SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

2900 కిలోల ఐఈడీ తయారీ పదార్ధాలు స్వాధీనం

హర్యానా పోలీసులతో కలిసి జమ్ముకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రమూకల గుట్టు రట్టయింది. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్‌వత్‌ఉల్‌హింద్ ఉగ్రవాద సంస్థలతో అత్యంత సబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు. వీరి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, 2900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వైద్యుల్లో జమ్ముకశ్మీర్ లోని కుల్గాంకు చెందిన డాక్టర్ ఆదిల్, పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్, లఖ్‌నవూకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ ఉన్నారు. షహీన్ లక్నో లోని లాల్‌బాగ్‌కు చెందినది. ఆమెకు చెందిన కారును డాక్టర్ ముజమ్మిల్ వినియోగిస్తున్నట్టు తేలింది. ఆ కారు నుంచి రైఫిల్, తూటాలు పట్టుబడ్డాయి. హర్యానా లోని ఫరీదాబాద్‌లో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ అల్ ఫలాహ్ యూనివర్శిటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీకి 45 కిమీ దూరంలో హర్యానా లోని ధోజ్‌లో ఈ యూనివర్శిటీ ఉంది. ప్రైవేట్‌గా నడుపుతున్న ఈ యూనివర్శిటీకి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉంది. ముజమ్మిల్ అహ్మద్ అద్దె నివాసంపై ఆదివారం రాత్రి దాడి చేసి భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌లో జేషే మహమ్మద్ పోస్టర్లు వేసిన కేసులో కూడా ముజమ్మిల్ వాంటెడ్‌గా ఉన్నాడు. ఆయన నుంచి 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు ఫరీదాబాద్ పోలీస్ కమీషనర్ సతేందర్ గుప్తా వెల్లడించారు. అది ఆర్‌డిఎక్స్ కాదని, కానీ అమోనియం నైట్రేట్ కావచ్చని చెప్పారు. ఇవి కాక ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికి 20 టైమర్లు, బ్యాటరీలతో నాలుగు టైమర్లు, ఐదు కిలోల మెటల్, వాకీ టాకీ సెట్, బ్యాటరీలు, రైఫిల్, మూడు మ్యాగజైన్లు, మరో 83 తూటాలు, 8 తూటాలతో ఉన్న పిస్టోలు, రెండు ఖాళీతూటాలు, స్వాధీనం అయ్యాయన్నారు. 8 పెద్ద సూట్‌కేసులు, నాలుగు చిన్న సూట్‌కేసులు, బకెట్ ధౌజ్ లోని ఆయన గది నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్‌లో అరెస్టు కాగా, మరో నిందితుడు ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్‌పూర్ నుంచి జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారని కమిషనర్ గుప్తా వెల్లడించారు. జమ్ము కశ్మీర్ పోలీస్ అధికార ప్రతిని ధి వివరాల ప్రకారం అక్టోబర్ 19న శ్రీనగర్ లోని బన్‌పొరా నౌగామ్ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలను లక్షం చేసుకుని జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిశాయి. దర్యాప్తులో ఉగ్రవాద భావజాలం కలిగిన విద్యార్థులు, ప్రొఫెసర్‌తోకూడిన ఓ ఉగ్రవ్యవస్థ వెలుగు చూసింది. పాకిస్థాన్ తదితర దేశాల నుంచి పనిచేసే ఉగ్రమూకలతో వీరికి సంబంధాలు ఉన్నాయి. సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో వీరు నిధులు సేకరించడం, తీవ్ర వాద భావజాలాన్ని పేరేపించడం, ఉగ్రవాద సంస్థల్లో చేర్పించడం తదితర కార్యకలాపాలు సాగిస్తున్నారని బయటపడింది. భద్రతా దళాలు మరికొందరిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ చేయడం ఈ ముఠా చర్యల్లో భాగంగా ఉంటోంది. ఆయుధాల చట్టం లోని సెక్షన్లు 7,25 కింద, చట్టవిరుధ్ధ కార్యకలాపాల నివారణ ఉపా చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

మన తెలంగాణ 10 Nov 2025 8:25 pm

క‌బ‌డ్డీ పోటీల్లో హోరాహోరీ…

క‌బ‌డ్డీ పోటీల్లో హోరాహోరీ… పినపాక, ఆంధ్రప్రభ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని

ప్రభ న్యూస్ 10 Nov 2025 8:25 pm

ఆన్ లైన్ లో అనుపమకు వేధింపులు

నటి అనుపమ పరమేశ్వరన్‌ కేరళ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.

తెలుగు పోస్ట్ 10 Nov 2025 8:20 pm

పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు వ‌రం…

పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు వ‌రం… కడం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ

ప్రభ న్యూస్ 10 Nov 2025 8:17 pm

ఎపిలో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం

ఎపిలో మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బాప ట్లకు వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లా రాచుపాలెం మండలంలోని రెడ్డిగూడెం వద్ద అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సిమెంట్ పైపులపై ఒరిగిపోయింది. ఆ పైపులు అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల కోసం ఉంచినవని అధికారులు వెల్లడించారు. అయితే, అదృష్ట వశాత్తూ బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులందరూ అత్యవసర ద్వారం ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. ఎటువంటి గాయాలు కాకపోవ డంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల గత కొద్దిరోజులుగా ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన రేపుతున్నాయి. ప్రైవేట్ బస్సు యజమానులు, ప్రభుత్వ రవాణా సంస్థలు పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. రహదారుల దుస్థితి, జాతీయ రహదారులు బాగా దెబ్బతిన్న పరిస్థితి కూడా ఈ ప్రమాదాలకు కారణమని నిపుణులు సూచిసు ్తన్నారు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సులే ప్రమాదానికి ఎక్కువగా గురౌతుండటం గమనార్హం.

