SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

US: డల్లాస్‌లో ఆగస్టు 15న ‘ఇండియన్ అమెరికన్ డే’

Indian American Day: భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని టెక్సాస్‌లోని డల్లాస్ అరుదైన గుర్తింపు ఇచ్చింది. ఆగస్ట్ 15వ తేదీని ఇండియన్ అమెరికన్ డేగా ప్రకటించింది. ఆ రోజు ఇండిపెండెన్స్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రవాస భారతీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. డల్లాస్‌, ఫోర్ట్ వర్త్ పరిసర ప్రాంతాల్లో సుమారు 2 లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారని.. వివిధ రంగాలకు సంబంధించిన అభివృద్దిలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని డల్లాస్ మేయర్ కొనియాడారు.

సమయం 11 Aug 2022 11:17 pm

విమానం భోజనంలో పాము తల.. వ్యాక్! సగం తిన్నాక!

Turkey Flight: విమానంలో సరఫరా చేసిన ఆహారంలో పాము తల కనిపించింది. సగం తిన్న తర్వాత క్రూ మెంబర్ దాన్ని గమనించాడు. తన చేదు అనుభవాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టర్కీకి చెందిన సన్ ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆహారం సరఫరా చేసిన క్యాటరింగ్ సంస్థకు నోటీసులు జారీ చేశారు.

సమయం 27 Jul 2022 3:18 pm

Sweet Job: కూర్చుని తింటే నెలకు రూ.6 లక్షల జీతం.. 5 ఏళ్లు పైబడిన వారెవరైనా అర్హులే..!

అమెరికాలో వింత జాబ్ (Sweet Job) నోటిఫికేషన్ పడింది. దాని గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. దీనికి కూడా జీతం ఇస్తారా..? ఇది కూడా ఓ ఉద్యోగమా..? అనిపిస్తుంది. ఆ కంపెనీ తయారు చేసిన క్యాండీలను రుచి చూసి.. దానికి రేటింగ్ ఇస్తే చాలు ఏడాదికి లక్ష డాలర్లను జీతంగా ఇస్తారు. మన కరెన్సీలో 79 లక్షలకుపైగా అన్నమాట. దీనికి అర్హతలు కూడా వింతగానే ఉన్నాయి. ఐదేళ్లు దాటిన వారెవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి జాబ్ మన దగ్గర పడితే... ఈ పాటికే కోట్లలో రెజ్యూమ్‌లు వెళ్లేవి కదా.

సమయం 25 Jul 2022 8:00 pm

California wildfires: కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. దహించుకుపోతున్న చెట్లు, 14 వేల ఎకరాలకుపైగా దగ్ధం

కాలిఫోర్నియాను (California wildfires)మరోసారి కార్చిచ్చు దహించేస్తుంది. సెంట్రల్ కాలిఫోర్నియాలోని ఓ పార్క్‌లో మంటలు అంటున్నాయి. అగ్నికీలల్లో చిక్కుకుని 15,000 ఎకరాలకుపైగా ధ్వంసమైంది. రెండు వేల మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నారు. కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. కార్చిచ్చు ఇంకా ఇంకా పెరుగుతుంది. ఎన్నో ఏళ్ల నాటి చెట్లు దహించుకుపోతున్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లోని వాహనం కాలి బూడిదయ్యాయి. 10 లక్షల మంది ఆ ప్రాంతం విడిచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

సమయం 25 Jul 2022 6:17 pm

Philippines shooting: యూనివర్సిటీలో కాల్పులు... ముగ్గురు మృతి

ఫిలిప్పీన్స్‌లోని (Philippines shooting) యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్‌ డేలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. దాంతో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు. మరోవైపు యూనివర్సిటీని క్లోజ్ చేశారు. అయితే లా స్కూల్ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండర్ గెస్ముండో హాజరుకావాల్సి ఉంది. కానీ తృటిలో ఆయనకు ప్రమాదం తప్పింది.

సమయం 24 Jul 2022 4:33 pm

London: ట్రైన్‌లో రాత్రంతా నిద్రపోయాడు.. తెల్లారి చూస్తే బిక్కమొహం వేశాడు..!

లండన్‌లో (London) ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. పొద్దుటకి తన చేరుకోవాల్సిన స్టేషన్‌లో చేరుకుంటాననే నమ్మకంతో రాత్రి తను రిజర్వేషన్ చేసుకున్న ట్రైన్ ఎక్కేసి పడుకుండిపోయాడు. రాత్రంతా హాయిగా పడుకుని పొద్దుటకు లేచి చూసేసరికి.. ఆశ్చర్యపోయాడు. తన ఎక్కిన ట్రైన్.. ఎక్కిన దగ్గరే ఉంది. ఒక ఇంచు కదల్లేదు. తర్వాత అసలు విషయం తెలుసుకుని బిత్తరపోయాడు. హీట్ వేవ్ కారణంగా రైళ్లు రద్దు అయ్యాయి. దాంతో ఆ ట్రైన్ అక్కడ నుంచి కదల్లేదు.

సమయం 23 Jul 2022 9:03 pm

China: డిపాజిటర్ల నిరసనలు.. బ్యాంకుల రక్షణ కోసం వీధుల్లో యుద్ధ ట్యాంకులు

చైనాలో (China) బ్యాంకు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. గ్రామాల్లో కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల డిపాజిట్లను విత్‌ డ్రాలను నిలిపివేయడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో బ్యాంకుల దగ్గర నిరసనలు తెలియజేస్తున్నారు. వారిని నిలువరించడానికి ఆర్మీ వాళ్లు యుద్ధ ట్యాంకులను మోహరించారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. బ్యాంకుల్లో అవకతవకలు జరగడం, రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతినడంతో బ్యాంకు తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లకు గురయ్యాయి.

సమయం 22 Jul 2022 5:14 pm

పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి మరణంపై 'తానా' సంతాపం

Pingali Venkaiah Daughter సీతామహాలక్ష్మి మరణంపై తాజా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తమ సంతాపాన్ని తెలియజేశారు.

సమయం 22 Jul 2022 12:12 pm

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌కు క్యాన్సర్... వైట్ హౌస్ వివరణ

అమెరికా ప్రెసిడెంట్ జో బైడన్‌ (Joe Biden) ఒక ప్రెస్ మీట్‌లో తనకు క్యాన్సర్ ఉందని చెప్పారు. దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. అయితే బైడన్ గత ఏడాది పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయనకున్న స్కిన్ క్యాన్సర్ గురించి ఆయన ప్రస్తావించినట్టు వైట్‌ హౌస్ వెల్లడించింది.

సమయం 21 Jul 2022 8:58 pm

Sri Lanka: కష్టకాలంలో కొత్త అధ్యక్షుడుగా రణిల్ విక్రమ సింఘే ప్రమాణం

శ్రీలంక (Sri Lanka) సంక్షోభ స్థితిలోనే కొత్త అధ్యక్షుడుగా రణిల్ విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ఆయన గురువారం ప్రమాణం చేశారు. బుధవారం జరిగిన రహస్య ఓటింగ్‌లో రణిల్ విక్రమ సింఘేకు అధిక ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన శ్రీలంకకు కొత్త అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అయితే ఆయనపై కూడా దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దాంతో కొత్త అధ్యక్షుడు వచ్చినా.. దేశం పరిస్థితిలో మార్పు వచ్చేటట్టు కనిపించడం లేదు.

సమయం 21 Jul 2022 7:34 pm

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని పీఠానికి అడుగు దూరంలో ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి అల్లుడు

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునక్ దూసుకెళ్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పోటీలో ఆయన చివరి దశకు అర్హత సాధించారు. ఇప్పటి వరకూ జరిగిన అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం కనబర్చిన రిషి.. తుది పోరులో లిజ్ ట్రస్‌తో పోటీ పడనున్నారు. 1.80 లక్షల మంది కన్జర్వేటివ్ సభ్యుల్లో ఎక్కువ మంది ఎవరి వైపు మొగ్గు చూపితే ప్రధానిగా వారే పగ్గాలు చేపడతారు. సెప్టెంబర్ 5న విజేతను ప్రకటిస్తారు.

