SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

22    C
... ...View News by News Source

సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానని సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఓ సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానేమోనని భయంతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్ పల్లి గ్రామంలో సోమవారం నాడు చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పిప్పడ్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి చాల్కి రాజు (36) అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేసి బరిలో నిలిచారు. అయితే ఆయన అప్పటికే అయ్యప్ప మాలాధారణ వేసి మండలంలోని శంషాద్దీన్ పూర్ గ్రామ శివారులో గల అయ్యప్ప సన్నిధానంలో తోటి అయ్యప్ప స్వాములతో ఉంటున్నాడు. కాగా రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి తోటి స్వాములతో నిద్రించాడు. సోమవారం తెల్లవారు జాము నాలుగు గంటల ప్రాంతంలో నిద్ర లేచి తోటి స్వాములతో కలిసి కాలకృత్యాలు చేయడానికి బయటకు వెళ్లాడు. అయితే బయటకు వెళ్లినఅయ్యప్ప స్వాములు తిరిగి సన్నిధానానికి వచ్చారు.. కాని రాజుస్వామి మాత్రం రాలేదు. దీంతో అయ్యప్ప స్వాములు చుట్టు పక్కల వెతికినా.. రాజు స్వామి ఆచూకి లభించలేదు. దీంతో చేసేదేమి లేక శంషాద్దీన్ పూర్ గ్రామస్తులకు సమాచారం అందించడంతో వెంటనే కొంత మంది గ్రామస్తులు అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకొని సమీప ప్రాంతంతో వెతికడంతో ఓ చెట్టుకు టావల్ తోని ఉరి వేసుకొని కనిపించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, రాయికోడ్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలాన్ని సంగారెడ్డి జిల్లా ఏఎస్పీ రఘునందన్ రావు, జహీరాబాద్ డీఎస్పీ సైదా, రూరల్ సీఐ హన్మంత్ లు పరిశీలించి జరిగిన విషయాన్ని అయ్యప్ప స్వాములను అడిగి తెలుసుకున్నారు. మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయికోడ్ ఎస్‌ఐ చైతన్య కిరిణ్ తెలిపారు.

మన తెలంగాణ 8 Dec 2025 10:10 pm

తప్పుడు ప్రచారంతో టిఆర్‌ఎస్ గోబెల్స్ రాష్ట్ర సమితిగా మారింది:మంత్రి సీతక్క

తప్పుడు ప్రచారంతో టిఆర్‌ఎస్ గోబెల్స్ రాష్ట్ర సమితిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైతే హరీష్ రావు ఓర్చుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని, గోబెల్స్ సమ్మిట్ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా సమాధానం చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే సహించలేకపోతున్నారని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని తెలంగాణ ఆగం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కెసిఆర్ కుటుంబమే గొప్పదన్న అహంకారంతో హరీష్ రావు మాట్లాడుతూ విజనరీ ఉన్న నేతలను చులకన చేసి మాట్లాడటం హరీష్ రావు నైజమని మండిపడ్డారు. ఖరీదైన భూములను పప్పు బెల్లాలకు అమ్ముకున్న చరిత్ర బిఆర్‌ఎస్ పెద్దలదని ఆరోపించారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ దేశ విదేశా కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు వేల కొలది ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయని చెప్పారు. నిరుద్యోగులను సొంత అవసరాలకు వాడుకొని కేసీఆర్ కుటుంబం వదిలేసిందని అన్నారు. అయితే తమ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ కల్పన చేస్తున్నామని చెప్పారు. దావోస్ సమ్మిట్ ను వినడమే కానీ నేను చూడలేదని, భారత్ ఫ్యూచర్ సిటీలో దావోస్ సమ్మిట్‌కు మించి ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని మంత్రి సీతక్క వివరించారు.

మన తెలంగాణ 8 Dec 2025 10:06 pm

ముగ్గురు సీఎంలు చదివిన కాలేజ్

గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది వివిధ రంగాల్లో రాణించారు..

తెలుగు పోస్ట్ 8 Dec 2025 9:50 pm

మా పెళ్లి రద్దు

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయింది. ఈ విషయాన్ని స్మృతి మంధాన స్వయంగా తన ఇన్ స్టా ద్వారా వెల్లడించింది.

తెలుగు పోస్ట్ 8 Dec 2025 9:48 pm

టికెట్ ధరలను తగ్గించిన ఎయిర్ ఇండియా

ఇండిగోలో తలెత్తిన సంక్షోభం కారణంగా దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలపై ప్రభావం పడింది.

తెలుగు పోస్ట్ 8 Dec 2025 9:40 pm

DHOOM 3 :  రూ.3 కోట్లు  లూటీ

DHOOM 3 : రూ.3 కోట్లు లూటీ * తెరమీదకు హవాలా స్టోరీ

ప్రభ న్యూస్ 8 Dec 2025 9:38 pm

Rajinikanth announces Sequel for his Iconic Film

Padayappa is one of the best films in Rajinikanth’s career and the film is a massive hit. The film was dubbed into Telugu as Narasimha and the film ended up as a super hit after a simultaneous release in Telugu along with Tamil. Ramya Krishna played one more important role and her performance will be […] The post Rajinikanth announces Sequel for his Iconic Film appeared first on Telugu360 .

తెలుగు 360 8 Dec 2025 9:34 pm

Chandrababu Naidu Breaks Silence on IndiGo Crisis, Blames Airline’s Poor Management

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu addressed the media at the AP Secretariat and responded for the first time to the ongoing IndiGo Airlines crisis. He stated that the mass cancellations and passenger distress were the direct result of IndiGo’s failure to follow the rules set by the Directorate General of Civil Aviation. He […] The post Chandrababu Naidu Breaks Silence on IndiGo Crisis, Blames Airline’s Poor Management appeared first on Telugu360 .

