SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

17    C
... ...View News by News Source

ఈ నెల 30న అఖిలపక్ష భేటీ

ఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మొత్తం 19వ తేదీ …

జనం సాక్షి 26 Nov 2025 6:29 am

నగరంలో విలువైన భూములు హాంఫట్‌

` 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్‌ పాలసీ ` రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న సిఎం రేవంత్‌ ` రాత్రికి రాత్రే బిలియనీర్‌ కావాలన్న …

జనం సాక్షి 26 Nov 2025 6:28 am

హైదరాబాద్‌ కార్పొరేటర్లకు శుభవార్త

` ప్రతి డివిజన్‌ కు రూ.2 కోట్ల అభివృద్ధి నిధులు ` జిహెచ్‌ఎంసి జనరల్‌ బాడీ తీర్మానం హైదరాబాద్‌(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు అభివృద్ధి చెందిన పౌర వసతులను …

జనం సాక్షి 26 Nov 2025 6:27 am

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు తుదిమెరుగులు

` విభాగాల వారీగా సీఎం సమావేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి):డిసెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ …

జనం సాక్షి 26 Nov 2025 6:25 am

జీహెచ్‌ఎంసీ పరిధి మరింత విస్తరణ

` 27 మున్సిపాలిటీల విలీనం ` ఓఆర్‌ఆర్‌ లోపలా, బయట ఉన్నవి విలీనం ` కొత్తగా మరో విద్యుత్‌ డిస్కమ్‌ ఏర్పాటుకు నిర్ణయం ` ఎన్టీపీసీ ఆధ్వర్యంలో …

జనం సాక్షి 26 Nov 2025 6:24 am

మోగిన పంచాయతీనగరా

` తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యుల్‌ విడుదల ` మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ ` డిసెంబర్‌ 11, 14, 17 తేదీల్లో పోలింగ్‌ ` అమల్లోకి …

జనం సాక్షి 26 Nov 2025 6:22 am

Avatar 3 |సెన్సేషన్ క్రియేట్ చేసేనా..?

Avatar 3 | సెన్సేషన్ క్రియేట్ చేసేనా..? Avatar 3, హైదరాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:14 am

సీమ రైతుకు అరటి ఆరళ్లు..

తిరుపతి (రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో : తినేవారికి తీపిని పంచే అరటిపండు పండించిన

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:04 am

జిహెచ్‌ఎంసి విస్తరణ

మన తెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట, ఓఆర్‌ఆర్‌ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) జిహెచ్‌ఎంసిలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆ మోదం తెలిపింది. అందుకు అవసరమై న జీహెచ్‌ఎంసీ యాక్ట్, తెలంగాణ ము న్సిపల్ యాక్ట్‌లకు సవరణలు చేసేందు కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసిలోకి విలీనం చేయాలని జీహెచ్‌ఎంసి కౌన్సిల్ ప్రతిపాదించడంతో దీనిపై స్టడీ చేసి సమగ్రమైన రిపోర్టు అందించాలని కౌన్సిల్‌ను మంత్రివర్గం ఆదేశించింది. మేడ్చల్ మ ల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కు చెందిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు విలీనమయ్యే 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్)లకు సంబంధించి మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 4 మున్సిపల్ కార్పొరేషన్‌లు, 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపల్ కార్పొరేషన్‌లు, 8 మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీలు కలిపి 27 మొత్తంగా జీహెచ్‌ఎంసిలో విలీనం చేయనున్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3,000 మెగా వాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. అయిదేళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ భేటీలో భాగంగా హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడున్న ఎన్‌పిడిసిఎల్, ఎస్‌పిడిసిఎల్‌లతో పాటు కొత్తగా మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లన్నీ ఈ కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, రాబోయే పదేళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంచనాలపై కేబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్ విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను పరిశీలించింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. అయిదేళ్ల కాల పరిమితితోనే ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో పలు చోట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలున్నాయి. పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కమ్‌ల వద్ద ఉన్న ఎంఓయూలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 వేల మెగా వాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయిం చింది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయించి, నీళ్లను అందిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ ను ముందుగా మన డిస్కమ్‌లకే అమ్మాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. కొత్త పరిశ్రమల యాజమాన్యాలు క్యాప్టివ్ పవర్ జనరేషన్‌కు రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్‌ను తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్త పరిశ్రమల యాజమాన్యాలు క్యాప్టివ్ పవర్ జనరేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది. పాల్వంచ, మక్తల్‌లోనూ ఎన్టీపిసి అధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ ను ఎన్టీపిసి అధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాల్వంచ, మక్తల్‌లోనూ ఎన్టీపిసి అధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఎన్టీపిసికి ఈ యూనిట్ నిర్మాణం అప్పగిస్తే ఎంత విద్యుత్ యూనిట్ రేట్ పడుతుంది, జెన్ కో ద్వారా చేపడితే ఎంత రేట్ పడుతుందో ముందుగా అంచనాలు వేసుకొని తుది పరిశీలన చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగుళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఉంది. ఇటీవలే అక్కడ అమలు చేసిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జిహెచ్‌ఎంసి పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు రూ. 14 వేల 725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిళ్ల వారీగా మూడు విభాగాలుగా విభజించుకొని ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌తో పాటు టి ఫైబర్, వివిధ కేబుల్ నెట్‌వర్క్ వైర్లన్నీ అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీ లతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల స్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటిసిలతో పాటు కొత్తగా 6 ఐటీఐల్లో ఏటిసిలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 

మన తెలంగాణ 26 Nov 2025 6:00 am

ఒకే వరలో రెండు కత్తులు... ఇదేం ‘పంచాయతీ’?

ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిస్థితి అలాగే ఉంది. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నదన్న నేపథ్యంలో మన పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఉన్నంత గందరగోళంగా ఏ రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు. ఒకేవరలో రెండు కత్తులు ఇమడలేని విధంగా మన పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒకే అధికార పరిధిలో రెండు పదవులు సృష్టించి అధికారులు, ప్రభుత్వాలు తమాషా చూస్తున్నారు తప్ప మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలో అధికార విభజన సమస్యలు లేకుండా చూసేందుకు ఇష్టపడడం లేదు? ఉన్న లోపభూయిష్టమైన పంచాయతీ రాజ్ వ్యవస్థ స్వరూపాన్ని మూడంచెల అధికారస్థాయిగా వికేంద్రీకరణ చేయడానికి బదులు, నాలుగు అంచెలుగా అస్తవ్యస్త అధికార విభజన చేయడంతోపాటు, అధికార విభజనలో అస్పష్టతతో చోద్యం చూస్తున్నారు. ఒకే అధికార పరిధిలో రెండు పదవులు పెట్టి రాజకీయ సవతి పోరుకు తెరలేపడమేకాక, ఒకే అధికార పరిధిలో రెండు ఎన్నికలను జరిపి, ఎన్నికల పేరుతో ఎంతో ప్రజాధనం వృథా చేస్తున్నారు. అదేమిటో పరిశీలన చేద్దాం. వాస్తవంగా గ్రామ సర్పంచ్, మండలం ప్రాదేశిక నియోజకవర్గం సభ్యుల (ఎంపిటిసి) అధికార పరిధి ఒక్కటే, అయితే, పదవులే వేర్వేరు. ఎన్నికలు మాత్రం రెండు పదవులకు జరగాలి. సర్పంచ్, ఎంపిటీసి ఇద్దరూ ఒకే మండల పరిషత్తులో సభ్యులుగా ఉండి ఆయా గ్రామాల నుండి ద్విప్రాతినిధ్యం వహించుతారు. ఎవరు సమావేశంలో సమస్య లేవనెత్తినా ఒక్కటే అంశం. ఇకపోతే మండల స్థాయిలో మండల పరిషత్తు అధ్యక్షుడు, జిల్లా ప్రాదేశిక నియోజికవర్గం సభ్యులది ఒకే అధికార పరిధి. అంతేకాదు ఒకే మండలం నుండి జిల్లా పరిషత్తులో రెండు ప్రాతినిధ్యాలు అవసరమా? అంతేకాదు, మండలంలో ఎంపిటిసి, జిల్లాలో జడ్‌పిటిసిలకు మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వరకే ప్రాధాన్యత ఉంటుంది. అటుతర్వాత వారి అధికారాలు తాలింపులో కరివేపాకు మాదిరే! ఇకపోతే గ్రామ స్థాయిలో సర్పంచ్, ఎంపిటిసి ఎన్నిక, మండలస్థాయిలో జెడ్‌పిటిసి, మండల పరిషత్తు ఎన్నికల వలన రెండు ఎన్నికల నిర్వాహణ ఖర్చుతోపాటు, ఐదేండ్ల పాటు ఎంపిటిసి, సర్పంచ్, జెడ్‌పిటిసిలకు నెల సరిగా ఇచ్చే గౌరవ వేతనం, సౌకర్యాలు కల్పనకు అవుతున్న ఖర్చు ప్రజలపైనే అదనపు భారం మోపుతున్నారు తప్ప నిక్కచ్చిగా మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్మాణం, ఎన్నికల పద్ధతి మార్పు చేసుకుంటే! ఈ అధికార విభజన గందరగోళం, ఎన్నికలు, గౌరవ వేతనం పేరుతో చేసే ఖర్చులు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఒకసారి మన మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులను పరిశీలన చేసినట్లైతే మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంత గందరగోళంగా ఎందుకు తయారైంది? అనే అంశం అవగతం అవుతుంది. మనకు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1955లో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థకు రూపకల్పన చేసి, అధికార విభజన కూడా చేశారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎన్నికల ద్వారా ఎన్నిక అవుతారు. ఎన్నికైన సర్పంచ్‌లు బ్లాక్ అధ్యక్షుడును పరోక్ష పద్ధతిలో ఎన్నిక అవుతారు. ఈ బ్లాకు అధ్యక్షులు అందరూ కలిసి పరోక్ష ఎన్నిక ద్వారానే జిల్లా పరిషత్తు చైర్మన్‌ను ఎంపిక చేసుకునేవారు. అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్షంగా జరిగితే, పరోక్షంగా బ్లాకు, జిల్లాస్థాయి ఎన్నికలు అన్ని పూర్తి అయ్యేవి. అటు తర్వాత 1970 దశకంలో మాధ్యమిక వ్యవస్థ అయిన బ్లాకు స్థానంలో పంచాయతీ సమితి ఏర్పాటు చేశారు. ఇక 1977 నుండి 1987 మధ్య అనేక మార్పులు జరిగాయి. పంచాయతీ సమితి అధ్యక్షుడు, జిల్లా పరిషత్తు చైర్మన్ ఎన్నిక పరోక్ష ఎన్నిక నుండి ప్రజలే నేరుగా ఎన్నుకునే విధంగా ఎన్నికల విధానం మార్చారు. అటు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్‌టిఆర్ అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీ రాజ్, రెవెన్యూ వ్యవస్థ స్వరూపం మార్చివేశారు. పాలనా సౌలభ్యం పేరుతో పంచాయతీ సమితి వ్యవస్థను రద్దుచేసి మండలం ప్రజాపరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు పేర్లతో నామకరణం చేశారు. మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్తు అధ్యక్షుడు ఎన్నికకు నేరుగా ఎన్నికలు జరిపించారు. అటు తర్వాత ఆయనే మండల ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపిటిసి) జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్‌పిటిసి) లుగా విభజించి ఎన్నికలు జరిపించారు. దీనితో మూడంచెల వ్యవస్థ కాస్తా గందరగోళంగా మారిపోతుంది. అటు తర్వాత 1992 లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా, రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్ ఆర్టికల్ 243 ననుసరించి స్థానిక స్వపరి పాలనా సంస్థలకు స్వయం పాలనా హక్కుగా గిరిజనులకు పీసా చట్టం లాంటి హక్కులు సంక్రమింపజేయడంతో మన స్థానిక స్వపరిపాలన వ్యవస్థ బలోపేతం అయింది. అయితే ఎంపిటిసి, జెడ్‌పిటిసి, సర్పంచ్‌లకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపి, ఎంపికైన వారి ద్వారా పరోక్ష ఎన్నిక ద్వారా మండల పరిషత్తు, జిల్లా పరిషత్ అధ్యక్షులు ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత 2018లో కెసిఆర్ నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని తెచ్చినప్పటికీ తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడంతప్ప అందులో కొత్తదనం పెద్దగా ఏమీ లేదు. ఉన్న ఎన్నికల విధానాన్నే యథాతథంగా కొనసాగిస్తూ వచ్చారు. ఫలితంగా పంచాయతీ, మధ్యమ స్థాయి, ఉన్నత స్థాయి లో రెండు రకాల ప్రజాప్రతినిధులు వ్యవస్థలు వచ్చి గందరగోళంగా, ప్రజలకు భారంగా మారింది. వాస్తవంగా గ్రామ సర్పంచ్, ఎంపిటిసి ఎన్నికల పరిధి దరిదాపు ఒక్కటే! ఇక అధికారాలు విషయానికి వేస్తే ఎంపిటిసిలకు మండలాధ్యక్షుల ఎంపిక, తొలగింపు అంశాలలో ప్రాధాన్యత తప్ప గ్రామ పంచాయతీపై మరే అధికారాలు లేవు. ఇక సర్పంచ్ గ్రామ పరిపాలనపై పూర్తి ఆధిపత్యం ఉంటుంది. మండల పరిషత్తు సమావేశంలో పాల్గొనే హక్కు ఉంటుంది కానీ, ఓటింగ్ విషయంలో, బిల్లుల, బడ్జెట్ ఆమోదం లాంటి ఎలాంటి హక్కులు లేకపోవడం వలన, మండల పరిషత్తు సమావేశంలో తమ సమస్యలు ప్రశ్నించడం తప్ప, మండల అధ్యక్షుడు, అధికారులను నియంత్రణ చేసే ఎలాంటి అధికారం లేని నామమాత్రపు సభ్యులుగా సర్పంచ్‌లు మండల పరిధిలో ఉంటారు. ఇక జిల్లా స్థాయి లో కూడా అదే పరిస్థితి ప్రత్యేకంగా ఎన్నికైన జెడ్‌పిటిసి సభ్యులు జిల్లా పరిషత్తు చైర్మన్ ఎన్నిక చేసే, లేక అవిశ్వాసం పెట్టగల అధికారం కలిగి ఉంటారు. ఇక జిల్లా పరిషత్తు సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షలు పాల్గొన్నా, మండలంలో సర్పంచ్‌లు ప్రాతినిధ్యం మాదిరే ఇక్కడ మండలం అధ్యక్షుడు అధికారాలకు కత్తెర వేయబడుతుంది. అంటే దీన్ని బట్టి మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికల విధానం, అధికారాల విభజన, అధికార పరిధి అంతా గందరగోళంగా మార్చివేశారు. ప్రభుత్వాలు మారుతున్నా అదే అధికార విభజన, అదే ఎన్నికల విధానం తప్ప అనర్థదాయకం అయిన, ఖర్చుతో కూడిన ఎన్నికల విధానం సంస్కరణ చేద్దామనే ఆలోచనకు ఎవరూ సాహసించడం లేదు. ఒక్క గ్రామ పంచాయతీ ఎన్నిక ప్రత్యక్షంగా నిర్వహిస్తే, పరోక్ష ఎన్నికల ద్వారా మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్మాణం అయ్యే అవకాశం ఉన్నా కొత్త ఒక వింత పాత ఒక రోతలాగా మన పంచాయతీ రాజ్ వ్యవస్థను చూస్తూ, అధికారాలు విభజన గందరగోళం, మూడంచెల వ్యవస్థకు బదులు, ఆరో వేలులాగా నాలుగంచెల వ్యవస్థను ఏర్పరచి చేతులు దులిపేసుకుంటున్నారు. కనుక స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ప్రాధాన్యత ఇటీవల కాలంలో పెరిగింది. పనికి ఆహార పథకం, సమీకృత గ్రామీణ అభివృద్ధి నిధులుకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యం, పచ్చదనం పేరుతో గ్రాంట్లు విడుదల చేయడంతో కాస్తా గ్రామీణ ప్రాంతం రూపురేఖలు మారాయి. వైకుంఠధామాలు, రైతువేదికలు, సచివాలయాలు, క్రీడా ప్రాంగణాలు, పారిశుద్ధ్య సిబ్బంది, సిమెంట్ రోడ్లు లాంటి సౌకర్యాలు మెరుగైన నేపథ్యంలో మన స్థానిక స్వపరిపాలన సంస్థల్లో స్పష్టమైన మార్పులు చేయడం, తప్పులు సరిదిద్దడం, స్పష్టమైన అధికార విభజన చేయడం అత్యవసరమే! అందుకు వివిధ రాష్ట్రాలలో ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్థ అధ్యయనం ఎంతో కొంత తోడ్పడే అవకాశం ఉంది. స్థానిక స్వపరిపాలన వ్యవస్థను సరైన మార్పులు తో పటిష్టం చేయవలసిన కనీస బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ఎన్ తిర్మల్ 94418 64514

