సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 9 (ఆంధ్రప్రభ): మంత్రి దామోదర్ రాజనర్సింహ నేతృత్వం లో
వైసీపీకి ఒక్కచాన్స్‌తో.. ఏపీకి నష్టం..
వైసీపీకి ఒక్కచాన్స్‌తో.. ఏపీకి నష్టం.. పాట్నా(బీహార్), ఆంధ్రప్రభ : వికసిత్ భారత్ లక్ష్యసాధనలో
న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తం నల్గొండ, ఆంధ్రప్రభ : రాజ్యాంగం
బీహార్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారిన ప్రధాన్ పాట్నా (బీహార్): కేంద్ర విద్యాశాఖ
కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసిన భక్తురాలు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో భక్తురాలు అత్యుత్సాహం ప్రదర్శించింది. కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో నోట్లకు మంటలు అంటుకున్నాయి. ఆలయ సిబ్బంది హుండీ నుండి పొగలు రావడాన్ని గమనించి నీళ్ళు పోసి మంటల్ని ఆర్పేశారు. కాలిన నోట్లను వేరు చేసి నోట్లను హెయిర్ డ్రైయర్ తో సిబ్బంది ఆరబెట్టారు. భక్తురాలికి భక్తి ఎక్కువగా ఉండడంతో ఆ పని చేసింది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇది పేదోళ్ల సొంతింటి కల… నర్సంపేట, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి
ఆ బాధ్యత నాదే – బలరాం నాయక్ గోదావరిఖని, ఆంధ్రప్రభ – సింగరేణి
థార్, బుల్లెట్దారులు పోకిరీలే! #Haryana #Police #DGP #ViralVideo #telugupost #latestnews
పొన్నం ఆదేశం.. ఉమ్మడి వరంగల్ ఆంధ్రప్రభ ప్రతినిధి – మొంథా తుఫాన్ నష్టం
ఐదేళ్లలో ఎపికి తీరని నష్టాన్ని మిగిల్చారు : లోకేష్
అమరావతి : తాను ఓ మంత్రిగా ఇక్కడకు రాలేదు అని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. బాధ్యత గల భారతీయ పౌరుడిగా వచ్చానని అన్నారు. బిహార్ లో లోకేష్ పర్యటన చేశారు. పాట్నాలో ఎన్ డిఎకు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వ్యక్తికి ఎపి ప్రజలు పట్టం కట్టారని, ఐదేళ్లలో ఎపికి వైసిపి అధినేత మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి తీరని నష్టాన్ని మిగిల్చారని మండిపడ్డారు. వైసిపి హయాంలో ఎపిలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, జగన్ పాలనలో పరిశ్రమలు, పెట్టుబడులు రాలేదని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలు ఎపిని విడిచి వెళ్లారని, అలాంటి పరిస్థితి బిహార్ కు రాకూడదని లోకేష్ కోరారు.
ఆదాయంపైనే గురి సర్కారుపై బ్రహ్మర్షి ఆర్ ఎం దాస్ ఫైర్ ( నర్సాపురం
(మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ) కేసముద్రం మండలంలో కొన్ని రోజుల నుంచి పాత
Revanth Reddy : 2034 వరకూ కాంగ్రెస్ దే అధికారం
మరో పదేళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. డైరెక్టర్ ఎవరంటే..
సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా హీరోలు రావడం సాధారణమే. స్టార్ హీరోలకు వారసులుగా ఇప్పటికే చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిలై ఇంటి బాట పట్టక తప్పలేదు. ఇక ఒకప్పటి స్టార్ హీరో కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా మరో అబ్బాయి రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మహేశ్‌బాబు సోదరుడు, దివంగత రమేశ్ బాబు తనయుడు నటుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేనిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ రూమర్సే నిజం అయ్యాయి. జయకృష్ణని హీరోగా పరిచయం చేస్తున్నట్లు అజయ్ భూపతి స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఎబి4’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు. తిరుమల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. జయకృష్ణను హీరోగా పరిచయం చేయడం తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా, గర్వంగా ఉందన్నారు. ‘ఒక గొప్ప కథతో మరింత గొప్ప బాధ్యత వస్తుందని’ పేర్కొన్నారు. అశ్వినీ దత్ ఈ సినిమాను సమర్పిస్తుండగా.. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని అజయ్ స్పష్టం చేశారు. With a Great Story comes Greater Responsibility... Thrilled and honoured to introduce #JayaKrishnaGhattamaneni through my next film From the heart of the hills, a raw, intense and realistic love story, #AB4 Title announcement soon❤️ Presented by @AshwiniDuttCh Produced by… pic.twitter.com/Fmn2AoYeEU — Ajay Bhupathi (@DirAjayBhupathi) November 9, 2025
America : అమెరికా షట్ డౌన్ తో ఎన్ని కష్టాలు.. భారమంతా వాటిపైనే?
అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడనుంది.
మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ #MaheshBabu #Jayakrishna #Cinema #FilmLaunch #Ghattamaneni
అదే నా లక్ష్యం – కవిత.. హనమకొండ, ఆంధ్రప్రభ – 20 ఏళ్లుగా
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన తుఫాన్ వాహనం..
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన తుఫాన్ వాహనం.. సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ బస్సును
శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం..#telugupost #latestnews #viralvideo #caraccidentvideos
ఆసీస్‌పై సిరీస్‌లో విక్టరీ.. ఇంపాక్ట్ ప్లేయర్ మెడల్ అతడికే..
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టి-20ల సిరీస్‌ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం జరగాల్సిన ఐదో టి-20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ భారత్‌కు దక్కింది. అయితే ఈ సిరీస్ అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డును ఇచ్చే సాంప్రదాయాన్ని భారత మేనేజ్మెంట్ కొనసాగించింది. ఈ మెడల్‌ను టీమ్ ఆపరేషన్స్ మేనేజర్ రహిల్ ఖాతా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కి అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిఐ సోషల్‌మీడియాలో విడుదల చేసింది. ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ.. రహిల్‌పై ప్రశంసలు కురిపించాడు. రహిల్ చేతుల మీదుగా ఈ పతకాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ప్రతి రోజు ఆయన చాలా కష్టపడుతూ.. తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు రావడం, తుది జట్టులో చోటు దక్కించుకోవడం, టీమ్ విజయానికి తోడ్పడటం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని తెలిపాడు. ఈ సిరీస్‌లో సుందర్ మూడు మ్యాచ్‌లు ఆడాడు. సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యంలో ఉన్న తరుణంలో, మూడో టి-20లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 49 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. నాలుగో మ్యాచ్‌లో 1.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)
Cyber Crime : ఆదమరిస్తే.. బ్యాంకు ఖాతా ఖాళీ.. సైబర్ నేరగాళ్లు ఏ రూపంలో వస్తున్నారో తెలుసా?
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎంతగా అంటే.. అమాయకులను వలలో వేసుకుని నేరగాళ్లు ఏ ఎత్తుగడతో వస్తారో తెలియదు
30 శాతం కమీషన్లు... అందుకే ఆ రంగం పడిపోయింది: హరీష్ రావు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఓటమి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. బిజెపి, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, రేవంత్ సర్కార్‌ను బిజెపి కాపాడుతోందని ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలోని మోతి నగర్ కాలనీ వాసవి బృందావనం అపార్ట్ మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో యూరియా కొరత వస్తే సంజయ్ ఎక్కిడికెళ్లారని ప్రశ్నించారు. కన్నీళ్లను కూడా రాజకీయం చేయడం చిల్లర రాజకీయమని దుయ్యబట్టారు. చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు సహించరని, కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసిన తరువాత అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయిందని, పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు భూమమ్ముదామంటే ధర లేక నష్టపోతున్నారని, రేవంత్ రెడ్డి అసమర్థత పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణాలకు ముఖ్యమంత్రి కమీషన్లు డిమాండ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని హరీష్ రావు దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణ పర్మిషన్లకు 30% కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దివంగత ఎంఎల్ఎ మాగంటి గోపీనాథ్ కాదు మా ఇంటి గోపీనాథ్ గా జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరించారని, దురదుష్టవశాతూ ఆయన చనిపోయారని, కుటుంబానికి, వారి పిల్లలకి అండగా బిఆర్ఎస్ పార్టీ నిలిచిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ అని ఘాటు విమర్శలు చేశారు. వాళ్లది రౌడీ కుటుంబం కాకపోతే పోలీస్ స్టేషన్ లో నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులను ఎందుకు బైండ్ ఓవర్ చేశారని ప్రశ్నించారు. బైండోవర్ చేసిన వాళ్లని రౌడీ అనకపోతే ఏమంటారని హరీష్ రావు అడిగారు. సునీతమ్మ ఒక్కరు కాదు అని, ఆమె వెంట కెసిఆర్, మొత్తం బిఆర్ఎస్ పార్టీ ఉందని తెలియజేశారు. జూబ్లీహిల్స్ లో సునీతమ్మ గెలుపుతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని, జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోవాల్సి వస్తుందన్నారు. ఈ రోజు ప్రజలందరూ మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని సరి చేయాలంటే మళ్ళీ ఇంకెంత సమయం పడుతుందని హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాదులో బిఆర్ఎస్ ప్రభుత్వం 43 ఫ్లైఓవర్లు నిర్మించిందని, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా? అని చురకలంటించారు.
శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : తిరుమల శ్రీవారిని
(ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి) : వానలు పుష్కలంగా కురిస్తేనే నీటిమట్టం పెరుగుతుంది.. గతసారితో
భారీ అగ్ని ప్రమాదం. ఎలా జరిగింది..?
భారీ అగ్ని ప్రమాదం. ఎలా జరిగింది..? సంగారెడ్డి,ఆంధ్రప్రభ: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ #Tirumala #MukeshAmbani #TTD #Darshan #AndhraPradesh
ప్రశంసిస్తూ జాతీయ రహదారి పక్కన ఫ్లెక్సీ వరద ముంపు దారి మళ్లింపు బాపట్ల
Bigg Boss 9 : రాము రాధోడ్.. నువ్వే గెలిచావు... నువ్చే నిజమైన ఛాంపియన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ప్రేక్షకులు ఎలిమినేట్ చేయకుండా సెల్ఫ్ ఎలమినేషన్ చేసుకుని రాము రాధోడ్ హౌస్ నుంచి వెళ్లిపోయాడు
స్నేహం కోసం.. వెల్గటూర్, ఆంధ్రప్రభ – మానవత్వానికి, స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా పదవ
ఆ విషయంలో కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసింది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రజాపాలన ప్రారంభమై రెండు సంవత్సరాలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందామన్నారు. రాష్ట్రం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజలు బిఆర్ఎస్ ను గెలిపించారన్నారు. మీట్ ది ప్రెస్ లో సిఎం రేవంత్ మాట్లాడారు. జిసిసిలు, డెటా సెంబర్లకు హైదరాబాద్ హబ్‌గా మారిందని, భారత దేశానికి వచ్చిన జిసిసి, డెటా సెంటర్లలో 70 శాతం హైదరాబాద్‌కే వచ్చాయని, దివంగత ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్థన్ రెడ్డి పునాది వేసిన ఐటి రంగం హైదరాబాద్‌లో అభివృద్ధికి ఎంతో కీలకంగా మారిందని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. 2004లో ఉచిత కరెంట్ పై వైఎస్సాఆర్ మొట్టమొదటి సంతకం చేశారని, రైతు రుణమాఫీ అమలు చేసి రైతులను ఆదుకుందని, కరువు ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి జలయజ్ఞం చేపట్టారని మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో ఐటి, ఫార్మా రంగాలను గత పాలకులు ఎంతో ప్రోత్సహించారని కొనియాడారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు పడ్డాయని ప్రశంసించారు. గతంలో కాంగ్రెస్ హయాం లోనే అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్ ఏర్పాటు చేశారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మార్చి నిధులు కొల్లగొట్టిందని, గతంలో నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కిన పరిస్థితులు ఉండేవన్నారు.
బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాపై ఆంక్షలు పెట్టారు: కవిత
హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉరివేసే ఖైదీని చివరి కోరిక అడుగుతారు. కానీ తనకు షోకాజ్ నో నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. హనుమకొండలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనపై ఆంక్షలు పెట్టారని, ప్రొటోకాల్ పేరుతో తనను కట్టేశారని.. అందుకే జనంలో తిరగలేకపోయానని తెలియజేశారు. తాను సిఎం కూతురునైనా బిఆర్ఎస్ హయాంలో తన పనులు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సిఎం కెసిఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తానని, బిఆర్ఎస్ తో తనకు సంబంధం లేదని కవిత పేర్కొన్నారు.
టెన్షన్ పెడుతున్న ట్రాన్స్ఫార్మర్..
టెన్షన్ పెడుతున్న ట్రాన్స్ఫార్మర్.. దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రమాదం పొంచి ఉన్న ట్రాన్స్ఫార్మర్
శ్రీశైలంలో విశేష పూజలు నంద్యాల బ్యూరో నవంబర్ 9 ఆంధ్రప్రభ : నంద్యాల
రాష్ట్ర పండుగగా కోటి దీపోత్సవం రేవంత్ ప్రకటన #Hyderabad #CMRevanthReddy #Kotideepotsavam #Festivals
రష్మీతో ప్రేమలో పడిన రాజమౌళి... వీడియో వైరల్
హైదరాబాద్: అప్పుడప్పుడు పాత వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి, యాంకర్ రష్మీ గౌతమికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2007లో రాజమౌళి యమదొంగ సినిమాతో సినీ రంగంలో ప్రవేశించారు. అక్కడి నుంచి విక్రమార్కుడు, సింహాద్రి, ఛత్రపతి, మర్యాదరామన్న, ఈగ, మగధీర, బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. బహుబలి సినిమాతో భారత దేశపు సినిమా ప్రపంచానికి తెలియజేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తన కెరీర్ ప్రారంభంలో నేరుగా సినిమా ద్వారా కాకుండా సీరియల్స్‌తో ప్రారంభించారు అనే చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. గతంలో రష్మీ, రాజమౌళి ఒక సీరియల్ నటించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో రష్మీ కంట్లో పడడంతో హీరో నాగార్జునను ఒక కోరిక కోరింది. రష్మీ-రాజమౌళి ఎప్పుడు కలిసి నటించారని అభిమానులు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. యువ సీరియల్ నుంచి తనకు చాలా మంచి మెమొరీలు ఉన్నాయని, సీరియల్ యూనిట్‌తో రీయూనియన్ ఎపిసోడ్ చేయాలని ఉందని నాగార్జునను యాంకర్ రష్మీ కోరింది. రాజమౌళి దర్శకధీరుడు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు. రష్మీ మాత్రం పలు టీవీ షోలలో యాంకర్‌గా దూసుకుపోతుంది. రష్మీతో రాజమౌళి యువ సీరియల్ లో నటించారు.
స్కూటీలో పాము కలకలం #telugupost #snake #viralvideo #snakerescue
వివాహ వేడుకలో.. మాజీ ఎమ్మెల్యే తాటి
వివాహ వేడుకలో.. మాజీ ఎమ్మెల్యే తాటి అశ్వారావుపేట, ఆంధ్రప్రభ: నియోజకవర్గ కేంద్రంలో శ్రీశ్రీ
ఈ క్యాష్ .. కలెక్టర్ దే.. బీహారీ వ్యాపారి అఫిషీయల్ కార్డ్
త్వరలో హెచ్ సిఎపై చర్యలు ఉండబోతున్నాయి: బండి
హైదరాబాద్: హెచ్ సిఎలో గ్రామీణ స్థాయి క్రికెటర్ల అవకాశం కల్పించట్లేదని తల్లిదండ్రులు తనను కలిశారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.ఈ విషయంపై స్పందిస్తూ.. బిసిసిఐకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. హెచ్ సిఎలో జరుగుతున్న జూనియర్, సీనియర్ సెలెక్షన్లపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలక్షన్ కమిటీలో రూ. లక్షలు తీసుకున్నట్లు తల్లిదండ్రులు చెప్పారని, గతంలో బాగా ఆడేవారిని కూడా ఎంపిక చేయలేదని తల్లిదండ్రులు ఆరోపించారని మండిపడ్దారు. త్వరలో హెచ్ సిఎపై చర్యలు ఉండబోతున్నాయని బండిసంజయ్ హెచ్చరించారు.
బిగ్‌బాస్ హౌస్‌లో క్లియర్ కట్ వెబ్ డెస్కు, ఆంధ్రప్రభ : బిగ్‌బాస్ హౌస్
నిరుపేద కుటుంబానికి అండగా.. మక్తల్, ఆంధ్రప్రభ – మక్తల్ ప్రాంతానికి చెందిన సత్తమ్మ
₹1 లక్ష స్కూటర్‌కు ₹21 లక్షల జరిమానా #TrafficFine #Muzaffarnagar #ViralChallan #PoliceClarification
క్రిష్ణగిరి: నాగర్ కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలో కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా వాహనం దగ్ధమైంది. ఫార్చునర్ కారులో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈగలపెంట దగ్గరలో కారులో నుంచి మంటలు వచ్చాయి. కారులో ఉన్నవారి బయటకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. క్షణాల వ్యవధిలో కారు మొత్తానికి మంటల వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. పోలీసులు క్రేన్ సహాయం తో వాహనాన్ని పక్కకు తొలగించారు.
టెన్షన్ లో రైతులు.. నల్గొండ, ఆంధ్ర ప్రభ:దేవుడు కనికరించినా పూజారి కనకరించలేదు అన్నట్టుగా..
అమెరికాలో భారీగా లేఆఫ్స్.. అమెరికాలో అక్టోబర్ నెలలో ఉద్యోగ కోతలు గరిష్ట స్థాయికి
ములుగు అడవుల్లో కొత్త సీతాకోకచిలుకల జాతులు #Wildlife #Mulugu #ForestDepartment #ButterflySurvey
130 మంది జంటలుశ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు గుడివాడ – ఆంధ్రప్రభ:
డిబోట్ అనే ఈ రోబోట్ పనిమనిషి ఇంటిని శుభ్రపరిచే శక్తి వంతమైన మహిళల నేస్తం. సెట్ చేసిన సమయం ప్రకారం మొదటి దుమ్ము ధూళి శుభ్రంగా చేస్తుంది. తరువాత అది తన ఛాంబర్ కెళ్ళి దుమ్ము వదిలేసి మరల తడిగుడ్డ పెట్టి తుడుస్తుంది. ఒకటికి రెండుసార్లు నీట్ గా శుభ్రం చేసిన తరువాత తన స్ధానంలోకి వెళ్లి ఛార్జింగ్ చేసుకుంటుంది. దీని ధర. రూ. 55000 అమెజాన్ లో ఉంది. దుమ్ము ఓ బ్యాగ్ లోకి వెళ్లి పోతుంది. అది మనం పడేయాలి. శుద్ధి చేసి మరలా వాడుకోవచ్చు. మాది గ్రానైట్ ఫ్లోరింగ్ కావున శుభ్రంగా తుడుస్తోంది. మార్బుల్ కూడా బాగానే ఉంటుంది. మన సెల్ ఫోన్ ద్వారా దీనిని మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
ఇటీవల కాలంలో సంభవిస్తున్న తుఫానులు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను దాటిన మొంథా తుఫాను తీవ్రవిధ్వంసం సృష్టిస్తుందనే భయంకరమైన పరిస్థితులనుండి ప్రజలు బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుఫాను తీరం దాటిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వలన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ప్రకృతిలో ఎందుకు అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి? ఆకస్మిక వాతావరణ మార్పులకు కారణమేమిటి? ఇలాంటి కీలకమైన అంశాలపై తీవ్రమైన పరిశీలన, మేధో మథనం జరగాలి. మానవ చర్యల వలన ప్రకృతిలో సంభవించే విపత్తులనుండి ప్రజలను కాపాడుకోవాలి. ప్రకృతి విధ్వంస దుష్ఫలితాలను కనీసస్థాయికి తగ్గించాలి. ప్రకృతి భూమికి రక్షణ కవచం వంటిది. అలాంటి ప్రకృతిని విధ్వంసం చేయడం మనల్ని మనం ప్రమాదంలో పడేసుకోవడమే. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతిని నిర్లక్ష్యం చేసి, పర్యావరణానికి ముప్పు కలగచేయడం క్షమార్హం కాదు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ, ఎన్నోఅవగాహనా సదస్సులు, ఎన్నో అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నా పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. పర్యావరణ విధ్వంసంతో మానవ ప్రపంచం విలపిస్తున్నది. ప్రపంచాన్ని పచ్చదనంతో నింపితేనే భూగ్రహాన్ని కాపాడగలం. స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఐస్లాండ్, డెన్మార్క్, యు.కె, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు హరిత దేశాలుగా పేర్కొనబడుతున్నాయి. సహజ వనరులను పరిరక్షించి, కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా డెన్మార్క్ గ్రీనెస్ట్ కంట్రీ దిశగా పయనిస్తున్నది. ఖతార్, నైజర్, గ్రీన్ లాండ్ వంటి దేశాల్లో పచ్చదనం తక్కువగా ఉంది. ధరిత్రిని కలుషిత వ్యర్ధాలనుండి కాపాడడం, ప్లాస్టిక్‌ను నెమ్మదిగా తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రపంచాన్ని మళ్ళించడం, జీవవైవిధ్యాన్ని కాపాడడం, అడవులను సంరక్షించడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి చర్యలతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ప్రస్తుత కలుషితభరితమైన ప్రపంచంలో ప్రతీ చోట వినిపించే మాట ‘పర్యావరణం’. పర్యావరణం అనే పదానికి నిర్వచనం చాలా మందికి తెలియకపోవచ్చు. పచ్చదనమే పర్యావరణ పరిరక్షణకు నిజమైన పరిష్కారమన్న అవగాహన మాత్రం సామాన్య ప్రజల్లో కూడా ఏర్పడింది. కాని ఆచరణలో పర్యావరణ పరిరక్షణ అంశం విఫలమవుతూనే ఉంది. పర్యావరణం శరవేగంగా విధ్యంసమవుతూనే ఉంది. మానవ ప్రపంచాన్ని పెను ప్రమాదం వెంటాడుతూనే ఉంది. మన చుట్టూ పంచభూతాలతో ఆవరించి ఉన్న సహజసిద్ధమైన ఏర్పాటును ‘పర్యావరణం’గా పేర్కొనవచ్చు. అలాంటి పర్యావరణం మానవ స్వార్థంతో, తప్పిదాలతో విధ్వంసం కావడం పెను ప్రమాదానికి సంకేతం-, మానవ మనుగడకు శరాఘాతం. సకల జీవరాశుల మనుగడకు ఏకైకఆధారం భూగ్రహం. మిగిలిన గ్రహాల్లో జీవించడానికి అనువైన పరిస్థితులు లేవు. ఇతర గ్రహాలపై పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటి వరకు జీవరాశుల జాడ కనిపించలేదు. వేలాది కోట్ల ధనం ఇతర గ్రహాలపై పరిశోధనలకు ఖర్చుపెడుతున్నా ఫలితాలు నిరాశాజనకంగానే ఉన్నాయి. ఇతర గ్రహాలపై తిష్ఠవేయాలనే మానవ జిజ్ఞాస కేవలం అత్యాశగానే మిగిలిపోతుందేమో అనే సంశయం కలగడం సహజం. సువిశాలమైన భూగ్రహాన్ని నాశనం చేసి, ఇతర గ్రహాలపై నివాసానికి కలలు కనడం హాస్యాస్పదం. ప్రకృతి హొయలతో అలరాడే అందమైన భూగ్రహాన్ని కాలుష్యంతో కురూపిగామార్చి, ఇతర