మన తెలంగాణ 10 Nov 2025 8:16 pm

#SSMB29: ప్రమోషన్స్ రంగంలోకి హీరోయిన్ ప్రియాంక

హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘#SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ రివీల్.. నవంబర్ 15వ తేదీన రామోజీ ఫిలిమ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్‌లో జరగనుంది. ‘GlobeTrotter’ అనే పేరుతో జరిగే ఈ ఈవెంట్ కోసం మహేశ్ అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ ఈవెంట్ ప్రమోషన్స్ కోసం హీరోయిన్ ప్రియాంక చోప్రా రంగంలోకి దిగింది. ఈ ఈవెంట్‌కు సంబంధించి ప్రియాంక ఓ వీడియోని విడుదల చేసింది. ‘నేనెందుకు ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉంటున్నానో నవంబర్ 15న తెలుస్తోంది. మాతో జాయిన్ అవ్వండి. ఈ ఈవెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని ప్రియాంక వీడియో ద్వారా తెలిపింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి సోమవారం ఓ అప్‌డేట్ విడుదలైంది. ఈ చిత్రం కోసం నటి శృతిహాసన్ పాడిన పాటను సైలంట్‌గా విడుదల చేసింది. చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ విడుదలైంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే పాత్రలో నటిస్తున్నారని ఆయన ఫస్ట్‌లుక్‌లో పేర్కొన్నారు. ఇక నవంబర్ 15వ తేదీన జరిగే ఈవెంట్‌తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. She’s been everywhere And now @priyankachopra is here to tell you why this is the one event you can’t miss… #GlobeTrotter #GlobeTrotterEvent @ssrajamouli @urstrulyMahesh @PrithviOfficial @mmkeeravaani @SriDurgaArts @SBbySSK @thetrilight @JioHotstar pic.twitter.com/AZyfQBlO62 — Sri Durga Arts (@SriDurgaArts) November 10, 2025

మన తెలంగాణ 10 Nov 2025 8:15 pm

ఎర్రకోటలో భారీ పేలుడు.. 8 మంది మృతి

పేలిన కారు బాంబు అనేక మందికి గాయాలు.. ఢిల్లీ సర్కారు హై అలెర్ట్​.

ప్రభ న్యూస్ 10 Nov 2025 8:12 pm

అయోధ్యలో భారీ రావణాసురుడి విగ్రహం

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలో రామాయణ థీమ్‌ పార్కు సిద్ధమవుతూ ఉంది.

తెలుగు పోస్ట్ 10 Nov 2025 8:10 pm

మధ్యాహ్న భోజనం వికటించి 17 మంది విద్యార్థులకు ఆస్వస్థత

 కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులు సోమవారం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. ఆ తర్వాత మరో పదిమంది కూడా వాంతులు అవుతున్నాయని తెలపడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తము జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పాఠశాల పంపించి చికిత్స అందించారు. పచ్చి పులుసు తీసుకోవడం వలన కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోఅస్వస్థతకు గురైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. జమ్మికుంట ప్రభుత్వ బాలికల పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వికటించిన ఘటన పట్ల మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ హాస్టళ్లు,పాఠశాలల్లో భోజన నిర్వహణ ను ప్రభుత్వం గాలికొదిలేసినట్టు ఇటీవల జరిగిన ఘటనలు రుజువు చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలోనే ప్రభుత్వం , అధికార యంత్రాంగం హడావిడి చేయడం ఆ తర్వాత మర్చిపోవడమే ఇందుకు కారణమన్నారు. తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు తలెత్తుతున్నప్పటికీ నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆస్పత్రిలో చేరిన 17 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లు,పాఠశాలలను ప్రక్షాళన చేయాలని, నిరంతర బాధ్యతాయుత పర్యవేక్షణ చేపట్టాలని, విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బాధితులను పరామర్శించిన వారిలో మాజీ మున్సిపల్ ఛైర్మెన్ రాజేశ్వర్ రావు, సొసైటీ ఛైర్మెన్ పొనగంటి సంపత్ మాజీ మున్సిపల్ సభ్యులు తదితరులు ఉన్నారు.

మన తెలంగాణ 10 Nov 2025 8:08 pm

చర్యల నిమిత్తం ఆదేశాలు జారీ…

చర్యల నిమిత్తం ఆదేశాలు జారీ… మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కేంద్రంలో నూతనంగా

ప్రభ న్యూస్ 10 Nov 2025 8:08 pm

అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి స్టేషలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి ఆసౌకర్యం కలుగకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను 715 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని దశలవారీగా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి రోజు దాదాపు 1.97 లక్షల మంది సికింద్రాబాద్ స్టేషన్‌కు వస్తుంటారని తెలిపారు. 3 వేల మంది ప్రయాణికులు కూర్చునేలా 3 ఎకరాల్లో వెయిటింగ్ హాల్, క్యాంటీన్ వంటి సదుపాలు కల్పిస్తామన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు మాదిరిగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నామని ఈ స్టేషన్‌కు నేరుగా మెట్రో అనుసంధానం చేపడుతున్నామని బస్ స్టేషన్‌కు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. 26 లిప్టులు, 32 ఎస్కలేటర్లు, రెండు సబ్‌స్టేషన్‌లు, అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ సిస్టమ్‌లు స్టేషన్‌లో ఉంటాయన్నారు. రోజుకు 5 లక్షల మురుగునీటి శుద్ద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ స్టేషన్ పూర్తయితే ప్రతి రోజు 2.70 లక్షల మంది ప్రయాణికులు వచ్చినా ఇబ్బందులు కలుగకుండా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 1.65 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతున్నదని ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ స్టేషన్‌ను ప్రారంభించాలన్నది తన ఆకాంక్ష అని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు రోడ్డు విస్తరణ పనులు చేయాలని ఎన్ని సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేయాలని, అలాగే చర్లపల్లి రోడ్డు కనెక్టివిటీని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నుంచి కావాల్సిన మద్దతు అందుతుందన్నారు. ఇప్పకిటే 50 శాతం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో సౌత్‌బ్లాక్ బేస్‌మెంట్, మల్లీలెవెల్ కారు పార్కింగ్, కాజీపేట వైపు పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని, సౌత్ మెయిన్ బిల్డింగ్, నార్త్ మెయిన్ బిల్డింగ్, కవర్ ఓవర్ ప్లాట్‌ఫారం, హైదరాబాద్ వైపు పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. 