మన తెలంగాణ 26 Nov 2025 6:00 am

నితీశ్ ప్రభుత్వం నిలకడగా సాగేనా?

ఇరవైఏళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతతో, వయస్సు పైబడి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న నితీశ్‌కుమార్ మరోసారి బీహార్‌లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసంభవం అని ఎన్నికల ముందు చాలామంది అంచనా వేశారు. అయితే ఎవ్వరూ ఊహించని రీతిలో ఘనవిజయం సాధించడమే కాకుండా, ప్రతిపక్షాల ఉనికిని ప్రశ్నార్థకం కావించారు. 2025 బీహార్ ఎన్నికల పోరాటంలో నితీశ్ నాయకత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఎన్నడూలేని విధంగా సంపూర్ణ మద్దతు అందించారు. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు కేవలం నితీశ్ రాజకీయ భవిష్యత్‌ను మాత్రమే కాకుండా తన రాజకీయ భవిష్యత్‌పై సైతం కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. బహుశా నితీశ్‌కు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు. ఫలితాలు రాగానే ప్రధానితో కనిపించిన ఉత్సాహం, మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలిపిన విధానం చూస్తే గతంలో ఆయన ఆ విధంగా వ్యవహరింపలేదని గుర్తింపవచ్చు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి 400 సీట్లు గెలిపించబోతున్నట్లు దేశమంతా ప్రచారం చేసుకుంటే, 240కు మించి సీట్ల సాధించలేకపోయారు. మోడీ ‘ప్రజాకర్షణ’ ఓవిధంగా మసకబారింది. ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలలో బిజెపి ఘనవిజయాలు సాధించినా అందుకు ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్రస్థాయిలో అమలు చేసిన వ్యూహాలే ఎక్కువ కారణంగా అందరూ భావించారు. బీహార్‌లో గెలుపు సాధింపలేకపోతే ఇక ఓటర్లపై ‘మోడీ ఆకర్షణ’ ప్రభావం ఉండబోదనే నిర్ణయానికి దేశంలో అందరూ వచ్చే ప్రమాదం ఉంది. ముందుగానే ఈ ప్రమాదం గుర్తించడంతో, గత ఎన్నికలలో చిరాగ్ పాశ్వాన్‌ని చీల్చి, నితీశ్ పార్టీ పోటీచేస్తున్న సీట్లలో అభ్యర్థులను నిలబెట్టి ఆ పార్టీ అతి తక్కువ సీట్లు గెలుపొందేటట్లు చేశారు. ఈసారి కూడా ప్రశాంత్ కిషోర్‌తో జట్టుకట్టి నితీశ్‌ను ఓడించేందుకు చిరాగ్ సిద్ధ్దమవుతున్న సమయంలో బిజెపి కట్టడిచేసింది. గతంలో ఎన్‌డిఎ నుండి విడిపోయిన వారిని తిరిగి తీసుకొచ్చి అభేద్యమైన కూటమిని ఏర్పాటు చేసి, చెల్లాచెదురైన ఇండియా కూటమిని చిత్తు చేయడంలో బిజెపి ప్రత్యేక శ్రద్ద చూపింది. గతంలో మాదిరిగా జెడి(యు)ను మరింత బలహీనంగా చేస్తే మోడీ నాయకత్వంకే ముప్పు అని భయపడ్డారు. దానితో ఆ పార్టీ స్థానాల సంఖ్య రెట్టింపు అయింది (2020లో 43 సీట్ల నుండి 2025లో 85 సీట్లకు). బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినా ఆ పార్టీ స్థానాల సంఖ్య 74 నుండి 89కి మాత్రమే పెరిగాయి. మహిళలు, ఇబిసిలు, మహాదళితులలో నితీశ్ ఇప్పటికీ ఎదురులేని మద్దతు పొందుతూ ఉండడంతో ఆయన నాయకత్వానికి మద్దతు ఇస్తూ, ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగించక తప్పని పరిస్థితులు బిజెపికి ఏర్పడ్డాయి. 2014 ఎన్నికల ముందు కేవలం మోడీ నాయకత్వానికి మద్దతు ఇవ్వలేకనే ఎన్‌డిఎకు దూరమైన నితీశ్ కుమార్, ఇప్పుడు మోడీ నాయకత్వం జాతీయ స్థాయిలో బలపడేందుకు కీలకమైన వ్యక్తిగా మారారు. గత ఏడాది జనవరిలో లోక్‌సభ ఎన్నికల ముందు కూడా ఇండియా కూటమి నుండి నితీశ్ ఎన్‌డిఎ కూటమిలోకి మారకపోయి ఉంటే, మోడీ మూడోసారి అధికారంలోకి రావడం ప్రశ్నార్థకంగా మారి ఉండెడిది. బిజెపి సీట్ల సంఖ్య 240 నుండి మరింతగా తగ్గిపోయి ఉంటే ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు మోడీ వెనుకడుగు వేసి ఉండేవారని చాలామంది భావిస్తున్నారు. బీహార్ లోని 40 సీట్లలో 30 సీట్లను నితీశ్ రావడంతో ఎన్‌డిఎ గెల్చుకుంది. ఆ విధంగా మోడీని రాజకీయంగా నితీశ్ రెండు సార్లు ఆదుకున్నారని చెప్పవచ్చు. అసలు మోడీకి వ్యతిరేకంగా బిజెపియేతర పక్షాలను ఓ వేదికపైకి తీసుకు వచ్చి, ఇండియా కూటమి ఏర్పాటుకు బలమైన కృషి చేసింది నితీశ్ కావడం గమనార్హం. దానితో సహజంగానే ఆయన ఆ కూటమికి నాయకత్వం వహించాలని ఆశించారు. అయితే, అదే జరిగితే ఆయనే కాబోయే ప్రధాని అభ్యర్థి కాగలరనే భయంతో ఒకవంక రాహుల్ గాంధీ, మరోవంక మమత బెనర్జీ అడ్డుతగలడంతో ఆయనకు ఆ కూటమి నుండి బైటకురాక తప్పలేదు. ఆ విధంగా ప్రధాని అభ్యర్థిగా దాదాపు దశాబ్దంపాటు ప్రచారంలో ఉన్న నితీశ్ తన రాష్ట్రానికి పరిమితం కావలసివచ్చింది. గతంలో సైతం కాబోయే ప్రధానిగా ప్రచారం పొందిన సర్దార్ పటేల్, ఎన్‌డి తివారి, శరద్‌పవర్, ఎల్‌కె అద్వానీ, ప్రణబ్ ముఖర్జీ వంటి వారు రాజకీయంగా ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చింది. అయితే నితీశ్ స్వరాష్ట్రంలో తన పట్టును మాత్రం నిలబెట్టుకుంటూ వచ్చారు. నితీశ్‌ను ఇండియా కూటమి నుండి వెళ్లకుండా అడ్డుకోగలిగి ఉంటె బిజెపి సీట్ల సంఖ్య మరింతగా తగ్గిఉండెడిది. నితీశ్ రాకతో సీట్లు 240కు తగ్గినా, నితీశ్, చంద్రబాబు నాయుడుల కీలక మద్దతుతో మరోసారి మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. నితీశ్‌ను కోల్పోయిన కారణంగానే ఇండియా కూటమి బీహార్‌లో సైతం ఘోర పరాజయం ఎదుర్కోవలసి వచ్చింది. తనకు ప్రతికూలంగా మారిన పరిస్థితులను సైతం సానుకూలంగా మార్చుకోవడంలో బిజెపి కొంతకాలంగా రాటుతేలుతుంది. అదే కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల్లో విజయంకోసం కన్నా తమ కుటుంబం పట్టు కాపాడుకొనే ప్రయత్నంలో రాజకీయంగా వరుస పరాజయాలకు గురికావాల్సి వస్తుంది. బీహార్ ఫలితాలతో ఇండియా కూటమి రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూటమికి ఓ నాయకత్వం గాని, అజెండా గాని, కనీసం తరచూ సమావేశాలు జరుపుతూ ఉండటం గాని లేకుండాపోయింది. చివరకు పార్లమెంట్ సమావేశాల్లో చెప్పుకోదగిన ఉమ్మడి ప్రయత్నాలు కూడా కనిపించడం లేదు. బీహార్ ఎన్నికల ఫలితాలు రాగానే ప్రధాని మోడీ ప్రసంగం వింటే కాంగ్రెస్‌కు, ప్రాంతీయ పార్టీలు మధ్య మరింత అగాధం పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.బిజెపి కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవాలలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ‘ప్రతికూల రాజకీయాల్లో’ మునిగిపోవద్దని, దాని నుండి దూరంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ తన మిత్ర పార్టీల ఓటు బ్యాంకులను మింగేసే ‘పరాన్నజీవి’ అని ఆయన హెచ్చరించారు. కొద్దీరోజులలో కాంగ్రెస్ పార్టీలో మరో చీలిక అనివార్యం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జరుగబోయే రాష్ట్రాలలో కాంగ్రెస్, -బిజెపియేతర పార్టీలు బలమైన ఉనికి కలిగి ఉండడంతో కాంగ్రెస్ గురించి ప్రాంతీయ పార్టీలను హెచ్చరించే ప్రయత్నం చేశారు. టిఎంసి పాలిత పశ్చిమ బెంగాల్, డిఎంకె పాలిత తమిళనాడు, వామపక్ష పాలిత కేరళలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పుడు బిజెపి ప్రధానంగా బీహార్ తర్వాత బెంగాల్ పై దృష్టి సారిస్తోంది. అక్కడ టిఎంసితో కాంగ్రెస్ చేతులు కలపకుండా నివారించే ప్రయత్నంచేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. మరోవంక, ఇంతటి ఘనమైన విజయం సాధించినా బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని భావించలేం. వచ్చే ఐదేళ్లలో అక్కడ ఎన్ని రాజకీయ మార్పులైనా జరిగే అవకాశం లేకపోలేదు. బీహార్‌లో తమ నేత ముఖ్యమంత్రి కావాలని బిజెపి బహిరంగంగానే తమ లక్ష్యాన్ని వెల్లడిస్తూ వస్తుంది. కీలకమైన హోం మంత్రిత్వ శాఖను ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి దక్కించుకోవడం ద్వారా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రజలలో ఆయనకు గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం ప్రారంభమైనదని చెప్పవచ్చు. నితీశ్ కుమార్ గెలుపుకు ప్రధానమైన కొన్ని సామాజిక వర్గాలలో ఆయనపట్ల తిరుగులేని నమ్మకం ఏర్పడటంతో పాటు పరిపాలన దక్షుడిగా, ‘జంగిల్ రాజ్’ లో శాంతిభద్రతలు కొనసాగేటట్లు చేయడం, మహిళల సంక్షేమంపట్ల ప్రత్యేక దృష్టి సారించడం ప్రధాన కారణం అన్నది అందరికీ తెలిసిందే. పైగా, సుదీర్ఘకాలం కులాల సమీకరణలో రాజకీయాలు కేంద్రీకృతం అయిన రాష్ట్రంలో మొదటిసారి మహిళా సంక్షేమం, యువత, ఉద్యోగాలు వాటిని సామాజిక అంశాలను ప్రధాన రాజకీయ అజెండాగా మార్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఈ విషయంలో ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ సొంత పార్టీలోనే విశ్వాసం పొందలేకపోయారు. ఇప్పటికే పరిపాలనలో మంచి అనుభవం ఉన్న ఇబిసి వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి హోం మంత్రిగా శాంతిభద్రతల విషయంలో సైతం చెరగని ముద్ర వేసేటట్లు చూడటం ద్వారా బీహార్ ప్రజలలో ప్రజాకర్షణ గల నాయకుడిగా ఎదిగే విధంగా బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. అది జరిగితే, జెడి(యు)లో చీలిక తీసుకురావడం, నితీశ్ కుమార్ ను ఒంటరి చేయడం పెద్ద కష్టం కాబోదు. ఇప్పటికే జెడి(యు) నాయకులు అనేకమంది బిజెపికి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ప్రజావ్యతిరేకత రానివిధంగా బీహార్‌లో పాగావేయాలని బిజెపి వ్యూహంగా కనిపిస్తుంది. చలసాని నరేంద్ర, 98495 69050

మన తెలంగాణ 26 Nov 2025 5:50 am

HYD |ఈ ఏరియాలో క‌రెంట్ క‌ట్ !!

