SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

పాలమూరులో కోరలు చాస్తున్న గంజాయి

ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు ముఖ్యంగా పాలమూరు పట్టణంలో గంజాయి కోరులు చాస్తూ బుసలు కొడుతోంది. రోజురోజుకు గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది. ఇప్పటి దాక హైదరాబాద్ నగరాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ ముఠాలు ఇప్పుడు పాలమూరుపై కన్నేశాయా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇందుకు ఉదాహరణలు గత నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే గంజాయి మత్తు ఎలా గమ్మత్తుగా యువతను పెడదారిలోకి నెడుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. గంజాయిని అరికట్టాల్సిన పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయం లేక పోవడం, ఉదాసీనంగా ఉండడంతో గంజాయి బ్యాచ్‌లు రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సీరియస్ వార్నింగ్‌లు ఇస్తున్నా, ఇక్కడ ఆయన ఆదేశాలు అమలు కావడం లేదనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా, రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ది ఉమ్మడి పాలమూరు జిల్లానే కావడం గమనార్హం. ఇద్దరు పెద్దలు ఉన్న జిల్లాలో గంజాయి మూడుపువ్వులు ఆరుకాయలుగా వ్యాపారం దర్జాగా సాగుతుందంటే పరిస్ధితులు ఇక్కడ ఎంత అధ్వానంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీంలు గట్టి నిఘా వేయడంలో విఫలం అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో తిష్ట వేసిన ముఠాలు ముఖ్యంగా జిల్లా కేంద్రంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. పోలీసులు, నిఘా నేత్రాల కళ్లుగప్పి ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లార్లు ఈ దందా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో వన్‌టౌన్, బండ్లగేరి, మినీ ట్యాంక్ బండ్, మోటార్ లైన్, వీరన్నపేట, రైల్వేస్టేషన్ రోడ్, ప్రేమ్‌నగర్, మర్లు, రూరల్ ప్రాంతాల్లోనూ విక్రయాలు రహస్యంగా జరుగుతున్నాయి. ఆరు గ్రాముల గంజాయి ప్యాకెట్ ధర రూ. 400 నుంచి రూ. 500 దాక విక్రయిస్తున్నారు. వీటి విక్రయాలు వెనుక హైదరాబాద్ ముఠాల హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ముఠా ఇక్కడి కొన్ని ముఠాలతో చేతులు కలిపి ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోకి గద్వాల జిల్లా మీదుగా కర్నాటక, నారాయణపేట మీదుగా మహారాష్ట్ర నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి, నల్లమల్ల నుంచి నాగర్‌కర్నూలు జిల్లాలకు సరఫరా అవుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాలు కూడా ఇప్పుడు గంజాయి మత్తులో జోలపాటగా మారింది. మాట్లాడితే దాడులే:  గంజాయికి అలవాటు పడిన యువత మత్తులో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు. మత్తులో వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ప్రధానంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్యన ఉన్న యువతనే ఈ గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా పేద కాలనీల్లోని పేద యువతనే దీని మత్తుకు చిత్తు అవుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ చేసి దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న సాయిచరణ్ గత నెల 16వ తేది వన్‌టౌన్ నుంచి బండ్లగేరి మీదుగా రాత్రి వెళ్తున్న సమయంలో బండ్లగేరి దగ్గర ఉన్న 7 మంది అడ్డగించారు. అప్పటికే గంజాయి సేవించిన ఆ బ్యాచ్ లో ఉన్న కొందరు సాయిచరణ్‌ను డబ్బులు డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో కడుపులో గుద్ది తీవ్ర గాయాలకు గురిచేశారు. ఆసుపత్రిలో చేరిన ఆ యువకుడికి కుడివైపున ఒక అవయవం పూర్తిగా దెబ్బతిందని వైద్యులు చెప్పారు. కొత్త బస్టాండ్ సమీపంలోని ఒక కాలనీలో కొందరు యువత రాత్రి సమయంలో ఇళ్లపై దాడులు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మినీ ట్యాంక్ బండ్, పట్టణ సమీపంలో బైపాస్, రియల్ ఎస్టేట్ వెంచర్లలలో ఈ దందా జరగడమే కాకుండా గంజాయి సేవిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయికి అలువాటుపడిన యువత ఇంకా ఎలాంటి అఘాయిత్యాలకైనా పాల్పడే ప్రమాదాలు లేక పోలేదు. మచ్చుకు కొన్ని సంఘటనలు:  ఇటీవల జడ్చర్ల నియోజకవర్గంలో బాలనగర్ మండల పరిధిలోని గుండేడు నుంచి గుడిత్యాల వెళ్లేదారిలో ఉన్న కిరాణ షాపులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురుపై దాడులు చేసి లక్ష విలువ చేసే 1.2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విక్రయాలు జరుపుతున్న కిషన్, నేనావత్ కృష్ణ, అతని భార్య లాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబ్‌నగర్ పరిధిలోని మయారి పార్క్ దగ్గర గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే ఇటీవల నారాయణపేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి, రూ. 5 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఊట్కూర్ మండల పరిధిలో అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 125 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే గద్వాల జిల్లాలో మహరాష్ట్ర నుంచి గద్వాలకు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వనపర్తి జిల్లాలో ఏకంగా 2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జడ్చర్లలో 6 నెలల వ్యవధిలోనే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత ఏడాదిలో 22 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 19 కేసులు నమోదు అయ్యాయి. ఇవి కేవలం గంజాయి పట్టుబడ్డవి మాత్రమే. అయితే పట్టుబడకుండా రహస్యంగా ఈ గంజాయి అమ్ముతున్న చీకటి దందా పెద్దగానే జరుగుతున్నట్లు సమాచారం. చట్టం ఏమి చెబుతోంది?: గంజాయి, డ్రగ్స్ విక్రయించినా, తాగినా చట్టం ప్రకారం శిక్షార్హులే. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టన్సెస్ యాక్ట్ (ఎన్‌డిపిఎస్) 1985 ప్రకారం పది సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ కేసు కింద పోలీసులు నమోదు చేస్తే తాను నేరం చేయలేదని నిందితుడే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో బెయిల్ రావడం చాలా కష్టం. కొందరు తెలిసో తెలియకనో ఈ గంజాయి వలలో చిక్కుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పట్టుబడితే ఇక జైలు జీవితం గడపాల్సిందే. ఇక గంజాయి, డ్రగ్స్ సేవించే వారికి కూడా చట్టంలో కఠినంగా ఉన్నాయి. గంజాయి సేవిస్తే రక్తనమూనాలో ఆ ఆనవాళ్లు 48 గంటల పాటు ఉంటుంది. గంజాయి తాగినట్లు పోలీసుల వద్ద ఉన్న కిట్లలో నమోదైతే కేసులు నమోదు చేస్తారు. బెయిల్ అంత త్వరగా రావడం కష్టమే. ఇక నేరం రుజువైతే ఏడాది జైలు శిక్ష, జరిమానాలు కూడా విధించే అవకాశాలు ఉన్నాయి.  - బిజి. రామాంజనేయులు 90598 95411 (బ్యూరో ఇంచార్జీ మహబూబ్‌నగర్) 

మన తెలంగాణ 19 Oct 2025 10:29 am

వాటర్ ట్యాంక్ కూలి తల్లీకుమారుడు మృతి

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఇంటి పైనున్న వాటర్ ట్యాంక్ పడి తల్లీ కుమారుడు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పి నాగమణి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి హోటల్ ప్రారంభించింది. రేకుల షెడ్డు పై వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. రేకులపై బరువు ఎక్కువగా ఉండడంతో వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సంఘటనలో తల్లి పి నాగమణి(32), కుమారుడు వంశీకృష్ణ(6) ఘటనా స్థలంలోనే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

మన తెలంగాణ 19 Oct 2025 10:26 am

ప్రభుత్వ విప్ పరామర్శ

ప్రభుత్వ విప్ పరామర్శ ఆంధ్రప్రభ ప్రతినిధి. యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 19 Oct 2025 10:24 am

రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల పెంపు

తెలంగాణలో బిసి రిజర్వేషన్ అంశం రాజకీయ, చట్టపరమైన చర్చలకు కేంద్రబిందువుగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ‘కామారెడ్డి బిసి డిక్లరేషన్’ ద్వారా స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42% రిజర్వేషన్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్ వద్దకు పంపితే అది అటునుంచి రాష్ట్రపతికి చేరింది. నెలలు గడుస్తున్నా ఆమోదం పొందకపోవడం, హైకోర్టు సెప్టెంబర్ 30 లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించమని ఆదేశించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ జిఒ నెం. 9 జారీ చేసింది. గ్రామ, వార్డుస్థాయి ఎన్నికల్లో 42% రిజర్వేషన్‌ను అమలు చేయాలని ఉద్దేశించింది. ఇది రాజ్యంగ విరుద్ధంగా తీసుకురాబడిందని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం, పిటిషనర్ తరపున వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఈ జిఒపై మధ్యంతర స్టే ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ బ్రేక్ పడింది. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపడేసినట్టు అయింది. రాజకీయ, చట్టపరమైన వర్గాల్లో ఈ స్టే చర్చనీయాంశమైంది. చాలామంది ఈ స్టేను ముందుగానే ఊహించారు. కొందరు నాయకులు స్థానిక అభ్యర్థుల్ని ‘ఎన్నికల ముందు ఖర్చులు పెట్టకండి’ అని హెచ్చరించారు. ఈ అంశం కేవలం స్టేకి మాత్రమే పరిమితం కాదు. ఇది భారత రిజర్వేషన్ విధానం, రాజ్యాంగ సవాళ్లు, రాజకీయ మార్పులతో ముడిపడి ఉంది. ముఖ్యంగా, రిజర్వేషన్‌కు ‘ట్రిపుల్ టెస్ట్’ సామాజిక, విద్యా వెనుకబాటుతనం, సరైన ప్రాతినిధ్యం లేకపోవడం, రిజర్వేషన్లు యాభై శాతానికి లోబడి ఉండడం మొదలైన అంశాల్ని 1992 ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయించింది. 2024 తెలంగాణ కులగణన సర్వే డేటా ఈ టెస్ట్‌కు అవసరమైన ఎంపిరికల్ లోపాలను ఎత్తిచూపుతోందన్న విమర్శలు వస్తున్నాయి. 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ జనాభా 3.50 కోట్లు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత ప్రభుత్వం చేసిన 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3.63 కోట్లు. కానీ 2024 కులగణనలో మొత్తం జనాభా 3.70 కోట్లుగా నమోదైంది. 2011 నుండి 2014 మధ్య మూడేళ్లలో 13 లక్షలు (సగటున ఏడాదికి 4.33 లక్షలు) జనాభా పెరిగింది. బిసిల్లో దాదాపు 120 కులాలు ఉండగా, కేవలం నాలుగైదు కులాలు మాత్రమే రిజర్వేషన్ ద్వారా లబ్ధ్ది పొందుతున్నాయన్న ఆరోపణలు బిసి సమాజం నుండే వ్యక్తం అవుతున్నాయి. మేమెంతో మాకంత నినాదం సరైందే. కానీ, అన్నివర్గాల్లో ఒక శాతం కూడా లేని కులాలు రాష్ట్రంలో వందకు పైగా ఉన్నాయి. మరి వారికెలా రిజర్వేషన్ కేటాయిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ పెంపు ప్రయత్నాలు జరిగినపుడు కోర్టుల్లో న్యాయ సమీక్షకు గురైన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇక్కడే తమిళనాడులో 69% రిజర్వేషన్ ఎలా సాధ్యమైందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 1993లో జయలలిత ప్రభుత్వం తమిళనాడు బిసి, ఎస్‌సి, ఎస్‌టి (రిజర్వేషన్ ఆఫ్ సీట్స్) బిల్ -1993 తీసుకొచ్చి 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎఐఎడిఎంకె అలయన్స్ విజయం, పివి నరసింహారావు ప్రభుత్వం మెజారిటీకి ఎఐఎడిఎంకె మద్దతు అవసరం ఉండటంతో, 76వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని 1994లో 9వ షెడ్యూల్‌లో చేర్చారు. భూసంస్కరణల కోసం తీసుకురాబడిన ఈ షెడ్యూల్ న్యాయ సమీక్ష నుండి రక్షణ ఇస్తుంది. 2007 ఐఆర్ కోయల్హో కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్తూ 9వ షెడ్యూల్లో చేర్చబడిన చట్టాలు కూడా రాజ్యంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా లేకుంటే న్యాయ సమీక్షకు అతీతం కావని తెలిపింది. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తాము మతపరమైన రిజర్వేషన్‌కు వ్యతిరేకమని, ముస్లింలను బిసిల్లో చేర్చితే బిల్లుకు మద్దతు ఇవ్వమని బిజెపి బాహాటంగానే చెప్తుంది. రిజర్వేషన్ పెంపు జరిగితే మా వల్లనే జరిగిందని ప్రచారం చేసుకునే రాజకీయ పార్టీలు కనబడుతున్నాయి తప్ప రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా బిసి రిజర్వేషన్లు కల్పించాలని స్పృహలేకపోవడం శోచనీయం. కోర్టుకు వెళ్లకూడదనే హక్కు ఎవరికీ లేదు. రాజ్యంగబద్ధ్దంగా రిజర్వేషన్లు అమలు చెస్తే ఎంతమంది కోర్టుకు వెళ్లినా కోర్టులు కూడా న్యాయం పక్షానే నిలుస్తాయి. తమిళనాడు మోడల్ తెలంగాణలో సాధ్యం కాకపోవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ పాత జిఒలు, రీనోటిఫికేషన్‌తో ముందుకు వెళ్తుందా? లేదా సుప్రీంలో పోరాటం చేస్తుందా లేదా తమవంతు ప్రయత్నం తాము చేశామని ప్రజల్లోకి వెళ్లి, పార్టీపరంగా 42% సీట్లను బిసిలకు కేటాయిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. కేంద్రం 2026లో జనగణనతోపాటు కులగణన ప్రారంభిస్తుంది. దాని డేటా రిజర్వేషన్‌లపై ఏమేరకు ప్రభావం ఉంటుందో చూడాలి. తెలంగాణ కులగణన సర్వేలోపాలు, బిసిల్లో ముస్లిం, మైనార్టీలను కలపడం, బిసి ఉపవర్గీకరణ లేకపోవడం మొదలైనవి ట్రిపుల్ టెస్ట్‌కు సవాళ్లు. కోట్లాది మంది ఓటర్లు ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికలు ఆలస్యమైతే, గ్రామీణ అభివృద్ధి, సెంట్రల్ గ్రాంట్లు కూడా ప్రభావితమవుతాయి. బిసిలకు సమతుల్య ప్రాతినిధ్యం లేకపోతే, సామాజిక అసమానతలు పెరుగుతాయి. రాజకీయ పార్టీలు మేమే బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేవారమని చెప్పుకోవడం కంటే బలమైన ఎంపిరికల్ డేటా, ఉపవర్గీకరణతో రాజ్యాంగ, చట్టపరమైన మార్గాలు ఎంచుకోవాలి. - యం. అర్జున్

మన తెలంగాణ 19 Oct 2025 10:19 am

మృతుని ఇంటికి వెళ్ళి

మృతుని ఇంటికి వెళ్ళి ధర్మపురి(ఆంధ్రప్రభ) జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి

ప్రభ న్యూస్ 19 Oct 2025 10:15 am

సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా

వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రేమిస్తున్నా చిత్రం నుండి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నాను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకన్ల నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజ్డ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ “అన్ కండీషనల్ లవ్‌తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు. అద్భుతమైన పాటలు, సన్నివేశాలతో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు సాత్విక్ వర్మ, ప్రీతి నేహా, నిర్మాత కనకదుర్గారావు పప్పుల పాల్గొన్నారు. 