తెలుగు 360 8 Dec 2025 9:32 pm

సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత హామీలు నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేస్తా..బాండ్ పేపర్‌ రిసిచ్చిన అభ్యర్థి

జుక్కల్ నియోజకవర్గం పిట్లం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ రాజీ నామా బాండ్ పేపర్‌ను అందజేశారు. ఈ సందర్బంగా నవాబ్ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ- తన పదవీకాలం సగం అంటే 2.5 ఏళ్లు పూర్తయ్యేలోగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైతే, ఎలాంటి పదవి మోహం లేకుండా తాను స్వయంగా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసి ప్రకటించారు. తమ మాట, తమ హామీల పరిరక్షణ పట్ల ప్రజల ముందే ప్రమాణం చేస్తున్నానని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల, పంచాయతీ పనుల్లో ప్రజా భాగస్వామ్యం పెంపు వంటి అంశాలను ప్రధాన ప్రాధాన్యాలుగా తీసుకొని ముందుకు సాగనున్నట్లు తెలిపారు. గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని నమ్మకమిస్తున్నట్లు నవాబ్ సుదర్శన్ గౌడ్ తెలిపారు. పిట్లం గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

మన తెలంగాణ 8 Dec 2025 9:13 pm

అండమాన్ నికోబార్ టూర్: మీ మరపురాని ప్రయాణానికి ఒక కంప్లీట్ గైడ్

అండమాన్ నికోబార్ దీవుల టూర్ కోసం ప్లాన్ చేస్తున్నారా? తప్పక సందర్శించాల్సిన ప్రాంతాల కోసం వెతుకుతున్నారా? సమగ్ర వివరాలు ఈ ప్రత్యేక కథనంలో డియర్ అర్బన్ అందిస్తోంది. నీలి సముద్రపు లోతుల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రపంచం, తీరం వెంబడి దట్టంగా పెరిగిన పచ్చని అడవులు, ఇసుక తిన్నెలు మీకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. మీ సాహసయాత్రకు ఇలా సిద్ధమవ్వండి. 1. అండమాన్ లో ది బెస్ట్ ఏవో తెలుసుకోండి: మీ ఐలాండ్ విహార ప్రణాళిక అండమాన్ […] The post అండమాన్ నికోబార్ టూర్: మీ మరపురాని ప్రయాణానికి ఒక కంప్లీట్ గైడ్ appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 8 Dec 2025 9:00 pm

జపాన్ లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

టోక్యో: జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. జపాన్ ఉత్తర తీరంలో సోమవారం 7.2 తీవ్రతతో భారీ భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారీ భూకంపం నేపథ్యంలో మూడు మీటర్ల ఎత్తులో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. అమోరి, హక్కైడో తీరంలో భూకంపం సంభవించిందని ఏజెన్సీ పేర్కొంది. జపాన్ తీరాన్ని భూకంపం అతలాకుతలం చేయడంతో సీలింగ్ లైట్లు ఊగుతున్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. కాగా, భూకంపం కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గానీ జరగలేదని అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 8 Dec 2025 8:58 pm

తెలంగాణ హైకోర్టులో ఐఎఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు

 సీనియర్ ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కేడర్ కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ స్టే విధించింది. ఈ పరిణామంతో ఆమ్రపాలికి తాత్కాలికంగా చుక్కెదురైంది. గత ఏడాది అక్టోబర్‌లో కేంద్రంలోని డివొపిటి ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలి డివొపిటి ఆదేశాలను సవాల్ చేస్తూ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేయగా క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. క్యాట్ ఆదేశాల మేరకు ఐఎఎస్ అధికారి హరికిరణ్‌తో స్వాపింగ్ పద్ధతి ద్వారా ఆమ్రపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. అయితే క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివొపిటి తెలంగాణ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. ఐఎఎస్ కేటాయింపు నిబంధనల ప్రకారం ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదని డివొపిటి ప్రధానంగా వాదించింది. ఐఎఎస్ హరికిరణ్ రిజర్వ్ కేటగిరీకి చెందిన అధికారి కాబట్టి ఓపెన్ కేటగిరీకి చెందిన ఆమ్రపాలికి ఆయనతో స్వాపింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని డివొపిటి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. డివొపిటి అప్పీల్‌ను పరిశీలించిన హైకోర్టు క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు క్యాట్ ఉత్తర్వులు అమలులో ఉండవని, వాటిపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరఫు న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశించింది.

మన తెలంగాణ 8 Dec 2025 8:54 pm

ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ సజీవదహనం

బేస్తవారిపేట: ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు వద్ద టమాటా లోడ్‌తో వెళ్తున్న లారీ టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ ను పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన దుర్గారావుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మన తెలంగాణ 8 Dec 2025 8:48 pm

Candidate |ప్రజా సమస్యల కోసం పని చేస్తా

Candidate | ప్రజా సమస్యల కోసం పని చేస్తా Candidate | నర్సింహులపేట,

ప్రభ న్యూస్ 8 Dec 2025 8:21 pm

మరికొన్ని గంటల్లో పుట్టినరోజు వేడుకలు.. అంతలోనే

పుట్టిన రోజే ఆ బాలుడికి మరణ దినంగా మారింది. మరికొన్ని గంటల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో విధి వక్రీకరించి వేడి సాంబార్ గిన్నెలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ గురుకుల విద్యాలయంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.... గురుకుల విద్యాలయం వసతిగృహం వంట మనిషిగా పని చేస్తున్న మొగిలి మధుకర్ ఆదివారం వంట చేసి సాంబారు గిన్నె పక్కనే పెట్టగా మధుకర్ కుమారుడు నాలుగు సంవత్సరాల మోక్షిత్ ఆడుకుంటూ వెళ్లి వేడి సాంబార్ గిన్నెలో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన మధుకర్ బాలుడు మోక్షిత్‌ను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మోక్షిత్ మృతి చెందాడు. ఆదివారం నాడే మోక్షిత్ పుట్టిన రోజు కాగా అదే రోజు మరణం సంభవించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాలుడి తండ్రి మధుకర్ ఫిర్యాదు మేరకు ధర్మారం ఎస్సై ఎం.ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 8 Dec 2025 8:18 pm

MD |జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి..

