SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

CMRF |నిరుపేదల పాలిట వరం

CMRF | నిరుపేదల పాలిట వరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..పేద ప్రజల

ప్రభ న్యూస్ 12 Nov 2025 11:29 am

Bhodhan –సస్పెండ్ చేసారు సరే. మరి.. డబ్బు..?

Bhodhan – సస్పెండ్ చేసారు సరే. మరి.. డబ్బు..? బోధన్, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 12 Nov 2025 11:23 am

హైవే పై వెళ్లేవారికి అలెర్ట్.. దారి దోపిడీ ముఠాలున్నాయ్

హైవేలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలి. దారి దోపిడీ గ్యాంగ్ లు కాచుకుని ఉన్నాయి

తెలుగు పోస్ట్ 12 Nov 2025 11:12 am

తాడిపత్రిలో ఉద్రిక్తత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి - వైసిపి పోటాపోటీగా కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తోంది. వైసిపి మెడిక‌ల్ కాలేజీల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి కార్యక్రమాలు ఉన్నందున మరో చోట కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని వైసిపి నేతలకు పోలీసులు సూచించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికి మండల కేంద్రంలో ర్యాలీకి ఏర్పాట్లు చేసుకున్నారు.  తాడిపత్రిలోని ఇంటి వద్ద ర్యాలీకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టనున్న విషయం తెలిసిందే. టిడిపి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి మరో చోట కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల సూచనతో యాడికి మండల కేంద్రానికి వైసిపి కార్యక్రమం మార్చుకున్నారు.  

మన తెలంగాణ 12 Nov 2025 11:12 am

Chiru-Charan’s Mega Comeback, Fans On Cloud Nine

Mega fans had been disappointed for quite some time following the underwhelming results of Megastar Chiranjeevi’s Bholaa Shankar and Mega Power Star Ram Charan’s Game Changer. Adding to their woes, the Mega camp hadn’t seen a true musical hit in recent years. However, that dry spell seems to have ended in spectacular fashion. Fans are […] The post Chiru-Charan’s Mega Comeback, Fans On Cloud Nine appeared first on Telugu360 .

తెలుగు 360 12 Nov 2025 11:07 am

Lord|సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భారీగా ఆదాయం

Lord|సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భారీగా ఆదాయం వివిధ సేవా రుసుముల ద్వారా 30 లక్షల

ప్రభ న్యూస్ 12 Nov 2025 11:00 am

బాసో బలి ​ ..సాహో

బాస్మతికి గట్టి పోటీ చిట్టి ముత్యాలకు తోడు ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు

ప్రభ న్యూస్ 12 Nov 2025 10:43 am

దారుణ హత్య…

దారుణ హత్య… పాత కక్షలు నేపద్యంలో హత్య..అక్రమ సంబంధం వ్యవహారమే కారణమా?.. నంద్యాల

ప్రభ న్యూస్ 12 Nov 2025 10:38 am

విశాఖలో కంటైనర్ బోల్తా... ట్రాఫిక్ జామ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ప్రాంతం అక్కిరెడ్డిపాలెంలోని షీలానగర్ చౌరస్తా వద్ద కంటైనర్ బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోర్టు రోడ్డు నుంచి ఎన్‌ఎడి వైపు వెళ్తున్న కంటైనర్ లారీ బోల్తాపడింది. మార్నింగ్ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో నాలుగు క్రేన్ల సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

మన తెలంగాణ 12 Nov 2025 10:35 am

ఆయన.. రైతుకు రోల్ మోడల్..

ఆయన.. రైతుకు రోల్ మోడల్.. చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో – మన దేశంలో

ప్రభ న్యూస్ 12 Nov 2025 10:20 am

Weather Report : చలిగాలులు చంపేస్తున్నాయ్.. ఇంకా ఎన్ని రోజులంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ని

తెలుగు పోస్ట్ 12 Nov 2025 10:09 am

Delhi : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..హైబ్రిడ్ విధానంలో పాఠశాలలు

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ఈరోజు మరింతగా క్షీణించింది. వాయు కాలుష్యం పెరిగింది

తెలుగు పోస్ట్ 12 Nov 2025 10:05 am

నేడు ఢిల్లీకి మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

తెలుగు పోస్ట్ 12 Nov 2025 9:49 am

డేంజర్ హైవే..

డేంజర్ హైవే.. నెల్లికుదురు, ఆంధ్రప్రభ : మండలంలోని నర్సింహులగూడెం శివారులో నడుస్తున్న గ్రీన్

ప్రభ న్యూస్ 12 Nov 2025 9:42 am

తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత

తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటా పోటీ కార్యక్రమాలను నిర్వహించడానికి పిలుపు నిచ్చారు

తెలుగు పోస్ట్ 12 Nov 2025 9:41 am

పోలీస్ వాహనం ఢీకొని ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

చెన్నై: తమిళనాడు రాష్ట్రం శివగంగ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుప్పువనమ్‌లోని సక్కుడిలో ద్విచక్రవాహనాన్ని పోలీసులు వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడడంతో మదురైలోని ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంజియూర్ లోని బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన ప్రసాద్, సత్య అనే దంపతులు, కూతరు అశ్విన్ గా గుర్తించారు. గాయపడిన మహిళ పేరు ఈశ్వర్ గా గుర్తించారు. మృతులు మేలురు ప్రాంతంలోని చిత్తపాటి గ్రామానికి చెందిన వారు అని పోలీసులు వెల్లడించారు.  

మన తెలంగాణ 12 Nov 2025 9:40 am

Dharmendra Discharged: In Recovery Mode

Veteran Bollywood actor Dharmendra has been hospitalized and there are a lot of rumors about his health from the past couple of days. His family members said yesterday that Dharmendra is recovering well. The 89-year-old actor has been discharged today from the hospital and he will be treated at his residence for further recovery. The […] The post Dharmendra Discharged: In Recovery Mode appeared first on Telugu360 .

తెలుగు 360 12 Nov 2025 9:34 am

Chandrababu : నేడు విశాఖపట్నానికి చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు.

తెలుగు పోస్ట్ 12 Nov 2025 9:33 am

Actor Govinda Falls Unconscious at Home

Bollywood has been going through a tough phase because of several uncertain incidents. Veteran actor Dharmendra is hospitalized and he is in recovery mode. Now, the entire nation woke up to a shock after actor Govinda was rushed to CritiCare Hospital in Juhu, Mumbai last night. He fell unconscious at his residence last night and […] The post Actor Govinda Falls Unconscious at Home appeared first on Telugu360 .

తెలుగు 360 12 Nov 2025 9:31 am

జనం బాటలో.. కవిత..

జనం బాటలో.. కవిత.. మిర్యాలగూడ, ఆంధ్రప్రభ – నల్లగొండ జిల్లాలో తెలంగాణ జాగృతి

ప్రభ న్యూస్ 12 Nov 2025 9:24 am

జై శ్రీరామ్ ఇటుకలు..

జై శ్రీరామ్ ఇటుకలు.. భద్రాచలం, ఆంధ్రప్రభ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్

ప్రభ న్యూస్ 12 Nov 2025 9:16 am

వైరలైన చిరు టెన్త్ సర్టిఫికెట్..

వైరలైన చిరు టెన్త్ సర్టిఫికెట్.. మెగాస్టార్ చిరంజీవి.. (Chiranjeevi) ఒక వ్యక్తిగా ఇండస్ట్రీలోకి

ప్రభ న్యూస్ 12 Nov 2025 9:07 am

Gold Prcie Today : పసిడి ధరలు అందుబాటులోకి రానున్నాయా? మీకోసం తీపికబురు

నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపిస్తుంది

తెలుగు పోస్ట్ 12 Nov 2025 8:59 am

విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచారం... టీచర్ పై పోక్సో కేసు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుప‌తిలో విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్చుకొని మూడేళ్లుగా చిన్నారిపై టీచర్ అత్యాచారం చేశాడు. ఓ ప్రైవేటు స్కూల్‌లో చెన్నంపల్లి జలపతి రెడ్డి అనే వ్యక్తి సోషల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. కూతురు తీరుపై మార్పును గమనించి తల్లిదండ్రులు నిలదీశారు. తిరుపతి ఈస్ట్ పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈస్ట్ పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.  ఈస్ట్ డిఎస్పి భక్తవత్సలం ఆధ్వర్యంలో విచారణ చేయగా నిందితుడు నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

మన తెలంగాణ 12 Nov 2025 8:54 am

కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తుల ఆందోళన

తిరుపతి: కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా కపిలతీర్థం పుష్కరిణీ వ‌ద్ద‌ భక్తుల నిరసన తెలిపారు. స్నానం ఆచ‌రించేందుకు అనుమతించడం లేద‌ని టిటిడి వైఖరిపై భక్తులు మండిపడుతున్నారు.  టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు డౌన్ డౌన్, ఇఒ డౌన్ డౌన్ అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఎందుకు స్నానానికి రానివ్వడంలేదని ప్రశ్నించారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అయ్యప్ప భక్తులు వాపోతున్నారు. అయ్యప్ప భక్తులు ఆందోళనతో అధికారులు దిగివచ్చారు.  పుష్క‌రిణీలో అయ్యప్ప భక్తులు స్నానాలకు అనుమతి ఇచ్చారు. ఆందోళ‌న చేసిన‌ప్పుడే కాదు ప్ర‌తి రోజూ వ‌ద‌లండి అంటూ భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు. 

మన తెలంగాణ 12 Nov 2025 8:49 am

Why Did Konda Surekha Apologise Only to Nagarjuna?

Minister Konda Surekha has finally apologised to actor Akkineni Nagarjuna for the controversial remarks she made. Her apology came through a late-night tweet that seemed carefully worded and legally cautious. She wrote: “I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu […] The post Why Did Konda Surekha Apologise Only to Nagarjuna? appeared first on Telugu360 .

తెలుగు 360 12 Nov 2025 8:41 am

సస్పెన్స్, థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వారికి మంచి ట్రీట్‌లా..

హీరో అల్లరి నరేష్ నటిస్తున్న థ్రిల్లర్ ‘12ఎ రై ల్వే కాలనీ’ సినిమాను నాని కాసరగడ్డ ద ర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీ నివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్‌తో పాపులరైన డాక్ట ర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశా రు. తాజాగా లాంచ్ చేసిన 12ఎ రైల్వే కాలనీ ట్రై లర్ మిస్టరీ మర్డర్స్ సిరీస్ చుట్టూ తిరిగుతూ ఆ ద్యంతం ఆకట్టుకుంది. దర్శకుడు నాని కాసరగ డ్డ... డా. విశ్వనాథ్ రాసిన థ్రిల్లింగ్ కథను తెరపై సస్పెన్స్‌తో అద్భుతంగా చూపించారు. అల్లరి నరే ష్ ఈసారి తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, ఇం టెన్స్ ఎమోషన్స్‌తో అదరగొట్టారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “చాలా మల్టీ లేయర్స్ ఉండే కథ ఇది. ఏ కథ ఎ టు నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డై రెక్టర్ నాని సినిమాని చాలా అద్భుతంగా తీశా డు. సినిమాలో కామాక్షి చాలా సహజంగా నటించింది. ఈ సినిమా చూసి రెండు, మూడు చోట్ల జర్క్ అవుతారు. అందరూ థియేటర్స్‌కి వచ్చి సి నిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. డైరెక్టర్ నాని మా ట్లాడుతూ “సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది”అని అన్నారు. షో రన్నర్ అనిల్ మాట్లాడుతూ “మంచి కథ, కాన్సెప్ట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వస్తున్న సినిమా ఇది. నరేష్ లేకపోతే ఇదొక చిన్న కథగా అయిపోయేది. ఆయన ఓకే చేశారు కాబట్టి ఇంత డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సినిమా చూడబోతున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్స్‌ని ఎంజాయ్ చేసే ఆడియన్స్‌కి ఇది మంచి ట్రీట్‌లా ఉండబోతుంది. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు”అని పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మా ట్లాడుతూ “ ఈ సినిమాలో వాట్ నెక్స్ అనేది మనం ఎవరు కూడా ఊహించలేము. నాకు ఒక డిఫరెంట్ మ్యూజిక్ చేయడానికి స్కోప్ ఇచ్చిన సినిమా ఇది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కామాక్షి, నిర్మాత శ్రీనివాస చిట్టూరి, జీవన్ కుమార్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 12 Nov 2025 8:40 am

Tirumala : తిరుమలకు వెళుతున్నారా.. అయితే మీకొక గుడ్ న్యూస్

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు.

తెలుగు పోస్ట్ 12 Nov 2025 8:33 am

NBK’s Akhanda 2 Lagging Behind in Promotions

Akhanda 2 is the most awaited film of the year and it is slated for December 5th release. The shoot of the film has been wrapped up and the expectations are big on the film. With just three weeks left for the film’s release, the film’s promotions are yet to begin. The makers have closed […] The post NBK’s Akhanda 2 Lagging Behind in Promotions appeared first on Telugu360 .

తెలుగు 360 12 Nov 2025 8:30 am

నిజామాబాద్ లో రెండు రోజుల్లో పెళ్లి.... నవవరుడు ఆత్మహత్య

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్‌పాడ్‌లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లికి ముందు చెట్టుకు ఉరి వేసుకొని ప్రతాప్(౩౦) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో గొడవ జరిగిందన్న మనస్థాపంతో ప్రతాప్ బయటకు వెళ్లాడు. గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 12 Nov 2025 8:27 am

చెన్నూరులో.. మంత్రి వివేక్..

చెన్నూరులో.. మంత్రి వివేక్.. చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో

ప్రభ న్యూస్ 12 Nov 2025 8:24 am

మంచి వినోదం, సందేశమున్న సినిమా

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సిని మా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నా రు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్స్ బా బీ, సందీప్ రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ ర వి, ప్రొ డ్యూసర్ లగడపాటి శ్రీధర్ ముఖ్య అ తిథులుగా పా ల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడు తూ “సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ చాలా బాగుంది. ఇలాంటి ముఖ్యమైన సబ్జెక్ట్‌ను అందరికీ నచ్చేలా చె ప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు తప్పకుండా స క్సెస్ దక్కుతుంది”అని తెలియజేశారు. లెలేక్టర్ సం జీవ్‌రెడ్డి మాట్లాడుతూ - “అన్నీ బా గుండి లైఫ్‌స్టైల్ వ ల్ల సంతాన లేమితో బాధపడేవారిని ఈ మూవీలో చూపించాం. ట్రైల ర్ చూస్తే మంచి లవ్ స్టోరీ ఉంది, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ ఉన్నాయి. వాటితో పా టు చిన్న సందేశం కూడా ఉంది. ఇదే మా సినిమా”అని అన్నారు. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడు తూ “- ఈ చిత్రంతో ఒ క మంచి ప్రయత్నం చేశాం. ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న ఒక క్లీన్ ఫ్యామిలీ మూవీ నిర్మించాం. మా సినిమాను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా”అని తెలిపారు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ “ఒక సున్నితమైన సమస్యను తీసుకుని దా నికి వినోదాన్ని జతచేసి రూపొందించిన చిత్రమిది. మూవీ చివరలో మంచి భావోద్వేగం, సందేశంతో ప్రే క్షకులు థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. సిని మా విజయంపై నమ్మకంగా ఉన్నాము” పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి, హీరోయిన్ చాందినీ చౌదరి, అజయ్ అరసాడ, కాసర్ల శ్యామ్, షేక్ దావూద్.జి, బాలవర్థన్, కల్యా ణ్ రాఘవ్, మురళీధర్ గౌడ్ పాల్గొన్నారు. 