మన తెలంగాణ 19 Oct 2025 9:45 am

గ్రీస్‌లో ఆటా పాట

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ గ్రీస్‌లో జరుగుతోంది. ఈ చిత్రం లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం తీవ్రంగా శ్రమిస్తూ షూటింగ్‌ను పూర్తి చేస్తోందట. గ్రీస్ షెడ్యూల్ శరవేగంగా సాగుతోందని తెలిసింది. దర్శకుడు మారుతి సారథ్యంలో టెక్నికల్ టీమ్ అత్యంత వేగంగా పనిచేస్తోందట. ప్రభాస్, మాళవిక మోహనన్ సహా మొత్తం బృందం ప్రస్తుతం గ్రీస్‌లో పాట చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. 

మన తెలంగాణ 19 Oct 2025 9:39 am

బోర్డర్ చెక్ పోస్ట్ పై ఏసీబీ సోదాలు

బోర్డర్ చెక్ పోస్ట్ పై ఏసీబీ సోదాలు అశ్వారావుపేట: నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలోని

ప్రభ న్యూస్ 19 Oct 2025 9:28 am

TDP MLA Loses ₹1.07 Crore to Cybercriminals Posing as Police

In yet another shocking case that highlights the growing menace of online fraud, Telugu Desam Party (TDP) MLA Putta Sudhakar Yadav was duped of ₹1.07 crore by cybercriminals posing as Mumbai cybercrime officials. The fraudsters allegedly threatened to arrest him in a fabricated money laundering and human trafficking case, forcing him to transfer the money […] The post TDP MLA Loses ₹1.07 Crore to Cybercriminals Posing as Police appeared first on Telugu360 .

తెలుగు 360 19 Oct 2025 9:21 am

రొటీన్ ఫార్ములాతో అలరించలేకపోయిన ‘కె ర్యాంప్’

గత ఏడాది దీపావళికి ‘క’ మూవీతో పెద్ద హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈసారి కూడా ఈ పండగకు ‘కె ర్యాంప్’ సిని మాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు జైన్స్ నాని రూపొందించిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించారు. ఈ చిత్రం శనివారం థియేటర్లలో విడుదలైంది. అయితే హీరో కిరణ్‌కు ఈ దీపావళి కూడా విజయాన్నందించిందా? లేదా? తెలుసు కుందాం పదండి. కథ: కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) తండ్రి బాగా డబ్బున్న వాడు. చిన్నప్పటి నుంచి అతడికి చదువు మీద ధ్యాస ఉండదు. ఎప్పుడూ తాగుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. తన దగ్గర ఉంటే కొడుకు బాగుపడట్లేదని.. కుమార్‌ను కేరళలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో డొనేషన్ కట్టి చేర్పిస్తాడు అతడి తండ్రి. అక్కడికి వెళ్లాక కూడా కుమార్‌లో ఏ మార్పూ ఉండదు. అక్కడే అతడికి మెర్సీ (యుక్తి తరేజా) పరిచయం అవుతుంది. ఆమె చేసిన సాయానికి ఆనందపడి తనతో ప్రేమలో పడిపోతాడు కుమార్. నెమ్మదిగా మెర్సీ కూడా అతడిని ప్రేమిస్తుంది. తాను కోరుకున్న అమ్మాయి ప్రేమించిందని కుమార్ సంబరపడుతుంటే.. మెర్సీకి ఉన్న ఓ సమస్య గురించి అతడికి తెలుస్తుంది. అక్కడి నుంచి కుమార్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ మెర్సీ సమస్యేంటి? దాని వల్ల కుమార్ పడ్డ ఇబ్బందులేంటి? ఈ సమస్య పరిష్కారం అయిందా లేదా అన్నది మిగతా కథ. కథనం, విశ్లేషణ: ‘కెర్యాంప్’ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం పలు సన్నివేశాల్లో మందు తాగుతూ కనిపిస్తుంటాడు. ఇంట్రడక్షన్ సీన్‌లో హీరో తాగుతుంటాడు. హీరోయిన్ పరిచయ సన్నివేశంలో కూడా హీరో తాగుతూనే కనిపిస్తాడు. సినిమాలో తొలి పాటకు ముందు కూడా అదే పని చేస్తుంటాడు. ఫైట్ సీన్‌లో కూడా హీరోకు తాగితే కానీ కొట్టేంత బలం రాదు. సినిమాలో కథ కీలక మలుపు తిరిగే సీన్లో కూడా హీరో మందుకొట్టి కింద పడిపోయి ఉంటాడు. ఇలా సినిమాలో యువతకు హీరోను కనెక్ట్ చేయడానికి ‘మందు’ను మించిన మార్గం లేదని అనుకున్నారేమో తెలియదు మరి. హీరో పాత్రను ఇలా పరిచయం చేసి.. సిల్లీగా సీన్లు నడిపిస్తుంటే ఇక సినిమా మీద ఏం ఆశలు ఉంటాయి? కిరణ్ అబ్బవరం ‘క’కు ముందున్న ఫాంలోకే వెళ్లిపోతున్నాడనే అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా కాలేజీ, ప్రేమాయణం, హీరోయిన్ సమస్యను తెలియ చేయడంతో సాదాసీదాగా సాగింది. ప్రధాన పాత్రలకు ఏదో ఒక డిజార్డర్ పెట్టి కామెడీ పండించడంలో దర్శకుడు మారుతి దిట్ట. భలే భలే మగాడివోయ్.. మహానుభావుడు చిత్రాల్లో అతను ఇలాగే ప్రేక్షకుల మనసులు గెలిచాడు. వేరే దర్శకులు కూడా అతడిని అనుసరించారు. కానీ ఒక దశలో ఆ కథలన్నీ ఒకేలా అనిపించడంతో వాటిని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. కానీ కొంచెం గ్యాప్ తర్వాత కొత్త దర్శకుడు జైన్స్ నాని.. తన డెబ్యూ మూవీకి ఈ ఫార్ములానే ఎంచుకున్నాడు. చెప్పిన మాట మీద నిలబడకపోయినా.. టైం తప్పినా.. వెర్రెత్తి ప్రవర్తించే హీరోయిన్ పాత్ర చుట్టూ సీన్లు రాసుకున్నాడు. ఈ పాత్ర కొత్తగా అనిపించకపోగా కొన్ని చోట్ల బోర్ కొట్టించింది. చివరలో కథకు ఇచ్చిన ఎమోషనల్ టచ్ అంతగా కుదరక సినిమా నిరాశ కలిగిస్తుంది. ఇక సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య అన్ని ముద్దు సీన్స్ యూత్ కోసమే తీశారనిపిస్తుంది. ఇక జీవితంలో ఓ లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడి పాత్రలో కిరణ్ అబ్బవరం పర్వాలేదనిపించాడు. మెర్సీ జాన్ పాత్రలో యుక్తి తరేజా గ్లామర్ కోసమే నటించినట్లుంది. హీరోకి తండ్రిగా, వ్యాపారవేత్తగా సాయి కుమార్, వెన్నెల కిశోర్, అలీ, శ్రీనివాసరెడ్డి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’తో కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరపురాని ఆడియో ఇచ్చిన చేతన్ భరద్వాజ్.. ఈసారి యావరేజ్ పాటలే ఇచ్చాడు. రవీంద్ర రాజా మాటలు కొన్నిచోట్ల ఓకే అనిపించినా చాలా చోట్ల డైలాగ్స్ హద్దులు దాటిపోయాయి. దర్శకుడు జైన్స్ నాని ‘కె ర్యాంప్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. 

మన తెలంగాణ 19 Oct 2025 9:19 am

జాగృతి జనం బాటకు ఆశీస్సులు ఉండాలి

జాగృతి జనం బాటకు ఆశీస్సులు ఉండాలి తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి తిరుమల

ప్రభ న్యూస్ 19 Oct 2025 9:08 am

దీపావళి కానుకగా..

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను డైరెక్టర్ ఆర్.జె.బాలాజీ సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే దీపావళి కానుకగా ఈ చిత్రం నుండి ఓ మంచి ట్రీట్ ఇస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను దీపావళి కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మ్యూజిక్ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

మన తెలంగాణ 19 Oct 2025 9:07 am

ఆత్మవిశ్వాసంతో టీమిండియా

గెలుపే లక్షంగా ఆస్ట్రేలియా నేడు తొలి వన్డే పెర్త్: ఆసియా కప్ గెలుచుకుని జోరుమీదున్న టీమిండియా మరో సమరానికి సిద్ధం అయ్యింది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. అందులో భాగంగా తొలి వన్డే ఆదివారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. వన్డే సారథిగా శుభ్‌మన్ గిల్‌కు తొలి సిరీస్ కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఏడు నెలల అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టనున్నారు. దీంతో అందరి చూపూ మాజీ కెప్టెన్ రోహిత్, కోహ్లీ మీదే ఉంది. 2027 ఐసిసి వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగాలంటే వీరిద్దరూ ఈ సిరీస్‌లో అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. పైగా- కెప్టెన్సీ పోయిన తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం అతనిపై మరింత ఉండే అవకాశం లేకపోలేదు. ఈ మూడు మ్యాచ్‌లలో ఏ మాత్రం రాణించకపోయినా వారి కేరీర్‌కు ఎండ్ కార్డు పడనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 50 ఓవర్ల ఫార్మట్ లో సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్‌లో దిగడం ఇదే తొలిసారి కూడా. స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా కెఎల్ రాహుల్ తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకగా భావించే నంబర్ 4 స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బరిలో దిగొచ్చు. జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల బౌలింగ్ దళాన్ని మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ముందుండి నడపాల్సి ఉంది. వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్ స్పిన్నర్లుగా ఆడటం దాదాపుగా ఖాయమైనట్టే. ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి మొదటి వన్డే మ్యాచ్‌లో ఆడొవచ్చు. ఆస్ట్రేలియాకు గాయాల బెడదా.. మరోవైపు- మిచెల్ మార్ష్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఆస్ట్రేలియా.. టీమిండియాను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది. గాయాలు ఆ జట్టును కలవరపెడుతున్నాయి. మాట్ రెన్‌షా, మిచ్ ఓవెన్ మిడిల్ ఆర్డర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. జోష్ ఫిలిప్ 2021 తర్వాత తన తొలి వన్డే ఆడనున్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ మాట్ కుహ్నెమాన్ కూడా తొలి మ్యాచ్ ఆడనున్నాడు. స్వదేశంలో ఇదే అతనికి తొలి మ్యాచ్. అయినా వారు దేశవాళీలో రాణించిన అనుభవం లేకపోలేదు. ట్రావీస్ హెడ్, ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, మాట్ రెన్షా, జోష్ ఫిలిప్, మిఛెల్ ఓవెన్ వంటి బ్యాటర్లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. మిఛెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాట్ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్ వంటి బౌలర్లతో బౌలింగ్ విభాగం సయితం ప్రమాదకరంగా ఉంది. దీంతో ఆసీస్ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఇక, వారికి సొంత గడ్డ, సొంతం మైదానం కాబట్టి వానికి కలిసొచ్చే అవకాశాలూ ఉన్నాయి.

మన తెలంగాణ 19 Oct 2025 8:38 am

Telugu Family Tragedy in the US: Mother and Daughter Killed in Chicago Road Accident

In a heartbreaking incident, a 52-year-old woman and her 32-year-old daughter from Mancherial, Telangana, lost their lives in a road accident near Chicago, United States, on Saturday. The victims, identified as Rama Devi and Tejaswi, died instantly when the family’s car was struck by a trailer. Several other family members sustained injuries in the crash. […] The post Telugu Family Tragedy in the US: Mother and Daughter Killed in Chicago Road Accident appeared first on Telugu360 .

తెలుగు 360 19 Oct 2025 8:31 am

Bigg Boss Telugu 9 Weekend: Bigg Questions, Bigg Clarity, and Hidden Biases

The weekend episode of Bigg Boss Telugu 9 took a sharp turn toward reality, as Nagarjuna decided to hold the housemates accountable for their words, actions, and biases. The day was a perfect mix of drama, fun, and confrontation—with a few emotional moments and strong lessons tucked in. Kitchen Clash Sparks the Day The episode […] The post Bigg Boss Telugu 9 Weekend: Bigg Questions, Bigg Clarity, and Hidden Biases appeared first on Telugu360 .