MD | జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి.. MD | విజయవాడ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Dec 2025 8:16 pm

ఫ్యూచర్ సిటీలో జూపార్క్ ఏర్పాటు.. కుదిరిన ఒప్పందం

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో కొత్త జూపార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. జూపార్క్ ఏర్పాటుకు వంతారా ఎంవొయు కుదుర్చుకుంది. సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జూపార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. వన్యప్రాణులకు సేవ అనే నినాదంతో వంతారా పని చేస్తోందని కొనియాడారు. ఈ నెల చివర్లో గుజరాత్‌కు వెళ్లి వంతారాను సందర్శిస్తామని పేర్కొన్నారు. వంతారా సంస్థ ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి చెందినది అన్న విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 8 Dec 2025 8:12 pm

బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఇద్దరి మృతి

వేగంగా దూసుకు వచ్చిన లారీ కిందపడి ఇద్దరు వ్యక్తులు దూర్మరణం. సూరారం పోలీస్ స్టేషన్ పరిధి జ్యోతి మిల్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుండి వేగంగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల దర్యాప్తు లో తెలింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పాండు బస్తీ కి చెందిన రాపిడో డ్రైవర్ సురేందర్ రెడ్డి (45). సూరారం వెంకటరమణ కాలనీ కి చెందిన జ్యోతి (32) పల్సర్ బైక్ పైన నర్సాపూర్ రోడ్డులో వెళ్తున్నారు. బైక్ పై వెళ్తున్న వారిని వెనుక నుండి వచ్చిన లారీ అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సురేందర్ రెడ్డి, జ్యోతి కింద పడిపోయారు. లారీ ముందు టైర్లు జ్యోతి, సురేందర్ పై నుండి వెళ్ళగా అక్కడికక్కడే చనిపోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. లారీని ట్రేస్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూరారం సీఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.

మన తెలంగాణ 8 Dec 2025 8:12 pm

Govt |కాపు, బీసీ భవనాల నిర్మిస్తా

Govt | కాపు, బీసీ భవనాల నిర్మిస్తా నా సొంత నిధులు వెచ్చిస్తున్నారాష్ట్ర

ప్రభ న్యూస్ 8 Dec 2025 8:08 pm

రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారు: హరీష్‌రావు

గ్లోబల్ సమ్మిట్‌ను ‘గోబెల్స్ సమ్మిట్‘ అంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు. గతంలో దావోస్ వెళ్లి డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులపాలయ్యారని విమర్శించారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమి, ఫార్మా సిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమి బిఆర్‌ఎస్ హయాంలో సమీకరించినదే గుర్తు చేశారు. అందులో రేవంత్ చెమట చుక్క కూడా లేదని అన్నారు. కెసిఆర్ యువత ఉద్యోగాల కోసం ఆలోచిస్తే, రేవంత్ ఆ భూములను తన అనుయాయులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. రెండో ఏడాది పాలన పెనంలోంచి పొయ్యిలో పడినట్లు ఉందని, మూడో ఏడాది ఏమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారన్నారు. రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు. రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో చూసుకోవాలని పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ కరప్షన్ పాలన రేవంత్ కుటుంబం, మంత్రులది అని ఆరోపించారు. కరప్షన్ ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు మొండి చేయి చూపించిందని... అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం విజన్, విధానం ఏంటో ఎవరికి ఇప్పటికీ అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు జరుపుకోవాలని హరీష్‌రావు అన్నారు.

మన తెలంగాణ 8 Dec 2025 8:07 pm

Cricket |బ్లైండ్ టీమ్ కెప్టెన్ దీపికకు నీరాజనం

Cricket | బ్లైండ్ టీమ్ కెప్టెన్ దీపికకు నీరాజనం Cricket | శ్రీ

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:58 pm

TET |టెట్ పై పునః సమీక్ష అవసరం

TET | టెట్ పై పునః సమీక్ష అవసరం TET | పల్నాడు

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:47 pm

నవజ్యోత్ కౌర్ సిద్ధూను సస్పెండ్ చేసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, పంజాబ్ మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూపై కాంగ్రెస్ వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల పార్టీపై నవజ్యోత్ కౌర్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల నవజ్యోత్ సింగ్ సిద్ధూ క్రియాశీల రాజకీయాలకు తిరిగి రావడంపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. కాంగ్రెస్ 2027కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తేనే ఆయన మళ్లీ పోటీ చేస్తారని చెప్పారు. రూ.500 కోట్లు సూట్ కేసు ఇచ్చేవారే ముఖ్యమంత్రి అవుతారని..ఆ పదవిని కొనడానికి అంత డబ్బు తమ వద్ద లేవని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు పార్టీలో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆమెను ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు.

మన తెలంగాణ 8 Dec 2025 7:47 pm

Ravi Teja’s BMW Second Single Promo: A Dazzling Melody

Mass Maharaja Ravi Teja and writer-director Kishore Tirumala have come together for the first time for a grand family entertainer, Bhartha Mahasayulaku Wignapthy. The movie first single, Bella, has become a good hit adding to the excitement created by the glimpse. Now, the makers are releasing the second single, Addam Mundu, on 10th December. The […] The post Ravi Teja’s BMW Second Single Promo: A Dazzling Melody appeared first on Telugu360 .

తెలుగు 360 8 Dec 2025 7:41 pm

Welcome |బాల సదనాల్లో మహిళా కమిషన్ తనిఖీ

Welcome | బాల సదనాల్లో మహిళా కమిషన్ తనిఖీ Welcome | కర్నూలు,

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:39 pm

OSSS Teaser: Tharun, Eesha’s Fun Ride

Tharun Bhascker joined hands with a debutant A R Sajeev for a rustic entertainer Om Shanti Shanti Shantihi. Eesha Rebba is cast opposite Tharun Bhascker in the movie which is done with its shoot and is getting ready for its theatrical release. Meanwhile, the makers started the promotions by revealing the teaser. Tharun Bhascker plays […] The post OSSS Teaser: Tharun, Eesha’s Fun Ride appeared first on Telugu360 .