HYD | ఈ ఏరియాలో క‌రెంట్ క‌ట్ !! మియాపూర్‌, (ఆంధ్రప్రభ) మియాపూర్‌

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:50 am

Parliament |డిసెంబర్‌ 1 నుంచి పార్లమెంట్‌

Parliament | డిసెంబర్‌ 1 నుంచి పార్లమెంట్‌ Parliament | డిసెంబర్‌ 1

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:42 am

రాజ్యాంగమా.. నీకు సెల్యూట్

అణగారిన వర్గాలనుండి వచ్చినవారు రాష్ట్రపతి వంటి అత్యున్నత స్థానాన్ని అధిరోహించగలుగుతున్నారంటే అది కేవలం రాజ్యాంగ చలువేనని, మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతంలో జన్మించి దేశ న్యాయ వ్యవస్థలోని అత్యున్నత స్థాయికి ఎదిగిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అనడాన్ని బట్టి రాజ్యాంగ ప్రాముఖ్యత మనకు అవగతం అవుతుంది. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో దోపిడీకి గురియై అస్తవ్యస్తమైన ఈ భారతదేశం స్వాతంత్య్రానంతరం ఏకతాటిపై నడిపించడానికి రాజ్యాంగం కీలకభూమిక వహించింది. దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించి స్వీకరించారు. అనంతరం 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే రాజ్యాంగం పుట్టిన నవంబర్ 26ని గుర్తు పెట్టుకోవాలని ఆలోచన 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్.ఎం. సింగ్వికి వచ్చింది. దీంతో నవంబర్ 26ను న్యాయవాద దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ భారత ప్రభుత్వం 2015లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించింది. అప్పటినుంచి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగ దినోత్సవం రోజున పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. చిన్నప్పటినుంచి అంబేద్కర్ కష్టపడి ఎలా చదువుకున్నారో ఈ రోజుల్లో చాలామందికి తెలియదు. అందువల్ల ఆ అంశాలను విద్యార్థులు, ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకొని ఈ ఏడాది నవంబర్ 26 కు 76ఏళ్లు పూర్తవుతోంది. ఎన్నో సంవత్సరాల నాగరికత కలిగిన భారతదేశానికి ఏడున్నర దశాబ్దాలు పెద్ద విషయం కాదు. కానీ పరాయి పాలననుంచి విముక్తి పొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనకు ఎంతో గర్వకారణం. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారని తెలిసిన తర్వాత రాజ్యాంగ రచనకు సన్నాహాలు జరిగాయి. ఇందుకోసం రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. ఇందులో 15 మంది మహిళలతోపాటు 299 మందిని సభ్యులుగా నియమించారు. తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. రాజ్యాంగ పరిషత్‌కు డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా, రచనా కమిటీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సారధ్యంలో ఏర్పడింది. కమిటీలో ఆరుగురు సభ్యులున్నారు. కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. 299 మంది సభ్యులు ఉండగా తుది ప్రతి మీద మాత్రం 284 మంది సంతకం చేశారు. 1947 నవంబర్ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం లభించింది. అయితే 1930 జనవరి 26ను కాంగ్రెస్ భారతదేశానికి పూర్ణ స్వరాజ్ దివస్‌గా తీర్మానించింది. జనవరి 26వ తేదీకి చిరస్థాయి కీర్తి అందించుటకుగాను 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. గత 76 సంవత్సరాలుగా దేశాన్ని అఖండంగా ఉంచటం రాజ్యాంగం సాధించిన ఘనవిజయం. విచ్ఛిన్నకరశక్తులు లౌకిక ఐక్యతను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ వారు కృతకృత్యులు కాలేకపోవడం ఒక ప్రగతి. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటం శుభపరిణామం. సాంఘిక, ఆర్థిక, సమానత్వం లేకుండా రాజకీయ సమానత్వం సాధించలేమని, జాతి నిర్మాణంలో సమాజంలోని అన్ని వర్గాలు పాల్గొనాలన్న అంశం ఆధారంగా రాజకీయ సమానత్వం సాధించాలన్నదే బి.ఆర్ అంబేద్కర్ ఆకాంక్ష. భారత ప్రజలమైన మేము అంటూ రాసుకున్న రాజ్యాంగం ఏదో కొన్ని నియమ నిబంధనల పుస్తకం కాదు. స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సమున్నత విలువలతో ప్రజల ఆశలు ఆశయాలకు ప్రతిరూపంగా ఉంటూ, ఆసేతుహిమాచలం, ఆబాలగోపాలం సమైక్యంగా పురోగమించాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని మున్ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత భారత పౌరులమైన మన అందరిదీ. ములక సురేష్, 94413 27666

మన తెలంగాణ 26 Nov 2025 5:40 am

Tandur |జోరుగా ఇసుక అక్రమ రవాణా …

Tandur | జోరుగా ఇసుక అక్రమ రవాణా … తాండూరు రూరల్‌, (ఆంధ్రప్రభ)

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:36 am

మంత్రి దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు

మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు. విశాలాంధ్ర – కడియం : రేషన్ డీలర్స్ కు ప్రస్తుతం ఇచ్చే ఒక రూపాయి కమిషన్ షాపు నిర్వహణకే సరిపోతుందని తూర్పుగోదావరి జిల్లా రేషన్ డీలర్స్ అధ్యక్షులు రాజు అన్నారు. రేషన్ డీలర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని, డీలర్స్ తో త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారని, త్వరలోనే […] The post మంత్రి దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:31 am

సంగ్రామం షురూ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నగా రా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం అడిషనల్ డిజిపి మహేష్ భగవత్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన, కార్యదర్శి మకరందు తదితరులతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఇసి) రాణికుముదిని పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఎ న్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. డిసెంబర్ ర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని వెల్లడించారు. గత సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించామని, కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్‌పై హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ఓటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం (నవంబర్ 27) నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనునున్నట్లు చెప్పారు. అలాగే రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరణ ఉంటుందని తెలిపారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లో నోటా గుర్తు ఉంటుందని తెలిపారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా గ్రివియెన్స్ విభాగం రూపొందించినట్లు కమిషనర్ రాణికుముదిని తెలిపారు. త్వరలో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఫోన్ నెంబర్ 9240021456కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. తొలి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు పోలింగ్ నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 27 స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 29 పరిశీలన: నవంబర్ 30 నామినేషన్ల ఉపసంహరణ-: డిసెంబర్ 3 ఎన్నికల తేదీ, ఫలితాలు- : డిసెంబర్ 11(ఉ.7 నుంచి మ. 1 వరకు) రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు 38,350 వార్డులకు పోలింగ్ నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 30 స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 2 పరిశీలన: డిసెంబర్ 3 నామినేషన్ల ఉపసంహరణ-: డిసెంబర్ 6 ఎన్నికల తేదీ, ఫలితాలు- : డిసెంబర్ 14(ఉ.7 నుంచి మ. 1 వరకు) రెండో విడతలో 4,150 సర్పంచ్ స్థానాలకు 36,452 వార్డులకు పోలింగ్ నామినేషన్ల స్వీకరణ: డిసెంబర్ 3 స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 5 పరిశీలన: డిసెంబర్ 6 నామినేషన్ల ఉపసంహరణ-: డిసెంబర్ 9 ఎన్నికల తేదీ, ఫలితాలు- : డిసెంబర్ 17(ఉ.7 నుంచి మ. 1 వరకు) మొత్తం గ్రామపంచాయతీలు : - 12,728 మొత్తం వార్డుల సంఖ్య -: 1,12,242 తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య - 16,655,186 పురుష ఓటర్లు -: 81,42,231 మహిళా ఓటర్లు - : 85,12,455 ఇతరులు : 500

మన తెలంగాణ 26 Nov 2025 5:30 am

Medak |వెూగిన ఎన్నికల నగారా..

Medak | వెూగిన ఎన్నికల నగారా.. ఉమ్మడి మెదక్‌ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) :పంచాయతీ

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:30 am

రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం

రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం” కార్యక్రమమా?–వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు ఎద్దేవా. విశాలాంధ్ర – కడియం : రైతులను అన్నివిధాలా చావగొట్టి చెవులు మూసిన కూటమి ప్రభుత్వం ఇవాళ ఏమి ఎరగనట్టు “రైతన్నా మీకోసం” కార్యక్రమం పెట్టి రైతులకు ఏదో చేసినట్టు మభ్య పెట్టాలని ప్రయత్నిస్తోందని వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పేర్కొన్నారు. ఆయన మంగళవారం కడియం లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆది నుంచి రైతులకు వ్యతిరేకమే […] The post రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:25 am

కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు

మురమండ, దుళ్ల కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మురమండ, దుళ్ల గ్రామ పంచాయతీలలో గ్రేడ్ 2 గ్రామ కార్యదర్శులుగా పనిచేస్తున్న రావిపాటి సత్యనారాయణ, బిక్కి సత్యానందకుమార్ లకు గ్రేడ్-1 కార్యదర్శులుగా పదోన్నతులు వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు. జోన్ 2 పరిధిలో ఉన్న వీరిలో సత్యనారాయణ ను అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నియమించగా సత్యానంద కుమార్ ను తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్ […] The post కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:22 am

Reservations |పంచాయతీ రిజర్వేషన్లపై గందరగోళం!

Reservations | పంచాయతీ రిజర్వేషన్లపై గందరగోళం! ఆంధ్రప్రభ, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి :

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:19 am

ప్రజలు చెంతకే పుర సేవలు

యాప్ వినియోగిస్తే ప్రయోజనాలు ఎన్నో.. విశాలాంధ్ర -కొవ్వూరు: మున్సిపల్ పరిధిలోని పట్టణాలలో ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పురమిత్ర యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మున్సిపల్ శాఖ సంచాలకుడు, కమిషనర్ నేరుగా యాప్ను పర్యవేక్ష తుండడడంతో అధికారులు పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించి సంబంధిత సమాచారాన్ని ఫిర్యాదుదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆస్తి పన్ను చెల్లింపు, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపు, నీటి చార్జీలు చెల్లింపు, నీటి సరఫరా కులాయిల కనెక్షన్ల దరఖాస్తులు, వ్యాపార లైసెన్స్ […] The post ప్రజలు చెంతకే పుర సేవలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:18 am

GHMC |మహా బల్దియా..

GHMC | మహా బల్దియా.. హైదరాబాద్‌ సిటీ బ్యూరో, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:11 am

HYD |ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం…

HYD | ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం… హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) :

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:10 am

వైద్యం ఒకరికి అయితే, ప్రిస్క్రిప్షన్ లో మరొకరి పేరు

విశాలాంధ్ర – కడియం : కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో దామిశెట్టి రత్నకుమారి పేరుకు బదులుగా వేరొకరి పేరుతో వైద్య పరీక్షలు, ఎక్సరే పరీక్షలు నిర్వహించి, మందులు రాసారని రత్నకుమారి భర్త నాగరాజు ఆరోపించారు. వైద్య పరీక్షలు నిమిత్తం దామిశెట్టి రత్నకుమారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారని ఆయన తెలిపారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో తమ భార్య మెడికల్ ప్రిస్క్రిప్షన్ ను మరొకరి పేరుతో చేయించారని ఆరోపించారు. ఎక్స్ రే, రక్త పరీక్షలు చేసి, మందులు కూడా వేరొకరి పేరు […] The post వైద్యం ఒకరికి అయితే, ప్రిస్క్రిప్షన్ లో మరొకరి పేరు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:07 am

చర్యలు తీసుకోవాలి

సినిమా డైరెక్టర్ గీతాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.— రాజమండ్రి రూరల్ దళిత నాయకులు. విశాలాంధ్ర – కడియం : దళితుల మనోభావాలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సినిమా డైరెక్టర్ అన్నందేవుల గీతాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం దళిత నాయకులు కడియం పోలీస్ స్టేషన్ లో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాయల సత్యనారాయణ, దమ్ము కృష్ణంరాజు, మంగమూరి చినబాబు, జల్ది కృపారావు, కనికల్ల బుల్లియ్య, ఇప్పర్తి శ్రీను తదితర […] The post చర్యలు తీసుకోవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:02 am

బిసిలకు 17 శాతం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 12,728 సర్పంచ్ స్థానాలకు 2,176 స్థానాలు బిసిలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన బిసిలకు 17.08 శాతం బిసిలకు సర్పంచ్ స్థానాలు దక్కాయి. 27.45 శాతంతో జోగులాంబ గద్వాల జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. ఈ జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకుగానూ 70 సర్పంచ్ స్థా నాలు బిసిలకు రిజర్వ్ అయ్యాయి. అలాగే సిద్దిపేట జిల్లాలో 26.77 శాతం బిసిల కు సర్పంచ్ కేటాయించారు. ఈ జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. నా రాయణపేట జిల్లాలో 272 గ్రామ పంచాయతీలకు గానూ 72 (26.47 శాతం) బిసిలకు కేటాయించగా, కరీంనగర్ జిల్లాలో 318 గ్రామ పంచాయతీల్లో బిసిలకు 84(26.41 శాతం) కేటాయించారు. పెద్దపల్లి జిల్లాలో 263 గ్రామ పంచాయతీలకుగానూ 69(26.23 శాతం) బిసిలకు రిజర్వ్ అయ్యాయి. అదిలాబాద్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో బిసిలకు 5 శాతం లోపే సర్పంచ్ స్థానాలు కేటాయించగా, 10 శాతం లోపు ఉన్న జిల్లాల్లో అసిఫాబాద్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో 471కి గాను బిసిలకు ఒక్క స్థానం కూడా దక్కలేదు.

