలో బంతిని అందుకున్న సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. సిరాజ్ 10 ఓవర్లలో 42 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

సమయం 18 Jan 2023 10:52 pm

భయపెట్టిన బ్రాస్‌వెల్.. మెరిసిన సిరాజ్.. ఉత్కంఠభరిత పోరులో భారత్ విజయం

న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేయడంతో 349 పరుగులు చేసిన భారత్.. కివీస్‌ను చిత్తుగా ఓడించేలా కనిపించింది. 131 పరుగులకే 6 వికెట్లు పడగొట్టింది. కానీ ఏడో వికెట్‌కు బ్రాస్‌వెల్, శాంటర్న్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 78 బంతుల్లో 140 పరుగులు చేసిన మిచెల్ శాంట్నర్ చివరి ఓవర్ వరకూ కివీస్‌‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు.

సమయం 18 Jan 2023 10:05 pm

పాపం హార్దిక్.. థర్డ్ అంపైర్ తప్పిదంతో పెవిలియన్‌కు.. రివేంజ్ తీర్చుకున్న ఇషాన్!

కివీస్‌తో తొలి వన్డేలో హార్దిక్ పాండ్య కుదురుకుంటున్న దశలో ఔటయ్యాడు. మిచెల్ బౌలింగ్‌లో హార్దిక్ బౌల్డ్ అయినట్లు థర్డ్ అంపైర్ ప్రకటించాడు. కానీ రిప్లేలో బంతి వికెట్ కీపర్ లాథమ్ చేతుల్లో పడిన తర్వాత గ్లౌవ్స్ స్టంప్స్‌కు తాకడంతో బెయిల్ కిందపడినట్లు తేలింది. బంతి హార్దిక్ బ్యాట్‌కు కూడా తాకలేదు. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఔటివ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో లాథమ్ బ్యాటింగ్‌కు వచ్చాక ఇషాన్ అదే సీన్ రిపీట్ చేశాడు.

సమయం 18 Jan 2023 8:15 pm