మన తెలంగాణ 10 Nov 2025 8:04 pm

Delhi : ఢిల్లీలో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్‌ సమీపంలో సోమవారం సాయంత్రం కారు పేలుడు సంభవించింది

తెలుగు పోస్ట్ 10 Nov 2025 8:02 pm

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల విక్రయం

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే ఔట్‌లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్‌గూడ ప్రాంతాల్లోని 163 ఓపెన్ ప్లాట్లను ఈనెల 17, 18 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలోని తొర్రూర్ ప్రాంతంలో 200 - నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న125 ప్లాట్లు, కుర్మల్‌గూడ లో 200ల నుంచి -300 చదరపు గజాల విస్తీర్ణంలోని 25 ప్లాట్లు, బహదూర్ పల్లిలో 200ల నుంచి -1,000 గజాల్లోని 13 ప్లాట్లను విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి వివాదాలు లేని, ఈ ప్లాట్లలో తమ అభిరుచులకు అనుగుణంగా ఇళ్లను నిర్మించుకోవచ్చని, ఈ లే ఔట్లలో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన కూడా పూర్తి అయ్యిందని ఎండి వి.పి.గౌతం పేర్కొన్నారు. ఈ ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. పెద్ద అంబర్‌పేట్‌లోని అవికా కన్వెన్షన్‌లో నవంబర్ 17,18 తేదీల్లో తొర్రూర్ ప్రాంతంలోని 125 ప్లాట్లకు, 18 వ తేదీ మధ్యాహ్నం నుంచి బహదూర్ పల్లి, కుర్మల్‌గూడల్లోని ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఎండి గౌతమ్ పేర్కొన్నారు. 125 ప్లాట్లకు బహిరంగ వేలం తొర్రూర్‌లో నచ్చిన ప్లాట్ ఎంపిక కోసం ప్రజలు తరలివచ్చారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలపై అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తొర్రూర్‌లోని ప్రాజెక్టు సైట్‌లో మౌలిక సదుపాయాల గురించి వాకబు చేస్తూ, ఇప్పటికే ఈ లే ఔట్ లో ఇళ్ల్లు కట్టుకొని నివసిస్తున్న వారితో మాట్లాడటంతో పాటు, ప్లాట్ల వాస్తును చూసుకుంటూ ప్రజలు సందడి చేస్తున్నారు. తొర్రూర్ లే ఔట్ లో ఉన్న 885 ప్లాట్లలో విడతల వారీగా ఇప్పటి వరకు 517 ప్లాట్లను విక్రయించారు. మిగిలిన వాటిలో ప్రస్తుతం 125 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు.

మన తెలంగాణ 10 Nov 2025 7:56 pm

వెలుగుల‌తో నిండిన ప‌వ‌ర్‌గూడ‌…

వెలుగుల‌తో నిండిన ప‌వ‌ర్‌గూడ‌… ఉట్నూర్/ జైనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:55 pm

వారం రోజులు  ఊరించి..

అకస్మాత్తుగా పెరిగిన బంగారం ధర ( ఆంధ్రప్రభ, బిజినెస్​ డెస్క్) ​ మదుపుర్లకు

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:49 pm

భూములు ఇచ్చేది లేద‌ని…

భూములు ఇచ్చేది లేద‌ని… తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:48 pm

ముదిగుబ్బలో మూడు కిలోల గంజాయి స్వాధీనం – 14 మంది అరెస్ట్

విశాలాంధ్ర, ముదిగుబ్బ: ముదిగుబ్బ పోలీసు బృందం భారీగా గంజాయి విక్రయ, సేవించే వారిని పట్టుకొనడం ముదిగుబ్బ లో కలకలం రేపింది. ముదిగుబ్బ గ్రామ శివారులోని కాకతీయ హోటల్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన పోలీసులు సోమవారం దాడి చేసి, గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను, గంజాయి సేవిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ధర్మవరం డీఎస్పీ బి.హేమంత్‌కుమార్ తెలిపారు.ఈ పోలీసుల దాడిలో మొత్తం మూడు కిలోల గంజాయి మరియు ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నామని, ముదిగుబ్బ తహసీల్దార్ […] The post ముదిగుబ్బలో మూడు కిలోల గంజాయి స్వాధీనం – 14 మంది అరెస్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 7:45 pm

త‌ల్లి అనికూడా చూడకుండా…

కొమ్ములవంచలో కత్తిపోట్ల కలకలం నర్సింహులపేట, ఆంధ్రప్రభ : కత్తితో ఓ వ్యక్తిని పొడుస్తుండగా

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:38 pm

సర్ ప్రైజ్.. #SSMB29 నుంచి శ్రుతిహాసన్‌ సాంగ్ రిలీజ్

దర్శకధీరుడు రాజమౌళి- సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘‘#SSMB29’’. నవంబర్ 15న ఈ మూవీ టైటిల్ తోపాటు వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం మేకర్స్, అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సిినిమాలో హీరోయిన్ శ్రుతిహాసన్ పాడిన పాటను కొద్దిసేపటిక్రితం రిలీజ్ చేశారు. ఈ ఆడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి.. అప్డేట్స్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాజమౌళి.. రామోజీ ఫిలీం సిటీలో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మహేష్, హీరోయిన్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తోపాటు తదితరులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈవెంట్ కు ముందే మేకర్స్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. గత శుక్రవారం ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘కుంభ’ అనే పాత్రలో కనిపించనున్న పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

మన తెలంగాణ 10 Nov 2025 7:37 pm

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 8 మంది మృతి

న్యూఢిల్లీ: ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్‌లోని పార్కింగ్ స్థలంలో ఉన్న కారులో పేలుడు సంభవించడంతో పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చెందగా.. పలువురు గాయపడ్డారు. పేలుడు కారణంగా చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలికి చేరుకున్నారు. సాయంత్రం 6.55 గంటలకు పోలీస్ కంట్రోల్ రూంకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఎర్రకోట గేట్ నెం.1 వద్ద పేలుడు జరిగినట్లు సమాచారం వచ్చిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఘటన స్థలికి చేరుకున్న క్లూస్ టీమ్, ఇతర దర్యాప్తు బృందాలు ఘటనస్థలిలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పేలుడు నేపథ్యంలో ఎర్రకోట సమీపంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. 

మన తెలంగాణ 10 Nov 2025 7:35 pm

సాహితీ లోకానికి తీరని లోటు…

సాహితీ లోకానికి తీరని లోటు… మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రజాకవి, రాష్ట్రీయ గీతం

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:31 pm

20 రోజులలో 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం…

20 రోజులలో 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం… పెద్దపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:25 pm

అర్హులైన పేద‌ల‌కే ఇండ్లు….