మన తెలంగాణ 26 Nov 2025 5:00 am

రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 

ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విశాలాంధ్ర – నల్లజర్ల : రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుందని వాటిని రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనతరం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతన్నల ఇంటికి వెళ్లి కరపత్రాలను […] The post రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 4:57 am

జనసేన నేత సువర్ణ రాజు 

వివాహ వేడుకలో పాల్గొన్న జనసేన నేత సువర్ణ రాజు విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలం సుబద్రపాలెం గ్రామ జన సైనికుడు వెలుగంటి వినయ్ కుమార్వివాహ మహోత్సవమునకు హాజరైన గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజుఐటీ కోఆర్డినేటర్ ఉన్నమట్ల సత్య కిరణ్ ,జనసేన పార్టీ మండల కార్యదర్శి కొత్తపల్లి హరిబాబు ,చీపురుగూడెం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గుండాబత్తుల వరుణ్ కుమార్,పోతవరం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గాజుల గణేష్ , చీపురుగూడెం […] The post జనసేన నేత సువర్ణ రాజు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 4:50 am

నల్లగొండలో డిసిసి చిచ్చు

మన తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ బ్యూరో: నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష(డిసిసి) ఎంపిక కొత్తచిచ్చుకు దారితీసింది. డిసిసి అ ధ్యక్ష పదవి కోసం చాలామంది ముఖ్యులు పోటీపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓయు ఉద్యమనేత పున్న కైలాశ్‌నేతకు డిసిసి బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరులు కష్టపడి పనిచేసే వారికి పదవులు ఇవ్వరు.. పార్టీని, ముఖ్యులను తిడితేనే పదవులు ఇస్తారా? అంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రధానంగా మంత్రి ప్రధాన అనుచరుడు గుమ్ముల మోహన్‌రెడ్డి అధిష్ఠానం తీరును తప్పుబట్టారు. కష్టకాలంలో పనిచేసిన వా రికి గుర్తింపు ఇవ్వకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. అయితే డిసిసి అధ్యక్షుల ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రకేబినేట్ సమావేశానికి ముందు సీఎం రేవంత్‌తో చర్చించినట్లు చెపుతున్నారు. గతంలో తనను, తనకుటుంబాన్ని అసభ్య పదజాలంతో తిట్టడం.. పార్టీకోసం ఏనాడు కష్టపడని వ్యక్తికి డిసిసి పీఠం కట్టబెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. డిసిసి అధ్యక్షుడిగా పున్న కైలాశ్‌నేతను వెంటన తొలగించాలని మంత్రి పట్టుపడుతున్నారు. సీఎం రేవంత్‌తో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు లేఖ రాసినట్లు చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే గతంలో తనను దూషించిన వ్య క్తికి జిల్లాపీఠం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు వెంట నే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు (డిసిసి) పదవుల చిచ్చు నల్లగొండ జిల్లాలో తారాస్థాయికి చేరిందని చెప్పవ చ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం రేవంత్‌కు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. ఈపరిణామాలతో వారిబంధం బెడిసికొడుతుందా? అనే చర్చ మొదలైంది. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాల్లో పై ర్‌బ్రాండ్‌గా ఉంటూ విపక్షంతో పాటు స్వపక్షంపై విమర్శలు చేయడం వారికి అలవాటు. అయితే ఈ పరిస్థితుల్లో డిసిసి ఎంపిక సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతుందా అనే చర్చ ప్రారంభమైంది. ఎట్టిపరిస్థితుల్లో డిసిసి అధ్యక్షులుగా పున్న కైలాశ్‌ను ఒప్పుకునేది లేదని వెంటనే తొలగించాలని మంత్రి కోమటిరెడ్డి పట్టుపడుతున్నారు. డిసిసి ఎంపిక చిచ్చు నల్లగొండ కాంగ్రెస్‌లో ఏవైపుకు దారితీస్తుందోనన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ అధిష్టానం ఏనిర్ణయం తీసుకుంటుంది? కోమటిరెడ్డిని బుజ్జగిస్తుందా? కైలాశ్‌నేతకు నచ్చచెపుతుందా? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనని అందరూ ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు. 

మన తెలంగాణ 26 Nov 2025 4:30 am

హిల్టప్ హీట్..

మన తెలంగాణ/హైదరాబాద్: భాగ్యనగరంలోని పారిశ్రామిక భూములపై రచ్చ మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ భూములను గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ ప్రకారమే తాము నడుచుకుంటున్నామని అధికార పార్టీ నేతలు చెబుతుండగా ప్రతిపక్ష బిఆర్‌ఎస్ మాత్రం కోట్ల రూపాయలను దోచుకునేందుకు పారిశ్రామిక భూములపై ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. దీని కో సం పరిశ్రమల శాఖ రూపొందించించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పా లసీ పాలసీని ఇటీవల మంత్రిమండలి ఆమోదిం చి జీవో కూడా జారీ చేసింది. పారిశ్రామికవాడల ను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ‘హిల్టప్’ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రా న్స్‌ఫార్మేషన్ పాలసీ) పేరుతో ఓ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. పారిశ్రామిక ప్రాంతాల్లో జనజీవనం పెరగడంలో కాలుష్య ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగరం నడిమధ్యలో ఉన్న పరిశ్రమలను ఓఆర్‌ఆర్ వెలుపల నూతన పారిశ్రామికవాడలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే హిల్టప్ విధానాన్ని తీసుకువచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) లోపల, సమీపంలోని అన్ని టీజీఐఐసీ/ఐఏఎల్‌ఎ పరిధిలోని అన్ని పారిశ్రామిక ఎస్టేట్లు, ఆటోనగర్‌లు స్వతంత్ర పరిశ్రమల భూములకు ఈ విధానం వర్తిస్తుంది. దీని పరిధిలోకి వచ్చే భూముల్లో అపార్టుమెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, కార్యాలయాలు, రిటైల్ సెంటర్లు, హోటళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఐటీ/ ఐటీఈఎస్ పార్కులు, రిక్రియేషన్ సౌకర్యాలు వంటివి నిర్మించడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. హైదరాబాద్‌లోని పాత పారిశ్రామిక ఎస్టేట్‌లు పార్కులు ఇప్పుడు అత్యంత విలువైన భూములుగా మారాయి. పెట్టుబడులు, పరిశ్రమలు రావాలనే లక్ష్యంతో 50- నుంచి 60 ఏండ్ల కిందట ప్రభుత్వం సబ్సిడీ ధరలకు పరిశ్రమలకు భూములను కేటాయించింది. దీంతో అప్పట్లో నగర శివారు ప్రాంతాలుగా ఉన్న 22 చోట్ల పారిశ్రామికవాడలు ఏర్పడ్డాయి. కాలక్రమంలో నగరం వేగంగా విస్తరించడంతో అప్పట్లో శివారు ప్రాంతాలుగా ఉన్న పారిశ్రామికవాడల చుట్టూ ఇప్పుడు జనావాసాలు ఏర్పడ్డాయి. అప్పట్లో ఏమాత్రం ధర పలకని భూములు ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి. గతంలో పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో చాలావరకు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. టెక్నాలజీ మారడంతో చాలా పరిశ్రమలు ఖాయిలా పడగా అనేక పరిశ్రమలు మార్కెట్ పోటీని తట్టుకోలేక మూతబడ్డాయి. దీంతోపాటు ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న పారిశ్రామికవాడలను ఔటర్ వెలుపలికి తరలించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, సమీపంలోని పాత పారిశ్రామికవాడలు ప్రస్తుతం హైదరాబాద్ నగరం మధ్యలో చిక్కుకున్నాయి. బాలానగర్, కూకట్‌పల్లి, కాటేదాన్ వంటి ప్రాంతాల్లో వేల ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది. వేర్వేరు ప్రాంతాల్లోని పారిశ్రామిక జోన్లలో సుమారు 9,292 ఎకరాలను పరిశ్రమల శాఖ గుర్తించింది. వీటిలో సుమారు 4,740 ఎకరాల చదును భూముల్లో అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించింది. ఈ భూములను నివాస, వాణిజ్య, ఐటీ, ఆసుపత్రులు, పార్కులతో కూడిన బహుళ ప్రయోజన ప్రాంతాలు (మల్టీయూజ్ జోన్లు)గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ వెలుపల పలు పారిశ్రామికవాడలను ఏర్పాటుచేసి నగరంలోని పరిశ్రమలకు సబ్సిడీ ధరలకు అక్కడ భూములు కేటాయించారు. ఇలా నగరంలోని పారిశ్రామిక వాడలకు చెందిన వేలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈఈ భూములను మల్లీయూజ్ జోన్లుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు ప్రక్రియ ఇలా టీజీ-పాస్ పోర్టల్ ద్వారా హిల్టప్ విధానానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని మొదట 20 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టీజీఐఐసీ 7 రోజుల్లో ప్రాథమిక పరిశీలన చేసి స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పరిశ్రమలు) అధ్యక్షతన ఆమోద కమిటీ మరో 7 రోజుల్లో అనుమతి ఇస్తుంది. మిగిలిన 80 శాతం ఫీజును రెండు విడతలుగా 45 రోజులకోసారి మొత్తంగా 90 రోజుల్లో చెల్లించవచ్చు. సబ్సిడీ ధరలకు కేటాయించిన భూములను లీజు పూర్తయిన తర్వాత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడమో, బహిరంగ మార్కెట్ ధర ప్రకారం వారివద్ద ధర వసూలు చేసి వారికి యాజమాన్య హక్కులు కల్పించడమో చేయాలి. ప్రభుత్వం ‘హిల్టప్’లో భాగంగా రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం ఫీజుగా వసూలుచేసి వారికి భూ వినియోగ మార్పిడి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. 9292 ఎకరాల్లో హిల్టప్ పాలసీ నగరంలోని మొత్తం 22 పారిశ్రామికవాడల్లో 9292.53 ఎకరాల భూమి ఉంది. నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, మౌలాలీ, ఉప్పల్, కూకట్‌పల్లి, ఐపీ జీడిమెట్ల, ఎస్‌వీసీఐఈ జీడిమెట్ల, ఐపీ బాలానగర్, టీఐఈ బాలానగర్, ఎస్‌వీసీఐఈ బాలానగర్, ఐపీ సనత్‌నగర్, ఐపీ మేడ్చల్, కుషాయిగూడ, సీఐఈ గాంధీనగర్, పటాన్‌చెరు, ఐడీఏ పాశమైలారం, రామచంద్రాపురం, కాటేదాన్, హయాత్‌నగర్, స్టాండ్ ఎలోన్ ట్యాండ్స్, చందూలాల్ బారాదరి తదితర పారిశ్రామికవాడల్లో ఈ భూములు ఉన్నాయి. ఈ భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పాలసీ ద్వారా వేల ఎకరాల నిరుపయోగమైన భూమి వినియోగంలోకి రావడంతోపాటు ఐటి, రియల్ ఎస్టేట్, హౌసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు రావడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాష్ట్రానికి వేల కోట్ల నాన్ ట్యాక్స్ ఆదాయం రావడం వల్ల సేకరించిన డబ్బులో 25 శాతం మళ్లీ కొత్త ఇండస్ట్రియల్ పార్కులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడుతాయని ఈ పాలసీని తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. లీకు వీరులపై కఠిన చర్యలు తప్పవు : ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలు, కేబినెట్ సమావేశంలో జరిగిన చర్చల సారాంశం మొత్త ప్రతిపక్ష నేతలకు చేరవేస్తున్న లీకు వీరుల విషయంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు శ్రీధర్ బాబు స్పందిస్తూ ఈ లీకుల విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని కేబినెట్ నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాల లీకులపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో కేబినెట్ సైతం ఇదే ఆలోచనతో ఉందన్నారు. కేబినెట్ నిర్ణయాలు చాలా కాన్ఫిడెన్షియల్ అని అలాంటిది ఇంకా జీవోలు రాకముందే వాటి సారాంశం ఇతరులకు చేరవేయడమంటే చాలా తీవ్రమైన నేరమని, అలాంటి ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో ఐఎఎస్ అధికారుల పాత్ర ఉన్నా చర్యలు తప్పవని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు.