సమయం 20 Jul 2022 9:41 pm

UK Temperature: బ్రిటన్‌ చరిత్రలో తొలిసారి.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

UK Temperature: భూమధ్యరేఖకు దూరంగా సమశీతోష్ణ మండలంలో ఉన్న యూరప్‌లో ఈ ఏడాది ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మంగళవారం బ్రిటన్‌ చరిత్రలో తొలిసారిగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైంది. ఈ ఎండలు ఆరోగ్యవంతుల్ని సైతం చంపేస్తాయ్ అంటూ బ్రిటన్ వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. పోర్చుగల్‌లోనైతే ఏకంగా 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కర్బన ఉద్గారాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

సమయం 20 Jul 2022 5:25 pm

శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు.. వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ ముందు పెద్ద ఎత్తున నిరసన

Sri Lanka new President: శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు వచ్చారు. పార్లమెంట్‌లో రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఓటింగ్‌లో రణిల్ విక్రమసింఘె 134 ఓట్లతో గెలుపొందారు. అనంతరం పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.

సమయం 20 Jul 2022 2:17 pm

Egpyt: టైర్లను మార్చేందుకు ఆపిన ట్రక్కును ఢీకొన్న బస్సు.. 22 మంది మృతి

దక్షిణ ఈజిప్ట్‌లో (Egpyt) మరో ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై టైర్లను మార్చేందుకు ఆపిన ట్రక్కును వేగంగా వచ్చిన బస్సు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే 22 మంది మృతి చెందారు. మరో 33 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ యాక్సిడెంట్లు జరగడం పరిపాటిగా మారింది. రహదారులు సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనల సరిగ్గా పాటించకపోవడంతో అక్కడ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. దాంతో ప్రభుత్వం ఈ మధ్యే రహదారుపై దృష్టి పెట్టింది.

సమయం 19 Jul 2022 7:00 pm

Sudan: ఆదివాసీ తెగల మధ్య ఘర్షణ.. తుపాకులతో, కత్తులతో దాడులు.. 65 మంది మృతి

సూడాన్ (Sudan) దేశంలో ఆదివాసీ తెగల మధ్య మళ్లీ ఘర్షణలు నెలకొన్నాయి. ఓ రైతు హత్యతో హింసాత్మక ఘటనలు సాగుతున్నాయి. తుపాకులతో, కత్తులతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు 65 మంది చనిపోగా.. 192 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఘర్షణలను కట్టడి చేసేందుకు సైన్యం సాయుధ వాహనాలను రంగంలోకి దింపింది. దాంతో అక్కడ కొంత దాడులు తగ్గుముఖం పట్టాయి. అయితే సూడాన్‌లో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

సమయం 18 Jul 2022 6:54 pm

Bangldesh: హిందువుల ఇళ్లు.. ఆలయాలపై దాడులు

బంగ్లాదేశ్‌లో (Bangldesh) మరోసారి హింస చెలరేగింది. ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ మత ఘర్షణకు దారితీసింది. ముస్లింలకు వ్యతిరేకంగా ఉందంటూ ఇస్లామిస్టులు ఆరోపించారు. హిందువుల ఇళ్లు, దేవాలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. చాలా ఇళ్లకు నిప్పు పెట్టారు. దాంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితి అదుపులో తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అయితే బంగ్లాదేశ్‌లో తరచుగా ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

సమయం 17 Jul 2022 3:12 pm

UK: చిన్న పొరపాటుతో ట్రోలింగ్‌కు గురైన రిషి సునక్

బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునక్ కొత్త ఇబ్బందులను కొని తెచ్చుకున్నారు. చిన్న తప్పు చేసి ట్రోలింగ్‌కు గురయ్యారు. క్యాంపెయిన్ స్పెల్లింగ్‌ను తప్పుగా రాసి అభాసుపాలయ్యారు. నెటిజన్లు ఓ ఆట ఆడేసుకున్నారు. దాంతో రిషి సునక్ ప్రతిస్పందించడం తప్పలేదు. తప్పును గుర్తించడమే కాకుండా.. సరిదిద్దుకోవడానికి రెడీ అయ్యారు. అలా నెటిజన్లకు చాలా కూల్‌గా సమాధానం ఇచ్చారు. కాగా యూకే ప్రధాని పదవికి పోటీ చేస్తున్న సునక్ రెండో రౌండ్‌లో అత్యధిక ఓట్లను గెలుచుకుని టాప్‌లో నిలిచారు.

సమయం 16 Jul 2022 4:00 pm

professional cuddler: భలే సంపాదన... ఒక కౌగిలింతకు రూ.7000లు

బ్రిటన్‌లో ఓ వ్యక్తి వినూత్నమైన పనితో డబ్బులు సంపాదిస్తున్నాడు. అయితే తనకొచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టి లక్షల్లో సంపాదిస్తున్నాడు. బాధల్లో ఉన్న వ్యక్తులను దగ్గరకు తీసుకుని, వారిని ఓదార్చడమే ఆయన చేసే పని. ఒంటితనంలో ఉండి.. వారి భావాలను పంచుకునేందుకు ఆయన చార్జ్ చేస్తున్నాడు. వారి దగ్గర గంటసేపు ఉండేందుకు ఏడు వేల రూపాయలను తీసుకుంటున్నాడు. ఆయన చేసే పనికి మంచి డిమాండ్ కూడా ఉంది. ఆయన కోసం క్యూ కడుతున్నారు.

సమయం 16 Jul 2022 3:23 pm

Sri lanka crisis: దేశం విడిచి వెళ్లొద్దు.. రాజపక్స సోదరులకు కోర్టు ఆదేశం

శ్రీలంకలో (Sri lanka crisis) ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. దాంతో ప్రజాందోళన పెల్లుబుకింది. దేశానికి ఈ దుస్థితిని తీసుకొచ్చారనే ఆక్రోషంతో ప్రజలు రాజకీయ నాయకులపై తిరగబడుతున్నారు. నిరననలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి నాయకులు దేశాన్ని వీడి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. దాంతో సుప్రీంకోర్టు వారిని ఎక్కడకు వెళ్లొద్దని ఆదేశించింది. కాగా శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

సమయం 15 Jul 2022 8:02 pm

Donald Trump కుటుంబంలో విషాదం.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఎమోషనల్

Ivana Trump కన్నుమూసినట్లు తెలియజేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇవానాకు 1993లో విడాకులు ఇచ్చిన ట్రంప్.. ఆ తర్వాత ఆమె కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.

సమయం 15 Jul 2022 9:40 am

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో నారాయణ మూర్తి అల్లుడి ముందంజ!

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునక్ ముందంజలో ఉన్నారు. గురువారం జరిగిన కన్జర్వేటివ్ పార్టీ రెండో దశ పోలింగ్‌లో రిషికి 103 ఓట్లు పడగా.. ఆయన సమీప ప్రత్యర్థి పెన్నీ మోర్డాంట్‌కు 83 ఓట్లు దక్కాయి. మొత్తం ఐదుగురు బ్రిటన్ ప్రధాని రేసులో ఉండగా.. జూలై 21న తుది దశ పోలింగ్ జరగనుంది. బోరిస్ జాన్సన్ వారసుడిగా ప్రధాని పగ్గాలు చేపట్టబోయేది ఎవరనే విషయాన్ని సెప్టెంబర్ 5న వెల్లడిస్తారు.

సమయం 14 Jul 2022 11:16 pm

Sri Lanka President: సింగపూర్ పారిపోయిన గొటబయ రాజపక్స

Sri Lanka President: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కూడా తలెత్తింది. అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన గొటబయ రాజపక్స.. పదవి నుంచి వైదొలగకుండానే మాల్దీవులు పారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆయన సింగపూర్ పారిపోయాడని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సమయం 14 Jul 2022 4:00 pm

Monkeypox: ముంచుకొస్తున్న మాయ రోగం... 50 దేశాల్లో 7,600 కేసులు

మంకీపాక్స్ (Monkeypox) వైరస్ చాపకింద నీరులా నెమ్మదిగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే 50కు పైగా దేశాల్లో 7,600 కేసులు నమోదయ్యాయి. అయితే భారత్‌లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ వ్యాధి మొదట్లో కేవలం ఆఫ్రికాలో మాత్రమే ఉండేది. ఆఫ్రికా దేశాల్లోనే ఈ కేసులు నమోదయ్యేవి. కానీ గత కొన్ని రోజుల నుంచి యూకే, ఆస్ట్రేలియా వంటి పెద్ద దేశాల్లోనూ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

సమయం 12 Jul 2022 2:18 pm

Sri Lanka crisis: మాజీ మంత్రి దుబాయ్ పారిపోయేందుకు యత్నం... ఎయిర్‌పోర్ట్‌ ముట్టడి

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం (Sri Lanka crisis) పెరుగుతుంది. దాంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహంతో రగలిపోతున్నారు. దాంతో రాజకీయ నాయకుల ఇళ్లను చుట్టుముడుతున్నారు. ఆ దేశం నుంచి నాయకులు పారిపోకుండా ఉండే విధంగా చూసుకుంటున్నారు. తాజాగా ఓ మాజీ మంత్రి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించగా అతనిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడి రాజకీయ నాయకులు రాజీనామా బాట పట్టారు. జూలై 20న అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడ నుంది.