తెలుగు 360 19 Oct 2025 7:57 am

అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది.... తాగుబోతుల వీరంగం

అమరావతి: ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తిలో మందుబాబుల వీరంగం సృష్టిస్తున్నారు. బైక్ వెళ్తుండగా మ‌ద్యం మ‌త్తులో మ‌హిళ‌తో ముగ్గురు యువ‌కులు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌హిళ బంధువులు, స్థానికులు మందుబాబుల‌కు దేహ‌శుద్ధి చేశారు. వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తిరుపతి సమీపంలోని గూడూరులో విద్యార్థులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల హల్‌చల్ చేశారు. జర్నలిస్టు, షాపు యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. సాధుపేట సెంటర్ లో దాడులకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జర్నలిస్టుకు కూడా భద్రత క‌రువైందని, లా అండ్ ఆర్డ‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌పై విమ‌ర్శ‌లు వస్తున్నాయన్నారు. గూడూరులో తరచూ విద్యార్థుల దాడులపై పోలీస్ అధికారులు దృష్టిసారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క జర్నలిస్టుకు భద్రత లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో గంజాయి రాయుళ్లు వీరవిహారం చేస్తున్నారు. తిరుమలకు వచ్చిన భక్తులపై దాడులు జరిగిన దాఖలలు చాలానే ఉన్నాయన్నారు. మందుబాబులు, గంజాయి రాయుళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలేదన్నారు. పోలీసులు ఉన్నారా? లేరా? సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో భక్తులు వస్తూ పోతూ ఉంటారు, వాళ్లకు రక్షణ లేకుండాపోయిందని నెటిజన్లు వాపోతున్నారు. మద్యం మత్తులో బైక్ లపై విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాళ్లు వాపోతున్నారు. ఇప్పటికే తిరుపతి నగరంలో ఎన్నో సంఘటన జరిగిన కూడా శాంతి భద్రతల విషయంలో మార్పు రావడం లేవని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మన తెలంగాణ 19 Oct 2025 7:52 am

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి పవిత్ర సమర్పణ

తిరుపతి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన శ‌నివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు. శనివారం ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ఆల‌యంలోని మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డీప్యూటీ ఇఒ వరలక్ష్మి, సూపరింటెండెంట్‌ ర‌మేష్‌, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధ‌న‌శేఖర్, ఆల‌య అర్చకులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 19 Oct 2025 7:32 am

రష్యా ఆయిల్‌ కొనుగోళ్లను భారత్‌ ఆపేయబోతోంది

` మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్‌ అంగీకరించిందని, ఈ మేరకు తన స్నేహితుడు, ఆ దేశ ప్రధాని …

జనం సాక్షి 19 Oct 2025 7:18 am

సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు

` విధి నిర్వహణలో అలసత్వం సరికాదు ` పథకాల పనుల అమల్లో నిర్లక్ష్యాన్ని సహించం ` అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరిక హైదరాబాద్‌(జనంసాక్షి):సొంత నిర్ణయాలను పక్కన …

జనం సాక్షి 19 Oct 2025 7:10 am

తల్లిదండ్రులను సాదకపోతే జీతం కట్‌

త్వరలోనే దీనిపై చట్టం తీసుకొస్తాం ఉద్యోగుల జీతాల్లో కోత విధించి తల్లిదంద్రులకు అందజేస్తాం గ్రూప్‌`2 అభ్యర్థులకు ఉద్యోగ పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌ తల్లుల కన్నీళ్లు తుడిచే …

జనం సాక్షి 19 Oct 2025 7:09 am

తల్లిదండ్రుల బాగోగుల కోసం ప్రత్యేక చట్టం

మన తెలంగాణ/హైదరాబాద్: నిస్సహాయకుల కు సహాయం అందించడమే మన బాధ్యత అని గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవ డం మన బాధ్యత అని, అందుకు గ్రూప్2 విజేతలు అంకితమవుతారని పూర్తి విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ఉద్యోగార్థులు ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. వారి జీతంలో 10నుంచి 15శాతం కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తానని హెచ్చరించారు. ఒకటో తేదీ ఉద్యోగులకు జీతం ఎలా వస్తుందో.. అలాగే వారి తల్లిదండ్రుల అకౌంట్‌లో ఒకటో తేదీన పడుతుందని, దీని కోసం  త్వరలో చట్టం తీసుకొస్తామని వెల్లడించారు.ఆ చట్టం మీతోనే రాపిస్తామని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అందుకోసం కొత్తగా అధికారులు అయిన ఉద్యోగులతో ఒక కమిటీని నియమించాలని సిఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని గ్రూప్ 2 విజేతలకు సిఎం సూచించారు. తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రూప్ -2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు శనివారం శిల్ప కళావేదికలో సిఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఈషాన్‌రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థులు తమ జీవితాలను ధారపోసి ఆత్మబలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉంటూ వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కానీ, ఆనాటి రాజకీయ పార్టీల నాయకులు.. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాన్ని, తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షను ఆయుధంగా మార్చుకొని పదేళ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారని... కానీ, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు, బందు వర్గాన్ని ఆగర్భ శ్రీమంతులు చేయటం కోసమే పదేళ్లు పరిపాలన సాగిందని ఆరోపించారు. అల్లుడిని అంబానీగా, కొడుకును అదానీగా చేయడం కోసమే గత పదేళ్లు పాలన జరిగిందని విమమర్శించారు. గత ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు, హోదాలను తన కుటుంబీకులకే ఇఛ్చిందని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వెంటనే వారికి ఎంఎల్‌సిలు, ప్లానింగ్ కమిషన్‌లో పదవులు ఇచ్చిందని,కానీ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని అన్నారు. తన కుటుంబం, బంధువుల ఉద్యోగాల గురించి ఆలోచించినట్లు యువత గురించి, తెలంగాణ రైతాంగం గురించి, తెలంగాణ మహిళల గురించి ఆలోచించలేదని ఆక్షేపించారు. కానీ గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. గత పాలకకులు ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం..కూలేశ్వరం అయి ఉండేది కాదు అని, రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయి ఉండేదని కాదని, మూడేళ్లకే కూలిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగలేదని ఆక్షేపించారు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవని..కానీ, వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. పదిహేనేళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదంటే, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా..? అని ప్రశ్నించారు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్ 1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలను అందిస్తున్నామని తెలిపారు. తర్వాత గ్రూప్ 3 ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. నేను సిఎంగా ఉండకపోయినా.. మీరు అధికారులుగా ఉంటారు గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో తమపై బురద జల్లే ప్రయత్నం చేశారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు అని గ్రూప్ 2 విజేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్ అని, మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలని ఆక్షాంక్షించారు. రేపటి రోజున తాను ముఖ్యమంత్రిగా ఉండకపోయినా.. మీరు మాత్రం అధికారులుగానే ఉంటారని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ పునర్:నిర్మాణంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని కోరారు. నాయకులం తాత్కాళికం.. అధికారులే శాత్వతం అని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే పనులు ఏవీ ఆపకుండా కొనసాగించాలని కోరారు. చౌకబారు విమర్శలను ఎదుర్కొన్నప్పడు ఆవేదన కలిగింది తన ఫామ్‌హౌజ్‌లో ఎకరా పంటపై రూ.కోటి ఆదాయం వస్తున్నట్లుగా ఒక పెద్దాయన చెప్పారని, మరి ఎకరాపై రూ.కోటి ఆదాయం వచ్చే విద్యను యువత, ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని సిఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా కెసిఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదవిన తాను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరు, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలే కారణం అని అభ్యర్థులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రూ.3 కోట్లు తీసుకుని గ్రూప్- 1 ఉద్యోగం ఇచ్చారని గత పాలకులు ఆరోపణలు చేశారని, పేదింటి బిడ్డలు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా..? అని ప్రశ్నించారు. కష్టపడి చదివిన వారిని అవమానించే విధంగా వారు మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయ చౌకబారు విమర్శలను ఎదుర్కొన్నప్పడు చాలా ఆవేదన కలిగిందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ జరగని కులగణన కాంగ్రెస్ పోరాటం వల్లే త్వరలో సాధ్యం కానుందని అన్నారు. గత పాలకుల పాపాల పుట్ట పగులుతోందని విమర్శించారు. వాళ్ల దోపిడీ గురించి తాము చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్‌తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని, అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగ ఉండాలని సూచించారు. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలని అన్నారు. సమర్ధవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవి నియామక పత్రాలు కావు..నిరుద్యోగుల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే పత్రాలు : భట్టి తెలంగాణ వచ్చాక పదేళ్లు ఒక కుటుంబం కోసమే పరిపాలన సాగిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం యువతకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వగా, ఇప్పుడు గ్రూప్-2 నియామక పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం సంకల్పానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఇలాంటి నియామకాలు చేయలేకపోయారని,తాము చేయకుండా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. అయినా యువత నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. తాము ఇస్తున్నవి కేవలం నియామక పత్రాలు కావు అని, నిరుద్యోగ యువకుల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే పత్రాలు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా, కార్పొరేట్ రంగాల్లో కూడా అవకాశాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

మన తెలంగాణ 19 Oct 2025 6:00 am

బిసి బంద్ సంపూర్ణం

మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలన్న డిమాండ్‌తో శనివారం బిసి సంఘాలు ఇచ్చిన బం ద్ ప్రశాంతంగా ముగిసింది. దీనికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘా లు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బంద్ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. బంద్ సందర్భంగా ఆర్‌టిసి బస్సులు డిపోలకే పరిమితం కావడంతో దీపావళి పండుగకు ఊళ్లకు వెళ్లాలనుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులనెదుర్కొన్నారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు వారు ఆశ్రయించడంతో ఇదే అదనుగా వారు అందినకాడికి దోచుకున్నారు. ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో ఇచ్చిన పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. బంద్ ప్రభావంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోగా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలపై పాక్షిక ప్రభావం చూపింది. అండగా నిలిచిన అధికార కాంగ్రెస్ పార్టీ బిసి సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన బంద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతానికి కృషి చేశారు. హైదరాబాద్ నగరంలోని అంబర్ పెట్, ఇమ్లీబన్, ట్యాంక్‌బండ్ అంబెడ్కర్ విగ్రహాల వద్ద జరిగిన నిరసన ప్రదర్శనల్లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్క, కొండ సురేఖ, ఎంపి అనిల్ యాదవ్ తదితరులు బంద్‌లో పాల్గొన్నారు. కాగా, మం త్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మంత్రులు, డిసిసి అధ్యక్షులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు బంద్ లో పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్ లిబర్టీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి , సిపిఐ ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం,తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. జై బిసి, బిసిల ఐక్యత వర్ధిల్లాలి, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిద్దాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంద్‌లో భాగంగా బిసి సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు తెల్లవారుజామున 4 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి డిపోల ఎదుట బైఠాయించి, నిరసనలకు దిగారు. దీంతో ఒక్క బస్సు కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. కేవలం అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎం, టిడిపి, టిజెఎస్,, సిపిఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ, మాలమహానాడు, ఆదివాసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్, జాగృతి, గిరిజన, మైనార్టీ, విదార్థు లు, ప్రజాసంఘాలు బంద్‌లో పొల్గొని సంఘీభావం తెలిపారు. బంద్ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో దీపావళి పండుగతో పాటు వారాంతపు సెలవులకు వెళ్లాల్సిన ప్రయాణికులు పలు ఇక్కట్ల నెదుర్కొన్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపించడానికి కొన్ని చోట్ల ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటిని ఎక్కడికక్కడ బిసి సంఘాల నాయకులు అడ్డుకున్నా రు.ఆయా ఆర్‌టిసి డిపోల ముందు ఆందోళనకు దిగారు. గేట్ మీటింగులు నిర్వహించి, అక్కడే బైఠాయించారు. ప్లకార్డులను ప్రదర్శిం చారు.జిల్లాలు, అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంద్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్తాండ్‌లైన ఇమ్లీబన్, జూబ్లీ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు బస్టాండ్‌లకే పరిమితమయ్యాయి. ఆర్‌టిసి ప్రయాణీకుల అగచాట్లు జూబ్లీ బస్‌స్టేషన్ ఎదుట బిజెపి కార్యకర్తలతో కలిసి మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జూబ్లీ బస్ స్టేషన్‌లో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు ప్రధాన బస్టాండ్ ఎంజిబిఎస్ లోనూ ప్రయాణికులు బస్సులు లేక పడిగాపులు కాశారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, విజయవాడ, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు బస్సులు దొరక్క తీవ్ర ఇబ్బందులు నెదుర్కొన్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ బోసి పోయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులు కదలట్లేదు. మరోవైపు ఇదే అదనుగా క్యాబ్ డ్రైవర్లు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. దీంతో ఆర్‌టిసి బస్సుల కోసమే పలువురు ప్రయాణికులు బస్టాండ ్లలో గంటల కొద్దీ నిరీక్షించారు. ఎప్పటికీ బస్సులు రాకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఇక, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, వరం గల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ సహా రాష్ట్రవ్యాప్తంగా బిసి రిజర్వేషన్లు పోరు కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన బంద్ లో బిసి సంఘాలతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో ఆర్‌టిసి సేవలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బస్సు డిపోల ఎదుట బిసి సంఘాలు, పలు పార్టీల నేతలు నిరసనలు చేపట్టారు. ఆదిలాబాద్‌లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆర్‌టిసి బస్సులు బయటకు రాకుండా బిసి సంఘాలు అడ్డుకున్నాయి. హనుమ కొండలో పలు దుకాణ సముదాయాలు స్వచ్ఛందం గా మూసివేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలోని అన్ని డిపోల ముందు 5 గంటల నుంచి జెఎసి నాయకులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. విద్యాసంస్థలు బంద్‌కు మద్దతు తెలుపుతూ ఇప్పటికే సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలూ సైతం బంద్ పాటించాయి. బంద్‌కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ, సిపిఎం పార్టీల శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. మహబూబ్‌నగర్ ఆర్‌టిసి డిపో ముందు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధర్నాకు దిగారు. రాజ్యాంగ సవ రణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీఓలు చెల్లవని తెలిపారు. ఇప్పటికైనా రాజ్యాంగ సవరణ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 19 Oct 2025 5:30 am

sunday magazine 19 oct 2025 ఆదివారం సంచిక 19 అక్టోబర్ 2025

ఈ సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ

ప్రభ న్యూస్ 19 Oct 2025 5:15 am

ఒక్క ఫైల్ ఆగినా ఊరుకోను

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పథకా లు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహారించ వద్దని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్య దర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అలసత్వం సహించేది లేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని సిఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని సిఎం సూచించారు. ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని, అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని ఆయన అన్నారు. శనివారం ఉదయం సిఎం నివాసంలో సిఎంఓ కా ర్యదర్శులు, సిఎస్ రామకృష్ణారావుతో ముఖ్యమం త్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సిఎంఓ అధికారులు ప్రతి వారం నివేదికలు అందించాలి అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పు డు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని సిఎస్‌ను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సిఎంఓ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడ కూడా ఫైలు ఆగిపోవడానికి, పనులు ఆగిపోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే, కేంద్రం నుం చి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. ఇకపై సిఎస్‌తో పాటు సిఎంఓ అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ఫీల్డ్ విజిట్లు చేయాలని.... ఏసి గదుల్లో కూర్చొని పని చేయకుండా, పైరవీలతో సమయం గడుపుతున్న అధికారులను ఉద్దేశించి సిఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా అధికారులు ఏసి గదుల నుంచి బయటకు రావడం లేదు. ఫీల్డ్ విజిట్లు చేయాలని పదే పదే చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. ఇలా ఉంటే ప్రజలకు సేవ ఎలా చేస్తారంటూ సిఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇకపై కంఫర్డ్ జోన్లలో ఉండే అధికారులకు కాకుండా, పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు ఇవ్వాలని సిఎం నిర్ణయించినట్టుగా తెలిసింది. 