మన తెలంగాణ 12 Nov 2025 8:20 am

Andhar Pradesh :ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం?

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది

తెలుగు పోస్ట్ 12 Nov 2025 8:18 am

ఆలయం మూసేసారు..

ఆలయం మూసేసారు.. వేములవాడ, ఆంధ్రప్రభ – దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ

ప్రభ న్యూస్ 12 Nov 2025 8:16 am

BB Kingdom Task Turns the House Into a Royal Battlefield

The latest Bigg Boss Telugu episode introduced a brand-new challenge — the BB Kingdom task, designed to decide who will earn immunity this week. The setup transformed the house into a mini monarchy, with Kings, Queens, Commanders, and Commoners — sparking lobbying, strategy, and plenty of drama. The Royal Appointments Bigg Boss crowned Kalyan, Ritu, […] The post BB Kingdom Task Turns the House Into a Royal Battlefield appeared first on Telugu360 .

తెలుగు 360 12 Nov 2025 8:14 am

Bigg Boss Telugu 9 : Is Star MAA Favouritism Towards Tanuja Crossing the Line?

As Bigg Boss Telugu Season 9 progresses, social media discussions have intensified over alleged bias and special treatment shown toward contestant Tanuja. From the way host Nagarjuna addresses her to the privileges she reportedly enjoys, viewers are questioning why the makers are so keen on making her the winner of the season. Nagarjuna’s Gentle Schooling […] The post Bigg Boss Telugu 9 : Is Star MAA Favouritism Towards Tanuja Crossing the Line? appeared first on Telugu360 .

తెలుగు 360 12 Nov 2025 8:10 am

ఆ.. చట్టాలు అమలు..

ఆ.. చట్టాలు అమలు.. బిక్కనూర్, ఆంధ్రప్రభ – రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ చట్టాలను

ప్రభ న్యూస్ 12 Nov 2025 8:03 am

Superstar Fans’ new Demand for GlobeTrotter

Superstar Mahesh Babu fans have been left restless for months as there were no official updates rolling about SS Rajamouli’s film which is called SSMB29. Later it was named GlobeTrotter and the team announced that the big update will arrive in November. This left them in delight and Rajamouli offered a treat with a number […] The post Superstar Fans’ new Demand for GlobeTrotter appeared first on Telugu360 .

తెలుగు 360 12 Nov 2025 8:03 am

Delhi Bomb Blast : ఢిల్లీ పేలుళ్లపై షాకింగ్ నిజాలివే.. దేశంలో వైట్ కాలర్ టెర్రరిజం

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు ఉగ్రకుట్ర కారణమని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు.

తెలుగు పోస్ట్ 12 Nov 2025 8:00 am

నాగార్జునకు సారీ..

నాగార్జునకు సారీ.. అక్కినేని నాగార్జునకు (Nagarjuna) తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda

ప్రభ న్యూస్ 12 Nov 2025 7:56 am

పీవీఎన్ మాధవ్ కు ఘన స్వాగతం..

పీవీఎన్ మాధవ్ కు ఘన స్వాగతం.. తిరుపతి తుడా, ఆంధ్రప్రభ: భారతీయ జనతా

ప్రభ న్యూస్ 12 Nov 2025 7:46 am

నాగార్జునపై మంత్రి కొండా సురేఖ ట్వీట్‌... ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నాగార్జునపై మంత్రి కొండా సురేఖ ట్వీట్‌ చేశారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. నాగార్జున బాధపడి ఉంటే చింతిస్తునన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ స్పష్టం చేశారు. గతంలో నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ దారుణంగా దూషించిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 12 Nov 2025 7:46 am

Bihar Result Nov 14 |బీహార్ తీర్పు ఇదేనా..

బీహార్ తీర్పు ఇదేనా.. దేశంలో ప్రధాని మోదీకి (Prime Minister Narendra Modi)

ప్రభ న్యూస్ 12 Nov 2025 7:34 am

ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా

ముంబయి: బాలీవుడ్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు బ్రీంచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం అర్థరాత్రి గోవిందా (61) స్పృహ కోల్పోవడంతో జుహులో బ్రీంచ్ కాండీ ఆస్పత్రికి తరలించామని మేనేజర్ లలిత్ బిందాల్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

మన తెలంగాణ 12 Nov 2025 7:34 am

నాలుగు తరాల కథ

ఎస్‌ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవం. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్‌పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రె డ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భం గా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కిం గ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడు తూ “నాకు గత జన్మల సినిమాలంటే చాలా ఇ ష్టం. నాన్నగారి సినిమా మూగ మనసులతో నాకు బాగా ఇష్టం. నేను అదే ఇష్టంతో జానకి రాముడు సినిమా చేశాను. గత వైభవం నాలుగు తరాల క థ. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. హీరో దుష్యంత్ మా ట్లాడుతూ “గత వైభవం సినిమా కథ, స్క్రీన్ ప్లే చా లా కొత్తగా ఉంటుంది. చాలా బిగ్ కాన్వాస్ సిని మా ఇది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను”అని తెలియజేశారు. డైరెక్టర్ సింపుల్ సుని మాట్లాడుతూ “గత వైభవం డిఫరెం ట్ జానర్ సిని మా. అన్ని కమర్షియల్ విలువలు ఉన్న ప్రయోగాత్మక చిత్రమిది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఆషికా రంగనాథ్, చైతన్య రెడ్డి, దీపక్, విలియం డేవిడ్ పాల్గొన్నారు. 

మన తెలంగాణ 12 Nov 2025 7:30 am

YSRCP : నేడు వైసీపీ ఆధ్వర్యంలో నిరసన

ఆంధ్రప్రదేశ్ లో నేడు వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన జరుగుతుంది

తెలుగు పోస్ట్ 12 Nov 2025 7:27 am

Union Cabinet : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే

ఈరోజు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

తెలుగు పోస్ట్ 12 Nov 2025 7:20 am

సఫారీలతో సిరీస్.. భారత్‌కు సవాల్ వంటిదే..

మన తెలంగాణ/హైదరాబాద్: సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్‌గా తయారైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ దక్షిణాఫ్రికా ఇటీవల కాలంలో వరుస విజయాలు సాధిస్తోంది. తెంబ బవుమా సారథ్యంలో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి న దక్షిణాఫ్రికా ఏకంగా 9 మ్యాచుల్లో జయకేతనం ఎగు ర వేసింది. విండీస్‌తో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల డ్రాగా ముగిసింది. ఇక బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించి సుదీర్ఘ కాలంగా అందరి ద్రాక్షగా ఉన్న ఐసిసి ట్రోఫీని సొంతం చేసుకుంది. వరుస విజయాలతో అంతర్జాతీయ క్రికెట్‌లో దూసుకుపోతున్న సఫారీలతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆతిథ్య భారత జట్టుకు పరీక్షగా మారింది. కొంత కాలం క్రితం న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూ డు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌పై సొంత గడ్డపై కళ్లు చెదిరే రికార్డు ఉన్న భారత జట్టు ఇలా ఘోర పరాజయం చవిచూస్తుందని ఎవరూ కూడా ఊహించలేక పో యారు. టీమిండియా మాత్రం అందరి అంచనాలను తా రుమారు చేస్తూ కివీస్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. న్యూజిలాండ్‌తో పోల్చితే సౌతాఫ్రికా చాలా బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాం టి పరిస్థితుల్లో సఫారీలను ఓడించి సిరీస్‌ను సొంతం చే సుకోవడం భారత్‌కు అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగా ల్లో సమతూకంగా ఉన్న దక్షిణాఫ్రికాతో పోరు భారత్‌కు సవాల్‌గా తయారైంది. పటిష్టమైన సఫారీలను ఓడించ డం చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పాలి. ఒం టిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌ లర్లు సౌతాఫ్రికా టీమ్‌లో ఉన్నారు. కెప్టెన్ బవుమా, మా ర్‌క్రమ్, జోర్జీ, జుబేర్ హంజా, డెవాల్డ్ బ్రేవిస్, వియాన్ ముల్డర్, మార్కొ జాన్సన్, ట్రిస్టన్ స్టబ్స్, రియాన్ రికెల్టన్, కైల్ వెర్రెన్నె వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక రబడా, జాన్సన్, కేశవ్ మహరాజ్, హార్మర్, ముత్తుసామి, కార్బన్ బోస్చ్‌లతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. రెండు విభాగాల్లో బలంగా ఉన్న సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. ఇక ఆతిథ్య భారత్‌కు సిరీస్ కీలకంగా మారింది. న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం షాక్ నుంచి టీమిండియా ఇంకా తేరుకోలేక పోతోంది. ఇందులో నుంచి బయట పడాలంటే బలమైన సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో ఘన విజయం సాధించాల్సిందే. అప్పుడే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఓడితే మాత్రం జట్టు మరింత ఒత్తిడిలోకి కూరుకు పోవడం ఖాయం. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 14 నుంచి కోల్‌కతాలో, రెండో టెస్టు నవంబర్ 22 నుంచి గౌహతిలో జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత్, సౌతాఫ్రికా బోర్డులు ఇప్పటికే తమ తమ జట్లను ప్రకటించాయి.

మన తెలంగాణ 12 Nov 2025 7:10 am

మేడారంలో.. ఆ నలుగురు..

మేడారంలో.. ఆ నలుగురు.. తాడ్వాయి, ఆంధ్రప్రభ – ములుగు జిల్లా తాడ్వాయి మండలం

ప్రభ న్యూస్ 12 Nov 2025 7:06 am

కిడ్నీ రాకెట్ ఎలా బయటపడిందో తెలుసా..?

కిడ్నీ రాకెట్ ఎలా బయటపడిందో తెలుసా..? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గుట్టుగా సాగుతున్న

ప్రభ న్యూస్ 12 Nov 2025 6:56 am

నెంబర్ 1 ప్లేస్ లో.. తెలంగాణ..

నెంబర్ 1 ప్లేస్ లో.. తెలంగాణ.. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1

ప్రభ న్యూస్ 12 Nov 2025 6:37 am

ఉగ్రవాదభూతం పీచమణచాలి

దేశంలో ఒకే రోజు చోటు చేసుకున్న రెండు భయానక సంఘటనలు జాతి యావత్తును దిగ్భ్రాంతి గొలిపాయి. అంతకుమించి, ఉగ్రవాదులు తమ విధ్వంసకాండను అమలుపరిచేందుకు అనుసరిస్తున్న కొత్త తరహా పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో ఓ మెట్రోస్టేషన్ వద్ద మొన్న రాత్రి పొద్దుపోయాక ఒక కారులో జరిగిన భారీ పేలుడు పదమూడు మందిని బలిగొనగా, మరో 24మందిని గాయాలపాలు చేసింది. పేలుడు తీవ్రత పరిసర జనాలను కకావికలం చేసింది. అనేక వాహనాలు ధ్వంసం కాగా, చుట్టుపక్కల దుకాణాలు సైతం దెబ్బతిన్నాయి. ఇంతటి భారీ పేలుడుకు కారణం ఉగ్రవాదమే అయి ఉంటుందనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు, అదే రోజు భారీ ఉగ్ర కుట్రను మన పోలీసులు భగ్నం చేశారు. మూడు రాష్ట్రాలలో ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసి, ఆరా తీయగా ఆశ్చర్యపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు భారీయెత్తున మందుగుండు సామగ్రిని సమకూర్చుకోవడమే కాదు, విద్యావంతుల్ని తమవైపు తిప్పుకుని, వారి సహాయంతో విధ్వంసకాండకు ఉగ్రవాదులు పథక రచన చేస్తున్నారని తేలడం విస్తుగొలుపుతోంది. హస్తినలో కారుబాంబు పేలుడుకు పాల్పడినది ఉమర్ అనే ఒక వైద్యుడని, శక్తిమంతమైన అమోనియం నైట్రేట్‌ను ఉపయోగించి ఆత్మాహుతికి పాల్పడి ఉండవచ్చునని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఈ రెండు సంఘటనలకూ ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే, ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులకు లభించిన పేలుడు పదార్ధాలలో భారీయెత్తున అమోనియం నైట్రేట్ ఉండటమే కాదు, ఆ కేసులో అరెస్టయిన వైద్యులతో ఆత్మాహుతి చేసుకున్న వైద్యుడికీ సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజధాని హస్తినలో విధ్వంసం సృష్టించి, దేశంలో శాంతిభద్రతలకు సవాల్ విసిరేందుకు ఉగ్రవాదులు సాగిస్తున్న ప్రయత్నాలు ఈనాటివి కావు. 1985లో ట్రాన్సిస్టర్ బాంబులతో 49మందిని బలిగొనడం ద్వారా తమ దాడులను ఆరంభించిన ముష్కరులు, పార్లమెంటుపై దాడి సహా పలుమార్లు హింసాకాండకు తెగబడ్డారు. ఈ నలభయ్యేళ్లలో ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 92 మందికి పైగానే అసువులు బాసినట్లు ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ చేపట్టిన అధ్యయనంలో తేలింది. అయితే కొంతకాలంగా ఉగ్రవాదం కోరలు పెరికివేసేందుకు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఇంటా బయటా చేస్తున్న ప్రయత్నాలతో ఊపిరి సలపని ఉగ్రవాదులు కొత్త పంథాను ఎంచుకున్నట్లుగా తాజాగా వెలుగుచూసిన ఉగ్రకుట్రతో వెల్లడైంది. భారతదేశంలో తమ ఆటలు ఇక సాగవని తెలుసుకున్న జైషే మహమ్మద్, ఐఎస్‌ఐఎస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఎజియుహెచ్ ఉగ్ర సంస్థ.. ఉన్నత విద్యావంతులను లోబరచుకుని, వారి సహాయంతో ధ్వంసరచన అమలుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ మహిళా వైద్యురాలితో సహా ముగ్గురు డాక్టర్లను అరెస్టు చేసి, వారినుంచి భారీయెత్తున పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఫరీదాబాద్‌లో అరెస్టయిన ఒక డాక్టర్ ఇంట్లో 360 కిలోల పేలుడు పదార్ధాలు లభ్యం కావడాన్ని చూస్తే, విద్యావంతులు సైతం ఉగ్రవాదం వైపు ఎంతలా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతుంది. హైదరాబాద్‌కు చెందిన మరో డాక్టర్ స్వయంగా ఒక విషాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషాలలో ఒకటిగా పేర్కొనే రిసిన్ అనే విష ద్రావకాన్ని ఆలయ ప్రసాదాలలోనూ, మంచినీళ్లలోనూ కలిపి అమాయకుల ప్రాణాలు హరించడమే సదరు వైద్యుడి పథకమని వెల్లడి కావడం గమనార్హం. అంటే, బాంబులు, ఆత్మాహుతి దాడులతోనే కాకుండా, సామూహిక విషప్రయోగాలు చేసి, వేలాదిమంది అమాయకుల ప్రాణాలను కబళించాలన్నది ఉగ్రవాదుల దుర్మార్గపుటాలోచనగా తెలుస్తోంది. దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం వేళ్లూనుకుంటున్నట్లు తాజా సంఘటనలను బట్టి విశదమవుతోంది. ప్రాణాలను రక్షించవలసిన వైద్యులే ఉగ్రవాదులై అమాయకుల ప్రాణాలను కబళించబూనడం అమానుషం. మొక్కై వంగనిది మానై వంగదన్నట్లు మొగ్గ దశలోనే ఈ తరహా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టకపోతే, భరతజాతి ప్రమాదపుటంచుల్లోకి జారుకుంటుందనడంలో సందేహం లేదు. ముందుగా, ఢిల్లీ పేలుళ్లకు కారకులెవరో, వారివెనుక ఉన్నదెవరో కూపీలాగి, వారి భరతం పట్టాలి. ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని, వారికి ఊతమిచ్చింది దాయాది దేశమేనని తేలిన పక్షంలో అంతర్జాతీయ సమాజాన్ని జాగృతం చేసి, గట్టి గుణపాఠం చెప్పాల్సిందే. భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఫలితమెంత దారుణంగా ఉంటుందో ఈసారి దాయాదికి మరింత స్పష్టంగా తెలియజేయాలి.  