అర్హులైన పేద‌ల‌కే ఇండ్లు…. కడం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:18 pm

నిరాశ వద్దు.. మహిళ క్రికెటర్లకు గవాస్కర్ సందేశం

భారత మహిళ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి భారీ ఎత్తున నగదు, బహుమానాలు ఇస్తామని చాలా సంస్థలు ప్రకటించాయి. అయితే ఈ విషయంపై టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వారికి ఓ సందేశాన్ని అందించారు. తమకు ప్రకటించిన బహుమతులు నగదు అందకపోతే నిరాశ చెందవద్దని ఆయన సందేశంలో పేర్కొన్నారు. 1983లో ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంలో తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని తెలిపారు. ఛాంపియన్‌గా నిలిచిన హర్మన్‌ప్రీత్ సేనకు ఐసిసి నుంచి దాదాపు రూ.40 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. బిసిసిఐ రూ.51 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. అంతేకాక ప్రపంచకప్ గెలిచి క్రికెటర్లకు తమ తమ రాష్ట్రాలు నగదు బహుమతులు ప్రకటించాయి. జట్టులోని స్టార్ ఆటగాళ్లతో కొన్ని బ్రాండ్లు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వాగ్దానాలు నెరవేర్చకపోతే నిరాశ చెందవద్దని గవాస్కర్ సూచించారు. ‘‘కొంత మంది ప్రకటనదారులు, బ్రాండ్లు, వ్యక్తులు ఉచితంగా ప్రచారం పొందడానికి మిమ్మల్ని వాడుకుంటారని.. జట్టును అభినందిస్తూ.. పూర్తి పేజీ ప్రకటనలు చేస్తారు.. హోర్డింగ్‌లు పెడతారు. జట్టు, వ్యక్తిగత స్పాన్సర్లు కాకుండా మిగిలిన వారు తమ బ్రాండ్లను లేదా తమ గురించి ప్రచారం చేసుకోవాడానికి ప్రయత్నిస్తారు తప్ప భారత క్రికెట్‌కు కీర్తిని తెచ్చిన వారికి ఏమీ ఇవ్వరు. 1983 ప్రపంచకప్ సాధించిన జట్టుకు కూడా చాలా వాగ్దానాలు చేశారు. అప్పట్లో మీడియా కూడా చాలా కవరేజ్ ఇచ్చింది. దాదాపు అవన్నీ ఎప్పుడూ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయంలో మీడియాను నిందించలేం. ఎందుకంటే వారు ఈ సిగ్గులేని వ్యక్తులు తమను కూడా ఉపయోగించుకుంటున్నారని గ్రహించకుండా గొప్ప ప్రకటనలను సంతోషంగా ప్రచారం చేస్తారు. కాబట్టి అమ్మాయిలారా.. ఈ సిగ్గులేని వారు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి మీ విజయాన్ని ఉపయోగిస్తుంటే బాధపడకండి. ప్రపంచకప్ సాధించిన మీకు మరోసారి అభినందనలు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుంది. జై హింద్’’ అని గవాస్కర్ సందేశం ఇచ్చారు. 

మన తెలంగాణ 10 Nov 2025 7:12 pm

పురుగుల మందు తాగి నవ వధువు ఆత్మహత్య

మన తెలంగాణ/ఇల్లందు టౌన్: పురుగుల మందు తాగి నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని లచ్చగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్ధ్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.... మృతురాలు కమటం అంజలికి అదే గ్రామానికి చెందిన చిట్టూరి సాయికుమార్‌తో ఆరునెలల క్రితం వివాహం జరిగింది. భర్త సాయికుమార్ హైద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. అత్తమామల వద్ద ఉన్న అంజలి కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన అత్తింటి వారు హుటాహుటిన ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన చికిత్సకోసం ఖమ్మంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అంజలి మృతి చెందింది. ఇకపోతే అత్తింటి వేధింపులతోనే తమ కూతురు మరణించిందని అంజలి తల్లిదండ్రులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. 

మన తెలంగాణ 10 Nov 2025 7:11 pm

వివాహానికి హాజ‌రు…

వివాహానికి హాజ‌రు… చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:10 pm

కుటుంబ స‌భ్యుల పేరున…

కుటుంబ స‌భ్యుల పేరున… బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని భగీరథ పల్లి గ్రామంలో

ప్రభ న్యూస్ 10 Nov 2025 7:02 pm

Shilpa Shetty Restless over Rs 60 Cr Cheating Case

Bollywood actress Shilpa Shetty and her businessman husband Raj Kundra have been facing allegations in a Rs 60 crore fraud case. The actress has now moved to Mumbai High Court to quash the case that was lodged against the star couple. Shilpa Shetty approached the Mumbai High Court to direct the cops not to file […] The post Shilpa Shetty Restless over Rs 60 Cr Cheating Case appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 6:59 pm

Shruti Haasan’s Vocals for GlobeTrotter

The title glimpse of SS Rajamouli – Mahesh Babu will be unveiled in a grand manner on November 15th in a grand event that will take place in Ramoji Film City. Talented actress Shruti Haasan will lend her voice for a song from the film and MM Keeravani has chosen Shruti Haasan for the song. […] The post Shruti Haasan’s Vocals for GlobeTrotter appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 6:58 pm

దళితులు, గిరిజనులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి — సిపిఐ జగదీష్

సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం జనగణనలో కులగణన చేపట్టాలని నవంబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు విశాలాంధ్ర బ్యూరో, అనంతపురం:దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయని, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలోని సిపిఐ కార్యాలయంలో బి. కేశవరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.జగదీష్ మాట్లాడుతూ, దేశంలో సామాజిక […] The post దళితులు, గిరిజనులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి — సిపిఐ జగదీష్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 6:57 pm

ఘనంగా ఆదివాసి ఫెస్టివల్స్..

ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు జైనూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ ఐటీడీఏ పీవో, డీడీల‌

ప్రభ న్యూస్ 10 Nov 2025 6:48 pm

విషాదం: 3 నెలల గర్భణీ ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు మండలం లచ్చగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి వివాహిత అంజలి (20) ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. 6 నెలల క్రితం వివాహమైన అంజలి ప్రస్తుతం 3 నెలల గర్భణి. అత్తింటి వేధింపులే అంజలి మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 10 Nov 2025 6:43 pm

ఆంధ్రపభ కథనానికి స్పందన

మరమ్మతులు చేపడతాం తాడ్వాయి, ఆంధ్రప్రభ : వృధాగా పోతున్న మిషన్ భగీరథ(Mission Bhagiratha)

ప్రభ న్యూస్ 10 Nov 2025 6:36 pm

వితంతువును ప్రేమ పేరుతో మోసం – బిడ్డతో కనిపించని వ్యక్తి..

