మనతెలంగాణ/హైదరాబాద్ : భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడుల ప్రవాహాం కొనసాగింది. రెండో రోజు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు జరిపారు. ఈ నేపథ్యంలోనే సి ఎం బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భగా పలు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. రెండోరోజూ 2 లక్షల 96 వేల 995 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీ య సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నా యి. మొదటి రోజు 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందా లు జరగ్గా మొత్తం ఈ రెండు రోజులు కలిపి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ప లు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. ఇన్ఫ్రాకీ డిసి పారక్స్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం తో భారీ డేటా పార్క్ అభివృద్ధి చేసేందుకు రూ. 70 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టడానికి ముందుకొచ్చింది. జెసీకే ఇన్ఫ్రా ప్రా జెక్ట్ లిమిటెడ్ రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టనుంది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏజిపి గ్రూప్ మొత్తం రూ.6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ) టీకాలు, పరిశోధన-అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ.3,500 కోట్ల కొత్త పెట్టుబడిని ప్రకటించింది. గ త పెట్టుబడితో కలిపి మొత్తం రూ.4 వేల కోట్లను రాష్ట్రంలో పెట్టనుం ది. దీనివల్ల 3 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఫెర్టిస్ ఇండి యా ప్రైవేటు లిమిటెడ్ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో అధునాతన ఆహార -వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో 800 పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్థిర వ్యవసాయానికి అవసరమైన పోషకాలు, బయో ఉత్ప్రేరకాలు తయారీకి రూ.200 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు. హెట్రో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు రూ.1,800 కోట్ల పెట్టుబడి వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఫ్రీజ్-డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపనకు రూ.1,100 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వెయ్యి మంది వరకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ కన్యూమర్ ప్రోడక్ట్ లిమిటెడ్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే యూనిట్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది. ఆర్సీ సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 1,600 కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యం గల గ్లోబల్ కెపాసిటీ, ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 3 వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అరబిందో ఫార్మా రూ.2 వేల కోట్లతో విస్తరణ చేపట్టి 3 వేలకు పైగా ఉద్యోగాలు సృష్టించనున్నారు. హెట్రో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు రూ.1,800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దీంతో 9 వేలకి పైగా ప్రత్యక్ష-పరోక్ష ఉద్యోగాలు సృష్టించనున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా రూ.1,200 కోట్ల పెట్టుబడితో 2,500-3 వేల మందికి ఉపాధి కల్పించనుంది. భారత్ బయోటెక్ రూ.1,000 కోట్ల పెట్టుబడి భారత్ బయోటెక్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేస్తోంది. దీంతో 200లకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆహార-పానీయాల తయారీ విస్తరణలో కేజేఎస్ ఇండియా రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ యూనిట్ ద్వారా 1,551 మందికి ఉపాధి లభించనుంది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు రూ.150 కోట్ల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఆక్వెలాన్ నెక్సస్ లిమిటెడ్ తెలంగాణలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. డెయిరీ వ్యాపారాన్ని విస్తరించడానికి గోద్రెజ్ ఆసక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గోద్రెజ్ జర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మిల్క్, ఎఫ్ఎమ్సీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ పామ్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి గోద్రెజ్ సంస్థ ఆసక్తి చూపింది. రాష్ట్రంలో తమ డెయిరీ వ్యాపారాన్ని (రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం) రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే ప్రతిపాదనపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 40 ఎకరాల భూమి అవసరం కానుండగా 2 సంవత్సరాల్లో 300 ప్రత్యక్ష ఉద్యోగాలను ఈ సంస్థ కల్పించనుంది. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ ఎంఓయూతో 60వేల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంతో అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణలో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ లో 60 వేల ఉద్యోగాలు సృష్టిస్తామని యూనివర్సిటీ సీనియర్ వైస్ ఛాన్స్లర్ అనంత శేఖర్ తెలిపారు. మొదటగా హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్రంలోని 13 జిల్లాలకు విస్తరిస్తామని ఆయన ప్రకటించారు. పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల భారీ పెట్టుబడులు పర్యాటక రంగంలోనూ రూ.7,045 కోట్ల భారీ పెట్టుబడులు తెలంగాణకు రానున్నాయి. దీంతో ప్రత్యక్షంగా 10 వేల మందికి పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది. ఫుడ్ లింక్ ఎఫ్అండ్బి హోల్డింగ్స్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ - రూ.3,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. డ్రీమ్‌వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్ - రూ.1,000 కోట్లతో నిర్మించనున్నారు. సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ (మాల్దీవులు) - రూ.800 కోట్లు, కేఈఐ గ్రూప్ (కామినేని గ్రూప్) - రూ.200 కోట్లు, పోలిన్ గ్రూప్ (టర్కీ), మల్టీవర్స్ హోటల్స్ - రూ.300 కోట్లు, ఫ్లుడ్రా ఇండియా (స్పెయిన్) - రూ.300 కోట్లు, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ - రూ.300 కోట్లు, రిధిరా గ్రూప్ - రూ.120 కోట్లు, సలామ్ నమస్తే దోసా హట్ (ఆస్ట్రేలియా), విశాఖ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ యానిమేషన్ - ఐఫా ఉత్సవం, ఏథెన్స్ ఈవెంట్ల భాగస్వామ్యం ద్వారా రాష్ట్రానికి రూ.550 నుంచి -600 కోట్ల ఆర్థిక లాభం చేకూరనుంది. టిడబ్ల్యూఐ గ్రూప్ ప్రపంచంలోనే తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోట్బాక్ తయారీ కేంద్రం తెలం గాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రూ.1,100 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఈ సంస్థ నిర్ణయించింది. ఈ కంపెనీ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్ర రూ.500 కోట్ల పెట్టుబడి మహీంద్రా అండ్ మహీంద్ర జహీరాబాద్ యూనిట్ విస్తరణకు నాలుగేళ్లలో రూ.500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఇండియా ఎక్స్ ట్రీమ్ అడ్వెంచర్ 20 ఎకరాల్లో ఎక్స్ ట్రీమ్ స్పోర్ట్, అడ్వెంచర్, ఈ- స్పోర్ట్ అరేనా. మొత్తంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టింది. బయోవరం టిష్యూ ఇంజనీరింగ్, రెజెనరేటివ్ మెడిసిన్, సెల్-జీన్ థెరపీకి ప్రత్యేక కేంద్రం రూ. 