సమయం 12 Jul 2022 1:25 pm

UK heatwave: ఎండకు రైలు పట్టాలు కాలిపోయాయ్...!

లండన్‌లో అధిక ఉష్ణోగ్రతలు (UK heatwave) నమోదవుతున్నాయి. దాంతో అక్కడి ప్రజలు వేడితో సతమతం అవుతున్నారు. దాంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేడి తట్టుకునే విధంగా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వచ్చే వారాంతం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు కారణంగా అక్కడి రైలు పట్టాలపై మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపు చేసింది.

సమయం 11 Jul 2022 11:16 pm

Vladimir Putin: 69 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న పుతిన్.. ఆయన గర్ల్‌ఫ్రెండ్ ఎవరంటే!

Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 69 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నారు. ఆయన ప్రియరాలు అలీనా కబాయెవా ఆడ పిల్లకు జన్మనివ్వబోతున్నారని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇంతకు ముందే పుతిన్, అలీనా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారని సమాచారం.

సమయం 11 Jul 2022 7:01 pm

పాకిస్థాన్‌‌‌లో వరదలు... 57 మంది మృతి

పాకిస్థాన్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. బలూచిస్థాన్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురవడంతో రహదారులు జలమయం అయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. కరాచీలో కొన్ని రోజులుగా వీధులు నీట మునిగాయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఎనిమిది ఆనకట్టలు తెగిపోయాయి.

సమయం 11 Jul 2022 2:06 pm

Sri Lanka: అధ్యక్షుడి భవనంలో గుట్టలుగా కరెన్సీ కట్టలు

శ్రీలంకలో నిరసనకారులు అధ్యక్షుడి భవనంలోకి దూసుకెళ్లడమే కాదు.. లక్షలాది రూపాయలను గుర్తించారు. గుట్టలుగా ఉన్న కరెన్సీ నోట్లను గుర్తించారు. వాటిని స్థానిక భద్రతాధికారులకు అందజేశారు. బయటపడ్డ కరెన్సీ నోట్లను ఆందోళనకారులు లెక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని వెనుక గల వాస్తవాలను తెలుసుకుంటామని స్థానిక అధికారులు తెలియజేశారు.

సమయం 10 Jul 2022 4:26 pm

మినీబస్‌లో వచ్చి బార్‌లో కాల్పులు... 14 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని ఓ బార్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు మృతి చెందారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీసి.. కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు ఎందుకు ఈ పని చేశారో తెలియడం లేదని వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా దక్షిణాప్రికాలో ఇలాంటి హింసాత్మక ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి.

సమయం 10 Jul 2022 3:32 pm

Ukraine Ambassador: జెలెన్‌స్కీ అనూహ్య నిర్ణయం.. భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి తొలగింపు

రష్యా దాడులు కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. భారత్‌‌లో ఏడేళ్లుగా రాయబారిగా పని చేస్తోన్న ఐగర్ పొలిఖాను బాధ్యతల నుంచి తప్పించారు. యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీలోని తమ రాయబారిపైనా జెలెన్ స్కీ వేటు వేశారు. చెక్ రిపబ్లిక్, నార్వే, హంగేరీ దేశాల్లోని తమ రాయబారులను సైతం ఆయన తొలగించారు. జెలెన్‌ స్కీ రాయబారులను తొలగించడానికి గల కారణాలేంటనేది మాత్రం తెలియరాలేదు.

సమయం 10 Jul 2022 2:36 pm

Sri Lanka crisis: ప్రజాందోళనతో దద్దరిల్లుతున్న శ్రీలంక.. ప్రధాని విక్రమ సింఘే రాజీనామా

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదరడంతో.. ప్రజలు మరోసారి తిరుగుబాటు చేశారు. గుంపులు, గుంపులుగా నిరసనలు చేపట్టారు. ప్రెసిడెంట్ నివాసం, కార్యాలయాన్ని నిరసనకారులు ముట్టడించారు. అధ్యక్షుడు ఇంటి నుంచి పారిపోయారు. దాంతో ఆ ఇంట్లోకి వెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నానా బీభత్సం చేశారు. ఈ క్రమంలో ప్రధాని విక్రమ సింఘే రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈ మేరకుఅన్ని పార్టీల జాతీయ ప్రభుత్వం ఏర్పాటై సభా విశ్వాసం పొందిన తర్వాత ప్రధాని రణిల్ విక్ర‌మ‌సింఘే రాజీనామా చేస్తారని ప్రధాని మీడియా డివిజ‌న్ తెలిపింది. అప్ప‌టి వరకు ఆయనే ప్రధానిగా కొనసాగుతారని తెలియజేసింది.

సమయం 9 Jul 2022 8:26 pm

దుండగుడు చంపాలనుకుంది షింజో అబెను కాదు!

Shinzo Abe Assassination: జపాన్ మాజీ ప్రధాని షింజో అబెను హత్య చేసిన నిందితుడు తొలుత హత్య చేయాలనుకుంది ఆయణ్ని కాదట. పోలీసుల విచారణలో అతడు నివ్వెరపోయే విషయాలు చెప్పినట్లు జపాన్‌కు చెందిన క్యూడో న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే, అతడు చంపాలనుకున్నది ఎవరు? షింజో అబెను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? నిందితుడి ప్లాన్ ఏంటి? కీలక వివరాలు..

సమయం 9 Jul 2022 3:36 pm

జపాన్ మాజీ ప్రధాని షింజో అబె మృతిపై చైనాలో సంబరాలు

జపాన్ మాజీ ప్రధాని షింజో అబె మృతిపై చైనాలో సంబరాలు జరుపుకున్నారు. పైగా అబెను షూట్ చేసిన వ్యక్తిని హీరోగా అభివర్ణించారు. షూటింగ్ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి చైనా ఇంటర్నెట్ వినియోగదారులు సోషల్ మీడియాలో షూటర్‌ను హీరోగా అభివర్ణిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

సమయం 9 Jul 2022 3:04 pm

రణరంగంగా శ్రీలంక.. అధ్యక్షుడి నివాసంలోకి దూసుకొచ్చిన ఆందోళనకారులు, పారిపోయిన రాజపక్సే

Colombo Anti Government Rally: శ్రీలంక మరోసారి అట్టుడుకుతోంది. ఆందోళనకారులు కొలంబోలో లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అధికార నివాసంలోకి దూసుకొచ్చారు. దీంతో రాజపక్సే తన కుటుంబసభ్యులతో పారిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆందోళనకారులు చెదర గొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఆందోళనకారుల దాడిలో నలుగురు జవాన్లు గాయపడినట్లు సమాచారం.

సమయం 9 Jul 2022 2:11 pm

Japan మాజీ ప్రధాని, భారత్ ఆత్మీయ మిత్రుడు షింజో అబె దారుణ హత్య

Japan Ex PM Shinzo Abe Death: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణంగా హత్యకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షింజో అబెపై దుండగుడు అతి సమీపంగా కాల్పులు జరిపాడు.

సమయం 8 Jul 2022 3:15 pm

జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు.. కుప్పకూలిన షింజో అబే, పరిస్థితి విషమం!

Shinzo Abeపై కాల్పులు జరిపిన దుండగులు.. అక్కడే కుప్పకూలిన జపాన్ మాజీ ప్రధాని. వెంటనే ఆస్పత్రికి తరలింపు.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటున్న డాక్టర్లు.