విశాలాంధ్ర, పుట్టపర్తి: వితంతువుని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్‌కి వినతి పత్రం అందజేసింది.బాధితురాలు పసుపులేటి పావని మాట్లాడుతూ కురుబలకోట మండలం రిషి వ్యాలీకి చెందిన తనకు ధర్మవరానికి చెందిన వినోద్ కుమార్‌తో వివాహం జరిగిందన్నారు . ఐదేళ్ల దాంపత్య జీవితం తర్వాత వినోద్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందడంతో తన స్వగ్రామంలో ఉండిపోయానని తెలిపారు. తరువాత మదనపల్లిలో వైద్యం […] The post వితంతువును ప్రేమ పేరుతో మోసం – బిడ్డతో కనిపించని వ్యక్తి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 6:35 pm

మ‌సీదుల‌ను ఎందుకు కూల్చ‌లేదు?

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఇటీవల తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు

ప్రభ న్యూస్ 10 Nov 2025 6:28 pm

మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందుచేత..

మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందుచేత.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : మెరుగైన వైద్యం

ప్రభ న్యూస్ 10 Nov 2025 6:21 pm

దళితుల స్మశానానికి దారి లేదు… పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద దళితుల ఆవేదన

విశాలాంధ్ర పుట్టపర్తి:- దళితుల స్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయాలని దళితులు కోరారు. సోమవారం చిలమత్తూరు మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన దళితులు పుట్టపర్తి కలెక్టరేట్ ఛాంబర్ లో బైఠాయించి నిరసన తెలిపి జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ, ఎస్సీ,ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు సాకే హరిలు మాట్లాడుతూ దళితవాడలో ఎవరు చనిపోయినా ఆరడుగుల జాగా లేక […] The post దళితుల స్మశానానికి దారి లేదు… పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద దళితుల ఆవేదన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 6:17 pm

Video : Exclusive Interview with Global Girlfriend Anu Emmanuel

The post Video : Exclusive Interview with Global Girlfriend Anu Emmanuel appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 6:10 pm

ఆమ్లా ఆల్‌టైమ్ వన్డే టీం ఇదే .. రోహిత్‌కి మొండి చెయ్యి

సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం హాషిం ఆమ్లా దన ధృష్టిలో అల్‌టైమ్ అత్యుత్తమ వన్డే క్రికెట్ జట్టును ప్రకటించాడు ఈ జట్టులో ముగ్గురు భారతీయులకు చోటు ఇచ్చిన ఆమ్లా టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు మొండి చెయ్యి చూపించాడు. తొలుత ఓపెనర్లుగా టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆసీస్ మాజీ ఆటగాడు ఆడం గిల్‌క్రిస్ట్‌లను ఎంచుకున్నాడు. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ.. నాలుగు ఐదు స్థానాల్లో బ్రియన్ లారా, ఎబి డివిలియర్స్.. ఆరో స్థానంలో తన సహచర క్రికెటర్ జాక్వెస్ కలిస్‌ని ఎంపిక చేశాడు. ఏడో స్థానానికి ఎంఎస్ ధోనీని ఎంచుకున్నాడు. ఇక బౌలర్లలో ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లకు చోటు ఇచ్చాడు. పేసర్లుగా వసీం అక్రమ్, డేన్ స్టెయిన్ లను, స్పిన్నర్లుగా ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్‌లను ఎంపిక చేసుకున్నాడు ఆమ్లా.

మన తెలంగాణ 10 Nov 2025 6:06 pm

Jubilee Hills Bye Elections : వార్ రూం నుంచి కీలక ఆదేశాలు.. పోలింగ్ పెరిగితే ఎవరికి లాభం?

జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది

తెలుగు పోస్ట్ 10 Nov 2025 6:05 pm

ఇసుక ట్రాక్ట‌ర్ బోల్తా…

ఇసుక ట్రాక్ట‌ర్ బోల్తా… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : అక్రమంగా ఇసుకను

ప్రభ న్యూస్ 10 Nov 2025 6:04 pm

రాజీపడేదే లేదు..

రాజీపడేదే లేదు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్మహిళా భద్రతా విభాగం పనితీరుపై సమీక్ష

ప్రభ న్యూస్ 10 Nov 2025 6:02 pm

సొమ్ము కేంద్రానిది… సోకు రాష్ట్రానిదా!!

సొమ్ము కేంద్రానిది… సోకు రాష్ట్రానిదా!! ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి

ప్రభ న్యూస్ 10 Nov 2025 5:53 pm

డిగ్రీ కళాశాలలో జిమ్ ప్రారంభం

డిగ్రీ కళాశాలలో జిమ్ ప్రారంభం పూర్వ విద్యార్థుల స‌హ‌కారంతో… పాల్వంచ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 10 Nov 2025 5:49 pm

Road Accident : రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సీరియస్

జాతీయరహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సమోటోగా విచారణ చేపట్టింది.

తెలుగు పోస్ట్ 10 Nov 2025 5:45 pm

నో ప్రోబ్లం.. నేనున్నా..   

నో ప్రోబ్లం.. నేనున్నా.. —– కొన్ని అర్జీలు ఇలా.. —– పోడూరు

ప్రభ న్యూస్ 10 Nov 2025 5:42 pm

యువ శాస్ర్త‌వేత్త‌లుగా ఎద‌గాలి…

యువ శాస్ర్త‌వేత్త‌లుగా ఎద‌గాలి… దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని

ప్రభ న్యూస్ 10 Nov 2025 5:39 pm

మరికొద్ది రోజుల్లోనే పెళ్లి.. అంతలోనే..