250 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. జ్యూరిక్ ఇన్షూరెన్స్ ఇండియాలో తొలి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జిసిసి) కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంది. మూడేళ్లలో దశలవారీగా దీనిని విస్తరించనున్నారు. కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (సిఐబిసి) తమ తొలి భారతీయ జిసిసిని హైదరాబాద్‌లో స్థాపించనుంది. హైదరాబాద్‌ను గ్లోబల్ ఇంజినీరింగ్-సైబర్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్క్యంగా పేర్కొంది. మాక్సిమస్ (అమెరికా) గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ టెక్నాలజీ-ఆపరేషన్స్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. శాటిలైట్ స్పోర్ట్ సిటీని అభివృద్ధి చేయనున్న జీఎంఆర్ స్పోర్ట్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా శాటిలైట్ స్పోర్ట్ సిటీని జీఎంఆర్ స్పోర్ట్ అభివృద్ధి చేయనుంది. అనలాగ్ ఏఐ (అలెక్స్ కిప్మాన్) హైదరాబాద్‌లో గ్లోబల్ పరిశోధన- ప్రోటోటైపింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఆల్ట్ మిన్ బ్యాటరీ ముడి పదార్థాల తయారీ కేంద్రం ప్రతిపాదించింది. అజయ్ దేవగన్ ఫిల్మ్ స్టూడియోలో స్టూడియోలు, విఎఫ్ ఎక్స్, వర్క్ షాప్‌లు వంటి ఫిల్మ్ ఎకో సిస్టమ్‌ను పిపిపి మోడల్లో అభివృద్ధి చేయనున్నారు. దీంతో యువతకు ఉపాధి అవకావాలు పెరగ నున్నాయి. తెలంగాణ,- యూఏఈ, -ఆఫ్రికా పెట్టుబడి భాగస్వామ్యాల కోసం చర్చించారు. బహుళరంగ పెట్టుబడి డెస్క్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకునేందుకు పరిశీలించారు. బ్లాక్‌స్టోన్ ఆసియా డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ పార్కులు, కమర్షియల్ స్పేస్‌లోలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. సత్త్వ గ్రూప్ సమగ్ర పట్టణ అభివృద్ధి, స్టూడెంట్- సీనియర్ లివింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. బ్రిగేడ్ గ్రూప్ సమగ్ర టౌన్షిప్ ప్రతిపాదనపై చర్చించారు. ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్ మెంట్‌పై ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది. సుమధుర గ్రూప్ కొత్త టౌన్షిప్, మధ్యతరగతి నివాస సముదాయాల ప్రతిపాదిం చింది. విజ్జీ హోల్డింగ్స్ మల్టీ-ఒమిక్స్, డిజిటల్ ట్విన్, ప్రిసిషన్ హెల్త్ పరిశోధన కోసం ఆధునిక కేంద్రం ప్రతిపాదించారు. -- 18 దేశాలు పాల్గొనే ఏషియా రోయింగ్ ఛాంపియన్షిప్ 2026లో ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లు ఫీఫా ఏఐఎఫ్ఎఫ్ ఫుట్‌బాల్ అకాడమీ టాలెంట్ అభివృద్ధికి ప్రపంచ స్థాయి అకాడమీ హైదరాబాద్‌లో స్థాపించనున్నారు. తెలంగాణను గ్లోబల్ హాకీ హబ్ గా మార్చేందుకు హాకీ మహిళల వరల్ కప్ క్వాలిఫైయర్ 2026ను 8 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ పోటీని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు పాల్గొనే ఏషియా రోయింగ్ ఛాంపియన్షిప్ 2026లో నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ 2026 ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఉత్సవం కానుంది. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తా స్క్రిఫ్ట్‌తో వస్తే సినిమా పూర్తి చేసుకొని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ పెద్దలకు భరోసా ఇచ్చారు. ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2025 సదస్సు సందర్భంగా ఆయన మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీకి వచ్చారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు రితేష్- జెనీలియా దంపతులు, అక్కినేని అమల, నటుడు రాహుల్ రవీంద్రన్ పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి వారితో స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సిఎం వివరించారు. 24 క్రాఫ్ట్ సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సినీ పెద్దలు సిఎం రేవంత్‌కు సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ, సహకారాలు ఉంటాయని సిఎం రేవంత్ తెలిపారు.
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)ను కొనసాగేలా చూడాలని రాష్ట్ర ప్ర భుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకో ర్టు సూచించింది. సర్ ప్రక్రియలో భాగమైన బూత్‌లెవెల్ అధికారులు (బిఎల్ఒ), ఇతర అధికారులు పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో బెదిరింపుల కు గురవుతుండడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఈ పరిస్థితిని అధిగమించాలని ఆదేశించింది. లేకపోతే అరాచకం అ వుతుందని హెచ్చరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ, దాని నిర్వహణలో ఎదురవుతున్న పరిస్థితులపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం చీఫ్‌జస్టిస్ సూ ర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బగ్చీ నేతృత్వం లో ని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అ త్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. బిఎల్ఓలకు బెదిరింపులు, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే, వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. బీఎల్ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరించాలని పేర్కొంది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం కోర్టుకు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల రక్షణ కల్పించడానికి నిరాకరిస్తే స్తానిక పోలీసులను డిప్యుటేషన్ పై తీసుకోవలసి వస్తుందని, అప్పటికీ పరిస్థితి మారకుంటే కేంద్ర బలగాలను రప్పించ వలసి వస్తుందని ఎన్నికల సంఘం తరపున కోర్టుకు హాజరైన ద్వివేది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ సనాతని సంగ్సాద్ , ఇతరుల తరఫున సీనియర్ న్యాయవాది వి. గిరి హాజరయ్యారు. బిఎల్‌ఒలపై దాడులు , బెదిరింపులు జరగకుండా వారికి రక్షణ కల్పించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రెండో విడత ఎన్నికల ప్రచా రం 12న, మూడో విడత ప్రచారం ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5 గంటల ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఇసి) తెలిపింది. ప్రచారం ముగిసిన తర్వాత బ హిరంగ సమావేశాలు, ఎలక్ట్రానిక్ మీడి యా, రేడియోలలో ప్రచారం నిర్వహించ డం పూర్తిగా నిషేధం అని ఎస్ఇసి కార్యద ర్శి ఎం.మకరందు తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని తెలిపారు. మొదటి విడత లో 4,236 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 37,440 వార్డు స్థానాలకు ఎ న్నికలు జరుగనున్నాయి. ఈనెల 11వ తేదీ న పోలింగ్ 189 మండలాలలో 37,562 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నవంబర్ 27 నుంచి 29 వరకు తొలి విడత పోలింగ్‌కు నామినేషన్లు స్వీకరించారు. తొలి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు 395 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు 13,127 అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 37,440 వార్డు స్థానాలకు 67,893 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. మొదటి విడతలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది తమ ఉపసంహరించుకోగా, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 9,626 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తొలి విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 27,41,070 మంది, మహిళలు 28,78,159 మంది, ఇతరులు 201 మంది ఉన్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ జరిగే ప్రాంతాలలో మంగళవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేయనుండగా.. తిరిగి 11న సాయంత్రం తెరుచుకోనున్నాయి.
భారత్‌లో మైక్రోసాఫ్ట్ బి.డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ చైర్మన్, సిఇఒ సత్య నాదెళ్ల మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అనంతరం భారత్‌కు 17.5 బిలియన్ డాలర్ల (రూ.1.58 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని ప్రకటించారు. ఆసియాలో ఇప్పటివరకు చేసిన అతిపెద్ద పెట్టుబడిగా ఇది గుర్తిం పు పొందింది. భారతదేశం ఎఐ ఆధారిత భవిష్యత్తు దిశగా ముందుకెళ్లేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం నాదెళ్ల సోషల్ మీడియా లో ధన్యవాదాలు తెలుపుతూ ఈ పెట్టుబడిని అ ధికారికంగా ప్రకటించారు. 2026 నుండి 2029 వరకు నాలుగు సంవత్సరాల కాలంలో ఈ నిధులు క్లౌడ్, కృత్రిమ మేధస్సు రంగాల్లో వి నియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ పెట్టుబడి విస్తరణ, నైపుణ్యాభివృద్ధి, సార్వభౌమ సాంకేతిక సామర్థ్యాలు వంటి మూడు ప్రధాన కేంద్రీకరణ రంగాలపై దృష్టి పెడుతుం ది. హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ఇండియా సౌత్ సెంట్రల్ క్లౌడ్ రీజియన్ 2026 మధ్య నాటికి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇది దేశంలోనే అతి పెద్ద హైపర్‌స్కేల్ డేటాసెంటర్ ప్రాం తంగా ఉండనుంది. అదనంగా చెన్నై, హైదరాబాద్, పుణెలలోని మూడు ప్రస్తు త డేటా సెంటర్ ప్రాంతాలూ విస్తరించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల పని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎఐ అభివృద్ధికి దోహదపడుతోందని సంస్థ వెల్లడించింది.
మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఎస్ఎస్సి) మంగళవారం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. సైన్స్ పరీక్షలు రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, 7న బయాలజీ, ఏప్రిల్ 13 సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్ 1 భాషా పరీక్ష, 16న ఒకేషనల్ కోర్సు పేపర్ 2 భాషా పరీక్ష జరుగనుంది. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రం(ఆబ్జెక్టివ్ పేపర్) పార్ట్ బి పరీక్ష చివరి అర గంట ముందు ఇస్తారు. విద్యార్థులు ఆ 30 నిమిషాల్లోనే అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్‌కు మాత్రం పార్ట్ బి కూడా పార్ట్ ఎ కూడా ఇస్తారు. సిబిఎస్ఇ తరహాలో పరీక్షల మధ్య వ్యవధి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్ఇ) విధానంలో ఈసారి పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి ఇచ్చారు. సిబిఎస్ఇ పరీక్షలలో ఒక్కో పరీక్షకు ఏడు రోజుల వ్యవధి కూడా ఇస్తారు. ఈసారి రాష్ట్రంలో స్టేట్ సిలబస్‌తో నిర్వహించే టెన్త్ పరీక్షలకు కూడా ఆ విధానాన్ని అమలు చేస్తున్నారు. పరీక్ష, పరీక్షకు మధ్య ఎక్కువ సమయం ఉంటే విద్యార్థులు ప్రిపేర్ అయ్యేందుకు సమయం లభిస్తుందని అధికారులు భావించారు. గత ఏడాది టెన్త్ షెడ్యూల్లో పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి లేదు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారని అధికారులు గుర్తించారు.దాంతో ఈసారి సిబిఎస్ఇ తరహాలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఎస్ఎస్సి బోర్డు ఖరారు చేసింది. సైన్స్ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, బయాలజీ) సంబంధించి పరీక్ష విధానంలో ఎస్ఎస్సి బోర్డు స్పష్టత ఇచ్చింది. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు భాగాలుగా వేర్వేరు రోజుల్లో నాలుగు రోజుల వ్యవధితో జరగనున్నాయి. ఏప్రిల్ 2న ఫిజికల్ సైన్స్ పరీక్ష జరుగనుండగా, 7న బయాలజీ పరీక్ష జరుగనున్నది. బయాలజీ, సోషల్ స్టడీస్ పరీక్షలకు మధ్య ఎక్కువగా ఐదు రోజుల వ్యవధి ఉన్నది. ఎక్కువ వ్యవధితో పరీక్షల నిర్వహణపై భిన్న వాదనలు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సిబిఎస్ఇ తరహాలో పరీక్ష, పరీక్షకు మధ్య వ్యవధి నిర్ణయం పట్ల భిన్న వాదనలు వ్యక్తమవుతునాయి. పరీక్ష, పరీక్షల మధ్యలో ఒకటి, రెండు రోజుల వ్యవధి ఉంటే సరిపోతుందని, మరీ ఎక్కువ రోజులు అవసరం లేదన్నది కొందరు వాదిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల సమయంలో ఉంటే ఒత్తిడి లేకుండా చదువుకుంటారని అభిప్రాయపడుతున్నారు. సిబిఎస్ఇ బోర్డ్ ఒకేసారి పది, 12 తరగతులకు పరీక్షలు నిర్వహిస్తుందని, దానికి తోడు ఆప్షనల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కో పరీక్ష మధ్య వ్యవధి ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు. అదే తరహాలో మరీ ఎక్కువ రోజుల వ్యవధి సరికాదని అభిప్రాయపడుతున్నారు. అయితే పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి కారణంగా విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఒక్కో సబ్జెక్టుపై ఎక్కువగా దృష్టి సారించడానికి, రివిజన్ చేసుకోవడానికి సమయం దొరుకుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం విద్యార్థుల ఉత్తమ ఫలితాలకు దోహదపడుతుందని విద్యాశాఖ విశ్వసిస్తోంది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ తేదీ పరీక్ష సమయం 2026 మార్చి 14 ఫస్ట్ లాంగ్వేజ్ ఉదయం 9.30- నుంచి 12.30 మార్చి 18 సెకండ్ లాంగ్వేజ్ ఉదయం 9.30- నుంచి 12.30 మార్చి 23 ఇంగ్లీష్ ఉదయం 9.30- నుంచి 12.30 మార్చి 28 గణితం ఉదయం 9.30 నుంచి -12.30 ఏప్రిల్ 2 సైన్స్ పార్ట్ 1(ఫిజికల్ సైన్స్) ఉదయం 9.30 నుంచి -11.00 ఏప్రిల్ 7 సైన్స్ పార్ట్ 2(బయాలజికల్ సైన్స్) ఉదయం 9.30 నుంచి -11.00 ఏప్రిల్ 13 సోషల్ స్డడీస్ ఉదయం 9.30- నుంచి 12.30 ఏప్రిల్ 15 ఒకేషనల్ కోర్సు పేపర్ -1 భాషా పరీక్ష ఉదయం 9.30- నుంచి 11.30 ఏప్రిల్ 16 ఒకేషనల్ కోర్సు పేపర్- 2 భాషా పరీక్ష ఉదయం 9.30- నుంచి 11.30 ...................................................................................
` వారు ఎలాంటి దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం ` అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ` సీడీఎఫ్‌గా బాధ్యత స్వీకరణ అనంతరం మునీర్ ప్రసంగం …
వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలు
` ప్రజలను వేధించడానికి కాదు: ఇండిగో సంక్షోభంపై మోదీ ` ఎంత పెద్ద సంస్థ అయినా సహించేది లేదు ` ఇండిగోకు కేంద్రం స్ట్రాంగ్ మెసేజ్ ` …
` సర్వీసులు సాధారణ స్థితికి ` సీఈఓ వీడియో సందేశం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కొన్ని రోజులుగా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ …
` ప్రక్రియ కొనసాగాల్సిందే ` రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్(జనంసాక్షి):ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ సవరణను …
ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఎన్నికల వ్యవస్థ
` ఈసీని బీజేపీ కబ్జాచేసింది ` లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్నికల సంస్కరణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో …
` సమ్మిట్‌లో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ` క్యూ కట్టిన కార్పొరేట్ కంపెనీలు ` రెండు రోజుల్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు ` ఫుడ్ …
బుధవారం రాశి ఫలాలు (10-12-2025)
మేషం వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. వృషభం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తుల ఉండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిధునం అధికారులు అనుగ్రహంతో పదోన్నతుల పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. సహాయసహకారాలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కర్కాటకం ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం కొంత ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సింహం వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కన్య ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. తుల ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వృశ్చికం బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ధనస్సు మాతృ వర్గ బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మకరం సోదరుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. భాగస్వామి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుంభం వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. మీనం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కీలక సమయంలో సన్నిహితుల స్నేహితుల సలహాలు కలిసివస్తాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
ఎన్టీఆర్, ఎంజీఆర్ మళ్లీ ఇప్పుడు వస్తే?
స్టార్ హీరో కార్తి నటిస్తున్న మూవీ ‘అన్నగారు వస్తారు‘ ఈ నెల 12న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్, కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కార్తి మాట్లాడుతూ “70, 80 దశకాల్లోని మాస్ కమర్షియల్ సినిమాకు నివాళిలా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించారు. చిన్న స్థాయి నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్, ఎంజీఆర్ మనకు సూపర్ హీరోస్. అలాంటి వాళ్లు మళ్లీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ ఎంతో శ్రమకోర్చి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు”అని అన్నారు. హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ “దర్శకుడు నలన్ కుమారస్వామి ఈ చిత్రంలో ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ఆ వరల్డ్‌ను ఈ నెల 12న థియేటర్స్‌లో చూస్తారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబీ, సందీప్ కిషన్, మధుర శ్రీధర్ రెడ్డి, బన్నీవాస్, శశిధర్, శైలేష్ కొలను, రాహుల్ రవీంద్రన్, వివేక్ ఆత్రేయ, దేవ కట్టా, శివ నిర్వాణ, వెంకీ కుడుముల, రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు.
10 dec cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాలు..