సమయం 8 Jul 2022 8:56 am

బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామాకు అంగీకరించారు. ఆయన నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో.. 40 మందికిపైగా రిజైన్ చేశారు. ఈ క్రమంలో బోరిస్ తన పదవి నుంచి తప్పుకోవడం అనివార్యం అయింది. ఈ క్రమంలో బ్రిటన్‌ తర్వాత ప్రధాని ఎవరనేదానిపై చర్చ తెరపైకి వచ్చింది. అయితే భారత సంతతికి చెందిన రిషి సునక్ ఆ రేసులో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

సమయం 7 Jul 2022 5:10 pm

ఉద్యోగిణితో ఇద్దరు పిల్లలకు తండ్రైన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్

Tesla CEO Become father to Twins with Employee: టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ తన సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ద్వారా మరోసారి తండ్రయ్యారు. ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ పేర్కొంది. ఎలాన్ మస్క్ ఇప్పటికే కెనడా సింగర్ గ్రైమ్‌తో ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారు. తన మాజీ భార్యతో ఐదుగురు పిల్లలకు తండ్రయ్యారు. ఇప్పటివరకు మొత్తం 9 మంది పిల్లలకు ఎలాన్ మస్క్ తండ్రయ్యారు.

సమయం 7 Jul 2022 3:03 pm

ఇండిపెండెన్స్ డే పరేడ్‌పై కాల్పుల మోత.. చికాగోలో మృత్యుఘోష

Chicago Independence Day: చికాగోలో స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌పై ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలవగా.. 35 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

సమయం 4 Jul 2022 11:35 pm

లోయలో పడిపోయిన బస్సు, 19 మంది మృతి, 11 మందికి గాయాలు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. దీంతో 19 మంది చనిపోగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనా స్థలంలో అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

సమయం 3 Jul 2022 7:41 pm

లెక్కల్లో 100/6 మార్కులు సాధించిన కొడుకు... బోరున ఏడ్చిన తండ్రి

చైనాలో ఓ వ్యక్తి తన కొడుకు మార్కులను చూసి గుండెలపగిలేలా ఏడ్చాడు. ఏడాదిగా తను ట్యూషన్‌ చెబుతుండగా.. కొడుకుకు కేవలం 100కి ఆరు మార్కులు మాత్రమే వచ్చాయి. దానిని చూసి మొదట షాక్ అయినా.. వెంటనే బోరున ఏడ్వడం మొదలుపెట్టాడు. తన ప్రయత్నం వృథా అయిందంటూ ఏడ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. మిలియన్‌ల కొద్దీ జనం దీనిని చూశారు. అయితే ఇంతకీ ఆ అబ్బాయికి ఎందుకు అంత తక్కువ మార్కులు వచ్చాయో ఎవరికి తెలియలేదు.

సమయం 2 Jul 2022 6:00 pm

కారులోంచి బయటకు లాగి సీనియర్ జర్నలిస్ట్‌పై దాడి

పాకిస్థాన్‌లోని లాహోర్‌లోఓ సీనియర్ జర్నలిస్ట్‌పై దాడి జరిగింది. టీవీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసుకుని.. కారులో తిరిగి వస్తున్న సమయంలో అమీర్‌ను కొందరు దుండుగులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఆయన గురువారం పాక్ ఆర్మీపై విమర్శిస్తూ ప్రసంగించారు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత అతని దాడి జరిగింది. అమీర్‌పై జరిగిన దాడిని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు తోటి జర్నలిస్ట్‌లు, విపక్షనేతలు ఖండించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని పోలీసులను ప్రభుత్వం కోరింది.

సమయం 2 Jul 2022 2:41 pm

రూ.3000లకి.. భర్తని అద్దెకిస్తున్న భార్య...!

యూకేలో ఓ మహిళ వినూత్న ఆలోచన చేసింది. అన్ని పనులు వచ్చిన తన భర్తను ఖాళీగా ఉంచడం ఎందుకనుంది. అనుకున్న వెంటనే వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి.. తన భర్తను అద్దెకు ఇస్తానని ప్రచారం మొదలుపెట్టింది. రూ.3000లు ఇచ్చి అద్దెకు తీసుకోవచ్చని, ఏ పనైనా చేస్తారని చెబుతుంది. ఈ విషయం అందరికి తెలిసి.. మహిళలు ఆమె ఆలోచనను మెచ్చుకుంటున్నారు. అతనిని రెంట్‌కు తీసుకోవడానికి చాలామంది ఉత్సాహపడుతున్నారు. ఈ వింత ఆలోచనకు అందరూ ఫిదా అవ్వడం కూడా వింతగానే ఉంది.

సమయం 30 Jun 2022 4:26 pm

టెక్సాస్‌లో ఘోరం... ట్రక్కులో గుట్టలుగా శవాలు

అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. టెక్సాస్‌లో సరిహద్దు దాటుతున్న ఓ ట్రక్కులో 46 శవాలు కనిపించాయి. ఒక కార్మికుడు అరుపులు, కేకలతో ఈ విషయం వెల్లడైంది. అందులో ఉన్న మరో 16 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా వడదెబ్బతో, అలసటతో బాధపడుతున్నారని అధికారులు చెప్పారు. అయితే ఇంత మంది చనిపోవడానికి కారణాలు తెలియ రాలేదు. దాంతో స్థానిక పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.

సమయం 28 Jun 2022 3:11 pm

అగ్రరాజ్యంలో శ్రీనివాస కల్యాణం.. విశేష సేవలు.. పాల్గొన్న వైవీ దంపతులు

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, తిరుమల శ్రీనివాసుడి కల్యాణం అగ్రరాజ్యం అమెరికాలో ఘనంగా జరిగింది. 25వ తేదీ శనివారం రోజున డాలస్‌లో గల క్రెడిట్‌ యూనియన్ ఆఫ్‌ టెక్సాస్‌ ఈవెంట్‌ సెంటర్‌ వేదికగా కన్నుల పండువగా సాగింది. ఏడుకొండలు దిగి, సప్త సముద్రాలు దాటి వచ్చిన వెంకన్నను దర్శించుకునేందుకు 12 వేల మందికి పైగా తరలివచ్చారు. మరో సముద్రంలా

వన్ ఇండియా 27 Jun 2022 10:38 pm

పెట్రోల్ ఆదా కోసం.. అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్

శ్రీలంక ఇంధన కొరతతో సతమతం అవుతుంది. దీంతో ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటుంది. దీనికోసం కొలంబోలో స్కూల్స్‌ను క్లోజ్ చేసింది. ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. ప్రస్తుతం శ్రీలంకలో అతి తక్కువ ఇంధన నిల్వలు ఉన్నాయి. కొత్తగా దిగుమతి చేసుకునే స్థాయి లేదు. దాంతో శ్రీలంక ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడ పెట్రోల్, డీజిల్ కోసం బంక్ స్టేషన్ల దగ్గర పెద్దస్థాయిలో క్యూలు ఉన్నాయి.

సమయం 27 Jun 2022 7:22 pm

పార్టీలో 20 మంది విద్యార్థులు మృతి.. నైట్ క్లబ్‌లో మృతదేహాలు

నైట్‌క్లబ్‌లో పార్టీ చేసుకున్న విద్యార్థులు పొద్దుటికి విద్యార్థులు విగతజీవులుగా కనిపించారు. పరీక్షలు అయిపోయాయని పార్టీ చేసుకున్న 20 మంది చనిపోయారు. అసలు ఎలా చనిపోయారనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది వారిపై విష ప్రభావం జరిగిందని భావిస్తున్నారు. అయితే స్థానిక అధికారులు మాత్రం దీనిపై ఎటువంటి ఊహాగానాలు చేయలేమని అంటున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. అయితే ఈ మరణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

సమయం 26 Jun 2022 7:33 pm

అబార్షన్‌ హక్కుల కోసం భగ్గుమంటున్న అమెరికన్లు.. అసలేం జరిగింది?

Abortion Rights: అమెరికాలో అబార్షన్‌ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. 50 రాష్ట్రాల్లో మహిళలు, అమెరికన్లు నిరసనకు దిగారు. అబార్షన్లపై US సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. అంతర్జాతీయంగానూ ఈ అంశం ప్రకంపనలు రేపుతోంది. వివిధ దేశాల అధ్యక్షులు ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం ఈ తీర్పుకు వ్యతిరేకంగా గళం విప్పారు.