మరికొద్ది రోజుల్లోనే పెళ్లి.. అంతలోనే.. బావిలో పడి యువకుడి మృతితారుపల్లిలో తీవ్ర విసాదం

ప్రభ న్యూస్ 10 Nov 2025 5:35 pm

ఎన్నికల హామీలు అమలు చేయాలి మెడికల్‌ కళాశాల పిపిపి విధానాన్ని రద్దు చేయాలి. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.వలరాజు,నాసర్‌ జీ

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : కూటమి ప్రభుత్వం ఎన్నికలల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,జీఓ నెం 108,77ను రద్దుచేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.వలరాజు, బందెల నాసర్‌ జీ లు డిమాండ్‌ చేశారు. సోమవారం ఏఐఎస్‌ఎఫ్‌ కలెక్టరేట్‌ సమీపంలోని విజయపాలడైరీ వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అద్యక్షుడు సోమన్న అద్యక్షత నిర్వహించిన బహిరంగ సభలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో చేపట్టిన ఇచ్చాపురం […] The post ఎన్నికల హామీలు అమలు చేయాలి మెడికల్‌ కళాశాల పిపిపి విధానాన్ని రద్దు చేయాలి. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.వలరాజు,నాసర్‌ జీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Nov 2025 5:27 pm

SC Raises Concern Over Delay in Telangana MLAs Defection Case

The Supreme Court is set to hear on November 17 a contempt petition filed against the Telangana Assembly Speaker for allegedly failing to comply with its order to decide on the disqualification pleas of 10 Bharat Rashtra Samithi (BRS) MLAs who defected to the ruling Congress party. Back on July 31, a Bench led by […] The post SC Raises Concern Over Delay in Telangana MLAs Defection Case appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 5:26 pm

బ్రిడ్జి ఉన్నట్టా? లేనట్టా?

బ్రిడ్జి ఉన్నట్టా? లేనట్టా? టేకుమట్ల, ఆంధ్రప్రభ : నవ్వి పొదురు గాక నాకేటి

ప్రభ న్యూస్ 10 Nov 2025 5:25 pm

Ap Cabinet Meeting : మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలివే

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు

తెలుగు పోస్ట్ 10 Nov 2025 5:23 pm

ఫ్యాక్ట్ చెక్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా పలు న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో

తెలుగు పోస్ట్ 10 Nov 2025 5:19 pm

త్వరగా పరిష్కరించాలి

త్వరగా పరిష్కరించాలి వైద్య పరీక్షలు చేయించుకున్న ఇన్చార్జి పీఓ ఉట్నూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 10 Nov 2025 5:04 pm

రాజంపేటలో కల్తీ డీజిల్ విక్రయాలు..

రాజంపేటలో కల్తీ డీజిల్ విక్రయాలు.. రాజంపేట (బిక్కనూర్), ఆంధ్రప్రభ : రాజంపేట మండల

ప్రభ న్యూస్ 10 Nov 2025 5:04 pm

మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. భోజనంలో గుడ్లు వాసన వచ్చాయని.. అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

మన తెలంగాణ 10 Nov 2025 5:03 pm

53 అర్జీలు స్వీకరించిన ఎస్పీ..

53 అర్జీలు స్వీకరించిన ఎస్పీ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యంజిల్లా ఎస్పీ కె.వి.

ప్రభ న్యూస్ 10 Nov 2025 4:51 pm

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మెట్రో మార్గంతో అనుసంధానం : కిషన్ రెడ్డి

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికరణ పనులు వేగంగా సాగుతున్నాయని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నడుస్తున్న రైళ్లు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పనులు చేయాల్సి వస్తోందని అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు నిత్యం 1.97 లక్షల ప్రయాణికులు వస్తుంటారని తెలియజేశారు. శంషాబాద్ విమానాశ్రయం వలే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దాలనేది తన ఆంకాంక్ష అని.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మెట్రో మార్గంతో అనుసంధానం చేస్తున్నాం అని.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఉంటాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వేస్టేషన్ కోసమే ప్రత్యేకంగా 2 సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, 5 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను 1.65 లక్షల చ.మీ. మేర కొత్తగా నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది డిసెంబర్ లోపు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 10 Nov 2025 4:50 pm

ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరైతే 50 మార్కులు విద్యార్థులకు ఇవ్వడం లేదు

ఉత్తరాఖండ్ లోని దేవ్ భూమి యూనివర్శిటీ అధికారులు ప్రధాని మోడీ సభకు హాజరైతే 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని

తెలుగు పోస్ట్ 10 Nov 2025 4:35 pm

రవితేజ లేటెస్ట్ మూవీ.. నవ్వులు పూయిస్తున్న గ్లింప్స్..

మాస్ మహరాజ రవితేజ సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఫ్యాన్స్‌కి అది ఒక పండుగలా ఉండేది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీతో ఆయన సినిమాలు నిండిపోయేవి. గత కొంతకాలంగా రవితేజ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ఎదుట బోల్తా పడింది. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు రవితేజ. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్నారనే విషయం తెలిసిందే. దీనికి ‘#RT76’ అనే వర్కింగ్ టైటిల్ ఇంతకాలం ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ని రివీల్ చేస్తూ ఓ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. టైటిల్ గ్లింప్స్‌లో రామసత్యనారాయణ(రవితేజ) జీవితంలో ఇద్దరు ఆడవాళ్లు అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానాలు చెప్పలేకపోయారు అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాలో డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ హీరోయిన్లు. సునీత్, సత్య, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్‌లో ప్రకటించారు. 

మన తెలంగాణ 10 Nov 2025 4:34 pm

జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక.

జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక. ఊట్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 10 Nov 2025 4:18 pm

జిల్లాను టాప్ ఫైవ్ లో ఉంచాలి…

జిల్లాను టాప్ ఫైవ్ లో ఉంచాలి… ప్రతి ఉద్యోగి 24 గంటలు విధుల్లో

ప్రభ న్యూస్ 10 Nov 2025 4:14 pm

కాంప్లెక్స్ షెట‌ర్ల‌ను కిరాయికి ఇస్తాం

స్పందించిన కమ్మర్‌ప‌ల్లి ఎంపీడీవోఆంధ్రప్రభ ఎఫెక్ట్ కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల

ప్రభ న్యూస్ 10 Nov 2025 4:05 pm

ముగింపు ద‌శ‌లో ష‌ట్‌డౌన్‌

ముగింపు ద‌శ‌లో ష‌ట్‌డౌన్‌ వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అమెరికాలో నెల‌కొన్న సుధీర్ఘ

