SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

రిక్ట‌ర్ స్కేలుపై 4.3గా తీవ్రత

రిక్ట‌ర్ స్కేలుపై 4.3గా తీవ్రత న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : భార‌త‌దేశానికి స‌మీపాన ఉన్న

ప్రభ న్యూస్ 6 Nov 2025 12:24 pm

Karnataka : నందిని నెయ్యి ధర భారీగా పెంపు

కర్ణాటకలో నందిని నెయ్యి ధర పెరిగింది. లీటరుకు డెబ్భయి రూపాయలు పెంచుతూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 6 Nov 2025 12:21 pm

Kaantha Trailer: Dulquer’s Nata Vishwaroopam

Kaantha starring Dulquer Salmaan, Bhagyashri Borse, Samuthirakani has created huge anticipation among audiences with its unique theme pertaining to old era of filmmaking. Now, the movie trailer has been unveiled today and the story core is an investigative thriller. For the first time, trailer reveals Rana Daggubati as an inspector who takes over the movie […] The post Kaantha Trailer: Dulquer’s Nata Vishwaroopam appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 12:18 pm

Video: Deekshith Shetty Interview

The post Video: Deekshith Shetty Interview appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 12:17 pm

ఏపీలో మరో బస్సు ప్రమాదం… కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు..ప్రయాణికులందరూ సురక్షితం

ఏపీలోని మన్యం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (ూూRుజ) చెందిన బస్సు విశాఖపట్నం నుంచి జైపూర్‌కు బయలుదేరింది. మన్యం జిల్లా పార్వతీపురం సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీన్ని […] The post ఏపీలో మరో బస్సు ప్రమాదం… కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు..ప్రయాణికులందరూ సురక్షితం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 12:16 pm

రోడ్డు మీద మృత‌దేహం

రోడ్డు మీద మృత‌దేహం సొంత ఇంట్లోకే రానివ్వని వైనంకొడుకు, మ‌ర‌వ‌రాలి ఆవేదన శ్రీ‌కాకుళం,

ప్రభ న్యూస్ 6 Nov 2025 12:13 pm

Ragging : నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 12:11 pm

ఆటో కారు, ఢీ..

ఆటో కారు, ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు..పెబ్బేరు 44వ జాతీయ రహదారి పై

ప్రభ న్యూస్ 6 Nov 2025 12:10 pm

ఏపీఎస్ ఆర్టీసీలో 9 వేల ఉద్యోగాల భర్తీకి సిఫారసు..

గత ప్రభుత్వ నిర్ణయాలపై బోర్డు సమీక్షకొనకళ్ల నారాయణ అధ్యక్షతన విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రక్షాళన దిశగా నూతన పాలకమండలి కీలక అడుగులు వేస్తోంది. సంస్థలో ఖాళీగా ఉన్న 9 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో పాటు, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలపై సమీక్ష జరపాలని నిర్ణయించింది. నిన్న విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ కొనకళ్ల […] The post ఏపీఎస్ ఆర్టీసీలో 9 వేల ఉద్యోగాల భర్తీకి సిఫారసు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 12:06 pm

ప్రియుడితో కలిసి భర్తను చంపి... ఇంట్లోనే పాతిపెట్టి... దృశ్యం సినిమా చూపించారు

అహ్మదాబాద్: ప్రియుడితో కలిసి భర్తను చంపి అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పాతి పెట్టింది. భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పోలీసులకు దృశ్యం సినిమాను చూపించింది. 18 నెలల తరువాత నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సమీర్ బిహారీ, రూబీ అనే దంపతులు ఫతేవాడిలో నివసిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఇమ్రాన్ అనే వ్యక్తితో రూబీ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తను చంపాలని ప్రియుడితో ప్లాన్ వేసింది. ప్లాన్‌లో భాగంగా భర్త ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమె ప్రియుడి, ఇద్దరు స్నేహితులతో కలిసి అతడి గొంతుకోసి హత్య చేశారు. అనంతరం ఇంట్లోనే గోతి తొవ్వి మృతదేహాన్ని పూడ్చేశారు. అనంతరం మృతదేహం పూడ్చిన వద్ద సిమెంట్ వేశారు. తన భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో రూబీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో తన భర్త ముంబయికి వెళ్లాడని దృశ్యం సినిమా చూపించింది. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపారు. భర్త అదృశ్యమై 18 నెలల గడిచిన అతడి ఆచూకీ కనిపించడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంటికి ఎవరు వచ్చి వెళ్తున్నారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇమ్రానే అనే వ్యక్తితో రూబీ ఇంటికి వస్తున్నాడని విచారణలో తేలడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో ఇంటికెళ్లి అస్థిపంజరం బయటకు తీసి డిఎన్‌ఎ టెస్టుకు పంపించారు. మృతుడు సమీర్ అని తేలడంతో ప్రియుడి, ప్రియురాలు, మరో ఇద్దరు స్నేహితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మన తెలంగాణ 6 Nov 2025 12:06 pm

ఏడుగురు మావోయిస్టుల హతం

దండకారణ్యంలో భీకర పోరు.. సుక్మాలో ఆయుధగారం స్వాధీనం ఆంధ్రప్రభ, చింతూరు (ఏఎస్​ఆర్​ జిల్లా)

ప్రభ న్యూస్ 6 Nov 2025 12:03 pm

Hyderabad–Vijayawada National Highway Expansion Gets Green Signal: DPR Ready for Approval

The long-awaited six-lane expansion of the Hyderabad–Vijayawada National Highway has reached a crucial milestone. The detailed project report (DPR) for the massive infrastructure upgrade has been completed and is expected to be presented before the National Highways Authority of India’s Project Appraisal and Technical Scrutiny Committee (PATSC) in the second week of this month. Officials […] The post Hyderabad–Vijayawada National Highway Expansion Gets Green Signal: DPR Ready for Approval appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 11:55 am

భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి నెలకొల్పింది నేనే…

ట్రంప్ నోట మళ్లీ అదే పాటవాణిజ్య ఒప్పందాలు రద్దు చేస్తానని బెదిరించడంతోనే ఇది సాధ్యమైందన్న ట్రంప్కూల్చేసిన ఫైటర్ జెట్ల సంఖ్యను 7 నుంచి 8కి పెంచిన అమెరికా అధ్యక్షుడుభారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, తనవల్లే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తానని బెదిరించడంతోనే అణుశక్తి దేశాలైన భారత్, పాక్‌లు వెనక్కి తగ్గాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆ ఘర్షణలో కూల్చేసిన ఫైటర్ […] The post భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి నెలకొల్పింది నేనే… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:48 am

గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలి..

గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలి.. కడెం, ఆంధ్రప్రభపశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు

ప్రభ న్యూస్ 6 Nov 2025 11:34 am

డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు శిక్ష..

డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు శిక్ష.. బిక్కనూర్, (ఆంధ్రప్రభ)డ్రంక్ అండ్ డ్రైవ్

ప్రభ న్యూస్ 6 Nov 2025 11:27 am

Nani’s Deadline for ‘The Paradise’ Team

Natural Star Nani has a habit of completing his films in quick schedules. Nani is one of the few actors who is available on the sets from early morning. He wants his producer to complete the film’s shoot as per the plan in the scheduled budget. But things are completely odd for ‘The Paradise’. This […] The post Nani’s Deadline for ‘The Paradise’ Team appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 11:25 am

Bigg Boss 9 : బిగ్ బాస్ టాప్ 5లో ఉండేది వారేనట

బిగ్ బాస్ 9 సీజన్ తెలుగులో ప్రేక్షకుల ఆదరణ పొందింది.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 11:24 am

క‌న‌బ‌డుట లేదు..

క‌న‌బ‌డుట లేదు.. జీపీఓలేరీ?ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ లింగాల

ప్రభ న్యూస్ 6 Nov 2025 11:20 am

కొల్లగొట్టేశారా…?

కొల్లగొట్టేశారా…? ఆంజ‌నేయుడి ఆలయంలో చోరీపెద్దేముల్ మండల కేంద్రంలో ఘటన తాండూరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 6 Nov 2025 11:18 am

నలుగురు మావోయిస్టులు మృతి..

నలుగురు మావోయిస్టులు మృతి.. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధి

ప్రభ న్యూస్ 6 Nov 2025 11:15 am

Hyderabad : హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాంటే ఇక నాలుగు గంటలే

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ఆమోదం తెలిపింది.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 11:02 am

అందుకే నవీన్ యాదవ్ కు ఓటు వేయాలి: పొన్నం

హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసుఫ్ గూడ డివిజన్ లోని శ్రీకృష్ణ నగర్ లో పొన్నం డోర్ టూ డోర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలను పలకరించారు. ప్రభుత్వ పథకాలు గురించి ఆరా తీశారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఒక్కొకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 కి గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళలకు ఆర్ టిసి లో ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని పొన్నం వివరించారు. అనంతరం కాపు సంఘ నాయకుల నివాసంలో అల్పాహార సమావేశం జరిగింది. కాపు సంఘాలు నవీన్ యాదవ్ కు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. 

మన తెలంగాణ 6 Nov 2025 10:43 am

లోత‌ట్టు బిక్కు బిక్కు

లోత‌ట్టు బిక్కు బిక్కు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిక కె.వి.బి.పురం, నవంబర్

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:41 am

శిథిలావస్థలో సింగిల్ బ్రిడ్జి..

శిథిలావస్థలో సింగిల్ బ్రిడ్జి.. మోత్కూర్, (ఆంధ్రప్రభ)యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:41 am

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଅମିତ ଶାହାଙ୍କ ନାମରେ ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା

କେନ୍ଦ୍ର ଗୃହ ମନ୍ତ୍ରୀ ଅମିତ ଶାହା   ଆରଜେଡି ସୁପ୍ରିମୋ ଲାଲୁ ପ୍ରସାଦ ଯାଦବ ଏବଂ ତାଙ୍କ ପରିବାର ଉପରେ ତୀବ୍ର ବର୍ଷିଛନ୍ତି। ଯଦି ତେଜସ୍ବୀ ଯାଦବ କ୍ଷମତାକୁ ଆସିବେ ତେବେ ବିହାର ହତ୍ୟା, ଅପହରଣ ଏବଂ ଦାଦାବଟି ପାଇଁ ୩ଟି ନୂଆ ମନ୍ତ୍ରାଳୟ ଦେଖିବ ବୋଲି ଶାହ କହିଛନ୍ତି। ମୁଜାଫରପୁରରେ ଏକ ନିର୍ବାଚନ ରାଲିରେ ଶାହ ବିରୋଧୀ ଏବଂ ଏନଡିଏ ମେଣ୍ଟ ମଧ୍ୟରେ ତୁଳନା କରି କହିଛନ୍ତି, ଯଦି ଏନ୍‌ଡିଏ ମେଣ୍ଟ କ୍ଷମତା ବଜାୟ ରଖେ ତେବେ ବିହାର ବନ୍ୟାମୁକ୍ତ ହେବ। ରାଜ୍ୟ‌ରେ ବନ୍ୟା ନିୟନ୍ତ୍ରଣ ପାଇଁ ଏନ୍‌ଡିଏ ସରକାର ଏକ ସ୍ବତନ୍ତ୍ର ମନ୍ତ୍ରାଳୟ ସୃଷ୍ଟି କରିବ ବୋଲି ସେ କହିଛନ୍ତି। ଆର୍‌ଜେଡି ନେତୃତ୍ବାଧୀନ ‘ଜଙ୍ଗଲ ରାଜ’ କ୍ଷମତାକୁ ଫେରିବା ବିରୋଧରେ ସେ ଚେତାବନୀ ଦେଇଛନ୍ତି। ଶାହ କଟାକ୍ଷ କରି କହିଛନ୍ତି, ଯଦି ଲାଲୁଙ୍କ ପୁଅ (ତେଜସ୍ବୀ) ବିହାର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ହେବେ‌ ତେବେ ଅପହରଣ, ଦାଦାବଟି ଏବଂ ହତ୍ୟା ପାଇଁ ୩ଟି ନୂଆ ମନ୍ତ୍ରାଳୟ ସୃଷ୍ଟି ହେବ। ଅନ୍ୟପକ୍ଷେ ଏନ୍‌ଡିଏକୁ ଆପଣମାନଙ୍କ ଭୋଟ୍‌ ବିହାରକୁ ଆର୍‌ଜେଡିର ଜଙ୍ଗଲରାଜ୍‌ କବଳରୁ ସୁରକ୍ଷା ଦେବ। ନୂଆ ଚେହେରା ସହ ‘ଜଙ୍ଗଲ ରାଜ୍‌’ ଫେରାଇ ଆଣିବାପାଇଁ ଉଦ୍ୟମ ଚାଲିଛି ବୋଲି ସେ କହିଛନ୍ତି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଗ୍ରାଫିକ୍ସ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସର ଗୋଟିଏ ପାର୍ଶ୍ଵରେ କେନ୍ଦ୍ର ଗୃହମନ୍ତ୍ରୀ ଅମିତ ଶାହାଙ୍କ ଫଟୋ ଲାଗିଥିବା ଵେଳେ ସାହାଙ୍କ ଫଟୋ ଉପରେ ଲେଖା ହୋଇଛି, ସୋସିଆଲ ମିଡିଆରେ ଯେତେବି କାର୍ଯ୍ୟକର୍ତା ଅଛନ୍ତି ଯେ କୌଣସି ପାର୍ଟିର ହୁଅନ୍ତୁ ନାଁ କାହିଁକି । ସିଏ ଆମର ୫କେଜି ରାସନରୁ ଚଳୁଛନ୍ତି । ଏହା ଅମିତ ସାହାଙ୍କ ମତ ବୋଲି ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଅନ୍ୟପଟେ ଗ୍ରାଫିକ୍ସର ଉପର ପାର୍ଶ୍ଵରେ ଏନଡିଟିଭି ପାୱାରପ୍ଲେ ଉଲ୍ଲେଖ ରହିଛି । ଯାହାର ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି ।    ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇନାହାଁନ୍ତି ଅମିତ ଶାହା । ନାହିଁ ଏହାକୁ କୌଣସି ଗଣମାଧ୍ୟମ ଖବର ପ୍ରକାଶିତ କରିଛି । ଅମିତ ଶାହାଙ୍କ ଏଭଳି ମନ୍ତବ୍ୟ ଦେବା ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏନେଇ କୌଣସି ତଥ୍ୟ ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ଯଦି ସାହା ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇଥାନ୍ତେ ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରକାସିତ କିମ୍ବା ପ୍ରସାରିତ ହୋଇଥାନ୍ତା । ଉକ୍ତ ଗ୍ରାଫିକ୍ସରେ ଏନଡିଟିଭି ଲୋଗୋ ଥିବାରୁ ଏହା ଏନଡିଟିଭିରେ ପ୍ରସାରିତ ଏକ ଖବର ବୋଲି ୟୁଜର୍ସ ଦାବି କରିଛନ୍ତି । ଉକ୍ତ ଗ୍ରାଫିକ୍ସ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏନଡିଟିଭିର କୌଣସି ମଧ୍ୟ ସୋସିଆଲ ମିଡିଆ ସାଇଟରେ ଏଭଳି ମନ୍ତବ୍ୟ ଥିବାର ଗ୍ରାଫିକ୍ସ ସେୟାର ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଅନ୍ୟପଟେ ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସକୁ ରିଭର୍ସ ଇମେଜ୍ ରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏନଡିଟିଭିର ଅଫିସିଆଲ୍ ସୋସିଆଲ ମିଡିଆରେ ପ୍ରକାଶିତ ଏକ ଗ୍ରାଫିକ୍ସ ପାଇଥିଲୁ । ଯାହାକି ୧ ନଭେମ୍ବରରେ ଅପଲୋଡ୍ କରାଯାଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା ।  ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସସହ ଏନଡିଟିଭି ର ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଗ୍ରାଫିକ୍ସ ପ୍ରାୟ ସମାନ ଦେଖାଯାଉଥିଲା । କେବଳ ଉକ୍ତ ଗ୍ରାଫିକ୍ସରେ ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସ ପରି କୌଣସି ବିବାଦୀୟ ମନ୍ତବ୍ୟ ଥିବାର ଦେଖିବାକୁ ପାଇନଥିଲୁ । ଏନଡିଟିଭି ସେୟାର କରିଥିବା ଗ୍ରାଫିକ୍ସରେ ଉଲ୍ଲେଖ କରିଛି, ବିହାର ଅନ୍ୟ ରାଜ୍ୟ ଅପେକ୍ଷା ରାଜନୈତିକ ଦୃଷ୍ଟିକୋଣରୁ ଜାଗୃତ ପ୍ରଦେଶ ମଧ୍ୟରେ ରହିଛି ବୋଲି ଉଲ୍ଲେଖ ରହିଛି । ସେହିପରି, ବିହାରର ଜନତା ପ୍ରକୃତ ମୁଦ୍ଦାକୁ ଜାଣିଛନ୍ତି ବୋଲି ସାହା ମତ ରଖିଛନ୍ତି ବୋଲି ଏନଡିଟିଭିର ନିଜ ଗ୍ରାଫିକ୍ସରେ ଉଲ୍ଲେଖ କରିଛି । ତେଣୁ ଉକ୍ତ ଗ୍ରାଫିକ୍ସକୁ ଏଡିଟ କରି ମନ୍ଦ ଉଦେଶ୍ୟରେ ବିବାଦିୟ ଲେଖା ସହ କେହି ସେୟାର କରିଥାଇପାରନ୍ତି ଜଣାଯାଉଛି । ଅନ୍ୟପଟେ ୩ ନଭେମ୍ବର ୨୦୨୫ରେ ଏକ ଖବର ପ୍ରସାରଣ କରି ଏନଡିଟିଭି ଉଲ୍ଲେଖ କରିଛି, ଶାହାଙ୍କ ମନ୍ତବ୍ୟ ସହ ଏନଡିଟିଭି ଲୋଗୋ ଲଗାଇ ଭାଇରାଲ କରାଯାଇଥିବା ଗ୍ରାଫିକ୍ସଟି ଫେକ ଅଟେ । ଆମ କାର୍ଯ୍ୟକ୍ରମରେ ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇ ନାହାଁନ୍ତି ଅମିତ ସାହା । ନାହିଁ ଏଭଳିକୌଣସି ମନ୍ତବ୍ୟ ସହ ଆମର କୌଣସି ଖବର ପ୍ରସାରଣ କରାଯାଇଛି । ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ହେଉଥିବା ଗ୍ରାଫିକ୍ସଟି ଫେକ ଅଟେ । ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇନାହାନ୍ତି ଅମିତ ଶାହା, ନାହିଁ ଏନଡିଟିଭି ଏଭଳି କୌଣସି ଖବର ପ୍ରସାରିତ କରିଛି । 

తెలుగు పోస్ట్ 6 Nov 2025 10:35 am

NTR – Neel Film: One Click Ends Speculations

There are a lot of speculations about NTR’s upcoming movie directed by Prashanth Neel. Rumors said that NTR and Neel are at loggerheads and the film’s content got scrapped. Telugu360 has found out the facts and revealed that the film is very much on track. The makers were tightlipped and decided not to respond much […] The post NTR – Neel Film: One Click Ends Speculations appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 10:34 am

బీహార్ పోలింగ్ అప్ డేట్..

బీహార్ పోలింగ్ అప్ డేట్.. బీహార్ లో ఈరోజు తొలి విడతగా 121

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:34 am

Will Ravi Teja rethink about his Choice of Films?

Like never before, Mass Maharaj Ravi Teja is getting trolled and criticized for delivering poor films which are completely outdated. He delivered his fifth disaster in a row with Mass Jathara. All his producers in the recent times have lost money because of the poor show of his films. The actor seems not much bothered […] The post Will Ravi Teja rethink about his Choice of Films? appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 10:31 am

రాజేంద్రనగర్ లో డ్రగ్స్‌ ఓవర్‌డోస్‌ తో యువకుడు మృతి... యువతి పరిస్థితి విషమం?