సమయం 25 Jun 2022 5:44 pm

నార్వే నైట్ క్లబ్‌లో కాల్పులు, ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు

నార్వేలోని నైట్‌ క్లబ్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, 14 మంది చనిపోయారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించామని, అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

సమయం 25 Jun 2022 10:03 am

IAF: ఆకాశంలో అద్భుతం.. భారత యుద్ధ విమానాలకు యూఏఈ అరుదైన సాయం!

IAF | భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ యుద్ధ విమానాలను యూఏఈ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం గాల్లోనే ఇంధనాన్ని నింపింది. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. భారత్, యూఏఈ మధ్య ఉన్న బలమైన సంబంధాలకు ఈ ఘటన అద్దం పట్టింది. భారత యుద్ధ విమానాలు టాక్టికల్ లీడర్‌షిప్ ప్రోగ్రాంలో పాల్గొనడం కోసం ఈజిప్ట్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో రఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుతున్న సమయంలోనూ యూఏఈ వాటికి గాల్లోనే ఇంధనాన్ని నింపింది.

సమయం 24 Jun 2022 6:57 pm

స్విమ్మింగ్ పోటీల్లో షాకింగ్ ఘటన.. స్పృహ కోల్పోయి కొలనులో మునిగిన స్విమ్మర్

FINA World Aquatics Championships: అంతర్జాతీయ ఈత పోటీల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన స్విమ్మర్ అనితా అల్వారెజ్‌ (25) ‘ఫినా వరల్డ్ అక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌’ పోటీల్లో సోలో ఫ్రీ ఫైనల్‌లో పోటీ పడుగూ తన ప్రదర్శన సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్విమ్మింగ్ పూల్ దిగువకు మునిగిపోయింది. పోటీలను వీక్షిస్తున్న వారు ఆమె సాధరణంగానే నీటిలో మునిగిందని అనుకున్నారు. కానీ, అక్కడే ఉన్న కోచ్‌ ప్రమాదాన్ని గుర్తించారు.

సమయం 24 Jun 2022 4:57 pm

సీఎం కేసీఆర్, అనిల్ కూర్మాచలంకు రాధారపు సతీష్ కృతజ్ఞతలు

హైదరాబాద్: ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యమకారునికి దక్కిన గౌరవం తెలంగాణ రాష్ట్ర వాదాన్ని ఖండాంతరాలలో టీఆరెఎస్ ఎన్నారై విభాగాన్ని స్థాపించి కేసీఆర్ నాయకత్వంలో బలంగా వినిపించిన ఎన్నారై టీఆరెఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలంకు ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక, తెలంగాణ రాష్ట్ర టీవీ అండ్ చలన చిత్రాభివృద్ది సంస్థ

వన్ ఇండియా 22 Jun 2022 8:40 pm

అఫ్గన్, పాక్‌లను వణికించిన భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు

వారం రోజుల వ్యవధిలోనే పాక్‌లో మూడు సార్లు భూమి కంపించింది. ముఖ్యంగా హిమాలయాలకు సమీపంలోని పంజాబ్, ఖైబర్ ప్రావిన్సుల్లోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బుధవారం తెల్లవారుజామున కూడా మరోసారి భూమి కంపించడంతో ప్రాణభయంతో జనం వీధుల్లోకి పరుగులు తీశారు. ఇప్పటి వరకూ భూకంప నష్టం గురించి ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. భూమి అంతర్గత చర్యల కారణంగానే తరుచూ ఈ ప్రకపంనలు చోటుచేసుకుంటున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.

సమయం 22 Jun 2022 7:47 am

Elon Musk తండ్రిపై కోర్టుకెక్కిన ఎలాన్ మస్క్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె.. అసలు కారణం ఇదే

ఇటీవల కాలంలో ప్రపంచ కుబేరుల్లో ఒకరు, టెస్లా సంస్థ చీఫ్ ఎలాన్ మస్క్ తరుచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తారు. ఆయన ఏదో ఒక వివాదంతో మీడియాలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంస్థను చేజిక్కించుకున్న తర్వాత మస్క్ చేసిన ప్రకటనలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా, అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ఆయన ట్రాన్స్‌జెండర్ కుమార్తె కోర్టులో దావా వేసింది. ఆయన సాయం నాకొద్దంటూ, పేరు మార్చాలని కోర్టును కోరింది.

సమయం 21 Jun 2022 1:37 pm

డల్లాస్‌లో మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా యోగా

యోగాను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలపడంతో 2015 నుంచి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. యోగా వల్ల శరీరం, మనసు అధీనంలో ఉంటాయని అనేక పరిశోధనల్లోనూ వెల్లడయ్యింది. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప ఔషధం యోగా. అందుకే దీనిని మతాలకు అతీతంగా సాధన చేయడానికి ముందుకొస్తున్నారు. అమెరికాలోని ప్రవాస భారతీయులు యోగా దినోత్సవం సందర్భంగా ఆసనాలు వేశారు.

సమయం 21 Jun 2022 6:52 am

Sergey Brin Divorce భార్యతో విడిపోతున్న మరో ధనవంతుడు.. హాట్ టాపిక్‌గా గూగుల్ వ్యవస్థాపకుడి విడాకులు

ప్రపంచంలోనే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ను 98లో స్థాపించినవారిలో సెర్గే బ్రిన్ ఒకరు. తన సహచరుడు లారే పేజ్‌తో కలిసి ఏర్పాటుచేసిన గూగుల్ అతి తక్కువ సమయంలో బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. దీనిని ఈ స్థాయికి తీసుకురావడంలో భాగస్వాముల కృష్టి, పట్టుదల, శ్రమ దాగి ఉన్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో సెర్గే ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే, ఆయన రెండో పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే త్వరలో ముగియనుంది.

సమయం 20 Jun 2022 5:02 pm

Sri Lanka Crisis మాజీ క్రికెటర్ గొప్ప మనసు.. బంకుల వద్ద క్యూలైన్‌లో ఉన్నవారికి టీ, బన్స్ సర్వ్

ద్వీప దేశం శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆర్థిక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కనీస అవసరాలు కూడా తీరక అక్కడ జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ద్రవ్యోల్బణానికి తోడు ఆహార కొరతతో ఏ వస్తువులు, సరుకులు ఓ పట్టాన దొరకడం లేదు. దీంతో పప్పు దగ్గర నుంచి పెట్రోల్ వరకు గంటల తరబడి క్యూలైన్‌లో ప్రజలకు నిరీక్షణ తప్పడం లేదు. పెట్రోల్‌ కోసం క్యూలైన్‌లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కలచివేస్తున్నాయి.

సమయం 20 Jun 2022 7:25 am

Fujian: చైనా అమ్ములపొదిలో అత్యాధునిక యుద్ధవాహక నౌక.. మరి భారత్ పరిస్థితేంటి..?

Fujian | చైనా ఇటీవలే ఫ్యూజియన్ అనే పేరున్న అత్యాధునిక యుద్ధవాహక నౌకను ప్రపంచానికి పరిచయం చేసింది. చైనా దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, దేశీయంగా నిర్మించింది. అమెరికా తరహాలో ఇందులో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కాటాపల్ట్ అసిస్ట్‌డ్ లాంచ్ సిస్టమ్‌ను వాడటం విశేషం. చైనా వద్ద ఇప్పటికే రెండు ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్లు ఉండగా.. ఇది మూడోది. ఫ్యూజియన్ అనేది తైవాన్‌కు చేరువలో ఉండే చైనా ప్రావిన్స్ కావడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

సమయం 19 Jun 2022 5:34 pm

Kabul Gurudwara Attack: కాబుల్ దాడిని ఖండించిన ప్రధాని మోదీ.. రంగంలోకి భారత్!

అప్ఘానిస్థాన్ రాజధాని కాబుల్ శివార్లలోని ఓ గురుద్వారాపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో ఓ సిక్కు సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ తక్షణమే స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దాడిని ఖండించగా.. అప్ఘానిస్థాన్‌లో ఉగ్రముప్పును ఎదుర్కొంటున్న సిక్కులు, హిందువులకు భారత్ అత్యవసరంగా ఇ-వీసాలను జారీ చేసింది. దీంతో వారు వెంటనే అప్ఘాన్ నుంచి వచ్చేయడానికి వీలవుతుంది. మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగా తామే ఈ దాడులకు పాల్పడ్డామని ఐసిస్ ప్రకటించుకున్నట్లు తెలుస్తోంది.

