SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

పాక్‌లో భారతీయ వస్తువులు అమ్మే మార్కెట్​ లక్ష్యంగా పేలుడు.. ముగ్గురు మృతి

పాకిస్థాన్‌లో ప్రధాన నగరమైన లాహోర్‌లోని ప్రముఖ అనార్కలీ మార్కెట్ వద్ద ముష్కరులు ఘాతుకానికి తెగబడ్డారు. భారతీయ వస్తువులు విక్రయించే ప్రాంతంలోని ఓ పాన్​ మండీ వద్ద ఈ పేలుడు జరిగింది.

సమయం 20 Jan 2022 6:00 pm

2024 ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలాయేనా? బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టి కొత్త చరిత్రను లిఖించారు. భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఈ ఘనత సాధించారు.

సమయం 20 Jan 2022 12:14 pm

అమెరికాలో 5జీ సేవలు షురూ.. విమానాలు నిలిపివేసిన ఎయిరిండియాా

5జీ సేవలు మొదలైతే అమెరికాకు విమాన సర్వీసులను రద్దు చేయాలని పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు భావించాయి. ఈ సమస్యపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

సమయం 20 Jan 2022 11:22 am

మాస్క్, కోవిడ్ పాస్‌లు తప్పనిసరికాదు.. రద్దుచేస్తూ బ్రిటన్ సాహసోపేత నిర్ణయం

జ‌రిమానాలు, చట్టపరమైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం వల్ల క‌రోనా కేసులు త‌గ్గుతాయ‌ని కోవడం అవివేకమని భావించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు.

సమయం 20 Jan 2022 10:05 am

కనీసం మీరైనా మమ్మల్ని గుర్తించండి: ముస్లిం దేశాలకు తాలిబన్లు అభ్యర్థన

తాలిబన్ల పాలనలో అఫ్గన్ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధిని కోల్పోయి చేతిలో డబ్బు.. తినేందుకు తిండి కరవయి ఎటుచూసినా ఆకలి కేకలు వినబడుతున్నాయి.

సమయం 20 Jan 2022 8:29 am

సెల్ఫీలు అమ్ముకున్నాడు.. కోటీశ్వరుడు అయ్యాడు..!

లాటరీ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యేవారున్నారు. కానీ ఇండోనేషియాలో ఓ విద్యార్థి తన సెల్ఫీలు అమ్ముకుని కోటీశ్వరుడు అయ్యాడు. సెల్ఫీలను సేల్ చేసి రూ.7 కోట్లు సంపాదించుకున్నాడు.

సమయం 19 Jan 2022 9:23 pm

భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ప్రమాదం లేదన్న నాసా

భారీ గ్రహశకలం భూమివైపుగా దూసుకొస్తుందని నాసా వెల్లడించింది. అయితే దాని వల్ల ప్రమాదం ఉండదని, సురక్షితంగా భూ కక్ష్యను దాటుతుందని పేర్కొంది. భూమివైపు దూసుకొచ్చే 1994 PC1 గ్రహశకలాన్ని మొదట 1994లో కనుగొన్నారు.

సమయం 18 Jan 2022 8:09 pm

పెళ్లికి నో చెప్పి మ్యారేజ్ బ్యూరో.. ప్రాణం తీసుకోబోయిన వృద్ధుడు

ఓ 64 ఏళ్ల వృద్ధుడు రెండో పెళ్లికి కంగారు పడి ప్రాణాలు తీసుకోబోయాడు. వెంటనే అమ్మాయిని చూడమని మ్యారేజ్ బ్యూరో‌ను కోరగా అతనికి పెళ్లి సంబంధం చూడ్డానికి నిరాకరించింది. దాంతో ఆ వృద్ధుడు అక్కడే ఆత్మహుతికి ప్రయత్నించాడు.

సమయం 18 Jan 2022 7:27 pm

పాంగాంగ్ సరస్సుపై వేగంగా చైనా వంతెన నిర్మాణం: బయటపెట్టిన శాటిలైట్స్

ఇండియన్ ఆర్మీ మెరుపు దాడికి దిగితే తన సైన్యాలను వేగంగా తరలించేందుకు డ్రాగన్ పాంగాంగ్ తొసో మీదుగా వంతెన సహా తన భూభాగంలో కొత్తగా రోడ్లు, హెలిప్యాడ్‌లను నిర్మిస్తోంది.

సమయం 18 Jan 2022 3:21 pm

మిమిక్రీ చేసే రోబోను చూశారా..? అచ్చం మనిషిలా ఎక్స్‌ప్రెషన్స్

ఎన్నో వింతలు జరుగుతున్నాయి. అత్యాధునిక సాంకేతితతో మనుషులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటి అద్భుతమే రోబో. రోబోలు మనిషిలా అన్ని పనులు చేయడమే కాదు.. మనిషిలా మిమిక్రీ కూడా చేస్తోంది.

సమయం 18 Jan 2022 2:57 pm

మంటల్లోంచి గుర్రాల పరుగులు.. స్పెయిన్‌లో వింత పండుగ

స్పెయిన్‌లో ప్రతి ఏడాది ఓ వింత పండుగను జరుపుకుంటారు. లాస్ లుమినేరియాస్ పేరుతో జరుపుకునే పండుగలో గుర్రాలను మంటల్లో దూకిస్తారు. అలా చేస్తే వాటికి ఏ అనారోగ్యాలు రావని అక్కడి వారి నమ్మకం.

