SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

బెంగళూరులో కొరియా మహిళకు లైంగిక వేధింపులు

బెంగళూరు : దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళకు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేసే మహమ్మద్ అఫాన్ అహమద్ ఈ మహిళను భద్రతా తనిఖీల పేరిట లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. రెండు మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఈ నిందితుడిని అరెస్టు చేశారు. స్వదేశానికి వెళ్లేందుకు టర్మినల్ 2లో ఇమిగ్రేషన్ నిబంధనలు పాటిస్తున్నప్పుడు ఈ మహిళను లైంగికంగా వేధించారు. తనిఖీలు సోదాల పేరిట అసహ్యంగా ప్రవర్తించారని వెల్లడైంది. లగేజీలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని చెప్పి సిబ్బందిలో ఓ వ్యక్తి తనను ఎవరూ లేని చోటికి మగవారి వాష్‌రూం వద్దకు తీసుకువెళ్లేందుకు యత్నించాడని మహిళ తెలిపింది. తనను హత్తుకోవడం, శరీరం తడమడం వంటి పనులకు దిగాడని తెలిపింది. తాను ప్రతిఘటించడంతో ఈ వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడని పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొంది. అక్కడి కెమెరాల పరిశీలన తరువాత కేసు నమోదు చేశారు. వ్యక్తిని విచారిస్తున్నారు. 

మన తెలంగాణ 23 Jan 2026 6:10 am

ఇసి తీరుపై ప్రజల్లో అపనమ్మకం

ఓటర్లు తమ గుర్తింపును ధ్రువీకరించుకునేలా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పునః పరిశీలనను ఎన్నికల కమిషన్ చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని, అందువల్ల ఈ కసరత్తు ఓటర్ల ఓటు హక్కుకు ఎలాంటి భంగం కలిగించబోదని సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని భరోసా ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా పశ్చిమబెంగాల్‌లోని గ్రామ పంచాయతీ భవనాలు, తాలూకా బ్లాక్ ఆఫీసుల్లోను, వార్డు ఆఫీసుల్లోనూ వ్యత్యాసాలున్న ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశించడం చెప్పుకోతగ్గది. అంతేకాదు ఈ కసరత్తు వల్ల ఎవరైతే బాధితులవుతున్నారో వారు తమ డాక్యుమెంట్లను లేదా అభ్యంతరాలను పంచాయతీ భవనాలు, బ్లాక్ ఆఫీసుల్లోను సమర్పించుకునే అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌కు సూచించింది. అయితే ఎన్నికల కమిషన్ ఓటర్లు జాబితాల్లో అనేక వైరుధ్యాలు ఉండడం వల్లనే పశ్చిమబెంగాల్‌లో దాదాపు 1.25 కోట్ల ఓటర్లను జాబితాల్లోంచి తొలగించవలసి వచ్చిందని వాదిస్తోంది. 2002 నాటి జాబితాలోని ఓటర్ల సంతానంతో వివరాలు సరిపోలకపోవడం, వివిధ అక్షర దోషాలు చోటు చేసుకోవడం ఈ వైరుధ్యాలకు దారితీసిందని చెబుతోంది. అలాగే తల్లిదండ్రులకు వారి పిల్లలకు వయసులో 15నుంచి 50 ఏళ్ల వరకు తేడాలు కనిపించడం జరుగుతోందని పేర్కొంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో వారికి నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించింది. అయితే ఈ వైరుధ్యాల వెనుక ఉండే తర్కం కోర్టును ఒప్పించలేకపోతోంది. దేశంలో బాల్య వివాహాలు లేవు కదా తల్లికి, బిడ్డకు 15 ఏళ్ల వరకు వయసు తేడా ఎలా వస్తోందని కోర్టు ఆశ్చర్యబోతోంది. ప్రజల హృదయాల్లో నమ్మకం కలిగించేలా ఎన్నికల కమిషన్ సమాధానాలు ఉండడం లేదు. ప్రజల ఓటు హక్కులకు సంబంధించి ఏం నిర్ణయాలు అయినా తీసుకునే స్వేచ్ఛ ఎన్నికల కమిషన్‌కు ఉన్నప్పటికీ నమ్మకం కోల్పోతే ఎన్నికలను నిర్వహించే సామర్థం కమిషన్‌కు ఉండదు. వాస్తవానికి ఇతర సంస్థల కన్నా ఎన్నికల కమిషన్ తనకు తానే విశ్వాసాన్ని కోల్పోతోంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితాలు తయారు చేస్తున్నప్పటికీ మొత్తం ఈ కసరత్తు అంతా కమిషన్‌పై అపనమ్మకంతోనే సాగుతోంది. తన కసరత్తులో తలెత్తుతున్న లోపాలకు బాధ్యత వహించకుండా ఏకపక్షంగా తన వాదనతోనే ముందుకు వెళుతోంది. బీహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర పరిశీలన ప్రారంభించేటప్పుడు సుప్రీం కోర్టు చేసిన హెచ్చరికలను ఎన్నికల కమిషన్ గుర్తు పెట్టుకోవాలి. ఈ కసరత్తు అంతా ఓటర్లను కలుపుకునే విధంగా సాగాలి తప్ప ఏదో సాంకేతిక లోపాలను చూపించి ఓటర్ల పేర్లను తొలగించకూడదని సుప్రీం కోర్టు ఆనాడే హెచ్చరించింది. ఎన్నికల జాబితాల ప్రక్షాళనను ఏ పార్టీ, ఏ వ్యక్తీ తన అధికారాన్ని ప్రశ్నించలేరు. కానీ ఓటర్లను తొలగించడం లేదా తిరస్కరించడం వంటి చర్యలకు బాధ్యత వహించకుండా కమిషన్ తనకు తాను సమర్ధించుకోవడం ఎవరికీ ఆమోద యోగ్యం అనిపించదు. ఎన్నికల జాబితానుంచి ఒక పేరు ఎందుకు తొలగించవలసి వచ్చిందో వివరించడానికి బదులు ప్రజలను తాము అసలైన ఓటర్లమని నిరూపించుకోవాలని అగ్నిపరీక్ష పెట్టడం మొండితనం గానే అసంతృప్తి కలిగిస్తుంది. పౌరులకు ఓటు హక్కు తొలగించే విషయంలో తాను తీసుకున్న చర్యలతో సుప్రీం కోర్టును ఎన్నికల కమిషన్ ఒప్పించలేకపోవడం గమనార్హం. కనీసం ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తన అధికార పీఠం బాధ్యతల సంగతి పక్కనపెట్టి వాస్తవాలు ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరం. పౌరులపట్ల తన బాధ్యత ఏమిటో అర్థం చేసుకోవాలి. ఈ ప్రక్రియను ప్రజలకు అసౌకర్యంగా, ఇబ్బందులు కలిగించేలా ఉండకుండా ప్రజల్లో నమ్మకం కలిగించేలా చాలా సున్నితంగా నిర్వహించక తప్పదు. ఇటీవల నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెద మేనల్లుడు, 60 ఏళ్ల చంద్ర కుమార్ బోస్ పశ్చిమబెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ సరిగ్గా జరగలేదని అసంతృప్తిని వ్యక్తం చేయడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. ఆయన 2016 అసెంబ్లీ ఎన్నికల్లోను, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన, ఆయన భార్య, కుమార్తె జనవరి 16న ఎన్నికల కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఆయన ఇద్దరు కుమారులు విదేశాల్లో ఉండడంతో వారి తరఫున కూడా విచారణలో వకాల్తా పుచ్చుకున్నారు. తామంతా ఎన్యూమరేషన్ ఫారాలతో సహా కావలసిన డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ, పరిశీలనకు ఎన్నికల కమిషన్ అధికారులు రమ్మన్నారని, ఆయన చెప్పారు. మొదట 2002 ఓటర్ల జాబితాలో తన పేరు కనిపించలేదన్నారని, తరువాత గుర్తించినట్టు చెప్పారని బోస్ పేర్కొన్నారు.ఇప్పుడు లింకేజీలో సాంకేతిక సమస్య ఎదురైందని సాకు చెబుతున్నారని, సాంకేతిక సమస్యే ప్రధాన కారణమైతే ఈ లోపానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ సవరణ ప్రక్రియ ఓటర్లను తీవ్రంగా వేధించడానికే తప్ప మరేమీ కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. బీహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర పరిశీలన ఆదరాబాదరాగా ఎన్నికల కమిషన్ చేపట్టడంతో ఎన్నో లోపాలు జరిగాయి. సవరణ చేపట్టక ముందు లింగ నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 907 మంది మహిళలు ఉండగా, సవరణ చేపట్టిన తరువాత 892 మందిగా సంఖ్య పడిపోయింది. ముఖ్యంగా 18నుంచి 29 ఏళ్ల వయసు గ్రూపు వారిలో మహిళా ఓటర్లను ‘పెర్మనెంట్లీ షిఫ్టెడ్’ కేటగిరి కింద విచక్షణారహితంగా జాబితాలనుంచి తొలగించడం అత్యంత వివాదాస్పదమైంది. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్‌కు కొన్ని సూచనలు చేసింది. అదెంతవరకు ఆచరణలో ఉంటుందో ఎన్నికల కమిషన్ స్పష్టం చేయక తప్పదు.

మన తెలంగాణ 23 Jan 2026 6:10 am

దావోస్..ధమాకా!

మనతెలంగాణ/హైదరాబాద్:‘తెలంగాణ రైజిం గ్’ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులోనూ తెలంగాణ ఆశించిన లక్ష్యాన్ని సాధించింది. వర ల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో పెట్టుబడులకు మించి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ప్రభు త్వ సంకల్పం నెరవేరింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో ప్రతినిధుల బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడుల ను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కా ర్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒ ప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర ల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగం హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫాలో అప్ ఫోరం నిర్వహించాలనే ప్రతిపాదన కు సానుకూల స్పందన లభించింది. మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రము ఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలు కీలక సమావేశాలు, ప్ర త్యేక సెషన్ల అనంతరం మూడు రోజు ల తెలంగాణ ప్రతినిధి బృందం దావోస్ ప ర్యటన గురువారం సాయంత్రం ముగిసింది. దా వోస్‌లో కార్యక్రమాలు ముగించుకొని సిఎం రేవంత్ రెడ్డి జూరిచ్ బయల్దేరారు. అక్కడి నుంచి సిఎం అమెరికా పర్యటనకు వెళుతున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దావోస్ నుంచి ఇండియాకు తిరుగు పయనమయ్యారు.

మన తెలంగాణ 23 Jan 2026 6:00 am

కులరాక్షసత్వంపై మోగిన ‘దండోరా’