ప్రభ న్యూస్ 10 Nov 2025 4:05 pm

Andhra Prabha Smart Edition |దివికేగిన అందెశ్రీ/కోర్టు ధిక్కారమే/హాస్పిటల్​లో ఆర్డీఎక్స్​​

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 10-11-2025, 4.00PM ఎల్లిపోయావా ఎల్లన్నా.. దివికేగిన అందెశ్రీ స్పీకర్​ది

ప్రభ న్యూస్ 10 Nov 2025 4:04 pm

Ravi Teja’s BMW: Perfect Sankranthi Entertainer

Mass Maharaja Ravi Teja is joined hands with director Kishore Tirumala for a wholesome entertainer co-starring Ashika Ranganath and Dimple Hayathi. Sudhakar Cherukuri is bankrolling the movie, with Zee Studios presenting. Today, the makers revealed the film’s title, first look, and title glimpse. Ravi Teja’s character finds himself hilariously trapped between two women in his […] The post Ravi Teja’s BMW: Perfect Sankranthi Entertainer appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 4:04 pm

రేపు ఘ‌ట్‌కేస‌ర్‌లో అందెశ్రీ అంత్య‌క్రియ‌లు

రేపు ఘ‌ట్‌కేస‌ర్‌లో అందెశ్రీ అంత్య‌క్రియ‌లు ప్ర‌భుత్వ లాంఛ‌న‌ల‌తో అంతిమ సంస్కారాలులాలాపేట నివాసానికి అందెశ్రీ

ప్రభ న్యూస్ 10 Nov 2025 4:01 pm

రేపు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సుకు శంకుస్థాపన

కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ఎచ్చెర్ల నియోజకవర్గం

ప్రభ న్యూస్ 10 Nov 2025 3:54 pm

సినీ ఫక్కీలో గంజాయి ర‌వాణా

32 కిలోల గంజాయి ప‌ట్టుకున్న పోలీసులువాహనం స్వాధీనంగంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలుజిల్లా

ప్రభ న్యూస్ 10 Nov 2025 3:41 pm

ప్రైవేటు పాఠ‌శాల‌ల మ‌ధ్య పోటాపోటీ…

ప్రైవేటు పాఠ‌శాల‌ల మ‌ధ్య పోటాపోటీ… నర్సింహులపేట, ఆంధ్రప్రభ : జిల్లా స్థాయి అండర్

ప్రభ న్యూస్ 10 Nov 2025 3:35 pm

బుమ్రా కంటే అతడే బెస్ట్ బౌలర్.. : మాజీ క్రికెటర్

ప్రస్తుత క్రికెట్‌లో బెస్ట్ బౌలర్ ఎవరని అడిగితే అంతా ముందుగా చెప్పేది జస్ప్రీత్ బుమ్రా పేరే చెబుతారు. చిన్న, పెద్ద అంతరూ అతడిని ఇస్టపడతారు. అయితే టీం ఇండియా మాజీ క్రికెట్ర్ సుబ్రమణ్యం బ్రదీనాథ్ మాత్రం బుమ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుమ్రా కంటే యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎంతో బెటర్ అని పేర్కొన్నారు చక్రవార్తి గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడని, అందుకే టి-20ల్లో నెం.1 బౌలర్ అయ్యాడని కొనియాడారు. ‘‘వరుణ్ చక్రవర్తి ప్రపంచంలోనే నెం.1 టి-20 బైలర్ ఎందుకు అయ్యాడో అతడి గణంకాలే చెబుతున్నాయి. అతడు బుమ్రా కంటే ఎక్కువ విలువైనవాడు. పవర్‌ప్లేలో కావొచ్చు, డెత్ ఓవర్లలో కానీ పరుగులు కట్టడి చేయాలంటే కెప్టెన్‌కు గుర్తుకువచ్చే పేరు చక్రవర్తిదే. అతడు ఇప్పుడు భారత జట్టులో ప్రధాన బౌలర్. తన అంతర్జాతీయ కెరీర్ అరంభంలో పెద్దగా రాణించకపోయినా.. తన పునరాగమనంలో మాత్రం అద్భుతాలు చేస్తున్నాడు. టి-20 ప్రపంచకప్ 2026లో అతడు భారత జట్టుకు కీలకం కానున్నాడు. వరుణ్ బంతితో మ్యాజిక్ చేస్తే భారత్‌కు తిరుగుండదు’’ అని సుబ్రమణ్యం అన్నారు. 

మన తెలంగాణ 10 Nov 2025 3:35 pm

రాజుకు లక్ష సహాయం

రాజుకు లక్ష సహాయం తక్షణమే స్పందించిన తోటి వ్యాపారులు నర్సంపేట, ఆంధ్రప్రభ: షార్ట్

ప్రభ న్యూస్ 10 Nov 2025 3:28 pm

గన్నవరంలో కేంద్ర బృందం

గన్నవరంలో కేంద్ర బృందం గన్నవరం, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను (mantha cyclone)

ప్రభ న్యూస్ 10 Nov 2025 3:19 pm

Samantha’s Socio-fantasy Attempt

Top actress Samantha is returning back to Telugu cinema after a huge gap. The actress has commenced shooting for ‘Maa Inti Bangaram’ and this interesting attempt is directed by Nandini Reddy. The film is said to be a socio-fantasy film which comes with a divine touch. Samantha’s rumored boyfriend Raj Nidimoru has penned the script […] The post Samantha’s Socio-fantasy Attempt appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 3:19 pm

కేజీబీవీ విద్యాల‌యం ఆక‌స్మిక త‌నిఖీ..