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో యువతి, యువకుడు డ్రగ్స్‌ పార్టీ చేసుకున్నారు. డ్రగ్స్‌ ఓవర్‌డోస్‌ తీసుకోవడంతో యువకుడు మృతి చెందగా యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. శివరాంపల్లిలోని కెన్ వరత్ అపార్ట్ మెంట్ లో పాత బస్తీ కాళాపత్తర్ కు చెందిన అహ్మద్, కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి సహజీవనం చేస్తున్నారు. రాత్రి డ్రగ్స్ కొనుగోలు చేసి ఇద్దరు రూమ్ లో సేవించారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో అహ్మద్ మృతి చెందగా యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. డ్రగ్స్ హైదరాబాద్ లోని నిలోఫర్ కేఫ్ వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. డ్రగ్స్ టెస్ట్ లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు అనే సమాచారాన్ని రాజేంద్రనగర్ పోలీసులు సేకరిస్తున్నారు. గురువారం ఉదయం రాజేంద్రనగర్ లో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తుండగా భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  

మన తెలంగాణ 6 Nov 2025 10:19 am

ధాన్యం కొనుగోలు..

ధాన్యం కొనుగోలు.. బిక్కనూర్, (ఆంధ్రప్రభ) రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:16 am

India Vs Australia T20 : గోల్డ్ కోస్ట్ టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే? పిచ్ రిపోర్టు ఇదే

భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. గోల్డ్ కోస్ట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 10:13 am

తిరుమలలో భక్తుల రద్దీ ఎంత ఉందంటే?

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి వున్నారు. మంగళవారం శ్రీవారిని 63,239 మంది భక్తులు దర్శించుకోగా 23,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లుగా ఉందని టిటిడి అదికారులు వెల్లడించారు. 

మన తెలంగాణ 6 Nov 2025 10:09 am

Andhra Pradesh : ఏపీలో మంటల్లో బస్సు

ఆంధ్రప్రదేశ్ లో మరో బస్సు ప్రమాదానికి గురయింది. ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్దమయింది.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 10:08 am

కేంద్రానికి తుమ్మల లేఖ.. ఆ గ్రామాలను మాకు ఇవ్వండి

భద్రాచలంలోని గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలపాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు

తెలుగు పోస్ట్ 6 Nov 2025 9:54 am

డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టివేత..

డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టివేత.. రాజేంద్రనగర్ లో డ్రగ్స్ తో పాటు

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:50 am

Amaravathi : కొత్త ఏడాది తొలిరోజు అమరావతి గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్యాంటమ్ వ్యాలీకి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 9:47 am

Rain Alert : మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ.. వానలు ఇక్కడే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 9:43 am

విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండ‌వ క‌న్నుమూత

గన్నవరం – ఆంధ్రప్రభ : విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:42 am

Nara Lokesh : నేడు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో లోకేశ్

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం లభించింది

తెలుగు పోస్ట్ 6 Nov 2025 9:39 am

ముగిసిన నారాయణ దుబాయ్ పర్యటన

దుబాయ్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన ముగిసింది.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 9:34 am

రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత... నలుగురు అరెస్టు

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొని వస్తుండగా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియా నుంచి డెడ్ డ్రాప్ పద్ధతిలో యువకులు డ్రగ్స్ తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి బస్సులో డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్ వస్తుండగా ఎస్ఓటి పోలీసులు వారిని పట్టుకున్నారు. డ్రగ్ సప్లయర్స్ సంగడి సంతోష్ తో పాటు గాంధీ సందీప్ కండేపల్లి శివ, పలక సాయిబాబును పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నుంచి పెద్ద మొత్తంలో ఎండిఎంఎ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

మన తెలంగాణ 6 Nov 2025 9:15 am

ఏపీలో తగ్గనున్న కరెంట్ బిల్లులు..

ఏపీలో తగ్గనున్న కరెంట్ బిల్లులు.. ఏపీలోని అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చౌడువాడ,

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:14 am

Gold Rates Today : అందుబాటులోకి వచ్చేవరకు ఆగుతారా? ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేస్తారా?

దేశంలో బంగారం, వెండి దరలు నేడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి

తెలుగు పోస్ట్ 6 Nov 2025 9:07 am

అందరినీ అలరించే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే తమిళ్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. నవంబర్ 7న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ “ఇలాంటి సినిమా చేయడం చాలా ఛాలెంజింగ్. తప్పకుండా ఆడియన్స్‌కి సీట్ ఎడ్జ్ అనుభూతినిస్తుంది ఈ సినిమా”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, మానస, డైరెక్టర్ ప్రవీణ్ హరీష్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 6 Nov 2025 9:00 am

Exclusive: Allu Arjun lining up the Biggest Films

Icon Star Allu Arjun has reached new heights after the release of Pushpa franchise. The actor’s potential outside the Telugu states got unleashed and the actor is working on bigger films. He is shooting for Atlee’s film and it releases in 2027. The actor while shooting for the film in Mumbai is working on new […] The post Exclusive: Allu Arjun lining up the Biggest Films appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 8:54 am

బిగ్ బ్రేకింగ్ –ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం..

బిగ్ బ్రేకింగ్ – ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం.. పార్వతీపురం మన్యం జిల్లాలో

ప్రభ న్యూస్ 6 Nov 2025 8:47 am

TDP : నేడు చంద్రబాబుకు తిరువూరు పై నివేదిక

తిరువూరు వివాదంపై నేడు క్రమశిక్షణ కమిటీ చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనుంది

తెలుగు పోస్ట్ 6 Nov 2025 8:45 am

మూసీకి వ‌ర‌ద‌

ఇన్ ఫ్లో 5000 అవుట్ ఫ్లో 3900 క్యూసెక్కులుసూర్యాపేట ఆంధ్రప్రభ : మూసీ

ప్రభ న్యూస్ 6 Nov 2025 8:42 am

ప్రజాస్వామ్యం కోసం ఓటు వేయండి –తేజస్వి

ప్రజాస్వామ్యం కోసం ఓటు వేయండి – తేజస్వి బీహార్ లో ఈరోజు తొలి

ప్రభ న్యూస్ 6 Nov 2025 8:35 am

విశాఖలో స్పా ముసుగులో వ్యభిచారం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నంలో స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతోంది. విఐపి రోడ్డులోని ఆర్చిడ్ స్పా సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ రైడ్ చేసింది. త్రి టౌన్ పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తొమ్మిది మంది అమ్మాయిలను స్పాలో టాస్క్ ఫోర్స్ గుర్తించింది. సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకోవడంతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిర్వహకులు స్పా ముసుగులో వ్యభిచారం చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