ఆంధ్రప్రభ, విజయవాడ : పెట్టుబడులు తీసుకురావడంలో పోటీపడుతూ దేశంలోనే శరవేగంగా ఏపీ, తెలంగాణ
కటక్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా సంచలన విజయంతో
ఐపీఎల్ 2026 మినీ వేలం.. బరిలో 350 మంది క్రికెటర్లు
అబుదాబి వేదికగా డిసెంబర్ 16న జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మినీ వేలం పాటలో 350 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. ఐపిఎల్ వేలం పాట కోసం నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితా నుంచి బిసిసిఐ ఏకంగా 1005 మంది క్రికెటర్ల పేర్లను తొలగించింది. అబుదాబిలో జరిగే వేలం పాటలో 350 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఐపిఎల్ మినీ వేలం అబుదాబిలో జరుగుతుందని బిసిసిఐ ఆయా ఫ్రాంచైజీలకు అధికారికంగా తెలిపింది. ఈ మేరకు ఫ్రాంచైజీలకు మెయిళ్లను పంపించింది మొదట బిడ్డిం ప్రక్రియ, బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్లు/బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా వేలం పాట కొనసాగనుంది. తొలుత క్యాప్డ్ ఆటగాళ్లతో ప్రారంభమయ్యే ఆక్షన్ తర్వాత అన్‌క్యాప్ట్ ఆటగాళ్ల వేలంతో ముగుస్తోంది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు
తొలి, మూడో విడత పోలింగ్ జరిగే గ్రామాలలో సెలవులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల కారణంగా పాఠశాలలకు వరుస సెలవులు లభించనున్నాయి. ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పాఠశాలల్లో ఏర్పాటు చేస్తుండటంతో, ప్రభుత్వం పలు దఫాలుగా సెలవులు ప్రకటించింది. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సుమారు ఆరు రోజుల పాటు విరామం దొరకనుంది. తొలి విడత పోలింగ్ నిర్వహణ, ఏర్పాట్ల కోసం డిసెంబర్ 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రెండో విడత ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 13, 14 తేదీల్లో జరగనుండగా, ఆ రోజులు రెండో శనివారం, ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు సాధారణ సెలవులుగానే ఉన్నాయి. మూడో విడత పోలింగ్ సందర్భంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పోలింగ్ సామగ్రిని సిద్ధం చేయడం, ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడం కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Pension Cyber scam: నకిలీ బ్యాంకు అఫ్ బరోడా ప్రకటనతో రిటైర్డ్ Bank of Baroda ఉద్యోగి ఖాతా కి చిల్లు
Mehdipatnamలో 81 ఏళ్ల వ్యక్తి ఫిర్యాదు Bank of Baroda లోగోతో వచ్చిన ప్రకటనే మోసానికి కారణం
11న టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా
ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 11న ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టిఆర్టిఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డిలు తెలిపారు. టిఆర్టిఎఫ్, ఎపిటిఎఫ్ (1938), ఐఫియా ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన విద్యా విధానం 2010 నిబంధనలో ఇన్ -సర్వీస్ టీచర్లకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. 2017లో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా 2010కి ముందున్న వారిని కూడా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Akhanda 2 Locks December 12 Release Date
The suspense is over. Nata Simham Nandamuri Balakrishna’s highly anticipated sequel Akhanda 2, directed by Boyapati Sreenu, is officially arriving in theatres on December 12th, while premiere shows are planned on 11th. Previously planned for a December 5 release, the film faced an unexpected delay. Now that all hurdles have been cleared, the team has […] The post Akhanda 2 Locks December 12 Release Date appeared first on Telugu360 .
74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. భారత్ ఘన విజయం
తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు సౌతాఫ్రికా జట్టు కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 101 పరుగులు భారీ తేడాతో గెలుపొందింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఓపెనర్ డిక్వాక్ డకౌటయ్యాడు. ఆది నుంచే టీమిండియా బౌలర్లు వికెట్లు తీస్తూ సౌతాఫ్రికాను కోలుకోకుండా దెబ్బ తీశారు.సౌతాఫ్రికా బ్యాటర్ లో బ్రేవిస్(22 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా టాప్ అర్డర్ బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 12.3 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 74 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. పాండ్యా, దూబేలు చెరో ఒక వికట్ తీశారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్ ల టీ20 సిరీలో 1-0తో ఆధిక్యం సాధించింది.
ఛాంపియన్: మనసుని హత్తుకునేలా ‘సల్లంగుండాలే...’ సాంగ్
ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ సల్లంగుండాలే రిలీజ్ చేశారు. వివాహానికి ముందు వధువు నిశ్శబ్దంగా కూర్చుని, తన ఇల్లు, గ్రామాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనతో బాధపడుతోంది. తండ్రి ఆమెను ఓదార్చడానికి వస్తాడు. అక్కడే పాట ప్రారంభమవుతుంది. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని అతను ఆశీర్వదించినప్పుడు కుటుంబం మొత్తం, గ్రామం వివాహ వేడుకల ప్రారంభాన్ని ఈ సాంగ్ అద్భుతంగా చూపించింది. ఈ పాటతో మిక్కీ జె మేయర్ మ్యాజిక్ సృష్టించాడు. సల్లంగుండాలే భావోద్వేగం, వేడుక రెండింటినీ కలిగి ఉన్న మరొక అద్భుతమైన పాట. చంద్రబోస్ సాహిత్యం, వివాహంలో జరిగే ప్రతి ఆచారం, భావోద్వేగాన్ని అందంగా చూపించింది. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన వధువు తల్లిదండ్రులుగా ఆకట్టుకోగా, రోషన్, అనశ్వర రాజన్ జోడి డ్యాన్స్ తో పాటకు ఉత్సాహాన్ని తెస్తారు. సల్లంగుండాలే సాంగ్ ప్రతి వివాహ వేడుకలో మ్రోగబోతుంది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆస్తి వివాదాలతోనే రియల్టర్ హత్య
సంచలనం సృష్టించిన రియల్టర్ హత్య కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆస్తి వివాదాలు, పాతకక్షలతోనే రియల్టర్ గంటా వెంకటరత్నంను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్‌లో వెంకటరత్నంను ఆరుగురు యువకులు సోమవారం ఉదయం హత్య చేసిన విషయం తెలిసిందే. ఎపిలోని విజయవాడకు చెందిన వెంకటరత్నం ధూల్‌పేట్‌కు చెందిన సుదేష్ సింగ్ వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. సుదేష్ సింగ్ గంజాయి, గుండుంబా, రౌడీయిజంతో నగరంలోని పలువురిని బెదిరిస్తూ డాన్‌గా ఎదిగాడు. ఇలా పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు, ఇలా వచ్చిన డబ్బులను తన వద్ద పనిచేస్తున్న బినామీల పేర్లపై ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అందులో వెంకటరత్నం పేరుపై కూడా వందల కోట్ల ఆస్తులు పెట్టినట్లు తెలిసింది. 2001లో సుదేష్ సింగ్‌ను ఎన్కౌంటర్ చేయడంతో అక్కడి నుంచి పారిపోయిన వెంకటరత్నం నగర శివారులో ఉంటున్నాడు. సుదేష్ సింగ్ తనను పోలీసులు ఎన్కౌంటర్ చేస్తాడని ముందుగానే తెలుసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సుదేష్ సింగ్ ఆచూకీ కోసం ఎంత వెతికినా పోలీసులకు దొరకకపోవడంతో వెంకటరత్నంపై ఒత్తిడి చేసి ఆచూకీ తెలుసుకున్నట్లు తెలిసింది. తర్వాత సుదేష్ సింగ్‌ను పట్టుకన్న పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీంతో వెంకటరత్నం సుదేష్ సింగ్ కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జవహర్ నగర్లో భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. వెంకటరత్నం వల్లే సుదేష్ సింగ్ ఆచూకీ పోలీసులకు తెలిసిందని, అంతేకాకుండా తన పేరుపై ఉన్న ఆస్తులు సుదేష్ సింగ్ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా పారిపోవడంతో వారు వెంకటరత్నంపై కక్ష పెంచుకున్నారు. అప్పటి నుంచి వెంకటరత్నం ఆచూకీ కోసం నగరంలో చాలా ఏళ్ల నుంచి గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటరత్నం ఉంటున్న ఏరియా గురించి ఇటీవలే సుదేష్ సింగ్ కుటుంబ సభ్యులకు తెలిసింది. రెక్కీ నిర్వహించిన సుదేష్ సింగ్ కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఆటోలో నలుగురు, బైక్‌పై ఇద్దరు వచ్చారు. వెంకటరత్నం ఇంటి నుంచి కూతురిని తీసుకుని పాఠశాలకు వెళ్లి, తిరిగి వస్తుండగా రాంగ్రూట్లో వచ్చి ఢీకొట్టి కిందపడేశారు. వెంటనే తుపాకీతో కాల్చి, కత్తులతో పొడిచారు, తలపై బండరాయి వేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగురు నిందితులు హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో వారిని రాచకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. స్పందించిన రైల్వే శాఖ !!