మన తెలంగాణ 26 Nov 2025 3:30 am

హిల్టప్ ముసుగులో భారీ దోపిడీ

కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి స్కీమ్‌కి తెర లేపిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. అందుకే 9,292 ఎకరాల భూమి దారాదత్తం చేసేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హెచ్‌ఐఎల్‌టిపి ..హిల్ట్ పి) పాలసీ తీసుకువచ్చిందని అన్నారు. గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకి గత ప్రభుత్వాలు పారిశ్రామిక వ్యక్తులకు ఇచ్చాయని తెలిపారు. అప్పటి మార్కెట్ రేట్‌కి సంబంధం లేకుండా అత్యంత చవకగా ఈ భూములను ఇచ్చారని అన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న 20 పారిశ్రామిక వాడలలోని 9,292 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది కోట్ల రూపాయల భూములను అప్పనంగా చేస్తున్న ఈ భూముల దందా పైన వెంటనే ప్రజలను జాగ్రత్త పరుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని మంగళవారం విద్యార్థి నాయకులకు కెటిఆర్ దిశానిర్దేశం చేశారు. ఒకప్పుడు పరిశ్రమల కోసం, ప్రజల ఉపాధి కోసం వచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు అపార్ట్‌మెంట్లు కడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తున్నదని విమర్శించారు. తాము గతంలో తీసుకువచ్చిన గ్రిడ్ పాలసీలో భాగంగా 50 శాతం ఐటీ ఆఫీసులకు, మిగిలిన 50 శాతం ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వానికి తగిన ఫీజులు కట్టిన తర్వాత అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం దారాదత్తం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం చెల్లిస్తే చాలు అంటూ అప్పనంగా ఒకప్పటి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నదని, తద్వారా ఐదు లక్షల కోట్ల రూపాయల భూముల స్కామ్‌కు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు, ముని మనవడు వరకు కావాల్సినన్ని డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పాలసీ తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ పాలసీ ద్వారా రేవంత్ రెడ్డి అంబానీ సరసన నిలవాలని ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందని, అంత భారీగా దోపిడీ చేసేందుకు తెరలేపారని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో పార్కులకు, ఇళ్లకు, చివరికి స్మశానానికి కూడా జాగా లేకున్నా, ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములన్నింటినీ అప్పనంగా అప్పగిస్తున్నదని చెప్పారు. ఇదే అంశాన్ని బిఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు జిహెచ్‌ఎంసి జనరల్ బాడీ కౌన్సిలింగ్ సమావేశంలో నిలదీశారని తెలిపారు. 9,300 ఎకరాల హైదరాబాద్ భూములను, ప్రజల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా చేస్తామంటే ఊరుకోమని, అది కాంగ్రెస్ పార్టీ అబ్బ జాగీరు కాదని బల్దియా సమావేశంలో ప్రశ్నించినట్లు తెలిపారు.

మన తెలంగాణ 26 Nov 2025 3:00 am

Panchayat |కోడ్‌ కూసింది..

కొందుర్గు, (ఆంధ్రప్రభ) : గ్రామీణ ప్రజాస్వామ్యం మరోసారి తన భవిష్యత్తు నిర్ణయితలను ఎంపికల

ప్రభ న్యూస్ 26 Nov 2025 1:28 am

బుధవారం రాశి ఫలాలు (26-11-2025)

మేషం చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన సమాచారం అందుతుంది. వృషభం వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిధునం స్థిరస్తి కొనుగోలు చేస్తారు.సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కర్కాటకం కుటుంబ సభ్యులతో స్వల్పవివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సింహం వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన మిత్రుల పరిచయం ఉత్సాహనిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. కన్య ఆస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తుల చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృశ్చికం ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పదు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ధనస్సు వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులుంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అధికారుల నుండి విమర్శలు తప్పవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మకరం వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. నిరుద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభకర్య ఆహ్వానాలు అందుతాయి. కుంభం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్ధిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. మీనం కుటుంబంలో చికాకులు తప్పవు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కొందరి ప్రవర్తన చికాకు పరుస్తాయి.  

మన తెలంగాణ 26 Nov 2025 12:20 am

‘త్రికాల’ వచ్చేస్తోంది

ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్‌తో వచ్చే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా ‘త్రికాల’ సినిమాను మణి తెల్లగూటి తెరకెక్కిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మాస్టర్ మహేంద్రన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, నటుడు అజయ్ విశ్వరూపం, సినిమాలోని డైలాగ్స్, శ్రద్దా దాస్ మేకోవర్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించడం విశేషం. ‘త్రికాల’కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం పూర్తి అయ్యాయి. డిసెంబర్ లో సినిమా రిలీజ్ కానుంది.

మన తెలంగాణ 25 Nov 2025 11:26 pm

నెక్కొండ మున్సిపాలిటీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

 రాష్ట్రంలో మరో మున్సిపాలిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాలో ని నెక్కొండ మండలంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలంటూ నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి, పత్తిపాక గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ లావుడ్యా సరిత లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కాగా నెక్కొండకు మున్సిపాలిటీగా అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

మన తెలంగాణ 25 Nov 2025 11:22 pm

రైతు డబ్బులు.. రాజన్న ఖాతాలోకి..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, (ఆంధ్రప్రభ): ఓ రైతు పత్తి అమ్మగా వచ్చిన

ప్రభ న్యూస్ 25 Nov 2025 11:20 pm

కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వ వైఖరి!

హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ‘లేబర్ కోడ్‌’లను

ప్రభ న్యూస్ 25 Nov 2025 11:00 pm

జుక్కల్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం..

డోంగ్లి, ఆంధ్రప్రభ : లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్న వెంటనే,

ప్రభ న్యూస్ 25 Nov 2025 10:51 pm

సీఎం ను క‌లిసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్..

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఎన్టీఆర్ జిల్లా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు అభివృద్ది

ప్రభ న్యూస్ 25 Nov 2025 10:45 pm

Srikakulam |నిర్భంధాలతో ఉద్యమాలు ఆపలేరు….

Srikakulam | నిర్భంధాలతో ఉద్యమాలు ఆపలేరు…. శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 25 Nov 2025 10:38 pm

Srisailam |కార్తీకం మాసంలో కొత్త రికార్డు…

Srisailam | కార్తీకం మాసంలో కొత్త రికార్డు… నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 25 Nov 2025 10:33 pm

కొత్త కార్మిక చట్టాలతో 77 లక్షల జాబ్‌లు

న్యూఢిల్లీ : ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల సంస్కరణలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నివేదిక వెల్లడించింది. దేశంలో ఇప్పటికే ఉన్న కార్మిక మార్కెట్ మధ్యకాలంలో గణనీయమైన స్థాయిలో అధికారీకరణ సామర్థాన్ని పెంచుకుంటుందని నివేదిక తెలిపింది. ప్రభుత్వం ఇటీవల నాలుగో లేబర్ కోడ్ల ద్వారా కార్మిక చట్టాల్లో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టింది. నాలుగు కోడ్‌లలో ది కోడ్ ఆన్ వేజ్ 2019, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండీషన్ కోడ్ 2020, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 వంటివి ఉన్నాయి. నివేదిక ప్రకారం, కొత్త లేబర్ చట్టాల వల్ల నిరుద్యోగం రేటు గరిష్ఠంగా 1.3 శాతం తగ్గి, 77 లక్షలకు పైగా ఉపాధి సృష్టించే అవకాశముంది. 15 ఏళ్లు దాటిన కార్మిక శక్తి పాల్గొనిన రేటు 60.1 శాతం, పని వయస్సు జనాభా 70.7 శాతం ఆధారంగా ఈ అంచనా వేశారు. పిఎల్‌ఎఫ్‌ఎల్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం 60.4 శాతం ఉన్న ఫార్మల్ వర్కర్ల శాతం కనిష్టంగా 15 శాతం పెరిగి 75.5 శాతానికి చేరవచ్చని నివేదిక వెల్లడించింది. సోషల్ సెక్యూరిటీ కవరేజ్ 85 శాతం వరకు పెరిగే అవకాశముందని కూడా పేర్కొంది. దేశంలో సుమారు 44 కోట్ల అసంఘటిత కార్మికుల్లో 31 కోట్ల మంది ఈ-శ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు అయ్యారు. వీరిలో 20 శాతం మంది ఫార్మల్ రంగానికి మారితే 1 కోటి మందికి ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ అందనున్నాయి. ఈ మార్పులతో 2 నుంచి 3 ఏళ్లలో సామాజిక భద్రత కవరేజ్ 80 నుంచి -85 శాతం వరకు పెరుగుతుందని ఎస్‌బిఐ అంచనా వేసింది. సంస్కరణలు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. 

మన తెలంగాణ 25 Nov 2025 10:23 pm

ఫిబ్రవరి 1న హైదరాబాద్ హెరిటేజ్ రన్ -2026

 హైదరాబాద్ మహానగర అపురూపమైన చరిత్రను, వాస్తు నిర్మాణ వైభవాన్ని, ఉజ్వలమైన స్ఫూర్తిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడానికి హైదరాబాద్ హెరిటేజ్ రన్ -2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ కార్యక్రమ వివరాలను చారిత్రక తారామతి బారామతి వేదికగా మంగళవారం వెల్లడించారు. పర్యాటక, సాంస్కృతిక (క్రీడలు) శాఖ ఆధ్వర్యంలో రాపిడో టైటిల్ స్పాన్సర్‌గా ఈ చారిత్రక క్రీడా కార్యక్రమం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈవెంట్‌కు తెలంగాణ టూరిజం, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సహకారం అందిస్తున్నాయని తెలిపారు.హైదరాబాద్ మహానగర వైభవాన్ని, చారిత్రక ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు తారామతి బారామతిని వేదికగా ఎంచుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ హెరిటేజ్ రన్ కేవలం ఒక పరుగు మాత్రమే కాదని, క్రీడలు, పర్యాటకం, సాంస్కృతిక గర్వానికి సంబంధించిన మహా వేడుక అన్నారు. చార్మినార్ నుంచి కుతుబ్ షాహీ సమాధుల వరకు మార్గాన్ని సజీవ వారసత్వ కారిడార్‌గా మారుస్తున్నామని వెల్లడించారు. దీని ద్వారా హైదరాబాద్‌ను వారసత్వ క్రీడా పర్యాటకానికి ప్రపంచ గమ్యస్థానంగా సుస్థిరం చేయాలనేదే తమ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్ నగర వాసులు, యువత క్రీడాభిమానులు పాల్గొని హైదరాబాద్ హెరిటేజ్ రన్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరు, హైదరాబాద్ ర్యాపిడో హెడ్ ఉమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ఫిబ్రవరి 1, 2026న జరగనుంది. నగర చరిత్రను ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. 21కే హాఫ్ మారథాన్ ఐకానిక్ చార్మినార్ వద్ద మొదలై కుతుబ్ షాహీ సమాధుల వద్ద ముగుస్తుంది. మార్గంలో హైకోర్టు, సిటీ కాలేజ్, అసెంబ్లీ, గోల్కొండ కోట, తారామతి బారామతి వంటి ప్రధాన చారిత్రక ప్రదేశాలను చుట్టి వస్తుంది. 5కే, 10కే రన్ చారిత్రక కుతుబ్ షాహీ సమాధుల వద్ద ప్రారంభమై అక్కడే ముగుస్తుంది.

మన తెలంగాణ 25 Nov 2025 10:17 pm

రూ.2500 కోట్ల కొకైన్ స్మగ్లింగ్ సూత్రధారి అరెస్ట్

న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీలో రూ.2500 కోట్ల విలువైన 82 కిలోల హైగ్రేడ్ కొకైన్‌ను నార్కోటిక్ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ భారీస్మగ్లింగ్‌కు మాస్టర్‌మైండ్ అయిన పవన్ ఠాకూర్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో అతడిని భారత్‌కు అప్పగించనున్నారు. ఢిల్లీకి చెందిన ఈ హవాలా ఏజెంట్ ఈ కొకైన్‌ను ఢిల్లీకి ట్రక్కుద్వారా పంపించేముందు దేశంలోని పోర్టు ద్వారా రవాణా చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఈవారం మొదట్లో ఢిల్లీలో పట్టుబడిన రూ.282 కోట్ల విలువైన మెథాంపెట్‌మిన్ డ్రగ్స్ రవాణాలో కూడా పవన్‌ఠాకూర్ కీలక సూత్రధారిగా తేలిందని దర్యాప్తు అధికారులు తెలియజేశారు. గత కొన్నేళ్లుగా హవాలా, మనీలాండరింగ్ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఢిల్లీ కుచ మహాజని మార్కెట్‌లో హవాలా ఏజెంట్‌గా పని ప్రారంభించిన ఠాకూర్ క్రమంగా భారీ ఎత్తున మాదకద్రవ్యాల వ్యాపారిగా మారాడు. అక్రమ సంపాదన దాచిపెట్టడానికి తన వాణిజ్య ప్రావీణ్యాన్ని వినియోగించేవాడు. డ్రగ్స్ వ్యాపారంలో వచ్చిన బ్లాక్‌మనీ విస్తారమైన హవాలా నెట్‌వర్క్ ద్వారా మళ్లించేవాడు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా భారత్, చైనా, సింగపూర్, హాంగ్‌కాంగ్, అరబ్ ఎమిరేట్స్ దేశాల సరిహద్దుల్లోని బినామీ కంపెనీలకు ఆ డబ్బంతా చేర్చేవాడు. 

మన తెలంగాణ 25 Nov 2025 10:11 pm

బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది:మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

 స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల మోసాలను బిసిలకు చేసిందని అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కి, బిసిలను నిట్టనిలువుగా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో రఘునాథ పాలెం మండలంలో బిసిలకు ఒక్క సర్పంచ్ స్థానం దక్కలేదని, మహబూబ్ నగర్‌లో చాలా గ్రామాల్లో బిసి సర్పంచ్‌లు లేరు,వార్డు మెంబర్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బిసి రిజర్వేషన్లపై ఎక్కడ నియమనిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన చీర తీసుకుని తమకు ఓట్లు వేయాలని సిఎం అంటున్నారని, మరి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చీరలు ఇవ్వలేదని అడిగారు.తాము చీర కట్టుకొని ఓటు వేయాలని సిఎం బహిరంగంగా అంటుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.