కులం పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని బాబాసాహేబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పారు. ఈ భారతదేశం అంటేనే కులాలు... కుల ఆధిపత్యాలు. అటువంటి కులరక్కసి వందేళ్లకు దగ్గరకు కావొస్తున్నా.. ప్రపంచం అంతా ఆధునికంగా దూసుకుపోతున్న కులం మన దేశంలో అవకాశాలనే కాదు.. మనుషుల ప్రాణాలను తీసేంత కారణం అవుతోంది. కులం కట్టుబాట్ల పేరుతో ఇంకా వేధింపులు భరించలేక భయంతో తలవంచుకు బతుకుతున్న పరిస్థితులు. కులం మాటను ధిక్కరిస్తే... కాటికి మోయడానికి శవాన్ని తీసుకెళ్లడమే కాదు.. ఆ కులానికి సంబంధించిన శ్మశానంలో దహన సంస్కారాలు చేయడానికి వీలు లేదని కర్కషత్వంగా ప్రవర్తించే కులరాక్షసత్వంపై.. కులం పేరిట జరుగుతున్న దాడులు, హత్యలపై దండోరా మోగించారు సినీ దర్శకుడు మురళీకాంత్. ఆయన చేసిన ప్రయోగం నిజంగా చాలా గొప్పది. సాహసంతో కూడినదని చెప్పొచ్చు. కులం... ఇది రెండు అక్షరాలే కానీ దాని వెనుక అంతులేని ఆవేదనలు ఉంటాయి. అయితే ఆ ఆవేదనలు బయటకు కన్పించకుండా ఎలా కనుమరుగు చేస్తున్నారో.. పల్లె మనుషుల్లో కులం ఎంత చిచ్చురేపుతోందో దండోరా సినిమాలో దర్శకుడు చూపగలిగారు. నిజంగా ఈ దేశంలో ప్రతిభ ఎంత గొప్పగా ఉన్నా చివరికి దానికి కొలమానం కులం అవుతుందే. ఎంత గొప్ప మనసు ఉన్నా .. గొప్ప చదువు ఉన్నా కులం రాక్షసత్వంపై అవేమీ పనిచేయవు. పల్లెల్లో నిత్యం జరిగే సంఘటనలనే అతి సాధారణంగా సినిమాలో చూపారు. కానీ ఆ దండోరా దగా పడ్డ గుండెల ఆవేదనలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ప్రతీ మనిషి జీవితంలో పుట్టుక, మరణం సాధారణం. అయితే తక్కువ కులంలో పుట్టినంత మాత్రాన తరతరాలుగా చీదరించుకునే పరిస్థితి. తక్కువ కులంలో పుట్టి గొప్ప కొలువు, గౌరవం ఉన్నా.. ఆ మనిషికి గౌరవించబడకపోవడానికి కారణం చూపగలిగారు. తరతరాల ఆచారాలే తప్ప.. కింది కులం వారి ఆలోచనలకు విలువనీయని పరిస్థితిని చక్కగా వివరించారు. మనిషి పుట్టుక ఎటువంటి అవకాశాలకు దగ్గర చేస్తుందో.. కింది వర్గాలను ఎలా దూరం చేస్తుందో తెలిపే ప్రయత్నం గొప్పగా చేశారు. ఓ కింది కులం వారికి తమ శ్మశానంలో దహనం చేసే అవకాశం లేకపోగా.. గుడి మైలపడిపోతదని భావించి అవతలి వైపు నుంచి తిప్పి పంపడమో.. ఊరి అవతలి నుంచి పంపడమో చేస్తుంటారు.. అటువంటి సన్నివేశం గుండెలను గాయం చేస్నిట్లు చేస్తుంది. అటువంటి అనేక సంఘటనలు, యదార్థ ఘటనలు ప్రస్తుతం సమాజంలో ఇంకా చీకటిలో ఉన్నట్లుగా బయటపడనివి ఎన్నో ఉన్నాయి. రెండు స్వచ్ఛమైన మనసులు కలిసి.. కులాలకు అతీతంగా కలిసిన ఆ మనసులను మూర్ఖత్వంగా విడగొట్టే ప్రయత్నంలో మనుషులను పొట్టన పెట్టుకోవడానికి వెనుకాడడం లేదు. కులం తక్కువోడికి తమ బిడ్డను ఇస్తే నలుగురిలో ఎలా తిరగగలను అని మనుషులను ద్వేషింవడమే కాదు.. హత్య చేయడమే మంచిది అన్నట్లుగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కళ్లకు చూపించారు. మీరు ఎంత గొప్ప చదువులు చదివినా.. ఎంత ఆస్తి ఉన్నా.. పుట్టిన పుట్టుక మారదంటూ తాతల నాటి బానిసత్వాన్ని చూస్తున్నారే తప్ప కింది కులాల్లోని గొప్ప మనసులను అర్థం చేసుకునే స్థితిలో లేరు. రెండు కులాలు కలిస్తేనే పెళ్లి తప్ప.. పెళ్లికి రెండు మనసులు కలిస్తే సరిపోదు.. రెండు కులాలు కూడా కలవాలి లేకుంటే ఎంతకైనా తెగించేందుకు సిద్ధం అవుతున్నారు. కులం బలం అవ్వాలి అంతే గానీ పెనుభూతంలా మారకూడదు. అటువంటి కులరాక్షత్వంపై తెలంగాణ యాసభాషలో దండోరా ఆవేదనల గుండెలను ఆవిష్కరించింది. కులం పేరుతో జరిగే గాయాలు... కులం ఆధిపత్యం దాడిలో బలయ్యే జీవితాల యెథలను కళ్లారా చూపగలిగారు. కుల వివక్ష తీవ్రంగా ఉన్న రోజులను, కుల కట్టుబాట్ల వల్ల విచ్ఛిన్నం అవుతున్న కుటుంబాలను, పల్లెలను వీడి పట్టణాలకే పరిమితమయ్యేలా కుల రాక్షసత్వాన్ని వివరించగలిగారు. కులం కేవలం కింది వర్గాలనే కాదు ఉన్నత వర్గాల్లోనూ కట్టుబాట్ల పేరిట ఎంత భయపెట్టిందో అర్థం అవుతుంది. కులానికి ఎదురు తిరిగితే.. కులం మాట వినకపోతే ఆఖరి ప్రయాణం అంత్యక్రియలకు కూడా షరతులు విధిస్తూ రాక్షస ఆనందాన్ని పొందిన విధానం.. చైతన్యం కలిగిన, సమాజాన్ని ప్రశ్నించే సత్తా కలిగిన వారుంటే కుల కట్టుబాట్ల పేరుతో వారిని వెలేయడం నాటి అనాగరిక కుల రక్కసి కన్పిస్తుంది. కులం అనే గర్వం ఆ మనిషి.. ఆ కుటుంబాన్ని ఎంత ఛిన్నాభిన్నం చేస్తుందో అద్భుతంగా చూపగలిగారు. ఎక్కువ కులం అమ్మాయిని ప్రేమించినందుకు తక్కువ కులం వాడంటూ హత్య చేసి తమ కులం గొప్ప కులం అని ఆధిపత్యాన్ని చాటుకోవడం గొప్ప అయింది. కులం సమాజంలో బలం అవ్వాలి.. అంతేగానీ ఆవేదనలకు కారణం కాకూడదు. అటువంటి అనేక ఆవేదనలకు దండోరా సాక్ష్యంగా నిలిచింది. కుల ఆధిపత్యం వల్ల కన్నతల్లి లాంటి పల్లెలనే ద్వేషించేలా కుల రాక్షసత్వం ఏవిధంగా ఉంటుందో చూపగలిగారు. అందుకే పల్లెలకు దూరంగా చదువుకున్న వారంతా వెళ్లిపోయి ఊళ్లంటేనే అయిష్టతగా మార్చివేసింది. అటువంటి సమయంలో కుల వివక్షపై అవగాహన సమావేశాల్లోనూ అంబేద్కర్, పెరియర్, జ్యోతిరావు ఫూలే వంటి సామాజిక శక్తుల పేర్లు తీసుకొని సమసమాజం కోసం ఎలా కొట్లాడాలో నేర్పే ప్రసంగం ఆసక్తిని కలిగిస్తుంది. దర్శకుడు ఈ విషయంలో పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. మహనీయుల పేర్లను సినిమాలో చాలా అరుదుగా వాడుకునే సందర్భం నుంచే వారి మాటలను విద్యార్థులకు ప్రసంగాల పేరిట విన్పించి నేటి తరానికి ఓ సందేశాన్ని ఇచ్చినట్లు చేశారు. చదవండి పిచ్చిపట్టినట్లు చదవండి.. ఏది తప్పనిపిస్తే దానిని నిలదీయండి అంటూ.. బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటేనే రాజకీయం తెలుస్తది. రాజకీయం తెలిస్తేనే బతుకులు బాగుపడతాయంటూ ప్రస్తుత తరానికి సైతం ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇదిలా ఉంటే కింది కులాల వారికి గుడిలోకి ప్రవేశానికి వందేళ్లు పట్టిందనే సత్యాన్ని చెప్పారు. కులాల కుంపటిలో తల్లి లాంటి బిడ్డను కోల్పోయిన తండ్రి.. ఆవేదన. తండ్రి ఆవేశం వల్ల చెల్లిని కోల్పోయాననే ఆవేశంతో కన్న కొడుకు తండ్రిని అసహ్యించుకునే సందర్భం... ఆవేశం, ఆవేదనలకు అంతులేని దుఃఖానికి దండోరా సాక్ష్యంగా కన్పించింది. చివరగా ఏ ఆధిపత్య కులం అని గర్వంగా విర్రవీగాడో.. ఆ కులమే ఆయన అంత్యక్రియలనే ఆఖరి మర్యాదకు అడ్డుపడింది. భూమిని సంఘానికి రాసి ఇస్తేనే అంత్యక్రియలకు శ్మశాన వాటికలో అవకాశం ఇస్తామనే షరతు కుల రాక్షసత్వం ఎంత ప్రమాదమో తెలిసివచ్చేలా చేసింది. ఆ భూమి ఏదో కులానికి కాదు.. అది చచ్చిన మనిషికి ఇచ్చే అఖరి మర్యాద కోసం అని పెంచుకున్న బిడ్డ ఊరి ప్రజల కోసం ఇచ్చి కుల రాక్షసత్వంపై.. కులం పెనుభూతాన్ని తరిమికొట్టినంత పనిచేసి కుల కట్టుబాట్లను ఎదురించగలిగింది.. కులం బలం అవ్వాలి.. కానీ భయం కాకూడదు. అనే గొప్ప సందేశాన్ని దర్శకుడు ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. దండోరా నిజంగా కుల రాక్షసత్వాన్ని చూపింది. ప్రేమ, చావు, అంత్యక్రియలు అనే మూడు అంశాలను పట్టుకొని ఆనాటి పరిస్థితులను కళ్లకు అద్దారు. అంతటి గొప్ప సినిమా దండోరా.. అందుకే జూనియర్ ఎన్‌టిఆర్ సైతం ‘దండోరా సినిమాపై ట్వీట్ చేసి మెచ్చుకున్నారు. నిజంగా అది ఆయన మంచి మనసుకు సాక్ష్యం. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని తీసిన సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా.. మిగతా ఇండస్ట్రీలోని పెద్ద వారు మాట్లాడకపోయినా ‘దండోరా’ నుంచి నేటి తరం నేర్చుకుంటుంది. సమాజమనే కుటుంబం పట్ల బాధ్యతగా మెదిలేలా దర్శకుడు మురళీకాంత్ గొప్ప ప్రయత్నం.. రేపటి రోజుల్లో కులహత్యలు, పరువు హత్యలు తగ్గడానికి కారణం అయ్యేలా సినిమాను ఆవిష్కరించారు.. ఇటువంటి సామాజిక, సందేశాత్మక చిత్రాలు మరెన్నో రావాల్సిన అవసరం ఉంది. సంపత్ గడ్డం 78933 03516

మన తెలంగాణ 23 Jan 2026 6:00 am

23rd jan 2026 |నేటి పంచాంగం

23rd jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:00 am

జననం తప్ప మరణం లేని నేతాజీ

నాకు రక్తాన్ని ఇవ్వండి స్వేచ్ఛను మీకు ఇస్తానన్న సుభాష్ చంద్ర బోస్ గొప్ప యోధులు. స్వేచ్చ ఎవరికీ ఇవ్వబడదు మనకు మనమే తీసుకోవాలి. మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అన్యాయంతో రాజీపడడం అంటే అతి పెద్ద నేరం చేసినట్టే. ఇవన్నీ నేతాజీ చెప్పిన మాటలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు. ‘ఢిల్లీ చలో’, ‘జై హింద్’, ‘నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను’ అనేవి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసిద్ధ నినాదం. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టినవాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. బోసుకి రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్య్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఆల్ ఇండియా యూత్ లీగ్) అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. ఈయనను ఆంగ్లేయులు దాదాపు 11 సార్లు కారాగారంలో నిర్బంధించారు. 939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి బోసు దీన్ని ఒక సువర్ణవకాశంగా భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరుతోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్యసహకారాలతో సింగపూర్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. బోసు మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని అధిక సంఖ్యాకుల అభిప్రాయం. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న భారతదేశంలోని ఒడిషాలోని కటక్ పట్టణంలో జన్మించాడు. తండ్రి జానకినాథ్ బోస్ గొప్ప లాయరు. గొప్ప జాతీయవాది. బెంగాల్ శాసనమండలికి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభాబతి బోస్. బోస్ విద్యాభ్యాసం కటక్లోని రావెన్షా కాలేజీయేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజీలోను సాగింది. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొననారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించసాగాడు. సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్‌ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్‌తో కలసి బోస్ బెంగాల్‌లో ఉద్యమం నిర్వహించాడు. ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలలో కొత్త భావాలు చోటుచేసుకొన్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికీ, మనడానికీ భారత దేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబరు 26న బోస్ ఎమిలీ షెంకెల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకొన్నాడు. ఈమె ఆస్ట్రియాలో జన్మించింది. వారికి 1942 లో పుట్టిన కూతురు పేరు అనిత. బోస్ తన భార్యకు రాసిన అనేక ఉత్తరాలను తరువాత లెటర్స్ అనే సంకలన పుస్తకంగా శిశిర్ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు. బోస్ 1939 లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి 1938లో, గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా, బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్ నుండి వైదొలిగాడు. వేరు మార్గం లేని బోస్ ‘అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్’ పార్టీని స్థాపించాడు. 1938లో ‘జాతీయ ప్రణాళికా కమిటీ’ అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు. స్వాతంత్య్రానికి బోస్ ప్రణాళిక జర్మనీలో భారత జాతీయ సైన్యం అదృశ్యం, అనుమానాస్పద మరణమును రెంకోజీ ఆలయం (జపాన్) అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం దొరకలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్‌కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. 1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్‌కు వెళ్ళింది. అప్పట్లో భారత్‌కు తైవాన్‌తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999- 2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్‌కు లేఖను పంపడం జరిగింది. ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. చరిత్ర ఉన్నంత కాలం బోస్ భారత ప్రజల గుండెల్లో ఉంటారు. నేటి యువతరం నేతాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి చరిత్రను అధ్యయనం చేయాలి. కామిడి సతీష్ రెడ్డి 9848445134

మన తెలంగాణ 23 Jan 2026 5:50 am

ఐఎఎస్ హోదా కోసం అడ్డదారులు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణకు చెందిన 16 మంది రెవెన్యూ అధికారులకు కేంద్రం ఐఏఎస్‌లుగా హోదా కల్పించడం వివాదాస్పదంగా మా రింది. వీటి వెనుక పెద్ద మొత్తంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. హోదా దక్కిన వారిలో కొందరిపై ఈడి, విజిలెన్స్, ఎసిబి, ఫోర్జరీ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారులు విస్తుపోతున్నారు. ఐఏఎస్ హోదాకు సిఫార్సునకు 56 సంవత్సరాల వయసు దాటకూడదన్న ప్రాథమిక నిబంధనను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంపై సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. యూపిఎస్సీ నిబంధనలను పాటించకుండా పలువురికి ఐఏఎస్ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాద న పంపించినప్పటి నుంచి డిఓపిటి, యూపిఎస్‌సి వరకు అన్ని చోట్ల అతిక్రమణలు జరగడం వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు అధికార వర్గా ల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు వారికి ఐఏఎస్ హోదా కల్పించే అంశంలో తమకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అర్హులు కొందరు హైకోర్టుసు ఆశ్రయిం చగా ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లో ఉంది. ఇ లా ఉండగా, రాష్ర్ట ప్రభుత్వం పంపించిన జాబితాకు నిబంధనలను పరిగణనలోకి తీసుకోలేదని దానిని ఆమోదించవద్దని సుప్రీంకోర్టు న్యాయవాది మనీ ష్ తివారీ ఆధారాలతో సహా యూపిఎస్సీ లేఖ రాశారు. అయినప్పటికీ ఆ లేఖ ను యూపిఎస్సీ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చే సే అవకాశం ఉన్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఐఏఎస్ హోదాకు ఎంపికైన వారిలో కొందరిపై హైకోర్టుల్లో కేసులు, మరికొందరిపై ఈడి, విజిలెన్స్, ఎసిబి కేసులు,అవినీతి ఆరోపణలు ఉండగా వారికి ఎలా హోదా కట్టబెడుతారని, పెండింగ్ కేసులు తేలకుండానే డిఓపిటి ఏ విధంగా ఆమోదించిందని ప్ర శ్నిస్తున్నారు. ఇవే కాకుండా ఉద్యోగంలో చేరినప్పటి (జాయినింగ్ రిపోర్టు) రి కార్డులో ఒకరకంగా యూపిఎస్సీకి చేసుకున్న దరఖాస్తులో మరోరకంగా ట్యాంపరింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కనీసం వాటిపై ఆధారాలతో స హా వచ్చిన ఫిర్యాదు కూడా యూపిఎస్సీ పరిశీలించకుండానే వారికి హోదా ఎ లా కట్టబెట్టారో అర్థం కావడం లేదని రిటైర్టు ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారుల్లో 16 మంది అధికారుల కు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బం ది, శిక్షణ శాఖ (డిఓపిటి) బుధవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ అధికారుల కేసుల డేటాను కొందరు బయటకు తీస్తున్నారు. మరి కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశం చర్చనీ యాంశంగా, వివాదాస్పదంగా మారింది. 56 సంవత్సరాలు దాటినప్పటికీ జాబితాలో పేరు& ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఈ ఐఏఎస్‌ల హోదాపై రిట్ పిటిషన్ (డబ్లూపి నెంబర్ 32415/2023) కేసు పెండింగ్‌లో ఉంది. దీంతోపాటు 2022 నుంచి 2024 వరకు ఐఏఎస్‌ల పదోన్నతలకు సంబంధించి డిప్యూటీ కలెక్టర్‌లుగా ఉన్న సమయంలో యూపిఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున జాబితాను పంపించారని, ఆ సమయంలో డిప్యూటీ కలెక్టర్‌ల సీనియారిటీ జాబితా ఫైనల్ కాలేదని, ఫైనల్ సీనియార్టీ జాబితాను సిసిఎల్‌ఏ ప్రకటించకుండానే యూపిఎస్సీకి ఆ జాబితా చేరిందని, ఈ విషయమై తాము చేసిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని దీనిపై పూర్తి విచారణ జరపాలని యూపిఎస్సీకి రాసిన లేఖలో అడ్వకేట్ మనీష్‌తివారీ కోరారు. అయితే, 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి యూపిఎస్సీకి పంపించిన జాబితాలో 56 సంవత్సరాలు దాటిన డిప్యూటీ కలెక్టర్‌ల పేర్లు కూడా ఉన్నాయని అది యూపిఎస్సీ నిబంధనలను విరుద్ధమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై క్యాట్‌లో కొందరు ఫిర్యాదు చేయడం విశేషం. డిప్యూటీ తహసీల్దార్‌గా నియామకం అయిన వారికే.... 2011 తరువాత గ్రూప్ 1 నియామకాలను అప్పటి ప్రభుత్వాలు నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024, 25లో గ్రూప్ 1 పరీక్షను నిర్వహించి 563 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. అయితే, గ్రూప్ 1 అభ్యర్థులతో పాటు రెవెన్యూ శాఖకు చెందిన అధికారులకు ఐఏఎస్‌గా పదోన్నతి లభిస్తోంది. (ఉదా...రాష్ట్రానికి సంబంధించి మూడు పోస్టులు ఐఏఎస్‌లు ఖాళీగా ఉంటే 2 పోస్టులు రెవెన్యూ 1 పోస్టు గ్రూప్1కు కేటాయిస్తారు). అయితే, ప్రస్తుతం రెవెన్యూ కోటాలో 20 పైచిలుకు ఐఏఎస్‌లు ఖాళీ ఉండగా, అందులో ఈ సారి 16 మందికి ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పించారు. ఈ 16 మందిలో 1995 సంవత్స రానికి సంబంధించి గ్రూప్ 2 ఏ కింద 14 మంది డిప్యూటీ తహసీల్దార్‌లుగా ఉద్యోగంలో చేరగా, ఒకరు డిప్యూటీ కలెక్టర్‌గా, మరొకరు గ్రూప్ 2 బి సర్వీసు కింద ఉద్యోగంలో చేరారు. ఈ 16 మంది 2011లో డిప్యూటీ కలెక్టర్‌లుగా పదోన్నతి పొందారు. 2022, 2023, 2024 సంవత్సరంలో ఏర్పడిన ఖాళీల ఆధారంగా తాజాగా 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఏర్పడిన ఖాళీలకు అనుగుణంగా 16 మందికి ఐఏఎస్‌లు పదోన్నతిని కల్పించారు. రాష్ట్రం నుంచి ఒకేసారి 16 మందికి ఐఏఎస్‌లుగా పదోన్నతి లభించడం ఇదే మొదటిసారి. 2019 నుంచి 2021 వరకు రెవెన్యూ కోటా పదోన్నతులకు ఖాళీలు భర్తీ కాలేదు. దీంతోపాటు 2022లో 11 ఖాళీలు, 2023లో మూడు ఖాళీలు, 2024లో రెండు ఖాళీలు ఏర్పడడంతో మొత్తం 16 మందికి పదోన్నతులను డిఓపిటి కల్పించింది.