మన తెలంగాణ 19 Oct 2025 5:00 am

మద్యం దుకాణాలకు ‘మస్తు’ దరఖాస్తులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఏ4 మద్యం దు కాణాల కోసం ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తుదారులు శనివారం బారులుతీరారు. ముఖ్యంగా ఏపికి చెందిన మహిళలు దరఖాస్తు చే సుకోవడానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన (సోన్ డి కులానికి) చెందిన ఓ మహిళ ఏకంగా 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోగా, ఇందుకోసం ఆమె రూ.4కోట్ల 50లక్షలు చెల్లించింది. ఎపికి చెందిన (సోన్ డి కులానికి) మహిళ లు ఈ దరఖాస్తుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తమ కులానికి ఎపిలో రిజర్వేషన్ ఉందని, తెలంగాణలో కూడా (సోన్ డి కులానికి) రిజర్వేషన్‌లు కల్పించాలని వారు డిమాండ్ చేశా రు. అందులో భాగంగా తాము కూడా తెలంగాణ లో ఏ4 మద్యం షాపులను ఏర్పాటు చేయడానికి ఈ దరఖాస్తులను దాఖలు చేశామని వారు తెలిపారు. అయితే, వారు డిమాండ్ చేసినట్టుగా ఎపికి చెందిన ఆ కులానికి ఇక్కడ రిజర్వేషన్‌లు వర్తించవని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన గౌడ్, ఎస్టీ, ఎస్సీలకే ఏ4 మద్యం షాపుల్లో రిజర్వేషన్‌లు వర్తిస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే సుమారుగా 30వేల దరఖాస్తులు! రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు శనివారం వరకు 80 వేల దరఖాస్తులు వచ్చాయి. శనివారం ఒక్కరోజే సుమారుగా 30వేల దరఖాస్తులు వచ్చినట్టుగా ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించేందుకు ఆబ్కారీ శాఖ సెప్టెంబర్ 25వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయగా శుక్రవారం వరకు మందకొడిగా దరఖాస్తుల పర్వం కొనసాగింది. శుక్రవారం ఒక్క రోజే 25 వేల దరఖాస్తులు రాగా, శుక్రవారం సాయంత్రం వరకు 50వేల దరఖాస్తులు ఆబ్కారీ శాఖకు వచ్చాయి. శుక్రవారం వరకు 50 వేల దరఖాస్తులు రాగా శనివారం మరో 30 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున నాన్ రిఫండెబుల్ ఫీజును ఎక్సైజ్ శాఖ వసూలు చేస్తోంది. శనివారం నాటికి 80 వేల దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.2,400 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఈనెల 23న మద్యం దుకాణాలకు డ్రా తీయను న్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మద్యం టెండర్లకు లక్షా 32 వేల దరఖాస్తులు రాగా వాటి ద్వారా 2,645 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. 2023లో అసెంబ్లీ, 2024లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో అప్పట్లో భారీగా దరఖాస్తులు వచ్చాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఓ మద్యం దుకాణానికి ఒకటే దరఖాస్తు ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని ఒక మద్యం దుకాణానికి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చినట్టుగా తెలిసింది. రిజర్వుడ్ దుకాణాలకు గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గినట్టుగా సమాచారం. వ్యాపారులు సిండికేట్లుగా మారి తక్కువగా దరఖాస్తులు వేశారన్న ఆరోపణలు పలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. దరఖాస్తుల ఫీజు ఎక్కువగా ఉండడంతో మద్యం వ్యాపారులు ఈసారి ఆచితూచి వ్యవహారిస్తున్నట్టుగా తెలిసింది. సిండికేట్‌లుగా మారి దరఖాస్తులను తక్కువగా వేసినట్టుగా తెలిసింది.

మన తెలంగాణ 19 Oct 2025 4:30 am

మందే ముందు.. అదే పసందు!

‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనము నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు’ అన్నాడు సుమతీ శతకకారుడు ఎప్పుడో. ఈ మాటను ప్రస్తుత మన రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ ఉంటారు. అటువంటి రాజకీయ నాయకులలో అందెవేసిన చెయ్యి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది. రాజకీయాల్లో బాగా రాటుదేలిన వ్యక్తి ఆయన. ఒకటా రెండా.. దాదాపు 50 సంవత్సరాలుగా రాజకీయాల్లోనే మునిగి తేలుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం నుండి దిగిపోయాక ఇంకో మాట మాట్లాడితే తప్పులేదని సుమతీ శతకకారుడే చెప్పాడు కదా అనుకుంటారేమో ఆయన. చరిత్ర రీలు వెనక్కు తిప్పితే చంద్రబాబునాయుడు రాజకీయాల్లో ‘ఎప్పటికామాటలాడి’ అన్నవిధంగా అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో ప్లేటు ఫిరాయించి చెప్పిందొకటి చేసింది ఒకటి అన్నవిధంగా వ్యవహరించిన విషయం జగద్విదితం. మిగతా విషయాలు ఎలా ఉన్నా మద్యం విషయంలో ఆయన తీసుకున్న యూటర్న్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఒక పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. 201419 కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం విధానానికి సంబంధించి అక్రమాలు జరిగాయంటూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులో ఆయన బెయిల్ పై ఉన్నారు. 2024లో మళ్ళీ అధికారంలోకి రాగానే వైయస్సార్ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులను, ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను మద్యానికి సంబంధించిన కుంభకోణం జరిగిందనే ఒక కేసు పెట్టి జైలుకు పంపించారు. ఈ రభస ఇలా జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో పెద్దయెత్తున కల్తీ మద్యం చలామణిలో ఉన్న విషయాలు బయటపడుతున్నాయి. ఇది కేవలం అక్కసుతో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు కాదు. ఎక్సైజ్ పోలీసులే స్వయానా కేసులు పెడుతున్నారు. ఇలా కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెలరేగిపోతున్నదని, ప్రజారోగ్యం ఆందోళనలో పడిందని, కొందరు మరణించారని తాము సేకరించిన సమాచారంతో కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తే అందులో ఒక మీడియా సంస్థ సంపాదకుడిమీద, ఒకరిద్దరు విలేకరుల మీద ఆధారాలు చూపండని కేసులు పెడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చ అంతా మద్యం చుట్టూ తిరుగుతున్నది. కాబట్టే చంద్రబాబు నాయుడు ఇతర అంశాల్లో కూడా తాను చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ ప్రస్తుతం మద్యం గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. మద్యాన్ని నిషేధించాలని చాలాకాలంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట మద్యాన్ని నిషేధించింది, తమకు పట్టుగల ప్రాంతాల్లో పకడ్బందీగా అమలు చేసింది అప్పటి పీపుల్స్ వార్ పార్టీ. 1994 కు ముందు కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక్క చుక్క మద్యం కూడా అమ్మకుండా పీపుల్స్ వార్ కట్టడి చేస్తే, అప్పటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు జువ్వాడి చొక్కారావు దానికి మద్దతు పలికారు. ఆయన గాంధేయవాది. జీవితాంతం మద్యపానాన్ని వ్యతిరేకించినవారు. అయితే చిత్రంగా విజయభాస్కర రెడ్డి ప్రభుత్వం నక్సలైట్ల మధ్య నిషేధ కార్యక్రమాన్ని తూట్లు పొడిచేందుకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లో పోలీసుల పహరాలో మద్యం అమ్మకాలు సాగించింది. మద్యంనుండి లభించే ఆదాయం అటువంటిది మరి. అప్పుడే ప్రతిపక్షంలో ఉన్న ఎన్టీ రామారావు మద్యనిషేధాన్ని తన ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకొని, గెలిచిన వెంటనే మాట నిలుపుకొని సంపూర్ణ మధ్య నిషేధం విధించారు. ఆరోగ్యరీత్యా వైద్యులు నిర్ణయిస్తే కొద్ది మోతాదులో మద్యం సేవించేందుకు పర్మిట్లను అనుమతించారు. కొన్ని మాసాలకే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మధ్య నిషేధంపట్ల తాను మరింత కఠినంగా ఉంటానని చెప్పుకునేందుకు ఆ హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు. అంతేకాదు, హైదరాబాద్ పాతబస్తీలోని కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక విశాలమైన పార్కులో అప్పటి మద్య నిషేధ శాఖ స్వాధీనపరుచుకున్న అక్రమ మద్యాన్ని తానే రోడ్డు రోలర్ నడిపిస్తూ వాటిని ధ్వంసం చేసి, పత్రికల్లో ఫోటోలు వేయించుకున్నారు. అప్పుడది అవసరం, అందుకే అది చేశారు. కొద్ది నెలల్లోనే మద్య నిషేధాన్ని సంపూర్ణంగా ఎత్తేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే ఆయన చేసిన తొలి సంతకాలలో బెల్ట్ షాపుల ఎత్తివేత కూడా ప్రధానమైనది. బెల్ట్ షాపులు అధికారికంగా ఏర్పాటు చేసేవి కాదు. వాటిని ఎత్తివేస్తామని ఒక ముఖ్యమంత్రి అధికారికంగా సంతకం చేయడమేమిటి? అది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ బాధ్యత కదా అని ముక్కున వేలేసుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్సైజ్ శాఖ బాధ్యత అక్రమ మద్యం ఉత్పత్తిని నిరోధించడం, కల్తీ మద్యం పంపిణీ ఆపడం, అనధికారికంగా ఏర్పాటయే మద్యం దుకాణాలను అంటే బెల్ట్ షాపులను నిర్మూలించడం. అది అధికారులు సహజంగా చేసుకోవాల్సిన పని. సంతకం అయితే చేసారు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఏ రీతిలో విచ్చలవిడిగా పెరుగుతూపోయాయో ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామానికి వెళ్లి ప్రజలు అడిగినా చెబుతారు. 2019లో ఆయన ఓడిపోయి వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను పాదయాత్ర సందర్భంగా కానీ, ఇతరత్రా కానీ చెప్పిన సంపూర్ణ మద్య నిషేధానికి బాటలు వేస్తూ మద్యం విధానాల్లో పలు మార్పులు తీసుకొచ్చారు. మద్యం విక్రయాలు ప్రైవేట్ వారి చేతుల్లో లేకుండా చేశారు. దుకాణాల సంఖ్య బాగా తగ్గించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అమ్మకాలు సాగించారు. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల మాదిరిగానే అవి ఉదయం తెరిస్తే సాయంత్రం మూసివేసేవారు. అదేవిధంగా, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన బ్రాండ్లనే ఈ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మినా ధరలు మాత్రం బాగా పెంచారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క బెల్టుషాపు కూడా లేకుండా కఠినమైన చర్యలు తీసుకున్నారు. దీనివల్ల నిజానికి ప్రభుత్వ ఆదాయం చాలా తగ్గుతుంది. అయినప్పటికీ ప్రచార సమయంలోగానీ, అంతకు ముందుగానీ తాను చెప్పినట్టు సామాన్య ప్రజలకు మద్యం అందుబాటులో లేకుండా చేసినట్లయితే వారిని తాగుడుకు బానిసలు కాకుండా కాపాడటానికి ప్రయత్నించవచ్చునని ఆయన ప్రభుత్వం సంపూర్ణంగా నమ్మింది. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్తుండిన మాట మద్యం బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలుంటాయని. ఆచరణలోనూ ఆయన అదే చేసి చూపించారు. కేరళ వంటి మరికొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ మద్యం అమ్మకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. వీటితోపాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ప్రతి మద్యం బాటిల్ ను విక్రయించే ముందు వినియోగదారుడి ఎదుటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూపించే పద్ధతిని కూడా ప్రవేశపెట్టింది. ఎందుకంటే ప్రభుత్వం అమ్మే మద్యంలో కల్తీ లేదా అక్రమ మద్యం వస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఆలోచనతో. బాటిళ్లు స్కాన్ కాకపోతే దాన్ని విక్రయించేవారు కాదు. ఆంధ్రప్రదేశ్ లో మద్యపానప్రియులు ఎవరినడిగినా ఈ విషయం చెబుతారు. స్కాన్ తో ఆ మద్యం సీసా ఏ డిస్టిలరీనుండి, ఏ డిపో నుండి వచ్చిందో ఏ షాపునకు అది వెళ్ళిందో, ఆ షాపులోనే విక్రయించారా లేదా అనే విషయాలు స్పష్టంగా తెలిసిపోతాయి. ఇటువంటి పకడ్బందీ ఏర్పాటు కారణంగా కల్తీ, అక్రమ మద్యాన్ని పట్టుకోవడం చాలా సులువు అయ్యేది. గత ప్రభుత్వంలో మద్యానికి సంబంధించి ఇదంతా జరుగుతున్న సమయంలో నాణ్యత లేని మద్యం తాగి వేలమంది మృతి చెందారంటూ అప్పటి ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ వారు, ఆయనతో స్నేహం చేసిన ఇతర కొన్ని పార్టీలు పెద్దయెత్తున ప్రచారం చేసాయి. ఇవన్నీ అభూతకల్పనలని తేల్చేస్తూ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పార్టీతో కలిసి కూటమిలో భాగస్వామిగా ఉన్న బిజెపి నేతృత్వంలోని కేంద్ర హోమ్ శాఖ 2022- 2023 నివేదికల్లో అక్రమ మద్యం కేసులు గాని, మృతులు గాని ఆంధ్రప్రదేశ్ నమోదు కాలేదని స్పష్టంగా చెప్పింది. ఇదిలాఉంటే 2024 ఎన్నికల ప్రచారంలో 70 ఏళ్ల వయసు దాటిన సీనియర్ రాజకీయవేత్త చంద్రబాబునాయుడు మద్యం విషయంలో జరిపిన ప్రచారం తీరు అందరినీ నిర్ఘాంతపరచకతప్పదు. ‘రోజంతా కష్టపడి అలసట మరచిపోవడానికి రెండు పెగ్గులు తాగాలనుకుంటారు. ఆ మద్యం మీకు సరైనది అందడం లేదు. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకే అందిస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో ప్రతి బహిరంగసభలో చంద్రబాబు నాయుడు ప్రజలను ఉత్సాహపరిచారు.అనధికారిక అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 90 లక్షలమంది మద్యం సేవించే వాళ్ళు ఉండొచ్చని ఒక లెక్క. ప్రచారం తొలి రోజుల్లో చంద్రబాబునాయుడు పదేపదే మద్యం గురించి ఇలా మాట్లాడుతుంటే ఇంత సీనియర్ నాయకుడు ప్రజలను మద్యం తాగడానికి ప్రోత్సహించడం ఎబ్బెట్టుగా ఉన్నదని, మద్యనిషేధాన్ని నిజాయితీగా నమ్మి, దాని కారణంగా వచ్చే విపరిణామాలను కూడా లెక్కచేయకుండా కచ్చితంగా అమలుపరిచిన ఎన్టీ రామారావు తన ఆరాధ్యదైవం అని చెప్పుకుంటూ ఆయన ఆత్మక్షోభించే విధంగా ఇవేం మాటలు అనుకున్న వాళ్ళకు.. ఇది ఆ 90 లక్షల ఓట్లకు వేస్తున్న గాలమని ఆ తర్వాత అర్థమైంది. ఆయన ఆశించినట్టే ఇతర అంశాలు కూడా కలిసి వచ్చి అధికారంలోకి రాగానే ప్రచార సమయంలో తాను ప్రజలకు మాట ఇచ్చినట్టుగా సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం కాకుండా ప్రభుత్వం అదుపులోనుండే మద్యం విక్రయాలను ఎత్తేశారు. మద్యం అసలైనదా, నకిలీదా అని తెలుసుకునే క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. ప్రైవేటు మద్యం దుకాణాలకు తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన గత ఏడాదిన్నర కాలంలో 11 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మద్యం అమ్మకాలు జరిగితే, అందులో 48 కోట్ల క్వార్టర్ బాటిళ్లు దాదాపు 5,280 కోట్ల రూపాయల విలువచేసే మద్యం అనధికారిక ఉత్పత్తి, సరఫరా జరిగిందని కడప లోకసభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రకటించారు. దానిమీద ప్రభుత్వంనుంచి ఈనాటివరకు ఎటువంటి వివరణ లేదు. మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న మద్యం విక్రయాలకు సంబంధించి, వాటిలో కల్తీ జరిగిన విషయంపైన, ఆ కల్తీ మద్యం తాగడం వల్ల మరణాలు కూడా సంభవించాయన్న వార్తలపైన నిజనిర్ధారణకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలను తేలిస్తే బాగుంటుంది. పలు జిల్లాల్లో యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రజారోగ్యానికి నష్టం కలగడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు కూడా గండిపడుతున్నదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలమీద ప్రభుత్వం నిగ్గుతేల్చితే మంచిది. మద్యం కల్తీ జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలు లేకుండా క్యూఆర్ కోడ్‌ను ఎత్తివేశారు. గత కొద్దిరోజులుగా దీనిమీద ఇంత రభస జరిగాక ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అప్రమత్తమై క్యూఆర్ కోడ్ పద్ధతిని మళ్ళీ ప్రవేశపెట్టినట్టు తెలుస్తున్నది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగేపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మద్యం విక్రయాల విలువ భారీగా తగ్గింది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఏటా గత సంవత్సరంతో పోలిస్తే ఓ పదిశాతం వరకు ఎక్సైజ్ రాబడి పెరుగుతూ ఉంటుంది. పశ్చిమగోదావరిలో గత ఏడాదికన్నా ఈ ఏడాది విక్రయాల విలువ నాలుగు శాతం తగ్గగా శ్రీకాకుళం, వైయస్సార్ కడప, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో విక్రయాల విలువ ఒక శాతం కూడా పెరగలేదు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో మూడు శాతం మాత్రమే పెరిగింది. మన్యం, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో నాలుగు శాతం మాత్రమే పెరిగినట్టు అందుబాటులో ఉన్న లెక్కలు చెబుతున్నాయి. దీనికి కారణం కల్తీ మద్యం విక్రయాలన్నది స్పష్టం. ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కూడా ఈ కల్తీ మద్యం మీద చర్చ జరగడం, నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఎక్సైజ్ శాఖ సూచించడం ఆంధ్రప్రదేశ్ లో మద్యానికి సంబంధించిన ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతున్నది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ విషయంలో విచారణ సందర్భంగా ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో పే ర్కొన్నట్టు రాజకీయ నేతల మీద కేసులు ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎల్లవేళలా ప్రత్యర్థి అనేవారు ఉంటారు. అయితే ప్రత్యర్థులు మాట్లాడే మాటలను, చేసే విమర్శలను, తమ దృష్టికి తీసుకువచ్చే అంశాలను ప్రజాక్షేమం దృష్టిలో పెట్టుకొని పట్టించుకుని అవసరమయిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.