కేజీబీవీ విద్యాల‌యం ఆక‌స్మిక త‌నిఖీ.. జూలూరుపాడు, ఆంధ్రప్రభ : కస్తూరిభా గాంధీ బాలికల

ప్రభ న్యూస్ 10 Nov 2025 3:16 pm

Allu Sirish Responds to Trolls in Style

Mega hero Allu Sirish got engaged to his lady love Nayanika and the wedding will take place soon. The engagement was limited to the family members. Allu Sirish’s look and his specially designed jewellery went viral all over. Some of the meme pages have trolled Allu Sirish for wearing a necklace and some of them […] The post Allu Sirish Responds to Trolls in Style appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 3:11 pm

జంతర్ మంతర్ దగ్గర…

జంతర్ మంతర్ దగ్గర… యువకుడు తనను తాను కాల్చుకుని.. ఢిల్లీ : దేశ

ప్రభ న్యూస్ 10 Nov 2025 3:05 pm

Ram Charan’s Chikiri Rare Global Milestone

Mega Power Star Ram Charan attained global fame with RRR and is now all set to enthrall in the rustic sports-action drama Peddi, helmed by Buchi Babu Sana. The musical journey of the movie began with the release of the first single, Chikiri Chikiri, which has already become a worldwide sensation. AR Rahman delivered a […] The post Ram Charan’s Chikiri Rare Global Milestone appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 3:04 pm

శ్రీశైలంలో భక్తుల కిటకిట…

ఘనంగా కార్తీక మహోత్సవాలు వేకువ జాము నుంచే దర్శనం ప్రారంభం.. నంద్యాల బ్యూరో,

ప్రభ న్యూస్ 10 Nov 2025 3:02 pm

వైభవంగా లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం

వైభవంగా లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 10 Nov 2025 2:53 pm

శ్రీశైలానికి కార్తీక శోభ

వైభ‌వంగా లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని

ప్రభ న్యూస్ 10 Nov 2025 2:53 pm

Massive Bureaucratic Reshuffle on the Cards in Andhra Pradesh

Andhra Pradesh is gearing up for a major bureaucratic overhaul. The state administration, led by Chief Minister N. Chandrababu Naidu, is preparing for a large-scale reshuffle of IAS officers across departments. After the formation of the coalition government, several transfers have already taken place, but the next phase is expected to be far more significant. […] The post Massive Bureaucratic Reshuffle on the Cards in Andhra Pradesh appeared first on Telugu360 .

తెలుగు 360 10 Nov 2025 2:53 pm

అమైరా దస్తూర్ హాట్ అందాలు మీకోసం

                               

మన తెలంగాణ 10 Nov 2025 2:51 pm

నేల కూలిన తెలంగాణ సాహితీ శిఖరం

నేల కూలిన తెలంగాణ సాహితీ శిఖరం నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ సాహితీ

ప్రభ న్యూస్ 10 Nov 2025 2:47 pm

ఆక్రమణలు తొలగించాలి

వ్యాపారులకు అధికారుల ఆదేశం సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : రాజీవ్ రహదారి కి ఇరువైపుల

ప్రభ న్యూస్ 10 Nov 2025 2:42 pm

సోలార్ ప్లాంట్ కు స్థల పరిశీలన…

సోలార్ ప్లాంట్ కు స్థల పరిశీలన… బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా

ప్రభ న్యూస్ 10 Nov 2025 2:39 pm

బీహార్‌లో రేపు తుదిదశ పోలింగ్

రెండోదశలో 122 స్థానాల్లో ఓటింగ్‌కు సర్వంసిద్ధం చివరి రోజు ఎన్‌డిఎ, మహాకూటమి నేతల హోరాహోరీ ప్రచారం 14న ఎన్నికల ఫలితాలు పాట్నా: బీహార్‌లో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రెండో తుది రౌండ్ పోలింగ్ ప్రచారం చివరి రోజున ఎన్‌డిఎ, ఇం డియా కూటమి అగ్రనేతలు పలు సభలలో గడు వు దాకా సభల్లో పాల్గొన్నారు. సాయంత్రంతో నెలరోజులుగా ఇక్కడ నెలకొని ఉన్న తీవ్రస్థాయి వ్యాగ్యుద్ధం, అధికారం కోసం ప్రత్యర్థుల స్థాయి హోరాహోరీ ముగిసింది. రెండో దఫా ఓటింగ్ మంగళవారం జరుగుతుంది. ఈ నెల 6వ తేదీన తొలి దశ పోలింగ్‌లో బీహార్‌లో అత్యధిక స్థాయి లో దాదాపు 65 శాతం ఓటింగ్ రికార్డు అయిం ది. అప్పుడు 121 స్థానాల్లో తమ ప్రతినిధుల భ వితవ్యాన్ని ప్రజలు బ్యాలెట్ ద్వారా నిర్ధేశించి ఉంచారు. రెండో దఫాలో 122 స్థానాలకు పో లింగ్ జరుగుతుంది. దీనితో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల వ్యూహాలకు మరింత పదును పెట్టుకోవడం జరిగింది. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇతర నేతలు ఎన్‌డిఎ తరఫున పలు సభల లో ప్రసంగించారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగా రు. ప్రధాని మోడీ, అమిత్ షాలపై ఓట్ల చోరీ ఆ రోపణలను తీవ్రతరం చేశారు. సీమాంచల్ ప్రాంతంలోని కిషన్‌గంజ్, పూర్ణియా జిల్లాల్లో ముస్లింల జనా భా ఎక్కువగా ఉండటంతో ఇక్క డ తమ స్థితిని పదిలపర్చుకునేందుకు ఇండియా కూటమి య త్నిస్తోంది. దీనికి ప్రతిగా బీహార్ ప్రగతిని ప్రధా న నినాదంగా చేసుకుని కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రచార రంగంలోకి దిగారు. వరుసగా 20 దశాబ్దాలుగా బీహార్‌లో నితీశ్ పాలన కొనసాగుతూ వస్తోంది. దీనిని ఇప్పుడు దెబ్బతీసేందుకు ప్రత్యేకించి ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ తన స్థానికత బలంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. తండ్రి లాలూ సెంటిమెంట్‌ను జాగ్రత్తగా వాడుకున్నారు. ఈ సారి ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు అ నేక మంది బీహార్‌లో ప్రచారం సాగించారు. డ బుల్ ఇంజిన్‌తోనే బీహార్ ప్రగతి సాగుతుందనే సంకేతాలు వెలువరించారు. పలువురు ఎన్‌డిఎ పాలిత సిఎంలు, మంత్రులు కూడా ప్రచారానికి వచ్చా రు. కాంగ్రెస్ సిఎంలు కూడా బీహార్ ప్రచారానికి దిగారు. ఎన్‌డిఎ, ఇండియా కూటమి మ ధ్య ఈసారి ఓటరు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఈ నెల 14వ తేదీన ఎన్నికల వెల్లడి అవుతుంది. ఈసారి ఎన్నికల ఫలితం ఇప్పటికైతే ఎవరికి అంతుచిక్కని ఉత్కంఠత రీతిలోనే ఉందని ఎన్నికల విశ్లేషకులు తెలిపారు. 

మన తెలంగాణ 10 Nov 2025 2:31 pm