మన తెలంగాణ 23 Jan 2026 5:30 am

23rd jan Vasantha Panchami |వాగ్దేవి ఉపాసనలో అంతరార్థం –వైదిక విశ్లేషణ

23rd jan Vasantha Panchami | వసంత పంచమి ప్రాముఖ్యత:ఋతువులలో వసంతుడిగా జ్ఞాన

ప్రభ న్యూస్ 23 Jan 2026 5:30 am

ఫోన్‌ట్యాపింగ్ కేసులో కెటిఆర్‌కు నోటీసులు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కే సు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చో టుచేసుకుంది. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం నోటీసులు జారీ చేసింది. శుక్రవారం (జనవరి 23) ఉదయం 11 గంటలకు జూ బ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కా వాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. సిఆర్‌పిసి 160 కింద నందినగర్‌లోని కెటిఆర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులను అందజేశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ అధికారులు 2024 మార్చి నుంచి దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఈ నెల 20వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. హరీష్ రావు విచారణ ముగిసిన రెండు రోజులకే కెటిఆర్‌కు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీశ్ ఫైర్ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వే దికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే రేవంత్ నోటీసుల డ్రామా అంటూ ఘాటు విమర్శలు చేశా రు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు అం టూ ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి బామ్మర్ది బొ గ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.‘రాజకీయకక్ష సాధింపు చర్యలో భాగమే నిన్న నాకు, నేడు కెటిఆర్‌కు ఇచ్చిన నోటీసులు’ అని పేర్కొన్నారు. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం..దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి బలహీనులు కాబట్టే పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటున్నారని, తాము ధైర్యవంతులం కాబట్టే ప్రజల మధ్య నిటారుగా నిలబడి సిఎంను నిలదీస్తున్నామని అన్నారు. సిట్ నోటీసులకు సమాధానం చెప్పడానికి బిఆర్‌ఎస్ నాయకులం ఎప్పుడూ సిద్ధమే అని తేల్చిచెప్పారు. కానీ, రేపు ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి రేవంత్‌రెడ్డి సిద్దంగా ఉండాలంటూ సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత మంది బిఆర్‌ఎస్ నాయకులను విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేసినా.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా ఆయనను, ఆయన పార్టీని వదిలిపెట్టం అని హెచ్చరించారు. అంతే కాదు, కాంగ్రెస్ సర్కార్ కుంభకోణాలను, వాటాల పంచాయతీలను బట్టబయలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బిఆర్‌ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారు..జై తెలంగాణ..జై కెసిఆర్ అంటూ ట్వీట్ చేశారు. ప్రశ్నిస్తున్న పార్టీ లక్ష్యంగానే నోటీసులు : సోమభరత్ ప్రతిపక్షాల నోరు మూయించేందుకే సిట్ ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నారని బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమభరత్ విమర్శించారు. కోర్టులు, చట్టంపై నమ్మకం ఉన్నందున చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. హామీలు అమలు చేయకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, ప్రజల దృష్టి మళ్లించేందుకు సిట్ వేశారని ఆరోపించారు. నోటీసు ఇచ్చి .. విచారణకు వచ్చేందుకు కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రెండు రోజుల క్రితం తమ పార్టీ సీనియర్‌నేత హరీష్‌రావుకు నోటీసులు ఇచ్చి, 7 గంటలకు పైగా విచారణ చేశారని మండిపడ్డారు. కేవలం ప్రశ్నిస్తున్న పార్టీ లక్ష్యంగానే నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. ఒక పద్ధతి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీ టార్గెట్‌గా నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చట్టం అమలు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విచారణకు కెటిఆర్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని కోరామని, సాక్షిగా విచారణ చేసినప్పుడు న్యాయవాదిని అనుమతించబోమని ఎసిపి చెప్పారని తెలిపారు. న్యాయస్థానాలు చెప్పినా సీరియల్‌లా చేస్తున్నారు : నిరంజన్‌రెడ్డి కెటిఆర్‌కు సిట్ నోటీసుల పేరుతో కాంగ్రెస్ సర్కారు నాటకం ఆడుతుందని మాజీ మంత్రి,బిఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పాలన గాలికి వదిలి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చేస్తున్నారని ఆక్షేపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం మొగలి రేకులు సీరియల్‌లగా దర్యాప్తు నడిపిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజల కర్మానికి వదిలేసి దావోస్ అటు నుండి అమెరికా పర్యటన పెట్టుకున్నారని మండిపడ్డారు. సర్కారు సొమ్ముతో రేవంత్ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి విదేశాల్లో విహరిస్తూ అక్కడి నుండి వచ్చే వరకు ఈ సీరియల్ నడిచేలా ప్లాన్ చేసినట్లు అనిపిస్తోందని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్‌కు పరాకాష్ట : వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక, తన అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో సిఎం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే రెండు రోజుల క్రితం హరీష్ రావుకు నోటీసులని డ్రామా ఆడి, ఇప్పుడు కెటిఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఇది రేవంత్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరిందనడానికి నిదర్శనం అని ఘాటు విమర్శలు చేశారు.

మన తెలంగాణ 23 Jan 2026 5:00 am

నైనీ నిగ్గు తేల్చడానికి కమిటీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఆరోపణలు, ప్ర త్యారోపణలతో తీవ్ర వివాదం తలెత్తిన నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అంశంపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగింది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దుకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ వి చారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ త్వరలోనే తెలంగాణలో పర్యటించనుంది. ఈ మేరకు విచారణ అధికారులుగా కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ డైరక్టర్ జనరల్ చేతనా శుక్లా, టెక్నికల్ డైరక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లును నియమిస్తూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అంశంలో పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు రావడంతో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు శాఖకు ఇ చ్చిన ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించింది. ఈ వివాదానికి, టెండర్ రద్దు చేయడానికి ఉన్న కారణాలు సహా ఇతర అంశాలపైనా సింగరేణి అధికారులతో కలిసి ఈ బృందం దర్యాప్తు చేస్తుందని అధికార వర్గాల సమాచారం. ఈ బృం దం దర్యాప్తు చేపట్టి నివేదిక అందించేందుకు కేంద్ర బొగ్గు శాఖ మూడు రోజుల సమయం కేటాయించింది. రాష్ట్రానికి వచ్చిన మూడు రోజు ల్లో సింగరేణిలో పర్యటించి నైనీ బొగ్గు గనుల టెండర్ రద్దుకు గల కారణాలపై విచారణ జరిపి ఆ నివేదికను కేంద్రానికి అందజేయాలని ఆదేశించింది. గత ఏడాది నవంబర్ 28న ఒడిశాలోని నైనీ ప్రాంతంలో సింగరేణికి ఉన్న నైనీ కోల్ బ్లాక్‌లో బొగ్గు తవ్వకానికి సంబంధించి సింగరేణి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసి ఆ తర్వాత దాన్ని రద్దు చేసింది. ఇలా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందనే అంశంపై కమిటీ దర్యాప్తు చేస్తుంది. ఇదిలావుంటే ఇదే అంశంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ ఈ నెల 21నే సింగరేణి సంస్థను వివరణ కోరింది. ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లోని బొగ్గుగనుల కార్యాలయంలో ఆ శాఖ సంయుక్త కార్యదర్శి కె.సంజీవ్కుమార్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నైనీ బొగ్గు గని టెండర్లపై సమీక్షించారు. ఈ సమీక్షలో నైనీ బొగ్గు గని టెండర్ల విషయంలో సంస్థ విధించిన నిబంధనలపై పాలకమండలి ముందే లోతుగా ఎందుకు చర్చించలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఒకవేళ చర్చించి ఉంటే ఇప్పుడు అవినీతి, ఆరోపణలు ఎందుకు ఆస్కారం కలిగిందని వీడియో కాన్ఫెరెన్స్‌లో ప్రశ్నించినట్లు సమాచారం. ఇంకా పలు అంశాలపై సూటిగా ప్రశ్నించిన తర్వాత క్షేత్రస్థాయిలో కమిటీని నియమించి పరిశీలించిన తర్వాతే సమగ్ర నివేదికను తీసుకునేందుకు కేంద్ర బొగ్గు శాఖ నిర్ణయం తీసుకుని ఇద్దరు అధికారులతో కూడిన కమిటీని నియమించింది. దీంతో కమిటీ ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించే అవకాశం ఉంది.

మన తెలంగాణ 23 Jan 2026 4:30 am

అక్రమాలకు పాల్పడితే చర్యలు

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పాటించిన మిల్లర్లకు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని, తప్పిదాలకు పాల్పడితే మాత్రం చర్యలు కఠినాత్మకంగా ఉంటాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా నిబంధనల అమలులో సిబ్బంది కఠినం గా ఉండాలని ఆయన ఉద్బోధించారు. అదే సమయంలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ధాన్యం కేటాయింపు ప్రసక్తే లేదని ,పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనున్నారు. పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి కనుగుణంగా ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో మిల్లుల పరిశ్రమను ప్రోత్సహించేలా విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రం ధాన్యం దిగుబడిలోనే కాకుండా ఖరీఫ్ సీజన్ లో కొనుగోలు చెందిన ధాన్యం దేశచరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ నమోదు చేసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన 25 సంవత్సరాల వ్యవధిలో ఇదే అత్యధిక రికార్డ్ అని ఆయన చెప్పారు. 2025- 26 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం పౌర సరఫరాల శాఖా రూపొందించిన ప్రణాళికలపై గురువారం బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల వ్యవధిలో అనుసరించిన విధానాల ఫలితమే ధాన్యం దిగుబడి, కొనుగోలులోనూ సంచలనాత్మక రికార్డ్ నమోదు చేసుకుందని చెప్పారు. పౌరసరఫరాల శాఖా,నీటిపారుదల, వ్యవసాయ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవడంతో పాటు తెలంగాణా రైతాంగం భాగస్వామ్యంతోనే ఇంతటి విజయం సాధించామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల చరిత్రలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత తెలంగాణా రాష్ట్రానికి దక్కిందన్నారు. 70.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు : దేశ చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో లేవని అన్నారు. 2020- 21 లో నమోదు అయిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రికార్డును అధిగమించి తాజాగా జరిగిన ఖరీఫ్ సీజన్ లో71.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించిందన్నారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు మొట్టమొదటి సారిగా తెలంగాణా ప్రభుత్వం అందిస్తున్న బోనస్ తో కలిపి మొత్తం 18,532.98 కోట్ల రూపాయలను 14.20 లక్షల మంది రైతులకు చెల్లించామన్నారు. 