మన తెలంగాణ 6 Nov 2025 8:35 am

Singer Chinmayi turns against Social Media Abuse

Singer Chinmayi Sripaada is active on X and she expresses her views. She was trolled, targeted and appreciated for her stand. The singer was targeted on X and she was quick to take the issue to the notice of Hyderabad Commissioner VC Sajjanar. The top cop was quick to respond. It all started after Chinmayi’s […] The post Singer Chinmayi turns against Social Media Abuse appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 8:34 am

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో శ్రీవిష్ణు కొత్తం చిత్రం

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్... శ్రీవిష్ణు కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.39 ని అధికారికంగా ప్రకటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ సంజయ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ’అనగనగా’తో ఓటీటీలో అరంగేట్రం చేసి ప్రేక్షకుల మెప్పు పొందిన దర్శకుడు సన్నీ సంజయ్, మరో గొప్ప కథతో రాబోతున్నారు. సున్నితమైన భావోద్వేగాలతో నిండిన, రోజువారీ జీవితాన్ని నిర్వచించే నిశ్శబ్ద సంఘర్షణలు, ఆశలు మరియు సంతృప్తిలను అన్వేషించే కథతో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకోబోతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుంది.

మన తెలంగాణ 6 Nov 2025 8:30 am

ఎపిలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్లతో భారీ అక్రమాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండోరోజు ఎసిబి సోదాలు చేపట్టింది. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎసిబి అధికారుల తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్‌లో ప్రైవేట్‌ వ్యక్తుల పాత్ర ఉన్నట్టు గుర్తించారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాత్రి పది గంటల వరకు ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ద్వారా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఎసిబి అడిషిన‌ల్ ఎస్ పి వెల్లడించారు. నిషేధిత భూములు రిజిస్ట్రేషన్లు మూడు నాలుగు చోట్ల జరిగిందిన్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతోందని, తిరుపతి శ్రీనివాసపురం నిషేధిత భూములు సర్వే 242 లో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్ లు జరిగినట్లు గుర్తించామని వివరించారు. లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నామని ఎసిబి వివరించింది. 

మన తెలంగాణ 6 Nov 2025 8:23 am

Andhra Pradesh : నేడు రామచంద్రాపురం నియోజకవర్గం బంద్

రామచంద్రాపురం నియోజకవర్గం నేడు బంద్ కు జేఏసీ పిలుపు నిచ్చింది

తెలుగు పోస్ట్ 6 Nov 2025 8:22 am

YSRCP : నేడు వైసీపీ కీలక సమావేశం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో సమావేశం కానున్నారు.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 8:11 am

Bigg Boss Telugu 9: Are the “Fire Storms” Losing Their Spark?

In the current week, Sai finds himself in the danger zone and the once-hyped wild card entries, popularly branded as “Fire Storms,” appear to be losing momentum. When six wild card contestants entered the house mid-season, expectations were sky-high. But weeks later, only a couple remain with any strong impact, prompting viewers to wonder whether […] The post Bigg Boss Telugu 9: Are the “Fire Storms” Losing Their Spark? appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 8:04 am

Bigg Boss Telugu 9: Milk Chaos, Wrong Guesses and a Spooky Immunity Task

The episode opened with confusion and chaos in the Bigg Boss house as housemates woke up to a bizarre situation in the kitchen. The milk packets had mysteriously disappeared overnight, setting off a chain of suspicion, arguments and laughter. Milk Chaos Creates Panic As revealed earlier, Suman and Divya successfully completed a secret task where […] The post Bigg Boss Telugu 9: Milk Chaos, Wrong Guesses and a Spooky Immunity Task appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 8:00 am

బీహార్ ప్రజలకు పొంగులేటి పిలుపు..

బీహార్ ప్రజలకు పొంగులేటి పిలుపు.. రెండు దశాబ్దాల పాటు అవినితి అక్రమాలు, అవకాశవాద

ప్రభ న్యూస్ 6 Nov 2025 7:55 am

Chandrababu : నేడు అమరావతికి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి చేరుకోనున్నారు.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 7:54 am

Jemima Rodrigues : జెమిమా రోడ్రిగ్స్.. ఈ పేరు వింటే చాలదూ.. ఇలాంటి అమ్మాయి మనఇంట్లో ఉండాలని ఎవరు కోరుకోరు?

జెమిమా రోడ్రిగ్స్ పేరు మహిళల వరల్డ్ కప్ తర్వాత ప్రపంచం అంతటా మారుమోగిపోతుంది.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 7:44 am

బీహార్‌లో తొలివిడత ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

పాట్నా: బీహార్‌లో తొలివిడత ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోసి, మగధ్‌, మిధిలాంచల్‌ ప్రాంతాలకు చెందిన మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాలలో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడత ఎన్నికలలో 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నవంబర్‌ 14న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. డ్రోన్లు, సీసీకెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహణ జరుగుతోంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ జరుగుతోంది.   121అసెంబ్లీ నియోజకవర్గాలలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీల కలయిక అయిన మహాఘట్‌బంధన్ మొత్తం 121 స్థానాలకు 63 గెల్చుకుని తిరుగులేదన్పించుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి గా సాగుతోన్న పోరులో జయాపజయాలు ఇండియా కూటమి ఉనికికి , బలోపేతానికి అగ్నిపరీక్ష కానున్నాయి. ఈ ప్రాంతంలో ఇంతకు ముందు బిజెపి, జెడియుల ఎన్‌డిఎ 55 స్థానాల్లో గెలిచింది. ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రచార సభలలో ప్రధాని మోడీ తన వెంట జెడియు నేత లలన్ సింగ్ ఉండగా బీహారీల ఓట్ల కోసం అభ్యర్థించారు. నితీశ్‌కుమార్ ఎక్కువగా సభలకు రాలేదు. దీని ప్రభావం ఏమిటనేది ఈ విడత పోలింగ్‌తో తెలుస్తుంది. ఇండియా కూటమి తరఫున స్థానిక ప్రజలను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇమేజ్ కీలకం కానుంది. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటు చోరీ నిరసన యాత్ర సాగించడం, జాలర్లతో కలిసి ఈత కొట్టడం, ఇతర ప్రజాకర్షక పద్థతులకు దిగడం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఓటు ఫలం ఎటు అనేది తేలాల్సి ఉంటుంది. అయితే ప్రచార దశలో ఆయన ఎక్కువగా పాల్గొనలేదు. కొంత కాలం అమెరికా ఇతర దేశాల పర్యటనలోనే గడిపారు. రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ కూడా ఈ సారి రంగంలోకి దిగింది. ఆయన పోటీ చేయడం లేదు. అయితే తమ పార్టీ ఈ ఎన్నికలలో గణనీయ శక్తి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి పోలింగ్‌లో తేజస్వీ యాదవ్ , సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సామ్రాట్ చౌదరి, గాయకులు మైధిలీ ఠాకూర్ వంటి వారు ప్రముఖులుగా ఉన్నారు. ఇండియా కూటమి తరఫు సిఎం అభ్యర్థి తేజస్వీ రఘోపూర్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పాట్నా సాహిబూ, బెగూసరాయ్. ఛాప్రా వంటి స్థానాలు ప్రధాన పోటీ కేంద్రాలు అయ్యాయి.