తెలుగు 360 8 Dec 2025 7:37 pm

Collector |తక్షణమే పరిష్కరించండి

Collector | తక్షణమే పరిష్కరించండి Collector | మచిలీపట్నం,- ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:35 pm

Gold |లక్కీ క్రికెటర్‌కు గోల్డ్ కాయిన్

Gold | లక్కీ క్రికెటర్‌కు గోల్డ్ కాయిన్ యువ హీరోలు రామ్ -హరి

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:28 pm

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వృద్ధుడి మృతి

విశాలాంధ్ర – బెలుగుప్ప:రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వెంకటాద్రిపల్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి (60) మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం ప్రకారం, హోటల్ నిర్వహణ చేస్తూ జీవనోపాధి సాగిస్తున్న చంద్రమౌళి బెలుగుప్పకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా, ఆవులెన్న క్రాస్ సమీపంలో తిప్పేస్వామి నడుపుతున్న బైక్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో చంద్రమౌళికి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించిగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు.ఆయన మృతితో కుటుంబ […] The post రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వృద్ధుడి మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Dec 2025 7:26 pm

health |శతాధిక వృద్ధురాలు కన్నుమూత

health | శతాధిక వృద్ధురాలు కన్నుమూత health | చల్లపల్లి, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:22 pm

Award |ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు

Award | ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు Award |

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:16 pm

నవ్వులు పూయిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత ఆయన నటుడిగా మారిపోయారు. పలు సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితమే ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ వస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారిపోయారు. ఆ హీరోగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళం వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘జయ జయ జయహే’ సినిమాకి ఇది రీమేక్. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. గోదావరి బ్యాక్‌డ్రాప్ ఈ సినిమా సాగుతుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. భార్యపై ఆధిపత్యం చెలాయించాలని అనుకొనే భర్తకి.. ఊహించని విధంగా భార్య అతడిపై తిరగబడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. మొత్తానికి టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. నేయిటివిటికి దగ్గరగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఈశా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎఆర్ సజీవ్ ఈ సినిమా దర్శకుడు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 23, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 8 Dec 2025 7:13 pm

Electric |విద్యుత్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి

Electric | విద్యుత్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి Electric | పామర్రు

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:09 pm

మహిళల ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ఇందిర మహిళా శక్తి స్టాల్

తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ఇందిర మహిళా స్టాల్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యం మహిళలను ఆత్మవిశ్వాసంతో నిలబడే యజమానిగా తీర్చిదిద్దడమేనని స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో సోమవారం ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మహిళా సాధికారతను ప్రతిబింబించే ఇందిరా మహిళా శక్తి స్టాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ ఎదిగితే కుటుంబం, సమాజం, రాష్ట్రం ఎదుగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళ శక్తిని కేంద్ర బిందువుగా చేసుకుని పని చేస్తోందని అన్నారు. ఈ స్టాల్‌లో కనిపిస్తున్న ప్రతీ విజయకథ తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. సెర్ప్, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా రూపొందించిన ఈ స్టాల్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఆధ్వర్యంలో మహిళల చేతుల్లో నడుస్తున్న విభిన్న వ్యాపారాలు, సేవలు, ఆర్థిక కార్యకలాపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. మహిళల నిర్వహణలో ఉన్న పెట్రోలు బంకులు, హైటెక్ సిటీలో పనిచేస్తున్న మహిళా శక్తి బజార్, జిల్లాల వ్యాప్తంగా నిర్మితమైన మహిళా శక్తి భవనాలు, శక్తి క్యాంటిన్లు, అలాగే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణలో మహిళలు సాధిస్తున్న విజయాలు దేశ విదేశాల ప్రతినిధులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ మహిళా సంఘాలు పెద్ద స్థాయిలో వ్యాపారాలు నడపడం, కార్పొరేట్ స్థాయి సేవలు అందించడం, ఇదే కొత్త తెలంగాణ శక్తి అని అన్నారు. మహిళకు వేదిక ఇస్తే ఆమె అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుందనే దానికి ఈ ప్రదర్శనే సాక్షమని అన్నారు.

మన తెలంగాణ 8 Dec 2025 7:08 pm

తెలంగాణ వ్యాప్తంగా 4 లేన్ల రోడ్లు : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ప్రపంచమంతా గ్లోబల్ సమ్మిట్ వైపు ఆసక్తిగా చూస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైసింగ్ నినాదంతో మంత్రులందరం యూనిటీగా పని చేస్తున్నామని ఆయన చెప్పారు. సోమవారం గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ, 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఆర్ అండ్ బి శాఖ ఆద్వర్యంలో జాతీయ రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త ఎయిర్‌పోర్టులు, డ్రైపోర్ట్ నుండి కోస్టల్ ఏరియా కనెక్టివిటీ, సౌత్ ఇండియా స్టేట్స్ కనెక్టివిటీ కారిడార్, గ్రీన్ ఫీల్ హైవేలు లాంటి ప్రణాళికతో వెళ్తున్నామని మంత్రి కోమటి రెడ్డి అన్నారు. మా విజన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో పూర్తిగా 4లేన్ల రోడ్లు రాబోతున్నాయని కోమటి రెడ్డి చెప్పారు. మంచి రోడ్లు ఉంటే గ్రామీణ తెలంగాణ అభివృద్ది చెందుతుందని, పరిశ్రమలు వస్తాయని, .యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి, భారత్ ఫ్యూచర్ సిటీ నుండి బెంగళూరు, చెన్నై గ్రీన్ ఫీల్ రహదారులు, బుల్లెట్ ట్రైన్ కారిడార్లు రాబోతున్నాయని ఆయన చెప్పారు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలవబోతున్నాయన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేదని ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. తమ కుటుంబంలో ఒక్కొక్కరు పదివేల కోట్లు తిన్నారని కవిత ఆరోపిస్తోందని, కెసిఆర్ క్యాబినెట్ మంత్రులపై కవిత చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని మంత్రి కోమటి రెడ్డి డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 8 Dec 2025 7:04 pm

Why is Dhurandhar a Game Changer in Indian Cinema?

Bollywood has been struggling to deliver impressive films and some of the biggest action dramas fell short of expectations. Many recent spy thrillers and action dramas are packed with glamour, expensive locations and forceful action. Then came Dhurandhar, a realistic and honest action drama that unfolded some of the shocking facts that happened behind the […] The post Why is Dhurandhar a Game Changer in Indian Cinema? appeared first on Telugu360 .

తెలుగు 360 8 Dec 2025 7:02 pm

కల్వకుర్తి లో భారీ చోరీ

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని విద్యా నగర్, కేశవ్ నగర్ కాలనిలో గల శ్రీనివాస్ శర్మ నివాసంలో సోమవారం భారీ చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్ శర్మ, అతని కుటుంబ సభ్యులు నవంబర్ 30న వేరే ఊరికి వెళ్ళి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి తాళం విరిగిపడి ఇంట్లో సామాన్లు చిందర వందరగా పడి ఉండడం ,బీరువాలు తెరిచి ఉన్నాయి. ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయాన్ని గమనించిన శ్రీనివాస్ శర్మ  వెంటనే  పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి ఎస్సై మాధవరెడ్డి తన సిబ్బందితో చేరుకుని ఇళ్ళంతా పరిశీలించారు. బాధితుడు 40 తులాల బంగారు, 6 లక్షల నగదు చోరీకి గురైందని చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. 