గ్రహాలపై పరిశోధనలు చేయడం కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది. భూగ్రహం కూడా ఈ సమస్త విశ్వంలో ఒక భాగమే. భూగ్రహంపై మూడొంతుల నీరు, ఒక వంతు భూమి కలదు. వృక్షాలతో, నదీనదాలతో, కొండలు, లోయలు, సముద్రాలతో పలు జీవరాశులతో, విభిన్నమైన భౌగోళిక నైసర్గీక స్వరూపాలతో, పచ్చని ప్రకృతి మధ్య జీవించే మహాద్భాగ్యాన్ని మానవుడే చెరిపేస్తున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం విచక్షణ కోల్పోయి ప్రకృతిని చెరబట్టి, వికృతంగా మారుస్తున్నాడు. అడవులను నరికి నివాసాలను ఏర్పాటు చేసుకోవడం, పంటభూములను మానవావసరాలకు వినియోగించడం, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఏర్పాటు చేయడం, శిలాజ ఇంధనాలను ఇబ్బడిముబ్బడిగా వినియోగించడం వలన ధరిత్రిపై కాలుష్యపు క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం వలన, అడవులను ధ్వంసం చేయడం వలన, పారిశ్రామిక విప్లవం వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువుల శాతం పెరిగి, భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే ‘గ్లోబల్ వార్మింగ్’ సమస్య పెరిగి భూమిపై మనుగడ సాగిస్తున్న పలు జీవరాశుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భూ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ తప్పిదాలే కారణం. ప్రకృతిలో లభ్యమయ్యే వనరులను అవసరాలకు మించి వినియోగించడం, ధనాశతో, దురాశతో దూరదృష్టి కోల్పోయి, పర్యావరణానికి చేటుతేవడం మానవ మనుగడకు పెనుముప్పు. పచ్చదనమే ప్రపంచ మానవాళికి నిజమైన ధనం. ఈ విషయాన్ని మరచిపోయి, కలుషితాల మధ్య జీవిస్తూ సుఖసౌఖ్యాలను ఆస్వాదిస్తున్నామని భ్రమించడం దురదృష్టకరం. పంచభూతాలు కలుషితమైపోయాయి. పర్యావరణం కాలుష్యంతో నిండిపోయింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రాబోవు ప్రళయానికి సంకేతాలు. సూర్యరశ్మి, గాలి, నీరు మొదలైన వనరులను పునరుత్పాదక శక్తివనరులుగా పిలుస్తారు. జంతువుల, మొక్కల వ్యర్ధాల నుండి ఉత్పత్తి కాబడే ఇంధనాన్ని బయోమాస్ ఎనర్జీ అంటారు. ఇది కూడా పునరుత్పాదక ఎనర్జీ. పునరుత్పాదక శక్తి వనరులను వినియోగించే కొద్దీ తిరిగి భర్తీ చేయబడతాయి. సౌరశక్తి, గాలి వంటి సహజసిద్ధమైన వనరులను వినియోగించుకుని కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వీటి వలన పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. సూర్యరశ్మి, గాలి వంటి ప్రకృతి సిద్ధమైన వనరుల నుండి లభ్యమయ్యే శక్తి కారకాలను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించినా తిరిగి పొందగలం. వీటిని వినియోగించడం వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పునరుత్పాదక శక్తివనరులతో వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించి, కాలుష్యాన్ని అరికట్టవచ్చు. దీనినే క్లీన్ ఎనర్జీ అంటారు. ప్రపంచంలో ప్రకృతి ప్రేమికులకు కొదవలేదు. అయినా ఆశించినంత ప్రయోజనం ఆచరణలో కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగకుండా, ప్రజల అవసరాలు తీర్చే ప్రణాళికలు చేపట్టకుండా పర్యావరణ విధ్వంసాన్ని ఆపలేం. పర్యావరణాన్ని పరిరక్షించి, భూతలాన్ని కాపాడేందుకు ‘రాచెల్ లూయీస్ కార్సన్’ వంటి పర్యావరణ వేత్తల ఆలోచనలు స్ఫూర్తి కావాలి. గేలార్డ్ నెల్సన్ లాంటి దూరదృష్టిగల పర్యావరణ ప్రేమికులను వర్తమాన ప్రపంచం తయారు చేయాలి. జాదవ్ పాయెంగ్, వనజీవి రామయ్య వంటి ప్రకృతి, పర్యావరణ సేవకులు సమాజం నుండి ఉద్భవించాలి. ప్రపంచ స్థాయి సంస్థలు, ప్రభుత్వాలు, పర్యావరణ వేత్తలు పర్యావరణ పునరుద్ధరణకు నడుంబిగించి, మానవాళిని పెను సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి వడివడి అడుగులు వేయాలి. సహజసిద్ధమైన, కలుషిత రహితమైన గత కాలం నాటి,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పునర్జీవింపచేయాలి. మానవ చర్యల వలన ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయాలి. ప్రకృతి వైపరీత్యాలనుండి ప్రజలను కాపాడాలి. - సుంకవల్లి సత్తిరాజు 97049 03463
Exclusive: Suresh Babu walks out of ENE Repeat
Ee Nagaraniki Emaindi is a cult classic in Telugu cinema and it impressed the youth big time. After Pelli Choopulu, director Tharun Bhascker picked up a film on bonding between four friends and the film is all about their life experiences. After years, the sequel for the film titled ENE Repeat was announced early this […] The post Exclusive: Suresh Babu walks out of ENE Repeat appeared first on Telugu360 .
యూట్యూబ్ నేర్పిన దారుణ హత్య #Crime #Visakhapatnam #YouTubeMurder #PoliceInvestigation #LalithaArrest
శివాలయాల్లో భక్తుల తాకిడి.. సూర్యాపేట జిల్లా మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో కార్తీకమాసం
పిల్లలమర్రికి భక్తుల తాకిడి
శివాలయాల్లో ప్రత్యేక పూజలు సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా మున్సిపల్ పరిధిలోని
నితీశ్ కు అగ్ని పరీక్ష..? రెండు దశాబ్ధాల పాటు వరుసగా సీఎంగా కొనసాగుతూ
యంగ్ హీరో శ్రీనందు తన తాజా మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ ద్వారా మేకర్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీజర్ హై ఎనర్జీతో అదిరిపోయింది. దర్శకుడు వరుణ్ రెడ్డి యువతను దృష్టిలో ఉంచుకుని కథను రూపొందించాడు, శ్రీ నందు పాత్రను హై ఎనర్జీతో ఎంటర్టైనింగ్ చేశారు. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా విడుదల కానుంది. మార్కెటింగ్‌ను రానా స్పిరిట్ మీడియా నిర్వహిస్తుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ నందు మాట్లాడుతూ “ఈ సినిమాలో ఫన్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంతా కూడా కథకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇది ఫ్యామిలీ కూడా కూడా నచ్చే సినిమా. అందరికీ నచ్చే యూనిక్ ఫన్ ఎంటర్టైనర్ ఇది”అని అన్నారు. డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ “చాలా కొత్తగా అనిపించే సినిమా ఇది. ఈ సినిమాతో నందులోని ఒక కొత్త యాంగిల్ చూస్తారు”అని తెలిపారు.
గోడకు రంధ్రం వేసి 15 కిలోల వెండి చోరీ #Crime #Medchal #JewelleryTheft #DundigalPolice #viralvideo
అత్తను చంపడానికి యూట్యూబ్ లో సెర్చ్... దాగుడుమూత ఆట పేరుతో పెట్రోల్ పోసి తగలబెట్టింది
అమరావతి: అత్త వేధింపులు ఎక్కువ కావడంతో యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆమెపై కోడలు పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 98వ వార్డు అప్పన్నపాలెం వర్షిణి ఆపార్ట్మెంట్ ఎఫ్ బ్లాకులో కనకమహాలక్ష్మి (66) అనే వృద్ధురాలు తన కుమారుడు, కోడలితో కలిసి ఉంటుంది. అత్త తన భర్తకు లేనిపోనివి చాడీలు చెప్పి తనని వేదిస్తుందని కోడలు పగ పెంచుకుంది. అత్తను చంపడానికి యూట్యూబ్‌లో సెర్చ్ చేసింది. 'హౌటు కిల్ ఓల్డ్ లేడీ' అని సెర్చ్ చేసింది. నవంబర్ 6న సాయంత్రం పెట్రోల్ తీసుకొని వచ్చి ఇంట్లో దాచి పెట్టింది. నవంబర్ 7న ఉదయం 8 గంటలకు భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. లలిత తల్లి స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లింది. ఇదే సరైన సమయం అనుకొని పిల్లలను అత్తతో దాగుడు మూతలు ఆట ఆడుకోవాలని సూచించింది. అత్తను చైర్లో కూర్చొబెట్టి కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లు, నోటికి గంతలు కట్టేసి దాక్కోమ్మని పిల్లలకు చెప్పింది. పిల్లలను గదిలోనికి పంపించిన తరువాత అత్తపై కోడలు పెట్రోల్ పోసి తగలబెట్టింది. అత్త అరుపులు బయటకు వినపడకుండా టివి సౌండ్ పెద్దదిగా పెట్టింది. మంటలకు కట్లు కాలిపోవడంతో చైర్లో నుంచి వృద్ధురాలి లేచి దేవుడి రూమ్ వైపుకు పరుగులు తీసింది. మనవరాలికి కూడా మంటలు అంటుకోవడంతో చేతులు, కాళ్లు కాలిపోయాయి. టివి వైర్లు తగిలి నాన్నమ్మకు మంటలు అంటుకున్నాయని పిల్లలకు చెప్పింది. బాత్రూమ్లో నుంచి లలిత తల్లి బయటకు వచ్చేసరికి కనకమహాలక్ష్మి కాలిపోయి కనిపించింది. ఎదురింట్లో ఎసి బిగిస్తున్న వ్యక్తి మంటలను ఆర్పడానికి ఇంట్లోకి పరుగెత్తుకొచ్చాడు. అతడిని ఇంట్లోకి రానివ్వకుండా కోడలు ఆపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులున ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎసి బిగిస్తున్న వ్యక్తిని వివరాలు పోలీసులు అడిగి తీసుకున్నారు. వెంటనే ఆమె ఫోన్ తీసుకొని యూట్యూబ్‌లో హిస్టరీలో ఓపెన్ చేశారు. 'హౌ టు కిల్ ఓల్డ్ లేడీ' అని ఆమె పలుమార్లు సెర్చ్ చేసినట్టు గుర్తించారు. కోడలిని అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించారు. తనని అత్త వేధించడంతోనే హత్య చేశానని కోడలు ఒప్పుకుంది. వెంటనే ఆమెపై పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Huge Social Media Appreciation for The Girlfriend
Top actress Rashmika attempted an interesting film ‘The Girlfriend’, a film that is filled with emotional drama and a strong message. The box-office numbers have seen a steady rise on the second day when compared to the registered openings on day one. The film is appreciated across social media well. The film’s director Rahul Ravindran […] The post Huge Social Media Appreciation for The Girlfriend appeared first on Telugu360 .