మన తెలంగాణ 19 Oct 2025 4:00 am

పాక్ దాడిలో ముగ్గురు క్రికెటర్లు మృతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మరోమారు అఫ్గానిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై శనివారం వైమానిక దాడులకు దిగింది. ఈ భీకర దాడులలో పలువురు ఉగ్రవాదులు, పౌరులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు యువ క్రికెటర్లు కూ డా ఉన్నారని ది డాన్ పత్రిక తెలిపింది. ఇప్పుడు పాక్, అఫ్గాన్ సేనల మధ్య డోలాయమాన స్థితిలో ఉన్న కాల్పుల విరమణ ఇప్పటి ఈ దాడుల ఘటనతో చతికిలపడింది. పైగా దోహాలో జరగాల్సిన ఇరుపక్షాల శాంతి చర్చలపై నీలినీడలు పర్చుకున్నాయి. తహరీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) బహదూర్ వర్గం పాక్ అఫ్గాన్ సరిహద్దుల్లో ప్రా బల్యం చాటుకునేందుకు యత్నించడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక్కరోజు క్రితమే నార్త్ వజరిస్థాన్‌లోని పాక్ సైనిక కేంద్రంపై ఉగ్రవాదులు కాల్పులు, బాంబుల దాడికి దిగారు. తాలిబన్ల ఉగ్రసంస్థ దాడికి ప్రతీకారంగా పాక్ సేనలు శనివారం అఫ్గాన్ మారుమూ ల ప్రాంతంలోని ఉర్గన్, బర్మాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలపై వైమానిక దా డులకు దిగాయి. అక్కడ ఉగ్రవాద స్థావరాలను లక్షాలుగా ఎంచుకున్నాయి. ఈ దాడులలో క్రికెటర్లు మృతి చెందారని పత్రిక తెలిపింది. క్రికెటర్ల మృతిని అఫ్గాన్‌స్థాన్ క్రికెట్ బోర్డు నిర్థారించింది. ముగ్గురు యువ ఆటగాళ్లు కబీర్, సిబ్ఘహతుల్లా, హరూన్‌లు చనిపోయారని ఈ క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో తెలిపింది. క్రికెటర్ల మృతికి నిరసనగా తాము మూడు దేశాల టి 201 సీరిస్ క్రికెట్ పోటీని బహిష్కరిస్తున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ పోటీలో పాక్ క్రికెట్ జట్టు ప్రధాన పక్షంగా ఉంది నవంబర్ చివరిలో ఈ క్రికెట్ జరగాల్సి ఉంది. జరిగ. ఇప్పటి దాడులతో దోహాలో జరిగే శాంతిచర్చలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని , యధావిధిగా జరుగుతాయని పాక్ తరఫున విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్, తాబిబన్లతో చర్చలు జరుపుతారని ప్రకటన వెలువడింది.  

మన తెలంగాణ 19 Oct 2025 3:00 am

వార ఫలాలు (19-10-2025 నుండి 25-10-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. బంధు వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ పరంగా సాధారణంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనిలో నిరాశ నిస్పృహ ఏర్పడుతుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. పాత బాకీలు వసూలు అవుతాయి.ఉద్యోగాలలోఆకస్మిక స్థానచలన సూచనలున్నవి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. స్తిరస్థుల క్రయవిక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వలన భవిష్యత్తు బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వివాహంకోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. కష్టేఫలి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. గణపతి స్వామి వారికి ప్రతిరోజు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయ అనుకూల వాతావరణం ఉంటుంది. పదిమందిలో గుర్తింపు సాధిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వారికి మీ విజయంతో సమాధానం చెబుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ. మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా ఆర్థికపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికి నచ్చుతాయి. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. కాలభైరవ రూపుని మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా భూ సంబంధిత విషయాలు, మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాలు సక్రమంగా పూర్తవుతాయి. మధ్యలో ఆగిపోయిన కార్యక్రమాలను కూడా తిరిగి పునః ప్రారంభించండి కచ్చితంగా విజయవంతం అవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారికి హోటల్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. భూమికి సంబంధించి క్రయవిక్రయాలు విజయవంతమవుతాయి. ఉద్యోగరీత్యా కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే వాళ్లకు చక్కగా అనుకూలమైన కాలం ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి మంచి క్యాంపస్ లో సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే స్కాలర్షిప్ లు కూడా వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మీరు చేసే ప్రతి పనిలో మంచి గుర్తింపు ఉంటుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి చాలా మంచిది అదేవిధంగా కాలభైరవ రూపు మెడలో ధరించండి. రుద్ర పాశుపత హోమం చేయించండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు ఎల్లో. సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు శుభకార్యాలు చాలా చక్కగా చేయగలుగుతారు. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. సంతానం కోసం ప్రయత్నించే వారు ఒక శుభవార్త వింటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం చాలా అనుకూలంగా ఉంది. ఎవరికైనా షూరిటీ పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. కూరగాయల వ్యాపారస్తులకు హోటల్ బిజినెస్ వారికి సినీ కళా రంగానికి చెందిన వారికి అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేసే వారు కొంత జాగ్రత్త వహించండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. స్నేహితులతో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు పనికిరావు. భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపరాధన చేయండి అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసివచ్చే రంగు తెలుపు. కన్య రాశి వారికి ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా చాలా చక్కగా ఉంది మీరు చేసే ప్రతి పనిలో సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు ఏర్పడతాయి జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఉద్యోగరిత్యా వ్యాపారరిత్యా చాలా నెమ్మదిగా సాగుతుంది రావలసిన బెనిఫిట్స్ నెమ్మదిగా వస్తాయి. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేసే వారికి చక్కగా ఉంది. వ్యాపారాలలో భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వివాహ విషయంలో కాస్త ఆలస్య మైనప్పటికీ మంచి సంబంధం కుదురుతుంది సంతాన పరంగా అభివృద్ధి బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చాలా అనుకూలిస్తాయి. ముఖ్యంగా మీకు పూర్వీకుల నుండి రావాల్సిన స్థిరాస్తులు మీకు వస్తాయి. విదేశాలలో చదువుకునే వారికి అనుకూలంగా ఉంది. అలాగే పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రయత్నం ప్రారంభించండి ఇంట్లో తల్లి యొక్క సలహాలు తీసుకోండి మీకు కలిసి వస్తాయి. ఈరాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. స్త్రీలకు కోర్టు సంబంధిత విషయాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఈ రాశి వారు భూమి మీద కానీ బంగారం మీద కానీ పెట్టుబడి పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. వడ్డీ వ్యాపారాల జోలికి వెళ్ళకండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి మంచిది. అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి ఆరోగ్యరీత్యా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు గ్రీన్. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఈ రాశి వారికి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఎంత కష్టపడితే అంతకు మించిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు భూమి అమ్మడం కంటే హౌసింగ్ లోన్స్ కు వెళ్ళటం మంచిది. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో చిన్నచిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి. ఏదైనా ఒకనిర్ణయం తీసుకునేటప్పుడు స్థిరమైన నిర్ణయం తీసుకోండి అదే నిర్ణయానికి కట్టుబడి ఉండండి మీకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ముఖ్యంగా ప్రేమవివాహ ప్రయత్నాలు చేసేవారు జాగ్రత్త వహించాలి తొందరపాటు నిర్ణయాలు సరికావు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్పా, చేయకుండా ఉండటం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఎప్పటినుంచో మీరు కంటున్న కల నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సినీ కళా రంగాల వారికి బ్యూటీషియన్స్ కి, రాజకీయ రంగంలోని వారికి కాలం అనుకూలంగా ఉంది. ఎన్నడు లేని విధంగా చేసే పనిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీలో ఉన్న పట్టుదలనే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి పరంగా, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంత వ్యాపారస్తులకు చాలా బాగుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభించడం కంటే ఉన్న ప్రాజెక్టులను సక్రమంగా పూర్తి చేసుకోవడం లేదా వాటినే కంటిన్యూ చేయడం మంచిది. చర్మ వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించండి. ఆహార నియమాలు పాటించండి. ఈ రాశి వారు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి అలాగే మొగలిపువ్వు కుంకుమతో అమ్మ వారిని పూజించడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే రంగు బ్లూ. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార రిత్యా మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి ఫలితం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చాలాచక్కగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఇది సరైన సమయం. సంతానం పట్ల వారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అంతా అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలను వెంటనే సద్వినియోగం చేసుకోండి. వ్యాపార అభివృద్ధి కూడా చాలా చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు మీకు మేలు చేస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి చార్టెడ్ అకౌంటెంట్ వారికి సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారికి అనుకూలంగా ఉంది. సిని కళా రంగం వారికి టెక్నీషియన్స్ కి బ్యూటీషియన్స్ కి కూడా అనుకూలంగా ఉంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి మంచిది. అలాగే ఓం నమశ్శివాయ పంచాక్షరి మంత్రం చదవడం కూడా మంచిది, దీనిని 41 రోజులు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది, కలిసి వచ్చే రంగు ఎరుపు. ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎప్పటినుండో వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీకున్న చిన్నచిన్న ఇబ్బందులు తొలగి పోతాయి. భూ సంబంధిత విషయాలు మీకు కలిసి వస్తాయి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది దానివల్ల కొన్నిపనులు నిదానంగా నడిచినప్పటికీ చివరకు సక్రమంగా పూర్తవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చాలా అనుకూలంగా ఉంది. స్నేహితుల విషయంలో వారి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ఏ పని చేసినా నలుగురి సలహాలు తీసుకోండి ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి. విద్యారంగం వారికి వైద్యరంగం వారికి మంచి కాలం. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి ల్యాబ్ టెక్నీషియన్స్ కి చిరు వ్యాపారస్తులకు ఆదాయాలు తక్కువగా ఉన్న పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి. పెద్దగా నష్టం కూడా ఉండదు. ఈ రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి అలాగే శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు కాలం చాలా అనుకూలంగా ఉంది. గడచిన వారాల కంటే ఈ వారం చాలా చక్కగా ఉంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యాపార అభివృద్ధి చాలా చక్కగా ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చక్కగా ఉంది. అలాగే బ్యూటీషియన్స్ కి సినీకళా రంగాల వారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వారికి కాలం అనుకూలంగా ఉంది. మీకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు గడచిన కాలం కంటే కూడా అనుకూలంగా ఉంది, ముఖ్యంగా వీరికి విదేశీ పర్యటన చాలా అనుకూలిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కలిసి వస్తుంది. బంధు వర్గంతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి పక్కవారి విమర్శలను పట్టించుకోకండి. స్వయంకృషితో మీరు చేపట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపరాధన చేయటం కాలభైరవ రూపు మెడలో ధరించడం మంచిది. ఈ రాశి వారికి నరదృష్టి అధికంగా ఉంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. కుంభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య రిత్యా ఉన్న కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఆరోగ్యపరంగా కొంతమంది విషయంలో సర్జరీ తప్పకపోవచ్చు వాటి విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం మంచిది. ఈ రాశి వారికి కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఒక రూపాయి సంపాదన ఉంటే పది రూపాయలు ఖర్చు ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. వీలైతే గో-దానం చేయండి లేదా గోవుకు ఉలవలు కానీ ఏదైనా ఆహారం కాని తినిపించండి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంతాన సంబంధిత విషయాలు చాలా చక్కగా ఉన్నాయి, విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈవారం వ్యాపారంలో లాభాలు చాలా చక్కగా ఉంటాయి, భాగస్వాముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండటం జరుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉంటారు. మీరు మానసికంగా చాలా మార్పు చెందుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. కోర్టు కేసులు కొంత ఇబ్బంది పెడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రతిరోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం, అఘోర పాశుపత హోమం చేయించడం, శనికి తైలాభిషేకం చేయించడం జపం చేయించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. మీన రాశి వారికి ఈవారం కాలం అంతా అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా లోతుగా ఆలోచించి తీసుకోవడం మంచిది ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. అప్పు చేసే విషయంలో జాగ్రత్త వహించండి. కోర్టు సంబంధిత విషయ వ్యవహారాలు మీకు సానుకూల పడతాయి. ఎప్పటి నుండో కలగంటున్నఒక కొత్త ప్రాజెక్టును మీరు ప్రారంభిస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం చేస్తే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నంలో ఫలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగానికి గడ్డుకాలం అని చెప్పవచ్చు. భూ సంబంధిత క్రయవిక్రయాల విషయాలలో జాగ్రత్త వహించండి. కొన్ని శుభకార్యాలు చేస్తారు. వివాహం కానివారికి వివాహ ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్నేహితులతో కొంత జాగ్రత్త వహించండి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. స్నేహితులకు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ఏ పని చేసినా ఇంట్లో వారికి చెప్పకుండా చేయకండి. మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి. ప్రేమ సంబంధిత వ్యవహారాలలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఆడవారైనా మగవారైనా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఏదైనా ఉంటే ఇంట్లో వారి సహాయ సలహాలు తీసుకోండి. మీకు సొంత నిర్ణయాలు కలిసి రావు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్నచిన్న అడ్డంకులు ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి కోర్టు సంబంధిత విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి కానీ సరైన నిర్ణయం తీసుకొని ధైర్యంతో ముందుకు వెళ్ళటం మంచిది. మీ మొండి పట్టుదలను పక్కనపెట్టి సామరస్యంగా ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. నలుగురులో కలిసి ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా లేవు. మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించడం మంచిది. ఈ రాశి వారు ప్రతి రోజు శని గ్రహ స్తోత్రం పఠించండి, శనికి అష్ట మూలికా తైలంతో అభిషేకం చేయించడం మంచిది. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.  