బెల్లంపల్లి, (ఆంధ్రప్రభ) : చారిత్రక వైభవాన్ని కలిగిన బెల్లంపల్లి రైల్వే స్టేషన్ దుస్థితిపై
ఇండిగో సేవలు గాడిన పడుతున్నాయి..ఇండిగో సీఈఒ
ముంబై : దేశీయ విమాన సంస్థ ఇండిగో సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడి సాధారణ స్థితికి చేరుకుందని ఆ సంస్థ సీఈఒ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఇండిగో సంస్థలో తలెత్తిన ఇబ్బందుల వల్ల , అత్యవసర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వేల మంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఈ విషయమై సీఈఒ క్షమాపణలు కోరారు. ఇండిగో విమాన సర్వీసుల్లో ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని పీటర్ హామీ ఇచ్చారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇండిగో విమానయాన సిబ్బంది అంతా తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రయాణికులే తమ తొలి ప్రాధాన్యమని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత కొన్ని రోజులుగా విమానసర్వీసులు రద్దవడంతో ఇప్పటికే లక్షలాది మంది ప్రయాణికులకు రీఫండ్ చెల్లింపు పూర్తి చేశామని , అలాగే సదరు ప్రయాణికుల లగేజీ కూడా వారి నివాసాలకు చేరవేశామని తెలిపారు. మిగిలిన మరికొన్ని బ్యాగేజీలనూ త్వరలోనే ఆయా ఇళ్లకు చేర్చడానికి తగిన ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. తీవ్ర ఇబ్బందుల నడుమ డిసెంబర్ 5న 700 ఫైట్లను మాత్రమే నడప గలిగామని, అయితే సోమ,మంగళవారాల్లో పరిస్థితులు కాస్త మెరుగవ్వడంతో మొత్తం 1800 విమానాలను అందుబాటు లోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం 138 గమ్యస్థానాలకు ఇండిగో ప్రయాణాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
సాగు–తాగునీటికి మొదటి ప్రాధాన్యతనిస్తా…
పెద్దపల్లి జిల్లా, ధర్మారం (ఆంధ్రప్రభ) : ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్
ఈసారి సంక్రాంతికి టఫ్ ఫైట్.. బరిలో మరో యంగ్ హీరో
చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజవరగమనతో బ్లాక్‌బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. ఇది ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇక మేకర్స్ 'నారి నారి నడుమ మురారి' సినిమా ఈ సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుందని ప్రకటించారు. ప్రీమియర్ షో సమయం - సాయంత్రం 5:49 అని మేకర్స్ తెలియజేశారు. సాధారణంగా సినిమాలు ఉదయం లేదా తెల్లవారుజామున షోలతో ప్రారంభమవుతాయి. కానీ మొదటిసారిగా ఈ సినిమా సాయంత్రం రిలీజ్ ని ఎంచుకుంటోంది. ముహూర్తం ఇంత త్వరగా ఖరారు కావడం టీమ్ ఖచ్చితమైన ప్లానింగ్‌ని తెలియజేస్తోంది. అనౌన్స్మెంట్ పోస్టర్లో శర్వా స్టైలిష్‌గా కనిపిస్తూ, మెడలో పూల హారంతో నిల్చున్నారు. సంయుక్త ఆవేదనతో నిండిన లుక్‌లో కనిపిస్తే, సాక్షి వైద్య స్వచ్ఛమైన చిరునవ్వుతో ఫ్రేమ్‌కి ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది.
నలుగురు సర్పంచ్ లు.. 72 వార్డ్ మెంబర్ లు ఏకగ్రీవం !!
భీమ్‌గల్ రూరల్, (ఆంధ్రప్రభ) : భీమ్‌గల్ మండలంలో మూడవ విడత స్థానిక సంస్థల
సూపర్‌హిట్ సినిమాకు సీక్వెల్.. #telugupost #rajinikanth #narasimha #trendingshorts
రసవత్తరంగా ఉట్నూర్ పంచాయతీ ఎన్నిక..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికల
Balotsavam |అదరహో అమరావతి బాలోత్సవం…
Balotsavam | అదరహో అమరావతి బాలోత్సవం… ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఎప్పుడెప్పుడా
6 ఎయిర్ పోర్టుల నుంచి 422 ఇండిగో విమానాలు రద్దు
ముంబై : ఇండిగో సంస్థ మంగళవారం ఆరు ఎయిర్‌పోర్టుల నుంచి 422 విమానసర్వీసులను రద్దు చేసింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి 152,బెంగళూరు నుంచి 121,హైదరాబాద్ నుంచి 58, ముంబై నుంచి 41, చెన్నై నుంచి 50 విమానసర్వీసులు రద్దయ్యాయి. ఇదిలా ఉండగా, శీతాకాలానికి సంబంధించి ఇండిగో షెడ్యూళ్లలో 10 శాతం కోత విధిస్తున్నట్టు డీజేసీఎ ప్రకటించింది.
From Films to Future Tech: Key Highlights of Telangana Rising Global Summit
Telangana is preparing for one of its most ambitious phases of development. At the Telangana Rising Global Summit, Chief Minister Revanth Reddy announced wide-ranging plans that aim to transform the state’s film industry, digital infrastructure and investment landscape. A Fresh Start for the Film Industry & As a Leading Film Destination During an exclusive interaction […] The post From Films to Future Tech: Key Highlights of Telangana Rising Global Summit appeared first on Telugu360 .
గత వారం డిసెంబర్ 5న రావాల్సిన ’అఖండ 2’ విడుదల ఆగిపోవడంతో నందమూరి అభిమానులు ఎంత నిరాశకు గురయ్యారో అందరికీ తెలిసిందే. సరిగ్గా ప్రీమియర్స్ పడాల్సిన సమయంలో బ్రేక్ పడటంతో ఆ హైప్ మొత్తం ఒక్కసారిగా చల్లబడినట్లయింది. అయితే ఇప్పుడు సమస్యలు ఓ కొలిక్కి రావడంతో మేకర్స్ మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, వారం తిరక్కముందే డిసెంబర్ 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించు కున్నారని తెలిసింది. ఈరోస్ ఇంటర్నేషనల్, - 14 రీల్స్ ప్లస్ మధ్య సమస్యలు ఉండటంతో ‘అఖండ 2’(Akhanda 2) చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కారమవడంతో ఈ సినిమా విడుదలకు సిద్ధమైందని సమాచారం. ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్సులు, డిస్ట్రిబ్యూటర్ల పెండింగ్ చెల్లింపులు పూర్తయితే ‘అఖండ 2’ని డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలిసింది. డిసెంబర్ 11న పెయిడ్ ప్రీమియర్లు, టికెట్ రేట్ల పెంపు కోసం కూడా టీమ్ మరోసారి దరఖాస్తు చేసిందట. ఇక గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త తదితరులు కీలక పాత్రల్లో నటించగా తమన్ సంగీతం అందిస్తున్నారు.