అదరగొట్టిన పవర్ఫుల్ ‘తాండవం’ ప్రోమో
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ అఖండ 2: తాండవం నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ పవర్ఫుల్ బీట్స్, డివోషనలో చాంట్స్‌తో ఈ సాంగ్‌ని అద్భుతంగా కంపోజ్ చేశారు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకంతో బాలకృష్ణ చేసిన అఖండ తాండవం గూస్ బంప్స్ తెప్పించింది. ప్రోమో సాంగ్‌పై అంచనాలని భారీగా పెంచింది. ఫుల్ సాంగ్ నవంబర్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. అఖండ 2: తాండవం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Thaman appeals to Prabhas’ fans, gives an update
Prabhas starrer The Raja Saab, a horror comedy with jump scares and humourous romance, is slated for release on January 9th as a Sankranti gift. As the release date is just two months away, fans are eagerly waiting for the team to kick start promotions to amplify the hype on the film as it is […] The post Thaman appeals to Prabhas’ fans, gives an update appeared first on Telugu360 .
యువకుని మృతదేహం లభ్యం.. జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని
వణికిపోతున్న ఢాకా ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: పదవీచ్యుతుడైన ప్రధాన మంత్రి షేక్ హసీనా
జురేల్ శతకం.. గెలుపు దిశగా టీమిండియా
ముంబై: సౌతాఫ్రికాఎతో జరుగుతున్న అనధికార టెస్టులో టీమిండియా ఎ జట్టు గెలుపు దిశగా దూసుకెళుతోంది. తొలి టెస్టులో భారీవిజయంతో ఆధిక్యంలో ఉన్న భారత్ఎ రెండో టెస్టులోనూ అదే జోరును కొనసాగిస్తోంది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(127 నాటౌట్) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగాడు. అతని తోడు జట్టు సారథి రిషభ్ పంత్(65 నాటౌట్) సయితం అర్ధ శతకంతో రాణించాడు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 382/-7వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు శనివారం ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 25 పరుగులు చేసింది. చివరిదైన నాలుగో రోజు ఆదివారం ప్రత్యర్థి బ్యాటర్లను ఆటకట్టిస్తే సునయాస విజయం ఖాయం. తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్ (132 నాటౌట్) సెంచరీతో గాడిలోపడిన భారత్.. బౌలర్ల విజృంభణతో సఫారీలను 221కే ఆలౌట్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలమైనా.. జురెల్ మెరుపు శతకంతో జట్టును మరోసారి గట్టెక్కించాడు. 17 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన పంత్.. హర్ష్ దూబే(84) వికెట్ పడ్డాక బ్యాటింగ్ వచ్చి చెలరేగాడు. జురెల్‌తో కలిసి స్కోర్ బోర్డును ఉరికించిన పంత్.. సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు. అప్పటికే ఆధిక్యం 400 మార్క్ దాటింది. టైమింగ్ కుదరక పంత్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. దీంతో 382/-7 వద్ద భారత ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, 416 పరుగుల భారీ లక్షాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. అనంరతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీఏ జట్టు ఆట ముగిసేసరికి 25 పరుగులు చేసింది. ఓపెనర్లు జొర్డాన్ హెర్మన్(15 నాటౌట్), లెసెగో సెనొకెవెనె(9 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంతిలో చెలరేగిన ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సిరాజ్‌లు మరోసారి రాణిస్తే.. సౌతాఫ్రికా బ్యాటర్లు కట్టడి చేయడం తేలికే.
ఖాట్మండులోనూ ఢిల్లీ తరహాలోనే..
రన్‌వే లైటింగ్ వ్యవస్థలో సమస్యలుఖాట్మండు: (నవంబర్ 9) రన్‌వే లైటింగ్ వ్యవస్థలో సమస్యలు
నేటితో అంతా గప్ చుప్.. రాష్ట్రమంతా ఆసక్తితో ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప
పాక్ అధ్యక్షుడి స్వామి భక్తి
పాక్ అధ్యక్షుడి స్వామి భక్తి ట్రంప్‌పై షరీఫ్ మళ్లీ పొకడ్తలు..ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Self-Evictions in Bigg Boss: When Emotion Overpowers Endurance
Bigg Boss Telugu, known for its drama, mind games, and emotional rollercoasters, has also witnessed rare yet heartfelt moments when contestants chose to leave the show voluntarily. Over the seasons, a handful of housemates have walked out of the house on their own, unable to handle the psychological isolation that comes with the show’s unique […] The post Self-Evictions in Bigg Boss: When Emotion Overpowers Endurance appeared first on Telugu360 .
టిడిపి ఎమ్మెల్యే సీటు కోసం అతడు రూ.7 కోట్లు వసూలు చేశాడు: మాధవి
అమరావతి: టిడిపి ఎమ్మెల్యే సీటు కోసం రూ.7 కోట్లు వసూలు చేశారని ఆ పార్టీ మహిళా నేత మాధవి ఆరోపణలు చేశారు. టిటిపి నేత వేమన సతీష్ తనను మోసం చేశాడని సదరు మహిళ మీడియా ముందు కన్నీంటిపర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అందరూ సతీష్ కు తెలుసునని చెప్పి తనని మోసం చేశాడన్నారు. టిడిపి తరపున రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తానని రూ.7 కోట్లు వసూలు చేశాడని మహిళ ఆరోపణలు చేసింది. ఆస్తులమ్మి 7 కోట్లు వేమన సతీష్ కు ఇచ్చామని, డబ్బు అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకున్నారు. గతంలో టిడిపి ఎంపి కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో తిరువూరు టిడిపి టికెట్ కోసం రూ.5 కోట్లు చిన్ని అడిగాడంటూ కొలికపూడి ఆరోపణలు చేసిన విషయం విధితమే. తన అకౌంట్ నుంచి మూడుసార్లు రూ.60 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా ఫేస్ బుక్ లో కొలికపూడి పోస్ట్ పెట్టాడు. ఎంపి చిన్ని పిఎ మోహన్ పోరంకి తన వద్ద నుంచి 50 లక్షలు తీసుకెళ్లాడని, తన మిత్రులు ఇచ్చిన 3.50 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం అంటూ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Ram Charan heaps Praise on AR Rahman
For the first time, legendary music composer AR Rahman is scoring music for a film featuring Ram Charan in the lead role. The film is titled Peddi and it is a rustic rural action drama directed by Buchi Babu Sana. The first single ‘Chikiri’ which was released recently turned out to be an instant hit. […] The post Ram Charan heaps Praise on AR Rahman appeared first on Telugu360 .
Bigg Boss Telugu 9: Top 6 Contestants Reveal and Ramu’s Self-Eviction
Bigg Boss Telugu Season 9 witnessed a mix of emotions, laughter, nostalgia, and farewells in today’s episode. With RGV, Amala, and Nagarjuna sharing the screen, and Ramu’s unexpected exit, the show offered a perfect blend of drama and sentiment. Divya’s Possessiveness Sparks Conversations The episode began with Tanuja and Ritu discussing Divya’s possessive attitude toward […] The post Bigg Boss Telugu 9: Top 6 Contestants Reveal and Ramu’s Self-Eviction appeared first on Telugu360 .
ఇంట్లో ఎవరూ లేని సమయంలో..పురుగుల మందు తాగిన వృద్ధురాలుచికిత్స పొందుతూ మృతి నాగిరెడ్డిపేట్
నేడు తిరుమలలో కార్తీక వన భోజనం
తిరుమల: కార్తీక వన భోజన కార్యక్రమం శనివారం తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరుగనుంది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొంటారు.
లక్ అంటే ఇలా ఉండాలి.. లక్.. ఉంటే జీవితం ఇట్టే మారిపోతుంది. ఆ
కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు
భక్తుల అభిప్రాయ సేకరణపై అదనపు ఈవో సమీక్ష తిరుమల: తిరుమలోని కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తులకు ఎప్పటికప్పుడు మరింత మెరుగైన సకర్యాలు కల్పించేందుకు టిటిడి అభిప్రాయ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐవిఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి క్రమంగా అభిప్రాయాలను సేకరించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టిటిడి అదనపు ఇఒ సి.హెచ్.వెంకయ్య చౌదరి పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఉదయం భక్తుల నుండి అక్టోబర్ నెలలో సేకరించిన అభిప్రాయాలపై విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిప్రాయాలపై అధికారులతో చర్చిస్తూ పలు అదేశాలు జారీ చేశారు. కాలిబాట మార్గాల్లో పంచాయతీ, ఆరోగ్య విభాగాలు కలసి తరచూ తనిఖీలు నిర్వహించి ఆ మార్గాల్లోని దుకాణాల్లో వస్తువుల ధరలను పర్యవేక్షించాలన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించేటప్పుడు అన్న ప్రసాదం సిబ్బంది చేతులకు తొడుగులు ధరించి ప్రసాదాలు వడ్డించాలని సూచించారు. భక్తులు చేతులు కడుగు ప్రదేశం, హాళ్లలో తడి లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని చెప్పారు. భక్తులు గదుల కాషన్ డిపాజిట్ తిరిగిపొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలన్నారు. ఎటిసి నుండి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉండే క్యూలైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు అందేలా అధికారులు నిత్యం క్యూలైన్లను పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని ఆదేశించారు. అన్న ప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్, క్యూలైన్ల నిర్వహణ, లడ్డూ కౌంటర్ విభాగాలపై వచ్చిన భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. తదుపరి సమావేశంలో వాటి పురోగతిపై రిపోర్టు సమర్పించాలని చెప్పారు. అనంతరం గోపార్క్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తిరుమలలోని పార్కింగ్ సమస్య పరిష్కారాలకు పార్కింగ్ యాప్ అభివృద్ధి, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రణాళిక, పార్కింగ్ ప్రీ బుకింగ్, నిర్దేశిత పార్కింగ్ జోన్లు గుర్తింపు, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు.ఈ సమావేశంలో టిటిడిలోని వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
క్రాస్ ఓటింగ్ కలిసొచ్చేది ఎవరికి…?
క్రాస్ ఓటింగ్ కలిసొచ్చేది ఎవరికి…? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అంతా
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు..