మన తెలంగాణ 25 Nov 2025 10:07 pm

మంధానను పలాశ్ మోసం చేశాడా?.. వివాహంపై కొనసాగుతున్న సస్పెన్స్

ముంబై: భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌ల వివాహం అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం బారిన పడడంతో వివాహం వాయిదా పడింది. అన్ని ఏర్పాట్లు పూర్తయి అనూహ్యంగా పెళ్లి అగిపోవడంతో అందరు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. మంధాన తండ్రికి గుండె నొప్పి రావడంతో ఆయన్ని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. తండ్రి అనారోగ్యం బారిన పడడంతో మనో వేదనకు గురైన మంధాన వివాహం వాయిదా వేయాలనే నిర్ణయించింది. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని, ఇలాంటి స్థితిలో పెళ్లికి తాను ఎలా సిద్ధమవుతానని మంధాన పేర్కొన్నట్టు ఆమె మేజేజర్ మీడియాకు వెల్లడించారు. మరోవైపు పెళ్లి కొడుకు పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ముచ్చల్, మంధాన వివాహం వాయిదాపై సోషల్ మీడియాలో పలు కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇరు కుటుంబాల మధ్య ఏదో జరిగిందని, అందుకే పెళ్లిని అర్ధాంరతంగా నిలిపి వేశారని వార్తలు గుప్పుమన్నాయి. పలాశ్ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకుని, మంధాను మోసం చేశాడని నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఇప్పటివరకూ ఇరువర్గాల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో మంధాన-పలాశ్ వివాహనంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

మన తెలంగాణ 25 Nov 2025 10:02 pm

ఫిబ్రవరి 27 నుంచి టి20 వరల్డ్

 వచ్చే ఏడాది జరుగనున్న పురుషుల టి20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 7, 2026 నుంచి మార్చి 8 వరకు ఈ వరల్డ్‌కప్ జరుగనుంది. భారత్, శ్రీలంకలు ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పోటీ పడనున్నాయి. వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదేసి జట్లు ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉన్నారు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 16న కొలంబో వేదికగా లీగ మ్యాచ్ జరుగనుంది. మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐసిసి చైర్మన్ జైషా, భారత మాజీ సారథి రోహిత్ శర్మ, ప్రస్తుత టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మహిళా జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ తదితరులు వరల్డ్‌కప్ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించారు. భారత్‌లోని ఐదు, శ్రీలంకలోని మూడు వేదికల్లో వరల్డ్‌కప్ జరుగనుంది. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ ఆడే అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే జరుగనున్నాయి. ఇక ఫైనల్ వేదికగా అహ్మదాబాద్‌ను ఎంపిక చేశారు. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంటే తుది పోరును కొలంబోలో నిర్వహిస్తారు. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్‌లను ముంబై, కోల్‌కతా నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్థాన్ సెమీస్‌కు చేరితే వేదికల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాగా, లీగ్ దశలో ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సూపర్8కు అర్హత సాధిస్తాయి. ఇక సూపర్8లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. కాగా, భారత్‌లోని ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న యూఎస్‌ఎ టీమ్‌తో ఆడుతుంది. ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. తొలి రోజు పాకిస్థాన్, నెదర్లాండ్స్, భారత్, అమెరికా, వెస్టిండీస్‌బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్‌ఎలో భారత్, పాకిస్థాన్ వరల్డ్‌కప్‌లో పాల్గొనే జట్లను ఎ, బి,సి, డి గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో భారత్‌తో పాటు పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్లు ఉన్నాయి. గ్రూప్‌బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్‌సిలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇటలీ, నెపాల్, వెస్టిండీస్, గ్రూప్‌డిలో అఫ్గానిస్థాన్, కెనడా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, యుఎఇ జట్లు ఉన్నాయి. కాగా, ఇటలీ తొలి సారి వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఐసిసి అంబాసిడర్‌గా రోహిత్ శర్మ టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ఐసిసి టి20 వరల్డ్‌కప్ కోసం రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసిసి నియమించింది. వరల్డ్‌కప్ ప్రచార కార్యక్రమంలో రోహిత్ పాల్గొంటాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టి20 వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి జరిగే విశ్వకప్ కోసం రోహిత్‌ను ఐసిసి తన అంబాసిడర్‌గా నియమించింది.

మన తెలంగాణ 25 Nov 2025 9:59 pm

ఐ బొమ్మ రవిని మేమే పట్టుకున్నాం: సిపి శ్రీనివాసులు

ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవిని అతడి భార్య పట్టించలేదని, ఆమె ఎలాంటి వివరాలు ఇవ్వలేదని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ క్రైం శ్రీనివాసులు తెలిపారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే పట్టుబడ్డాడని, అతడి స్నేహితుడిపై నిఘా పెట్టడంతో పట్టుబడ్డాడని తెలిపారు. ఐ బొమ్మ రవి కేసు గురించి అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవికి బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ద్వారా డబ్బులు వచ్చేవని తెలిపారు. యాడ్ బుల్ కంపెనీ రవికి చెందినదేనని, యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులను యాడ్ బుల్ కంపెనీకి మళ్లించారని చెప్పారు. ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బుల వచ్చేదని, రవి సర్వర్లన్నీ నెదర్‌లాండ్‌లో ఉన్నాయని తెలిపారు. రవి టీం ఇంకా కరేబియన్ దేశంలోనే ఉన్నారని తెలిపారు. రవికి హైదరాబాద్, వైజాగ్‌ల్ ఉన్న ఆస్తులను గుర్తించామని, ఇప్పటికే బ్యాంక్‌లో ఉన్న రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఇమంది రవి ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల వరకు సంపాదించాడని వెల్లడించారు. ఐబొమ్మ, బప్పం సైట్లను రవి స్నేహితుడు నిఖిల్ డిజైన్ చేశాడని తెలిపాడు. నిఖిల్, రవికి స్నేహితుడని, పైరసీ వెబ్‌సైట్లు డిజైన్ చేసేవాడని, అతడి ద్వారానే రవిని ట్రాప్ చేశామని తెలిపారు. గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ద్వారా నూ నిందితుడు బోలెడు డబ్బు సంపాదించాడు. ఇవే కాకుండా మరికొన్ని పైరసీ వెబ్‌సైట్లు నడుస్తూనే ఉన్నాయని, మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ వంటి పైరసీ సైట్లు ఇంకా నడుస్తున్నాయని తెలిపారు. పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఐబొమ్మ పాపులర్ అయ్యాక దానిపేరును చాలామంది వాడుకుంటున్నారని, సినిమా సమీక్షలకు కూడా ఐబొమ్మ సైట్ పేరు పెట్టుకున్నారని తెలిపారు. భవిష్యత్‌లో వెబ్-3 టెక్నాలజీ కూడా రాబోతుంది, ఈ టెక్నాలజీతో పైరసీ చేస్తే పట్టుకోవడం కష్టం అని స్పష్టం చేశారు. రీడైరెక్ట్... ఐ బొమ్మ డొమైన్‌ను ఎన్ జిల్లా అనే కంపెనీలో రవి రిజిస్టర్ చేశాడని, మరో కంపెనీ నుంచి హోస్ట్ చేశాడని అదనపు సిపి శ్రీనివాసులు తెలిపారు. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా ఐ బొమ్మ, బప్పం ద్వారా సినిమాలు పోస్ట్ చేశాడని తెలిపారు. బప్పం, ఐబొమ్మ వెబ్ సాఫ్ట్‌వేర్‌లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశారని, రీడైరెక్ట్ ద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్ సైట్లకు వెళ్లేదని తెలిపారు. అక్కడ వాటి యాడ్లను, యాడ్ క్యాష్, యాడ్ స్టరా అనే కంపెనీలు మేనేజ్ చేస్తున్నాయని తెలిపారు. బెట్టింగ్ సైట్లు యాడ్స్ డిస్‌ప్లే చేయడం ద్వారా వచ్చే డబ్బు ఇమ్మడి రవి ఖాతాలోకి వెళ్లేది తెలిపారు. మరోసారికి కస్టడీకి... రవి పోలీస్ కస్టడీలో సహకరించలేదని, ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, మరోసారి కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబడతామని మంగళవారం నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఎవరికీ కాపీలు ఇవ్వొద్దంటూ పోలీసుల మెమో దాఖలు చేశారు. దీని వల్ల కస్టడీ విచారణ నీరుగారుతోందని కోర్టుకు విన్నవించారు. అయితే కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కస్టడీకి పిటీషన్‌పై బుధవారం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.

మన తెలంగాణ 25 Nov 2025 9:56 pm

ADB |అనాథ పిల్లలకు అండగా..

ఉట్నూర్/జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మోడీగూడ గ్రామంలో

ప్రభ న్యూస్ 25 Nov 2025 9:47 pm

భర్తపై బాలీవుడ్ నటి గృహహింస కేసు

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై స్థానిక కోర్టులో గృహ హింస కేసు పెట్టింది. తనభర్త నుంచి భౌతికంగా, లైంగికంగా, దూషణల ద్వారా తీవ్ర వేదనకు గురవుతున్నానని ఆమె పిటిషన్‌లో ఆరోపించింది. మంగళవారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్‌సి తాడ్యే ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. దీనిపై హాగ్‌కు నోటీస్ జారీ అయింది. డిసెంబర్ 12న దీనిపై విచారించనున్నారు. కరన్‌జ్వాల అండ్ కంపెనీ న్యాయ సంస్థ ద్వారా ఆమె పిటిషన్ దాఖలు చేశారు. 47 ఏళ్ల సెలీనా జైట్లీ 2010లో పీటర్ హాగ్‌ను ఆస్ట్రియాలో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వివాహం అయిన తరువాత తనను పనిచేయరాదని భర్త ఆంక్షలు విధించినట్టు ఆమె పిటిషన్‌లో ఆరోపించారు. తన భర్త దురహంకారి, ముక్కోపి, తనకుతాను ఎక్కువని భావించే వ్యక్తి, మద్యపాన బానిసని, ఈ అవలక్షణాలతో నిరంతరం తాను వేదనకు, ఒత్తిడికి గురవుతున్నానని ఆమె పిటిషన్‌లో ఆరోపించారు. భౌతికంగా, దుర్భాషల ద్వారా ఎలా తనను వేధించేవాడో ఆమె కొన్ని సంఘటనలను ఉదహరించారు. హాగ్ కూడా ఆస్ట్రియాలోని కోర్టులో ఈ ఏడాది ఆగస్టులో విడాకులకు దరఖాస్తు చేశాడని పేర్కొన్నారు. తన మాజీ భర్త నుంచి రూ. 50 కోట్లు పరిహారం , నెలనెలా రూ 10 లక్షలు భరణం ఇప్పించాలని ఆమె పిటిషన్‌లో కోరారు. ఆస్ట్రియాలో ప్రస్తుతం హాగ్ దగ్గరే ఉన్న తన ముగ్గురు పిల్లలతో వర్చువల్‌గా నైనా మాట్లాడే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.

మన తెలంగాణ 25 Nov 2025 9:33 pm

TG |ములుగులో సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ !!

TG | ములుగులో సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ !! వాజేడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 25 Nov 2025 9:25 pm

రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..

టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ఐసిసి టి20 వరల్డ్‌కప్ కోసం రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసిసి నియమించింది. వరల్డ్‌కప్ ప్రచార కార్యక్రమంలో రోహిత్ పాల్గొంటాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టి20 వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి జరిగే విశ్వకప్ కోసం రోహిత్‌ను ఐసిసి తన అంబాసిడర్‌గా నియమించింది. కాగా, 2026 ఫిబ్రవరి 7, 2026 నుంచి మార్చి 8 వరకు ఈ వరల్డ్‌కప్ జరుగనుంది. భారత్, శ్రీలంకలు ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పోటీ పడనున్నాయి. వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న జట్లను ఎ, బి,సి, డి గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో భారత్‌తో పాటు పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్లు ఉన్నాయి. గ్రూప్‌బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్‌సిలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇటలీ, నెపాల్, వెస్టిండీస్, గ్రూప్‌డిలో అఫ్గానిస్థాన్, కెనడా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, యుఎఇ జట్లు ఉన్నాయి. కాగా, ఇటలీ తొలి సారి వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఇక, చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ జట్ల మధ్య ఫిబ్రవరి 16న కొలంబో వేదికగా లీగ మ్యాచ్ జరుగనుంది.