మన తెలంగాణ 19 Oct 2025 12:10 am

బుల్లెట్ కన్నా .. బ్యాలెట్ గొప్పది: వెంకయ్య నాయుడు

‘బుల్లెట్ కన్నా .. బ్యాలెట్ గొప్పది’ అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. నక్సల్స్ తమ వాదనను బ్యాలెట్ ద్వారా వినిపించాలని ఆయన సూచించారు. ఇటీవల నక్సల్స్ పెద్ద ఎత్తున లొంగిపోవడం శుభపరిణామమని ఆయన తెలిపారు.ప్రజ్ఞాభారతి అధ్వర్యంలో శనివారం నగరంలో జరిగిన కార్యక్రమంలో బహుముఖ ప్రజ్ఞాశాలి త్రిపురనేని హనుమాన్ చౌదరికి పంచ నవతి జన్మదినం సందర్భంగా జీవన సాఫల్య పురస్కారాన్ని వెంకయ్య నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయం తీసుకుని ఇటీవల పెద్ద సంఖ్యలో లొంగిపోవడం సంతోషకరమని అన్నారు. బుల్లెట్ కన్నా, బ్యాలెట్ శక్తివంతం అని ఆయన తెలిపారు. కాబట్టి వారి వాదాన్ని బ్యాలెట్ ద్వారా వినిపించాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసి వారి వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి మద్దతు కోరాలని ఆయన చెప్పారు. తుపాకి సంస్కృతితో సాధించేది ఏమీ లేదని ఆయన తెలిపారు. మావోయిస్టుల వ్యవహారానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారని ఆయన వివరించారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, కుటుంబ వ్యవస్థ మన బలం అని ఆయన తెలిపారు. స్నేహ సంపద, కుటుంబ సభ్యులతో గడిపి సమయమే గొప్ప సంపద అని ఆయన చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషను కాపాడుఓవడానికి యువతరం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని, దానిని ఎవరికి ఆపడం సాధ్యం కాదన్నారు. హనుమాన్ చౌదరికి జీవన సాఫల్య పురస్కారం అందజేయడం చాలా సంతోషంంగా ఉందన్నారు. హనుమాన్ చౌదరి భారత టెలికాం రంగానికి అందించిన సేవలు నిరుపమానమైనవని అన్నారు. విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ తొలి చైర్మన్‌గా, టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికారని ఆయన గుర్తు చేశారు. అందరికీ ఆదర్శప్రాయులని ఆయన ప్రశంసించారు. మన పెద్దల స్పూర్తిని యువతరం అందిపుచ్చుకుని నవ భారత నిర్మాణంలో చోదక శక్తులు కావాలని ఎం. వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.ప్రజ్ఞా పురస్కారాలు అందుకున్న నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్, సీనియర్ జర్నలిస్టు రాకా సుధాకర్‌ను, కల్లోల భారతం పుస్తక రచయిత కోవెల సంతోష్ కుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజ్ఞాభారతి సంస్థ తీసుకున్న చొరవలో ‘లోక్ మంథన్’ కార్యక్రమం మహోన్నతమైందని, తాను ఎంతో అభిమానించేదని ఆయన తెలిపారు. మన సంస్కృతిని కాపాడుకునేందుకు అవగాహన కల్పించడంలో విజయవంతమైందని ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాప్రవాహ్ జాతీయ కన్వీనర్ నందకుమార్, ప్రజ్ఞా భారతి అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 18 Oct 2025 11:10 pm

తెలంగాణ సాధనలో టీచర్లది కీలక పాత్ర: కల్వకుంట్ల కవిత

టీచర్లకు ఇవ్వాల్సిన పిఆర్‌సితో పాటు పెండింగ్ డి.ఎలను వెంటనే చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. టీచర్ల గురించి గొప్పగా మాట్లాడే సిఎం కనీసం వారికి సమయానికి జీతాలు కూడా చెల్లిచంటం లేదని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్(టిజెటిఎఫ్)ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఫెడరేషన్ లోగోను శనివారం జాగృతి కార్యాలయంలో కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన 12 ఏళ్ల క్రితం నాటిదేనని చెప్పారు. అయితే ఇన్నాళ్లకు సమయం వచ్చిందన్నారు. జయశంకర్ సార్ నా ఫేవరేట్ టీచర్ తన ఫేవరేట్ టీచర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కవిత చెప్పారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిలో ఆయన మనందరికీ టీచర్ మాదిరిగా అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పారనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్లు కీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా కవిత గుర్తుచేశారు. ఆనాటి ప్రభుత్వం నిర్భంధం ఉన్న సరే తెలంగాణ మ్యాప్, ప్రత్యేక క్విజ్ పోటీలు నిర్వహించి భావజాల వ్యాప్తికి కృషి చేశారని పేర్కొన్నారు. అలాంటి టీచర్ల సమస్యలపై పోరాటం చేయటం మనందరి బాధ్యత అని కవిత అన్నారు. టిజెటిఎఫ్ టీచర్ల సమస్యలపై పోరాడుతుందన్నారు. నా కొడుకు వయసు చిన్నది...ఇప్పుడే రాజకీయాలు లేవు బిసి బంద్ కార్యక్రమంలో తన కుమారుడు పాల్గొనటంపై కవిత స్పందించారు. కేవలం సామాజిక బాధ్యత నేర్పే క్రమంలోనే తన కుమారుడిని బిసి బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చానని చెప్పారు. బిసిల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నామంటే తాను పోరాటంలో పాల్గొంటానని అన్నారని తెలిపారు. మన ఇంటి నుంచే సామాజిక బాధ్యత నేర్పాలనే ఉద్దేశంతోనే బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చానని చెప్పారు. తన కొడుకు వయసు చిన్నది అని, ఇప్పుడే రాజకీయాలు ఏమీ లేవని చెప్పారు. ముఖ్యమంత్రి కోటరీపై కొండా సురేఖ వ్యాఖ్యలపై తానేమీ స్పందించనని కవిత అన్నారు. నా కోటరీతోనే డీల్ చేయటమే నాకు కష్టమవుతుందని... సంబంధం లేని అంశంపై ఏమీ మాట్లాడలేనని అన్నారు. కార్యక్రమంలో టిజెటిఎఫ్ అధ్యక్షులు మోరం వీరభద్రరావు, అడ్‌హక్ కమిటీ సభ్యులు ఘనపురం దేవేందర్, జాడి శ్రీనివాస్, తానిపర్తి తిరుపతి రావు, ఎం. కవిత, సుజాత, ఉపాధ్యాయులు ఈరవేణి రాజ్ కుమార్, విష్ణువర్ధన్, దుర్గములత, ఎస్ ఆర్ సతీష్ కుమార్, కే గంగరాజు, కోటగిరి గంగా ప్రసాద్, కంచరి రవికుమార్, చిట్యాల సుజాత, నాగమల్ల ఉమాదేవి, జీ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 18 Oct 2025 10:50 pm

రాజమండ్రిలో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పై కేసు

రాజమండ్రిలో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై కేసు

మన తెలంగాణ 18 Oct 2025 10:07 pm

క్రెడిట్‌కార్డులకు ఇక కాలం చెల్లు

వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే ఇప్పుడున్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు ఉనికిలో ఉండకపోవచ్చునని సౌత్ ఆసియా మాస్టర్‌ కార్డు ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సిఇఒ) గౌతమ్ అగర్వాల్ తెలిపారు. ఓ మోస్తరు ఆదాయ వర్గాలు, ఉద్యోగస్తులు, ప్రత్యేకించి యువ ఐటి ఉద్యోగులు విరివిగా ఈ క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియ అత్యధికంగా డిజిటల్ రూపంలో ఉంటుంది. కార్డుల రూపంలో చెల్లింపుల దశ ఉండదేమో, మన ఆలోచనలకు అనుగుణంగా తక్షణ చెల్లింపుల క్రమంలో ఇకపై ఇప్పటి క్రెడిట్ కార్డుల చెల్లింపుల దశ మారుతుందని న్యూఢిల్లీలో జరుగుతోన్న ఎన్‌డిటీవీ సమ్మిట్ 2025లో ఆర్థిక లావాదేవీల విషయాల విశ్లేషణ దశలో అగర్వాల్ చెప్పారు. భారతదేశంలో ఆర్థిక వ్యవహారాలు, ప్రత్యేకించి చెల్లింపుల ప్రక్రియలో అత్యంత వేగవంతంగా మార్పులు ఉంటున్నాయి. ఇంతకు ముందు రూపాయల్లో చెల్లింపులు ఉండేవి. వీటి స్థానంలో క్రమేపీ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదంతా కూడా మానసిక చైతన్యస్రవంతికి సంబంధించిన వ్యవహారం కానుంది. ఈ క్రమంలో చెల్లింపుల విషయంలో మార్పులు అనూహ్యం అన్నారు. మొత్తం మీద భారత్ ప్రపంచంలోనే అత్యధిక అధునాతన చెల్లింపుల వ్యవస్థగా నిలిచింది. ఇందులో సందేహం లేదు. విస్తరిస్తున్న డిజిటల్ ప్రక్రియ, ఇందులో ఇమిడి ఉంటోన్న అత్యంత తేలికైన లావాదేవీల వ్యవహారాలతో జనం ప్రత్యేకించి భవిష్య తీరుతెన్నుల వైపు మొగ్గుచూపే వారు క్రెడిట్ కార్డులు , లేదా డెబిట్ కార్డుల దారిని వీడుతారని అగర్వాల్ విశ్లేషించారు. పైగా క్రెడిట్ కార్డుల చెల్లింపుల క్రమంలో తలెత్తే తాత్కాలిక ప్రయోజనంతో పోలిస్తే ఆ తరువాత తలెత్తే ఆర్థికపరమైన చిక్కులు, పొందిన దాని కంటే ఎక్కువ చెల్లింపుల స్థాయిలో భారం వంటి అనుభవాలతో జనం పాత బాట వీడి వేరే రూపంలో చెల్లింపులకు దిగే వీలుందని విశ్లేషించారు. 

మన తెలంగాణ 18 Oct 2025 10:01 pm

సాగర్‌లో ఎపి గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శనివారం కుటుంబ సమేతంగా నాగార్జునసాగర్‌ను సందర్శించారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్లే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకోగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ నారాయణ అమిత్ గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం నేరుగా స్థానిక లాంచీ స్టేషన్‌కు బయలుదేరి నాగార్జునకొండను సందర్శించి అక్కడ పురావస్తు శాఖ మ్యూజియాన్ని సందర్శించి, అక్కడి బుదుడి విశేషాలు తెలుసుకున్నారు. సాయంత్రం తెలంగాణ పర్యాటక శాఖ విజయ విహార్ గెస్ట్ హౌస్‌లో బస చేసి ఆదివారం ఉదయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు, బుద్ధవనాన్ని సందర్శించి ఆదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్రప్రదేశ్ బయలుదేరనున్నారు. కాగా, ఎపి గవర్నర్ రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

మన తెలంగాణ 18 Oct 2025 9:53 pm

Chiru’s Meesala Pilla Unstoppable, Still In Top

Megastar Chiranjeevi’s most stylish look and commanding presence in the first glimpse of Mana Shankara Vara Prasad Garu quickly became a hot topic. While fans were still celebrating the teaser, director Anil Ravipudi and his team recently dropped the film’s first single, Meesala Pilla. Composed by Bheems Ceciroleo, the soulful and catchy number perfectly showcases […] The post Chiru’s Meesala Pilla Unstoppable, Still In Top appeared first on Telugu360 .

తెలుగు 360 18 Oct 2025 9:42 pm

Bandla Ganesh hosts a Grand Diwali Bash

Tollywood producer Bandla Ganesh is aiming for a strong comeback in Telugu cinema. On the occasion of Diwali, he hosted a grand bash for the celebrities of Telugu cinema at his residence in Jubilee Hills, Hyderabad. Megastar Chiranjeevi, Venkatesh, Srikanth, Naveen Yerneni, Harish Shankar, Siddhu Jonnalagadda, Tharun and others attended the grand bash. Most of […] The post Bandla Ganesh hosts a Grand Diwali Bash appeared first on Telugu360 .