మన తెలంగాణ 12 Nov 2025 6:20 am

చలి ఎన్ని రోజులు ఉంటుందంటే..

చలి ఎన్ని రోజులు ఉంటుందంటే.. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమక్రమంగా విజృంభిస్తోంది.

ప్రభ న్యూస్ 12 Nov 2025 6:17 am

పాక్‌లో భారీ పేలుడు...12 మంది మృతి

ఇస్లామాబాద్ : ఇస్లామాబాద్ లోని కోర్టు ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి 12 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది న్యాయవాదులు, సిబ్బంది ఉన్నారు. కోర్టు కాంప్లెక్సు వద్ద పార్కింగ్ స్థలంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది ఆత్మాహుతి దాడి అని కారులో అమర్చిన గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రద్దీ సమయంలో ఈ సంఘటన జరగడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. ఇస్లామాబాద్ జిల్లాకోర్టు లోని న్యాయవాదులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు శబ్దం దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు వినిపించిందంటే పేలుడు తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దగ్ధమైన కారు నుంచి మంటలు, పొగలు ఉవ్వెత్తున పైకి కమ్ముకోవడం వీడియోల్లో కనిపించింది. సమీపాన పార్కింగ్ చేసి ఉన్న అనేక వాహనాలు ఈ పేలుడుకు భారీగా దెబ్బతిన్నాయి. పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ, ఈ ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. దక్షిణ వజీరిస్థాన్ లోని కాడెట్ కాలేజ్ వానా వద్ద తెహ్రీక్‌ఇతాలిబన్ పాకిస్థాన్ ( టిటిపి) దాడిని పాక్ భద్రతా దళాలు భగ్నం చేసిన కొన్ని గంటల్లోనే ఈ సంఘటన జరిగింది. కళాశాల విద్యార్థులను బందీలుగా చేసుకోవాలన్న తెహ్రీక్ ప్రయత్నాన్ని పాక్ బలగాలు అడ్డుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో టిటిపికి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పాక్ సైన్యం మట్టుపెట్టింది.

మన తెలంగాణ 12 Nov 2025 6:00 am

అసోంలో బహిష్కరణల పర్వం

భారత రాజ్యాంగం అందరికీ సమానత్వ హక్కు, గౌరవంగా జీవించే హక్కు, నివాస హక్కుకు హామీ ఇస్తుంది. పునరావాసం కల్పించకుండా ఎవరినైనా ఎక్కడి నుంచైనా తొలగించడం జాతీయ పునరావాస మార్గదర్శకాలకు, అటవీ చట్టం 2006 కు విరుద్ధం. అడవిపై ఆధారపడిన వర్గాలకు, భూమిలేనివారికి రక్షణ కల్పించాలని చట్టం ఆదేశించింది. స్థానభ్రంశం జరిగినప్పుడు ప్రభుత్వం మానవీయ పునరావాసం కల్పించాలని సుప్రీం కోర్టు పదేపదే పేర్కొంది. బిశ్వశర్మ ప్రభుత్వం అడ్డూఆపూ లేకుండా చేపట్టిన తొలగింపులు అన్ని ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నాయని పౌరస్వేచ్ఛా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఓటర్లను మోసగిం చేందుకే ప్రభుత్వం తొలగింపులను ఓ రాజకీయ సాధనంగా ఉపయోగిస్తోందని ప్రతిపక్ష పార్టీలు, గిరిజన సంస్థలు, మైనారిటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం భూ విధానాలను పారదర్శకంగా నిర్వహించాలని, ఏదైనా తొలగింపు నిర్వహించే ముందు, బాధితులకు పునరావాసం కల్పించాలని అనేక విద్యార్థి సంఘాలు, డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఈ విజ్ఞప్తులను పట్టించుకునే నాథుడే లేడు.   అసోంలో బహిష్కరణల పర్వం మళ్లీ మొదలైందని తాజాగా ‘ది హిందూ’ పేర్కొంది. ఈ తొలగింపు తర్వాత మళ్లీ అసోంలో భూమి, గుర్తింపుపై తాజాగా ఉద్రిక్తతలు తలెత్తాయి. 580 కుటుంబాలు, ముఖ్యంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను హిమంత బిశ్వశర్మ సర్కార్ నిర్దిష్ట భూముల నుంచి తొలగించింది. అసోం ప్రభుత్వం, ప్రభుత్వ, అటవీ, పశువులను మేపుకునే భూములనుంచి ఆక్రమణదారుల ముద్రవేస్తూ, వారినుంచి భూమి తిరిగి పొందేందుకు తొలగింపులకు పూనుకుంది. ఇలా నిరాశ్రయులైనవారిలో ఎక్కువ మంది భూమిలేని వారు, పేద, అణగారిన వర్గాలవారేనని కమ్యూనిటీ ప్రతినిధులు, పౌరసమాజ సంస్థలు హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. నిజానికి వీరంతా బ్రహ్మపుత్ర నది వల్ల కోతకు గురైన ప్రాంతాల నుంచి వచ్చి, దశాబ్దాలుగా ఈ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు. సెప్టెంబర్ 19న సింగపూర్‌లో ప్రసిద్ధ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతిపై రాష్ట్రంలో తలెత్తిన తీవ్ర ప్రజా ఆగ్రహావేశాలు ఈ కేసులో పారదర్శకత, జవాబుదారీతనం కోరుతూ నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో జనందృష్టి మరల్చేందుకే తాజాగా ఈ తొలగింపు కార్యక్రమం చేపట్టారు.కొంతమంది మియా ముస్లింలు నిరసన తెలిపినా, బహిష్కరణ కార్యక్రమం కొనసాగుతుందని సిఎం బిశ్వశర్మ ప్రకటించారు. భూమి సమస్యను మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడంతో ముస్లిం లు, ముఖ్యంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను టార్గెట్ చేస్తున్నారనే ఆందోళనలను ఈ మధ్య ఇటువంటి వ్యాఖ్య లు మరింత పెంచాయి. భూమిలేకపోవడం, స్థానభ్రంశం.. అంతులేని చరిత్ర అసోం భూ సమస్య, ఈ ప్రాంత భౌగోళిక స్వరూపంతో ముడిపడి ఉంది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల వల్ల ఏటా దాదాపు 8,000 హెక్టార భూమి కోతకు గురవుతోందని జలవనరుల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కోత కారణంగా ఏటా దాదాపు 2.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారని, నదీగట్ల వెంబడి నివసించే దాదాపు 90 కుటుంబాలు ఇళ్లు కోల్పోతున్నాయని నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ అధ్యయనం చెబుతోంది. ఈ కుటుంబాలు తరచు నదిలో లంక (చార్) గ్రామం నుంచి మరో లంకకు లేదా అందుబాటులో ఉన్న ప్రభుత్వ బీడు భూమికి మారుతూ ఉంటాయి. ఈ కమ్యూనిటీలు ఈ మధ్య వలస వచ్చినవి కావు. వారిలో చాలా మంది ఓటర్ గుర్తింపు కార్డులు, దశాబ్దాలుగా జారీ అయిన భూమి రసీదులు, ఆధార్ కార్డులు కలవారే. అంతేకాదు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) ప్రక్రియలో సమర్పించిన పౌరసత్వం డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎన్‌ఆర్‌సి ప్రక్రియ దాదాపు 19 లక్షల మందిని దేశం లేని స్థితిలో ఉంచింది. ఫలితంగా, పునరావాసం లేకుండా తొలగింపు, డాక్యుమెంటేషన్, పౌరసత్వ ధ్రువీకరణ సవాళ్లతో ఇప్పటికే క్లిష్టంగా ఉన్న మానవతా సమస్యను మరింత తీవ్రం చేస్తున్నది. తొలగింపు అనేది రాష్ట్రప్రభుత్వ విధానం.. 2021 నుంచి భూములనుంచి తొలగింపులు హెచ్చాయి. అసోం అసెంబ్లీలో పేర్కొన్న డేటా ప్రకారం 5,400 హెక్టార్ల భూమి నుంచి జనాలను ఖాళీ చేయించారు. దీంతో 5,000 కన్నా ఎక్కువ కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. 2021లో సిపాజార్ లోని ధల్పూర్ లో దాదాపు 800 కుటుంబాలను ఖాళీ చేయించారు. దీంతో హింసాత్మక ఘర్షణలు చెలరేగి ఒక మైనర్‌తో సహా ఇద్దరు పౌరులు చనిపోయారు. తొలగింపు నోటీసులు, ఇతర వ్యవహారాలు బెంగాలీ మాట్లాడే ముస్లిం లనే టార్గెట్ చేస్తున్నాయని మానవ హక్కుల పరిశీలకులు వాదిస్తున్నారు. అసోంలో మియా ముస్లిం అనే పదం వాడుకలో ఉన్నా, మొత్తం ముస్లిం సమాజాన్ని బయటి వ్యక్తులుగా చిత్రీకరించేందుకు సాంసృ్కతిక, రాజకీయ గుర్తుగా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. భూమి హక్కులు సామూహికీకరణ జుబీన్ గార్గ్ వంటి సాంసృ్కతిక దిగ్గజానికి న్యాయం చేయాలని కోరినవారిలో ఎవరు పాల్గొన్నారనే సామూహిక చర్యకు దిగితే రాజకీయ ప్రకటనలు, నిరసనలు లేదా అసమ్మతిని ఓ నిర్దిష్ట మతానికి ముడిపెట్టినప్పుడు, ప్రజాస్వామ్యం కూడా మతపరంగా మారిపోతుంది. ఇది ప్రభుత్వ ఏజెన్సీలపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. భూముల నుంచి వెళ్లగొట్టబడిన వారిలో చాలా మంది పేదరికంతో బాధపడుతున్నారు. ఆరోగ్య సంరక్షణ లేదు, కనెక్టివిటీ బొత్తిగా లేదు. విద్యా మౌలిక సదుపాయాలు లేని చార్ (లంక) ప్రాంతాలలో నివసిస్తున్నారు. దాదాపు 70 శాతం చార్ నిర్వాసితులు భూమిలేని వ్యవసాయ కూలీలే అని అసోం గ్రామీణ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ సేవల సంస్థ 2020లో నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ కమ్యూనిటీలు కూరగాయలు, జనపనార సాగు చేసుకుంటూ జీవిస్తున్నాయి. అయినా వారి ఉనికి ప్రమాదకరంగా రాజకీయంగా బలహీనంగా ఉంది. చట్టపరమైన, రాజ్యాంగపరమైన పరిణామాలు భారత రాజ్యాంగం అందరికీ సమానత్వ హక్కు, గౌరవంగా జీవించే హక్కు, నివాస హక్కుకు హామీ ఇస్తుంది. పునరావాసం కల్పించకుండా ఎవరినైనా ఎక్కడి నుంచైనా తొలగించడం జాతీయ పునరావాస మార్గదర్శకాలకు, అటవీ చట్టం 2006 కు విరుద్ధం. అడవిపై ఆధారపడిన వర్గాలకు, భూమిలేనివారికి రక్షణ కల్పించాలని చట్టం ఆదేశించింది. స్థానభ్రంశం జరిగినప్పుడు ప్రభుత్వం మానవీయ పునరావాసం కల్పించాలని సుప్రీం కోర్టు పదేపదే పేర్కొంది. బిశ్వశర్మ ప్రభుత్వం అడ్డూఆపూ లేకుండా చేపట్టిన తొలగింపులు అన్ని ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నాయని పౌరస్వేచ్ఛా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పౌరసమాజం, ప్రతిపక్షాల ప్రతిస్పందన ఎన్నికలకు ముందు ఓటర్లను మోసగించేందుకే ప్రభుత్వం తొలగింపులను ఓ రాజకీయ సాధనంగా ఉపయోగిస్తోందని ప్రతిపక్ష పార్టీలు, గిరిజన సంస్థలు, మైనారిటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం భూ విధానాలను పారదర్శకంగా నిర్వహించాలని, ఏదైనా తొలగింపు నిర్వహించే ముందు, బాధితులకు పునరావాసం కల్పించాలని అనేక విద్యార్థి సంఘాలు, డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఈ విజ్ఞప్తులను పట్టించుకునే నాథుడే లేడు. బుల్డోజర్ల వెనుక మానవ కన్నీటి గాథలు బహిష్కరణకు గురైన కుటుంబం అన్నీ కోల్పోతుంది. మళ్లీ మొదటి నుంచీ బతుకు ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంది. స్థానభ్రంశం వల్ల వారు ఇళ్లనే కాదు, వ్యవసాయభూములను, పశుసంపదను, ఏళ్లుగా తాము పొదుపు చేసుకున్న మొత్తాన్ని పూర్తిగా కోల్పోవలసి వస్తోంది. వారి పిల్లలు చదువుకు పూర్తిగా దూరమవుతున్నారు. ఇప్పటికే దినదిన గండంగా బతుకుతున్న వారు మరింత అభద్రతకు గురవుతున్నారు. వారి ఆవేదన, గొంతు విన్పించదు. అయినా వారే ఎక్కువ ప్రభావితమవుతారు. ఈ బహిష్కరణ చర్యల వల్ల రాజకీయ ప్రయోజనం అస్సామీ భూమి, గుర్తింపును రక్షించి, నిర్మించడంలో ఇమిడి ఉంది. ప్రభుత్వ చర్యలు అసోం సాంసృ్కతిక, చారిత్రక నేపథ్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. న్యాయంగా వ్యవహరించడం, సంప్రదింపుల కోసం పిలుపు అసోంలో పరిస్థితి ఓ క్రాస్ రోడ్‌లో ఉన్నట్లు ఉంది. భూ సంక్షోభం వాస్తవమే. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులవల్ల కలిగే స్థానభ్రంశానికి తక్షణ పరిష్కారం కనుగొనడం అవసరం. భూమి లేకపోవడం, మతపరమైన లోపంగా మార్చడం వల్ల అభివృద్ధి సాధించడం సాధ్యంకాదు. ప్రశాంతత నెలకొనదు. ప్రభుత్వ పునరావాస విధానాలు, పారదర్శకంగా భూ నిర్వహణ, న్యాయపరమైన పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి, పౌరుల హక్కులు, వారి సమాజ గుర్తింపుపై ఆధారపడడం భావ్యం కాదు. సామరస్యంగా వ్యవహరించాలి, న్యాయం సమానంగా, గౌరవంగా అందరికీ కల్పించినప్పుడే ప్రజాస్వామ్య సమాజం మనుగడ సాధించగలదు. గీతార్థ పాఠక్