బౌండరీలతో విరుచుకుపడిన పాండ్యా.. దక్షిణాప్రికా టార్గెట్ ఎంతంటే?
భారత్ టాపార్డర్ చేతులెత్తేసిన వేళ హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చి రాగానే భారీ సిక్సులతో చెలరేగిపోయాడు. దీంతో భారత్ మంచి స్కోరు సాధించింది. కటక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్(04), అభిషేక్ శర్మ(17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈక్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(26) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భారీ షాట్ ఆడి క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్(23) కూడా వెనుదిరగాడు. దీంతో టీమిండియా 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఈ క్రమంలో పాండ్యా, శివమ్ దూబే(23)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధనా ధన్ బ్యాటింగ్ తో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. పాండ్యా 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక, చివర్లో జితేష్ శర్మ 5 బంతుల్లో 10 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియా జోరు #sarpanchelections #telugupost #socialmedia
ఎసిబి వలలో సివిల్ సప్లై అధికారి
రేషన్ డీలర్ వద్ద లంచం తీసుకుంటూ ఓ సివిల్ సప్లై అధికారి ఎసిబి వలలో చిక్కారు. రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ నాయక్ అవినీతి నిరోధక శాఖ ట్రాప్‌లో పడ్డారు. షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ రేషన్ డీలర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు ఏసిబి అధికారులు వెల్లడించారు. పిడిఎస్ రైస్‌కు సంబంధించిన కేసు క్లియరెన్స్ విషయంలో బాధితుడి వద్ద జిల్లా సివిల్ సప్లై విభాగం డిటి రవీందర్ నాయక్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసిబి తెలిపింది. నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఏసిబి అధికారులు ప్రజలకు సూచించారు.
ఆశీర్వదించండి… అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా
ఆలేరు, ఆంధ్రప్రభ : ఒక్కసారి ఆశీర్వదించండి… అభివృద్ధినే ధ్యేయంగా చేసుకుని పనిచేస్తాను అని
‘సర్’ కొనసాగేలా చూడండి.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
అడ్డుకుంటే మా వద్దకు రండి.. లేకపోతే అరాచకం అవుతుంది బిఎల్ఓల సమస్యలు మా దృష్టికి తీసుకురండి అవసరమైతే ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తాం: సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)ను కొనసాగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సూచించింది. సర్ ప్రక్రియలో భాగమైన బూత్‌లెవెల్ అధికారులు (బిఎల్ఒ), ఇతర అధికారులు పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో బెదిరింపులకు గురవుతుండడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఈ పరిస్థితిని అధిగమించాలని ఆదేశించింది. లేకపోతే అరాచకం అవుతుందని హెచ్చరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ, దాని నిర్వహణలో ఎదురవుతున్న పరిస్థితులపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం చీఫ్‌జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బగ్చీ నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. బిఎల్ఓలకు బెదిరింపులు, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే, వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. బీఎల్ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరించాలని పేర్కొంది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం కోర్టుకు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల రక్షణ కల్పించడానికి నిరాకరిస్తే స్తానిక పోలీసులను డిప్యుటేషన్ పై తీసుకోవలసి వస్తుందని, అప్పటికీ పరిస్థితి మారకుంటే కేంద్ర బలగాలను రప్పించ వలసి వస్తుందని ఎన్నికల సంఘం తరపున కోర్టుకు హాజరైన ద్వివేది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ సనాతని సంగ్సాద్ , ఇతరుల తరఫున సీనియర్ న్యాయవాది వి. గిరి హాజరయ్యారు. బిఎల్‌ఒలపై దాడులు , బెదిరింపులు జరగకుండా వారికి రక్షణ కల్పించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.
గ్లోబల్ సమ్మిట్‌లో సినీ గ్లామర్..#telugupost #cmrevanthreddy #globalsummit2025
Massive Blaze in jakarta ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
Massive Blaze in Jakarta ఇండోనేషియాలో 22 మంది ఆహుతి 15 మంది
చెలరేగుతున్న దక్షిణాఫ్రికా బౌలర్లు.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్
ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్(04), అభిషేక్ శర్మ(17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈక్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(26) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భారీ షాట్ ఆడి క్యాచ్ ఔటయ్యాడు. దీంతో భారత్ 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం హార్దిక్ పాండ్యా, అక్షపటేల్.. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత అక్షర్(23) కూడా వెనుదిరగాడు. ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో పాండ్యా(15), శివమ్ దూబే(0)లు ఉన్నారు.
పట్టాలెక్కిన తిరుపతి - షిర్డీ ఎక్స్‌ప్రెస్
తిరుపతి సాయినగర్ షిర్డి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి. సోమన్న మంగళవారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ఎం.రఘునాథ్ రెడి, డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఇందులో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి ఎపి మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణచక్రవర్తి, శాసన సభ్యులు ఆరణీ శ్రీనివాసులు, ఇతర ప్రజా ప్రతినిధులు , దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి . సోమన్న మాట్లాడుతూ తిరుపతి - సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో నివసిస్తున్న భక్తులకు ఒక చారిత్రాత్మక రోజని అన్నారు. ప్రస్తుతం తిరుపతి, షిర్డీతో పాటు నెల్లూరు, గుంటూరు, సికింద్రాబాద్, బీదర్, మన్మాడ్, ఇతర ముఖ్యమైన స్టేషన్లోతో కలుపుకొని 31 స్టాప్‌లతో నేరుగా రైలు ద్వారా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఈ రైలు తీర్థయాత్రలు, పర్యాటకానికి , అనుసంధానాన్ని పెంపొందించుతుందని, ఈ మార్గంలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఈ నూతన రైలు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, సికింద్రాబాద్ నుండి ప్రత్యక్ష అనుసంధానాన్ని అందిస్తూ ఈ మార్గంలోని ఒక ముఖ్యమైన శివాలయం అయిన పర్లి వైజ్‌నాథ్‌ను కూడా కలుపుతుందని తెలిపారు. 2014 నుండి ఆంధ్రప్రదేశ్ 100శాతం విద్యుదీకరణతో 1,580 కి.మీ నూతన ట్రాక్‌ను జోడించిందని, రాష్ట్రంలో ఇప్పుడు 73 అమృత్ స్టేషన్లు 3,125 కోట్ల రూపాయల వ్యయంతో ఉధునీకరణలో ఉన్నాయని తెలిపారు. భారత రైల్వేలు తిరుపతిలో రూ. 312 కోట్ల విలువైన తిరుపతి అమృత్ స్టేషన్‌తో సహా ఇతర ప్రాజెక్టు పనులను చేపట్టాయని పేర్కొన్నారు. తిరుపతి- పాకల-కాట్పాడి డబ్లింగ్, గూడూరు - రేణిగుంట 3 వ లైన్, నడికుడి - శ్రీకాళహస్తి కొత్త లైన్, విజయవాడ , -గూడూరు 3 వ లైన్, యేర్పేడు -పూడి బైపాస్ లైన్ వంటి ప్రధాన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు.
పొద్దు తిరుగుడు పువ్వుల రాజకీయాలు మానుకో కడియం
లింఘాలఘన్‌పూర్ : లింఘాలఘన్ పూర్ మండలంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
లోక్‌భవన్‌తో పాటు సిఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు
రాష్ట్రంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ), లోక్ భవన్లను పేల్చడానికి కుట్ర జరుగుతోందని పేర్కొంటూ అగంతకుడు లోక్ భవన్ కార్యాలయానికి ఈమెయిల్ పంపాడు. ’వాసుకి ఖాన్’ అనే పేరుతో వచ్చిన ఈ బెదిరింపు మెయిల్లో వెంటనే విఐపిలను, ప్రముఖులను ఆ భవనాల నుంచి ఖాళీ చేయించాలని బెది రించినట్లు సమాచారం. ఈ మెయిల్ అందిన వెంటనే గవర్నర్ కార్యాలయం అప్రమత్తమైంది. గవర్నర్ కార్యాలయ సిఎస్ఒ శ్రీనివాస్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. హుటాహుటినా బాంబు స్కాడ్‌తో సీఎంవో, లోక్ భవన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అలాగే, బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు ఆ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది, దాన్ని ఎవరు పంపారు అనే దానిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు.