మన తెలంగాణ 25 Nov 2025 9:19 pm

సింగరేణిలో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్

పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్తులో వినియోగించబడని విద్యుత్తును ఉచితంగా గ్రిడ్ కు సరఫరా చేయకుండా, బ్యాటరీలో నిలువ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను రాష్ట్రంలో తొలి సారిగా సింగరేణిలో ప్రారంభించనున్నారు. పునరుత్పాదక విద్యుత్తు పెంపుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేస్తున్న విశేషమైన కృషిలో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ మందమర్రి ఏరియాలో గల తన 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కు అనుబంధంగా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్‌ఎస్) ను ఇటీవల ఏర్పాటు చేసింది. ఇది ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన ప్రయోగాత్మక ప్లాంట్. దీనిని రెండు మూడు రోజుల్లో ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని సింగరేణితో సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సంస్థ ఇప్పటికే తన ఏరియాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇవి సమర్థంగా పనిచేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇలా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను తెలంగాణ ట్రాన్స్‌కో గ్రిడ్ ద్వారా అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నారు. అయితే సింగరేణిలో డిమాండ్ లేని సమయాల్లో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్ ను గ్రిడ్‌కు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతోంది. ఇలా మిగిలిపోయిన సోలార్ విద్యుత్తును పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా నిల్వ చేసి గరిష్ట విద్యుత్ వినియోగం ఉండే సమయంలో కంపెనీ అవసరాలకు వినియోగిస్తారు. సాంకేతికపరంగా బీఈఎస్‌ఎస్ అత్యాధునికమైన సోలార్ విద్యుత్తు నిల్వ మరియు పొదుపు వ్యవస్థగా పేర్కొనవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పెద్ద ఎత్తున సుమారు 250 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో మందమర్రిలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 1 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ఒక తొలి అడుగుగా భావించవచ్చు. సుమారు 2.73 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ వల్ల సింగరేణి సంస్థ ఏడాదికి సుమారుగా వినియోగించబడని 9.1 లక్షల యూనిట్ల సోలార్ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకుంటూ 70 లక్షల రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలో అనేక సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఉన్నప్పటికీ తొలిసారిగా బీఈఎస్‌ఎస్ ఏర్పాటు చేసే అవకాశం తమకు కల్పించినందుకు సింగరేణి సంస్థ ఛైర్మన్ ,సిఎండీ ఎన్. బలరామ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సింగరేణి వ్యాప్తంగా అనువైన చోట్ల ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

మన తెలంగాణ 25 Nov 2025 9:15 pm

Errabelli |బీసీలను మోసం చేసింది కాంగ్రెస్…

Errabelli | బీసీలను మోసం చేసింది కాంగ్రెస్… కొడకండ్ల, ఆంధ్రప్రభ : కొడకండ్ల

ప్రభ న్యూస్ 25 Nov 2025 9:13 pm

నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్

మాయమాటలు చెప్పి పెళ్లి పేరుతో మహిళల దగ్గర డబ్బు, బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయి తప్పించుకొని తిరుగుతున్న నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు భువనగిరి పట్టణ సీఐ రమేష్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప పట్టణానికి చెందిన సోమారపు సురేంద్ర 2021లో క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా భువనగిరి పట్టణానికి చెందిన మహిళకి పరిచయమై ఆమెకు తప్పుడు ఉద్యోగ, వ్యాపార వివరాలు చెప్పి నమ్మబలికి ‘మైనింగ్‌లో ఉన్నాను, కన్సల్టెన్సీ నడుపుతున్నాను, పెట్రోల్ బంక్ వచ్చేసింది‘ అంటూ తప్పుడు హామీలు ఇచ్చి రూ‘ 15,00,000 నగదును 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేసి 2024 నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ముందుగా మరొక మహిళ కృష్ణవేణిని వివాహం పేరుతో 12 లక్షల వరకు మోసం చేసి, రూ‘ 7,00,000కు రాజీ చేసుకున్న విషయం బయటపడిందని, కృష్ణ వేణి అతన్ని వెతుక్కుంటూ ఫిర్యాదు రాలి ఇంటికి రావడంతో, ఫిర్యాదురాలి తల్లిదండ్రులు భయట తెలిస్తే పరువు పోతుందని కృష్ణవేణీకి ఫిర్యాదురాలి తల్లిదండ్రులు రూ‘ 6,00,000 రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే మిడియేటర్ జూపల్లి కిరణ్ కుమార్ ద్వారా మరో మహిళ శైలజా విషయంలో కూడా 2.50 లక్షలు తీసుకొని మోసం చేసినాడని, తరువాత విజయవాడకు చెందిన రత్నకుమారి వద్ద కూడా సురేంద్ర 2 లక్షలు రూపాయలు మోసగించినట్లు ఫిర్యాదురాలికి తెలిసింది. వివాహం అయిన తర్వాత కూడా తనను ఇంటికి తీసుకెళ్లకుండా, తరచూ డబ్బులు, ఇంటి పేపర్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ, శారీరక, మానసిక హింస చేశాడని పెర్కోన్నారు. అతడి ప్రవర్తనపై విసుగు చెందిన మహిళ అతనిని ప్రశ్నించగా ‘మీకు నాకు సంబంధం లేదు, మీరు నాకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదని మెసేజ్ పెట్టి ఆమె ఫోన్ నంబర్ నీ బ్లాక్ చేసి ఆమెని వదిలి పారిపోయాడు. నిందితుడికి ఒక కరీంనగర్ కి చెందిన లేడితో 2017 లో వివాహం చేసుకొని 2020 లో ఆమెతో కూడా విడాకులు తీసుకున్నట్లు విచారణలో తేలినట్లు తెలిపారు. ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేసి ఎంతోమంది మహిళలను వివాహం పేరుతో మోసం చేశాడని, పిర్యాదురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన భువనగిరి పట్టణ సిఐ రమేష్ ప్రత్యేక బృందం ద్వారా నిందితుడు సోమవారపు సురేంద్రను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ రమేష్ తెలిపారు.

మన తెలంగాణ 25 Nov 2025 9:10 pm

Chemical Ice Cream |భీమవరంలో చెలగాటం…

Chemical Ice Cream | భీమవరంలో చెలగాటం… భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: చిన్నారులు,

ప్రభ న్యూస్ 25 Nov 2025 9:05 pm

మహా శివరాత్రి కానుకగా ’స్వయంభు’... అంచనాలు పెంచేసిన వీడియో

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ’స్వయంభు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ భారీ అప్‌డేట్‌ను ప్రకటించారు. రెండు సంవత్సరాల ప్రయాణం, 170 రోజుల ఇంటెన్స్ షూటింగ్ తర్వాత ఈ సినిమా మహత్తర చిత్రీకరణ పూర్తి చేసిందని టీం గర్వంగా ప్రకటించింది. భారతదేశపు వైభవమైన చరిత్రను, మహోన్నతను సెలబ్రేట్ చేస్తూ రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రం మీద పనిచేయడం సవాలుతో కూడుకున్నా అద్భుతమైన అనుభవం అని ‘రైజ్ ఆఫ్ స్వయంభు’ వీడియో షేర్ చేశారు నిఖిల్. ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ కంపోజర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

మన తెలంగాణ 25 Nov 2025 9:01 pm

Mulugu | 100% చీరల పంపిణీ పూర్తి….

Mulugu | 100% చీరల పంపిణీ పూర్తి…. ములుగు, ఆంధ్రప్రభ : ములుగు

ప్రభ న్యూస్ 25 Nov 2025 8:51 pm

Ex Miss India Legal Fight :  న్యాయం కోసం ..

Ex Miss India Legal Fight : న్యాయం కోసం .. (ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 25 Nov 2025 8:49 pm

Munugodu |అన్ని స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్ధం..

Munugodu | అన్ని స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్ధం.. మునుగోడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 25 Nov 2025 8:47 pm

కాలుష్య వాహనాలపై పిఎంఒ కఠిన చర్యలు

న్యూఢిల్లీ : ఢిల్లీఎన్‌సిఆర్‌లో అధ్వాన్నంగా తయారైన వాయు నాణ్యతను పరిష్కరించడానికి ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) చర్యలు చేపట్టింది. కాలుష్యానికి కారణమైన వాహనాలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రాజధానిలో ఎలెక్ట్రిక్ వాహనాల పర్యావరణాన్ని వ్యాపింప చేయాలని సూచించింది. ఢిల్లీలో గత రెండు వారాలుగా వాయు నాణ్యత పరమ అధ్వాన్నంగా ఉండడంతో ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి పిఎంఒ సమావేశం మంగళవారం జరిగింది. నిబంధనలను ఉల్లంఘించిన కాలుష్యకారక వాహనాలను పూర్తిగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీఎన్‌సిఆర్ ప్రాంతంలో ప్రమాణాలు పాటించని 37 శాతం వాహనాలు కాలం చెల్లినవని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీ రోడ్లపై అనేక సంఖ్యల్లో ఎలక్ట్రిక్ వాహనాలు నడిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సౌకర్యాల కల్పనకు చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పాలని , సబ్సిడీలు అందించాలని సూచించారు. సంప్రదాయ పెట్రోలు, డీజిల్ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించాలని కోరారు. 

మన తెలంగాణ 25 Nov 2025 8:40 pm

Village Secretariats to Get a Major Revamp : Pawan Sets March Deadline

The Andhra Pradesh government’s mission to clean up and restructure the Secretariat system has reached the final stage. After completing staff rationalisation and employee reclassification, the coalition government is now turning its attention to the most crucial part of the exercise, defining job responsibilities and streamlining the promotion process for employees. As part of this […] The post Village Secretariats to Get a Major Revamp : Pawan Sets March Deadline appeared first on Telugu360 .

తెలుగు 360 25 Nov 2025 8:37 pm

డిసెంబర్ 30 నుండి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధి, విధానాలు వివరాలు ఇలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎల్క్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27వ తేది ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/, మొబైల్ యాప్ https://apps.apple.com/in/app/ttdevasthanams/, వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు భక్తులకు అందించబడతాయి. వాట్సాప్ బాట్ లో నమోదు చేసుకునే విధానం వాట్సాప్ బాట్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నెంః 9552300009 కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతఉం ఇంగ్లీష్, తెలుగు భాషలను సెలక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కోసం EN, తెలుగు కోసం TE అని రిప్లై ఇవ్వాలి. అనంతఉం మీరు ఎంచుకున్న బాషలో సర్వీస్ విండో కనిపిస్తుంది. ఆసర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ఓపెన్ చేయాగానే వైకుంఠ ద్వార దర్శనం (డిప్) రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలను ఎంపిక చేసుకుని కన్ఫర్‌మ చేయాలి. తర్వాత చిరునామా, పిన్ కోడ్ నమోదు చేయాలి. అనంత్రం డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో మీకు దర్శనం కావాల్సిన రోజులను లేదా మూడు రోజులను ప్రయారిటీ ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత భక్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వయస్సు, లింగం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత వివరాలను సరి చూసుకుని SUBMIT చేయాల్సి ఉంటుంది. ఒకసారి చేసిన పేర్లను మార్చడానికి వీలు పడదు. ఆధార్ నంబర్, , పిన్ కోడ్ ను తప్పుగా నమోదు చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తుల వివరాలు విజయవంతంగా SUBMIT చేయాగానే ACKNOWLOmGEMENT మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రిఫరెన్సుగా నెంబర్‌గా పరిగణించడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది. మొదటి మూడు రోజులు సర్వదర్శనం , శ్రీవాణి దర్శనాలు రద్దు వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులైన డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో ఎస్ ఈ డి , శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ పది రోజుల పాటు, తిరుమల, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్ లైన్ లో శ్రీవాణిదర్శన టికెట్లు జారీ చేయబడవు. పది రోజుల పాటు తిరుపతిలో సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయడం జరుగుతుంది. జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా సర్వ దర్శనం వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నారు. భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈరోజుల్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబడవని తెలియజేయడమైనది. జనవరి 2 నుండి 8వ తేది వరకు ఎస్ ఇ డి , శ్రీవాణి దర్శన టికెట్ల జారీ వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు. డిసెంబర్ 5వ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్‌ఆర్‌ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు దర్శనం జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు. ఇందులో తిరుపతి, చంద్రగిరి , రేణిగుంట స్థానికులకు రోజుకు 4500 టోకెన్లు కేటాయించగా, తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లు కేటాయించారు. ఈ టోకెన్లు డిసెంబర్ 10 తేదిన ఆన్ లైన్ లో విడుదల చేయబడతాయి. ఒక్కో వ్యక్తి 1+3 విధానంలో టోకెన్లు బుకింగ్ చేసుకోవచ్చు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ దర్శనం వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఈ రోజులకు సంబంధించి తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ రోజుల్లో ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడమైనది. ఆన్ లైన్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్ కు అవకాశం రూ.కోటి ఆపైగా విరాళం ఇచ్చిన దాతల వారి కుటుంబ సభ్యులకు డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు రోజుకు 125 మందికి దర్శనం కల్పించునున్నారు. రూ.లక్ష నుండి రూ.99 లక్షల వరకు విరాళం ఇచ్చిన దాతలకు డిసెంబర్ 30, 31 వ తేదిల్లో రోజుకు 1000 మందికి, జనవరి 1వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు 2వేల మందికి దర్శనం కల్పించునున్నారు. వీరు కూడా ఆన్ లైన్ అప్లికేష్న్ లో డిసెంబర్ 5వ తేదిన ఉదయం 10 గంటలకు విడుదల చేసే టికెట్లను ఇప్పుడున్న విధానంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.అన్ని వర్గాల భక్తులకు దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయాలను గమనించి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.

మన తెలంగాణ 25 Nov 2025 8:37 pm

క్రైస్తవ అధికారి అపీలును తిరస్కరించిన సుప్రీం

న్యూఢిల్లీ :ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి తిరస్కరించినందుకు తనను విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ మాజీ క్రిస్టియన్ ఆర్మీ అధికారి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఇది అత్యంత దారుణమైన క్రమశిక్షణారాహిత్యంగా వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ జాయ్‌మాల్యలతో కూడిన ధర్మాసనం ఆర్మీ చర్యలను సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మాజీ క్రిస్టియన్ ఆర్మీ అధికారి శామ్యూల్ కమలేశన్ సైనిక క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారని సుప్రీం పేర్కొంది. ఆయన ఎలాంటి సందేశం పంపుతున్నారు? ఇది పూర్తిగా క్రమశిక్షణ రాహిత్యం.ఒకసారి ఆర్మీ యూనిఫాం ధరించాక వ్యక్తిగత అభిప్రాయాలు,విశ్వాసాలకు అవకాశం ఉండకూడదు. ఆ సైనికాధికారి అత్యుత్తమంగా విధులు నిర్వర్తించే వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించే స్వభావం ఆర్మీకి సరిపోదు అని కోర్టు పేర్కొంది. కమలేశన్ తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపిస్తూ ఒకే ఒక్క ఉల్లంఘనకే ఆయనను విధుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. హోళీ, దీపావళి వంటి పండగల్లో పాల్గొని ఇతర మతాల వ్యక్తులతో గౌరవంగా వ్యవహరిస్తుంటారని వాదించారు. పంజాబ్ లోని మమున్‌లో గురుద్వారా,ఆలయం మాత్రమే ఉన్నాయని, అధికారులు ఇచ్చిన ఆదేశాల్లో గర్భగుడి లోకి ప్రవేశించడానికి మాత్రమే ఆయన నిరాకరించారని చెప్పారు. ఈ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. 