మన తెలంగాణ 12 Nov 2025 6:00 am

అందెశ్రీ పేరిట స్మృతివనం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీని కోల్పోవడం తెలంగాణకు తీరని నష్టమని సి ఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన గళాన్ని, కలాన్ని తెలంగాణ సమాజానికి అంకితమిచ్చిన అందెశ్రీ కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అలాగే, ఆయన రచించిన జయజయహే తెలంగాణ పాటను పాఠ్యాంశంగా తీసుకొస్తామని సిఎం తెలిపారు. అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆయన పాటల సంకలనం ‘నిప్పుల వాగు’ ఒక భగవద్గీతగా, బైబి ల్‌గా, ఖురాన్‌గా తెలంగాణ సమస్యలపై పోరాడే వారికి గైడ్‌గా ఉపయోగపడుతుందని, ఆయన రచనల తో 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతి లైబ్రరీలో నిప్పుల వాగును అందుబాటులో ఉంచుతామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. అందెశ్రీ రచనలు అన్ని లైబ్రరీల్లో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేరు, స్ఫూర్తి శాశ్వతంగా ఉండేలా చూస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. అందెశ్రీ చివరి వరకు సాధారణ జీవితం గడిపారన్నారు. రాజకీయ నేతలను నేరుగా కలవనని చెప్పిన అందెశ్రీ, ఆ తరువాత మీడియా మాధ్య మం ద్వారా కలిశామన్నారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా ఆప్తుడిని కోల్పోయిన బాధను కలిగించింన్నారు. అందెశ్రీని కలిసినప్పుడల్లా సొంత అన్నను కలిసినట్టుగా ఉండేదన్నారు. తన పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కటిగా నడిపించారని సిఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. అందెశ్రీ పాట, మాట గొప్ప స్ఫూర్తిని ఇచ్చిందని, ఎన్నో సందర్భాల్లో ఇద్దరం కలిసి అనేక కీలక అంశాలపై చర్చించామని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. గద్దర్‌తో పాటు అందెశ్రీ పాటు తెలంగాణ ఉద్యమానికి ఎంతో బలాన్ని ఇచ్చిందన్నారు. అందెశ్రీ పేరుతో స్మృతివనం ఏర్పాటు అందెశ్రీ జయజయహే పాట తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిందని అందుకే జయజయహే పాటను రాష్ట్ర గీతంగా గుర్తించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందెశ్రీ వ్యక్తిగతంగా తన మనసుకు దగ్గరి వ్యక్తి అని ఆయన లేని లోటు తన కుటుంబానికి వ్యక్తిగతంగా తీరని లోటని సిఎం రేవంత్ అన్నారు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గతేడాది కేంద్రానికి లేఖ రాశామని కానీ, అవార్డు రాలేదన్నారు. ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామని ఆయనకు పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలుగా అందెశ్రీని పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జీవితాంతం తెలంగాణ కోసం జీవించిన వ్యక్తి కళాకారుడిగా, రచయితగా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారో అందరికి తెలుసని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణ ఉన్నంత వరకు అందెశ్రీ కీర్తీ శాశ్వతం చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాడె మోసిన సిఎం రేవంత్‌రెడ్డి అంతకు ముందు అందెశ్రీ పార్థివ దేహాన్ని సిఎం రేవంత్‌రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. ఎంతోకాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో ముఖ్యమంత్రి ఆయన అంతిమయాత్రలో పాల్గొని పాడెను మోశారు. ఈ సందర్భంగా రోదిస్తున్న కుటుంబ సభ్యులను ఆయన ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు. మొదటగా లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సినగర్ వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగాయి. రెండు నిమిషాలు పాటు అందరూ మౌనం పాటించగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల పాటు గౌరవ సూచికంగా కాల్పులు జరిపారు. అనంతరం అందెశ్రీ సతీమణి మల్లుబాయి, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ కుమారుడు దత్తసాయి సంప్రదాయ పద్ధతిలో కర్మకాండలను నిర్వహించగా, అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు అక్షరయోధుడికి కడసారి వీడ్కోలు పలికారు. అంతియయాత్రలో సిఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్, సీనియర్ నేత కేశవరావు, పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు అందెశ్రీ అభిమానులు, సాహితీ ప్రియులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

మన తెలంగాణ 12 Nov 2025 6:00 am

బీహార్‌లో ఎన్‌డిఎకే విజయహారం

జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో బిజెపికి పూర్తి మెజార్టీ లేకపోవడం తో నరేంద్ర మోడీ ప్రభుత్వం టిడిపి, జెడి(యు) పార్టీలపై ఆధారపడిన నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికలు దేశరాజకీయలపై ప్రభావం చూపనున్నాయి. బీహార్‌లో బిజెపి, జెడి(యు) పార్టీల మధ్య మైత్రి కొనసాగింపుకు ఈ ఎన్నికలు కొలమానంగా నిలువనున్నాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా ఏ ఒక్క పార్టీకి ఏకఛత్రాధిపత్యంగా అధికారం ఇవ్వకుండా సంకీర్ణ ప్రభుత్వాలకు పట్టం గడుతున్న బీహార్ ప్రజలు మరోసారి ఎన్‌డిఎకే జైకొట్టనున్నారని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్గిట్ పోల్ సర్వేల్లో వెల్లడైంది. రాష్ట్రంలో మరోసారి అధికారం రావడానికి ఎన్‌డిఎకి నిమో (నితీశ్+మోడీ) ఫార్ములా దోహదపడింది. నితీశ్ ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రంలో మహిళా రోజ్‌గార్ యోజన పథకం కింద దాదాపు కోటి 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడం ఎన్‌డిఎ విజయానికి కీలకంగా మారింది. బీహార్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జెడి(యు) నేతృత్వంలోని ఎన్‌డిఎ, కాంగ్రెస్, ఆర్‌జెడి నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌పై భారీ ఆధిక్యంతో అధికారం చేపడుతుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్‌డిఎ దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్‌బంధన్ కూటమి మీద పైచేయి సాధిస్తోంది. ఎన్‌డిఎకి 46.2 శాతం ఓట్లు, మహాఘట్‌బంధన్‌కు 37.9%, కొత్తగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ‘ప్లస్ ఆర్ మైనస్’ ఉండే అవకాశాలున్నాయి. 243 స్థానాలు ఉన్న బీహార్ లో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్‌డిఎకు 133- 159 స్థానాలు వచ్చే అవకాశాలుండగా, మహాఘట్ బంధన్ 75 -101 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇతరులకు 2 8 స్థానాలు, జన్‌సురాజ్ పార్టీకి 0 -5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. పార్టీల వారీగా సాధించే స్థానాలను పరిశీలిస్తే ఎన్‌డిఎ కూటమిలో బిజెపి 63- 70, జెడి(యు) 55- 62, ఎల్‌జెపి (ఆర్‌వి) 12-17, హెచ్‌ఎఎమ్ 2-5, ఆర్‌ఎల్‌ఎం 1-4 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. మహాఘట్ బంధన్‌లో ఆర్‌జెడి 62-69, కాంగ్రెస్ 9- 18, సిపిఐ (ఎంఎల్) 4-9 గెలిచే అవకాశాలున్నాయి. కొత్తగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 0-5 స్థానాలు, ఎఐఎంఐఎం పార్టీ 0-2, సిపిఐఎంకి 0-3, విఐపికి 0- 5, సిపిఐ 0- 2, ఇతరులు 2- 8 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. ఒక్కొక్క పార్టీ పొందే ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే బిజెపికి 21.4 శాతం, ఆర్‌జెడికి 23.3 శాతం, జెడి(యు)కి 17.6 శాతం, జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, కాంగ్రెస్ పార్టీకి 8.7 శాతం, ఎల్‌జెపికి 5%, ఇతరులకు 7.2%ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 19.46% ఓట్లతో 74 స్థానాలు, జెడి(యు) 15.39 శాతం ఓట్లతో 43 స్థానాలు, ఆర్‌జెడి 23.11% ఓట్లతో 75 స్థానాలు, కాంగ్రెస్ 9.48% ఓట్లతో 19 స్థానాల్లో గెలిచాయి.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ మహాఘట్ బంధన్ కూటమిపై కేవలం 0.03 ఓట్ల వ్యత్యాసంతో సుమారు 11 వేల ఓట్ల ఆధిక్యంతోనే అధికారం చేపట్టగా, ప్రస్తుత ఎన్నికల్లో ఎన్‌డిఎ భారీ ఆధిక్యత పొందడానికి ప్రధాన కారణం జెడి(యు) మంచి ఫలితాలు సాధించడమే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని ఓటర్లను ప్రశ్నించినప్పుడు ఆర్‌జెడి యువ నేత తేజస్వి యాదవ్ 32 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. 2005 నుండి కొన్ని నెలలు మినహా 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్ కుమార్ 30 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 8%, ఎల్‌జెపి నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ 8 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. బిజెపి నేత సామ్రాట్ చౌదరికి 6%, కాంగ్రెస్ నేత రాజేశ్ కుమార్‌కి 2% మంది మద్దతిచ్చారు. సామాజిక వర్గాలవారీగా పరిశీలిస్తే అగ్రవర్ణాలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఇబిసి వర్గాలు ఎన్‌డిఎకు మద్దతుగా నిలుస్తున్నారు. ముస్లిం, బుద్ధిస్టులు, ఒబిసి సామాజిక వర్గాల్లో అధిక శాతం మహాఘట్‌బంధన్ వైపు ఉన్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. బీహార్‌లో ఎన్‌డిఎకు పట్టంకట్టడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో 66.8% మహిళలు ఎన్‌డిఎ వైపుఉండగా, మహాఘట్‌బంధన్‌కు 24.8% ఓటర్లు మాత్రమే మద్దతిస్తున్నారు. బ్రాహ్మణ, కుశ్వ, పాశ్వాన్, రాజ్‌పుత్, కుర్మి, చమార్, భూమియార్, మల్లా, తేలి, బనియా, కాను, నోనియా సామాజిక వర్గాల్లో ఎన్‌డిఎకు బాసటగా నిలుస్తున్నాయి. మహాఘట్ బంధన్ కేవలం యాదవ్, ముస్లిం, ఒబిసిల్లోని కొన్ని వర్గాల్లో మాత్రమే కొంత ఆధిక్యత కనబరుస్తోంది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి ఉన్న జనాకర్షణ, రాష్ట్రంలో నితీశ్ కుమార్‌పై ఉన్న ప్రజాదరణ బీహార్ లో ఎన్‌డిఎ గెలుపుకు అనుకూలంగా మారాయి. బీహారీలను ఆకర్షించడంలో నితీశ్ కుమార్ వంటి జనాకర్షణ కలిగిన నాయకుడు తమ పార్టీలో లేకపోవడంతో బిజెపి ఆయనపైనే ఆధారపడాల్సి వచ్చింది. అందుకే మోడీ ప్రచారంలో నితీశ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. 75 ఏళ్ల వయసులోనూ నితీశ్ ఎన్‌డిఎకు ట్రంప్ కార్డుగా ఉన్నారు. ఆయనకున్న క్లీన్ చీట్ ఇమేజీ ఎన్‌డిఎకు బలంగా మారింది. రెండు దశాబ్దాలుగా సిఎంగా ఉన్నా నితీశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఎంఎల్‌సిగా ఎన్నికవుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు. సిట్టింగ్ ఎంఎల్‌ఎలు అభివృద్ధిని పట్టించుకోలేదని, అవినీతికి పాల్పడ్డారనే వ్యతిరేకత ప్రజల్లో కనిపించినా ‘నిమో’ ఫార్ములా ఎన్‌డిఎకు అనుకూలించింది. 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నా నితీశ్ ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని నిలబడడానికి ప్రధాన కారణం మహిళల ఆశీర్వాదమే. ఎన్‌డిఎతో పోలిస్తే మహాఘట్‌బంధన్ బలహీనంగా ఉంది. ఆ కూటమి సిఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌లో 2020 ఎన్నికల్లో ఉన్న ఉత్సాహం 2025 ఎన్నికల్లో కనిపించలేదు. ప్రస్తుత ఎన్నికల్లో తేజస్వీయాదవ్ నిరుద్యోగం, వలసలు అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకున్నా 2020లో ఆయనకు యువతలో ఉన్న క్రేజీ ఇప్పుడు తగ్గింది. నిరుద్యోగం, వలసలపై యువతలో అసంతృప్తి ఉన్నా అది పూర్తిగా తేజస్వి యాదవ్‌కు అనుకూలంగా మారలేదు. జన్‌సురాజ్ పార్టీ, బిజెపి కూడా యువత ఓట్లను ఆకర్షించాయి. మహాఘట్‌బంధన్ కూటమి ముస్లిం, యాదవ్ సామాజికవర్గాల్లో ఇప్పటికే 33% మద్దతున్నా, దాన్ని 40 శాతానికిపైగా దాటించడమే తేజస్వి యాదవ్‌కు ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు తేజస్వి యాదవ్‌కు తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఉన్న ‘జంగల్ రాజ్’ అభియోగం పెద్ద గుదిబండగా మారింది. లాలూప్రసాద్ పాలనలో యాదవ్ సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని ఇప్పటికీ దళితులు, అగ్రవర్ణాలు మరవకపోవడం తేజస్వి యాదవ్‌కు ప్రతికూలమైంది.మహాఘట్‌బంధన్‌లో ప్రధాన భూమిక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీవలే ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యారు. ఆయన ఎత్తుకున్న ‘ఓట్ చోరీ’ నినాదం బీహార్‌లో ఓట్లను రాల్చలేకపోయింది. రెండు కూటములు సంక్షేమ పథకాలపై పోటాపోటీగా హామీలిచ్చాయి. మహాఘట్‌బంధన్ నిరుద్యోగం, వలసలను ప్రచారాస్త్రాలుగా చేసుకుంటే, ఎన్‌డిఎ ‘జంగల్ రాజ్’ తో పాటు అభివృద్ధిపై ప్రచారం చేసింది. ప్రధాని మోడీ లాలూప్రసాద్ యాదవ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలుచేస్తూ ‘జంగల్ రాజ్’ను ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. రాష్ట్రంలో ఎన్‌డిఎ చెబుతున్నట్టు అభివృద్ధి జరిగితే బీహారీలు ఎందుకు వలసెళ్తున్నారని మహాఘట్ బంధన్ ప్రచారం చేసింది. ఇతర పార్టీలతో పోలిస్తే బిజెపికి వనరులు అధికంగా ఉండడం ఎన్‌డిఎకు అనుకూలంగా మారింది. డిజిటల్ ప్రచారంలో అన్ని పార్టీలు చేసిన ఖర్చులను కలిపినా ఒక్క బిజెపి చేసిన ఖర్చు కంటే తక్కువే. 2020 ఎన్నికలకు ప్రస్తుత 2025 ఎన్నికలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దళితులలో ఆదరణ ఉన్న ఎల్‌జెపి 2020లో విడిగా పోటీ చేయగా ప్రస్తుతం ఎన్‌డిఎలో ఉండడంతో ఎన్‌డిఎ మరింత బలపడింది. యావత్ దేశాన్ని ఆకర్షించిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ యువతను ఆకర్షించడంలో విజయవంతం అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు చెప్పుకోదగ్గ సీట్లు రాకపోయినా భవిష్యత్‌లో బీహార్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే పార్టీగా జన్‌సురాజ్ ఎదగడం ఖాయమని పీపుల్స్‌పల్స్ అధ్యయనంలో స్పష్టమైంది. ఎన్‌డిఎలో బిజెపి, జెడి (యు) భారీగా సీట్లు పొందే అవకాశాలు కనిపిస్తుండగా, ఆర్‌జెడి చెప్పుకోదగ్గ స్థానాలు సాధిస్తున్నా, కాంగ్రెస్‌కు ఆశించిన మేరకు సీట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో మహాఘట్‌బంధన్‌కు నష్టం జరుగుతోంది. ప్రధానంగా మహిళా ఓటర్లు ఆదరిస్తుండడంతో బీహార్‌లో మరోసారి ఎన్‌డిఎ జయకేతనం ఖాయంగా కనిపిస్తోంది. జి. మురళీ కృష్ణ