సమయం 18 Jan 2022 2:03 pm

టోంగో దీవిలో రాకాసి అలలు విధ్వంసం.. వెల్లడించిన శాటిలైట్ చిత్రాలు

మూడు రోజుల కిందట పసిఫిక్ తీరంలోని టోంగో దీవిలో అగ్ని పర్వతం విస్ఫోటనం చెంది భారీగా బూడిద, పొగలు ఎగిసిపడ్డాయి. దీని ప్రభావంతో రాకాసి అలలు విరుచుకుపడ్డాయి.

సమయం 18 Jan 2022 1:43 pm

అఫ్గన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 26 మంది మృతి

గతేడాది ఆగస్టులో తాలిబన్లు రెండోసారి అఫ్గన్‌ను ఆక్రమించుకున్న తర్వాత అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి కూడా కరువై దిక్కుతోచని పరిస్థితుల్లో అవయవాలను అమ్ముకుంటున్నారు.

సమయం 18 Jan 2022 7:05 am

సౌదీలో ఉగ్రదాడి.. ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మృతి

సౌదీలో ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే హౌతీ తిరుగుబాటుదారులు రాకెడ్, డ్రోన్ల దాడులతో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విరుచుకుపడ్డారు.

సమయం 17 Jan 2022 6:10 pm

అమెరికా ఆంక్షలు బేఖాతరు.. నెలలో నాలుగోసారి ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు

వరుస క్షిపణి ప్రయోగాలతో అగ్రరాజ్యం అమెరికా కంటిలో నలుసుగా మారింది ఉత్తర కొరియా. నాలుగు రోజుల కింద అమెరికా ఆంక్షలు విధించినా ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు.

సమయం 17 Jan 2022 5:33 pm

డీజిల్ కొరతతో ఆగిన ఇంటర్‌నెట్ సేవలు… ఆ దేశంలో వింత పరిస్థితి

లెబనాన్‌లో వింత పరిస్థితి నెలకొంది. ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడ కొన్ని గంటలు మాత్రమే విద్యుత్ సదుపాయం ఉంటుంది. దాంతో జనరేటర్ల నెట్ వర్క్‌పై అక్కడ ప్రజలు ఆధారపడుతున్నారు. అయితే ఆ స్టేషన్లు డీజిల్‌తో నడుస్తాయి.

సమయం 17 Jan 2022 1:16 pm

కోవిడ్-19 ఎమర్జెన్సీ చట్టాల రద్దు యోచనలో ఆ దేశ ప్రధాని

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి కఠినమైన చట్టాలను పలు దేశాలు అమలు చేస్తున్నాయి. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే జరిమానా విధించడం, కేసులు నమోదుచేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.

సమయం 17 Jan 2022 12:29 pm

అప్ఘాన్‌లో అరాచకం.. పోరాటం చేస్తోన్న మహిళలపై పెప్పర్ స్ప్రే..!

అప్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్లో తమ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలపై తాలిబన్ ఫైటర్లు పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. దాంతో వారంతా చెల్లాచెదురైపోయారు. తాలిబన్ ప్రభుత్వం మొదలైన దగ్గర నుంచి అక్కడ ప్రజలపై రకరకాల ఆంక్షలు అమలవుతున్నాయి.

సమయం 17 Jan 2022 10:28 am

సంగీతంపై ఆంక్షలు.. హార్మోనియం పెట్టెను తగలబెట్టిన తాలిబన్లు

అప్ఘానిస్థాన్‌లో తాలిబన్లు ఇప్పుడు మ్యూజిక్‌పై పడ్డారు. ఇళ్లల్లో ఉండే సంగీత పరికరాలను, పాటల రికార్డులను నాశనం చేయాలని పిలుపునిచ్చారు. ఓ సంగీత కళాకారుడిని కొట్టి… ఆయన కళ్ల ముందే హార్మోనియం పెట్టెను తగలబెట్టారు.

సమయం 16 Jan 2022 4:17 pm

విద్యార్థులకు గిఫ్ట్‌గా పందుల్ని ఇచ్చిన టీచర్లు..!

చైనాలో ఓ స్కూల్ వింత ఆలోచన చేసింది. బాగా చదువుతున్న విద్యాార్థులకు పందులను బహుమతిగా అందజేసింది. ఇలా చేయడం వల్ల మెరిట్ సర్టిఫికెట్ కంటే ఎక్కువ ఉపయోగం ఉంటుందని అక్కడ టీచర్లు అంటున్నారు.

సమయం 16 Jan 2022 1:13 pm

బద్ధలైన అగ్ని పర్వతం.. పలు దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ

టోంగా ద్వీపంలో పేలిన అగ్ని పర్వతంతో పలు దేశాల్లో సునామీ భయం పట్టుకుంది. ఆ పేలుడు ప్రభావం న్యూజిలాండ్, జపాన్, ఫిజి, అమెరికా దేశాలపై ఉండడంతో ఆయా దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

సమయం 16 Jan 2022 12:15 pm

తెగ చూసేశారు.. యూట్యూబ్ వీడియోకు వెయ్యి కోట్లకుపైగా వ్యూస్

ఓ యూట్యూబ్ వీడియోకు వెయ్యి కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇన్ని వ్యూస్ వచ్చిన తొలి వీడియోగా రికార్డ్ సాధించింది. పింక్ ఫాంగ్ అనే సంస్థ రూపొందించిన వీడియో ఈ కీర్తిని దక్కించుకుంది. అది చిన్నారులకు సంబంధించిన పాట కావడం విశేషం.