మన తెలంగాణ 6 Nov 2025 7:42 am

India vs Australia : నేడు భారత్ - ఆస్ట్రేలియా నాలుగో టీ20

భారత్ - ఆస్ట్రేలియా మధ్య నేడు నాలుగో టీ20 జరగనుంది. గోల్డ్ కోస్ట్ వేదికగా మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది

తెలుగు పోస్ట్ 6 Nov 2025 7:35 am

Bihar : బీహార్ లో నేడు తొలి విడత ఎన్నికలు

నేడు బీహార్ తొలి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 7:25 am

బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ మూవీ.. ‘జటాధర’

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అర్ణు అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు వినుంటాం. ‘బ్యాంకులు లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి ఒక బంధనం వేసి దానికి ఒక పిశాచి కాపలాగా ఉంటుంది’ అని ప్రచారంలో ఒక కథ ఉండేది. ఈ కథకు అలాంటి ఒక జానపదం ఆధారం. అలాంటి కథని ఈ కాలంలోకి వచ్చి తీసుకొచ్చి చాలా ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో -దెయ్యం, కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, శివుడు గురించి కథలు... ఇలా చాలా లేయర్స్ వున్నాయి. అరుణాచల ప్రస్తావన కూడా వుంది. యాక్షన్, ఫ్యామిలీ, మైథలాజి... అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా ఇది. -ఈ సినిమాలో ఘోస్ట్ హంటర్‌గా కనిపిస్తా. అయితే తనకి దెయ్యాలు ఉన్నాయంటే నమ్మకం వుండదు. దేవునిపై నమ్మకం వుంటుంది. సైన్స్ ని నమ్ముతాను. అలా ఎందుకనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా వుంటుంది. బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ సినిమా ఇది. సోనాక్షి చాలా అద్భుతమైన నటి. సినిమాలో ధనపిశాచి పాత్రలో తన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. -శిల్పా శిరోద్కర్ శోభ అనే పాత్రలో కనిపిస్తారు. అద్భుతంగా నటించారు. ఇక నెక్స్ రాహుల్ రవీంద్రన్ తో ఒక సినిమా వుంది. ఇప్పుటి వరకు అలాంటి కాన్సెప్ట్ వరల్డ్ సినిమాల్లో రాలేదు. కాన్సెప్ట్ పరంగా అది ఒక బాహుబలి లాంటి సినిమా. అలాగే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయాలి” అని అన్నారు.

మన తెలంగాణ 6 Nov 2025 7:20 am

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు..

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు.. ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:57 am

నేడు బీహార్ లో పోలింగ్..

నేడు బీహార్ లో పోలింగ్.. బీహార్ లో ఈరోజు తొలి విడతగా 121

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:41 am

నేడు బీహార్ తొలి దశ పోలింగ్

ఈసారి 121 స్థానాలలో ఓటు ఎన్‌డిఎ, ఇండియా కూటమి హోరాహోరీ గంగా దక్షిణ ప్రాంతపు 18 జిల్లాల్లో బ్యాలెట్ సిఎం అభ్యర్థి తేజస్వీకి కీలక పరీక్ష పాట్నా: ఎన్‌డిఎ, ఇండియా కూటమి మహాఘట్‌బంధన్ నడుమ తీవ్ర ఉత్కంఠతను రేపే బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నేడు ( గురువారం) జరుగుతుంది. ఈ తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలలో అర్హులైన ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కు వినియోగించుకోనున్నారు. ఈ దఫా గంగా దక్షిణ ప్రాంతంలో విస్తరించుకుని ఉండే ఈ పోలింగ్‌లో ఇంతకు ముందటి ఫలితాల క్రమంలో మహాఘట్‌బంధన్‌కు ఆధిక్యత అవకాశం ఉంది. అయితే ఈసారి ఇక్కడ ఎన్‌డిఎ అతిరధ మహారధులు ప్రత్యేకించి మోడీ, అమిత్ షాలు తమ దృష్టిని కేంద్రీకరించారు. దీనితో ఓటు ఫలితం ఎటువైపు అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ పలు రాజకీలక సమీకరణలు, సామాజిక పరిస్థితులు గెలుపోటములను ఖరారు చేస్తాయి. ఈ ప్రాంతంలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీల కలయిక అయిన మహాఘట్‌బంధన్ మొత్తం 121 స్థానాలకు 63 గెల్చుకుని తిరుగులేదన్పించుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి గా సాగుతోన్న పోరులో జయాపజయాలు ఇండియా కూటమి ఉనికికి , బలోపేతానికి అగ్నిపరీక్ష కానున్నాయి. ఈ ప్రాంతంలో ఇంతకు ముందు బిజెపి, జెడియుల ఎన్‌డిఎ 55 స్థానాల్లో గెలిచింది. ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రచార సభలలో ప్రధాని మోడీ తన వెంట జెడియు నేత లలన్ సింగ్ ఉండగా బీహారీల ఓట్ల కోసం అభ్యర్థించారు. నితీశ్‌కుమార్ ఎక్కువగా సభలకు రాలేదు. దీని ప్రభావం ఏమిటనేది ఈ విడత పోలింగ్‌తో తెలుస్తుంది. ఇండియా కూటమి తరఫున స్థానిక ప్రజలను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇమేజ్ కీలకం కానుంది. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటు చోరీ నిరసన యాత్ర సాగించడం, జాలర్లతో కలిసి ఈత కొట్టడం, ఇతర ప్రజాకర్షక పద్థతులకు దిగడం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఓటు ఫలం ఎటు అనేది తేలాల్సి ఉంటుంది. అయితే ప్రచార దశలో ఆయన ఎక్కువగా పాల్గొనలేదు. కొంత కాలం అమెరికా ఇతర దేశాల పర్యటనలోనే గడిపారు. రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ కూడా ఈ సారి రంగంలోకి దిగింది. ఆయన పోటీ చేయడం లేదు. అయితే తమ పార్టీ ఈ ఎన్నికలలో గణనీయ శక్తి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో హైదరాబాద్ ఎంపి , మజ్లిస్ నేత అసదుద్దిన్ తమ పార్టీ తరఫున అభ్యర్థులను దింపారు. ఇవి ఇండియా కూటమి ఓట్లను చీలుస్తాయనే ఆందోళన సంబంధిత పార్టీల నేతలలో ఉంది. ఈసారి పోలింగ్‌లో నితీశ్ కుమార్ కేబినెట్‌లోని 16 మంది మంత్రుల భవితవ్యం తేలాల్సి ఉంది. ప్రత్యేకించి రాఘోపూర్,మహూవా , ఛాప్రాల్లో పోటీ నువ్వానేనాగా ఉంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలలో ఇప్పుడు జరిగే తొలి విడత పోలింగ్ 18 జిల్లాలకు విస్తరించుకుని ఉంది. ఈసారి పోలింగ్‌లో తేజస్వీ యాదవ్ , సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సామ్రాట్ చౌదరి, గాయకులు మైధిలీ ఠాకూర్ వంటి వారు ప్రముఖులుగా ఉన్నారు. ఇండియా కూటమి తరఫు సిఎం అభ్యర్థి తేజస్వీ రఘోపూర్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పాట్నా సాహిబూ, బెగూసరాయ్. ఛాప్రా వంటి స్థానాలు ప్రధాన పోటీ కేంద్రాలు అయ్యాయి. 