మన తెలంగాణ 12 Nov 2025 5:50 am

న్యుమోనియా రహిత భారతాన్ని నిర్మించుకోలేమా?

న్యుమోనియా అంటువ్యాధితో 2021లో 2.2 మిలియన్లు మరణించగా, అందులో 5.02 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల అధిక మరణాలకు కారణమైన వ్యాధి న్యుమోనియా. కొవిడ్- 19 కారణంతో మరో 10 మిలియన్లు కూడా అదనంగా మరణించినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అధిక ప్రాణాలను గైకొంటున్న వ్యాధుల్లో న్యుమోనియా ప్రధానమైనదని తేలింది. వాతావరణ ప్రతికూల మార్పులు, గాలి కాలుష్యం కోరలు చాచడంతో శ్వాసవ్యవస్థ, ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నం కావడం, న్యుమోనియా మహావిపత్తు వస్తుందనే భయం కూడా ఉందని, పది లక్షలమందికి న్యుమోనియా సోకే ప్రమాదంలో ఉన్నారని వైద్యులు అంచనా వేస్తున్నారు. న్యుమోనియా వ్యాధి ఐదేండ్ల లోపు పిల్లలకు, వృద్ధులకు వస్తుంది. టీకాలు వేయించుకోనివారు, పోషకాహార లోపాలు, ఇంట్లో వంట చెరుకువాడేవారు, కలుషిత గాలి పీల్చే పెద్దలు, పొరతాగే దురలవాటు ఉన్నవారు అధికంగా న్యుమోనియా బారినపడే ప్రమాదం ఉంటుంది. న్యుమోనియా వ్యాధి తీవ్రత, ప్రమాదాన్ని గుర్తించిన అంతర్జాతీయ సమాజం 2009 నుంచి ఏటా 12 నవంబర్ రోజున ప్రపంచ న్యుమోనియా దినం పాటిస్తూ ఆ వ్యాప్తిపట్ల కనీస అవగాహన కల్పించడం జరుగుతోంది. బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగీ సంక్రమణ కారణంగా తాపజనక శ్వాస రుగ్మత (ఇన్‌ఫ్లమేటరీ రెస్పిరేటరీ డిసార్డర్) లేదా న్యుమోనియా వ్యాధి అంటుకుంటుంది. ఈ సూక్ష్మజీవులు ఊపిరితిత్తుల్లో చేరి ఎల్వియోలి అనే భాగంపై ప్రభావాన్ని చూపి న్యుమోనియాకు దారి తీస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. బలహీన వ్యాధి నిరోధకశక్తి కలిగిన పిల్లలు, వృద్ధులకు న్యుమోనియా సోకి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ప్రపంచ న్యుమోనియా దినం -2025 ఇతివృత్తంగా పిల్లల మనుగడ (చైల్ సర్వైవల్) అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. న్యుమోనియా నివారించదగిన అంటువ్యాధి. వ్యాధిగ్రస్థులు తుమ్మడం, దగ్గడం, ముక్కు చీదడం లాంటి సందర్భాల్లో మరొకరికి సంక్రమిస్తుందని తెలుసుకోవాలి. పిల్లల్లో బ్యాక్టీరియా కారణ స్ట్రెప్టోకోకల్ న్యుమోనియా అతి ప్రధానమైనది. దాని తర్వాత హిమోఫిలస్ ఇన్‌ఫ్లుయెంజా రెండవ ప్రధానమైనది. న్యుమోనియాలో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ వ్యాధి వైరస్ వర్గంలో ముఖ్యమైనది. న్యుమోనియా వ్యాధికి చికిత్స కూడా అందుబాటులో ఉన్నది. ప్రపంచ న్యుమోనియా దినం వేదికగా ప్రభుత్వాలు, వైద్యఆరోగ్యశాఖ, ఎన్‌జిఒలు, ఇతర సంస్థలు కలిసి న్యుమోనియా పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, రోగగ్రస్థులకు చికిత్సా పద్ధతులు వివరించడం మంచి ఫలితాలను ఇస్తాయి. న్యుమోనియాను తొలిదశలో గుర్తించడం, చికిత్స తీసుకోవడం, నివారణ మార్గాలను తెలుసుకోవడం లాంటి అంశాలను గుర్తుంచుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ఏట 14 లక్షల పిల్లలు న్యుమోనియా సోకి చనిపోవడం, పిల్లల మరణాల్లో 18% వరకు న్యుమోనియా కారణం కావడం గమనార్హం. యూనిసెఫ్ వివరాల ప్రకారం ప్రతి 39 సెకన్లకు ఒక పిల్లవాడు న్యుమోనియాతో మరణిస్తున్నాడు. వృద్ధుల్లో న్యుమోకోకల్ న్యుమోనియా అధికంగా సోకుతుంది. న్యుమోసిస్టిక్ జిరోవెస్సీ వ్యాధి ఫంగస్ సోకడంతో వస్తుంది. గాలి కాలుష్యం, స్మోకింగ్ వల్ల 16 లక్షల వృద్ధులు మరణిస్తున్నారు. డబ్ల్యుహెచ్‌ఒ, యూనిసెఫ్‌లు సంయుక్తంగా న్యుమోనియా, డయేరియా వ్యాధుల కట్టడికి గ్లోబల్ ఆక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏండ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న రోగులు, పర్యావరణ కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న జనులు, హెచ్‌ఐవి/కేన్సర్ లాంటివి సోకిన వ్యాధిగ్రస్థులు న్యుమోనియా ప్రమాదంలో పడే అవకాశాలే ఎక్కువ. టీకాలు వేయించడం, పోషకాహారం అందిచడం, గాలి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల న్యుమోనియా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. ఆంటీబ్యాక్టీరియల్, అంటీ వైరల్, ఆంటీ ఫంగల్ ఔషధాలతో న్యుమోనియా కట్టడి జరుగుతుంది. భౌతిక దూరాలు పాటించడం, మాస్కులు ధరించడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకుండా ఉండడం, దగ్గినపుడు లేదా తుమ్మినపుడు కండువా కప్పుకోవడం వంటి పలు జాగ్రత్తలు న్యుమోనియా కేసులను తగ్గిస్తాయి. పిల్లలకు, పెద్దలకు అతి ప్రమాదకరమైన అంటువ్యాధిగా నిలిచిన న్యుమోనియా పట్ల సరైన అవగాహన పెంచుకొని అలాంటి ప్రాణాంతక రుగ్మతకు చరమగీతం పాడదాం, న్యుమోనియా కానరాని భారతాన్ని నిర్మించుకుందాం.  డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి 9949700037

మన తెలంగాణ 12 Nov 2025 5:40 am

జూబ్లీహిల్స్‌లో 48 % పోలింగ్

మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్ స్వల్ప వివాదాలు, వాగ్వాదాలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారంగా పోలింగ్ శా తం 48.47 శాతం నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు తమ అధృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు. మొత్తం ఓటర్లు 4,01,365. వీరు ఓటు వేసేందుకు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు స్వతహాగా ముందుకు వచ్చి తమతమ ఓట్లను సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నది. మంగళవారం (నవంబర్ 11) ఉ.7 గం.ల నుంచి సా. 6 గం.ల వరకూ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. సా.5 గం.ల వరకూ 47.16శాతం మంది ఓటు వేశారు. సా. 6 గం టల లోపు పోలింగ్ బూత్‌ల వద్ద క్యూ లైన్లో ఉన్న ఓటర్ల కు ఓటువేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఈ నెల 14వ తేదీన అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదేరోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు. పనిచేయని ఈవిఎంలు.. బద్దకించిన ఓటర్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు ఓటేసేందుకు బద్దకించారు. ఉ.7 9 గం.ల మధ్య ఓటింగ్ 10.2 శాతంగా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 130 పోలింగ్ కేంద్రంలో ఉ. 9 గం.ల వరకు కూడా ఖాళీగా దర్శనమిచ్చింది. రెహ్మత్‌నగర్, వెంగళరావునగర్, యూసుఫ్‌గూ డ, బోరబండ ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లోని ఈవిఎంలు సాంకేతిక లోపం వల్ల పనిచేయలేదు. కొన్ని రిజర్వ్‌గా అందుబాటులోని ఈవిఎంలు కూడా పనిచేయలేదు. 11 చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆయా బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరడం కన్పించింది. ఓట ర్లు మాత్రం క్యూలో నిలిచారు. వెంగళరావునగర్‌లోని పోలింగ్ బూత్‌లు 76, 78, షేక్‌పేట్‌లోని పీఎస్ 30ల ఈవిఎంలలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఉ.11 గం.ల వర కు జూబ్లీహిల్స్‌లో కేవలం 20.76 శాతం మాత్రమే ఓటిం గ్ నమోదు అయింది. మధ్యాహ్నం అవుతున్నా ఈ సె గ్మెంట్లో ఓటర్లు లేక అనేక పోలింగ్ సెంటర్లు వెలవెలబోయాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జూబ్లీహిల్స్ ఓటర్లు ఆసక్తి చూపలేదు. కేవలం బస్తీల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో పోలింగ్ కోసం ఓటర్లు కదలలేదు. ఎన్నికల సంఘం ఎంతగా అవగాహన కల్పించినా ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు ఆసక్తిని కనబరచలేదు. ఇక ఓటర్లు ఓటింగ్ చేయాలని అభ్యర్థులు మీడియా ద్వారా పిలుపునిచ్చారు. వాగ్వాదాలు, కేసులు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పలు పోలింగ్ కేంద్రాల్లో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఇసి సీరియస్ అయ్యింది. వీరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, రామచంద్రనాయక్‌లు పోలింగ్ కేంద్రాలు 75, 76, 77, 78లలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తున్నారనీ, స్థానికేతరులైన వీరు ఇక్కడ ఎందుకు ఉన్నారని ఈసి ఆగ్రహం వ్యక్తం చేసింది.పోలింగ్ కేంద్రం 79 వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనీ సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానంద్‌పైనా ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌లపైనా కేసులు నమోదయ్యా యి. పోలింగ్ కేంద్రం 125, 126ల వద్ద నగదు పంపకాలు జరుగుతున్నట్టు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. 120 పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీ ఆర్‌ఎస్‌లు పరస్పరం దూషించుకున్నారు. బోరబండలో బీఆర్‌ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నేతలు హెచ్చరించడం తో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత స్పందిస్తూ.. పోలీసులను ప్రశ్నించారు. అపెక్స్ స్కూలు వద్ద బూత్ వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. పోలీసులు కలుగజేసుకుని గుమిగూడొద్దని హెచ్చరించారు. దీంతో స్థానికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రం 4, 5, 6, 7ల వద్ద పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. సాయంత్రం గంటల వరకు 40.2 శాతం పోలింగ్ నమోదైంది. బోరబండలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. డ్రోన్ కెమెరాలు.. తనిఖీలు 139 ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని 139 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణను అధికారులు చేశారు. ఈ డ్రోన్ కెమెరాలను జీహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేసి.. అక్కడి నుండి పర్యవేక్షణను చేపట్టారు. 407 పోలింగ్ కేంద్రాల నుండి వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఓటర్లు రాకపోకలు, అక్కడి సిబ్బంది, బూత్ ఏజెంట్లు పనితీరును అధికారులు పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌కమిషనర్ ఆర్‌వి కర్ణన్ పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీచేశారు. డ్రోన్ కెమెరాల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడి వసతులు, రవాణా, ఓటర్ల సహాయకులు, ఫోన్‌ల భద్రపరిచే కేంద్రాలను కర్ణన్ తనిఖీచేవారు. మునుపెన్నడూ లేని విధంగా ఫోన్‌లు భద్రపరిచే కేంద్రం ఏర్పాటు, డ్రోన్‌ల పర్యవేక్షణ, ఓటరుకు సహాయకులను అందుబాటులో ఉండటం వంటివి మొదటిసారి ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఓటేసిన ప్రముఖులు.. బోరబండలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, యూసుఫ్‌గూడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, శ్రీనగర్‌కాలనీలో బీజెపి అభ్యర్థి దీపక్‌రెడ్డిలు తమ తమ ఓటును వినియోగించుకున్నారు. మధురానగర్ 132 పోలింగ్ కేంద్రంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కుటుంబ సమేతంగా ఓటును వినియోగించుకున్నారు. షేక్‌పేట్‌లో చలనచిత్ర దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, తన సతీమణితో, సినీనటుడు గోపీచంద్‌లు వచ్చి ఓటును వినియోగించుకున్నారు. యూసుఫ్‌గూడలో సినీ నటుడు తనికెళ్ళ భరణి, ఆయన సతీమణితో కలిసి ఓటును వేశారు. చాలా మంది విద్యావంతులు, వ్యాపారస్థులు పోలింగ్‌కు దూరంగా ఉండటం గమనార్హం.