సమయం 15 Jan 2022 4:34 pm

అమెరికాలో కోవిడ్ ఉధృతి.. పౌరులకు ఫ్రీగా ర్యాపిడ్ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు

అమెరికాలో కోవిడ్ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దాంతో యూఎస్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. పౌరులకు ఫ్రీగా మాస్క్‌లను అందజేయనుంది.

సమయం 14 Jan 2022 9:56 pm

చెవిపోటుతో అవస్థలు పడ్డ వ్యక్తి…. బొద్దింకను బయటకు తీసిన డాక్టర్

చెవిలో బొద్దింకతో ఓ వ్యక్తి మూడు రోజులు అవస్థలు పడ్డాడు. డాక్టర్ దగ్గరకు వెళ్లడంతో ఆయన చెక్ చేసి చెవిలో పురుగు ఉన్నట్టు గుర్తించారు. దానిని బయటకు తీయగా షాక్‌కు గురయ్యాడు. ఈ అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేశాడు.

సమయం 14 Jan 2022 6:22 pm

13.5 సెకన్లలో ఫుడ్ వచ్చేస్తుంది..!

వేగంగా అందించే సేవలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇది గుర్తించి మెక్సికోలోని ఓ రెస్టారెంట్ వచ్చే కస్టమర్లకు అంతే వేగంగా ఫుడ్‌ను అందిస్తోంది. దాంతో కస్టమర్లు ఆ రెస్టారెంట్‌కు క్యూ కడుతున్నారు.

సమయం 14 Jan 2022 4:08 pm

మరో వివాదంలో బ్రిటన్ ప్రధాని.. ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు ముందు మందు పార్టీ

రాజ్యమేదైనా..రాజైనా, ప్రజలైనా నిబంధలు పాటించాల్సిందే. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

సమయం 14 Jan 2022 3:05 pm

బోరింగ్ జాబ్ అంటూ దావా… రూ.33 లక్షల పరిహారం చెల్లించిన సంస్థ..!

ఫ్రాన్స్‌లో తనకు సరైన పని ఇవ్వలేదని కోర్టునాశ్రయించిన వ్యక్తికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తనకిచ్చిన పని వల్ల డిప్రెషన్‌కు గురయ్యాయని చెప్పడంతో కోర్టు సదరు సంస్థ నుంచి పరిహారం కూడా ఇప్పింది.

సమయం 14 Jan 2022 12:35 pm

అఫ్గన్‌లో ఆకలికేకలు.. కడుపుతీపితో కిడ్నీలు అమ్ముకుంటున్న తల్లిదండ్రులు

తాలిబన్ల పాలనలోకి వచ్చిన తర్వాత అఫ్గన్‌లో ప్ర‌జ‌లు ప్రాణాల‌ను గుప్పిట‌లో పెట్టుకుని బ‌తుకుతున్నారు. అనిశ్చితి ప‌రిస్థితుల కార‌ణంగా అఫ్గన్‌లో ఆక‌లి కేక‌లు త‌ప్ప‌వ‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ఇప్పటికే హెచ్చ‌రించింది.

సమయం 14 Jan 2022 12:28 pm

కరోనాకు కొత్తగా మరో రెండు చికిత్సలు.. డబ్ల్యూహెచ్ఓ ఆమోదం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వైరస్ కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 30 కోట్ల మందికిపైగా వైరస్ బారినపడ్డారు.

సమయం 14 Jan 2022 8:22 am

కాలేయ మార్పిడి చేసి.. ఆటోగ్రాఫ్ చెక్కిన వైద్యుడు.. తగిన శిక్ష విధించిన కోర్టు

రోగులకు కాలేయ మార్పిడి చేసి..ఆ కాలేయాలపై తన అటోగ్రాఫ్ చెక్కుకున్న వైద్యుడికి న్యాయస్థానం తగిన శిక్ష విధించింది. రోగులను మానసిక సంఘర్షణకు గురిచేసిన అతడికి వైద్యవృత్తికి అనర్హుడిగా ప్రకటించింది.

సమయం 13 Jan 2022 4:37 pm

డెల్టాను అధిగమించిన ఒమిక్రాన్.. మున్ముందు ఆస్పత్రులకు చీకటి రోజులు: నిపుణుల హెచ్చరిక

వ్యాక్సిన్లు తీసుకోని వారిలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతోపాటు కొత్తగా బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లు కూడా నమోదవుతుండటం కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

సమయం 13 Jan 2022 12:30 pm

జీరో కొవిడ్‌ వ్యూహంతో చైనా అగచాట్లు.. బలవంతంగా మెటల్ బాక్సుల్లో జనం!

ప్రపంచ దేశాలన్నీ ఒక దారిలో వెళ్తుంటే చైనా మాత్రం తొలి నుంచి జీరో కోవిడ్ వ్యూహాన్నే అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఒక్క కేసు వచ్చినా లాక్‌డౌన్‌లు అమలు చేస్తోంది.

సమయం 13 Jan 2022 11:49 am

ఒమిక్రాన్ కేసులు తగ్గుతాయ్..! గుడ్ న్యూస్ చెప్పిన శాస్తవేత్తలు

ఒమిక్రాన్ కేసుల భారీ తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికే దేశాల్లో కేసులు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో తగ్గుముఖం పడతాయని చెప్పారు. కాగా ఒమిక్రాన్‌తో 115 మంది మరణించారు.