మన తెలంగాణ 23 Jan 2026 4:00 am

కోజీకోడ్‌లో కొలువుదీరిన సాహితీ నక్షత్రాలు

ఆసియాలోనే అతి పెద్దదైన కేరళ లిటరరీ ఫెస్టివల్ (కేఎల్‌ఎఫ్ )కోజికోడ్ సముద్ర తీరాన గురువారం నాడు ప్రారంభం అయింది . 25 వ తేదీ వరకు నా లుగు రోజుల పాటు జరిగే ఈ సాహిత్య ఉత్సవాలను వ్యోమ గామి సునీత విలియమ్స్, స్ప్రింటర్ బెన్ జాన్సన్ , ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్ , నటి భావన తదితరులు ప్రారంభించారు. తొలి రోజు ఉదయం నుండే వివిధ అంశా ల మీద సదస్సులు కొనసాగుతున్నప్పటికీ, అధికారిక ప్రారంభోత్సవం సాయంత్రం 6 గంటలకు జ రిగింది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సు నీతా విలియమ్స్ ప్రారంభోత్సవం లో మాట్లాడు తూ ఈ సాహిత్యోత్సవానికి హాజరయిన సాహిత్యకారులను, సాహిత్యాభిమానులను చూ స్తూ ఉంటే అంతరిక్షంలో నక్షత్రాలను చూసిన సంతోషం కలుగుతుందన్నారు. ప్రకాష్ రాజ్ మా ట్లాడుతూ ఆ కాశంలో చుక్కల మధ్య విహరించిన అంతరిక్షం లో ల్యాండ్ అయిన సునీతా విలియ మ్స్‌ను చూడ టం ఎంతో స్పూర్తి కలిగిస్తూ ఉంది. అక్కడ లాండ్ అయిన ఆమె ఇక్కడ ఈ కెఎల్‌ఎఫ్ లో లాండ్ అవుతుందని నేను ఊహించలేదు. ఇక్కడకు ఆమె రావడం అద్భుతం. ఈ ఫెస్టివల్ కి వచ్చి న నటి భావన మనందరికీ స్ఫూర్తి ఫైటర్ అన్నారు . ప్రముఖ స్ప్రింటర్ బెన్ జాన్సన్ ఈ సాహిత్య సభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కోజికోడు మేయర్ సదాశివన్, ఫెస్టివల్ డైరెక్టర్ కె. సచ్చితానందన్, ప్రముఖ అంతరిక్ష యాత్రికురాలు సునీత విలియమ్స్, సినీ నటులు భావన, ప్రకాష్ రాజ్ , సన్నాహక కమిటీ చైర్మన్ ఎ. ప్రదీప్ కుమార్, మంత్రులు మొహమ్మద్ రియాస్, పలనివర్ తంగ రాజన్ , గోధే జంత్రం దక్షిణాసియా డైరెక్టర్ డాక్టర్. మార్లా స్టుకెన్ బెర్గ్ తదితరులు పాల్గొన్నారు. హెరిటేజ్ ప్రాంతంగా యునెస్కో భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా గుర్తించిన పోర్ట్ సిటీ, కోజికోడులోని అరేబియా సముద్ర తీరపు ఇసుకతిన్నెల వద్ద జరుగుతున్న ఈ సాహిత్య పండుగకు, దేశ విదేశాల నుండి సుమారు ఐదు లక్షల మంది సాహిత్యం పట్ల అభిలాష ఉన్న ప్రతినిధులు హాజరవుతారని ఒక అంచనా. ఈ కెఎల్‌ఎఫ్. 8వ ఎడిషన్ భారీ సాహిత్య ఫెస్టివల్ కు ప్రముఖ కవి సాహితీ విమర్శకులు గతంలో కేంద్ర సాహిత్య అకాడమీకి , ప్రస్తుతం కేరళ సాహిత్య అకాడమీకి డైరెక్టర్ గా వున్న ప్రొఫెసర్ కె . సచ్చిదానందన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.రచయితలు, కళాకారులు, ఫిలిం మేకర్స్,చిత్రకారులు, మేధావులు, సైంటిస్ట్ లు, సినీ నటులు ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రముఖులు ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు.మూడు వందల సెషన్లు సమాంతరంగా ఈ నాలుగు రోజులపాటు జరుగుతాయి. దేశ విదేశాల నుండి వచ్చిన 500 మంది వక్తలు వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు.డిసెంబర్, జనవరి మాసాలు దేశవ్యాప్తంగా సృజన కారుల పండుగ రోజులు. నాట్యం, సంగీతం, చిత్రకళ, శిల్పకళ, సాహిత్యం వంటి అనేక సృజన రంగాల లో నిష్ణాతులైన వారు భాగస్వాములయ్యే అనేక ఫెస్టివల్స్ తో దేశం అంతా కళకళలాడుతూ ఉంటుంది. పూణే, కలకత్తాల్లో అలాగే ఇటీవలే చెన్నైలో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన, హిందూ లిటరరీ ఫెస్టివల్స్ జరిగాయి. ప్రసిద్ధి చెందిన జైపూర్ లిటరి ఫెస్టివల్ కూడా ఇటీవలే ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాదులో జనవరి 22 నుంచి 25 వరకు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ (హెచ్‌ఎల్‌ఎఫ్) జరుగుతున్నది. ఆసియాలోనే అతి పెద్దదైన కె ఎల్ ఎఫ్ .పండుగకు జర్మనీని అతిథి దేశంగా ఆహ్వానించారు. కేఎల్‌ఎఫ్ ప్రాంగణంలోనే జర్మనీ పెవీలియన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లల కోసం ప్రత్యేకంగా సికెఎల్‌ఎఫ్ పేరుతో కె ఎల్ ఎఫ్ ప్రాంగణంలోనే ప్రత్యెక ఏర్పాటు చేశారు. రచయితలతో సంభాషణలు, సమావేశాలు, సాంసృ్కతిక ప్రదర్శనలు, థియేటర్, సంగీతం, పుస్తక ప్రదర్శనలు, వంటి వాటి కోసం కూడా ప్రత్యేక హాల్స్ ఏర్పాటు చేశారు. 8 ప్రధానమైన ప్రాంగణాలలో సమావేశాలు జరుగుతున్నాయి. అనేక వర్క్ షాప్స్ కూడా జరుగుతున్నా యి.18 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు సాహిత్యము, అస్తిత్వం ,అనువాదాలు, పర్యావరణ, మానవ హక్కులు ,ఆర్కిటెక్చర్, సినిమా, ఆటలు, సైబర్ సెక్యూరిటీ ,పబ్లిక్ పాలసీ వంటి అనేక విషయాల పైన ప్రసంగించనున్నారు. సునీత విలియమ్స్, కిరణ్ దేశాయ్ , అబ్దుల్ రజాక్, అభిజిత్ బెనర్జీ, గుర్నాహ్, పీకో అయ్యర్, బెన్ జాన్సన్, జిమ్మీ వాల్స్ , కిరణ్ దేశాయ్, రొమిల్లా థాపర్ వంటి ప్రముఖులు ఈ నాలుగు రోజుల సాహిత్యోత్సవం లో పాల్గొంటున్నారు. ప్రతినిధులతో కిక్కిరిసిన ప్రధాన హాల్లో మొదటి రోజు ఉదయం ప్రముఖ నటుడు, ఆలోచనపరుడు ప్రకాష్ రాజ్ అసమ్మతి ని నేరం గా పరిగణించడం (Criminalising Dissent! Who Gets LOCKED Up for Speaking Out ?) అనే అంశంపై కాన్‌ఫ్లూయెన్స్ మీడియా సిఈవో జొసీ జోసెఫ్ తో సంభాషించారు.ప్రజాస్వామిక హక్కులపై, భిన్నాభిప్రాయ పై, బహుళత్వంపై జరుగుతున్న దాడులు, నిర్బంధం గురించి, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసహనం గురించి వారు మాట్లాడారు. చివరగా పౌరసత్వ ఆందోళనలో ఎంతో ప్రాచుర్యం పొందిన హమ్ యాద్ రఖేంగే కవితతో ఆయన ప్రసంగాన్ని ముగించారు.కె . సచ్చిదానందన్,గీతా హరిహరన్ లు సంపాదకత్వం వహించిన సంకలనం The View from Hear: Storia And Poems OF Many Indiyans పుస్తకం పై సబితా సచ్చి ( కవి, సచ్చితానందన్ కూతురు) సంపాదకులు ఇద్దరితోనూ ఆసక్తికరమైన సంభాషణను నిర్వహించారు.వివిధ భాషలు, మతాలు, అస్తిత్వాలు,సంసృ్కతులలో జీవిస్తూ రాసిన రచనలను ఒక దగ్గరకు తెచ్చే ప్రయత్నం ఈసంకలనం చేసిందని వారు అన్నారు. దేశం ఒక క్లిష్టమైన పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటుందని, మాట్లాడుతున్న వాళ్ళని ఇతరులు, బయటివారుగా పరిగణిస్తూ విమర్శిస్తున్నారని ,దేశాన్ని, ప్రజలని ప్రేమించడం వేరు నేషనలిజం పేట్రియాటిజం అనే పేరుతో జాతీయతను ఏకశిలా సదృశ్యకం చేయడం వేరని ఆయన అన్నారు. ఇండియా ఒకటే కానీ ఇండియన్స్ లో అనేక రకాల ఇండియన్లు ఉన్నారు అని గీతా హరిహరన్ చెప్పారు.దక్షిణాది భాషల పై కూడా ఒక సెషన్ జరిగింది. అనేక పుస్తకాలపై రచయితలతో విశ్లేషణాత్మక చర్చలు జరిగాయి.ముఖ్య అతిథి దేశంగా జర్మన్ పెవిలియన్ లో కూడా అనేక అంశాలపై సమావేశాలు జరుగుతున్నాయి.డిప్లమసీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఎఐ, రింబరింగ్ యాజ్ రెసిస్టెన్స్: హౌవ్ జర్మనీ తదితర అంశాలపై సమావేశాలతో పాటు, జర్మనీ థియేటర్ లో నాటికలు, అనేక వర్క్ షాప్స్ కూడా జరుగుతున్నాయి.కన్నడ, మలయాళ, తమిళ దక్షిణాది రచయితలు , బెంగాలీ, అస్సామీ, ఒరియా, కాశ్మీరీ, హిందీ, వంటి అనేక భాషల రచయితను కనపడుతున్నారు తప్ప మచ్చుకి ఒక్క తెలుగు రచయిత కూడా కనపడక పోవడం బాధాకరం. తెలుగు భాషకు కనీస ప్రాధాన్యత కూడా లేకపోవడం కొట్టోచ్చినట్టు కనిపిస్తున్న అంశం. ఈ సాహిత్య ,సాంసృ్కతిక సమ్మేళనం ఎల్లలను చెరిపివేసి, సాహిత్యకారులను కళాకారులను ఏకం చేస్తూ ఉంది.

మన తెలంగాణ 23 Jan 2026 3:30 am

‘వీబీ`జీరాంజీ’కి పాతపేరే కొనసాగించాలి ` రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ(జనంసాక్షి):జాతీయ ఉపాధి హావి పథకంలో గాంధీ పేరు తొలగించి ‘వీబీ`జీరాంజీ’పేరుతో కొత్త చట్టం తేవడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. పేదల పని హక్కులను హరించడమే …

జనం సాక్షి 23 Jan 2026 1:03 am

ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోండి

` బిల్లులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది ` డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హామీ కొమురం భీం(జనంసాక్షి): ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం …

జనం సాక్షి 23 Jan 2026 1:01 am

దిగుబడేకాదు.. కొనుగోళ్లలోనూ రికార్డు

` 25 సంవత్సరాలలో అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ` తెలంగాణా రైతాంగం భాగస్వామ్యంతోటే ఇంతటి విజయం ` బోనస్‌తో కలిపి చెల్లించిన మద్దతు …

జనం సాక్షి 23 Jan 2026 12:57 am

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీతో సీఎం రేవంత్ ముఖాముఖీ

` తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను వివరించిన ముఖ్యమంత్రి ` 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ రోడ్‌మ్యాప్‌పై వివరణ ` హైదరాబాద్‌లో ఫాలోఅప్ సదస్సు నిర్వహణకు విజ్ఞప్తి …

జనం సాక్షి 23 Jan 2026 12:46 am

శుక్రవారం రాశి ఫలాలు (23-01-2026)

మేషం సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున ఊహించని మార్పులు ఉంటాయి. వృషభం ధన వ్యవహారాలు కలసివస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. మిధునం అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. కన్య నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. తుల ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృశ్చికం కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ధనస్సు వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. మకరం కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక ఋణ సమస్యలు నుండి బయట పడతారు. స్థిరస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. కుంభం నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. మీనం ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటా.  

మన తెలంగాణ 23 Jan 2026 12:10 am

22nd jan |పురాణపండ శ్రీనివాస్ చేత శ్రీమాలిక గ్రంథ ఆవిష్కరణ

22nd jan | సికింద్రాబాద్‌లో ఘనంగా బ్రహ్మోత్సవాలువేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారి కల్యాణంకళా జనార్ధనమూర్తి

ప్రభ న్యూస్ 22 Jan 2026 11:56 pm

దక్షిణ కొరియా మహిళకు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం

దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళకు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేసే మహమ్మద్ అఫాన్ అహమద్ ఈ మహిళను భద్రతా తనిఖీల పేరిట లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. రెండు మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఈ నిందితుడిని అరెస్టు చేశారు. స్వదేశానికి వెళ్లేందుకు టర్మినల్ 2లో ఇమిగ్రేషన్ నిబంధనలు పాటిస్తున్నప్పుడు ఈ మహిళను లైంగికంగా వేధించారు. తనిఖీలు సోదాల పేరిట అసహ్యంగా ప్రవర్తించారని వెల్లడైంది. లగేజీలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని చెప్పి సిబ్బందిలో ఓ వ్యక్తి తనను ఎవరూ లేని చోటికి మగవారి వాష్‌రూం వద్దకు తీసుకువెళ్లేందుకు యత్నించాడని మహిళ తెలిపింది. తనను హత్తుకోవడం, శరీరం తడమడం వంటి పనులకు దిగాడని తెలిపింది. తాను ప్రతిఘటించడంతో ఈ వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడని పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొంది. అక్కడి కెమెరాల పరిశీలన తరువాత కేసు నమోదు చేశారు. వ్యక్తిని విచారిస్తున్నారు.

మన తెలంగాణ 22 Jan 2026 11:25 pm

రైతులకు ద్రోహం.. కూలీలకు అన్యాయం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ఇంతకు ముందు రైతులను మోసం చేసినట్లే, ఇప్పుడు కూలీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామి పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)ను ఎత్తివేయడం వెనుక భారీ స్థాయి అన్యాయం ఉందని తెలిపారు. దేశంలో మూడు అక్రమ వ్యవసాయ చట్టాలను తీసుకురావడానికి కేంద్రం దొడ్డిదారిన యత్నిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తీసుకువస్తున్న లోపభూయిష్ట విబి జి రామ్‌జి చట్టానికి వ్యతిరేకంగా పేదలు అంతా కలిసికట్టుగా ముందుకు రావల్సి ఉందని పిలుపు నిచ్చారు. రచనాత్మక్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ రోజ్‌గార్ ఉపాధి హామీ పథకం వర్కర్ల సదస్సులో ఖర్గే ఇతరులతో కలిసి రాహుల్ గురువారం మాట్లాడారు. పేదల మేలుకోసం ఇంతకు ముందు రోజ్‌గార్ యోజనను తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు దీనిని మార్చివేశారని విమర్శించారు. ఇంతకు ముందు తీసుకువచ్చిన నల్ల సాగు చట్టాలను రైతుల సంఘటిత పోరుతో వెనకకు తీసుకున్నారు. ఇప్పుడు ఏదో విధంగా వాటిని తిరిగి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఉపాధి పథకంతో కేంద్రమే నిధులను ఖరారు చేస్తుంది. రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఇందులో అత్యధిక భాగం ఎప్పుడూ బిజెపి పాలిత రాష్ట్రాలకే చెందుతాయని విమర్శించారు. ప్రతిదీ రాజు వంటి ప్రధాని ద్వారానే జరగాలినేదే బిజెపి పాలనలో పావు అని రాహుల్ విమర్శించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ గ్రామీణ ఉపాధి పథకం విషయాన్ని ప్రస్తావిస్తుందని పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. మహాత్మా గాంధీ పేరు లేకుండా చేశారు. పేదలకు అన్యాయం చేస్తారని హెచ్చరించారు. 