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు.. తెలంగాణ చలి తీవ్రత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా
అడవిలో ఏం జరుగుతోంది..? శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందన సంరక్షణకు మరింత కట్టుదిట్టమైన
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రానికి తెరపడనున్నది. గత నెల 13వ తేదిన ఈ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి నేడు ప్రచారం ముగిసే వరకు దాదాపు మూడు వారాల పాటు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య నీవ్వా, నేనా? అన్నట్టుగా దాదాపు మూడు వా రాల పాటు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే బరిలో ఈ మూడు పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పోటి మాత్రం కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యనే నెలకొన్నది. అయినప్పటికీ ఇక్కడ బీజేపీ చీల్చుకోబోయే ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయని రా జకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ మేర కు బీజేపీ గట్టి పోటి ఇస్తుందా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల తర్వాతనే తేలనున్నది. బీజేపీ నేతలేమో ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా తమకు సైలెంట్ వేవ్ ఉందని, అధికార, ప్ర ధాన ప్రతిపక్షానికి షాక్ ఇచ్చే విధంగా ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాత్రమే సంబంధించింది అయినప్పటికీ ఇక్కడ వచ్చే ఫలితం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయన్న అంచనాతో అన్ని పార్టీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ ఉప ఎన్నిక తర్వాత స్థానిక సంస్థలకు రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని జూబ్లీహిల్స్‌లో వచ్చే ఫలితం ఎంతో కొంత ప్రభావితం చేస్తాయని రాజకీయ పక్షాలు అంచనా వేస్తోన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి సరిగ్గా రెండేండ్లు పూర్తి అవుతోన్న నేపథ్యంలో జరుగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వ పాలనకు రెఫరాండంగా రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శిస్తోంది. దీంట్లో ఎంత వరకు వాస్తవం ఉందనేది కూడా జూబ్లీహిల్స్ ఫలితాలు తేటతెల్లం చేయబోతున్నాయి. ఇక్కడ విజయం సాధిస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందేందుకు ట్రెండ్ క్రియేట్ అవుతుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అధికారం, అభివృద్ధి ని నమ్ముకున్న కాంగ్రెస్ ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా అధికార పార్టీకి అనుకూల ఫలితాలు రావడం సర్వసాధారణం. ఈ లెక్కన జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడం ఖాయమని అధికార కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఒక్క జిహెచ్ఎంసి తరఫుననే ఇక్కడ వంద కోట్ల రూపాయలను అభివృద్ధి పనులపై ఖర్చు చేసింది. ఇవ్వే కాకుండా ఇతర శాఖల పరిధిలో కూడా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. మొదట ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్రావును ఎన్నికల ఇంచార్జీలుగా నియమించి వాడ వాడలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టింది. అలాగే ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు ఇద్దరేసి మంత్రులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. దీనికి తోడు సీఎం రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు ఎన్నికల వ్యూహంపై ఇంచార్జీలుగా ఉన్న మంత్రులకు దిశ నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రతి డివిజన్లో రోడ్ షోలు నిర్వహించారు. ఏఐసీసీ పరిశీలకులు ప్రతి డివిజన్లో పర్యటించి రాష్ట్ర పార్టీకి, అధిష్టానానికి నివేదికలు పంపించడంతో పాటు లోటుపాట్లపై అప్రమత్తం చేస్తున్నారు. ఇలా ఉండగా ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం మద్దతు ప్రకటించడం, ముస్లీం మై నార్టీలకు ఈ నియోజకవర్గంలో ఉన్న అత్యధిక ఓట్లే కాంగ్రెస్ అభ్యర్థిని గట్టెక్కించేందుకు దోహదం చేస్తుందని ధీమాగా ఉంది. సెంటిమెంట్‌ను నమ్ముకున్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపినాథ్ మరణంతో ఉప ఎన్నిక రావడంతో బీఆర్ఎస్ పార్టీ ఆయన సతీమణి సునీతకు టికెట్ ఇచ్చి బరిలోకి దించింది. భర్త మరణంతో సునీతకు సానుభూతి తోడైతే సులువుగా గెలిచే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ అంచనా వేసింది. అలాగే ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయనకు ప్రజలతో ఉన్న విస్తృత పరిచయాలు తమ అభ్యర్థి సునీతకు కలిసి వస్తుందని కూడా భావిస్తోంది. శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్ నగరం మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలుపొందడంతో ఈ ఉప ఎన్నికలో కూడా అదే విధమైన ఫలితం వస్తుందని బీఆర్ఎస్ మరో అంచనా. ఈ ఎన్నికను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి డివిజన్లో రోడ్ షోలు నిర్వహించి కాంగ్రెస్ హయాంలో చోటు చేసుకున్న ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడుతూ వచ్చారు. చివరలో కాస్త పుంజుకున్న బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో పోలిస్తే బీజేపీ కాస్త వెనుకబడిందనే చెప్పవచ్చు. అయితే వారం రోజులుగా ఆ పార్టీ ప్రచారం కూడా ఊపందుకుంది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు నిర్వహించారు. ఏపికి చెందిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఆ రాష్ట్ర అధ్యక్షుడు మాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలో బీజేపీకి బలమైన నినాదం లేకపోవడంతో జిఎస్టి శాతం తగ్గింపు, ప్రధాని మోడీ పట్ల ఒక వర్గం ప్రజలకున్న అభిమానం కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. దీనికి తోడు ఇక్కడ జనసేనకు పెద్దగా బలం లేకపోయినప్పటికీ ఆ పార్టీ మద్దతు పలకడంతో పవన్‌కల్యాణ్ పై అభిమానంతో యువత ఓట్లు వస్తాయని అంచనా వేస్తోంది. వీరి అంచనాలు ఎంత మేరకు ఫలిస్తాయో ఓట్ల లెక్కింపు దాకా వేచి చూడాల్సిందే.
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రూ.60,799 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం చేపడుతోం ది. వీటితోపాటు ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో హ్యా మ్రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు అదనంగా నిధులను కేటాయించింది. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం చేపట్టనుండగా అందులో ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్‌రోడ్డు), సింగిల్ రోడ్డు ఉ న్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం, హైవేల నిర్మాణం, రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, హైదరాబాద్- టు విజయవాడ హైవే ఎనిమిది లైన్లుగా మార్చడానికి ఈ నిధులను కేటాయించింది. కేటాయింపుల్లో భాగంగా రూ.10,400 కోట్లతో హైదరాబాద్- టు విజయవాడ హైవే ఎనిమిది లైన్లుగా ప్రభుత్వం విస్తరించనుంది. రాష్ట్ర గతిని మార్చే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల కోసం రూ.36 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇక రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ రోడ్డు ఉన్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం, హైవేల నిర్మాణానికి రూ.11,399 కోట్ల నిధులను కేటాయించిన ప్రభుత్వం త్వరలోనే వాటికి టెండర్లు పిలవనుంది. అదేవిధంగా రూ.8 వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కి.మీల ఎలివేటెడ్ కారిడార్ పనులకు శ్రీకారం చుట్టనుంది. దేశానికే తలమానికంగా మారనున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేను రూ.20 వేల కోట్లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 రోడ్లు 412.17 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ రహదారులు వీటితో పాటు పలుచోట్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న రహదారుల వద్ద కూడా గ్రీన్‌ఫీల్డ్ రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలోని మధిర, -కృష్ణాపురం, -దెందుకూరు ప్రాంతంలో 13 కిలోమీటర్ల మేర 4 వరుసల ఔటర్ రింగ్ రోడ్డును రూ. 193.52 కోట్లతో నిర్మించనున్నారు. అలాగే నల్గొండ జిల్లాలోని వైద్య కళాశాల నుంచి నల్గొండ పట్టణం పరిధిలో 10 కిలోమీటర్ల 4 వరుసల బైపాస్ రోడ్డును రూ. 210.02 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదన చేశారు. నివేదికలో కొత్తగా 30 రోడ్లను 412.17 కిలోమీటర్ల మేర రూ. 1,620.86 కోట్లతో ప్రతిపాదించారు. మరో 79 రోడ్లను 1,344.70 కిలోమీటర్ల మేర రూ. 4,009.13 కోట్లతో విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో హ్యామ్ రోడ్ల నిర్మాణం వీటితో పాటు రోడ్లు-, భవనాల శాఖ రూ. 10,547.38 కోట్లతో 5,566.15 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులను 32 ప్యాకేజీలుగా విభజించి, రానున్న 30 నెలల్లో పూర్తి చేయనున్నారు. మొత్తం 400 రహదారులను 5,566.15 కిలోమీటర్ల పొడవునా రూ. 10,547.38 కోట్ల వ్యయంతో అభివృద్ధి ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విస్తృత ప్రాజెక్టును 32 ప్యాకేజీలుగా విభజించారు. ఇవి నూతన జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రంలోని 98 నియోజకవర్గాలకు ఈ విస్తరణ ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో హ్యామ్.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం కూడా గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల కోసం హ్యామ్ రోడ్ల నిర్మాణం నిమిత్తం పలు సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ. 6,294 కోట్లతో 7,449 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఈ రోడ్ల నిర్మాణాన్ని నిర్మాణ సంస్థలు 30 నెలల్లో నిర్మించి, తరువాత 15 సంవత్సరాల పాటు వాటి నిర్వహణను పర్యవేక్షించాల్సి ఉంటుంది. తొలి విడతలో రూ. 6,294 కోట్ల ఖర్చుతో 2,162 రోడ్ల నిర్మాణాన్ని పంచాయతీరాజ్ శాఖ చేపట్టనుంది. మొత్తం మీద 17 ప్యాకేజీలలో 7,449 కిలోమీటర్ల మార్గాలను పంచాయతీరాజ్ విభాగం అభివృద్ధి చేయనుంది. రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించడంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించడంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణాల్లో నిధుల విడుదలకు సహకరిస్తున్న సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో బహుళజాతి సంస్థలకు రాష్ట్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే రూ.లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు గ్రామీణ యువతకు సైతం ఉపాధి లభించబోతోందని ఆయన పేర్కొన్నారు.