మన తెలంగాణ 6 Nov 2025 6:30 am

కాంగ్రెస్ ను ముట్టుకుంటే.. తెలుస్తుంది –భట్టి

కాంగ్రెస్ ను ముట్టుకుంటే.. తెలుస్తుంది – భట్టి కాంగ్రెస్ అంటే.. కరెంట్, కరెంట్

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:28 am

పేదరిక నిర్మూలనలో కేరళ ఆదర్శం

సామాజిక, మానవ అభివృద్ధిలో రికార్డు సాధిస్తున్న ‘దేవభూమి’ కేరళ, తీవ్రమైన పేదరికం నుంచి విముక్తి పొందినట్టు 69వ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబరు 1న రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించడం దేశానికే ఆదర్శాన్ని చాటుతోంది. తమ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు రూ. 1000 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఇదే సాఫల్యమైన కేరళ అసలు స్టోరీగా అభివర్ణించారు. అనేక రంగాల్లో కేరళ అభివృద్ధి సాధించడం ద్వారా ‘కేరళ మోడల్’ అన్న పేరు బాగా ప్రసిద్ధి చెందిందన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. పినరయి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మదాం నియోజకవర్గం ఇప్పటికే దేశం లో, పేదరిక రహిత నియోజకవర్గంగా ప్రకటించబడడం గమనార్హం. పేదరిక కుటుంబాలను గుర్తించడంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. వివిధ ఏజెన్సీల సహకారంతో ప్రణాళిక రూపొందించింది. స్థానిక స్వపరిపాలన శాఖ నేతృత్వంలో సామాజిక భాగస్వామ్యానికి ప్రణాళికలో చోటు కల్పించింది. 2021 మేలో రాష్ట్ర ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అత్యంత పేదరిక నిర్మూలన కార్యక్రమం (ఎక్స్‌ట్రీమ్ పోవెర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఇపిఇపి) ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు ఇటీవల సవరించిన అంతర్జాతీయ దారిద్య్రరేఖ ప్రకారం రోజుకు మూడు అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో జీవించే వ్యక్తులను తీవ్ర పేదరికంతో ఉన్నట్టు పరిగణిస్తారు. ఈ లెక్కన కేరళ ప్రభుత్వం ప్రజా కేంద్రీకృత అభివృద్ధి, వికేంద్రీకృత ప్రణాళికతో పేదరికాన్ని తగ్గించగలిగింది. 1973 74లో 59.8% వరకు ఉన్న పేదరికం 201112 నాటికి 11.3 శాతానికి తగ్గింది. నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవెర్టీ ఇండెక్స్ 2023లో దేశం మొత్తం మీద అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా సూచించింది. కేరళ జనాభాలో కేవలం 0.55 శాతం మంది మాత్రమే బహుముఖ పేదరికంలో ఉన్నారని స్పష్టం చేసింది. ఇది జాతీయ తలసరి పేదరికం 14.96% కన్నా చాలా తక్కువ. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలను గుర్తించడంలో పూర్తిగా స్వీయ నమోదుపై ఆధారపడకుండా ప్రత్యేకంగా దాదాపు 4 లక్షల ఎన్యూమరేటర్లను నియమించింది. వీరికి స్థానిక పాలనా సంస్థలతోపాటు కుడుంబశ్రీ వర్కర్ల సహాయం కూడా అందించింది. అనేక స్థాయిల్లో మధింపు జరిగిన తరువాత 64,006 అతి పేద కుటుంబాలకు చెందిన 1,03,099 మంది పేదలను గుర్తించింది. వీరిలో చాలా మందికి కనీస ధ్రువీకరణ పత్రాలు లేవు. నాలుగు అంశాల ఆధారంగా వీరి పేదరికాన్ని గుర్తించారు. వారు తింటున్న ఆహారం, ఆరోగ్య ప్రమాణాలు, ఉండడానికి ఇల్లు ఉందా లేదా, వారి చదువు తదితర వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కుటుంబాల్లో చాలా మందికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా లేవు. 21,263 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ అందేలా చేశారు. 4000 కుటుంబాలకు 5422 ఇళ్లు కట్టించి ఇచ్చారు. మరో 5522 ఇళ్లను తిరిగి నిర్మించారు. 1500 కుటుంబాలకు సాగుభూమి అందించారు. శిథిల స్థితిలో ఉన్న ఇళ్లల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ. 2 లక్షల వంతున సహాయం అందించారు. పేదరికం నుంచి ఒకసారి విముక్తి కల్పించడమంటే అన్ని సమస్యలు వారికి వెంటనే పరిష్కారమైనట్టు కాదు. పేదరికాన్ని ఎదుర్కోవడం ఎప్పటికీ అంతం కాని పని. రాష్ట్రప్రభుత్వం తీవ్ర పేదరిక నిర్మూలన ఆదర్శనీయమైన పద్ధతిలో కొనసాగించడంలో అసలు ఉద్దేశం కటిక పేదరికం మళ్లీ ఏర్పడకూడదని, కొత్తగా ఏ కుటుంబం పేదరికంలో పడకూడదని.. పేదరికం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికే ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్య, ఆరోగ్య రంగాల్లోనూ స్థానిక ప్రభుత్వాలు గట్టిగా కృషి చేస్తున్నాయి. 2025 నాటికి కేరళలో అక్షరాస్యత 96 శాతం చేరుకుంది. ఆరోగ్య భద్రత విషయాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో 5415 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మహిళల ప్రసూతి సమయంలో శిశుమరణాల సంఖ్య జాతీయ స్థాయిలో ప్రతివెయ్యి కాన్పులకి 28 వరకు ఉండగా, కేరళలో వెయ్యి కాన్పులకు 5 మాత్రమే ఉండటం గమనార్హం. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో భారీ పరిశ్రమలు అంటూ లేవు. అయినా మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి సూచికల్లో అగ్రగామిగానే కేరళ ఉంటోంది. పేదరిక నిర్మూలన నిరంతర కార్యక్రమమని, 2026 మార్చి నాటికి పేదరికం 0.002 శాతానికి చేరేలా ప్రయత్నిస్తామని రాష్ట్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. అయితే కేరళ నమూనాను విమర్శించేవారు కూడా ఉన్నారు. అభివృద్ధి విషయంలో స్తబ్ధత నెలకొందని, నిరుద్యోగం పెరుగుతోందని ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు సాక్షాలన్న విమర్శలు వస్తున్నాయి. పేదరిక నిర్మూలన గణాంకాలు ఉత్త బోగస్ అని కాంగ్రెస్ నేతృత్వం లోని విపక్షం ఆక్షేపిస్తోంది. ఈ విమర్శలను సవాలుగా తీసుకొని ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను, సాంకేతిక హరిత ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. నిరుద్యోగాన్ని తొలగించడానికి విద్యావంతులకు నైపుణ్యాభివృద్ధిని చేపట్టింది. దేనికీ రాజీపడని ప్రగతిశీల పరిపాలన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ రెండిటినీ సమతుల్యం చేసుకోగలదని ‘ఇపిఇపి’ నిరూపిస్తోంది. సమాజం నడిపించే ఈ నమూనా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేరళ స్టోరీ దేశం మొత్తంమీద ఆదర్శవంతమే కాక, విస్తృతంగా అనుసరించేలా ప్రచారం చేయదగిందనే చెప్పవచ్చు.  