సమయం 12 Jan 2022 8:10 pm

కోవిడ్‌తో మంచు చిరుత మృతి

కరోనా సోకడంతో అరుదైన జంతువు చనిపోయింది. కోవిడ్ ప్రేరిత న్యూమోనియాతో బాధపడిన రైలూ అనే మంచు చిరుత మృతి చెందింది. అమెరికాలో ఇల్లి నాయిస్‌లో ఉన్న మిల్లర్ పార్క్ జూ‌లో మరికొన్ని మంచు చిరుతల్లో కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు జూ అధికారులు గుర్తించారు.

సమయం 12 Jan 2022 6:09 pm

భూటాన్ సరిహద్దుల్లో చైనా నిర్మాణాలు.. భారత్‌కు ముంచుకొస్తున్న మరో ముప్పు

విస్తరణవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా.. సరిహద్దుల్లోని పొరుగు దేశాల భూభాగాలకు ఆక్రమించుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల కాలంలో భారత్ భూభాగంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టినట్టు నివేదికలు వచ్చాయి.

సమయం 12 Jan 2022 4:18 pm

కోవిడ్ ఆంక్షల ఉల్లంఘన… 4 ఏళ్లకుపైగా జైలు శిక్ష

సిబ్బంది మాస్క్ పెట్టుకోకపోవడంతో ఓ సంస్థలో ముగ్గురు అధికారులకు చైనాలో జైలు శిక్ష పడింది. కోవిడ్ ఆంక్షలు అమలు చేయడంలో విఫలం అయినందుకు వారికి నాలుగేళ్లకుపైగా శిక్ష వేసి జైలుకు పంపించారు.

సమయం 12 Jan 2022 3:25 pm

నచ్చని పాటకు డ్యాన్స్ చేసిన వధువు.. వివాహవేదికపైనే విడాకులిచ్చిన వరుడు!

సంగీత్‌లో తమ మనోభావాలు దెబ్బతినేలా నచ్చని పాటకు వధువు డ్యాన్స్ చేయడం విడాకులకు కారణమయ్యింది. ఈ ఘటన ఇరాక్‌లోని బాగ్దాద్‌లో చోటుచేసుకుంది.

సమయం 12 Jan 2022 11:12 am

తాలిబన్‌ల పాలనలో రోడ్డున పడ్డ జర్నలిస్టులు

అప్ఘనిస్థాన్‌లో తాలిబన్‌ల పాలనలో జర్నలిస్టుల పరిస్థితి అధ్వానంగా మారింది. వారి అరాచకాలకు చాలా మీడియా సంస్థలు మూతబడ్డాయి. దాంతో వేలాదిమంది జర్నలిస్టులు ఉద్యోగాలను కోల్పోయారు. దాంతో వారు మనుగడ కోసం వేరే వృత్తులను ఎంచుకున్నారు.

సమయం 11 Jan 2022 5:59 pm

వైద్యశాస్త్రంలో మరో అద్భుతం.. మనిషికి పంది గుండె

అవయవాల కొరత తీవ్రంగా వేధిస్తోన్న ప్రస్తుత తరుణంలో అమెరికా వైద్యులు మరో అద్భుతం సాధించారు. పంది గుండెను మనిషికి విజయవంతంగా అమర్చారు.

సమయం 11 Jan 2022 11:23 am

చంద్రుడిపై నీటి జాడను కనుగొన్న చైనా వ్యోమనౌక

చంద్రుడిపై నీటి ఆనవాళ్ల గురించి ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడ నీళ్లు ఉన్నాయని చాలాసార్లు శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. అయితే మరోసారి అది రుజువైంది. చందమామపై నీటి ఆనవాళ్లు ఉన్నట్టు చైన వ్యోమనౌక ద్వారా తెలిసింది.

సమయం 10 Jan 2022 7:13 pm

పాటకు డ్యాన్స్ వేసిందని పెళ్లిలోనే విడాకులిచ్చేసిన వరుడు

కాబోయే భార్య డ్యాన్స్ వేస్తే ఏ వరుడైన సంతోషపడతాడు. అందులోనూ పెళ్లి వేడుకల్లో వధువు డ్యాన్స్ వేస్తే చూడముచ్చటగా ఉంటుంది. అయితే ఇరాక్‌లో మాత్రమే దీనికి విరుద్ధంగా జరిగింది. భార్య డ్యాన్స్ వేసిందని వదిలేసి వెళ్లిపోయాడు.

సమయం 10 Jan 2022 1:17 pm

అమెరికాలో అగ్నిప్రమాదం.. 9 చిన్నపిల్లలతో సహా 19 మంది మృతి

అమెరికాలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో చిన్నపిల్లలతో సహా చాలామంది చనిపోయారు. కొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

సమయం 10 Jan 2022 9:54 am

దేశాల్లో కోవిడ్ డేంజర్ బెల్స్… ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశాల్లో వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. లక్షలాది మంది ప్రజలు కోవిడ్ బారిన పడుతున్నారు. కోవిడ్ బాధితులకు సేవలందిస్తోన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇలా ప్రపంచవాప్తంగా 22 లక్షలకు పైగా కోవిడ్ నమోదయ్యాయి.