మన తెలంగాణ 8 Dec 2025 7:00 pm

Social |శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు….

Social | శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు…. Social | ధర్మపురి,

ప్రభ న్యూస్ 8 Dec 2025 6:56 pm

2BHK ప్లాన్ చేస్తున్నారా? 3BHK నా? ఏది బెస్ట్? మొదటిసారి ఫ్లాట్ కొనేవారికి గైడ్

హైదరాబాద్ వంటి నగరంలో మొదటిసారి ఫ్లాట్ కొనాలనుకునే వారు ఎదుర్కొనే అతిపెద్ద సందిగ్ధత 2BHK కొనాలా? లేక 3BHK తీసుకోవాలా? ఈ నిర్ణయం కేవలం ఒక అదనపు గది గురించి మాత్రమే కాదు.. ఇది మీ భవిష్యత్తు, జీవనశైలి, ఆర్థిక ప్రణాళికతో ముడిపడి ఉంటుంది. డియర్ అర్బన్ అందిస్తున్న ఈ గైడ్ ముఖ్యమైన అంశాలైన ఖర్చు, జీవనశైలి, భవిష్యత్ ప్రణాళికలను విశ్లేషించడం ద్వారా ఈ క్లిష్టమైన నిర్ణయాన్ని సులభతరం చేయడానికి రూపొందించింది. 1. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ […] The post 2BHK ప్లాన్ చేస్తున్నారా? 3BHK నా? ఏది బెస్ట్? మొదటిసారి ఫ్లాట్ కొనేవారికి గైడ్ appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 8 Dec 2025 6:52 pm

incident |సాంబారులో పడి బాలుని మృతి..

incident | సాంబారులో పడి బాలుని మృతి.. incident | పెద్దపల్లి జిల్లా

ప్రభ న్యూస్ 8 Dec 2025 6:50 pm

టి-20 ప్రపంచకప్‌.. జియో హాట్‌స్టార్ కీలక నిర్ణయం?

వచ్చే ఏడాది ఐసిసి టి-20 ప్రపంచకప్ జరుగనుంది. ఈ ప్రపంచకప్‌కి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ కూడా ప్రకటించారు. అయితే ఈ టోర్నీకి ముందు ప్రముఖ ఒటిటి సంస్థ జియో హాట్‌స్టార్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కి షాక్ ఇస్తూ.. ఈ టోర్నమెంట్ ప్రసారకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఐసిసికి చెప్పినట్లు సమాచారం. అంతేకాక నాలుగేళ్ల భారత మీడియా హక్కుల ఒప్పందంలోని మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్‌ని కూడా కొనసాగించలేమని జియో హాట్‌స్టార్ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు ఒటిటి ఫ్లాట్‌ఫామ్‌కి వస్తున్న భారీ ఆర్థిక నష్టాలే ఈ నిర్ణయం వెనుక కారణంగా తెలుస్తోంది. దాదాపు 2.4 బిలియన్ల డాలర్లతో 2026-29 మధ్య కాలానికి భారత మీడియా హక్కులకు సంబంధించిన విక్రయ ప్రక్రియను ఐసిసి తాజాగా ప్రారంభించింది. జియో హాట్‌స్టార్ 2024-27 మధ్య కాలానికి 3 బిలియన్ల డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు జియో హాట్‌స్టార్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో బిడ్‌లు దాఖలు చేయాలని పలు ప్రధాన ఒటిటి ఫ్లాట్‌ఫామ్‌లను ఐసిసి ఆహ్వానించిది. సోని పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ, ఒప్పందం విలువ చాలా అధికంగా ఉండటంతో ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదని సమాచారం.

మన తెలంగాణ 8 Dec 2025 6:48 pm

కాప్రా సాకేత్‌లో రియల్టర్ దారుణ హత్య

హైదరాబాద్ శివారు ప్రాంతం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ కాప్రా సాకేత్‌లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది.పాత కక్షలతో దుండగులు ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి,బండరాయితో మోది, తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన సోమవారం ఉదయం 8 గంటలకు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాకేత్‌లో వెలుగు చూసింది.మృతుడు కాప్రా సర్కిల్ పరిధిలోని సాకేత్‌లో నివసించే ఘంటా వెంకటరత్నం (54)గా పోలీసులు గుర్తించారు.పక్కా పథకం ప్రకారం నలుగురు వ్యక్తులు ఆటోలో,బైక్‌పై మరో ఇద్దరు వెంకటరత్నంను ఫాలో అవుతూ ఆటోను స్కూటీకి అడ్డగించి కత్తులతో విచక్షణరహితంగా దాడిచేశారు.అంతటితో ఆగకుండా తుపాకీతో కాల్చి తిరిగి అదే ఆటోలో పారిపోయారు.ఈ సంఘటనతో స్థానికులు భయాందోనళకు గురయ్యారు.సమాచారం అందుకున్న జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదయ్య తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు. పోలీసుల వివరాల ప్రకారం కాప్రా సాకేత్‌లో నివసించే ఘంటా వెంకటరత్నం (54) రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తు భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం తన కూతురిని సాకేత్‌లోని ఫాస్టర్ బిల్లా బాంగ్ స్కూల్‌లో వదిలి తిరిగి ఇంటికి స్కూటీపై వస్తుండగా ఆరుగురు వ్యక్తులు ఆటోను అడ్డంగా ఉంచి అతనిపై కత్తులతో దాడి చేశారు.విచక్షణరహితంగా దాడి చేయడమే కాకుండా తుపాకీతో షూట్ చేసి పారిపోయారు. వెంకటరత్నంను హత్య చేయడానికి నిందితులు గత కొంత కాలంగా రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది.మృతుడు వెంకటరత్నం గతంలో దూల్‌ఫేటలో రియల్ ఏస్టేట్ వ్యాపారం నిర్వహించేవాడు.అతనిపై అక్కడ రౌడిషీట్‌తో పాటు హత్య నేరారోపణలు ఉన్నాయి.సాకేత్‌లో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నప్పటికి అక్కడి ఆర్థిక,వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.మృతుడి తల్లి,భార్య పిల్లలు మృతదేహం వద్ద బోరున విలపించారు. తన కుమారుడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని తల్లి పోలీసుల ముందు వాపోయింది.మల్కాజ్‌గిరి డివిజన్ డిసిపి సిహెచ్.శ్రీధర్ ఘటన స్థలాన్ని సందర్శించి హత్యకు దారితీసిన విషయాలపై అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమోరాల పుటేజీని పరిశీలిస్తున్నామని, తొందరలోనే నిందితులను పట్టుకుంటామని డిసిపి శ్రీధర్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సైదయ్య తెలిపారు.