మన తెలంగాణ 22 Jan 2026 11:17 pm

Photos : Constable Kanakam Movie Success Meet

The post Photos : Constable Kanakam Movie Success Meet appeared first on Telugu360 .

తెలుగు 360 22 Jan 2026 11:17 pm

Coalition Politics or Collapse: Vijayasai Reddy’s Sharp Message to YSRCP

Former MP Vijayasai Reddy has sent a blunt message to YSR Congress Party chief Y. S. Jagan Mohan Reddy. He stated that Jagan has no chance of returning to power unless the present political alliance in Andhra Pradesh is weakened. According to him, padayatras and public campaigns will not deliver results. He said, electoral success […] The post Coalition Politics or Collapse: Vijayasai Reddy’s Sharp Message to YSRCP appeared first on Telugu360 .

తెలుగు 360 22 Jan 2026 11:08 pm

పరస్పర సహకారంతోనే… రేవంత్, లోకేశ్ మాటా మంతి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కలిశారు. ఈ సందర్భంగా సీఎంను మంగళగిరి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. మంత్రి లోకేశ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కూడా సత్కరించారు. ఏపీ విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు, ఐటీ ప్రగతి గురించి […] The post పరస్పర సహకారంతోనే… రేవంత్, లోకేశ్ మాటా మంతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 11:02 pm

మోదీ పాలనలో పేట్రేగుతున్న మతోన్మాదం

. రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం. మహిళా రక్షణ కేవలం నినాదమే. ప్రజాద్రోహ పాలనపై సమరశీల ఉద్యమాలు. సైదా సయుద్దిన్ హమీద్, నిషా సిద్ధూ. ఎనఎఫఐడబ్ల్యూ జాతీయ సమితి సమావేశాలు ప్రారంభం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మోదీ సర్కారు అవలంబిస్తున్న మతోన్మాద, రాజ్యాంగ విరుద్ధ, ప్రజాద్రోహక పాలనకు వ్యతిరేకంగా మరిన్ని సమరశీల ఉద్యమాలు అవశ్యమని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎనఎఫఐడబ్ల్యూ) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సైదా సయుద్దిన్ హమీదు, నిషా సిద్ధూ చెప్పారు. […] The post మోదీ పాలనలో పేట్రేగుతున్న మతోన్మాదం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 11:00 pm

Is Aamir Khan Married Again?

Bollywood Superstar Aamir Khan and Gauri Spratt have been dating each other for a while. Aamir confirmed about his relationship publicly last year. Now, they are poised to progress in their relationship. Allegedly, Aamir and Gauri have settled into a new place together in Mumbai. In an interview, Aamir expressed, “In my heart, I’m already […] The post Is Aamir Khan Married Again? appeared first on Telugu360 .

తెలుగు 360 22 Jan 2026 11:00 pm

రిపబ్లిక్ డేలో మహిళా అగ్నివీర బాండ్

న్యూఢిల్లీ : ఈసారి గణతంత్ర దినోత్సవంలో తొలిసారిగా అగ్నివీర్ మహిళా దళం ద్వారా వాయుసేన బాండ్ పాల్గొంటుంది. ఇందులో తొమ్మండుగురు మహిళా అగ్నివీరులు పాలుపంచుకుంటారు. ఈ మహిళా బృందం వాయిద్యాలు ఆలాపిస్తూ కర్తవ్యపథ్‌లో ముందుకు సాగుతారు. తరువాత జరిగే సైనిక , ఇతరత్రా ప్రదర్శనలకు ఆరంభం పలుకుతారు. ఐఎఎప్ బాండ్‌కు సెర్జెంట్ ఛార్లెస్ ఆంటోని డేనియల్ నాయకత్వం వహిస్తారు. 144 మందితో కూడిన కవాతు బృందం వాయుసేన తరఫున పాల్గొంటుంది. గణతంత్రం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంబడి నిలిచి జాతీయ పతాకాన్ని ఫ్లెయిట్ లెఫ్టినెంట్ అక్షిత ధన్‌కర్ ఎగురవేస్తారని వాయుసేన తెలిపింది. 

మన తెలంగాణ 22 Jan 2026 10:59 pm

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ – 16 మంది మావోయిస్టుల మృతి

మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడువిశాలాంధ్ర-చింతూరు: జార్ఖండ్ అడవుల్లో తుపాకుల మోత మోగింది. ఎన్‌కౌంటర్ పేరుతో మరో 16 మందిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. రాష్ట్రంలోని చోటా నాగపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కుంభాది సమీపంలోని సారండా అడవుల్లో గురువారం భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకార్పులు జరిగాయి. మోస్ట్ వాంటెడ్ కేంద్ర కమిటీ సభ్యుడు, పతిరామ్ మాంజి అలియాస్ అనల్ దాదాతో పాటు 16 మంది ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. సీఆర్పీఎఫ్ డీఐజీ అనురంజన్ కిస్పోట్టా, […] The post జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ – 16 మంది మావోయిస్టుల మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 10:58 pm

రెండు లైన్ల ప్రసంగం… వాకౌట్

. కర్నాటక గవర్నరు తీరూ అదే. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: సిద్ధరామయ్య బెంగళూరు: కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాత్ రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి చేసిన రెండు లైన్ల ప్రసంగం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. గురువారం గెహ్లాత్ రాష్ట్ర శాసనసభ ఉమ్మడి సమావేశంలో తన సంప్రదాయ ప్రసంగాన్ని రెండు ప్రారంభ పంక్తులు మాత్రమే చదివి ముగించారు. సభ్యులను పలకరించిన తర్వాత గవర్నర్… ‘ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక, […] The post రెండు లైన్ల ప్రసంగం… వాకౌట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 10:53 pm

మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపైదేశవ్యాప్త ప్రచారోద్యమం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మరో వంద సంవత్సరాలకు స్ఫూర్తినిచ్చేలా సీపీఐ శతవార్షికోత్సవాల ముగింపు వేడుకలు ఖమ్మంలో జరిగాయని పార్టీ జాతీయ కార్యదర్శి కే రామకష్ణ పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముగింపు వేడుకలపై ఆయన మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గసభ్యులు రావుల వెంకయ్య, ఏపీ కంట్రోల్ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పాల్గొన్న ఈ సమావేశంలో రామకష్ణ మాట్లాడుతూ […] The post మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపైదేశవ్యాప్త ప్రచారోద్యమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 10:50 pm

కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ గ్లింప్స్ విడుదల

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ కి వచ్చిన రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ సినిమాగా థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే రెండు సీజన్స్ కలిపి థియేటర్స్ లో సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్‌ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినిదత్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ “కోవెలమూడి సత్య సాయిబాబా తన అనుభవాన్ని అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అనే సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ చేశారు. ప్రశాంత్ కుమార్ అద్భుతంగా తెరకెక్కిస్తున్న కానిస్టేబుల్ కనకం ప్రతి సీజను బాహుబలి లాగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు. 

మన తెలంగాణ 22 Jan 2026 10:48 pm

పారిశ్రామిక ప్రగతి వేదిక దావోస్

. ఆయా రంగాల్లో మార్పులు, ఆలోచనలు పంచుకునే అవకాశం. చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ. ముగిసిన 4 రోజుల పర్యటన`నేడు హైదరాబాద్ రాక విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ప్రపంచ పారిశ్రామిక రంగంలో వస్తోన్న మార్పులు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు దావోస్ వేదిక ఎంతో ఉపయోగకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీని గ్లోబల్ బ్రాండ్‌గా నిలిపేందుకు, కొత్త పాలసీలపై మార్కెట్ స్పందన అంచనా వేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. 2025 […] The post పారిశ్రామిక ప్రగతి వేదిక దావోస్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 10:42 pm

Sharwanand | 4 సినిమాలు రిలీజ్ చేయనున్నాడా..?

Sharwanand | 4 సినిమాలు రిలీజ్ చేయనున్నాడా..? ఆంధ్ర్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 22 Jan 2026 10:30 pm

ఆస్ట్రేలియా టౌన్ కాల్పుల్లో ముగ్గురు మృతి

ఆస్ట్రేలియాలోని లేక్ కార్గిలిగో పట్టణంలో గురువారం కాల్పుల ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారని పోలీసు అధికారులు తెలిపారు. న్యూ సౌత్ వేల్స్‌లో దాదాపు 1500 మంది జనాభాతో ఉండే చిన్నపట్టణంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు. కేవలం రెండు వీథులతో ఉండే ఈ టౌన్‌లో ఇప్పుడు భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మొహరించుకుని ఉన్నాయి. ఇక్కడ జరిగిన ఆస్ట్రేలియా జాతీయ సంతాప దినం నాడే కాల్పుల ఘటన జరిగింది. ఆస్ట్రేలియాలో అప్పుడప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. సిడ్నీలో డిసెంబర్ 14వ తేదీన సాయుధులు జరిపిన కాల్పుల్లో కనీసం 15 మంది చనిపోయారు.

మన తెలంగాణ 22 Jan 2026 10:22 pm

నెహ్రూ కాలం నుంచి నేటి మోడీ పాలన వరకు..వేల ఫోన్లు పోలీసులు వింటూనే ఉన్నారు: కెటిఆర్

దేశానికి ప్రధానిగా నెహ్రూ ఉన్నకాలం నుంచి నేటి ప్రధాని మోడీ పాలన వరకు దేశభద్రత, శాంతి భద్రతలు, ప్రభుత్వాల రక్షణకు పోలీసులు వేల సంఖ్యలో ఇతరుల ఫోన్లు వింటారని, ఇది పోలీసులకు నిత్యకృత్యమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్ అన్నారు. గురువారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం సిట్ ముందు హజరు కావాలని గురువారం కెటిఆర్‌కు నోటిసులు ఇచ్చిన అంశంపై కెటిఆర్ స్పందించారు. శుక్రవారం తప్పకుండా సిట్ ముందు హజరవుతానన్నారు. తనను ఎందుకు పిలిచారో తెలియదన్నారు. సిఎం రేవంత్‌రెడ్డికి దావోస్‌లో ఉన్నా ఇక్కడ డిప్యూటి సిఎం తన సీటును కాజేస్తారని, నల్లగొండ బాంబులతో మంత్రులు తన సీటుకు ఎసరు పెడతారనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రోజుకొకరికి నోటీసులిచ్చి కాలక్షేపం చేస్తున్నారన్నారు. సిఎం రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనేదే సిట్ అన్నారు. కార్తీక దీపం సీరియల్‌గా ఇదెంత కాలం సాగుతుందో తెలియదన్నారు. ఇప్పటికే రెండేళ్లలో రేవంత్ రెడ్డి హమీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హమీలు అమలు చేయాలని కోరడంతో బుధవారం హరీష్‌రావుకు, గురువారం తనకు సిట్ నోటీసులిచ్చారన్నారు. రెండేళ్లుగా కాళేశ్వరమని, గొర్రెల స్కామని, ఫోన్ ట్యాపింగని ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నారన్నారు. హరీష్‌రావు సింగరేణి బొగ్గు కుంభకోణం జరిగిందని, కాంగ్రెస్, బిజేపి నాయకులు కుమ్ముక్కై వందల కోట్లు కాజేశారని, అర్హత లేకున్నా సిఎం బావమరిది సృజన్‌రెడ్డికి అమృత్ పథకం కాంట్రాక్ట్ ఇచ్చారని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు భూ ఆక్రమణలపై ఆధారాలతో బయట పెట్టినందుకే సిట్ నోటీసులిచ్చారన్నారు. తాను స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తేనే సిబిఐ విచారణ చేస్తామనడం చూస్తే దొంగ తనపై విచారణ కోరాలననట్టు ఉందన్నారు. కంచె గచ్చిబౌళిలో 10 వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని సాక్షాత్తూ సెంట్రల్ ఎంపవర్‌మెంట్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఎందుకు విచారించడం లేదన్నారు. ప్రధాని మోడీ స్వయంగా రాష్ట్రంలో ఆర్‌ఆర్ టాక్స్ (రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ) వసూలవుతుందన్నారని, మరి ఎందుకు విచారించడం లేదన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ స్వయంగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటిఎంలా మారిందన్నారని.. దానిపై ఎందుకు విచారించడంలేదన్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, వెంకటరెడ్డిలు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని బహిరంగంగా ప్రకటిస్తే.. దానిపై ఎందుకు విచారించడం లేదన్నారు. ఓ సన్నాసి ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి కుట్ర చేస్తున్నాడని, 50 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకుని ఎంఎల్‌ఏలను కొనుగోలు చేస్తున్నాడని తెలిస్తే, ఏ వెధవో ప్రభుత్వాన్ని కూలగొడతానంటే పోలీసులు ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చని, గూఢచర్యం అనేది నిరంతర ప్రక్రియని అంటూ, దానికీ రాజకీయ నాయకులకు ఏం సంబంధం ఉందన్నారు. అవసరమైతే ఆనాడు ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఇప్పటి డిజిపి శివధర్‌రెడ్డిని సిట్ పిలవాలని, లేదంటే అప్పటి డిజిపిలు మహేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రవిగుప్తాలను పిలిచి అడగాలని, తమనెందుకు పిలుస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. అధికారంలోఉన్నవారికి ప్రధానంగా సిఎంలకు సమాచారం పోలీసులు గూఢచర్యం చేసి అందిస్తారని, అదేలా వచ్చిందో ఎవరికి చెప్పరన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతలుగా ఉన్న తమ ఫోన్లు ట్యాప్ చేయడం లేదని అధికారులు ప్రమాణ పూర్వకంగా చెప్పగలరా? అని కెటిఆర్ నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసనేది లొట్టపీసుకేసు, బక్వాస్ కేసు, ట్రాష్ కేసని, అడిగిందే పలుసార్లు అడుగుతారని మళ్లీ అదే చెపుతామని, ఇది పూర్తిగా రాజకీయ వేధింపుల కుట్ర అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. పోలీసులను బలి పశువులను చేసే చర్య అన్నారు. త్వరలో తమ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ సిఎం కాగానే తాము కూడా కాంగ్రెస్ నేతల అక్రమాలపై విచారణ చేపట్టక తప్పదన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి హయాంలో ఫోన్‌ల ట్యాపింగ్ జరగడంలేదా? అన్నారు. తమకు నోటీసులిస్తే రేవంత్‌రెడ్డి దావోస్‌లో రెండుగంటలపాటు శునకానందం పొందుతాడేమో కాని తమకేమీ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని రకాలుగా వేధించాలని చూసినా తాము మాత్రం ప్రజల పక్షాన ఉంటామని, కాంగ్రెస్ బిజేపిల సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని వదలమని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హమీలు అమలయ్యేంత వరకూ ఊరుకోమని కెటిఆర్ హెచ్చరించారు.