సమయం 9 Jan 2022 8:11 pm

చనిపోయిన బొద్దింకలపై పెయింటింగ్స్... ఔరా అంటోన్న నెటిజన్స్

కళకారులు ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తుంటారు. వాటిని వెంటనే అమల్లో పెట్టేస్తుంటారు. చాలా క్రియేటివ్‌గా కొత్త కొత్త పద్ధతుల్లో తమ కళను ప్రదర్శిస్తుంటారు. అలాగే ఫిలిప్పీన్స్ ఆర్టిస్ట్ బొద్దింకలపై చిత్రాలు గీసింది.

సమయం 9 Jan 2022 4:36 pm

క్లాత్ మాస్క్ ధరిస్తే పావు గంటలోనే కోవిడ్ సోకే ప్రమాదం.. హెచ్చరించిన అధ్యయనం

డిసెంబరు 2019లో చైనాలో తొలిసారి వెలుగుచూసిన కరోనా మహమ్మారి రెండేళ్ల నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజుకో కొత్త రూపంలో విరుచుకుపడుతోంది.

సమయం 9 Jan 2022 4:30 pm

అవినీతిపై చైనా ఉక్కుపాదం.. లంచం తీసుకుంటే ఉరి

చైనా ప్రభుత్వం ఏదైనా ఒక ఆదేశం జారీ చేస్తే.. కచ్చితంగా అది అమలు చేయాల్సిందే.. ప్రజలైనా, పెద్ద సంస్థలైనా సరే ప్రభుత్వం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి. ఎవరైనా అవినీతికి పాల్పడితే అస్సలు క్షమించదు. లంచం తీసుకున్న అధికారులను కఠినంగా శిక్షిస్తుంది.

సమయం 9 Jan 2022 2:33 pm

కరోనా సోకిందని కొడుకును కారు డిక్కీలో తీసుకొచ్చిన టీచరమ్మ!

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వేరియంట్ వ్యాప్తితో రికార్డుస్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.

సమయం 9 Jan 2022 10:50 am

మిస్సైన అఫ్గన్ చిన్నారి దొరికింది.. ఫలించిన తల్లిదండ్రుల ఐదు నెలల నిరీక్షణ

అమెరికా సైన్యం వైదొలగిన తర్వాత అఫ్గన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో రెండు దశాబ్దాల కిందట అరాచకపాలన కళ్లముందు మొదలడంతో తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరారయ్యారు.

సమయం 9 Jan 2022 8:24 am

మంచు అందాలకు బలైన పర్యాటకులు, చిన్నారులతో సహా 21 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు వెళ్లిన పర్యాటకులు చనిపోయారు. దట్టంగా కురుస్తోన్న మంచులో చిక్కుకుపోయి చలి తీవ్రతకు చనిపోయారు.

సమయం 8 Jan 2022 7:15 pm

అమెరికాలో కరోనా విధ్వంసం.. ఐదేళ్లలోపు పిల్లలకు కోవిడ్

చైనా నుంచి వ్యాప్తి చెందిన కోవిడ్ వైరస్ … దశల వారీగా ప్రపంచంపై విరుచుకుపడుతోంది. ఇప్పుడు మళ్లీ అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. అయితే అమెరికాలో పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు.

సమయం 8 Jan 2022 2:21 pm

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదు

చైనాలోని టిబెట్ పీఠభూమి సమీపంలోని ప్రావిన్సుల్లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రికర్ట్ స్కేల్‌పై 6.9గా నమోదయ్యింది.

సమయం 8 Jan 2022 12:12 pm

చైనా: ప్రభుత్వ కార్యాలయంలో భారీ పేలుడు.. 16 మంది మృతి

ఆఫీసు క్యాంటీన్‌లో పేలుడు సంభవించి 16 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది గాయపడ్డారు. గ్యాస్ లీక్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

సమయం 8 Jan 2022 11:23 am

నిరసన తెలిపితే కాల్చిపారేయండి.. పోలీసులకు కజిక్ అధ్యక్షుడు ఆదేశాలు

చములు ధరలు పెరగడంతో ఆగ్రహానికి గురైన ప్రజలు తొలుత అల్మాటీ నగరంలో మేయర్ భవనాలకు, అధ్యక్ష భవనాలకు నిప్పంటించారు. తర్వాత ఈ ఆందోళనలు దేశమంతటా వ్యాపించాయి.

సమయం 8 Jan 2022 8:39 am

తల్లికి సైనికుడు రాసిన ఉత్తరం 76 ఏళ్ల తర్వాత చేరింది..!

ఫోన్‌లు వచ్చిన తర్వాత ఉత్తరాలు రాసుకునే కల్చర్ పోయింది. ఒకప్పుడు ఉత్తరాలు ద్వారానే ఒకరి కష్ట, సుఖాలు ఇంకొకరికి తెలిసేవి. అయితే ముఖ్యమైన ఉత్తరాలు ఆలస్యంగా చేరి ఒక్కోసారి చికాకు కలిగించేవి. అలా ఓ సైనికుడు తన తల్లికి రాసిన లేఖ.. 76 ఏళ్ల తర్వాత చేరింది.

సమయం 7 Jan 2022 8:42 pm

చమురు ధరల పెంపుపై నిరసనలు.. రక్తసిక్తమైన కజికిస్థాన్

కజికిస్థాన్‌లో చమురు ధరలు పెంపుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. ముందుగా ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారడంతో పౌరులతోపాటు, పోలీసులు చనిపోయారు.