మన తెలంగాణ 12 Nov 2025 5:00 am

లక్షల ఎకరాలను ముంచిన మొంథా

మన తెలంగాణ/హైదరాబాద్ :మొంథా తుఫాన్ దాటికి నష్టపోయిన పంటల వివరాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మొంథా తుఫాన్ కారణంగా రా ష్ట్రంలో 1,17,757 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నివేదికను సమర్పించిందన్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టం వాటిల్లిన జిల్లాలలో పర్యటించిన వ్యవసాయశాఖ అధికారుల బృందం, దెబ్బతిన్న పంటల వివరాలను, సర్వే చేసి నివేదికను సి ద్ధం చేసినట్టు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అత్యధికంగా వరి 83,407 ఎకరాలలో, పత్తి 30,144,మొక్కజొన్న2,097 ఎకరాలలో న ష్టం జరిగిదని, నాగర్ కర్నూల్ జిల్లాల్లో న ష్టం జరిగినట్లు వ్యవసాయ నివేదికలో పేర్కొన్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 33 శా తంకి పైగా పంట నష్టం జరిగిన వివరాలు సేకరించామని, 27 జిల్లాల్లోని 1,22,142 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరా ల్లో నష్టం వాటిల్లిందని మంత్రి చెప్పారు. కేం ద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్‌డిఆర్‌ఎఫ్ కింద ఇసుక మేటలకు ఎకరానికి రూ 7,285, నీటిపారుదల కింద సాగైన పంటలకు ఎకరానికి  రూ.6,880, వర్షాధార పంటలకు ఎకరానికి రూ. 3,440,- తోటలకు ఎకరానికి రూ. 9,106- చొప్పున మొత్తం 70 కోట్ల నిధులు రాష్ట్రానికి నిధులు రావల్సి ఉందని మంత్రి చెప్పారు. గతంలో వరదలు సంభవించినప్పుడు కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందలేదని, ఈ పంట నష్టం వివరాలు కేంద్రానికి పంపి ఎన్‌డిఆర్‌ఎఫ్‌లో కేంద్రాన్ని నిధులు అడుగుతామని మంత్రి తెలిపారు. ఇప్పటికే మొంథా తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపించాలని కోరామన్నారు. త్వరలోనే పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి పదివేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాల వారీగా పంట నష్టం వివరాలు మొంథా తుఫాన్ దాటికి జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ పంటం నష్టం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్‌లో 23,508.6 ఎకరాల్లో పంట నష్టం కాగా, తరువాత వరుసగా వరంగల్‌లో 19,736.22, కరీంనగర్‌లో 11,473.32, హన్మకొండలో 11,310.10, జనగాంలో 8,457.04, మహబూబాబాద్‌లో 8, 318.07, సూర్యాపేటలో 7,476, సిద్దిపేటలో 5,277, నల్గొండలో 5,259.20, సంగారెడ్డిలో4,858.01, ఖమ్మంలో 3,901.34, వనపర్తిలో 1,884.01, మెదక్‌లో 1,634.19, జగిత్యాలలో 1,157.16, మంచిర్యాలలో 570.15, వికారాబాద్‌లో 523.35, జయశంకర్ భూపాలపల్లిలో 481.25, మహబూబ్‌నగర్‌లో463.36, యాదాద్రి భువనగిరిలో 421.04, రంగారెడ్డిలో 316.19, నిర్మల్‌లో 252.23, నిజామాబాద్‌లో 250.14, ఆదిలాబాద్‌లో 62.38, రాజన్న సిరిసిల్లలో 55.03, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 13.28, జోగులాంబ గద్వాల్‌లో 12.16, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 7.30 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వ్యవసాయ శాఖ వెల్లడించింది.

మన తెలంగాణ 12 Nov 2025 4:30 am

ఇందిరమ్మ ఇళ్లకు రూ.202కోట్లు

మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల్ల లబ్ధిదారులకు బిల్లుల రూపేణా ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేసినట్టు హౌసిం గ్ కార్పొరేషన్ ఎండి వి.పి.గౌతం తెలిపారు. ఇళ్ల నిర్మాణపు పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆ ప్రక్రియలో భాగంగా నవంబర్ 11 వ తేదీ నాటికి పురోగతి సాధించిన మేరకు 18,247 మంది లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వారం లబ్ధిదారులకు చేసిన చెల్లింపుల్లో బేస్‌మెం ట్ లెవల్ నిర్మాణాలు 4,615, రూఫ్ లెవల్ (గోడలుపూర్తి) అయిన 8,517, శ్లాబ్ వేసిన 5,115 ఇళ్ల్లు ఉన్నాయని ఆయన వివరించారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇంతవరకు మొత్తం రూ.2900.35 కోట్లను చెల్లించినట్టు ఆయన తెలిపారు. వీటిలో బేస్ మెంట్ లెవల్ (బిఎల్) దా టిన ఇళ్లకు రూ.1610.79 కోట్లు, రూఫ్ లెవల్ (ఆర్ ఎల్) - రూ.716.91 కోట్లు, రూఫ్ క్యాస్టెడ్ (శ్లాబ్ పూర్తి -ఆర్‌సి)- అయిన ఇళ్లకు రూ.572.65 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 2,33,069 ఇళ్ల పనులు ప్రారంభం కాగా, వాటిలో బేస్‌మెంట్ (బిఎల్) స్థాయిలో 90,613, గోడల నిర్మాణం పూర్తయినవి (ఆర్‌ఎల్) 41,212 ఇళ్లు శ్లాబ్ పూర్తి (ఆర్‌సి) అయినవి 37,400 ఇళ్లు ఉన్నాయని మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు.

మన తెలంగాణ 12 Nov 2025 4:00 am

జిఎస్‌టి వసూళ్లలో భేష్

మన తెలంగాణ/హైదరాబాద్: జీఎస్టీరేట్ల త గ్గింపుతో వస్తువుల ధరలు తగ్గినా తెలంగాణలో పన్ను వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. తాజా ని వేదిక ప్రకారం దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ అంచనాలను మించి 10 శాతం వృ ద్ధిని నమోదు చేసింది. ఈ సానుకూల వృద్ధి కేం ద్ర బడ్జెట్ అంచనాలను మించే అవకాశం ఉం దని నిపుణులు భావిస్తున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వస్తువుల ధరలు తగ్గినా తెలంగాణలో ప న్ను వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. తాజా ని వేదిక ప్రకారం దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ అంచనాలను మించి 10 శాతం వృ ద్ధిని నమోదు చేసింది. ఈ సానుకూల వృద్ధి కేం ద్ర బడ్జెట్ అంచనాలను మించే అవకాశం ఉం దని నిపుణులు భావిస్తున్నారు. సవరించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల కారణంగా వస్తువుల ధరలు దిగివచ్చాయి. కొన్ని వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించగా మరికొన్నింటి శ్లాబులు తగ్గించారు. అయితే దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు తగ్గుతాయని.. నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనాలు వేశారు. అయితే జీఎస్టీ పన్ను రేట్లు తగ్గినా వ సూళ్లు మాత్రం తగ్గట్లేదు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వల్ల లబ్ధి పొందిన అతిపెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. తాజా ‘ఎకోరాప్’ నివేదిక ప్రకారం జీఎస్టీ వసూళ్లలో అనూహ్య వృద్ధిని నమోదు చేసి దేశంలోనే రెండో స్థానం దక్కించుకుంది. జీఎస్టీ రేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆ దాయంలో 7 శాతం నష్టాన్ని అంచనా వేసిన తెలంగాణ రాష్ట్రం దానికి భిన్నంగా 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2025 అక్టోబర్ నెలలో తెలంగాణ జీఎస్టీ ద్వారా రూ.5,726 కోట్లు వ సూలు చేసింది. ఇది అంతకుముందు సంవత్స రం (2024 అక్టోబర్) వసూలు చేసిన రూ.5, 211 కోట్లతో పోలిస్తే 10శాతం అధికం. రాష్ట్రం అంచనా వేసిన నెలవారీ రూ.583 కోట్ల నష్టానికి బదులు.. ఏకంగా రూ.783 కోట్ల లాభాన్ని న మోదు చేసింది. ఎకోరాప్ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 8-9 శాతం వార్షిక జీఎస్టీ వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో కర్ణాటక 10 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలవగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కూడా తెలంగాణకు సమానంగా 8-9 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా. కర్ణాటక రాష్ట్రం నెలవారీ రూ.7,083 కోట్ల నష్టాన్ని అంచనా వేసినా అది కూడా 10శాతం వృద్ధిని చూసింది. పంజాబ్ 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో స్వల్పంగా 1 శాతం క్షీణత కనిపించగా కేరళలో జీఎస్టీ ఆదాయం 2 శాతం తగ్గింది. బడ్జెట్ అంచనాలను మించే అవకాశం : జీఎస్టీ కౌన్సిల్ డేటా ప్రకారం ధరల సవరణల తర్వాత చాలా రాష్ట్రాలు సానుకూల వృద్ధిని కనబరిచాయి. దేశీయ జీఎస్టీ వసూళ్ల అంచనాల ఆధారంగా చూస్తే రాష్ట్రాలు అక్టోబర్ 2025లో చూపిన వృద్ధిని ఇలాగే కొనసాగిస్తే 2025 -26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం జీఎస్టీ ఆదాయాలు కేంద్ర బడ్జెట్‌లో అంచనా వేసిన ప్రొజెక్షన్లను మించిపోయే అవకాశం ఉందని ఎకోరాప్ నివేదిక పేర్కొంది. గతంలో 2018 జూలై, 2019 అక్టోబర్ నెలల్లో జీఎస్‌టి రేట్ల మార్పుల తర్వాత కూడా స్వల్ప సర్దుబాటు దశ అనంతరం ఆదాయాలు నెలవారీ 5-6 శాతం వృద్ధి చెందాయని నివేదిక గుర్తు చేసింది. ప్రస్తుత రేట్ల తగ్గింపు వల్ల స్వల్పకాలంలో 3-4 శాతం క్షీణత ఉన్నప్పటికీ మొత్తం జీఎస్టీ పన్ను పరిధిని బలోపేతం చేసిందని, భవిష్యత్తులో స్థిరమైన వృద్ధికి ఇది మార్గం సుగమం చేస్తుందని నివేదిక వెల్లడించింది. రూ.1.22 లక్షల కోట్లు దాటిన ఆదాయం రాష్ట్ర ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది పెరిగింది. కొత్త రుణాలతోపాటు పన్నుల ఆదాయం అధికంగా ఉండటంతో రాష్ట్ర ఆదాయ, వ్యయాల్లో గణనీయంగా వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025- 26) తొలి అర్ధభాగం (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు) రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.1.22 లక్షల కోట్లు దాటగా వ్యయం రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్నట్లు కాగ్ తాజా ఆడిట్ నివేదిక వెల్లడించింది. గత ఏడాది(2024- 25) ఇదే అర్ధ సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రూ.14 వేల కోట్ల ఆదాయం అధికంగా ఉంది. పన్నుల ద్వారా ఈ ఏడాది మొత్తం కలిపి రూ.1.75 లక్షల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలని బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అర్ధ సంవత్సరం ముగిసేనాటికి అందులో 40.97 శాతం (రూ.71,836 కోట్లు) మాత్రమే సాధించింది. గత ఏడాది తొలి అర్ధభాగంతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో పన్నులపై ఆదాయం అదనంగా రూ.2,913 కోట్లు మాత్రమే పెరిగింది. కానీ కొత్త రుణాలు రూ.12,626 కోట్లు అదనంగా సేకరించడంతో మొత్తం ఆదాయం రూ.1.22 లక్షల కోట్లు దాటినట్లు కాగ్ వివరించింది. కొత్త రుణాల సేకరణ భారీగా పెరగడంతో అదే నిష్పత్తిలో వ్యయం కూడా రూ.1.01 లక్షల కోట్ల నుంచి రూ.1.11 లక్షల కోట్లకు చేరింది. సంక్షేమ పథకాలు, రాయితీలతోపాటు ఉద్యోగుల జీతభత్యాలు, రిటైరైన వారికి పింఛన్లు, పాత బాకీలపై వడ్డీలు, అసలు కిస్తీల చెల్లింపులకే భారీగా వ్యయం అవుతున్నట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయం భారీగా పెరగడం అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వెల్లడిస్తోంది. బడ్జెట్ లక్ష్యాల మేరకు పన్నుల ఆదాయం భారీగా పెరగకపోగా కనీసం తొలి అర్ధభాగంలో సగమైనా రాకపోవడంతో ఆర్థిక ద్రవ్యలోటు రూ.45,139 కోట్లకు విస్తరించింది. దీన్ని పూడ్చుకునేందుకు అంతమేర కొత్త రుణాలను సేకరించినట్లు తేలింది. ఇక ఈ ఏడాది ఆదాయ, వ్యయాల అనంతరం రెవెన్యూ మిగులు రూ.2,738 కోట్లకుపైగా ఉండవచ్చని బడ్జెట్‌లో అంచనావేస్తే తలకిందులై తొలి ఆరు నెలల్లోనే రూ.12,452 కోట్ల లోటు ఏర్పడింది. ఈ లోటు మైనస్ 454 శాతం అని కాగ్ స్పష్టం చేసింది.