సమయం 19 Jun 2022 1:08 pm

సైకిల్‌ తొక్కుతూ పడిపోయిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్ తొక్కుతూ బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయారు. ఆ సమయంలో అక్కడున్నవారంతా వచ్చి జో బైడెన్‌ను పైకి లేవదీశారు. అయితే ఆయనకు ఎటువంటి గాయాలవ్వలేదు. తను బాగానే ఉన్నానని బైడెన్ కూడా చెప్పారు. కాగా తన భార్య జిల్‌ బైడెన్‌తో కలసి సైకిల్ రైడ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్న వైట్ హౌస్ కూడా ధ్రువీకరించింది. బైడన్ బాగానే ఉన్నారని కూడా పేర్కొంది.

సమయం 19 Jun 2022 10:59 am

కాబూల్‌లో గురుద్వారా లక్ష్యంగా పేలుళ్లు.. ఇద్దరి మృతి, భారత్ ఆగ్రహం

అప్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సిక్కులు దేవాలయం గురుద్వారాలో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే 30 మంది భక్తులు ఉంటుండగా ఈ పేలుళ్లు జరిగాయి. 15 మంది తప్పించుకుంటున్నట్టు తెలుస్తుంది. ఉదయం ఏడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ పరిస్థితులను పరిశీలిస్తున్నట్టు వె్లడించింది.

సమయం 18 Jun 2022 3:08 pm

పెట్రోల్ కోసం పడిగాపులు.. క్యూ లైన్‌లోనే గుండెపోటుతో డ్రైవర్ మృతి

శ్రీలంకలో ఇంకా అత్యంత దారుణమైన పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇంధనం, నిత్యావసరాలు దొరకక జనం అవస్థలు పడుతున్నారు. తాజాగా అక్కడ పెట్రోల్ కోసం వేచి చూస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. శ్రీలంకలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

సమయం 17 Jun 2022 5:54 pm

పాక్ ప్రధాని షెహబాజ్, ఇమ్రాన్ కంటే వారి భార్యలే చాలా రిచ్..!

పాకిస్థాన్‌లో ప్రధానులుగా పనిచేసిన వారిలో చాలా మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అవినీతి కేసుల్లో నవాజ్ షరీఫ్ దోషిగా తేలడంతో ఆయనకు కోర్టు శిక్ష విధించింది. అయితే, పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని, మాజీ ప్రధాని ఇమ్రాన్, ఇతర రాజకీయ నేతలు, వారి భార్యలు, ఇతర కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను తాజాగా వెల్లడయ్యాయి. ఎన్నికల కమిషన్ వద్ద వాళ్లు సమర్పించిన వివరాల ఆధారంగా చూస్తే పాలకుల కంటే వారి భార్యలే అధిక ధనవంతులు

సమయం 17 Jun 2022 8:40 am

ఒకప్పుడు టీవీ స్క్రీన్‌పై... ఇప్పుడు స్ట్రీట్‌ఫుడ్ అమ్ముకుంటూ...

అప్ఘనిస్థాన్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో అక్కడ ఓ జర్నలిస్ట్‌లు, రిపోర్టర్లు రోడ్డుపాలవుతున్నారు. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం కారణంగా చాలామంది కూటి కోసం బోలేడు పాట్లు పడుతున్నారు. ఈ పరిస్థితిని తెలియజేస్తూ ఓ జర్నలిస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సమయం 16 Jun 2022 8:55 pm

ఉత్తర కొరియా నెత్తిన మరో పిడుగు.. కరోనాకు తోడైన అంతుచిక్కని కొత్త వ్యాధి

తమను కరోనాయే తాకలేదని రెండేళ్లు చంకలు గుద్దుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడికి.. మే నెలలో ఝలక్ తగిలింది. ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించిన ఓ సైనిక పరేడ్‌తో మహమ్మారి ఎంటరైపోయింది. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరుకావడం కొంప ముంచింది. కొద్ది రోజుల్లోనే వైరస్ దావానంలా వ్యాపించి చుట్టుముట్టేసింది. ఇప్పటి వరకూ ఆదేశంలో 45 లక్షల మందికిపైగా జనం వైరస్ బారినపడ్డారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించారు కిమ్.

సమయం 16 Jun 2022 4:42 pm

I2U2: భారత్ కీలక భాగస్వామిగా.. ‘పశ్చిమాసియా క్వాడ్’ను ఏర్పాటు చేసిన అమెరికా!

I2U2 - India, Israle, UAE and USA దేశాలు కలిసి ఓ కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. ఇప్పటికే భారత్‌‌, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి క్వాడ్‌‌ను ఏర్పాటు చేసిన అమెరికా.. అదే తరహాలో నాలుగు దేశాల గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. గత ఏడాది అక్టోబర్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఈ గ్రూప్ ఏర్పాటుకు ముందడుగు పడగా.. వచ్చే నెలలో ఈ దేశాల అధినేతలు తొలిసారి వర్చువల్‌గా భేటీ కానున్నారు.

సమయం 16 Jun 2022 2:26 pm

AIDS ఒక్క డోస్‌తో హెచ్ఐవీ సమూలంగా అంతం.. ఔషధం అభివృద్ధిచేసిన శాస్త్రవేత్తలు

కొన్ని మొండి వ్యాధులను అంతం చేసే ఔషదాల కోసం నిరీక్షణ దశాబ్దాలుగా సాగుతోంది. ఎయిడ్స్, కేన్సర్ వంటి రోగాలను నయం చేసే మందుల కోసం శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు పరిశోధనలు విజయం దిశగా సాగుతున్నాయి. తాజాగా, ఇజ్రాయేల్ పరిశోధకులు ఎయిడ్స్‌ను నిరోధించే సరికొత్త చికిత్సపై చేపట్టిన ప్రయోగాలు ఆశాజనకంగా సాగుతున్నాయి. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను నేచుర్ అనే సైన్స్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురించారు.

సమయం 16 Jun 2022 10:58 am

టిండర్‌లో పరిచమైన మహిళపై రేప్.. యూకేలో భారత సంతతి వైద్యుడికి 4 ఏళ్ల జైలు శిక్ష

డేటింగ్ యాప్ టిండర్‌లో ఓ నర్సింగ్ విద్యార్ధినితో డాక్టర్ మనేశ్ గిల్‌కు నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో ఇద్దరూ ఓ చోటు కలుద్దామని భావించారు. ఇందుకు స్టీర్లింగ్‌లోని ఓ హోటల్ కలుసుకుందామని డాక్టర్ చెప్పడంతో యువతి సరేనంది. అయితే, మనేశ్ మాత్రం ప్లాన్ ప్రకారం హోటల్‌లో గది బుక్ చేశాడు. తాను చెప్పిన చోటుకు వచ్చిన తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సమయం 16 Jun 2022 8:05 am

35 వేల అడుగుల ఎత్తులో దగ్గరగా రెండు విమానాలు.. పైలట్ల చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం

త్రుటిలో ఓ రెండు విమానాలు ఢీకొట్టే సంఘటన నుంచి తప్పించుకున్నాయి. ఈ ఘటన టర్కీ గగనతలంలో రెండు రోజుల కిందట చోటుచేసుకుంది. శ్రీలంక, బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ రెండు విమానాలు దగ్గరగా వచ్చాయి. టర్కీ ఏటీసీ సూచనలను శ్రీలంక విమాన పైలట్లు పాటించి ఉంటే మాత్రం భారీ ప్రమాదమే జరిగేది. కానీ, తమకు సమీపంలోనే మరో విమానం వేగంగా వెళ్తున్నట్టు వారు గుర్తించి అంకారా ఏటీసీ సూచనలను నిరాకరించారు.