తెలుగు 360 18 Oct 2025 9:38 pm

యువకుడి ప్రాణం తీసిన ఫైనాన్స్ వేధింపులు

 ఫైనాన్స్ వేధింపులు ఒక యువకుడి నిండు ప్రాణాలు బలిగొన్నాయి. ఈ విషాద ఘటన సిద్దిపేట అర్బన్ మండలం, ఎల్లుపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, 3 టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఐరేని మల్లేశం (30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. 2023లో నూతనంగా నిర్మించుకున్న ఇంటి అవసర నిమిత్తం సిద్దిపేటకు చెందిన చోళ మండలం ఫైనాన్స్ కంపెనీలో ఏడు లక్షల 12 వేల రూపాయల రుణంగా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి గత కొంతకాలంగా ఇఎంఐలు చెల్లిస్తూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో రెండు ఇఎంఐలు పెండింగ్ కావడంతో గత 5 రోజుల నుండి ఫైనాన్స్ నిర్వాహకులు అతనికి ఫోన్ చేయడం, ఇంటికి వస్తుండడం, ఎక్కడైనా పనికి వెళ్తే అక్కడికి వెళ్లి వేధించేవారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు..కొంత ఇబ్బంది ఉంది.. డబ్బులు రాగానే చెల్లిస్తాం.. అని చెప్పినప్పటికీ వినకుండా ఈ నెల 16వ తేదీసాయంత్రం ఫైనాన్స్ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎల్లుపల్లి గ్రామానికి వచ్చి ఇంటి వద్ద కూర్చొని ‘డబ్బులు ఇస్తేనే వెళ్తాం.. లేదంటే నువ్వు చచ్చినా వెళ్లం’ అని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఐరేని మల్లేశం ఇంటి నుండి వెళ్లిపోయి తమ వ్యవసాయ బావి శివారులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో మిస్టర్ టి అనే పేరుతో టీ స్టాల్ పెట్టి కొంత ఆర్థికంగా ఇబ్బంది కావడంతో ఫైనాన్స్ కట్టడం ఆలస్యమైందని, ఎంత చెబుతున్నా వినకుండా ఫైనాన్స్ వారు అనేక రకాలుగా మానసికంగా హింస పెట్టడం వలన మనస్తాపంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి దుర్గయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫైనాన్స్ కంపెనీపై కూడా సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. ఫైనాన్స్ వేధింపులకు మరికొందరు బలికాకుండా ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు కోరారు.

మన తెలంగాణ 18 Oct 2025 9:23 pm

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

మహారాష్ట్రలోని నందూర్భార్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. చాంద్సైలి ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. అక్కడికక్కడే ఆరుగురు చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. మూల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బాధితులంతా దడ్గావ్ తాలూకా లోని అస్లి వద్ద అష్టంబ (అశ్వత్థామ ) రుషి తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నసమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఏటా దీపావళి సందర్భంగా ఈ తీర్థయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పోలీసులు, సహాయక బృందాలు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని సమీపం లోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు నందూర్బార్ తాలూకా లోని ఘోటానే నివాసితులుగా సమాచారం. 

మన తెలంగాణ 18 Oct 2025 9:18 pm

నెక్కొండలో మృతి… ఒడిషాలో ఎఫ్ ఐ ఆర్

నెక్కొండలో మృతి… ఒడిషాలో ఎఫ్ ఐ ఆర్ మృతదేహన్ని ఆలా తరలించవచ్చా..? సాధారణంగా

ప్రభ న్యూస్ 18 Oct 2025 9:16 pm

గరీబ్థ్ రైలులో మంటలు.

 పంజాబ్ లోని అమృత్‌సర్ నగరం నుంచి శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో బయలుదేరిన అమృత్‌సర్‌సహర్సా గరీబ్థ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో శిర్హింద్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జి19 ఎసీ బోగీలో మొదట పొగలు రావడాన్ని జీఆర్‌పి అధికారి ఒకరు గుర్తించారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు బోగీ లోని చెయిన్ లాగి రైలును ఆపేశారు. ఆ తరువాత ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ఈలోగా మంటల్లో చిక్కుకుని బోగీ మొత్తం తగలబడి పోయింది. సమీపం లోని మరో రెండు బోగీలకు కూడా మంటలు వ్యాపించి అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. మూడు కోచ్‌లను రైలు నుంచి వేరు చేసి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయమైందని రైల్వేబోర్డు ప్రకటించింది. కాలిన గాయాలైన మహిళను (32) ఫతేగఢ్ సాహిబ్ లోని సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు శిర్హింద్ జీఆర్‌బీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రతన్‌లాల్ తెలిపారు. 

మన తెలంగాణ 18 Oct 2025 9:13 pm

కోడళ్లు తాను చెప్పినట్టే ఉండాలన్న పట్టింపుల్లేవు: అక్కినేని అమల

సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున ఇంట ఇటీవల కాలంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. నాగార్జున ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2024లో హీరోయిన్ శోభిత దూళిపాళను చైతన్య వివాహం చేసుకోగా... ఈ ఏడాదే ముంబైకి చెందిన వ్యాపారవేత్త జైనబ్ రివ్జీను అఖిల్ పెళ్లాడారు. దీంతో కొత్త కోడళ్ల రాకతో అక్కినేని వారి ఇల్లు కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో కోడళ్లతో తన అనుబంధం గురించి నాగార్జున సతీమణి అమల మాట్లాడుతూ తమ ఇంటికి కోడళ్లు శోభిత, జైనబ్ రావడంతో తనకు గర్ల్ సర్కిల్ ఏర్పడిందని అన్నారు. వాళ్లు ఎప్పుడూ ఆనందంగా కనిపిస్తారని, వాళ్ల వల్లే జీవితం సరికొత్తగా మారిందని చెప్పారు. కోడళ్లతో ఉన్నప్పుడు భలే సరదాగా ఉంటుందని, ఇక వాళ్ల వ్యక్తిగత విషయాల్లో తాను తలదూర్చనని తెలిపారు. అలాగే ఇంట్లో వాళ్లకు ఎంతో స్వేచ్ఛ ఉంటుందని, కోడళ్లు తాను చెప్పినట్టే ఉండాలన్న పట్టింపులేమీ తనకు లేవని అమల చెప్పారు. వాళ్లు తమ తమ రంగాల్లో రాణిస్తూ బిజీగా ఉండడం వల్ల తనకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని కోరుకోనని తెలిపారు.

మన తెలంగాణ 18 Oct 2025 9:11 pm

బహుమతిగానూ ఫాస్టాగ్ వార్షిక టోల్‌పాస్

న్యూఢిల్లీ : జాతీయ రహదారులపై టోల్ ఫీజుల చెల్లింపులకు సంబంధించిన ఫాస్టాగ్‌పై మరో కొత్త సౌలభ్యం కూడా అందుబాటులోకి వచ్చింది. వార్షిక టోల్‌పాస్‌ను ఇకపై మనం ఎవరికైనా గిఫ్ట్‌గా కూడా ఇవ్వొచ్చు. దీపావళి సందర్భంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. మీరు ఎవరికైతే టోల్‌పాస్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారో యాప్‌లోకి వెళ్లి ‘యాడ్ పాస్’ విభాగంలోకి వెళ్లాలి. మనం ఎవరికైతే గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నామో వారి వాహనం నెంబర్, కాంటాక్ట్ వివరాలు జతపరచాల్సి ఉంటుంది. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత మీ ద్వారా బహుమతిగా పొందిన వ్యక్తి దాన్ని ఉపయోగించుకునే సౌలభ్యం దొరుకుతుంతని ఎన్‌హెచ్‌ఎఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదిలావుండగా ఏడాదికి రూ.3వేలతో వార్షిక టోల్ పాస్ తీసుకుంటే ఏడాది పాటు లేదా 200 సార్లు టోల్‌ప్లాజాలు దాటే అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. 

మన తెలంగాణ 18 Oct 2025 9:03 pm

మల్లికార్జున ఖర్గేని పరామర్శించిన మంత్రి సీతక్క

 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క శనివారం బెంగళూరులో పరామర్శించారు. ఖర్గే యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.

మన తెలంగాణ 18 Oct 2025 8:56 pm

యూట్యూబర్లపై పోక్సో కేసు

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ ఛానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ నుంచి వీడియోలను డిలిట్ చేశారు. కంటెంట్ డిలిట్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు రెండు యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉందని, ఇష్టం వచ్చినట్లు మైనర్లపై కంటెంట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే చర్యలు తీసుకుంటామని సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు. ఇక నుంచి కూడా అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో పెడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. యూట్యూబ్ ఛానళ్లపై 67,67ఏ, 67బి, ఐటి యాక్ట్, 294,79,49,8,7,12,11,14,13,17,16 పోక్సో యాక్ట్ 20212 కింద కేసు నమోదు చేశారు.

మన తెలంగాణ 18 Oct 2025 8:52 pm

తప్పు చేసినోళ్లని వదలం

తప్పు చేసినోళ్లని వదలం

ప్రభ న్యూస్ 18 Oct 2025 8:33 pm

టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీ నష్టం..

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కటకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. టపాసుల ప్యాకింగ్ పేపర్ల వ్యర్థాల్లో ప్రమాదవశాత్తు నిప్పురవ్వ పడి మంటలు చెలరేగాయి. గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన హోల్‌సేల్ అండ్ రిటైల్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చ మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి విలువైన టపాసులు కాలిపోయాయని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు.

మన తెలంగాణ 18 Oct 2025 8:14 pm

మనది రైతు మిత్ర విధానం

మనది రైతు మిత్ర విధానం విజయవాడ, ఆంధ్రప్రభ : రైతులకు ఎటు వంటి

ప్రభ న్యూస్ 18 Oct 2025 8:06 pm

సమాజంలో ఆడమగ వివక్ష తగదు

సమాజంలో ఆడమగ వివక్ష తగదు కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : ఇక్కడ ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 18 Oct 2025 7:51 pm

దీపావళి బాంబులు సీజ్

దీపావళి బాంబులు సీజ్ మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట(Mangapet) మండలంలోని

ప్రభ న్యూస్ 18 Oct 2025 7:39 pm

మరో మహిళకు గాయాలు.. కేసు నమోదు.

మరో మహిళకు గాయాలు.. కేసు నమోదు. ఊట్కూర్, ఆంధ్రప్రభ : అదుపుతప్పి ట్రాక్టర్

ప్రభ న్యూస్ 18 Oct 2025 7:27 pm

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పరువు హత్య

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, దహెగాం మండలం, గెర్రె గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. నిండు గర్భిణి అయిన కోడలిని స్వంత మామే గొడ్డలితో దారుణంగా నరికి హతమార్చాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలండి లచ్చయ్య, అనసూర్య దంపతుల కుమార్తె శ్రావణి (23), అదే గ్రామానికి చెందిన శివర్ల సత్తయ్య, సత్తక్క దంపతుల చిన్న కొడుకు శేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రావణి 9 నెలల గర్భిణి. వచ్చే నెల వైద్యులు ప్రసవం కోసం ఆమెకు డేట్ కూడా ఇచ్చారు. అయితే, శ్రావణి, శేఖర్ కులాలు వేర్వేరు కావడంతో శేఖర్ తండ్రికి వీరి వివాహం ఇష్టం లేదు. శ్రావణి ప్రస్తుతం వారి తల్లిగారింటిలో ఉంది. వారి ఇంటిలో ఎవరూ లేని సమయం చూసిన మామ సత్తయ్య గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. కాగజ్‌నగర్ డిఎస్‌పి వహిదుద్దీన్, సిఐ కుమార స్వామి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు శ్రావణి తండ్రి లచ్చయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 18 Oct 2025 7:24 pm

K Ramp Producer Expresses his Dissatisfaction

Young producer Razesh Danda produced films like Samajavaragamana and Mazaka in the past. He recently produced Kiran Abbavaram’s K Ramp and the film released today. This mass entertainer had early USA premieres and the talk was completely negative. The reviews too were poor but K Ramp opened on a decent note across the Telugu states […] The post K Ramp Producer Expresses his Dissatisfaction appeared first on Telugu360 .

తెలుగు 360 18 Oct 2025 7:23 pm

గాల్లో విమానం.. బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా మంటలు..

ఎయిర్ చైనాకు చెందిన ఓ విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. శనివారం ఎయిర్‌ చైనా విమానయాన సంస్థకు చెందిన విమానం తూర్పు చైనాలోని హాంగ్‌జౌ నుంచి దక్షిన కొరియాలోని సియోల్ సమీపంలోని ఇంచియాన్‌కు బయలు దేరింది. విమానం గాల్లోకి లేచిన కొంత సేపటికే ఓ ప్రయాణికుడి లగేజీలో ఉన్న లిథియం బ్యాటరీ పేలి.. మంటలు అంటుకున్నాయి. మంటలు ఓవర్‌హెడ్ బిన్ నుంచి బయటకు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ఎయిర్ చైనా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ ప్రయాణికులు సోషల్‌మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారాయి.

మన తెలంగాణ 18 Oct 2025 7:19 pm

పీజీ కోర్సుల్లో 106 కొత్త సీట్లు..

పీజీ కోర్సుల్లో 106 కొత్త సీట్లు.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 18 Oct 2025 7:19 pm

Revanth Reddy : అల్లుడిని అంబానీని.. బిడ్డను బిర్లాను చేయాలనుకున్నారు కానీ?

తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 18 Oct 2025 7:10 pm

బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రం బీసీ బిల్లును ఆమోదించాలి:మంత్రి సీతక్క

తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలంటే కేంద్రం బీసీ బిల్లును ఆమోదించాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి సీతక్క డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. అందుకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, కులగణన ప్రక్రియను ఎక్కడా లోపం లేకుండా పూర్తి చేశామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోరుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించామని, అయితే ఆ బిల్లు ఆరు నెలలుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ బంద్‌ను ప్రజాభవన్‌లోని మంత్రి సీతక్క నివాసంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి శనివారం పర్యవేక్షించారు. అనంతరం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఇతర నేతలతో కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేతలు జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశ్యంతో బీసీ బంద్ నిర్వహించామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయకుండా బిల్లును నిలిపి వేస్తోందని ఆమె విమర్శించారు. బిజెపి పార్టీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరించడం దారుణమని అన్నారు. తెలంగాణలోని బిజెపి నేతలు బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామంటారు, కానీ ఢిల్లీలో వారి పెద్దలు ‘నో’ అంటారని తెలిపారు. బీసీ అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ బీసీ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలని సీతక్క డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బిజెపి, బిఆర్‌ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. కులగణనలో పాల్గొనని వారు బీసీల హక్కులపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వారికి ప్రజలే సమాధానం చెబుతారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. .................