మన తెలంగాణ 22 Jan 2026 10:20 pm

జార్ఖండ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రక్కును ఢీకొని దూసుకెళ్లిన రైలు

జార్ఖండ్ లో నవాదిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద గురువారం నాడు గోండా - అసన్సోల్ ఎక్స్ ప్రెస్ ఓ ట్రక్కును ఢీకొట్టింది. రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రాణనష్టం జరగలేదు. కానీ, జసిదిహ్ -అసన్సోల్ ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారి తెలిపారు. తూర్పు రైల్వే జోన్ పరిధిలోని అసన్సోల్ రైల్వే డివిజన్ లోని జాసిదిహ్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ట్రక్కు కాస్త దెబ్బతిన్నా, ఆ ప్రాంతంలో ఉన్న రెండు మోటర్ సైకిళ్లు మాత్రం దెబ్బతిన్నాయి.

మన తెలంగాణ 22 Jan 2026 10:19 pm

భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు

గురువారం వెండి ధర కిలోకు సుమారు రూ.19,000 తగ్గి రూ.2.99 లక్షలకు చేరింది. బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.3,099 తగ్గి రూ.1.51 లక్షలకు వచ్చింది. ఇటీవల భారీ పెరుగుదల తర్వాత లాభాల బుకింగ్, స్టాక్ మార్కెట్ ర్యాలీ, భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. కొత్త పెట్టుబడిదారులు కొంతకాలం వేచి చూడాలని సూచిస్తున్నారు. 2025లో బంగారం 75 శాతం, వెండి 167 శాతం పెరిగాయి. 

మన తెలంగాణ 22 Jan 2026 10:14 pm

గీతం యూనివర్శిటీకి హైకోర్టు షాక్

రాష్ట్ర హైకోర్టు సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీకి షాక్ ఇచ్చింది. విద్యుత్ బకాయిల్లో రూ. 59.65 కోట్లు మూడు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. గీతం యునివర్శిటిపై ఎస్‌పిడిసిఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. యూనివర్శిటీ చెల్లించాల్సిన మొత్తం బకాయిల్లో సగం చెల్లించాలని కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, గీతం యునివర్శిటీకి చెందిన విద్యుత్ బకాయిలు రూ. 118.13 కోట్ల రూపాయలు చెల్లించడంలేదంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో ఎస్‌పిడిసిఎల్ నోటీసులు జారీ చేసింది. దీనిపై యునివర్శిటీ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ మాదవి దేవి గీతం యూనివర్శిటీకి విద్యుత్ కనెక్షన్ పునరుద్దరించాలని ఎస్‌పిడిసిఎల్‌ను ఆదేశించింది. దీనిపై ఎస్‌పిడిసిఎల్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ విద్యుత్ కనెక్షన్‌ను పునరుద్ధరించడానికి ముందస్తు షరతుగా మూడు వారాల్లోగా మొత్తం విద్యుత్ బకాయిలలో సగం విద్యుత్ సంస్థకు చెల్లించాలని స్పష్టం చేసింది.

మన తెలంగాణ 22 Jan 2026 10:10 pm

సింధు అరుదైన రికార్డు

జకార్తా: భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నయా చరిత్ర సృష్టించింది. ఇండోనేసియా సూపర్ 500 మాస్టర్స్ టోర్నమెంట్‌లో సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో తన కెరీర్‌లో రికార్డు స్థాయిలో 500వ విజయాన్ని అందుకుంది. ఓ భారత షట్లర్ 500 విజయాల మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా 500వ విజయం సాధించిన ఆరో షట్లర్‌గా సింధు నిలిచింది. కాగా, గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో సింధు 2119, 2118తో డెన్మార్క్‌కు చెందిన హోజ్‌మార్క్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో లక్షసేన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రీక్వార్టర్ ఫైనల్లో సేన్ 2110, 2111తో హాంకాంగ్ ఆటగాడు జాసన్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేశాడు.

మన తెలంగాణ 22 Jan 2026 10:09 pm

ఇండియా-పాక్ వార్ నేపథ్యంలో ’బార్డర్ 2’.. ఆ దేశాల్లో విడుదలకు నో

సన్నీడియోల్ హీరోగా నటించిన ‘బార్డర్ 2’ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 23న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ వార్ డ్రామాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. అయితే ’బార్డర్ 2’ మూవీ గల్ఫ్ దేశాల్లో నిషేధం ఎదుర్కొంటుందని తెలుస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రేన్ వంటి దేశాల్లో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పలు సన్నివేశాలు ఉన్న కారణంగా అక్కడి ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 1971లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ’బార్డర్ 2’ సినిమా మొదటి భాగంతో పోలిస్తే విస్తృతమైన కథాంశంతో వస్తోంది. 

మన తెలంగాణ 22 Jan 2026 9:36 pm

Chiranjeevi |విశ్వంభర తెర వెనుక ఏం జరుగుతోంది..?

Chiranjeevi | విశ్వంభర తెర వెనుక ఏం జరుగుతోంది..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 22 Jan 2026 9:30 pm

ట్రంప్‌పై నిరసనలు.. సరుకులకు ఉరుకులు

న్యూక్: గ్రీన్‌లాండ్ అమెరికాకు కావల్సిందేనని ట్రంప్ ప్రకటించడంతో గ్రీన్‌లాండ్‌లో కలవరం చెలరేగింది. అక్కడి ప్రభుత్వం పౌరులకు అత్యవసర జాగ్రత్త చర్యలకు సమాయత్తం చేసింది. పౌరులు చాలినంతగా ఆహారం, మంచి నీరు, ఇంధనం వంటి నిత్యావసరాలతో సిద్ధంగా ఉండాలని ఇంగ్లీషు, స్థానిక గ్రీన్‌ల్యాండిక్ భాషలో కరపత్రం వెలువరించారు. తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలిపారు. సంక్షోభం ఏర్పడుతుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో పౌరులు దుకాణాలకు వెళ్లి తమకు అవసరం అయిన వస్తువులు కొనుకుంటున్నారు. గ్రీన్‌లాండ్‌ను ఏదో విధంగా స్వాధీన పర్చుకోవడమే ట్రంప్ తంతు అన్పిస్తోందని స్దానిక పౌరుడు జాకోబ్‌సెన్ మండిపడ్డారు. ప్రపంచ స్థాయి సదస్సు నుంచి ట్రంప్ ప్రేలాపనలు తమక సహించలేని విధంగా ఉన్నాయని నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్‌వి బెదిరింపులే కావచ్చు. అయితే మనం అంతా సిద్ధంగా ఉండకుండా వ్యవహరించడం కన్నా సిద్ధంగా ఉండటం మంచిదని తెలిపారు. 

మన తెలంగాణ 22 Jan 2026 9:22 pm

సిసి కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు

 రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌పై మరింత కట్టుదిట్టమైన నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరంతోపాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. రెండు రోజుల్లో ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల జారీ చేయనున్నారు.- ఈ పరీక్షలకు సుమారు 4 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. సిసి కెమెరాలు ఉన్న కాలేజీ ల్యాబ్‌లకే ఈసారి ప్రాక్టికల్ పరీక్షలకు సెంటర్లు కేటాయించనున్నారు. కార్పోరేట్, ప్రైవేట్ కాలేజీలు స్వతహాగా సిసి కెమెరాలు అమర్చుకున్నారు. ప్రభుత్వ కాలేజీలలో అమర్చిన సిసి కెమెరాలతో పాటు ప్రైవేట్ కాలేజీలలో ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయించే ల్యాబ్‌ను కూడా ఇంటర్ బోర్డ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేస్తున్నారు.ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం అయినందున వాటిల్లోనే ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే కేంద్రాలలో ఇన్విజిలేటర్ల పర్యవేక్షణతో పాటు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తారు. దాంతోపాటు కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు కూడా ప్రాక్టికల్ పరీక్షలను పర్యవేక్షిస్తారు. పారదర్శకంగా ప్రాక్టికల్ పరీక్షలు రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ఎక్కువగా థీయరీపైనే దృష్టి సారించి, ప్రాక్టికల్స్‌ను విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో అవసరమైనా సామాగ్రి లేకపోవడం, మరికొన్నింటిలో నేర్పించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కొన్ని కాలేజీలు ప్రాక్టికల్ పరీక్షలో తమ విద్యార్థులు పూర్తి మార్కులు కేటాయిస్తుందన్న ఆరోపణల నేసథ్యంలో పారదర్శకంగా ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ర్యాంకుల పందేరంలో ప్రాక్టికల్స్ మార్కులే కీలకం. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఎంపిసి వారికి 60 మార్కులు, బైపిసి వారికి 120 మార్కులు ఉన్నాయి. ఒక్క మార్కు తేడాతో కూడా ర్యాంకులు తారుమరవుతుంటాయి. దాంతో ర్యాంకుల పోటీలో ప్రతి మార్కూ కీలకంగానే మారుతుంది.

మన తెలంగాణ 22 Jan 2026 9:20 pm

మేడారంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన మంత్రి సీతక్క

మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ మంత్రి దనసరి అనసూయ పిలుపునిచ్చారు. గతంలో కాలినడక నుండి కార్ల మీద వచ్చిన భక్తులు.. ప్రస్తుతం ఎడ్ల బండ్లను వదిలి హెలికాప్టర్‌పై రావడానికి సిద్ధమవుతున్నారన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థ నిర్వహించనున్న హెలికాప్టర్ సేవలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవార్లను సత్వరమే దర్శనం చేసుకోవడానికి సమయం వృధాకాకుండా హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టిందని, హనుమకొండ జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు, మేడారం నుండి హనుమకొండ కు వెళ్లేందుకు అతి తక్కువ ధరలలో ఒక్కొక్కరికి 31 వేల రూపాయల టికెట్ నిర్ణయించిందన్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్‌ద్వారా పర్యటించడానికి 4 వేల 8 వందల రూపాయల టికెట్‌ను ఖరారు చేశారని వివరించారు. గతంలో మహా జాతర సందర్భంగా అప్పటి పాలకులు నామమాత్రంగా నిధులు కేటాయించగా ప్రజాప్రభుత్వం గద్దెల పునరుద్ధరణ పనులతోపాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 251 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. గురువారం నుండి ఈ నెల 31 వరకు వీరి సేవలు కొనసాగుతాయని తెలిపారు. థంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సర్వీస్ నిర్వహిస్తుంది. బుకింగ్ కొరకు మొబైల్ నెంబర్ 9676320139, 8530004309, 7660939509 వెబ్‌సైట్ డబ్లుడబ్లుడబ్లు . హెలితాక్సియ్.కామ్‌లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈద్గా ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క.... జిల్లా కేంద్రంలోని ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి సుమారు రూ.15 లక్షలతో నిర్మించిన ఈద్గా ప్లాట్ ఫామ్ మంత్రి సీతక్క ప్రారంభించారు. ముస్లిం మైనారిటీల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మైనారిటీల కోసం మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ప్రజా ప్రతినిధులు, మైనార్టీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 22 Jan 2026 9:10 pm

వాయిదా పడిన ’స్వయంభు’

పాన్ -ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ’స్వయంభు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగా ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. భారతదేశపు వైభవమైన చరిత్రను, మహోన్నతను సెలబ్రేట్ చేస్తూ రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని ఇంతకు ముందు ప్రకటించారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా వాయిదా పడినట్టుగా తెలిసింది. స్వయంభూ సినిమాలో గ్రాఫికల్, వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఎక్కువగా ఉన్నాయట. వాటి కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారట మేకర్స్. దీంతో ఈ సినిమా వాయిదా పడిందని సమాచారం. అయితే మార్చి చివరన లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట.

మన తెలంగాణ 22 Jan 2026 9:02 pm

సింగరేణి తెలంగాణ ప్రజల హక్కు..సంస్థను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోం: కొప్పుల ఈశ్వర్

 రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్,కేంద్రంలో ఉన్న బిజెపి ఒక్కటే అని, అందుకే సింగరేణి టెండర్ల వ్యవహారంలో విచారణ చేపట్టడం లేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సింగరేణి టెండర్లలో జరిగిన అవినీతిలో ముఖ్యమంత్రి బామ్మర్ది కీలకం అని తెలుస్తుందని, ఈ వ్యవహారంలో సిఎం విచారణకు కోరుతారా..? అని ప్రశ్నించారు.కాంగ్రెస్, బిజెపి కబంధ హస్తాల నుండి సింగరేణిని కాపాడడం కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. సింగరేణి సంస్థ కాంగ్రెస్ పార్టీది కాదు....బిజెపిది కాదు అని, ఆ సంస్థ తెలంగాణ ప్రజల హక్కు అని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సింగరేణి బచావో పేరు మీద ఉద్యమం చేస్తామని చెప్పారు. నైని బ్లాక్ ఒక్కటే కాదు...మొత్తం టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు బ్లాకుల కుంభకోణంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని అన్నారు. ఈ కుంభకోణంపై తమ నేత హరీష్ రావు ఆధారాలతో బయట పెట్టడంతో నైని టెండర్లు రద్దు చేశారని పేర్కొన్నారు. మిగతా బ్లాకుల టెండర్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. సింగరేణి అంటే ఒక్క బొగ్గు బ్లాక్ కాదు అని, అనేక మంది కుటుంబ సభ్యుల భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. స్వయాన ముఖ్యమంత్రి బావమర్ది ప్రసన్నం చేసుకోవడం కోసమే ఈ కుంభకోణం అని తెలుస్తోందని పేర్కొన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి గురించి ఆలోచించారని అన్నారు. ఈ బొగ్గు కుంభకోణం బయట పెడితే హరీష్ రావును సిట్ విచారణ పేరిట ఇబ్బంది పెట్టారని మండిడ్డారు. సింగరేణి టెండర్ల విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సైట్ విసిట్ సర్టిఫికేషన్ అనేది ముఖ్యమంత్రి బామ్మర్ది మేలు కొరకే పెట్టారని ఆరోపించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మైనస్‌లలో టెండర్లు జరిగేవి అని, ఇప్పుడు ప్లస్‌లలో టెండర్ల ప్రక్రియ జరుగుతుంది అంటే కుంభకోణం జరిగినట్లే కదా..? అని అడిగారు. మంత్రుల మధ్య వాటాల పంపిణీ తేడాతోనే ఈ కుంభకోణం బయటకు వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారని, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