మన తెలంగాణ 8 Dec 2025 6:45 pm

funding |గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..!

funding | గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..! funding | ఇంద్రవెల్లి,

ప్రభ న్యూస్ 8 Dec 2025 6:30 pm

Vote |అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా…

Vote | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధికి ఈనెల 11వ తేదీన

ప్రభ న్యూస్ 8 Dec 2025 6:25 pm

candidate |భారీ మెజార్టీతో గెలిపించండి… అభివృద్ధి చేస్తా…

candidate | భారీ మెజార్టీతో గెలిపించండి… అభివృద్ధి చేస్తా… candidate | బిక్కనూర్,

ప్రభ న్యూస్ 8 Dec 2025 6:24 pm

Services |ఆదరించండి..అభివృద్ధి చేసి చూపిస్తా..

Services | ఆదరించండి..అభివృద్ధి చేసి చూపిస్తా.. Services | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 8 Dec 2025 6:18 pm

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: పనితీరు, టాప్ హోల్డింగ్స్, ఇంకా రిస్క్ గురించి సమగ్ర వివరాలు

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి మీకు అవగాహన కల్పించడానికి ఈ కథనం సహాయపడుతుంది. ఈ ఫండ్ పనితీరు, వేటిలో పెట్టుబడులు పెడుతుంది? వంటి అంశాలు కూడా చర్చించుకుందాం. మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన ఉదాహరణ తీసుకుందాం. దీనిని ఒక నిపుణుడు నిర్వహించే వివిధ కంపెనీల స్టాక్స్ ఉన్న బుట్టగా ఊహించుకోండి. మీరు డబ్బు పెట్టినప్పుడు, ఆ ఫండ్ మేనేజర్ మీ కోసం ఆ స్టాక్స్‌ను కొనుగోలు చేసి, అమ్మి, వాటిని […] The post క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: పనితీరు, టాప్ హోల్డింగ్స్, ఇంకా రిస్క్ గురించి సమగ్ర వివరాలు appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 8 Dec 2025 6:15 pm

Grand |చారిత్రక వైభవానికి చిరునామా బెల్లంపల్లి స్టేషన్..

Grand | చారిత్రక వైభవానికి చిరునామా బెల్లంపల్లి స్టేషన్.. Grand | బెల్లంపల్లి,

ప్రభ న్యూస్ 8 Dec 2025 6:13 pm

Kalvakuntla Kavitha : హరీశ్ రావుపై మరోసారి కవిత ఫైర్

హరీశ్ రావుపై మరోసారి కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

తెలుగు పోస్ట్ 8 Dec 2025 6:11 pm

Schemes |కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి…

Schemes | కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి… ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్….

ప్రభ న్యూస్ 8 Dec 2025 6:04 pm

Gold Eyes |బంగారు కన్నులు సమర్పణ..

Gold Eyes | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని

ప్రభ న్యూస్ 8 Dec 2025 6:02 pm

State |గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

State | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా State | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Dec 2025 6:00 pm

WOMEN |తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జిగా పద్మ వీరపనేని

WOMEN | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జిగా పద్మ వీరపనేని WOMEN |

ప్రభ న్యూస్ 8 Dec 2025 5:59 pm

Public |గ్రామాభివృద్ధి చేస్తా.. ఉంగరం గుర్తుకు ఓటు వేయండి

Public | గ్రామాభివృద్ధి చేస్తా.. ఉంగరం గుర్తుకు ఓటు వేయండి Public |

ప్రభ న్యూస్ 8 Dec 2025 5:56 pm

ఇండిగో సంక్షోభం పై రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే?

ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు

తెలుగు పోస్ట్ 8 Dec 2025 5:55 pm

వెంబడించిన వీధి కుక్కలు.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి

అన్నమయ్య జిల్లా: జిల్లాలోని రాయచోటి పట్టణంలో దారణం చోటు చేసుకుంది. వీధి కుక్కలు వెంబడించడంతో బైక్ వెళ్తున్న వ్యక్తి మృత్యువాత పడ్డారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురంలో నివాసముంటున్న ఫజిల్(42) అనే వ్యక్తి గాలివీడు రోడ్డులోని అర్బన్ పోలీస్‌స్టేషన్ సమీపం నుంచి రాత్రి 3 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో వీధి కుక్కలు ఆయన బైక్‌ను వెంబడించాయి. కుక్కల నుంచి తప్పించుకునేందుకు ఫజిల్ బైక్‌ను వేగంగా నడిపారు. దీంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న ఆలయ గోడను ఢీకొని.. అక్కడికక్కడే ప్రాణాలు కో్ల్పోయారు. సమాచారం అందుకున్న రాయచోటి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆవులు, కుక్కలు ఇష్టారీతిన రోడ్ల మీద తిరుగుతున్నా.. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

మన తెలంగాణ 8 Dec 2025 5:53 pm

అభ్యంతరకర పోస్టులు.. ఢిల్లీ హైకోర్టుకు జూ. ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సోమవారం ఎన్టీఆర్ కోర్టులో పిటిషన్ వేశారు. తన అనుమతి లేకుండా ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. అనుమతి లేకుండా ఎన్టీఆర్‌ ఫోటో, పేరును వాడిన సోషల్ మీడియా ఖతాలపై, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఐటీ రూల్స్ 2021 కింద మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు న్యాయస్థానం వాయిదా వేసింది. సినీ సెలబ్రిటీలపై కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అభ్యంతరకర పోస్టులను ఎదుర్కొన్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.  కాగా, దేవర మూవీ తర్వాత తారక్.. ప్రశాంత్ నీల్ తో భారీ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇంటర్ నేషన్ స్థాయిలో ఈ మూవీ ఉండబోతోందని ఇటీవల నిర్మాత వెల్లడించారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. చాలా బక్కగా, గుబురు గడ్డంతో స్టైలీష్ గా కనిపిస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ సినిమా టైటిల్ తోపాటు పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.