సమయం 15 Jun 2022 6:33 pm

అప్పులు పెరిగిపోతున్నాయి.. టీ తక్కువగా తాగండి.. పాక్ మంత్రి విజ్ఞ‌ప్తి

ఇప్పటికే పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం 13.8 శాతానికి చేరడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారిని మరింత రెచ్చగొట్టేలా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరచూ భారీ ర్యాలీలు, నిరసనలకు పిలుపునిస్తున్నారు. అటు, విదేశాల నుంచి స్పాట్ మార్కెట్‌లో గ్యాస్ కొనుగోలుకు అవసరమైన విదేశీ నిల్వలు లేకపోవడంతో.. ఇప్పటికే ఉన్న గ్యాస్ నిల్వలను పవర్ ప్లాంట్లకు మళ్లిస్తున్నారు. దీంతో ఎరువుల తయారీ కంపెనీలకు గ్యాస్ కొరత తలెత్తనుంది. అలాగే, నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి.

సమయం 15 Jun 2022 5:36 pm

UAE Wheat Ban: భారత గోధుమల ఎగుమతులపై యూఏఈ తాత్కాలిక నిషేధం.. కారణంఇదే..!

UAE Wheat Ban: భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంపై యూఏఈ నాలుగు నెలలపాటు నిషేధం విధించింది. మే 13వ తేదీకి ముందు భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలతోపాటు గోధుమ పిండిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కంపెనీలు పర్మిషన్ తీసుకోవాలని యూఏఈ ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలను అనుమతి తీసుకొని ఎగుమతి చేసుకోవడానికి యూఏఈ అనుమతి ఇచ్చింది.

సమయం 15 Jun 2022 2:10 pm

ధరల పెంపుపై నిరసన తెలిపితే.. 25 ఏళ్ల జైలు శిక్ష

కమ్యూనిస్ట్ దేశమైన క్యూబాలో కఠిన శిక్షలను అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. గత ఏడాది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేశారు. ఆ సందర్భంగా చాలామందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు కూడా పెట్టారు. అయితే అందులో కొంతమంది 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. అలా శిక్ష విధించిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ చర్యను ప్రభుత్వం సమర్థించుకుంటుంది. అమెరికా తీవ్రంగా ఖండిస్తుంది.

సమయం 14 Jun 2022 3:15 pm

పుతిన్ మలమూత్రాలను ప్రత్యేక సూట్‌కేసులో సేకరిస్తున్న బాడీ గార్డ్‌లు..!?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించి పాశ్చ్యాత మీడియా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. పుతిన్ విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో బాడీ గార్డులు ఆయన శరీర వ్యర్థాలను ఓ ప్రత్యేక సూట్‌కేసులోకి సేకరించి.. దాన్ని సీల్ చేసి మాస్కో‌కు పంపిస్తారని తెలిపింది. పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి వివరాలను విదేశీ గూఢచారులకు అందకుండా చూడటం కోసం ఇలా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కొరియా నియంత కిమ్ విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది.

సమయం 14 Jun 2022 2:18 pm

గొటాబయను మోదీని ఒత్తిడి చేశారని ఆరోపించిన శ్రీలంక అధికారి రాజీనామా!

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు ఇటీవల భారత్ ఉదారంగా సాయం చేసింది. ఆహారం, అత్యవసర ఔషదాలు, వైద్య పరికరాలను కూడా ఉచితంగా అందజేసింది. అయితే, లంకలోని ఎనర్జీ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ను గౌతమ్ అదానీ గ్రూప్‌నకు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్షుడు గోటాబయ రాజపక్సేపై ఒత్తిడి చేశారని చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగింది. అయితే, ఈ వ్యాఖ్యలను లంక అధ్యక్షుడు రాజపక్సే మాత్రం తీవ్రంగా ఖండించారు.

సమయం 14 Jun 2022 8:06 am

పిల్లలకు ట్రాన్స్‌జెండర్ పాఠాలు... కేసు వేసిన తల్లులు

అమెరికాలో ముగ్గురు తల్లులు ఓ స్కూల్‌పై కేసు పెట్టారు. పిల్లలకు ట్రాన్స్‌జెండర్ పాఠాలు చెబుతున్నారని వారు ఆగ్రహానికి గురయ్యారు. దాంతో ఏకంగా కోర్టుకు ఎక్కారు. పెన్సిల్వేనియాలో మౌంట్ లెబనాన్ స్కూల్లో ఫస్ట్‌గ్రేడ్ చదువుతున్న పిల్లలకు లింగ మార్పిడికి సంబంధించిన పాఠాలు చెబుతున్నారని, దానిపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.

సమయం 13 Jun 2022 9:12 pm

భారత్‌కు పక్కలో బల్లెంలా మారిన పాక్, చైనాలు.. మరోసారి బయటపడ్డ దోస్తీ

పాకిస్థాన్‌కు అప్పులను ఎరగా వేసి చైనా తన చెప్పుచేతల్లో పెట్టుకుంది. ఈ రెండు దేశాలూ కలిపి భారత్‌పై కుట్రలు చేస్తూ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి చేయని ప్రయత్నం లేదు. తాజాగా, ఇరు దేశాల మధ్య మైత్రి మరోసారి బట్టబయలైంది. సంయుక్త సైనిక ఆపరేషన్ కమిటీలో భాగంగా పాక్ ఆర్మీ చీఫ్ నాలుగు రోజుల చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ముఖ్యంగా రక్షణ విషయంలో అనేక కీలక ఒప్పందాలు జరిగాయి.

సమయం 13 Jun 2022 4:34 pm

Sri Lanka Crisis అదానీకి మోదీ సిఫార్సు.. శ్రీలంకలో పెను దుమారం.. ఆ వ్యాఖ్యలపై అధికారి యూటర్న్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లంకలో ప్రజాందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ పవర్ ప్లాంట్‌పై తీవ్ర దుమారం రేగుతోంది. భారత్‌లో విలువైన మౌలిక వసతుల ప్రాజెక్ట్లన్నీ అదానీ చేతిలోనే ఉన్నాయి. ప్రముఖ పోర్ట్‌లు కూడా అదానీ దక్కించుకున్నారు. అయితే మోదీ రికమండేషన్‌తో శ్రీలంకలో పవర్ ప్రాజెక్ట్ దక్కిందని, అధ్యక్షుడు గొటాబయ రాజపక్సేపై భారత ప్రధాని ఒత్తిడి తీసుకొచ్చినట్టు సిలోన్ ఎలక్ట్రిసిటీ సీనియర్ అధికారి చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

సమయం 13 Jun 2022 2:50 pm

US mass shooting: కాల్పులతో దద్దరిల్లిన అగ్రరాజ్యం.. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు

అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగ విప్పింది. దుండగులు రెచ్చిపోయారు. విచ్చలవిడిగా, విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దాంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో యువకులు, మహిళలు కూడా ఉన్నారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల ఘటనలు వరసగా జరిగాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తుపాకీ సంస్కృతిని అదుపు చేసేందుకు అమెరికా పార్లమెంట్‌‌లో చర్చలు సాగుతున్నాయి.

సమయం 13 Jun 2022 1:25 pm

రూ.22 వేలు కట్నం ఇచ్చి మరీ ఆడ మేకను పెళ్లి చేసుకున్నాడు..!

ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇండోనేషియాలో ఓ వ్యక్తి ఆడమేకను పెళ్లి చేసుకున్నాడు. కట్నం ఇచ్చి మరీ ఆడ మేకను సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. దీనికి స్థానికులు కూడా ఎంతో ప్రోత్సాహం అందించారు. అయితే ఆ వ్యక్తి అనుకున్నట్టుగా పెళ్లి వీడియో వైరల్ అయింది. అయితే నెటిజన్లు మాత్రం మండిపడ్డారు. దీనివల్ల ఎక్కువ నష్టమే జరుగుతుందని కామెంట్లు పెట్టారు. దాంతో ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి క్షమాపణలు చెప్పక తప్పలేదు. కించపరచడానికి తీయలేదని కూడా చెప్పుకొచ్చాడు.

సమయం 11 Jun 2022 5:02 pm

రష్యా దాడిపై మేం ముందే హెచ్చరించినా.. జెలెన్‌స్కీ వినలేదు: జో బైడెన్

రష్యా ముందుస్తు ప్రణాళికతోనే ఉక్రెయిన్‌పై దాడికి దిగిందని, ఈ విషయంలో తమ హెచ్చరికలను కీవ్ పట్టించుకోలేదని తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీయే కాదు అమెరికా మిత్రదేశాలు కూడా దీనిని అతిశయోక్తిగా భావించాయి. కానీ, చివరకు అమెరికా అంచనాలన్నీ నిజమయ్యాయి. తేదీలతో సహా ముందుగానే అగ్రరాజ్యం మాస్కో దురాక్రమణ గురించి వెల్లడించింది. ఫిబ్రవరి రెండో వారంలోనే దాడి జరుగుతుందని చెప్పింది. అయితే, తేదీ మారింది కానీ దండయాత్ర పక్కగా జరిగింది.