మన తెలంగాణ 12 Nov 2025 3:30 am

భారత్‌పై సుంకాలు తగ్గిస్తాం:ట్రంప్

న్యూయార్క్ / వాషింగ్టన్ : భారత్‌పై విధించిన సుంకాలను ఏదో ఒక సమయంలో తగ్గించాలని అమెరికా యో చిస్తోందని, భారత్‌తో తా ము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గర గా ఉన్నామని అమెరికా అ ధ్యక్షుడు ట్రంప్ వెల్లడించా రు. భారత్‌తో జరుగుతున్న వాణిజ్య చర్చల గురించి విలేకరులు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి భి న్నంగా ఇప్పుడు ఒప్పందం ఉంటుందని పేర్కొన్నా రు. భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ వైట్‌హౌస్‌లో ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ భారత్‌పై సుంకాల గురించి ప్రస్తావించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్‌కు సన్నిహితంగా చర్చలు జరిగేలా చూడాలని సెర్గియోకు ట్రంప్ సూచించారు. 

మన తెలంగాణ 12 Nov 2025 3:00 am

బుధవారం రాశి ఫలాలు (12-11-2025)

మేషం : బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్త నడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృషభం : నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతుల పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. మిధునం : ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలసి వస్తాయి. వ్యాపారాలు అనుకులిస్తాయి. కర్కాటకం :  స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసి రావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం. సింహం : వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విబేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కన్య : స్థిరస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తుల :  కుటుంబసభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృశ్చికం : మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ధనస్సు : కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన శిరోభాధలు కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. మకరం : ఆత్మీయుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. కుంభం : వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీనం : ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.  

మన తెలంగాణ 12 Nov 2025 12:20 am

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..

దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించగా.. బ్యాంకాక్‌ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద భారీగా విదేశీ గంజాయిని గుర్తించారు. మొదట లగేజి బ్యాగ్‌ను చెక్‌ చేస్తుంటే NIA అధికారినంటూ నిందితురాలు బుకాయించింది. ఫేక్‌ ఐడీ కార్డు చూపించి కస్టమ్స్‌ అధికారులను బెదిరింపులకు దిగింది. అంతేకాదు, వాష్‌రూమ్‌లో NIA జాకెట్‌ వేసుకుని బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెపై అనుమానం కలగడంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని చెక్ చేయగా.. 12 కిలోల విదేశీ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్ లో రూ.12 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.

మన తెలంగాణ 11 Nov 2025 11:42 pm

ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్..

ములుగు, (ఆంధ్రప్రభ) : ములుగు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్

ప్రభ న్యూస్ 11 Nov 2025 11:03 pm

Prabhas wraps up The Raja Saab on a big day

Pan-India superstar Prabhas has his platter full with a bunch of projects. The Raja Saab, a horror comedy, will be his immediate next release and the shooting formalities are on the verge of completion. The makers have already announced that the film will hit the screens on January 9th. Director Maruthi surprised Prabhas fans with […] The post Prabhas wraps up The Raja Saab on a big day appeared first on Telugu360 .

తెలుగు 360 11 Nov 2025 10:55 pm

ఐర్లాండ్ 270/8

బంగ్లాదేశ్‌తో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఐర్లాండ్ టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన కేడ్ కర్మిఛెల్‌లు అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ధాటిగా ఆడిన స్టిర్లింగ్ 9 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన కేడ్ 129 బంతుల్లో ఏడు బౌండరీలతో 59 పరుగులు సాధించాడు. కుర్టిస్ కాంఫెర్ (44), వికెట్ కీపర్ లొర్కాన్ టక్కర్ (41), జోర్డాన్ నీల్ (30) పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి మెక్‌కార్తీ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మీరాజ్ మూడు, హసన్ మురాద్ రెండే వికెట్లను పడగొట్టారు.

మన తెలంగాణ 11 Nov 2025 10:31 pm

టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదగడం ఖాయం.. ధ్రువ్ జురెల్ పై ప్రశంసలు

కోల్‌కతా: యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల సౌతాఫ్రికాఎతో జరిగిన అనధికార టెస్ట్ సిరీస్‌లో ధ్రువ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందన్నాడు. రానున్న రోజుల్లో ధ్రువ్ జురెల్ టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదగడం ఖాయమన్నాడు. అతని బ్యాటింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ జట్టుకు అండగా నిలిచే సత్తా అతనికుందన్నాడు. రానున్న రోజుల్లో అతను టీమిండియా కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఎదగడం ఖాయమని గంగూలీ జోస్యం చెప్పాడు.

మన తెలంగాణ 11 Nov 2025 10:28 pm

పేలుడు బాధితులకు ఢిల్లీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

ఎర్రకోట సమీపంలో పేలుడు మృతుల కుటుంబాలకు ఢిల్లీ సిఎం రేఖాగుప్తా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారంగా అందజేయనున్నట్లు మంగళవారంనాడు ఒక ప్రకటనలో ఆమె వెల్లడించారు. శాశ్వత అంగవైకల్యానికి గురైనా వారికి రూ.5లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.2లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. స్వల్ప గాయాలతో బయటపడిన వారికి రూ.20వేలు అందజేస్తామని సిఎం వివరించారు. ఈ మేరకు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

మన తెలంగాణ 11 Nov 2025 10:22 pm

ఢిల్లీ పేలుడు డాక్టర్ పనే..

పుల్వామాకు చెందిన వైద్యుడు ఉమర్ నబీ కీలకపాత్ర! ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి కారులో వచ్చి మారణాకాండ ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధాలు సిసిటివి ఫుటేజీల ఆధారంగా పోలీసుల ప్రాథమిక నిర్ధారణ డిఎన్‌ఎ పరీక్ష కోసం ఉమర్ కుటుంబీల శాంపిళ్ల సేకరణ ఢిల్లీ కేసు ఎన్‌ఐఎకు అప్పగింత, ఉపా చట్టం కింద కేసు నమోదు న్యూఢిల్లీ/శ్రీనగర్ : ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. సిసిటివి ఫుటేజీల ఆధారంగా పేలుడుకు ఉపయోగించిన హ్యుందయ్ కారు నడిపిన జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీని కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు రోజు హర్యానాలోని ఫరీదాబాద్‌లో పట్టుబడ్డ 8మందితో కూడిన ఉగ్రవాద నెట్‌వర్క్‌తో ఉమర్‌కు సంబంధాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 2900 కేజీల పేలుడు పదార్ధాలతో పాటు భారీ ఎత్తున ఆయుధాలను ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న గంటల వ్యవధిలో ఢిల్లీలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పేలుడుకు ఉపయోగించిన కారు కూడా ఫరీదాబాద్ నుంచే ఢిల్లీకి రావడం మరింత బలం చేకూరుస్తోంది. ఢిల్లీలో పేలుడుకు ఉపయోగించిన హెచ్‌ఆర్ 26సిఇ 7674 నెంబర్ కలిగిన హ్యుండయ్ ఐ20 కారును సోమవారం ఉమర్ నబీ ఒక్కడే నడిపినట్లు, ఎర్రకోటలోని పార్కింగ్ ఏరియాకు మధ్యాహ్నం 3.19 గంటలకు వచ్చినట్టు గుర్తించారు. పేలుడు జరిగింది సాయంత్రం 6.52గంటలకు అంటే సుమారు 3గంటలకుపైగా ఉమర్ మాస్క్ ధరించి కారులోనే ఉన్నట్లు సిసిటివి ఫుటేజీలను బట్టి అర్థమవుతోంది. అయితే రద్దీ సమయంలో పేలుడుకు పాల్పడేందుకు అంతసేపు వేచిచూశాడా, లేకపోతే ఎవరి నుంచైనా ఆదేశాల కోసం ఎదురుచూశాడా అన్న కోణంలోనూ విచారణ సాగిస్తున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఎర్రకోటతో పాటు దాని చుట్టుపక్కల సిసిటివి ఫుటేజీలను కూడా విశ్లేషిస్తున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. ఆ 11 గంటల ప్రయాణం... పోలీసులు విచారణ క్రమంలో బదర్‌పూర్ అనే టోల్‌ప్లాజా వద్ద ఉమర్ నబీ ఫీజు చెల్లించడాన్ని సిసిటివి ఫుటేజీ ద్వారా గుర్తించారు. కారు హర్యానాలో ఫరీదాబాద్ నుంచి సోమవారంనాడు తెల్లవారుజామునే ప్రయాణం మొదలు పెట్టినట్లు అంచనాకు వచ్చారు. తొలుత ఫరీదాబాద్‌లోని ఏషియన్ ఆస్పత్రి వెలుపల ఉదయం 7.30గ.లకు కారు కనిపించింది. బదర్‌పూర్ టోల్‌ప్లాజాను సుమారు 8.13గంటలకు, ఒక్లాహా పారిశ్రామిక వాడకు సమీపంలోని పెట్రోల్ పంప్‌ను 8.20గంటలకు దాటింది. ఢిల్లీహర్యానా సరిహద్దుల్లో ఈ ప్రాంతాలు ఉంటాయి. మధ్యాహ్నం 3.19గంటలకు ఎర్రకోట కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పార్కింగ్ ఏరియాలోకి కారు ప్రవేశించింది. అక్కడ మూడు గంటల పాటు నిలిపివుంది. 6.22గంటలకు పార్కింగ్ ఏరియాను వీడిన కారు ఎర్రకోటకు సమీపించింది. అనంతరం 6.52గంటలకు పేలుడు సంభవించింది. పార్కింగ్ ఏరియాను వీడిన అర్ధగంట తర్వాత భారీ పేలుడును సృష్టించింది. ఇంకా ఢిల్లీ పొరుగు ప్రాంతాలు, ముఖ్యంగా ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చే రహదారులపై ఉన్న సిసిటివి ఫుటేజీలను తెప్పిస్తున్నామని, వాటన్నింటిని విశ్లేషించిన తర్వాత కారు ప్రతి కదలికను గుర్తించగలుతామని పోలీసులు వివరించారు. కాగా సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో బదర్‌పూర్ టోల్‌ప్లాజా వద్ద ఫీజు చెల్లించి ఉమర్ రిసిప్ట్ అందుకున్న దృశ్యాలు, ఆ సమయంలో నిందితుడు మాస్క్ ధరించి ఉన్నట్లు వాటిని బట్టి తెలుస్తోంది. ఇదే కారులో రెండు వారాల క్రితం ఉమర్ సహా ముగ్గురు కలిసి ప్రయాణించారని, ఒకచోట కారుకు పొల్యూషన్ చెకప్ కూడా చేయించినట్లు గుర్తించారు. ఆ మిగతా వ్యక్తులు ఎవరన్న కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు ఉపయోగించిన కారు హర్యానా నెంబర్ ప్లేట్ కలిగి ఉంది. దాని యజమాని పుల్వామాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. డిఎన్‌ఎ నమూనాల సేకరణ... పేలుడు ఘటనలో ఉమర్ నబీ కూడా మరణించినట్లు దాదాపు నిర్ధారించుకున్న దర్యాప్తు బృందాలు జమ్మూ కశ్మీర్‌లో పోలీసులను అప్రమత్తం చేశాయి. పుల్వామాలో కోయిల్ అనే గ్రామానికి హుటాహుటిన తరలివెళ్లాయి. అతని తల్లితో పాటు ఇద్దరు సోదరుల నుంచి డిఎన్‌ఎ పరీక్షల కోసం నమూనాలు సేకరించాయి. ఢిల్లీ పేలుడు స్థలి నుంచి సేకరించిన మృతదేహాల్లోని ఏదేని నమూనాతో వారి డిఎన్‌ఎ సరిపోలితే కేసు దర్యాప్తు కొలిక్కి వస్తుందని శ్రీనగర్‌కు చెందిన పోలీసు అధికారి వెల్లడించారు. ఇక ఉమర్ తండ్రి గులాం నబీ భట్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు వివరించారు. అదే సమయంలో కారు అమ్మకం, కొనుగోలుతో ంబంధాలున్న ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఎన్‌ఐఎకు అప్పగింత.. ఉపా కింద కేసులు ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగించింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు సమాచారం. సాధారణంగా ఉగ్రవాద సంబంధిత కేసులను ఎన్‌ఐఎ విచారణ చేపడుతూ ఉంటుంది. మరోవైపు ఈ ఘటనపై ఉపా, పేలుడు పదార్థాల చట్టం కింద ఢిల్లీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కొట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు రిజిస్టర్ చేశారు. దర్యాప్తు క్రమంలో ఢిల్లీ పోలీసులు అడుగడునా జల్లెడ పడుతున్నారు. అనుమానితుల కోసం వేట ముమ్మరం చేశారు. అదే సమయంలో ఫరీదాబాద్‌లోని అల్‌ఫలాహ్ విశ్వవిద్యాలయంపై కూడా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. వైద్య అధ్యాపకులు, వైద్యులు పలువురు ఉగ్రవాద నెట్‌వర్క్‌లో పాలుపంచుకున్నట్లు ఇటీవలి అరెస్ట్‌లతో తేటతెల్లం కావడం తెలిసిందే. 