మన తెలంగాణ 22 Jan 2026 9:00 pm

ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి

జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్బూమ్ జిల్లాలో గురువారం భారీ స్థాయి ఎన్‌కౌంటర్ జరిగింది. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన కోబ్రా దళం దాడిలో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. తలపై రూ కోటి పారితోషికం ప్రకటితం అయి ఉన్న అగ్రస్థాయి నక్సల్ పత్రీరామ్ మాజీ అలియాస్ అనల్‌దా కూడా మృతుల్లో ఉన్నాడు. దాదాపు 1500 మందితో కూడిన సుశిక్షిత కోబ్రా దళం నక్సలైట్ల గాలింపు చర్యలలో వెళ్లుతుండగా సరందా అటవీ ప్రాంతంలోని కుమ్దీ వద్ద ఎదురు కాల్పుల ఘటన జరిగిందని , ఇది కిరిబురా పోలీసు స్టేషన్ పరిధిలో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. నక్సల్స్ పూర్తి స్థాయి నిర్మూలన లక్షంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో పెద్ద ఎత్తున నక్సల్స్ గాలింపు చర్యలు వేగవంతం అయ్యాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ భారీ స్థాయి కోబ్రా చర్య జరిగింది. భారీ పటాలంతో కోబ్రా బలగాలు ఈ ప్రాంతంలో మంగళవారం నుంచే తమ ఆపరేషన్ ఆరంభించాయి. అయితే గురువారం అడవుల్లో పొంచి ఉన్న నక్సలైట్ల వైపు నుంచి ముందుగా కాల్పులు ఎదురయ్యాయని, తమ వైపు నుంచి ప్రతి చర్య జరిగిందని అధికారులు తెలిపారు. ఈ తరువాత ఇక్కడ జరిపిన గాలింపులో 15 మంది మావోయిస్టుల భౌతిక కాయాలను గుర్తించామని వెల్లడించారు. వీరిలో ఒకరిని మావోయిస్టు కీలక నేత అనల్ దా అని గుర్తించామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఆపరేషన్స్) మైకెల్ రాజ్ ఎస్ వార్తా సంస్థలకు తెలిపారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ సంచారం ఎక్కువగా ఉందని సమాచారం అందింది. వీరిలో నక్సల్స్ అగ్రనేత కూడా ఉన్నారని నిర్థారణ అయిందని, దీనితో తాము గాలింపులు ఉధృతం చేశామని వివరించారు. గిరిధ్ జిల్లాలోని పిర్తాంద్‌కు చెందిన పత్రీరామ్ మావోయిస్టు దళంలో 1987 నుంచి చురుకుగా పనిచేస్తున్నాడు. ఆయనపై కోటి రూపాయిల రివార్డు ప్రకటించారు. ఆయన కోసం చాలా సంవత్సరాలుగా గాలిస్తున్నారు. భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలియగానే ఈ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తమ బృందంతో ఛాయ్‌బసా ప్రాంతంలో పర్యటించారు. కోబ్రా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో గాలింపు చేపట్టారు. నక్సలైట్లు మరింత ఎక్కువ సంఖ్యలోనే చనిపోయి ఉంటారని , ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లో చాలా వరకూ నక్సల్స్ నిర్మూలన జరుగుతోంది. కొల్హాన్, సరందాలు వీరికి మిగిలిన చివరి స్థావరాలు అని వెల్లడైంది. జార్ఖండ్‌లోని బుడా పహాడ్, ఛత్రా , లాటేహర్ , గుమ్లా, రాంచీ , పరాసంత్ ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే మావోయిస్టుల ఏరివేత దాదాపు పూర్తి అయింది. ఇప్పుడు మిగిలిన కంచుకోట వంటి ఈ ప్రాంతంపై కూడా కోబ్రా దళాలు విరుచుకుపడ్డాయి.ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిగింది. 

మన తెలంగాణ 22 Jan 2026 8:52 pm

స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు : హరీష్‌రావు

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే రేవంత్ నోటీసుల డ్రామా అంటూ ఘాటు విమర్శలు చేశారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు అంటూ ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి బామ్మర్ది బొగ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘రాజకీయకక్ష సాధింపు చర్యలో భాగమే నిన్న నాకు, నేడు కెటిఆర్‌కు ఇచ్చిన నోటీసులు’ అని పేర్కొన్నారు. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం..దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి బలహీనులు కాబట్టే పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటున్నారని, తాము ధైర్యవంతులం కాబట్టే ప్రజల మధ్య నిటారుగా నిలబడి సిఎంను నిలదీస్తున్నామని అన్నారు. సిట్ నోటీసులకు సమాధానం చెప్పడానికి బిఆర్‌ఎస్ నాయకులం ఎప్పుడూ సిద్ధమే అని తేల్చిచెప్పారు. కానీ, రేపు ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి రేవంత్‌రెడ్డి సిద్దంగా ఉండాలంటూ సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత మంది బిఆర్‌ఎస్ నాయకులను విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేసినా.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా ఆయనను, ఆయన పార్టీని వదిలిపెట్టం అని హెచ్చరించారు. అంతే కాదు, కాంగ్రెస్ సర్కార్ కుంభకోణాలను, వాటాల పంచాయతీలను బట్టబయలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బిఆర్‌ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారు..జై తెలంగాణ..జై కెసిఆర్ అంటూ ట్వీట్ చేశారు.

మన తెలంగాణ 22 Jan 2026 8:50 pm

2022 |అప్పుడు పంపించారు..మళ్ళీ పిలిపించారు..అదే ఐఏఎస్ అధికారికి మళ్లీ కీలక పదవి

2022 | త్యాగరాజ్ స్టేడియం వివాదం: 2022 | సంజీవ్ ఖిర్వార్ పేరు

ప్రభ న్యూస్ 22 Jan 2026 8:46 pm

నైనీ టెండర్లపై రాష్ట్రం కోరితే సిబిఐ విచారణకు కేంద్రం సిద్ధం:బిజెపి రాంచంద్రరావు

సింగరేణి నైనీ కోల్ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. సీబీఐ ద్వారా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలం నుండి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం గురువారంఒ జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర కమిటీల పనితీరుతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాలుగు నెలల ఫలితాలను సమీక్షించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలని రాంచందర్ రావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అనుబంధ విభాగాల పనితీరుపై కూడా రాంచందర్ రావు సమీక్ష చేశారు. బిజెపి అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గతంలో దావోస్ పర్యటనకు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో, ఎంతమందికి ఉద్యోగాలు లభించాయో, అనే విషయాలు ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు. ఇప్పటికి రెండుసార్లు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 22 Jan 2026 8:40 pm

విజయ్ పార్టీ ఎన్నికల గుర్తు విజిల్!

తమిళనాడులో సినీనటుడు, రాజకీయనాయకుడు విజయ్ ఆధ్వర్యంలోని పార్టీ తమిళగ వెట్రి కజగం ఎన్నికల చిహ్నంగా విజిల్ ను కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో పార్టీ కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నెలకొంది. టివికె కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో ఉత్సాహం చూపుతున్నారని, సీనియర్ నాయకుడు సిటిఆర్ నిర్మల్ కుమార్ గురువారం తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచించిన 10 చిహ్నాలలో విజయ్ ఎంచుకున్న విజిల్ గుర్తుకే ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపినట్లు తమిళగ వెట్రి కజగం జాయింట్ సెక్రటరీ కుమార్ వివరించారు.విచిత్రం ఏమిటంటే, 2024లో విజయ్ నటించిన గోట్ చిత్రంలో విజయ్ విజిల్ పాడు (విజిల్ వేయి) అనే పాట పాడతాడు. ఆచిత్రం, ఆ పాట సూపర్ హిట్ అయ్యాయి. ఆ పాటలో తాను రాజకీయాలలోకి వస్తానని విజయ్ సూచన ప్రాయంగా తెలిపారు. అంతే కాదు, గతంలో విజయ్ బిజిల్ అనే చిత్రంలో నటించారు. దాని అర్థం విజిల్ అనే.రాజకీయ పార్టీ స్థాపించిన రెండేళ్ల తర్వాత 2026 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు విజయ్ ఆధ్వర్యంలోని టివికి పార్టీకి తొలి ఎన్నికల పోరుగా కుమార్ వర్ణించారు. రానున్న ఎన్నికల్లో విజిల్ మారు మోగుతుందని, టివికె ఘనవిజయం సాధించి, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రస్థానం మొదలవుతుందని కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 22 Jan 2026 8:40 pm

Will Prabhas Realize Raja Saab Mistakes?

Raja Saab is one of the costliest mistakes made in Telugu cinema. For the film’s genre and the concept, there is no need to spend hundreds of crores on the film. The shoot was also delayed by years because of other commitments of Prabhas. Even the hardcore fans of Prabhas felt that a big amount […] The post Will Prabhas Realize Raja Saab Mistakes? appeared first on Telugu360 .

తెలుగు 360 22 Jan 2026 8:34 pm

గ్రూప్ 1 పరీక్షలపై తీర్పు ఇంకా సిద్దం కాలేదు

గ్రూప్ 1 పరీక్షల తుది తీర్పుపై ఇంకా ఉత్కంఠత వీడలేదు. గురువారం వెల్లడించాల్సి ఉండగా, తుది తీర్పు సిద్దంగా లేకపోవడంతో ఫిబ్రవరి 5వ తేదీన వెల్లడిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మెహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది. మొయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం తుది మార్కుల జాబితాతో పాటు ప్రకటించిన ర్యాంకుల జాబితా రద్దు చేస్తూ, పరీక్షా పత్రాలు పునఃమూల్యాంకనం చేయాలని, అది సాధ్యం కాకపోతే మరల పరీక్షలు నిర్వహించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పును టిజిపిఎస్‌సితో పాటు గ్రూప్1కు ఎంపికయిన అభ్యర్థులు సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. వీటిపై అత్యున్నత ధర్మాసనం విచారించి తుది తీర్పునకు లోబడే నియామకాలు జరగాలని స్పష్టం చేస్తూ వాదనలు ముగించింది. అయితే తరువాత రాష్ట్ర ప్రభుత్వం 563 మందికి గ్రూప్1 నియామకపత్రాలు అందచేసింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేయడంతో తుది తీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొంది.

మన తెలంగాణ 22 Jan 2026 8:23 pm

బిఆర్‌ఎస్ బాటలోనే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

 తెలంగాణ ఏర్పడిన తర్వాత దురదృష్టవశాత్తు సింగరేణి నష్టాల బాట పట్టి ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిందని, ఇందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం పూర్తిగా సింగరేణిపై అజమాయిషీ చేసిందని, బోర్డు కేవలం నామమాత్రంగా మారిందని విమర్శించారు. టెండర్ల నుంచి చిన్న కాంట్రాక్టుల వరకు ప్రతిచోటా కేసీఆర్ కుటుంబ ఆదేశాలే అమలయ్యాయని, రాజకీయ జోక్యంతో సింగరేణిని సమస్యల్లోకి నెట్టారని విమర్శలు దాడి చేశారు. ఈ విషయం తెలంగాణ సమాజానికీ, సింగరేణి కార్మికులకూ బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... బిఆర్‌ఎస్ హయాంలోనే కాకుండా గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా సింగరేణిపై ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర అవుతోందని, సింగరేణిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఖర్చు తగ్గింపుపై నివేదిక సిద్ధం చేయించామని వివరించారు. ఆ నివేదికపై సింగరేణి అధికారులతో చర్చించి సంస్థ ఆర్థిక పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. ఈ అంశాలన్నింటినీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్లకు వివరించామని అయితే అప్పట్లో నైని కోల్ బ్లాక్ అంశంపై ఎలాంటి చర్చ కూడా జరగలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

మన తెలంగాణ 22 Jan 2026 8:19 pm

Rs. 12 crore |ఎమ్మెల్యేకి పాలాభిషేకం….

Rs. 12 crore | ఎమ్మెల్యేకి పాలాభిషేకం…. Rs. 12 crore |

ప్రభ న్యూస్ 22 Jan 2026 8:09 pm

New districts |విచారణ పేరుతో టార్గెట్ చేస్తున్నారు..

New districts | విచారణ పేరుతో టార్గెట్ చేస్తున్నారు.. New districts |

ప్రభ న్యూస్ 22 Jan 2026 8:01 pm

Subsidy |మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా చాటాలి

Subsidy | మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా చాటాలి Subsidy |

ప్రభ న్యూస్ 22 Jan 2026 7:44 pm

గ్రీన్‌లాండ్ టారీఫ్‌పై ట్రంప్ వెనుకడుగు

దావోస్ వేదిక నుంచే కీలక నిర్ణయాలు అమెరికా కదలికలపై దీవి ప్రజల ఆగ్రహం తమకు సంబంధం లేని విషయం అన్న పుతిన్ దావోస్ : మిత్రపక్ష ఐరోపాదేశాలపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తమ గ్రీన్‌లాండ్ టారీఫ్‌ను వెనుకకు తీసుకున్నారు. ఎనిమిది యూరప్ దేశాలపై తమ ప్రతిపాదిత పాతిక శాతం తొలిదఫా సుంకాలను నిలిపివేస్తున్నానని దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నేపథ్యంలో ట్రంప్ గురువారం ప్రకటించారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా తీసుకుంటుందనే తమ ప్రతిపాదనపై వ్యతిరేకత చూపే మిత్రదేశాలు తమకు శత్రుదేశాల కన్నా ఇబ్బందికరం అని ట్రంప్ భావించారు. అత్యంత కీలకమైన దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా గ్రీన్‌లాండ్ టారీఫ్‌ను గత వారం ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయా దేశాలు అర్కిటిక్ దీవికి సంబంధించి దారికి వచ్చాయని ట్రంప్ చెప్పారు. అర్కిటిక్ డీల్ నమూనాపై నాటో దేశాలు అంగీకారానికి వచ్చినట్లు తెలిసిందని, అందుకే టారీఫ్‌లను నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు. గ్రీన్‌లాండ్ తమకు కావల్సిందేనని, దీనిపై హక్కులను , భౌగోళిక అధికారాన్ని, చివరికి యాజమాన్యాన్ని పొంది తీరుతామని ట్రంప్ దావోస్ వేదికగానే ప్రకటించారు. ఐరోపా దేశాల వైఖరిపై మండిపడ్డారు. అయితే ఇప్పుడు గ్రీన్‌లాండ్ భద్రతకు తమ ఫార్మూలాకు నాటో అధినేత అంగీకరించారని, దీనితో తాము గ్రీన్‌లాండ్ టారీప్‌ను నిలిపివేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. వారు దారిలోకి రావడం మంచి పరిణామం అయిందన్నారు. అమెరికాకు అత్యంత కీలకమైన రక్షణ వలయం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ, పైగా 175 బిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన తమ ప్లాన్ గురించి కూడా తాను నాటోతో చర్చించినట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ బహుళ స్థాయి వ్యవస్థతో అమెరికా తొలిసారిగా తమ ఖండాంతర క్షిపణులను ఇతర కీలక ఆయుధాలను ఏకంగా అంతరిక్షంలో అమర్చి ఉంచడానికి వీలేర్పడుతుంది. వీటిని అవసరం అయినప్పుడు వాడుతారు. ఐరోపా దేశాలతో జరిపిన చర్చలలో తాను ఆశించిన దాని కంటే ఎక్కువ ఫలితాలు వెలువడ్డాయని, తాము సరికొత్త టారీఫ్ నిర్ణయాన్ని వెనకకు తీసుకుంటున్నానని ట్రంప్ తమ సోషల్ మీడియా ప్రకటనలో తెలిపారు. గ్రీన్‌లాండ్‌పై ఆధిపత్యాన్ని తాము ఈ ప్రాంత రక్షణకే కాకుండా, అమెరికా ప్రయోజనాల కోణంలోనే చూడకుండా , మొత్తం ప్రపంచ శాంతి పరిరక్షణ దృక్ఫథంతోనే చూస్తున్నామని దావోస్ వేదికగా ట్రంప్ ఘాటైన కీలక ప్రసంగం చేయడంతో ప్రపంచ దేశాల నేతలలో తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి. 