మన తెలంగాణ 8 Dec 2025 5:43 pm

Awareness Meeting |నేతలకు దూరంగా ఉండాలి

Awareness Meeting | నేతలకు దూరంగా ఉండాలి Awareness Meeting | జన్నారం,

ప్రభ న్యూస్ 8 Dec 2025 5:29 pm

Army |ఆర్మీ అకాడమీకి కృషి అభినందనీయం

Army | ఆర్మీ అకాడమీకి కృషి అభినందనీయం Army | నారాయణపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Dec 2025 5:23 pm

Bharat Army |ఆర్మీ అకాడమీ కృషి అభినందనీయం

Bharat Army | ఆర్మీ అకాడమీ కృషి అభినందనీయం తెలంగాణ జాగృతి జిల్లా

ప్రభ న్యూస్ 8 Dec 2025 5:22 pm

Telangana: డాబుసరితనం లేదు.. గొప్పలు చెప్పు కోలేదు..గ్లోబల్ సమ్మిట్ పై ప్రశంసలు

తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

తెలుగు పోస్ట్ 8 Dec 2025 5:18 pm

DRUGS |విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

DRUGS | విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ DRUGS | తిర్యాణి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 8 Dec 2025 5:17 pm

Nallagonda |అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..

Nallagonda | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధి

ప్రభ న్యూస్ 8 Dec 2025 5:17 pm

1 rupee ఇదీ..నా కథ..

1 rupee ఇదీ..నా కథ.. 1 rupee ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 8 Dec 2025 5:14 pm

Solution |అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తా.. గెలిపించండి…

Solution | అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తా.. గెలిపించండి… Solution | రఘునాథపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 8 Dec 2025 5:13 pm

Elections |నియమాలు పాటించాలి

Elections | నియమాలు పాటించాలి Elections | దండేప‌ల్లి, ఆంధ్రప్రభ : రానున్న

ప్రభ న్యూస్ 8 Dec 2025 5:11 pm

37,440 people |రేపే లాస్ట్!

37,440 people | రేపే లాస్ట్! 37,440 people | తెలంగాణ న్యూస్

ప్రభ న్యూస్ 8 Dec 2025 5:08 pm

టీం ఇండియాకు ఝలక్ ఇచ్చిన ఐసిసి

సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్‌కి ముందు టీం ఇండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసిసి ఝలక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌ రేట్ కారణంగా భారత ఆటగాళ్లకు భారీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశిత సమయం కంటే రెండు ఓవర్లు వెనకబడింది. దీంతో ఓవర్‌కు 5 శాతం చొప్పున పది శాతం మ్యాచ్‌ ఫీజ్‌ను టీం ఇండియాకు జరిమానాగా విధించారు. ఐసిసి ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు నుంచి 5 శాతం కోత విధిస్తారు. అయితే ఈ జరిమానాను కెప్టెన్ కెఎల్ రాహుల్ అంగీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ లేకుండా ఈ కేసు ముగిసింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా చేధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని 1-1గా సమం చేసింది. కానీ, వైజాగ్‌లో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించి.. 2-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది.

మన తెలంగాణ 8 Dec 2025 5:06 pm

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. మరో టాప్ కమాండర్ సరెండర్..

రాజ్‌నంద్‌గావ్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నక్సలైట్ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) రామ్‌ధేర్ మజ్జి సోమవారం తన బృందంతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయాడు. హిడ్మాతో సమానంగా కీలక నేతగా ఎదిగిన అతని తలపై ఇప్పటికే పోలీసులు రూ. కోటి రివార్డు ప్రకటించారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ బకర్ కట్టాలోని పోలీస్ స్టేషన్‌లో మజ్జి లొంగిపోయాడు. మజ్జితో పాటు లొంగిపోయిన ఇతర మావోయిస్టు కార్యకర్తలలో చందు ఉసేండి, లలిత, జానకి, ప్రేమ్, రాంసింగ్ దాదా, సుకేశ్ పొట్టం, లక్ష్మి, షీలా, సాగర్, కవిత, యోగిత ఉన్నారు. వీరి లొంగుబాటుతో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మండలాలు నక్సల్ రహితంగా మారాయి. కాగా, ఇటీవల మావోయిస్టులు భారీగా ఆయుధాలతో సహా పోలీసుల ముందు లొంగిపోతున్న విషయం తెలసిందే. ఛత్తీస్‌గఢ్‌లో 80 శాతం నక్సలిజం నిర్మూలించబడింది.. కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. మార్చి 2026 నాటికి ఈ హింస నుండి రాష్ట్రం విముక్తి పొందుతుంది. అభుజ్‌మద్‌లోని పశ్చిమ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలలో, సుక్మా, బీజాపూర్ జిల్లాల దక్షిణ ప్రాంతాలలో మాత్రమే నక్సలిజం కొనసాగుతోంది. నేడు, బస్తర్‌లోని ప్రజలు భయం లేకుండా బహిరంగ గాలిని పీల్చుకోగలరు అని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం అన్నారు

మన తెలంగాణ 8 Dec 2025 5:00 pm

Revanth Reddy : గ్లోబల్ సమ్మిట్ అసలు లక్ష్యమిదే

తెలంగాణలో చైనా లోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

తెలుగు పోస్ట్ 8 Dec 2025 4:57 pm

భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ: మంత్రి శ్రీధర్ బాబు

భవిష్యత్తు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, అక్కినేని నాగార్జున, పలువురు మంత్రులు, దేశవిదేశీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల ప్రజాపాలనను పూర్తి చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. ఉత్పత్తి, ఇంధన, నిర్మాణ రంగాల్లో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. ప్రపంచమంతా లాంచ్ ప్యాడ్ కోసం ఎదురుచూస్తోంది. తెలంగాణ అందుకు సిద్ధంగా ఉంది. టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం, రాజకీయ నిబద్ధతతో అభివృద్ధికి కృషి చేస్తోంది అని చెప్పారు