మన తెలంగాణ 11 Nov 2025 10:04 pm

పెళ్లికి రెండు రోజుల ముందు…

ఎడపల్లి, (ఆంధ్రప్రభ): ఎడపల్లి మండలం మంగళపాడు గ్రామంలో పెళ్లి వేడుకకు సిద్ధమైన కుటుంబంలో

ప్రభ న్యూస్ 11 Nov 2025 10:02 pm

ఢిల్లీ పేలుడు ఘటన...12కు చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ : ఎర్రకోట సమీపంలో పేలుడు ఘనటలో మృతుల సంఖ్య 12కు చేరింది. సోమవారంనాడు రాత్రి వరకు 9మంది మృత్యువాత పడగా, మరో 20మంది గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరో ముగ్గురు మరణించినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు. అనుమానిత ఉగ్రవాదులు ఢిల్లీలో సోమవారం సాయంత్రం కారు బాంబు పేలుడు సృష్టించి మారణకాండకు కారణమైన సంగతి తెలిసిందే. దుండగులను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు రాజధానితో పాటు దాని చుట్టుపక్కల భారీ ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. 

మన తెలంగాణ 11 Nov 2025 9:48 pm

వదంతులు వ్యాప్తి చేయొద్దు.. ధర్మేంద్ర ఆరోగ్యంపై కూతురు

ముంబై : ప్రముఖ నటుడు 89 ఏళ్ల ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన కోలుకుంటున్నారని కుమార్తె ఈషా దేవోల్ మంగళవారం వెల్లడించారు. ముంబై బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయన మృతి చెందారంటూ మంగళవారం ఉదయం మీడియాలో వార్తలు రావడంపై ఆమె ఖండించారు. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని మీడియాకు ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా సూచించారు. ధర్మేంద్ర మంచి ఆరోగ్యంగా ఉండాలని సుదీర్ఘకాలం జీవించాలని మనమంతా ప్రార్ధిద్దామని ఆమె అభ్యర్థించారు.

మన తెలంగాణ 11 Nov 2025 9:30 pm

భారత్‌పై సుంకాలు తగ్గించాలని యోచిస్తున్నాం : ట్రంప్

న్యూయార్క్/వాషింగ్టన్: భారత్‌పై విధించిన సుంకాలను ఏదో ఒక సమయంలో తగ్గించాలని అమెరికా యోచిస్తోందని, భారత్‌తో తాము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. భారత్‌తో జరుగుతున్న వాణిజ్య చర్చల గురించి విలేకరులు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి భిన్నంగా ఇప్పుడు ఒప్పందం ఉంటుందని పేర్కొన్నారు. భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ వైట్‌హౌస్‌లో ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ భారత్‌పై సుంకాల గురించి ప్రస్తావించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్‌కు సన్నిహితంగా చర్చలు జరిగేలా చూడాలని సెర్గియోకు ట్రంప్ సూచించారు. 

మన తెలంగాణ 11 Nov 2025 9:24 pm

జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తొలిస్థానంలో తెలంగాణ

జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జల్ సంచయ్ జన్ భాగీదారి 1.0 కింద 5.2 లక్షల టీఎంసీల నీటి సంరక్షణ నిర్మాణాలతో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా అవతరించిందని జల్ శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. అలాగే 4.05 లక్షల టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్టులతో ఛత్తీస్ గఢ్ 2వ స్థానంలో, 3.64 లక్షల నీటి సామర్థ్య ప్రాజెక్టులతో రాజస్థాన్ మూడవ స్థానంలో ఉందని తెలిపారు.‘జల్ శక్తి అభియాన్ : క్యాచ్ ది రెయిన్’ ప్రచారం కింద ఈ ఏడాది అవార్డులను అందిస్తున్నట్లు పాటిల్ ప్రకటించారు. నవంబర్ 18న జరిగే 6వ జాతీయ జల అవార్డుల కార్యక్రమంలో జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావుతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారని తెలిపారు.

మన తెలంగాణ 11 Nov 2025 9:13 pm

రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

గత పది రోజుల వరకు రాష్ట్రాన్ని తడిచి ముద్ద చేసిన వర్షాలు తగ్గాయనే లోపే చలి పంజాతో రాష్ట్రాన్ని వణికిస్తుంది. గత రెండు రోజులుగా చలి తీవ్రరూపం దాల్చడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమొదయ్యాయి. ఆదిలాబాద్‌లో 10.2 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లలో 11.5, నిర్మల్‌లో 11.7, నిజామాబాద్‌లో 11.8, వికారాబాద్‌లో 12.0, సంగారెడ్డిలో 12.1, కామారెడ్డిలో 12.2, జగిత్యాలలో 12.5, మెదక్‌లో 12.8, సిద్దిపేటలో 13.3, రంగారెడ్డి, కరీంనగర్‌లో 13.4న, మంచిర్యాలలో 13.6, పెద్దపల్లిలో 13.7, మహబూబ్‌నగర్‌లో 14, నారాయణపేటలో 14.1, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లిలో 14.4, యాదాద్రి భువనగిరిలో 14.7, జనగాంలో 14.8, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 14.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు రాష్ట్ర డెవలెప్‌మెంట్ ప్రణాళికా సంఘం వెల్లడించింది.దీంతో పాటు రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉంటాయని పేర్కొంది. చలి తీవ్రత దృష్టా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మన తెలంగాణ 11 Nov 2025 9:10 pm

హుజూర్‌నగర్‌, మంథనిలో..

హుజూర్‌నగర్‌/మంథని (ఆంధ్రప్రభ): రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి. రేపు బుధవారం నీటిపారుదల, పౌరసరఫరాల

ప్రభ న్యూస్ 11 Nov 2025 9:04 pm

అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

 అటవీ భూమిని అక్రమంగా నరుకుతుంటే అడ్డుకోబోయిన అటవీ సిబ్బంది పై గిరిజనులు దాడి చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సమీపంలోని వత్తిమక్కులకుంట దగ్గర దాదాపు 15 ఎకరాల అటవీ భూమిలో కొంత మంది గిరిజనులు చెట్లను నరికారు. అటవీ భూమి నరకుతుంటే అడ్డుకోబోయిన ఫారెస్ట్ అధికారి జయరాంను వెంటబడి దాడి చేశారని ఫారెస్ట్ అధికారి తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దాడి చేసిన గిరిజనులను అదుపులోకి తీసుకొని ఫారెస్ట్ కార్యాలయానికి తరిలించారు.కొంతమంది పరారైనట్లు ఫారెస్ట్ రేంజర్ ఈశ్వర్ తెలిపారు. అటవీ భూములను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని, అక్రమంగా అడవిని నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికారిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గిరిజన మహిళలు తమపై దాడి చేసారని ఆరోపించారు. అటవీ అధికారులపై దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధికారుల సంఘం అధ్యక్షులు రవి కుమార్, ముజీబ్ ఘోరి, తేజశ్రీ, రాంబాబు, వల్య, హన్మంతు డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 11 Nov 2025 8:58 pm

ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి కారులో వచ్చి మారణాకాండ

ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. సిసిటివి ఫుటేజీల ఆధారంగా పేలుడుకు ఉపయోగించిన హ్యుందయ్ కారు నడిపిన జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీని కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు రోజు హర్యానాలోని ఫరీదాబాద్‌లో పట్టుబడ్డ 8మందితో కూడిన ఉగ్రవాద నెట్‌వర్క్‌తో ఉమర్‌కు సంబంధాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు విచారణ క్రమంలో బదర్‌పూర్ అనే టోల్‌ప్లాజా వద్ద ఉమర్ నబీ ఫీజు చెల్లించడాన్ని సిసిటివి ఫుటేజీ ద్వారా గుర్తించారు. కారు హర్యానాలో ఫరీదాబాద్ నుంచి సోమవారంనాడు తెల్లవారుజామునే ప్రయాణం మొదలు పెట్టినట్లు అంచనాకు వచ్చారు. తొలుత ఫరీదాబాద్‌లోని ఏషియన్ ఆస్పత్రి వెలుపల ఉదయం 7.30గ.లకు కారు కనిపించింది. బదర్‌పూర్ టోల్‌ప్లాజాను సుమారు 8.13గంటలకు, ఒక్లాహా పారిశ్రామిక వాడకు సమీపంలోని పెట్రోల్ పంప్‌ను 8.20గంటలకు దాటింది. ఢిల్లీహర్యానా సరిహద్దుల్లో ఈ ప్రాంతాలు ఉంటాయి. మధ్యాహ్నం 3.19గంటలకు ఎర్రకోట కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పార్కింగ్ ఏరియాలోకి కారు ప్రవేశించింది. అక్కడ మూడు గంటల పాటు నిలిపివుంది. 6.22గంటలకు పార్కింగ్ ఏరియాను వీడిన కారు ఎర్రకోటకు సమీపించింది. అనంతరం 6.52గంటలకు పేలుడు సంభవించింది. పార్కింగ్ ఏరియాను వీడిన అర్ధగంట తర్వాత భారీ పేలుడును సృష్టించింది. ఇంకా ఢిల్లీ పొరుగు ప్రాంతాలు, ముఖ్యంగా ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చే రహదారులపై ఉన్న సిసిటివి ఫుటేజీలను తెప్పిస్తున్నామని, వాటన్నింటిని విశ్లేషించిన తర్వాత కారు ప్రతి కదలికను గుర్తించగలుతామని పోలీసులు వివరించారు. కాగా సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో బదర్‌పూర్ టోల్‌ప్లాజా వద్ద ఫీజు చెల్లించి ఉమర్ రిసిప్ట్ అందుకున్న దృశ్యాలు, ఆ సమయంలో నిందితుడు మాస్క్ ధరించి ఉన్నట్లు వాటిని బట్టి తెలుస్తోంది. ఇదే కారులో రెండు వారాల క్రితం ఉమర్ సహా ముగ్గురు కలిసి ప్రయాణించారని, ఒకచోట కారుకు పొల్యూషన్ చెకప్ కూడా చేయించినట్లు గుర్తించారు. ఆ మిగతా వ్యక్తులు ఎవరన్న కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు ఉపయోగించిన కారు హర్యానా నెంబర్ ప్లేట్ కలిగి ఉంది. దాని యజమాని పుల్వామాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

మన తెలంగాణ 11 Nov 2025 8:52 pm

హైదరాబాద్‌లో అడ్వాన్స్ రోబోటిక్స్ ఇన్ రిహాబ్ అండ్ రికవరీ’ సదస్సు

హైదరాబాద్‌లో జరిగిన ఒక శాస్త్రీయ సమావేశంలో 50 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు , రీహాబిలిటేషన్ నిపుణులు ఆరోగ్య సంరక్షణలో అత్యంత నిర్లక్ష్యం చేయబడినప్పటికీ అత్యంత కీలకమైన అంశాలలో ఒకటైన - పోస్ట్-స్ట్రోక్ రీహాబిలిటేషన్ గురించి చర్చించారు. రోగులకు వేగవంతమైన మరియు అతి తక్కువ ఖర్చులో కోలుకోవడాన్ని నిర్ధారించడానికి భారతదేశం దాని పోస్ట్-స్ట్రోక్ కేర్ వ్యవస్థలో అధునాతన రోబోటిక్ రీహాబిలిటేషన్ ను ఏకీకృతం చేయాలని ప్యానెల్ ఏకాభిప్రాయంతో వెల్లడించింది. ‘అడ్వాన్స్ రోబోటిక్స్ ఇన్ రిహాబ్ & రికవరీ’ పేరిట నిర్వహించిన ఈ సదస్సు భారతదేశ ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో ఒక ప్రాథమిక అంతరాన్ని వెలుగులోకి తెచ్చింది. దేశంలో పెద్ద వయసు వ్యక్తుల వైకల్యానికి స్ట్రోక్ ప్రధాన కారణాలలో ఒకటిగా ఉన్నప్పటికీ చాలా మంది రోగులకు, వైద్య జోక్యం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌తోనే ముగుస్తుంది. రికవరీ కోసం నిజమైన యుద్ధం ఇక్కడే ప్రారంభమవుతుందని నిపుణులు నొక్కి చెప్పారు. “భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అత్యవసర సంరక్షణలో ప్రావీణ్యం సంపాదించింది, కానీ రీహాబిలిటేషన్ అంటే జీవితాలను నిజంగా పునర్నిర్మించే ప్రదేశం” అని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ బిఎస్వి రాజు అన్నారు. “స్ట్రోక్‌లో, ప్రతి రోజు లెక్కించబడుతుంది. రోగి గైడెడ్ రిహాబిలిటేషన్‌ను ఎంత త్వరగా ప్రారంభిస్తే, అతను తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. రోబోటిక్ రీహాబిలిటేషన్ చికిత్సకు ఖచ్చితత్వం మరియు తీవ్రతను జోడిస్తుంది” అని అన్నారు. HCAH సహ వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు డాక్టర్ గౌరవ్ తుక్రాల్ మాట్లాడుతూ, “మేము ఇటీవల తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్ రీహాబిలిటేషన్ ల్యాబ్ ను ప్రారంభించాము, ఇందులో ఏఐ -శక్తితో పనిచేసే ఎక్సోస్కెలిటన్లు మరియు మోషన్-ట్రాకింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ప్రారంభ మరియు నిర్మాణాత్మక రీహాబిలిటేషన్ క్లినికల్‌గా ప్రభావవంతంగా ఉండటమే కాకుండా ఆర్థికంగా కూడా తెలివైనది. చికిత్సను ముందుగానే ప్రారంభిస్తే రోగులు వేగంగా కోలుకుంటారు” అని అన్నారు. “శస్త్రచికిత్స ప్రాణాలను కాపాడుతుంది; రీహాబిలిటేషన్ దానిని తిరిగి ఇస్తుంది. పోస్ట్-స్ట్రోక్ రీహాబిలిటేషన్ ను మనం సంరక్షణలో ఒక ప్రామాణిక భాగంగా మార్చాలి” అని డాక్టర్ తుక్రాల్ జోడించారు.

మన తెలంగాణ 11 Nov 2025 8:50 pm

పసుపు రంగు చెప్పులు పట్టించేశాయ్!!

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో నాదర్‌గుల్‌ ప్రాంతంలోని అద్దె ఇంట్లో వరుసగా నేరాలు చేసింది.

తెలుగు పోస్ట్ 11 Nov 2025 8:43 pm

Observed Sridevi, Savitri For Kaantha: Bhagyashri

Bhagyashri Borse played the leading lady in the upcoming period drama Kaantha which is due for release in 3 more days on November 14th. The actress feels blessed to portray such a challenging role as Kumari at the very beginning of her career. “Since the film is set in the 1960s, recreating that era was […] The post Observed Sridevi, Savitri For Kaantha: Bhagyashri appeared first on Telugu360 .

తెలుగు 360 11 Nov 2025 8:40 pm

డిసెంబరు 13న హైదరాబాద్‌కు మెస్సీ

అర్జెంటీనాకు చెందిన దిగ్గజ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్‌కు రానున్నారు.

తెలుగు పోస్ట్ 11 Nov 2025 8:40 pm