చలి పంజా.. బయటికి రావద్దు! #WeatherAlert #Telangana #Hyderabad #ColdWave #YellowAlert #TeluguUpdates
98 voters |రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీ బృందావనపురం
98 voters | రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీ బృందావనపురం 98 voters
స్థానిక సంస్థల ఎన్నికల్లో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల ప్రకారం సర్పంచ్
University |ఉస్మానియా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
University | ఉస్మానియా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి University | హైదరాబాద్, ఆంధ్రప్రభ
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగల కళేబరం
భారీ తిమింగల కళేబరం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన సంఘటన కన్యాకుమారిలోన కిల్మీదలం తీరంలో చోటుచేసుకుంది. కొట్టుకు వచ్చిన తిమింగలం సుమారు 10 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉంది. ఈ భారీ తిమింగలాన్ని చూడటానికి స్థానిక ప్రాంత ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా కోలాహలంగా మారింది. అంతకు ముందు భారీ తిమింగలం మత్స్యకారుల వలకు చిక్కింది. మత్స్యకారులు తిమింగలంను రక్షించేందుకు వలను కత్తిరించారు. కానీ తిమింగలం మృతి చెంది కళేబరం ఒడ్డుకు కొట్టుకొచ్చింది.
funds | వేసి గెలిపించండి funds | ధర్మపురి, ఆంధ్రప్రభ : బ్యాట్
Chiru’s MSG Songs @ 100 : Hype Levels Keep Rising
Megastar Chiranjeevi is all set to captivate with his highly anticipated family entertainer, Mana Shankara Vara Prasad Garu, directed by Anil Ravipudi. With Sankranti 2026 around the corner, the film has already ignited buzz with its first two songs. The first song- Meesala Pilla quickly took the internet by storm, racking up nearly 80 million […] The post Chiru’s MSG Songs @ 100 : Hype Levels Keep Rising appeared first on Telugu360 .
RTC buses |ఆర్టీసీ బస్సుల్లో స్వీట్ల పంపిణీ
RTC buses | ఆర్టీసీ బస్సుల్లో స్వీట్ల పంపిణీ RTC buses |
అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం
భువనగిరి (రూరల్), ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర
notification |ఫస్టు ఫేజ్ ప్రచారం క్లోజ్.. ప్రలోబాలకు రెడీ!
notification | ఫస్టు ఫేజ్ ప్రచారం క్లోజ్.. ప్రలోబాలకు రెడీ! notification |
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికలను సంపూర్ణంగా, శాంతియుత వాతావరణంలో
ట్రిబుల్ ఆర్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: ఎంపీ చామల
దేశంలోనే మొదటి అవుటర్ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో చామల కిరణ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ చుట్టూర సుమారు నాలుగు వందల కిలో మీటర్లు విస్తరించి సుమారు ఎనిమిది జిల్లాలను, పద్నాలుగు మండలాల్లో ట్రిబుల్ ఆర్ వస్తుందన్నారు. ఇందులో దాదాపు ఐదు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే ప్లై వోవర్లు ఉన్నాయని, వీటి అంచనా వ్యయం సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలని ఆయన వివరించారు. రాబోయే అవుటర్ రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తుందని ఆయన తెలిపారు. ఉత్తర భాగం, దక్షిణ భాగం సర్వే పూర్తి అయ్యిందని ఆయన చెప్పారు. హైదరాబాద్ ప్రాముఖ్యత, అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఆయన తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఆవిష్కరణ, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించిందని, ఇది దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థకు, దేశపు ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్షానికి మరింత దోహదపడడమే కాకుండా వికసిత్ భారత్ యొక్క థీమ్, లక్షాన్ని సాధించడంలో కూడా సహాయపడుతుందన్నారు. ఈ రింగ్ రైల్ ప్రాజెక్టు ఆర్థిక కార్యకలాపాలను, ఐటి హబ్‌లను, ఫార్మాస్యూటికల్ క్లస్టర్లను లాజిస్టిక్ పార్కులు, అభివృద్ధి చెందుతున్న పట్టణ వృద్ధి కేంద్రాలను సృష్టిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వృద్ధి కారిడార్లను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుందని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
Tenth exams |మార్చి 14 నుంచి -టె-న్త్ పరీక్షలు
Tenth exams | మార్చి 14 నుంచి -టె-న్త్ పరీక్షలు Tenth exams
గ్లోబల్ కాదు గోల్-మాల్ సమ్మిట్ :బిజెపి ఎంఎల్ఎ రాకేష్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్&గోల్ మాల్ సమ్మిట్‌లా ఉంది. అని బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విమర్శించారు. సమ్మిట్‌కు ఎంఎల్ఏలను ఆహ్వానించి అవమానించారని ఆయన విమర్శించారు. తాను వెళ్ళానని, అక్కడ ఎంఎల్ఏలను పట్టించుకునే నాధుడే లేరని ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. ఎంఎల్ఏలు కూర్చునేందుకు కనీసం కుర్చీలు లేవని ఆయన విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్‌లా లేదని, రియల్ ఎస్టేట్ బ్రోచర్ విడుదల చేసే కార్యక్రమంలా ఉందని ఆయన విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ఏదో గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. రాబోయే రెండు వందల ఏళ్ళ తర్వాత జరిగే అభివృద్ధి ఎవరికి అవసరమని ఆయన ప్రశ్నించారు. ముందు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వదిలేసి గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివాసీలు, లంబాడిలు నివసించే తండాల్లో తాగు నీరు, రవాణా సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంఎల్ఏ రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి 'దేఖ్ లేంగే సాలా' ప్రోమో రిలీజ్..
ఓజి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. 'దేఖ్ లేంగే సాలా' అనే తొలి లిరికల్ సాంగ్ ప్రమోను కొద్దిసేపటిక్రితమే రిలీజ్ చేశారు. చాలా రోజుల తర్వాత పవన్ డ్యాన్స్ తో అలరించనున్నట్లు ప్రోమో చేస్తే అర్థమవుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి సాంగ్ ను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వచ్చే ఏడాదిలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.
12 autos |బోధన్ బల్దియాలో చెత్త సేకరణకు కొత్త ఆటోలు..
12 autos | బోధన్ బల్దియాలో చెత్త సేకరణకు కొత్త ఆటోలు.. 12
నియోపోలిస్‌లో ఎకరం రూ.151.25 కోట్లకు దక్కించుకున్న కాస్కేడ్స్ డెవలపర్లు
హైదరాబాద్ నియోపోలిస్ రియాల్టీ మార్కెట్లో మరో రికార్డు నమోదైంది. “ది కాస్కేడ్స్ నియోపోలిస్” సంస్థ నియోపోలిస్ ప్లాట్ 15ను ఎకరానికి రూ. 151.25 కోట్లకు దక్కించుకున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండో అత్యధిక ల్యాండ్ బిడ్. నియోపోలిస్ ప్రాంతంలో ఇప్పటివరకు నమోదైన బిడ్లలో ఇదే అత్యధికం. జిహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా, అర్బన్‌బ్లాక్స్ రియాలిటీ డెవలపర్స్ సంయుక్తంగా ది కాస్కేడ్స్ నియోపోలిస్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నిర్వహించిన ఫేజ్ 3 వేలంలో […] The post నియోపోలిస్‌లో ఎకరం రూ.151.25 కోట్లకు దక్కించుకున్న కాస్కేడ్స్ డెవలపర్లు appeared first on Dear Urban .
vote |అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా
vote | అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా vote | ధర్మపురి, ఆంధ్రప్రభ
రేపు హైదరాబాద్ రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ నగర రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఈవీట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను బుధవారం రాణిగంజ్ డిపో లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆర్టిసి ఎండి వై నాగిరెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అనధికార ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఉదయం పది గంటలకు బస్సుల ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే. నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఆర్టిసి ఎలక్ట్రిక్ బస్సులను వివిధ రూట్లలో నడుపుతోంది.