సమయం 7 Jan 2022 1:04 pm

ఒమిక్రాన్‌‌తోనూ ప్రాణాలు పోతున్నాయి: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హెచ్చరిక

కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్‌ వల్ల ఇన్‌ఫెక్షన్ స్వల్పంగానే ఉంటుందని, ఇది తేలికపాటి వ్యాధిగా సూచించడం ప్రమాదమే అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ

సమయం 7 Jan 2022 12:56 pm

డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా.. సూపర్ మార్కెట్లను మూసేసిన చైనా

వాస్తవానికి ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిచెందదని పలు పరిశోధనలు వెల్లడించాయి. అయితే, డ్రాగన్ ఫ్రూట్స్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడటం కలకలం రేగుతోంది.

సమయం 7 Jan 2022 8:51 am

అఫ్గన్ సైన్యంలో ఆత్మాహుతి దళం.. ఐఎస్‌కు చెక్ పెట్టాలంటే తాలిబన్లకు ఇదే దిక్కు!

అమెరికా, మిత్ర దేశాల బలగాలు, అఫ్గన్ ప్రభుత్వ సైన్యాలతో రెండు దశాబ్దాలు యుద్దం చేసిన తాలిబన్లు.. ఆత్మాహుతి దళంపైనే ఎక్కువగా ఆధారపడ్డారు.

సమయం 6 Jan 2022 5:36 pm

పాక్ అణు స్థావరాలపై ‘మొసాద్’ మెరుపు దాడి.. స్విస్ పత్రిక నివేదికలో దిమ్మదిరిగే వాస్తవాలు!

భారత్‌ పోటీగా అణు కార్యకలాపాలను ప్రారంభించిన దాయాది పాకిస్థాన్.. అణ్వాయుధాలను తయారుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వీటిని రహస్యంగా తయారుచేయడం గమనార్హం.

సమయం 6 Jan 2022 4:29 pm

మీడియాపై పరువు నష్టం దావా.. ఒక్క పౌండు పరిహారం గెలుచుకున్న ప్రిన్స్ హ్యారీ భార్య!

రాజరికం ఓ ముళ్ల కిరీటం వంటిందని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వారసుడిగా గుర్తింపు.. ఇవన్నీ వదులుకుని యువరాజు హ్యారీ సాధారణ జీవితం గడపుతున్న విషయం తెలిసిందే.

సమయం 6 Jan 2022 1:07 pm

కిమ్ దుందుడుకుతనం.. మరో హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్షించిన ఉత్తర కొరియా

దేశంలో ఆహార సంక్షోభం నెలకొందని, ప్రజలు తక్కువగా తినాలంటూ ఉపన్యాసాలిచ్చిన ఉత్తర కొరియా అధినేత.. తన వైఖరిలో ఏమాత్రం మార్పురాలేదని మరోసారి నిరూపించుకున్నారు.

సమయం 6 Jan 2022 11:15 am

ఒమిక్రాన్ తేలికపాటిదని సూచించడం చాలా డేంజర్.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో కొత్తరకం, ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన విషయం తెలిసిందే.

సమయం 6 Jan 2022 10:30 am

ఈదురు గాలులతో నౌక మునక.. 11 మంది భారతీయ సెయిలర్స్‌ను రక్షించిన ఇరాన్

ఒమన్‌కు పంచదారను తీసుకెళ్తున్న నౌక.. ఇరాన్ ప్రాదేశిక జలాల సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. నడి సంద్రంలో భారీ గాలులు వీయడంతో నౌక మునిగిపోయింది.

సమయం 6 Jan 2022 8:18 am

ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుదలతో ప్రమాదం.. కొత్త వేరియంట్ల ముప్పు: WHO హెచ్చరిక

చైనాలో తొలిసారిగా వెలుగుచూసిన సార్స్-కొవి-2 వైరస్ ప్రపంచాన్ని చాప చుట్టేసి కొత్త రూపంలో మళ్లీ మళ్లీ దాడిచేస్తోంది. వేరియంట్‌లు పుట్టుక మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

సమయం 5 Jan 2022 8:59 am

ఫ్రాన్స్‌లో మరో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే అధిక మ్యుటేషన్లు

ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తోంది. అమెరికాలో ఏకంగా సునామీలో విరుచుకుపడి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తరుణంలో ఫ్రాన్స్ కొత్తరకం వేరియంట్‌ను గుర్తించింది.

సమయం 5 Jan 2022 7:27 am

విరిగిపడిన కొండ చరియలు.. 14 మంది మృతి

చైనాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై కొండచరియలు విరుగిపడ్డాయి. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తోన్న కార్మికులు మృతి చెందారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

సమయం 4 Jan 2022 5:42 pm

అమెరికాపై కరోనా సునామీ.. ఒక్క రోజే 10 లక్షలకుపైగా కేసులతో ప్రపంచ రికార్డు!

గడచిన రెండు వారాల నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరే దేశానికి ఇప్పటి వరకూ సాధ్యం కాని విధంగా అమెరికాలో మిలియన్ కేసులు బయటపడ్డాయి.

సమయం 4 Jan 2022 3:05 pm

కవలలే కానీ.. వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు.. అరుదైన ఘటన

సాధారణంగా కవలలు నిమిషాల తేడాతో జననం జరుగుతుంది. దీంతో ఇద్దరూ ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకుంటారు. కానీ, ఓ కవలల పుట్టినరోజు మాత్రం తేదీ, నెల, సంవత్సరమే మారిపోయింది.