మన తెలంగాణ 18 Oct 2025 7:04 pm

తుగ్గలి అర్డబ్ల్యూఎస్ ఏఈ అరెస్టు

తుగ్గలి అర్డబ్ల్యూఎస్ ఏఈ అరెస్టు తుగ్గలి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రభ : దీపావళికి

ప్రభ న్యూస్ 18 Oct 2025 6:53 pm

కెప్టెన్సీ చేజారుతుందేమో అని భయం వేసింది..: సూర్యకుమార్

గడిచిన కొద్దికాలంలోనే టీం ఇండియాలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. టెస్ట్ క్రికెట్‌కి రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పడంతో అతడి స్థానంలో శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇంగ్లండ్ సిరీస్‌ రూపంలో గిల్‌కు పెద్ద సవాలే ఎదురైంది. అయితే ఆ ప్రతిష్టాత్మక సిరీస్‌ని గిల్ 2-2 తేడాతో సమం చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి.. ఆ బాధ్యతలు కూడా గిల్‌కే అప్పగించింది బిసిసిఐ. మరి ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలి. అయితే అంతకు ముందే గతేడాది టి-20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టి-20 ఫార్మాట్‌కి రోహిత్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. దీంతో అతడి స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్ భర్తీ చేశాడు. అయితే తాజాగా మూడు ఫార్మాట్‌లకు ఒకరే కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంకేతాలు ఇచ్చారు. దీనిపై సూర్య తాజాగా స్పందించాడు. ‘‘గిల్ రెండు ఫార్మాట్‌లకు కెప్టెన్ కావడం సంతోషంగా ఉంది. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే, టి-20 కెప్టెన్సీ విషయంలో నేను అబద్ధం చెప్పను. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కెప్టెన్సీ చేజారుతుందనే భయం ఉంటుంది. అయితే, ఆ భయం నుంచే నన్ను నేను మరింత మెరుగుపరచుకోవాలనే ప్రేరణ కూడా వస్తుంది. మైదానం లోపల, వెలుపల గిల్‌తో నా రిలేషన్‌ అత్యద్భుతంగా ఉంది. సోదర భావంతో మెలుగుతాం’’ అని సూర్య అన్నాడు. కాగా, అక్టోబర్ 19 భారత్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ఆక్టోబర్ 29 నుంచి టి-20 సిరీస్‌లో తలపడనుంది. 

మన తెలంగాణ 18 Oct 2025 6:47 pm

షాక్‌తో ఎద్దు మృతి

షాక్‌తో ఎద్దు మృతి వెల్దండ, ఆంప్రభ : వెల్దండ మండల సమీపంలోని రాచూర్

ప్రభ న్యూస్ 18 Oct 2025 6:44 pm

చ‌ట్ట స‌భ‌ల్లో స‌ముచిత స్థానాన్ని క‌ల్పించాలి..

చ‌ట్ట స‌భ‌ల్లో స‌ముచిత స్థానాన్ని క‌ల్పించాలి.. లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ : బీసీ

ప్రభ న్యూస్ 18 Oct 2025 6:30 pm

తెలుసు కదా మూవీ రివ్యూ: ప్రేమ, త్యాగం.. ఈ సినిమా అలరిస్తుందా?

తెలుసు కదా మూవీ అక్టోబరు 17, 2025న విడుదలైంది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న నీరజ కోన తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆధునిక సంబంధాలు, ప్రేమలోని సంక్లిష్టతలను చర్చించింది. నిన్న (అక్టోబర్ 17, 2025) విడుదలైన ఈ చిత్రంపై విశ్లేషణాత్మక, విమర్శనాత్మక సమీక్ష ఇక్కడ అందిస్తున్నాం. కథా నేపథ్యం వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ) అనాథగా పెరిగి, […] The post తెలుసు కదా మూవీ రివ్యూ: ప్రేమ, త్యాగం.. ఈ సినిమా అలరిస్తుందా? appeared first on DearUrban .

డియర్ అర్బన్ 18 Oct 2025 6:23 pm

Andhra Prabha Smart Edition|ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 18-10-2025

*ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 18-10-2025, 4.00PM* *బీసీ బంద్ సూపర్ సక్సెస్*

ప్రభ న్యూస్ 18 Oct 2025 6:13 pm

విద్యా రంగంలో నూజివీడు డివిజన్ ని అగ్రగామిగా నిలుపుతాం

డివైఇఓవిశాలాంధ్ర – చాట్రాయి : విధ్యారంగంలో నూజివీడు డివిజన్ రాష్ట్రస్తాయిలో అగ్రగామిగానిలపాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని డిప్యూటీ విద్యాశాఖ అధికారి సుధాకర్ తెలిపారు. శనివారం సాయంత్రం చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. ఇటీవల జరిగిన మెగా డీఎస్సీలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావడం జరిగిందని ఎలిమెంటరీ స్కూల్స్ లో 112 మంది జడ్ పి స్కూల్స్ లో 55 మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావడం జరిగిందన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని […] The post విద్యా రంగంలో నూజివీడు డివిజన్ ని అగ్రగామిగా నిలుపుతాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 6:12 pm

తండ్రిని హ‌త‌మార్చిన కొడుకు

తండ్రిని హ‌త‌మార్చిన కొడుకు జన్నారం, ఆంధ్రప్రభ : తాగుడుకు బానిసైన కొడుకు కన్న

ప్రభ న్యూస్ 18 Oct 2025 6:10 pm

భోధనేతర పనులను బాయ్ కట్ చేయండి

జీ రాము విశాలాంధ్ర – చాట్రాయి : ఉపాధ్యాయులంతా బోధనేతర పనులను బాయ్ కట్ చేయాలని ఎస్టియు ఉపాధ్యాయ సంఘం జిల్లా ఆర్థిక కార్యదర్శి జి రాము కోరారు.శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యాయులు బోధ నేతర పనులు చేయడం వలన విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అందువలన రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యంగా ఇచ్చిన పిలుపుమేరకు ఉపాధ్యాయులు ఇతర పనులు బాయ్ కట్ చేయాలని కోరారు.ఎస్టియూ జిల్లా కార్యదర్శి గుడ్ల అమరయ్య సంజపు నరసింహారావు […] The post భోధనేతర పనులను బాయ్ కట్ చేయండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 6:07 pm

బిజెపి కేంద్ర మంత్రులు, ఎంపిలు మోడీపై ఒత్తిడి తేవాలి: హరీశ్ రావు

హైదరాబాద్: బిసి రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్, బిజెపిలు నాటకాలాడుతున్నాయని.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బిజెపి, కాంగ్రెస్ మద్దతు ఇచ్చాక.. రిజర్వేషన్లను ఆపేదెవరు? అని ప్రశ్నించారు. ‘‘ఆరుసార్లు జనగనన చేసిన కాంగ్రెస్ ఏనాడు బిసి గణన చేయలేదు. బిజెపి ఏకంగా జనగణను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తోంది. ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్, బిజెపికి బిసిలు గుర్తుకురాలేదా.? రిజర్వేషన్లు పెంచాలని కెసిఆర్ రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టలేదు.? ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బిజెపి ఎంపిలు మోడీపై ఒత్తిడి తేవాలి. బిసి రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీ వేదికగా పోరాటం మొదలు పెట్టాలి’’ అని హరీశ్ అన్నారు. 

మన తెలంగాణ 18 Oct 2025 6:06 pm

దివ్యాంగులకు ప్రత్యేక బోధన

అనితవిశాలాంధ్ర – చాట్రాయి : అంగవైకల్యం కలిగిన పిల్లలకు ప్రత్యేక విద్యాబాధన ఎంతగానో దోహదం చేస్తుందని చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయురాలు అనిత తెలిపారు. శనివారం సాయంత్రం ఆమె విశాలాంధ్రతో మాట్లాడుతూ. మండల కేంద్రమైన చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగవైకల్యం కలిగిన పిల్లలకు ఫిజియోథెరపీ ,నోట్ స్పీచ్, మరియు విద్యాబోధన అందించడమే కాకుండా ప్రభుత్వం నుండి అందే ఉపకార వేతనాలను గుర్తింపు కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. వారి తల్లిదండ్రులకు ప్రత్యేక […] The post దివ్యాంగులకు ప్రత్యేక బోధన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 6:05 pm

Telangana : దారుణం ...కోడలిని హత్య చేసిన మామ

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గర్భవతి అని చూడకుండా మామ కోడలిని హత్య చేశాడు

తెలుగు పోస్ట్ 18 Oct 2025 6:01 pm

బాల్క సుమ‌న్ ప్ర‌జ‌ల నాయ‌కుడు

బాల్క సుమ‌న్ ప్ర‌జ‌ల నాయ‌కుడు లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : మున్సిపాలిటీ పరిధిలోని

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:59 pm

కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా భూస్థాపితం

కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా భూస్థాపితం హైదరాబాద్, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ) : బిసి

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:57 pm

మీ ఆప్తుల కోసం అద్భుతమైన దీపావళి శుభాకాంక్షలు: 10 ప్రత్యేక సందేశాలు, లక్ష్మీదేవి శ్లోకాలు

మీకు మీ కుటుంబానికి డియర్ అర్బన్ దీపావళి శుభాకాంక్షలు చెబుతోంది. వెలుగుల పండుగ దీపావళి వచ్చింది. ఈ పండుగ రోజున కొత్త కాంతిని, సరికొత్త ఆశలను ఆహ్వానిస్తాం. మన జీవితంలోని చీకట్లను తొలగించి, సంతోషాల వెలుగులు నింపే గొప్ప పండుగ ఇది. ఈ శుభ సందర్భంలో, మీ బంధుమిత్రులకు, ఆత్మీయులకు ప్రేమను, శుభాకాంక్షలను పంపండి. మీరు పంపడానికి వీలుగా, 10 అత్యుత్తమమైన దీపావళి శుభాకాంక్షలను మేము ప్రత్యేకంగా రూపొందించాం. వాటితో పాటు, సిరిసంపదల దేవత లక్ష్మీ దేవి […] The post మీ ఆప్తుల కోసం అద్భుతమైన దీపావళి శుభాకాంక్షలు: 10 ప్రత్యేక సందేశాలు, లక్ష్మీదేవి శ్లోకాలు appeared first on DearUrban .

డియర్ అర్బన్ 18 Oct 2025 5:49 pm

ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారం అవ‌స‌రం..

ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారం అవ‌స‌రం.. బాసర, ఆంధ్ర ప్రభ : ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:42 pm

Revanth Reddy : అధికారులపై రేవంత్ సీరియస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 18 Oct 2025 5:34 pm

ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు

విశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ గోపాల్ నాయక్, జడ్పీ గర్ల్స్ హై స్కూల్ హెడ్మాస్టర్ సుమన, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెస్సు, వాలీబాల్, బ్యాట్మింట, కోకో, కబడ్డీ, యోగాలలో అండర్ 14, 17. బాలికల, బాలుర విభాగాలలో ఎంపిక టోర్నమెంటును నిర్వహించి అన్ని విభాగాలలో […] The post ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 5:29 pm

ఏలూరు జిల్లా పోలీసుల నయా హిస్టరీ

ఏలూరు జిల్లా పోలీసుల నయా హిస్టరీ ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ఏలూరు

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:28 pm

రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది.. కన్వీనర్ నామా ప్రసాద్

విశాలాంధ్ర- ధర్మవరం ; రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి గాంధీ నగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ లను పంపిణీ చేశామని తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి […] The post రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది.. కన్వీనర్ నామా ప్రసాద్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 5:25 pm

ఏర్పేడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్

ఏర్పేడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన ఎంపీ గురుమూర్తి ఏర్పేడు, అక్టోబర్

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:24 pm

కొందరు అధికారుల పనితీరులో మార్పు రాలేదు: సిఎం

హైదరాబాద్: సిఎస్, సిఎంవొ కార్యదర్శులతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల పనితీరుపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారుల పని తీరులో ఇంకా మార్పు రాలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. కొందరు అధికారు పని తీరులో ఇంకా మార్పు రావట్లేదని పేర్కొన్నారు. అధికారులు అలసత్వం వీడి పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దని తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తేనే పనులు వేగవంతం అవుతాయని సిఎం స్పష్టం చేశారు. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని.. కీలక దస్త్రాలు, పనులు ఎక్కడా ఆగిపోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, నిధులు రాబట్టుకునే కార్యచరణను వెంటనే చేపట్టాలని.. ఇకపై సిఎస్, సిఎంవొ అధికారులు ప్రతివారం నివేదికలు అందించాలని ఆదేశించారు.

మన తెలంగాణ 18 Oct 2025 5:21 pm

వేముల‌వాడ ఏరియా ఆస్ప‌త్రి వైద్య‌లు ఘ‌న‌త‌

వేముల‌వాడ ఏరియా ఆస్ప‌త్రి వైద్య‌లు ఘ‌న‌త‌ వేముల‌వాడ, ఆంధ్ర‌ప్ర‌భ : వేములవాడ ప్రభుత్వ

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:17 pm

నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరుస్తాం..

సూపరిండెంట్ తిప్పేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరైన నిధులతో ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరుస్తాము అని సూపర్డెంట్ తిప్పేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. తొలుత కమిటీ సభ్యులతో ఆసుపత్రిలోని పలు వార్డులను, రోగులతో మాటలు తదితర వాటిని వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగుల సౌకర్యార్థం అవసరమైన పరికరాల కొనుగోలుకు 63 లక్షల నిధులతో పనులు చేపడతామని తెలిపారు. ఎందుకు కమిటీ కూడా […] The post నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరుస్తాం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 5:16 pm

అటవీ శాఖ దాడితో పరారీ

అటవీ శాఖ దాడితో పరారీ కడపలో సంచలనం కడప, ఆంధ్రప్రభ బ్యూరో :

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:09 pm

ప్రశాంతమైన వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకోవాలి.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర- ధర్మవరం; ఈనెల 20వ తేదీన నిర్వహించుకునే దీపావళి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు టపాసుల విక్రయదారులతో ఆర్డిఓ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహిస్తూ, పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టపాసుల విక్రయదారులు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని వారు హెచ్చరించారు. ప్రమాదాలు జరగకుండా బాధ్యతతో దుకాణా దారులు మెలగాలని వారు సూచించారు. మరో మూడు రోజుల్లో దరఖాస్తు చేసుకున్న వారి […] The post ప్రశాంతమైన వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకోవాలి.. ఆర్డీవో మహేష్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 5:09 pm