మన తెలంగాణ 8 Dec 2025 4:50 pm

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: కిషన్ రెడ్డి

హైదరాబాద్: దశాబ్ద కాలంగా భారత్ కు విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పదేళ్లుగా అన్ని రంగాల్లో ఈ అభివృద్ధి కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందని తెలియజేశారు. పదేళ్లలో ఎయిర్ పోర్టులు రెండింతలయ్యాయని, జాతీయ రహదారులు 60 శాతం ఎక్కువై లక్షా 46 వేల కి.మి. చేరుకున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సెల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ ప్రస్తుతం రెండోస్థానంలో ఉందని, అన్ని రాష్ట్రాల అభివృద్ధితోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. కేంద్రం పాటిస్తున్న పారదర్శకత, జవాబుదారితనం వల్లే పెట్టుబడులు పెరిగాయని, గ్లోబల్ కంపెనీలకు డెస్టినేషన్ హబ్ గా భారత్ మారిందని కొనియాడారు. గత దశాబ్దకాలంగా భారత్ లో ఎన్ హెచ్ ల నిర్మాణం 70 శాతం పెరిగిందని, పదేళ్ల క్రితం 240 కి.మి. ఉన్న మెట్రో రైల్ నెట్ వర్క్ ఇప్పుడు 1013 కి.మి. పెరిగిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

మన తెలంగాణ 8 Dec 2025 4:49 pm

Chandrababu : వచ్చే నెలలో చంద్రబాబు దావోస్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ఖరారయింది.

తెలుగు పోస్ట్ 8 Dec 2025 4:42 pm

Tandoor |బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి

Tandoor | బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి ఓటర్లను అభ్యర్థించిన బీజేపీ రాష్ట్ర

ప్రభ న్యూస్ 8 Dec 2025 4:29 pm

‘ఎందుకో అంత క్యూట్‌గా?’ ప్రభాస్‌పై ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ కామెంట్స్

రెబల్‌స్టార్ ప్రభాస్‌కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు ప్రభాస్. అభిమానులంతా ‘డార్లింగ్’ అంటూ ప్రభాస్‌ని ప్రేమగా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎంతటి పవర్‌ఫుల్ రోల్స్ చేసినా.. బయట మాత్రం చాలా సౌమ్యంగా, ప్రేమగా ఉంటారు. అయితే ప్రభాస్‌ అంటే చాలా మంది సెలబ్రిటీలకు కూడా ఇష్టమే. అందులో ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. తనకి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో ఆమె తాజాగా ఎక్స్‌లో వేసిన ఓ పోస్ట్ చూస్తే తెలుస్తోంది. ప్రభాస్ ఇటీవల జపాన్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ‘బాహుబలి: ది ఎపిక్’ విడుదల సందర్భంగా ఆయన జపాన్ వెళ్లి అక్కడ ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ స్టిల్స్ కొన్ని వైరల్ అయ్యాయి. ఆ స్టిల్స్ పోస్ట్ చేసిన పాయల్.. ‘‘ఇంత అమాయకంగా ఎవరైనా ఉండగలరా? ఇండస్ట్రీ మనల్ని కఠినంగా మార్చుతుంది. అంతేకాక.. మంద చర్మం గత వారిలా చేస్తుంది. కానీ, ఈ వ్యక్తి మాత్రం సులువుగా సిగ్గుపడుతుంటారు.. దాంతో ఎక్కువ మాట్లాడలేరు. ఎందుకు అంత క్యూట్‌గా ఉంటాడో? దేవుడు అతడిని దీవించుగాక’’ అంటూ ప్రభాస్‌ని పొగుడుతూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అభిమానులు ‘‘మీరిద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుంది’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మన తెలంగాణ 8 Dec 2025 4:28 pm

In Charge |గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తా

In Charge | గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తా తూడుకుర్తి గ్రామ సర్పంచ్

ప్రభ న్యూస్ 8 Dec 2025 4:25 pm

Varni |గ్రామ వికాసానికి కృషి చేస్తాం..

Varni | వర్ని, ఆంధ్రప్రభ : గ్రామంలో పెరిగిపోతున్న కోతుల బెడదను అరికట్టడంతో

ప్రభ న్యూస్ 8 Dec 2025 4:18 pm

DMHO |విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు

DMHO | విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు జిల్లా వైద్యాధికారి మధుసూదన్DMHO |

ప్రభ న్యూస్ 8 Dec 2025 4:18 pm

Andhra Prabha Smart Edition |సమ్మిట్​ సంరంభం/వందేమాతరం/ఇండిగో

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 08-12-2025, 4.00PM సమ్మిట్​ సంరంభం.. గ్రాండ్​గా షురూ ఆమ్రాపాలికి

ప్రభ న్యూస్ 8 Dec 2025 4:14 pm

Govt |బాధ్యతాయుతమైన పాలన అందిస్తా

Govt | బాధ్యతాయుతమైన పాలన అందిస్తా గెలుపు బాటలో జంజర్ల లింగన్న… సూరయ్య

ప్రభ న్యూస్ 8 Dec 2025 4:10 pm

Pawan Kalyan’s PKCW, PMF’s Historic Partnership

Reliable industry sources say that Pawan Kalyan Creative Works (PKCW) headed by Power Star Pawan Kalyan and People Media Factory (PMF) led by TG Vishwa Prasad and Krithi Prasad are in talks for a big multi-film partnership. If this happens, it could mark a new phase for large-scale Telugu films. The plan reportedly includes two […] The post Pawan Kalyan’s PKCW, PMF’s Historic Partnership appeared first on Telugu360 .

తెలుగు 360 8 Dec 2025 4:05 pm

Welfare schemes |ఓటు వేసి గెలిపించండి.. అభివృద్ధి చేస్తాం…

Welfare schemes | ఓటు వేసి గెలిపించండి.. అభివృద్ధి చేస్తాం… Welfare schemes

ప్రభ న్యూస్ 8 Dec 2025 3:58 pm

Krishna Kanth |ప్రజల కోసం ఎన్నికల బరిలో విద్యావంతుడు

Krishna Kanth | మంథని, ఆంధ్రప్రభ : కత్తెర గుర్తుకు ఓటెయ్యాలని, కష్టాలు

ప్రభ న్యూస్ 8 Dec 2025 3:57 pm