సమయం 4 Jan 2022 10:40 am

సరిహద్దుల్లో చైనా దూకుడు: పాంగాంగ్ సరస్సుపై వంతెన, హెలీప్యాడ్ నిర్మాణాలు!

తూర్పు లడఖ్ సరిహద్దుల్లో 2020 ఏప్రిల్ నుంచి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. ఇరు దేశాలూ పలుసార్లు జరిపిన చర్చలు, సంప్రదింపులు కొంత వరకూ ఫలితానిచ్చాయి.

సమయం 4 Jan 2022 7:31 am

తైవాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదు

తైవాన్‌లో భూమి కంపించింది. భూకంప తీవ్రతకు ఆఫీసుల్లో అద్దాలు, ఫోటోలు కింద పడ్డాయి. రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. భవనాలు కదలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమయం 3 Jan 2022 9:12 pm

శిశువు చనిపోయిందని డెత్ రిపోర్ట్… అంత్యక్రియల టైంలో ట్విస్ట్

ఊహించనవి జరిగినప్పుడు కచ్చితంగా అద్భుతం జరిగిందనుకుంటాం. అలా ఎందుకు జరిగిందో కూడా అర్థం కాదు. అలాంటి సంఘటన బ్రెజిల్లో జరిగింది. చనిపోయాడనుకున్న బిడ్డ గుండె చివరి నిమిషంలో కొట్టుకుంది.

సమయం 3 Jan 2022 6:25 pm

పీపాల్లో వేల లీటర్ల మద్యం.. కాల్వలో పారబోసిన తాలిబన్లు: వీడియో విడుదల

అమెరికా సైన్యం వైదొలగిన తర్వాత అఫ్గన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కఠిన షరియా చట్టాలను అమలుచేయనున్నట్టు ప్రకటించారు.

సమయం 3 Jan 2022 9:35 am

పాపను రక్షించేందుకు కారు అద్దాలు పగలగొట్టిన పోలీస్… అక్కడున్నది చూసి కంగుతిన్నాడు

యూకేలో ప్రమాదంలో ఉన్న పాపను రక్షించేందుకు ప్రయత్నించిన ఓ పోలీస్‌కు వింత అనుభవం ఎదురైంది. కారులో ఒంటరిగా ఉన్న పాపను రక్షించేందుకు పోలీస్ అధికారి కారు అద్దాలు పగలగొట్టాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. అది పాప కాదు బొమ్మ అని.

సమయం 2 Jan 2022 5:05 pm

పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం.. చెలరేగుతున్న మంటలు

దక్షిణాఫ్రికా పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. భనవనాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

సమయం 2 Jan 2022 4:17 pm

ఆప్ఘానిస్తాన్‌కు భారత్ సాయం... 5 లక్షల డోసుల వ్యాక్సిన్లు పంపిన ఇండియా

దేశాలను అతలాకుతలం చేస్తోన్న కోవిడ్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు రెడీ అయ్యాయి. అయితే కోవిడ్ కట్టడికి ఆప్ఘనిస్తాన్‌‌లో కనీస పరికరాలు లేవు. దాంతో ఇతర దేశాల సాయం కోరుతుంది. ఈ క్రమంలో భారత్ 5 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఆ దేశానికి పంపించింది.

సమయం 1 Jan 2022 8:31 pm

2022లో కోవిడ్‌కు ముగింపు.. కలసి పనిచేస్తేనే సాధ్యం : ప్రపంచ ఆరోగ్య సంస్థ

దేశాలన్నీ ఒమిక్రాన్ వాకిట కొత్త ఏడాదికి స్వాగతం పలికాయ్. ఆంక్షల నడుము 2022కు వెల్‌కమ్ చెప్పాయి. ఈ ఏడాదన్న కోవిడ్ వైరస్ అంతమవుతుందోననే ఆశ అందరిలో ఉంది. అయితే కలసికట్టుగా పనిచేస్తే అది సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

సమయం 1 Jan 2022 5:06 pm

మరోసారి గాల్వాన్‌లోకి చైనా సైన్యం.. అంగుళం కూడా వదులుకోమని ప్రకటన!

సరిహద్దుల్లో చైనా వైఖరి తోటి మాట్లాడి నొసటితో వెక్కిరించిన చందంగా మారింది. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెబుతూనే..డ్రాగన్ దుందుడుకు చర్యలు కొనసాగిస్తోంది.

సమయం 1 Jan 2022 1:25 pm

ఇజ్రాయేల్‌లో కొత్తరకం వ్యాధి: ‘ఫ్లోరోనా’ తొలి కేసు నమోదు.. డబుల్ ఇన్‌ఫెక్షన్

కరోనా కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని మరోసారి భయంలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్‌లో మరో కొత్త వ్యాధి బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

సమయం 1 Jan 2022 9:16 am

విమానంలోనే క్వారంటైన్.. 5 గంటలపాటు బాత్ రూంలో ఉండి ప్రయాణం

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతోంది. దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణంలోనే ఓ టీచర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలండంతో ఆమె తనకు తానుగా విమానంలోనే ఐసోలేట్ అయింది.