మన తెలంగాణ 25 Nov 2025 8:36 pm

Huge Boost needed for Andhra King Taluka

After years, Ram is testing his luck with a sensible film titled Andhra King Taluka which is also loaded with an emotional love story. The songs gained popularity and Andhra King Taluka is a different attempt. With just two days left for the film’s release, Andhra King Taluka needed a huge boost through the pre-release […] The post Huge Boost needed for Andhra King Taluka appeared first on Telugu360 .

తెలుగు 360 25 Nov 2025 8:31 pm

100 క్వింటాల పత్తి దగ్ధం

ఇల్లందు  మండలంలోని నెహ్రునగర్ గ్రామంలో భరత్ చంద్రా ట్రైడర్స్ ప్రోప్రైటర్ బాలక్రిష్ణ రైతుల నుండి కొనుగోలు చేసినటువంటి పత్తి తేమశాతం ఉందనుకొని పత్తిని ఆరపెట్టాడు. ఈ  క్రమంలోగుర్తు తెలియని వ్యక్తులు పత్తిలో అగ్గిపడేయడంతో పత్తి పూర్తిగా దగ్థమైనది. దీంతో వ్యాపారి బాలక్రిష్ణ తీవ్ర దిగ్బ్రాంతికి గురి అయ్యారు. బాలక్రిష్ణ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

మన తెలంగాణ 25 Nov 2025 8:30 pm

ఏదో ఒకటి తేల్చేయండి.. అధిష్టానానికి సిఎం సిద్ధరామయ్య..

గందరగోళానికి తెరదించండి ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటా అధిష్టానానికి కర్నాటక సిఎం సిద్ధరామయ్య స్పష్టీకరణ అది నలుగురి మధ్య జరిగిన రహస్య ఒప్పందం పార్టీని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు: డికె శివకుమార్ బహిరంగంగా చర్చించబోం: ఖర్గే బెంగళూరు/కనకపుర/న్యూఢిల్లీ: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం రసకందాయానికి చేరుకుంటోంది. ఇప్పటి వరకు ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటిస్తూ వచ్చిన సిఎం సిద్ధరామయ్య స్వరంలో మార్పులు వస్తున్నాయి. కొద్ది రోజులుగా ప్రభుత్వంలో, పార్టీలో ఈ అంశంపై సాగుతున్న గందరగోళానికి హైకమాండ్ తెరదించాలని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని మంగళవారంనాడు మీడియాతో వ్యాఖ్యానించారు. శాసనసభ్యులకు ఢిల్లీ వెళ్లే స్వేచ్ఛ ఉందని, వారి అభిప్రాయాన్ని హైకమాండ్‌కు చెప్పుకోవచ్చని అన్నారు. మరికొన్ని నెలల్లో అనూహ్య పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని కేంద్రమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందన వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా తాను, శివకుమార్ అలాగే చేయాలని పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి మార్పు అంశంపై బహిరంగంగా చర్చించడం తనకిష్టం లేదని, ఇది పార్టీలోని మా నలుగురైదుగురు మధ్య జరిగిన రహస్య ఒప్పందమని, తాను తనమనస్సాక్షిని నమ్ముతానని కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ మంగళవారం వెల్లడించారు. పార్టీని ఇబ్బంది పెట్టి , బలహీనపర్చడం తనకిష్టం లేదని వ్యాఖ్యానించారు. మంగళవారం ఖర్గే ఢిల్లీకి బయలుదేరుతుండగా ఆయనతోపాటు డికె విమానాశ్రయానికి వెళ్లడం గమనార్హం. ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ఫైనల్ అవుతుందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు శివకుమార్ బదులిస్తూ“ నన్ను ముఖ్యమంత్రిని చేయమని నేను అడగలేదు. ఇది ఐదుగురు ఆరుగురు మధ్య ఉన్న రహస్య ఒప్పందం. మనం మనస్సాక్షి ప్రకారం పనిచేయాలి” అని సమాధానం ఇచ్చారు. స్వంత నియోజకవర్గం కనకపురలో విలేకరులతో మాట్లాడుతూ..“ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన సీనియర్ నాయకులు. ఆయన పార్టీకి గొప్ప ఆస్తి. ముఖ్యమంత్రిగా ఏడున్నర ఏళ్లు పూర్తి చేశారు. (ఇదివరకు 2013 నుంచి 2018 వరకు సిద్ధరామయ్య సిఎంగా పనిచేశారు)” అని డికె వెల్లడించారు. మరోవైపు కర్నాటక పరిణామాలపై బహిరంగంగా చర్చించబోమని ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తాను రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చానని అన్నారు. 

మన తెలంగాణ 25 Nov 2025 8:22 pm

స్థానిక ఎన్నికల్లోనూ మాదే విజయం: కాంగ్రెస్ ఎంపి మల్లు రవి

త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎంపి డాక్టర్ మల్లు రవి ధీమాగా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సుఖ శాంతులతో ఉన్నందున స్థానిక ఎన్నికల్లో విజయం చేకూరుస్తారని విశ్వసిస్తున్నానని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని ఆయన చెప్పారు. పేదలకు సన్న బియ్యం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి రావాల్సి ఉన్న రూ. 3,500 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేస్తుందని ఆయన వివరించారు. విపక్షాల నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేయకుండా కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న ఉద్దేశంతో లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరు బాగుండడంతో జీర్ణించుకోలేకపోతున్న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మల్లు రవి విమర్శించారు.

మన తెలంగాణ 25 Nov 2025 8:15 pm

జుబిన్ గార్గ్‌ది హత్యే.. ప్రమాదవశాత్తు జరిగింది కాదు: అసోం సిఎం

గువాహటి: ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ ప్రమాదవశాత్తు మరణించలేదని, అది హత్యే అని మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. అయితే ఈహత్యకు గల కారణం కచ్చితంగా రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. అస్సామీస్‌తోపాటు బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో పాటలు పాడిన జుబిన్ సెప్టెంబర్ 19న సింగపూర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ గాయకుడి మరణాన్ని అస్సాం ప్రజలు ఏమాత్రం తట్టుకోలేకపోయారు. కుటుంబ సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో హిమంత ప్రభుత్వం దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. ఈ హత్యకేసు అంశంపై చర్చించాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఆయనను కుట్రపూరితంగా హత్యచేశారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, నిందితుల్లో ఒకరు ఆయనను హత్య చేయగా, మిగిలినవారు అతడికి సహకరించినట్టు దర్యాప్తులో తేలిందని వివరించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తుల పైనా పోలీసులు కేసు నమోదు చేశారని, డిసెంబర్‌లో ఛార్జిషీటు సమర్పించిన తరువాత ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారన్నారు. సిట్ మొదటి మూడు రోజుల్లోనే హత్య కేసు నమోదు చేసింది. మరోవైపు జుబిన్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ఏకసభ్య కమిషన్ వాంగ్మూలాలు నమోదు చేయడానికి, మరిన్ని సాక్షాలను సమర్పించడానికి దర్యాప్తును డిసెంబర్ 12 వరకు పొడిగిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ అనూహ్య రీతిలో జుబిన్ ప్రాణాలు కోల్పోయినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రమాదానికి గురైన జుబిన్‌ను సింగపూర్ ఆస్పత్రికి తరలించారని, అక్కడే ఆయన మృతి చెందినట్టు తర్వాత వార్తలు వచ్చాయి. జుబిన్ బ్యాండ్‌మేట్ శేఖర్‌జ్యోతి గోస్వామి గాయకుడు జుబిన్‌కు విషమిచ్చి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 25 Nov 2025 8:13 pm

Telangana Panchayath Elections on December 11, 14 & 17

Telangana Panchayath elections will be held on December 11, 14 and 17. Telangana State Election Commission released the notification for the Panchayath elections on Tuesday. Elections to 12,728 Gram Panchayaths will be held in three phases. The fresh notification puts to end the suspense over the much awaited Panchayat elections in Telangana state. Telangana State […] The post Telangana Panchayath Elections on December 11, 14 & 17 appeared first on Telugu360 .

తెలుగు 360 25 Nov 2025 8:10 pm

Chandrababu Clears Decks for Major Administrative Reform: Three New Districts and Five Revenue Divisions Soon

Andhra Pradesh is heading for another round of administrative reshaping. After weeks of consultations, Chief Minister N. Chandrababu Naidu has approved the creation of three new districts and five new revenue divisions, giving long-pending public demands a clear direction. This move comes after the coalition government decided to revisit the previous YSRCP administration’s district reorganization, […] The post Chandrababu Clears Decks for Major Administrative Reform: Three New Districts and Five Revenue Divisions Soon appeared first on Telugu360 .

తెలుగు 360 25 Nov 2025 8:08 pm

3.39 crores |వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ

3.39 crores | వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ 3.39 crores

ప్రభ న్యూస్ 25 Nov 2025 7:52 pm

Rs.700 crore |డీసీఎల్ ఆఫీస్ వ‌ద్ద ధ‌ర్నా

Rs.700 crore | డీసీఎల్ ఆఫీస్ వ‌ద్ద ధ‌ర్నా Rs.700 crore |

ప్రభ న్యూస్ 25 Nov 2025 7:47 pm

T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..

న్యూఢిల్లీ: T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ మెగా టోర్నమెంట్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మంగళవారం ఐసిసి అధికారికంగా ప్రపంచకప్ షెడ్యూల్ ను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. మొత్తం ఎనిమిది వేదికలపై ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత్ లో ఐదు వేదికలు... ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే స్టేడియం, చెన్నైలోని MA చిదంబరం స్టేడియం, శ్రీలంకలోని మూడు వేదికలు.. కొలంబోలోని R ప్రేమదాస స్టేడియం, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కాండీలోని పల్లెకే స్టేడియం ఈ గ్లోబల్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తాయి. కాగా, టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక్కో గ్రూపులో ఐదు టీమ్‌లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్‌లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. ఇలా మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. అహ్మదాబాద్ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఒకవేళ ఫైనల్ కు పాక్ జట్టు వస్తే.. వేదిక శ్రీలంకకు మారుతుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది దేశాలు భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది.

మన తెలంగాణ 25 Nov 2025 7:46 pm

పార్టీ బలోపేతం..ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో., న (జనం సాక్షి). జిల్లాలో బలోపేతం తో పాటు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని డి.సి.సి అధ్యక్షులు …

జనం సాక్షి 25 Nov 2025 7:32 pm

3500 houses |పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు

3500 houses | పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు 3500 houses | దేవరకొండ,

ప్రభ న్యూస్ 25 Nov 2025 7:30 pm

Manchiryala |ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న స్థానికులు

Manchiryala | ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న స్థానికులు Manchiryala | నస్పూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 25 Nov 2025 7:22 pm

భాగ్యశ్రీ బోర్సే తో రిలేషన్ పై స్పందించిన రామ్ పోతినేని

రామ్ పోతినేని హీరోగా పి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ చిత్రంతో రామ్ ఒక స్టార్ హీరోకు అభిమాని పాత్రలో నటించారు.ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.. అయితే వీరిద్దరే డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రామ్ పోతినేని. వీరిద్దరూ పై వస్తున్న రూమర్స్ పై రామ్ స్పందించారు. ఈ సినిమా కోసం నేను ప్రమ గీతం రాశాను. అప్పటి నుంచే రూమర్స్ మొదలయ్యాయని, మనసులో ఏమీ లేకపోతే అంత గొప్పగా పాట ఎలా రాయగలరని అందరూ అనుకున్నారన్నారు. కానీ ,నేను ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ ప్రాతలను ఊహించుకొని మాత్రమే లిరిక్స్ రాశానని, ఈ పాట రాసినప్పటికి అసలు హీరోయిన్ ఎంపిక జరగలేదన్నారు.

మన తెలంగాణ 25 Nov 2025 7:21 pm

Rs 35 lakhs |రూ.35 లక్షలతో సీసి రోడ్డు..

Rs 35 lakhs | రూ.35 లక్షలతో సీసి రోడ్డు.. Rs 35

ప్రభ న్యూస్ 25 Nov 2025 7:18 pm

Adilabad |అంగన్వాడీల వేతనాలకు చట్టబద్ధత కల్పించాలి…

Adilabad | అంగన్వాడీల వేతనాలకు చట్టబద్ధత కల్పించాలి… Adilabad | ఆంధ్రప్రభ బ్యూరో,

ప్రభ న్యూస్ 25 Nov 2025 7:12 pm

School |రోడ్డెక్కిన విద్యార్థులు…!

School | రోడ్డెక్కిన విద్యార్థులు…! School | ఇచ్చోడ, ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 25 Nov 2025 7:07 pm

Fresh Troubles for NBK’s Aditya 999?

Nandamuri Balakrishna has been in plans to take up the sequel for Aditya 369 from a long time and he announced that the film is titled Aditya 999. Balakrishna announced that he would direct the film but he changed his plans. He handed the responsibility to sensible director Krish. The talented director also announced the […] The post Fresh Troubles for NBK’s Aditya 999? appeared first on Telugu360 .

తెలుగు 360 25 Nov 2025 7:07 pm

MLA |ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం…

MLA | ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం… MLA | మాడుగుల పల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 25 Nov 2025 6:59 pm

మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల అయ్యింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 11న తొలి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరపనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. నవంబర్ 27 నుండి మొదటి విడత నామినేషన్ ప్రారంభం కానుంది. అలాగే, నవంబర్ 30 నుండి రెండవ విడత నామినేషన్.. డిసెంబర్ 3 నుండి మూడవ విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాగా, ఈ మూడు విడతల్లో మొత్తం 12,760 పంచాయతీలు.. లక్షా 13 వేల 534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహించి.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో  ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

మన తెలంగాణ 25 Nov 2025 6:53 pm