ఎగిరిపడే ఖాకీల తోకలు కట్ చేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇల్లు కూల్చేస్తామని బెదిరిస్తూ బిఆర్ఎస్ నాయకులను బ లవంతంగా రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేర్చుతున్నారని బిఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కొం తమంది ఆకు రౌడీలు, గుండాలతోపాటు కొం తమంది పోలీసులు కూడా ఎగిరెగిరి పడుతున్నారని, వాళ్ల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. 500 రోజుల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం రా బోతుంది.. ఒక్కొకరి పేరు రాసి పెట్టుకుంటున్నానని, ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నవారిని రేవంత్ రెడ్డి కాదు,వాళ్ల తాత దిగొచ్చినా కాపాడలేరని అన్నారు. హిట్లర్ వంటి నియంతకు కూడా పతనం తప్పలేదని.. రేవంత్ రెడ్డి ఒక లెక్కనా అని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ కాం గ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా బిఆర్ఎస్ నేతల మీద కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శనివారం ఎర్రగడ్డ డివిజన్లో కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారుకు, బుల్డోజర్కు జరుగున్న ఎన్నిక అని, ఈ ఎన్నికలో కారు గెలిస్తే పేదల ఇళ్లకు బుల్డోజర్ రాదు అని పేర్కొనారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్ ఎప్పుడు వస్తదో తెలియని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. కత్తి ఒకరికి ఇచ్చి తమను యుద్ధం చేయమంటే సాధ్యం కాదు అని, ఈ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి సునీతను గెలిపిస్తే తాము ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టలేదు.. కానీ, హైడ్రా పేరు మీద వేల ఇండ్లు కూలగొట్టిందని మండిపడ్డారు. హైడ్రా భూతం, హైడ్రా రాక్షసి పోవాలంటే బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కేవలం పేదలను లక్ష్యంగా చేసుకుంటూ వారి ఇళ్లను కూలగొడుతున్న హైడ్రా బుల్డోజర్ పేద వాళ్ళ ఇంటికి, బస్తీల జోలికి రావద్దంటే ఈనెల 11వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా ఇండ్లను కూల్చిన సందర్భంగా పేదల పడిన బాధలను కెటిఆర్ తన రోడ్డు షోలో అందరికీ అర్థం అయ్యేలా ఎల్ఇడి స్క్రీన్లపై చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. వేల మంది ఇండ్లను కూలగొట్టి.. గూడు లేకుండా చేశారని పేర్కొన్నారు. హైడ్రా ప్రతాపమంతా గరీబోళ్ల మీదనే ఉంటుందని, హైడ్రా భూతం పోవాలంటే, హైడ్రా రాక్షసిని తరిమికొట్టాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అభివృద్ధి పేరుతో మరోసారి కాంగ్రెస్ మోసానికి చేరలేపింది అభివృద్ధి పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ మళ్లీ సిద్ధం అయ్యిందని కెటిఆర్ హెచ్చరించారు. ఇదే పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. మళ్లీ మోసపోకుండా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. ఈ నెల 14న రాష్ట్రంలో పెను తుఫాను రాబోతోందని చెప్పారు. రెండేళ్లలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధమయ్యారని తేల్చిచెప్పారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. అభివృద్ధి అంటూ కాంగ్రెస్ చెబుతున్న మాటలన్నీ అబద్దమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఒక్కసారి ఓటేసిన పాపానికి ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో కెసిఆర్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేశారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి రూ.లక్ష ఇచ్చారని.. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డ పుడితే రూ.12 వేలు.. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు అందించామని చెప్పారు. అభివృద్ధిలోనూ తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత బిఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. యాపిల్, గూగుల్. అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు నగరానికి వచ్చాయని.. వాటి ద్వారా లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పెరిగాయని తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించామని అన్నారు. కానీ, కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్‌తో పాటు హోటళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు పడిపోయాయని వెల్లడించారు. కాంగ్రెస్ నిర్వాకం వల్ల ఆటో అన్నల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. గతంలో రెండు వేలు వచ్చే ఆదాయం.. వెయ్యికి పడిపోయిందని తెలిపారు. దీనివల్ల ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. మహిళలకు తులం బంగారం ఇస్తామని.. మెడలో ఉన్న గొలుసులు కూడా లాక్కుంటున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌ను ఓడించడమే వీటన్నింటికి పరిష్కారమని అన్నారు. ఈ నెల 11న ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి.. కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మన తెలంగాణ/హైదరాబాద్:“అసలు ఆట ముందున్నది మిస్టర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డీ&మీ బెదిరింపులకు భయపడేది లేదు..” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. బ్యాడ్ బ్రదర్స్ సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదురు దాడి చేశారు. కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బ్యాడ్ బ్రదర్స్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం విమర్శించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎన్వి సుభాష్, ప్రకాష్ రెడ్డితో కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి పనులు చేసిందో చెప్పాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు బ్యాడ్ బ్రదర్స్ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. అసలు ఆట ఇంకా మొదలుకాలేదని ఆయన హెచ్చరించారు. అసలు ఆట ఏమిటో తెలంగాణ గడ్డపై చూపిస్తామన్నారు. దళితులకు ఇస్తామన్న హామీలు నెరవేర్చలేదని, మద్యం ఏరులై పారుతున్నదని, ల్యాండ్ మాఫియా, క్రిమినల్స్ రెచ్చిపోతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మజ్లీస్ పార్టీ తప్ప అన్ని పార్టీలూ తిరిగారని ఆయన విమర్శించారు. బిజెపికి బలం లేకపోతే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నేతలు తమను ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిందంటే రాష్ట్రంలో సగభాగంలో తాము అధిపత్యంలో ఉన్నట్లేనని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను లక్షంగా చేసుకుని విమర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బిఆర్ఎస్-బిజెపి కలిసి ఉందని చేస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ గతంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలూ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. ముఖ్యమంత్రి తనకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి కెటిఆర్ తమకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మీలా అవినీతి పార్టీ కాదని, లోపల ఒకటి, బయట మరొకటి చెప్పే రకం కాదన్నారు. మడమ తిప్పని పార్టీ అని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఇప్పటి వరకు చిన్న అవినీతి మరక కూడా లేదన్నారు. ఢిల్లీ స్థాయిలో బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒప్పందం చేసుకున్నారని ఆయన విమర్శించారు. బిజెపిని అడ్డుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్, కెసిఆర్ అందరూ ఒక్కటి కావాలని కెటిఆర్ సోషల్ మీడియా ద్వారా చెప్పారని ఆయన గుర్తు చేశారు. చీము, నెత్తురు ఉంటే మీ మాటలను నిరూపించాలన్నారు. కెసిఆర్ అవినీతి లక్ష కోట్లు కక్కిస్తా , బొక్కలో వేస్తా అన్న మీ మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని, ఫోన్ ట్యాపింగ్ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టు సంఘానికి వినతి తెలంగాణకు తాను అణా పైసా కూడా తేలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను విమర్శించారని ఆయన తెలిపారు. అయితే తెలంగాణ కోసం ఏమేమీ తెచ్చానో ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ చర్చను జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. చర్చ ట్యాంక్ బండ్‌పై లేదా సచివాలయం లేదా మరెక్కడైనా ‘సై’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ చర్చ నిర్వహించేందుకు జర్నలిస్టు సంఘం బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సంఘానికి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.
రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత. ప్రధానమంత్రి కావలసిన నాయకుడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి ప్రత్యర్థిగా నిలిచిన పార్టీలను సమన్వయం చేసుకుని ముందుకు పోతున్న నాయకుడు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కొద్ది రోజులనుండే ఆయన ఓట్లకు సంబంధించిన అనేక అవకతవకల మీద సీరియస్‌గా దృష్టి సారించి అధ్యయనం జరిపి పలు విషయాలు బయటికి తెస్తున్నారు.. ఒకసారి ఆటంబాబు అని, మరోసారి హైడ్రోజన్ బాంబు అని. ఈ బాంబులు ఎందుకు పేలడం లేదు? అంటే.. జనంలో ఎందుకు రావలసినంత స్పందన రావడం లేదు? స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ఎందుకు ఆయన ఆరోపణలను ఖండన ప్రకటనలతో తేలిగ్గా కొట్టిపారేస్తున్నది? నిజానిజాలను నిగ్గు తేల్చి ఆయన విమర్శలు అవాస్తవాలైతే ఎందుకు రుజువులతో జనం ముందుకు రావడం లేదు? బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పినట్టు ‘రొట్టె ఎక్కువ సమయం ఒక వైపే కాలిస్తే మాడిపోతుంది. ఇంకోవైపుకు మార్చాలి’. ఆయన బహుశా మోడీ నేతృత్వంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ కూటమి గురించి అని ఉండొచ్చు. 20 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్‌కుమార్ గురించి అని ఉండొచ్చు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న సత్యం అందరూ గుర్తించవలసిందే. ఆ లెక్కన ఎప్పుడో అప్పుడు రాహుల్ గాంధీయో, మరొకరో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండనే ఉంది. మరెందుకు రాహుల్ గాంధీ నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా జనానికి, ఎన్నికల సంఘానికి ఎక్కడం లేదు? ఆయన విమర్శలను సహేతుకంగా, శాస్త్రీయంగా, నిరాధారమైనవని నిరూపించే ప్రయత్నం ఏమాత్రం చెయ్యకుండా తేలికగా కొట్టిపారెయ్యడాన్ని జనం ఎలా అర్థం చేసుకోవాలి? తాజాగా రాహుల్ గాంధీ గత ఏడాది హర్యానా రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి జరిగిన అవకతవకలను గురించి మాట్లాడారు. ఆ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు పోలయ్యాయన్నది రాహుల్ ఆరోపణ. వాటి ద్వారా బిజెపి ఓట్లను దొంగిలించి అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ ఆయన దాన్ని ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’ అన్నారు. ఆయన ఓట్ల చోరీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈలోగా బీహార్ ఎన్నికలు కూడా వచ్చేశాయి. బీహార్‌లో కూడా ఇలా ఓట్ల చోరీ జరిగే ప్రమాదం ఉందని ఆయన అంటుండగానే అక్కడ మొన్న ఆరో తేదీన మొదటి విడత పోలింగ్ కూడా అయిపోయింది. ఎల్లుండి రెండవ, చివరి విడత పోలింగ్ కూడా ముగిసిపోతుంది. రాహుల్ గాంధీ గోడు వినడానికి, ఆయన తప్పు అని శాస్త్రీయంగా రుజువు చేయడానికి మాత్రం ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు. హర్యానాలో పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్‌కు 73 సీట్లలో, బిజెపికి 17 సీట్లలో ఆధిక్యం వస్తే, ఇవిఎం పోలింగ్ తరువాత ఫలితాలు మాత్రం వేరుగా రావడాన్ని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. హర్యానా వ్యవహారంలో రాహుల్ గాంధీ ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఆయన మాటల్లోనే ‘ఎవరీ మహిళ, ఆమె పేరు ఏమిటి? ఎక్కడినుంచి వచ్చింది? అనేవీ ఎవరికీ తెలియదు. కాని ఆమె హర్యానా ఎన్నికల్లో 22 సార్లు 10 వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసింది. సీమా, స్వీటీ, సరస్వతి, రష్మి, విమల.. ఇలా రకరకాల పేర్లతో. తీరా ఆ ఫోటోలో ఉన్న మహిళ ఏనాడూ భారతదేశంలో అడుగు కూడా పెట్టని ఒక బ్రెజిల్ మోడల్. ఒక హిందీ సినిమా టైటిల్ ‘వో కౌన్ థీ’ తరహాలో ‘ఏ కౌన్ హై’ అని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ఎన్నికల వ్యవస్థ అవకతవకల మీద చేస్తున్న మిగతా ఆరోపణలన్నీ పక్కన పెడదాం. కనీసం ఈ ఒక్క ఘటన గురించి అయినా ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుని నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయం బ్రెజిల్ మోడల్ లారిస్సా బొనెస్ దాకా వెళ్లింది. తన ఫోటో, అదీ ఎప్పుడో తాను 20 ఏళ్ల వయసులో ఉన్ననాటిది వాడుకుని ఇలా దొంగ ఓట్లు వెయ్యడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చెయ్యడమే కాకుండా చీదరించుకున్నారు కూడా. ప్రజలను మోసం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో ‘ఏ ప్రపంచంలో బతుకుతున్నాం మనం’ అని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. నిజమే, ఆ బ్రెజిల్ మోడల్ అన్నట్టుగా మనం ఏ ప్రపంచంలో అనే మాటకు ఏ కాలంలో బతుకుతున్నాం మనం అనే మాట కూడా చేరిస్తే బాగుంటుంది. ‘హెచ్‌ఫైల్’ పేరిట తమ వద్ద ఉన్న ఆధారాలను నూటికి నూరు శాతం రుజువు చెయ్యగలమని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలి. ఒక్క హర్యానాలోనే కాదు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కూడా ఇదే సమస్య ఉందని రాహుల్ చెబుతున్నారు. ఎక్కడో బ్రెజిల్లో ఉన్న మహిళ ఫోటో ఉపయోగించి 10 పోలింగ్ కేంద్రాల్లో 22 సార్లు ఓటు వెయ్యడం ఏమిటి? ఒకే వ్యక్తి ఒకే ఫోటోతో రెండు పోలింగ్ కేంద్రాల్లో 223 ఓట్లు కలిగి ఉండటం ఏమిటి? ఒకే ఇంట్లో 501 ఓట్లు నమోదై ఉండటం ఏమిటి? ఇవి అసత్యాలని రుజువు చేసే ప్రయత్నం కూడా ఎన్నికల సంఘం వైపునుండి ఎందుకు జరగడం లేదు? ఆ పని మానేసి ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) ను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నది. 