సమయం 31 Dec 2021 3:10 pm

రూ.77 వేల ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. క్యాడ్బరీ చాక్లెట్లు వచ్చాయి

ఆన్‌లైన్ షాపింగ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇలా ఆర్డర్ చేస్తే అలా ఇంటికొచ్చేస్తాయి. అయితే ఆన్‌లైన్ షాపింగ్‌లో అన్ని సార్లు ఆర్డర్ పెట్టిన వస్తువులు వస్తాయనే నమ్మకం లేదు. ఒక్కోసారి తారుమారు అవ్వొచ్చు. అలా ఓ వ్యక్తి ఫోన్ ఆర్డర్ పెడితే చాక్లెట్లు వచ్చాయి.

సమయం 31 Dec 2021 1:51 pm

సైకోలా మారి 18 మందిని కరిచిన ఉడత.. మరణ శిక్ష విధించిన అధికారులు!

సాధారణంగా ఉడత సాధు జంతువు. రామాయణంలో వారధి నిర్మాణానికి రాముడికి సాయపడిందని పురాణాల్లో చెప్పారు. అటువంటి ఉడత సైకోలా మారి దాడిచేసిన ఘటన యూకేలో చోటుచేసుకుంది.

సమయం 31 Dec 2021 9:41 am

బ్రిటిష్ రాయల్ గార్డ్స్ కవాతులో అనూహ్య ఘటన.. వైరల్ అవుతోన్న వీడియో

లండన్ టవర్ వద్ద బ్రిటిష్ రాయల్ ఆర్మీకి చెందిన గార్డులు కవాతు చేసుకుంటూ వెళ్తుండగా ఓ బాలుడు అనూహ్యాంగా వారి కింద పడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమయం 31 Dec 2021 8:00 am

సిరియాలో వింత పరిస్థితి.. నీటి కొరతతో స్నానాలు చేయలేకపోతున్న జనం .. బాత్ హౌస్‌లకు పరుగులు

సిరియాలో వింత పరిస్థితి నెలకొంది. అక్కడ ప్రజలు ఇళ్లలో స్నానాలు చేసే పరిస్థితి లేకపోవడంతో బాత్ హౌస్‌లకు పరుగులు తీస్తోన్నారు. స్నానం చేయడానికి తమ వంతు వచ్చే వరకూ క్యూలో పడిగాపులు కాస్తున్నారు.

సమయం 30 Dec 2021 2:37 pm

మెక్సికోలో గ్యాంగ్ వార్.. ఒక వర్గంపై మరొక వర్గం కాల్పులు, మృతుల్లో చిన్నారులు

డ్రగ్స్ ముఠాల ఘాతుకానికి ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణం కోల్పోయింది. 16 ఏళ్ల బాలిక చనిపోయింది. మెక్సికోలో ఆధిపత్యం కోసం తలపడిన గ్యాంగ్‌ల మధ్య జరిగిన పోరుకి 8 మంది అమాయకులు బలి అయ్యారు.

సమయం 30 Dec 2021 1:04 pm

సునామీలా కోవిడ్.. ఆరోగ్య వ్యవస్థలు పతనం తప్పదు: WHO తీవ్ర ఆందోళన

ప్రపంచంలో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులను బట్టి చూస్తే కొత్త వేరియంట్‌ సహా కరోనా ముప్పు అధికంగానే ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది.

సమయం 30 Dec 2021 10:50 am

భారత్ బీ అలర్ట్.. కొద్ది రోజుల్లో విస్ఫోటనంలా కోవిడ్ కేసులు : కేంబ్రిడ్జ్ వర్సిటీ హెచ్చరిక

దేశంలో కరోనా కొత్తరకం వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది. రాజధాని ఢిల్లీలో భారీగా కేసులు నమోదుకావడంతో కేజ్రీవాల్ సర్కారు అప్రమత్తమయ్యింది.

సమయం 29 Dec 2021 5:55 pm

తానా ఆధ్వర్యంలో ప్రఖ్యాత సాహితీవేత్తల వ్యక్తిగత కోణం‌పై ప్రత్యేక సదస్సు

ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషకు సంబంధించి పలు అంశాలపై వేడుకలు, కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.

సమయం 29 Dec 2021 11:05 am

ఘోర ప్రమాదం: కుప్పకూలిన బంగారు గని.. 38 మంది దుర్మరణం

మైనింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో బంగారు గనిని ప్రభుత్వం మూసివేయగా.. ఆశతో స్థానికులు స్వంతంగా తవ్వకాలు జరుపుతూ ప్రాణాలు పోగొట్టుకున్నారు.

సమయం 29 Dec 2021 9:34 am

ఒమిక్రాన్ భయం.. అక్కడ నాలుగో డోస్‌పై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం!

ఒమిక్రాన్ వ్యాప్తి భయంతో అన్ని దేశాల కంటే ముందు ఇజ్రాయేల్ సరిహద్దులను మూసివేసి.. విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించింది. బూస్టర్ డోస్‌ల పంపిణీ కూడా ప్రారంభించింది.

సమయం 28 Dec 2021 3:02 pm

బ్రిటన్ రాణిపై భారతీయ సిక్కు యువకుడు హత్యాయత్నం.. కారణం ఇదేనట!

భారత స్వాతంత్ర సంగ్రామంలో అత్యంత దురదృష్టమైన సంఘటన జలియన్ వాలాబాగ్. 13 ఏప్రిల్ 1919లో జనరల్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైనికులు నిరాయుధులైన మహిళలు, పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

సమయం 28 Dec 2021 11:32 am