మన తెలంగాణ 22 Jan 2026 7:39 pm

Municipal |ఆలేరు మున్సిపల్ కమీషనర్ గా….

Municipal | ఆలేరు మున్సిపల్ కమీషనర్ గా…. Municipal | ఆలేరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Jan 2026 7:38 pm

Friends |స్నేహితునికి అండగా…

Friends | స్నేహితునికిఅండగా… Friends | మోత్కూర్, ఆంధ్రప్రభ : స్నేహితుని తండ్రి

ప్రభ న్యూస్ 22 Jan 2026 7:35 pm

Video : Exclusive Podcast with Cheekatilo Web Series Team

The post Video : Exclusive Podcast with Cheekatilo Web Series Team appeared first on Telugu360 .

తెలుగు 360 22 Jan 2026 7:30 pm

పెద్ద పాలమడలో ఉచిత పశువైద్య శిబిరం

వందల సంఖ్యలో పశువులకు వ్యాధి నివారణ చర్యలు విశాలాంధ్ర, తాడిపత్రి :మండల పరిధిలోని పెద్ద పాలమడ గ్రామంలో గురువారం డాక్టర్, ఏహెచ్ఏ, పశువైద్య సహాయకుల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 17 పశువులకు వ్యాధి నివారణ, 2 పశువులకు గర్భకోశ నివారణ, 1 పశువుకు చూలు పరీక్ష నిర్వహించినట్లు పశువైద్యులు హరికృష్ణ తెలిపారు. అదేవిధంగా 22 పెద్ద పశువులకు, 15 చిన్న దూడలకు, అలాగే 3,252 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు […] The post పెద్ద పాలమడలో ఉచిత పశువైద్య శిబిరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 7:24 pm

రాజకీయాలకు అతీతంగా మానవత్వం చాటిన టిడిపి ఎమ్మెల్యే

వైసీపీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి మానవత్వానికి పెద్దపీట వేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ను నియోజకవర్గ ప్రజలు అభినందిస్తున్నారు.. గత ఎన్నికల సమయంలో గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబానికే గురువారం అండగా నిలిచిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన మానవీయ కోణాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం గుద్దిళ్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వడ్డే రాము భార్య అనారోగ్యంతో […] The post రాజకీయాలకు అతీతంగా మానవత్వం చాటిన టిడిపి ఎమ్మెల్యే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 7:01 pm

ఆ జిల్లాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర: కెటిఆర్

తెలంగాణలో కొన్ని జిల్లాలను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. గురువారం సాయంత్రం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సౌలభ్యం కోసం కెసిఆర్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ఏర్పాటు చేశారు. కానీ, అవి అశాశిస్త్రీయంగా ఏర్పాటు చేశారంటూ.. రిటైర్డ్ జడ్జిలతో ఏదో కమిషన్ వేస్తున్నారని అన్నారు. కెసిఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేయడమే దీని ఎజెండా అని అనుమానం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. జిల్లాలను రద్దు చేస్తే.. ప్రజల చేతిలో కాంగ్రెస్ కు చావు దెబ్బ తప్పదన్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారని అనుకున్నామని.. కానీ, పరాజయం తప్పదన్న భయంతో ప్రభుత్వం జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించడం లేదని కెటిఆర్ విమర్శించారు. జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కెటిఆర్ కు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. దీంతో మరికాసేపట్లో హరీష్ రావుతోపాటు కెటిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లి కెసిఆర్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సిట్ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది.

మన తెలంగాణ 22 Jan 2026 7:01 pm

2 Brands | ORSL మరియు eRZL ఆవిష్కరణ

2 Brands | డీహైడ్రేషన్ సమస్యకు కెన్వ్యూ డబుల్ పవర్ పరిష్కారంORSL: డయేరియా

ప్రభ న్యూస్ 22 Jan 2026 7:00 pm

Sports |సీఎం కప్ క్రీడలు…

Sports | సీఎం కప్ క్రీడలు… Sports | మేడ్చల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:48 pm

జయనగర్ కాలనీలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం..

ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి చొరవతో పైపులైన్ పనులు పూర్తి విశాలాంధ్ర–తాడిపత్రి :ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి చొరవతో పట్టణంలోని జయనగర్ కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని 21వ వార్డు కౌన్సిలర్ టి. హుస్సేన్ భాష తెలిపారు. గురువారం పట్టణంలోని 21వ వార్డు జయనగర్ కాలనీలో చేపట్టిన త్రాగునీటి సరఫరా పైపులైన్ పనులను కౌన్సిలర్ టి.హుస్సేన్ భాష, మున్సిపల్ ఏఈ నాగేంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయనగర్ కాలనీ 18వ […] The post జయనగర్ కాలనీలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 6:48 pm

Rs. 200 crore funds |బాకీ కార్డుల పోస్టర్లు ఆవిష్కర‌ణ‌…

Rs. 200 crore funds | బాకీ కార్డుల పోస్టర్లు ఆవిష్కర‌ణ‌… Rs.

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:43 pm

service |సేవా భావంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి

service | సేవా భావంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి service |

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:31 pm

Balayya |మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా..?

Balayya | మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:30 pm

ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని తేరు బజార్లో గల ఆర్యవైశ్య కొత్త సత్రంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు శ్రీరామ భజన మందిరం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు, దేవత కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దైవ ఆశీస్సులు లేనిదే ఏ పని జరగదని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలన్న తలుపుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అర్చకులచే తొలుత ఉత్సవ […] The post ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 6:28 pm

నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు మహాత్మా గాంధీ సందేశ యాత్ర : రఘువీరా రెడ్డి

ఈ నెల 28 నుండి పాదయాత్ర ప్రారంభం. విశాలాంధ్ర గుడిబండ : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విద్వేషాలు, యుద్ధ వాతావరణం మధ్య మహాత్మా గాంధీ సూచించిన శాంతి, అహింసా మార్గాన్ని సమాజానికి మళ్లీ గుర్తు చేయాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని సిడబ్ల్యూసీ మెంబర్ శ్రీ ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. గురువారం నీలకంఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 28, 29, 30 తేదీల్లో నీలకంఠాపురం నుంచి హిందూపురం గాంధీ చౌక్ వరకు ‘మహాత్మా […] The post నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు మహాత్మా గాంధీ సందేశ యాత్ర : రఘువీరా రెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 6:26 pm

ఇలినాస్ విశ్వవిద్యాలయంతో జేఎన్టీయూ చర్చలు

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : అమెరికాలో ఇలినాస్ విశ్వవిద్యాలయం అధికారులు ఆచార్య దేభాసిస్ దత్త , ఆచార్య శిఖాలకన్ పాల్ తో సమగ్రమైన, దీర్గ కాలిక విద్యా సంబంధిత బాగ స్వామ్యం అంశాలపై గురువారం పరిపాలన భవనంలో వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య డైరెక్టర్ అడ్మిషన్స్, ఫారిన్ అండ్ అల్యూమిని మేటర్స్ ఆచార్య ఎ. సురేష్ బాబు, డిఏపి డైరెక్టర్ ఆచార్య […] The post ఇలినాస్ విశ్వవిద్యాలయంతో జేఎన్టీయూ చర్చలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 6:21 pm

Central schemes |గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Central schemes | గెలుపే లక్ష్యంగా పనిచేయాలి Central schemes | మోత్కూర్,

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:16 pm

Zaynur |సందీరికి రామ్ రామ్..

Zaynur | సందీరికి రామ్ రామ్.. Zaynur | జైనూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:13 pm

Alcohol |గ్రామాల్లో మద్యం అమ్మితే రూ. లక్ష ఫైన్ …

Alcohol | గ్రామాల్లో మద్యం అమ్మితే రూ. లక్ష ఫైన్ … Alcohol

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:10 pm

చిన్నారి వైష్ణవికు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులు

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్ నర్సులు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ మల్లీశ్వరి విలేకరులతో మాట్లాడుతూ… ప్రాణ అపాయ స్థితిలో ఆసుపత్రికి చేరుకున్న తొమ్మిది సంవత్సరాల వైష్ణవికి పునర్జన్మను ప్రసాదించారు అని పేర్కొన్నారు కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన 9 సంవత్సరాల వయసు గల వైష్ణవి ను డిసెంబర్ […] The post చిన్నారి వైష్ణవికు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 6:03 pm

Telangana : కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పడం ఖాయం కనిపిస్తున్నట్లుందిగా?

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త, పాత నేతల మధ్య వార్ ఊపందుకున్నట్లు కనిపిస్తుంది

తెలుగు పోస్ట్ 22 Jan 2026 6:01 pm

Press conference |ప‌ని తీరు మార‌లేదు..

Press conference | నల్గొండ, ఆంధ్రప్రభ : రేవంత్ రెడ్డి పగటి పూట

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:54 pm

Women’s Hostel |పెండింగ్ పనులు పూర్తి చేయాలి…

Women’s Hostel | పెండింగ్ పనులు పూర్తి చేయాలి… Women’s Hostel |

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:54 pm

30 special buses |చిట్యాల నుంచి మేడారంకు 30 ప్రత్యేక బ‌స్సులు..

30 special buses | చిట్యాల నుంచి మేడారంకు 30 ప్రత్యేక బ‌స్సులు..

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:52 pm

TG |మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం..

TG | మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. TG |

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:47 pm

Sarpanch |ఉచిత కంటి వైద్య శిబిరం…

Sarpanch | బిక్కనూర్, ఆంధ్రప్రభ : కంటి వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:44 pm

Review meeting |నిర్మాణ పనులను వేగవంతం చేయాలి..

Review meeting | నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.. Review meeting |

ప్రభ న్యూస్ 22 Jan 2026 5:42 pm

నియంత జగన్ ఇక అధికారంలోకి రావడం కల్ల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 22 Jan 2026 5:40 pm

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ నుంచి ఔట్..

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఫిబ్రవరి 7ను భారత్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడబోమని స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో తమ జట్టు పర్యటించదని.. ఈ టోర్నమెంట్ ను తప్పుకుంటున్నట్లు బిసిబి ప్రకటించింది. ఈరోజు(జనవరి 22 గురువారం) జరిగిన అంతర్గత బోర్డు సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిసిబి వెల్లడించింది. బిసిబి అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఆడాలనేదే తమ ఉద్దేశమని పేర్కొంటూనే, భారతదేశంలో ఆడటాన్ని మరోసారి నిరాకరించారు. 2026 ఐపీఎల్ కోసం బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుండి తొలగించిన సంఘటనను ఆయన ప్రస్తావించారు. నిన్న రాత్రి ఐసిసి తన ప్రకటనలో పేర్కొన్నట్లుగా ఇది కేవలం ఒకే ఒక్క సమస్య కాదని ఆయన అన్నారు. మ్యాచ్‌లను భారత్ నుండి వేరే చోటికి మార్చాలని పాలక మండలిని కోరాం. కానీ, సమస్యకు పరిష్కారించడంలో ఐసిసి విఫలమైందన్నారు. మేము ఐసిసితో సంప్రదింపులు కొనసాగిస్తాము. ప్రపంచ కప్‌లో ఆడాలనుకుంటున్నాము, కానీ భారతదేశంలో ఆడము. మేము పోరాడుతూనే ఉంటాము. ఐసీసీ బోర్డు సమావేశంలో కొన్ని దిగ్భ్రాంతికరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముస్తాఫిజుర్ సమస్య కేవలం ఒకే ఒక్క సమస్య కాదు. ఆ విషయంలో వారే (భారతదేశం) ఏకైక నిర్ణయాధికారులు. మా మ్యాచ్‌లను భారతదేశం నుండి వేరే చోటికి మార్చాలన్న మా అభ్యర్థనను ఐసిసి తిరస్కరించింది. ప్రపంచ క్రికెట్ స్థితి గురించి మాకు ఖచ్చితంగా తెలియదు. దాని ప్రజాదరణ తగ్గుతోంది. వారు 20 కోట్ల మంది ప్రజలను దూరం చేశారు. క్రికెట్ ఒలింపిక్స్‌కు వెళ్తోంది, కానీ మా లాంటి దేశం అక్కడికి వెళ్లకపోతే, అది ఐసిసి వైఫల్యమే అని అమీనుల్ ఇస్లాం బుల్బుల్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌! నిన్న(జనవరి 21 బుధవారం) బిసిబి డైరెక్టర్లతో చర్చలు జరిపిన ఐసిసి.. స్పష్టమైన నిర్ణయం కోసం గడువును విధించింది. ఒకవేళ, బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుండి వైదొలిగితే, ఫిబ్రవరి 7న టోర్నమెంట్ ప్రారంభమయ్యేలోపు స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయంగా చేర్చుకుంటామని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం.. టీ20 ప్రపంచ కప్ ప్రారంభ రోజునే ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో బంగ్లాదేశ్ తలపడాల్సి ఉంది. తర్వాత కోల్‌కతాలో బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. చివరి లీగ్ మ్యాచ్ ముంబైలో ఆడాల్సి ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ తప్పుకోవడంతో ఐసిసి మొత్తం షెడ్యూల్‌ను మార్చకుండా, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చనుంది.  

మన తెలంగాణ 22 Jan 2026 5:33 pm

దావోస్ లో తెలంగాణకు భారీ పెట్టుబడులు

దావోస్ లో తెలంగాణకు పెట్టుబడులు పెరుగుతున్నాయి

తెలుగు పోస్ట్ 22 Jan 2026 5:32 pm