2002- 2005 తరువాత ఇప్పుడు మళ్లీ రెండోసారి డూప్లికేట్, వలస వెళ్లిన, అనర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించి, ఓటు అర్హతను తనిఖీ చేసే ఆలోచనతో పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 51 కోట్ల ఓట్లను తనిఖీ చేసి ఓటర్ల జాబితాలను సక్రమ మార్గంలో పెట్టే ఆలోచనతో మొదలైన కార్యక్రమం. అయితే ఈ కొత్త ‘సర్’ మీద కూడా నీలినీడలు పరచుకున్నాయి. ఈ రెండో విడత ‘సర్’.. ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా చేయడం కాక ఎంపిక చేసిన ఓట్లు తొలగించే కార్యక్రమంగా తయారయిందని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ వంటి మేధావులు నెత్తీ నోరుకొట్టుకుని చెబుతున్నారు. ‘సర్’లో విధించిన నిబంధనలు చూస్తే అర్హులైన ఓటర్లు ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసే బాధ్యతను ఎన్నికల కమిషన్ గాలికి వదిలేసి, జాబితాలో నుండి హడావుడిగా ఓటర్లను తొలగించే పని చేస్తున్నదని వారి ఆరోపణ. తాను నిజమైన ఓటరని రుజువు చేసుకునే బాధ్యత దేశ పౌరుడి మీద వదిలెయ్యడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు వారు. నిర్ణీత సమయంలో ఎన్యూమరేషన్ ఫాంను నింపకపోతే ఓటు హక్కు కోల్పోవడం ఏమిటి? రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కు ప్రతి పౌరుడికీ అందేవిధంగా పని చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది. ఓటర్ల జాబితాలను సరిచూసేందుకు సులభమైన, పారదర్శకతతో కూడిన మార్గాలు 2003 నాటి ‘సర్’, 2016 నాటి జాతీయ ఓటర్ల జాబితా సరిచేసే ప్రక్రియ వదిలేసి ఇంత జటిలమైన, పౌర ప్రయోజనాల వ్యతిరేక పద్ధతిని అనుసరించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.ఓటు హక్కు అంటే భావ ప్రకటనా స్వేచ్ఛ అనే అర్థం. ఒక రాజకీయ పక్షం పట్ల లేదా ఒక రాజకీయ నాయకుడి పట్ల, ఆయన ఎంచుకున్న అభ్యర్థి పట్ల దేశ పౌరులు తమ భావాలను ఓట్ల రూపంలో వ్యక్తం చేసే ప్రక్రియ ఎన్నికలు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారత పౌరుడికి/ పౌరురాలికి ఓటు హక్కు తప్పనిసరిగా కల్పించాల్సిన బాధ్యత స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల వ్యవస్థ పైన ఎంత ఉంటుందో, అనర్హులు అందులోకి చొరబడకుండా చూడాల్సిన, అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అదే వ్యవస్థ మీద తప్పనిసరిగా ఉంటుంది. అటువంటి ఎన్నికల సంఘం మీద ఒక బాధ్యత గల రాజకీయ పక్షానికి నేతృత్వం వహిస్తున్న నాయకుడు నూటికి నూరు శాతం ఆధారాలు ఉన్నాయని చెబుతుంటే పిల్లలాటగా తీసి పారేయడం సమంజసం అనిపించుకోదు. అసలే ఏ ఏటికాఏడు ఓటర్లలో పెరుగుతున్న నిర్లిప్తత, ఏ కారణంవల్ల అయితేనేమీ రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఏవగింపునకు ఇదంతా తోడయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తి గడించిన భారతదేశం మరింత నవ్వుల పాలు కాక తప్పదు. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు?
మన తెలంగాణ/హైదరాబాద్ : గత వారం రోజుల వరకు రాష్ట్రాన్ని వరుణుడు వణికిస్తే, కొద్ది విరామం తరువాత రాష్ట్రంలో చలి పంజా విసరడం మొదలయింది. గత రెండు రోజులుగా చలి తీవ్రతో రాష్ట్రంలోని పలు జిల్లాలు వణికిపోతున్నాయి. ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే రాబోయే రోజులు ఏవిదమయిన ఉష్ణోగ్రతలు ఉంటాయోన ని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా రా ష్ట్రంలో రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీలు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో 14.7 ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో పాటుఆదిలాబాద్లోని భీమ్‌పూర్ 14.7, సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో 14.8, వికారాబాద్ 14.8, కొమరంభీంలో 14.8, శంకర్పల్లి 14.9, మొయినాబాద్ 15, , సంగారెడ్డిలోని జిన్నారంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శేరిలింగంపలి, రాజేంద్రనగర్, హెచ్‌సీయూలో 15.3, రామచంద్రాపురం, పఠాన్‌చెరువు, బీహెచ్ఈఎల్లో 15.5, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్‌లో 15.7, చందానగర్ 15.9, బేగంపేట 16.4, మల్కాజ్గిరి, అల్వాల్ 17.1, గాజులరామారం 17.4, గోషామహాల్, కార్వాన్ 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కాగా, ఆదివారం మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని డిజిడిజిఎస్ వెల్లడించింది. మూడు రోజులు మరింత తగ్గే అవకాశం రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని టిజిడిపిఎస్ వెల్లడించింది. కొమరం భీం జిల్లాలో అత్యధికంగా 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు ఆదివారం కామారెడ్డిలో 13.7, మెదక్‌లో 14.5, రంగారెడ్డిలో 14.8, ఆదిలాబాద్‌లో 13.5, నిజామాబాద్‌లో 13.9, వికారాబాద్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర ప్లానింగ్ డెవలెప్మెంట్ ప్లానింగ్ సోసైటీ పేర్కొంది.
క్రషర్ యంత్రానికి వెల్డింగ్ చేస్తుండగా పేలిన గ్యాస్ సిలెండర్
క్రషర్ యంత్రాన్ని వెల్డింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో సిలిండర్ పేలిన సంఘటనలో నలుగురు తీవ్రంగ గాయపడి చికిత్స పొందుతుండగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం. వట్టినాగులపల్లిలోని సపర్ణ క్రషర్ కంపనీలో వెస్ట్ బెంగాల్ కి చెందిన రూపం సాహు(20), చంచల్ కమ్రి (19), సూరజ్ సింగ్(25), పూర్ణతరై(21)లు పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి క్రషర్ యంత్రానికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌తో వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయ్యి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ నలుగురిని ఉస్మానియా దవఖానకు తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వార ఫలాలు (09-11-2025 నుండి 15-11-2025 వరకు)
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రాబడి తక్కువగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన అవకాశాలు చేజారిపోయే పరిస్థితి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది జాగ్రత్త వహించండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు ఎల్లో. వృషభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు అత్యవసరమైతేతప్ప చేయకుండా ఉండటం మంచిది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఇక కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఇంట బయట కొన్ని చికాకులు ఏర్పడతాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి కుబేర కుంకుమతో అమ్మవారిని స్వామివారిని పూజించండి. నూతనవ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రీన్. మిధున రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరుగుతుంది. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా అభివృద్ధి సాధిస్తారు. అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడతాయి. పోటీపరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. బంధు వర్గంతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. సంతాన సంబంధిత విషయం వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసివచ్చే రంగు గ్రీన్. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. చాలాకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సినీ కళా రంగాలలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. దైవ దర్శనాలు చేసుకుంటారు. విందు వినోదాలల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. భూ వివాదాలు తీరుతాయి. హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. టెక్నికల్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గో సేవ చేస్తారు. ఈరాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు తెలుపు. సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. ఏ కార్యక్రమం మొదలు పెట్టిన పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు స్నేహితులకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు అనుకున్నట్టుగా నలుగురిలో పేరు ప్రఖ్యాతలు పదిమందిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆలోచన నెరవేరుతుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటేతొలగిపోతాయి. ఈ రాశి వారికి సమయానికి ధనం చేతికి అందుతుంది. మీరు ప్రయత్నం పూర్వకంగా మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం నెరవేరుతుంది. పది మందికి సహాయం చేసే గుణం ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉన్న చిన్నపాటి ఇబ్బందులు తొలిగిపోతాయి. వ్యాపార రీత్యా రావలసిన బెనిఫిట్స్ కూడా వస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది. అదే విధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు గత వారం కంటే కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండటం మంచిది. అదేవిధంగా లాయర్స్ కి డాక్టర్స్ కి చార్టెడ్ అకౌంట్ వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్న వారికి మంచి ఉద్యోగం వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రేమ వివాహాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు పనికిరావు దాని వల్ల కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో ట్రాన్స్ఫర్ గురించి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎప్పుడో పెట్టుబడి పెట్టిన వాటికి కూడా మంచి లాభం వస్తుంది. వీరు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇస్తే తిరిగి రాదు కావున అవసరమైతే తప్ప ఎవరికీ ఇవ్వరాదు లేదంటే సేవింగ్స్ రూపంలో వెళ్లడం మంచిది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే భూమి మీద కానీ బంగారం మీద కానీ వెండి మీద కానీ పెట్టండి కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ కి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపరాధన చేయటం అలాగే మొగలి పువ్వు కుంకుమతో ఆరావళి కుంకుమ తో అమ్మవారిని స్వామివారిని ఆరాధించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. కన్యా రాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబ పరంగా లేదా సామాజికపరంగా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి పదవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అవసరమైతే తప్ప కొనకపోవడం మంచిది. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా బాగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు దేవదర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా నరాల సంబంధిత మరియు జలుబు సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడతాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. కన్సల్టెన్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అడ్మినిస్ట్రేషన్ వైద్య వృత్తిలో ఉన్నవారికి మార్కెటింగ్ పరికరాలకు సంబంధించిన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. స్టీలు మరియు ఐరన్ ఈ రంగాల వారికి చాలా బాగా అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి కొంత ఇబ్బంది కరమైన వాతావరణం ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు అవార్డులు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతాయి. ఈ రాశి వారు శివుడికి అభిషేకం కానీ ప్రతిరోజు ఓం నమశివాయ జపం 108 సార్లు కానీ చేయటం మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. భవిష్యత్తు కార్యాచరణ కోసం ఎక్కువగా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఎంత అవసరమో అంతే పెట్టుబడి పెట్టండి. క్రయ విక్రయాలకు సంబంధించిన లాభాలు కూడా బాగున్నాయి. స్థలాన్ని కానీ ఇంటిని గాని కొనుగోలు చేస్తారు. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదరటం అలాగే చేజారిపోయిన సంబంధాలు కూడా తిరిగి రావటం జరుగుతుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. మీ వల్ల పదిమందికి ఉపయోగం ఉంటుంది కానీ వారి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపరాధన చేయండి అలాగే ఉదయం సాయంత్రం ఆరావళి కుంకుమతో మొగలిపువ్వు కుంకుమతో ప్రతిరోజు స్వామివారిని అమ్మవారిని ఆరాధించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రే. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వృత్తివ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. రావలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొంతవరకు రుణాలు తీర్చగలుగుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఆరోగ్య రీత్యా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గైనిక్ మరియు గ్యాస్టిక్ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది పేరు ప్రఖ్యాతలు అధికంగా సంపాదిస్తారు. కానీ ధనం వచ్చినట్టే వచ్చి ఖర్చవుతుంది. దైవానుగ్రహం వల్ల కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశీ విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రయత్నాలు ఇప్పటినుంచే ప్రారంభించండి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. స్నేహితులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది మంచివారు ఎవరో చెడ్డ వారు ఎవరో ముందే గ్రహించండి. ఏదైనా సరే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదు జాగ్రత్త వహించాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా మీకున్న ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఈ కార్తీకమాసంలో రుద్రాభిషేకం కానీ శివ నామస్మరణ కాని చేయండి మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపరాధన చేయటం మంచిది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు బ్లూ. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ధనం అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటినుంచో పడుతున్న బాధలకు ఇప్పుడు ముగింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎక్కువగా లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి సంతానం మంచి ఆరోగ్యంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఆధ్యాత్మికంగానూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దైవ దర్శనాలు, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలు చేయగలుగుతారు. పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి. రాదు అనుకునే ధనం చేతికి అందుతుంది దాని ద్వారా శుభకార్యాలు కూడా చేస్తారు. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఒక ఇల్లు గాని ఫ్లాట్ గాని కొనుగోలు చేస్తారు. పర్సనల్ లోన్స్ కు దూరంగా ఉండటం మంచిది. పదిమందిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దక్షిణా మూర్తి రూపును మెడలో ధరించండి మంచి జరుగుతుంది. ఆరోగ్యరీత్యా ఉన్నా చిన్నచిన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ప్రేమ వ్యవహరాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకపోవటమే మంచిది. చదువు మీద శ్రద్ధ కొనసాగించండి. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. గతంలో కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు ప్రారంభించండి కాలం అనుకూలంగా ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వతులతో దీపరాధన చేయటం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు గ్రే. ధనస్సు రాశి వారికి ఈ వారం చాలు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. అందరితో కలిసి మెలిసి ఉంటూ మన పని మనం చేసుకోవటం మంచిది. ఎవరు మనవారు ఎవరు పరాయివారు తెలుసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు ముందుకు వెనక్కి ఉంటూ అంత ఆశాజనకంగా ఉండవు. వినాయకుడికి దండం పెట్టుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. ఎవరు ఎన్ని చెప్పినా మీరు సొంత నిర్ణయాలను మాత్రమే పాటించండి. విదేశీ సంబంధిత వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. పనులు నిదానంగా సాగిన చివరకు సక్రమంగా పూర్తవుతాయి ఓపిక వహించాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు పెట్టుకుంటే ఒకవేళ ఇంట్లో వారితోనే పెట్టుకోండి కలిసి వస్తాయి బయట వారితో కలిసి రావు. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కాలమని చెప్పవచ్చు. అనుకోని పదవులు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. సినీ కళా రంగాల వారికి అడ్మినిస్ట్రేషన్ వారికి ఫైనాన్సు సెక్టార్ లో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా మంచి లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించు కుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవానుగ్రహం వల్ల ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆరోగ్యరీత్యా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తొలగి పోతాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి కొంత ఊరట లభిస్తుంది. ఉద్యోగం పోతుందేమో అనుకునే వారికి స్థిరత్వం ఉంటుంది . అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా గడిచిన కొంతకాలం కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న సంబంధం కూడా కుదురుతుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్మోటిక్స్, స్టీలు రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి లాయర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నెగిటివ్ గా ఆలోచించడం మానేసి పాజిటివ్‌గా ఆలోచించి ముందుకు వెళ్ళండి అంతా మంచే జరుగుతుంది. విదేశీ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ఆర్మీలో ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు అండదండలు బాగా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతాన కోసం ప్రయత్నం చేసే వారు మంచి శుభవార్తను వింటారు. సంతానయోగం ఉన్నది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు కూడా ప్రారంభించ వచ్చు. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు గ్రే. కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు అనుకున్న పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలో మీకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. గో సేవ చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి._విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. శుభకార్యాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చు అవుతుంది. మీ కార్తీకమాసంలో ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నీవే బ్లూ. మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్థి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన విషయాలలో వాగ్దానాలు, మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు. ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు పనికిరావు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతోనువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 09-11-2025
“డిఎన్ఎ” ఆవిష్కరణ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ కన్నుమూత
డిఎన్ఎలో డబుల్ హీలిక్స్ నమూనాను ఆవిష్కరించి విశ్వవిఖ్యాత కీర్తి గడించిన ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ (97) గురువారం నార్త్‌పోర్ట్‌లో కన్నుమూశారు. ఆయన కుమారుడు డంకన్ వాట్రస్ ఈ సమాచారాన్ని ధ్రువీకరించారు. డిఎన్ఎ ఆవిష్కరణకు గాను ఫ్రాన్సిస్ క్రిక్, మారిస్ విల్కిన్స్తో కలిసి నోబెల్ బహుమతిని 1962 లో అందుకున్నారు. 1928 ఏప్రిల్ 6 న చికాగోలో జన్మించిన వాట్సన్ 19 ఏళ్లకే చికాగో యూనివర్శిటీ నుంచి జువాలజీ, ఆ తరువాత మూడేళ్లకే ఇండియానా యూనివర్శిటీ నుండి పిహెచ్డి పొందారు. 1953 లో డీఎన్ఏ డబుల్ హీలిక్స్ నమూనాను ఆవిష్కరించారు. ఇది వంశపారంపర్య సమాచారాన్ని తరాల బదిలీ చేయడానికి అనుమతించే పరమాణు నిర్మాణాన్ని వెల్లడించింది. ఈ ఆవిష్కరణకు డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రేరణగా నిలిచింది. జన్యుశ్రేణి, ఫోరెన్సిక్ విశ్లేషణ, వారసత్వ వ్యాధుల అధ్యయనానికి ద్వారాలు తెరిచింది. జన్యుపరీక్ష అభివృద్ధి నుంచి బయోటెక్నాలజీ, ఆధునిక వైద్యం వరకు ప్రతి అంశాన్ని ప్రభావితం చేసింది. జాతుల మధ్య మేధస్సు తేడాలు ఉన్నాయని, స్త్రీలపై , లింగ భేదాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2014లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన నోబెల్ బహుమతిని వేలం వేయగా రష్యా బిలియనీర్ 4.8 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి వాట్సన్‌కు సాయం అందించారు.
చంద్రయాన్ 2 అధునాతన డేటా ఇస్రో సేకరణ
చంద్రుని ధ్రువ ప్రాంతాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి చంద్రయాన్2 లూనార్ ఆర్బిటర్ నుంచి అత్యంత ఆధునిక డేటాను సేకరించినట్టు ఇస్రో శనివారం వెల్లడించింది. చంద్రుని ధ్రువ ప్రాంతాల ఉపరితలంపైని భౌతిక, విద్యుద్వాహక ప్రమాణాల లక్షణాలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి వీలవుతుందని పేర్కొంది. చంద్రునిపై భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రయోగాలకు ఈ డేటా ఉపయోగపడుతుందని వివరించింది. 2019 నుంచి చంద్రుని కక్షలో చంద్రయాన్ 2 ఆర్బిటర్ పరిభ్రమిస్తోందని, అత్యంత నాణ్యమైన డేటాను సేకరించిందని ఇస్రో పేర్కొంది. చంద్రయాన్ 2 ప్రయోగించిన దగ్గర నుంచి ఇప్పటివరకు దాదాపు 1400 రాడార్ డేటా సెట్ల సమాచారం గ్రహించడమైందని, ఉత్తర, దక్షిణ ధ్రువాల 8ం నుంచి 90 డిగ్రీల అక్షాంశాల్లో ధ్రువ మాపక నమూనా సృష్టించడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని ఇస్రో వివరించింది.
బెంగాల్ కుగ్రామంలో యువతుల పెళ్లి
పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ ప్రాంతంలో గ్రామ దేవత ఆలయం ఎదుట నిలబడి ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి నదులకు రక్షణగా ఉన్నట్లున్న దట్టమైన అడవులు. మామిడి తోటల మధ్యలో ప్రశాంతంగా ఉండే జలబేరియా తండాలో ఈ వింత వివాహ తంతు జరిగింది. శాస్త్రీయ నృత్య కళాకారిణులు యువతులు రియా సర్దార్, రాఖీ నస్కార్‌లు మనువాడారు. ఈ నెల 4వ తేదీన స్థానిక పలేరు చాక్ దేవాలయం ఆవరణలో వందలాదిగా జనం తరలిరాగా, కొందరు ఉత్సాహంగా శంఖాలు పూరిస్తూ ఉండగా, డప్పులు వాయిద్యాలు మోగిస్తూ ఉండగా , ఇంకా 20 సంవత్సరాలు కూడా రాని ఈ ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. మాంగల్యధారణ జరిగింది. రియా వధువు వేషధారణతో, రాఖీ వరుడిగా తలపాగాతో కన్పించారు. స్థానిక పూజారి ఈ పెళ్లి తంతును మంత్రాల నడుమ సంపూర్తి చేశారు. తండావారిలో అనేకలు విస్మయం చెందారు. మౌనంగా ఈ విచిత్ర వివాహాన్ని ఆమోదించారు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడ మగ భేధ భావన అనుచితం, మేమిద్దరం ఇష్టపడ్డాం. ఒక్కటి కావాలనుకున్నామని, అదే చేశామని వారు ప్రకటించారు. తాము యుక్త వయస్కులం, మేజర్లమని, తమ జీవితాన్ని తాము ఎంచుకున్నామని ఇరువురు సవినయంగా తెలిపారు. ఈ పెళ్లి గురించి తమకు ముందస్తు సమాచారం లేదని, అయినా స్థానికులు దగ్గరుండి చేయించిన పెళ్లి, ఇది ఎటువంటిది అయినా తాము చేసేది ఏమీ లేదని, పిలిస్తే తాము కూడా వెళ్లి , విందు భోజనం ఆరగించి వచ్చేవారమని స్థానిక పోలీసులు తెలిపారు
IND vs SA |మూడు ఫార్మాట్ల పోరకు సన్నద్ధం..
ఆంధ్రప్రభ : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. మరో బిగ్

26 C