Village |ప్రజలారా.. మాయ మాటలు చెప్పే వాళ్లను నమ్మొద్దు…
Village | ప్రజలారా.. మాయ మాటలు చెప్పే వాళ్లను నమ్మొద్దు… -సర్పంచ్ గా
Officers |తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ..
Officers | తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ.. Officers | నాగర్ కర్నూల్
IND vs SA T20: టాస్ గెలిచిన దక్షిణాప్రికా.. భారత్ జట్టు ఇదే
ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా కటక్ వేదికగా తొలి టీ20లో భారత్-సౌతాఫ్రికా జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను జట్టులోకి తీసుకోలేదు. ఎప్పటి లాగే అభిషేక్ శర్మ, గిల్ లు ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. చాలా రోజుల తర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. సంజూ శాంసన్ కు బదులు వికెట్ కీపర్ గా జితేష్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. కాగా, వన్డే సిరీస్ విజయంతో జోష్ లో ఉన్న భారత జట్టు.. ఈ మ్యాచ్ లో గెలుపొంది సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, దక్షిణాఫ్రికా జట్టు కూడా తొలి టీ20లో విజయం సాధించి సిరీస్ లో ఆధిక్యాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. ఇరు జట్ల వివరాలు: భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్(c), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, లూథో సిపమ్లా, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే
Great success |ఇంటింటా ప్రచారం
Great success | ఇంటింటా ప్రచారం Great success | పరకాల, ఆంధ్రప్రభ
Apollo Hospitals Champions Health, Hope and Humanity in Telangana’s Growth Story
Under the leadership of Dr. Shobana Kamineni, Dr. Sangita Reddy, Upasana Konidela and Vishwajit Reddy, Apollo Hospitals has set in motion a transformational mission to uplift the health and well-being of every citizen in Telangana. A multi-year investment of ₹1,700+ Crore reaffirms Apollo’s commitment not just to hospitals, but to people. From pioneering Proton Therapy […] The post Apollo Hospitals Champions Health, Hope and Humanity in Telangana’s Growth Story appeared first on Telugu360 .
history |అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం
history | అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం history |
UBS Dekhlenge Saala Promo: Pawan Kalyan sets dance floor on fire
Power Star Pawan Kalyan and maverick magician Harish Shankar are back together with their highly awaited Ustaad Bhagat Singh. Sreeleela and Raashii Khanna are playing leading roles in the film produced by Mythri Movie Makers. After a long time, Pawan Kalyan is gearing up to set dance floor on fire. He has been staying away […] The post UBS Dekhlenge Saala Promo: Pawan Kalyan sets dance floor on fire appeared first on Telugu360 .
street lights |ఆశీర్వదిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
street lights | ఆశీర్వదిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా -మాటేడు గ్రామ కాంగ్రెస్
Telangana : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు
Govt |సేవే మార్గం..అభివృద్ధి లక్ష్యంగా…
Govt | సేవే మార్గం..అభివృద్ధి లక్ష్యంగా… Govt | తాడ్వాయి, ఆంధ్రప్రభ :
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో బుమ్రా
టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డులకు పెట్టింది పేరు. తన కెరీర్లో ఎన్నో రికార్డులను బుమ్రా తిరశరరాశాడు... సృష్టించాడు కూడా. కాగా, బుమ్రా నేటి మ్యాచ్‌లో ఒక వికెట్ తీస్తే.. టి-20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. తద్వారా అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు లసిత్ మలింగ, షకిబ్ అల్ హసన్, టిమ్ సౌథీ, షహీన్ అఫ్రిది మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈరోజు మ్యాచ్‌లో బుమ్రా ఈ రికార్డు సాధించే అవకాశం ఉంది. అంతేకాక.. బుమ్రా ఇంకొక వికెట్ తీస్తే.. భారత్ తరఫున టి-20ల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటికే అర్ష్‌దీప్ సింగ్ (105) ఈ మైలురాయిని చేరుకున్నాడు.
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల
Kalvakuntla Kavita : మీరు రెండంటే.. వాళ్లు నాలుగంటారు కవితక్కా
కల్వకుంట్ల కవిత పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు
Urea |కేసీఆర్ దీక్ష దివస్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం..
Urea | కేసీఆర్ దీక్ష దివస్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం.. —
In LS : ప్రయాణికుల భద్రతే లక్ష్యం
In LS : ప్రయాణికుల భద్రతే లక్ష్యం ఇండిగోపై చర్య తప్పదు పార్లమెంటులో
సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆర్డీవోకు ఫిర్యాదు..
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మరిపల్లి గ్రామానికి
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని సెల్ టవర్ ఎక్కిన రైతు #telugupost #latestnews #farmer
అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పించండి
ధర్మపురి, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధి కోసం అనుభవం ఉన్న తనకు మరోసారి
Sharwa’s Special Release Plan For NNNM
Charming Star Sharwa is coming up with a feel-good family entertainer Nari Nari Naduma Murari, directed by Ram Abbaraju and produced by Ramabrahmam Sunkara under the AK Entertainments banner in collaboration with Adventures International Pvt. Ltd. The film as earlier announced will light up theatres this Sankranthi with a special release plan. Unlike the usual […] The post Sharwa’s Special Release Plan For NNNM appeared first on Telugu360 .
School |ఆదరించండి…. అభివృద్ధి చేస్తా
School | ఆదరించండి…. అభివృద్ధి చేస్తా School | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ
ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండోనేషియా రాజదాని జకార్తాలో ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. స్థానిక మీడియా సమాచారం ప్రకారం, అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించిన మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. భవనం నుండి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం సమయంలో భవనం మొదటి అంతస్తులో మంటలు అలుముకుని, ఆపై పై అంతస్తులకు వ్యాపించిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో కొంతమంది ఉద్యోగులు భవనంలో భోజనం చేస్తుండగా, మరికొందరు కార్యాలయం నుండి వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
MAMATHA |ప్రతి నిత్యం అందుబాటులో ఉంటా..
MAMATHA | ప్రతి నిత్యం అందుబాటులో ఉంటా.. ఓటు వేసి గెలిపించండి MAMATHA
Pradeep Ranganathan’s LIK Postponed for the Second Time
Pradeep Ranganathan scored two back-to-back blockbusters this year: Dragon and Dude. He had plans to release his third film Love Insurance Kompany (LIK) and the film is scheduled for December 18th release across the globe in Tamil and Telugu languages. Vignesh Shivan is the director of this romantic drama and Krithi Shetty is the leading […] The post Pradeep Ranganathan’s LIK Postponed for the Second Time appeared first on Telugu360 .
Sabarimala : శబరిమల వెళ్లే భక్తులకు అలెర్ట్.. అక్కడకు వెళ్లొద్దు
అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేసింది
విజయ్ ‘రౌడీ జనార్ధన్’లో విలన్‌గా స్టార్ హీరో
ఈ ఏడాది ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయినా విజయ్‌కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న చిత్రం ‘రౌడీ జనార్ధన్’. రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకుడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విలన్ ఎవరనే విషయాన్ని ఇప్పటివరకూ వెల్లడించలేదు చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఈ విలన్ పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన మరెవరో కాదు తమిళ స్టార్ విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన విజయ్ సేతుపతి. తొలుగులో ‘ఉప్పెన’ సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి డైరెక్ట్ తెలుగు చిత్రంఈ ఏడాది ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. అన్ని సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

18 C