సమయం 11 Jun 2022 4:10 pm

శ్రీలంకకు భారత్ సాయం.. వర్షాకాల సీజన్లో ఊరటనిచ్చేలా కీలక ఒప్పందం

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను ఆదుకోవడం గత కొద్ది నెలలుగా భారత్ పలు విధాలుగా సాయం చేస్తోంది. ఇప్పటికే పొరుగు దేశానికి భారీ మొత్తంలో ఆర్థిక సాయంతోపాటు డీజిల్ నిల్వలను పంపిన భారత్.. తాజాగా క్రెడిట్ లైన్ రూపంలో 65 వేల మెట్రిక్ టన్నుల యూరియాను పంపేందుకు అంగీకరించింది.

సమయం 11 Jun 2022 11:33 am

పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ పరిస్థితి అత్యంత విషమం

Pakistan మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కండరాల సంబంధిత వ్యాధి Amyloidosis తో బాధపడుతున్న ముషారఫ్ గత 3 వారాలుగా దుబాయ్‌లోని అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా ఆయణ్ని వెంటిలేటర్‌పై ఉంచి లైఫ్ సపోర్టు అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కోలుకోలేనంత క్లిష్టంగా ఉందని ట్వీట్ చేశారు. కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకుడు ముషారఫ్.

సమయం 10 Jun 2022 7:13 pm

Pakistan భారీగా తగ్గిపోయిన హిందువులు.. పాక్ జనాభాలో ఎంత మంది ఉన్నారంటే?

దాయాది పాకిస్థాన్‌లో ఒకప్పుడు 20 శాతంగా ఉన్న హిందువులు 7 దశాబ్దాల్లో గణనీయంగా తగ్గిపోయారు. ఏటా ఈ జనాభా క్షీణిస్తూ వస్తోంది. 98 తర్వాత ఇది మరింత వేగంగా తగ్గిపోవడం గమనార్హం. ప్రస్తుతం మైనార్టీల జనాభాలో మాత్రం హిందులే అత్యధికంగా ఉన్నారు. తర్వాతి క్రైస్తవులు ఉండగా.. పాక్ మొత్త జనాభాలో ముస్లింలే 98 శాతం మంది. ఇటీవల కాలంలో హిందువుల సహా మైనార్టీలపై పాక్‌లో దాడులు పెరుగుతున్నట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

సమయం 10 Jun 2022 8:55 am

గంజాయి సాగు, వాడకం చట్టబద్దం.. బాంబు పేల్చిన థాయ్‌లాండ్

గంజాయిని నార్కోటిక్స్ అంటే డ్రగ్స్ జాబితా నుంచి థాయ్‌లాండ్ తొలగించింది. 2018లోనే చికిత్సలో గంజాయి వాడకానికి అనుమతించి, ఈ నిర్ణయం తీసుకున్న మొదటి ఆసియా దేశంగా గుర్తింపు పొందింది. థాయ్ ప్రభుత్వ నిర్ణయంతో ఇక అక్కడ గంజాయితో కూడిన వంటకాలు, పదార్థాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కస్టమర్లు రెస్టారెంట్‌లలో తమకు నచ్చిన వాటిని ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, దీని వల్ల నేరాలు కూడా పెరుగుతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

సమయం 9 Jun 2022 6:40 pm

చైనాకు షాకిచ్చిన భారత్.. మిలటరీ బేస్‌లు వాడుకునేలా వియత్నాంతో ఒప్పందం

లడఖ్ సరిహద్దుల్లో కవ్విస్తోన్న చైనాకు భారత్ షాకిచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో ప్రాదేశిక జలాల విషయమై చైనాతో వివాదం ఉన్న వియత్నాంతో కీలక సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాలు పరస్పరం మిలటరీ బేస్‌లను వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్ తన యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను చైనాకు చేరువగా.. వియత్నాంలో నిలిపేందుకు అవకాశం ఉంటుంది. వియత్నాం ఈ తరహా ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశం భారత్ కావడం విశేషం.

సమయం 9 Jun 2022 1:07 pm

Pakistan లోయలోకి దూసుకెళ్లిన మినీ వ్యాన్.. 22 మంది మృతి

దాయాది పాక్‌లోని అత్యంత ఎత్తైన కొండ ప్రాంతం బలూచిస్థాన్‌లో తరుచూ రోడ్డు ప్రమాదాలతో వందల మంది ప్రాణాలు కోల్పోతుంటారు. పాక్ నైరుతి ప్రాంతంలో ఏడాదిలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా పాక్ ప్రభుత్వం మాత్రం నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా, బుధవారం జరిగిన ప్రమాదంలో మరో 22 మంది బలయ్యారు. ఆ ప్రాంతంలో రహదారి భద్రత నిబంధనలు నామ మాత్రంగా ఉంటాయి. ప్రజల కుడా ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో అలసత్వం వహిస్తారు.

సమయం 8 Jun 2022 4:37 pm

కరువుతో ఎండిపోయిన టైగ్రిస్ నది.. పురాతన నగరం బయటకు!

Iraq: ఇరాక్‌లోని కెమునేలోని కుర్దిస్థాన్ రీజియన్‌లో ఎండిపోయిన టైగ్రిస్ నది భాగంలో ఓ పురాతన నగరం బయటపడింది. క్రీ.పూ. 1550 - క్రీ.పూ. 1350 మధ్య ఈ నగరం మిట్టని సామ్రాజ్య పాలనలో కీలకంగా ఉండవచ్చని పరిశోధకులు, పరావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సమయం 8 Jun 2022 4:20 pm

Hong kong ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం.. అక్కడ పెట్రోల్ కంటే కప్పు కాఫీ, కిలో టమోటాలే కాస్ట్!

కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసింది. ఇప్పుడిప్పుడే ప్రపంచం కుదుటుపడుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ముప్పు మాత్రం పూర్తిగా తొలగిపోలేదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక, ఈ ఏడాది కూడా అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ నిలిచినట్టు ఓ అంతర్జాతీయ సర్వే నివేదికలో వెల్లడించింది.

సమయం 8 Jun 2022 4:02 pm

Ukraine War రష్యాకు ఎదురుదెబ్బ.. మరో సైనిక జనరల్‌ను హతమార్చిన ఉక్రెయిన్

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు బారీ సైనిక, ఆయుధ నష్టం వాటిళ్లుతోంది. అయితే ఈ విషయాన్ని మాస్కో బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటి వరకూ తాము 12 మంది మాస్కో సైనిక జనరల్స్‌ను మట్టుబెట్టామని కీవ్ ప్రకటించింది. కానీ, దీనిపై క్రెమ్లిన్ మాత్రం నోరు విప్పడం లేదు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల నుంచి ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని అందుకుంటున్న ఉక్రెయిన్.. వాటి సాయంతో పోరాటం కొనసాగిస్తోంది. త్వరలో అమెరికా క్షిపణి వ్యవస్థలు రానున్నాయి.

సమయం 8 Jun 2022 11:54 am

Cancer క్లినికల్ ట్రయల్స్‌లో తొలిసారి.. ఒకే ఔషధంతో పేషెంట్లందరిలో కేన్సర్ మాయం

వైద్య శాస్త్రానికి ఇప్పటి వరకూ అంతుబట్టిన రహస్యంగా ఉన్న కేన్సర్ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీనిని పూర్తిగా నయం చేసే చికిత్సలు, ఔషధాలు అందుబాటులోకి ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో చీకట్ల చిరుదీపంలా ఓ ప్రయోగం సత్ఫలితాన్ని ఇచ్చింది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న రోగులందరికీ కేన్సర్ నయం కావడం ఆశాకిరణంలా భావిస్తున్నారు. రెక్టార్ కేన్సర్ బాధితులపై అమెరికా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. మరిన్ని ప్రయోగాలకు వారు సిద్ధమయ్యారు.

సమయం 8 Jun 2022 10:12 am