మన తెలంగాణ 6 Nov 2025 6:20 am

నేడు భారత్, ఆస్ట్రేలియా నాలుగో టి20.. ఇరు జట్లకు కీలకం

క్వీన్స్‌లాండ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం క్వీన్స్‌లాండ్ వేదికగా కీలకమైన నాలుగో టి20 మ్యాచ్ జరుగనుంది. తొలి టి20 వర్షార్పణం అయ్యింది. రెండో పోటీలో ఆస్ట్రేలియా, మూడో టి20లో టీమిండియా జయకేతనం ఎగుర వేశాయి. దీంతో ప్రస్తుతం సిరీస్ 11తో సమంగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళుతోంది. ఇలాంటి స్థితిలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. కిందటి టి20లో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియా ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులో గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆతిథ్య టీమ్ ఆస్ట్రేలియా కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇరు జట్లలోనూప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు రెండు జట్లలోనూ ఉన్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఓపెనర్లే కీలకం.. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు కీలకంగా మారారు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. వన్డే సిరీస్‌తో పాటు ఇప్పటి వరకు ఆడిన రెండు టి20 మ్యాచుల్లోనూ గిల్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. గిల్ వరుస వైఫల్యాలు జట్టును కలవరానికి గురి చేస్తోంది. అభిషేక్ రెండో టి20లో అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. మూడో టి20లో బాగానే ఆడినా భారీ స్కోరును అందుకోలేక పోయాడు. ఈసారి మాత్రం ఆ లోటును తీర్చుకోవాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో వాషింగ్టన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయం సాధించి పెట్టాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. జితేశ్ కూడా బ్యాట్‌ను ఝులిపించేందుకు సిద్ధమయ్యాడు. తిలక్‌వర్మ, సూర్యకుమార్‌లు కూడా తమవంతు పాత్ర పోషిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్ తదితరులతో భారత బౌలింగ్ కూడా బలంగానే ఉంది. రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గెలుపే లక్షంగా.. మరోవైపు కిందటి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా ఎలాగైనా భారత్‌ను ఓడించాలనే లక్షంతో కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుకు సాగాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా సమతూకంగా ఉంది. కానీ కీలక ఆటగాళ్ల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. మూడో టి20లో టిమ్ డేవిడ్, స్టోయినిస్, మాథ్యూ షార్ట్ తప్ప మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో మాత్రం కీలక ఆటగాళ్లు బ్యాట్‌ను ఝులిపించాలనే కసితో ఉన్నారు. హెడ్, మార్ష్, ఇంగ్లిస్, డేవిడ్, ఓవెన్, స్టోయినిస్, షార్ట్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆస్ట్రేలియాతో పోరు భారత్ అంత తేలికేం కాదనే చెప్పాలి.

మన తెలంగాణ 6 Nov 2025 6:20 am

ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు..

ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు.. భద్రతా ప్రమాణాల పరిశీలన పాటించకపోతే కఠిన

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:02 am

మనోళ్ల చేతిలో ట్రంప్ ఢమాల్

న్యూయార్క్ : అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు ఎదురు దెబ్బ తిన్నారు. షాక్ కు గురయ్యారు. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు ముస్లిం డెమోక్రాట్లు జోహ్రాన్ మమ్దానీ, అఫ్తాబ్ పురేవాల్, గజాలా హష్మి ఆయనకు తొలి రాజకీయ ఓటమిని చవిచూపారు. రాజకీయ కాక పుట్టించి, న్యూయార్క్ నగరం, సిన్సినాటి, వర్జీనియాలో అధికవోట్లను అగ్రశ్రేణి డెమోక్రాట్లు - జోహ్రాన్ మమ్దానీ, అఫ్తాబ్ పురేవాల్, గజాలా హష్మి గెలుచుకున్నారు. న్యూయార్క్ నగర మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ భారతీయ - అమెరికన్ తల్లి మీరా నాయర్ దంపతుల బిడ్డ. కాగా వర్జీనియా లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నికైన గజాలా హష్మీ భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలోని మలకపేట కు చెందిన వారు కావడం విశేషం. ఇక అఫ్తాబ్ పురేవాల్ తండ్రి పంజాబీ, తల్లి టిబెటన్ కు చెందిన వారు. జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ భారతీయ ప్రముఖ చిత్ర నిర్మాత, అతని తండ్రి మహ్మద్ మమ్దానీ పూర్వీకులు గుజరాత్ కు చెందిన వారే. మహ్మద్ మమ్దానీ ప్రముఖ రచయిత, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్. న్యూయార్క్ నగర మేయర్ గా ఎన్నికైన తొలి ముస్లిం గా, భారతీయ సంతతి వ్యక్తిగా జోహ్రాన్ కొత్త రికార్డు సృష్టించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలతో సహా పలు ఎన్నికల్లో డెమోక్రాట్స్ కు వరుసగా ఓటమి ఎదుర్కొంటున్న సమయంలో ఈ విజయాలు కొత్త జీవం పోశాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఎన్నికల రేస్ లో వ్యక్తిగతంగా లేకపోయినా, ఆయన ప్రభావం, నిర్ణయాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. న్యూయార్క్ లో జహ్రానీ మమ్దానీ చేతిలో ఓడిపోయిన ఇండి పెండెంట్ అభ్యర్థి ఆండ్రూ క్యూమోను ప్రెసిడెంట్ ట్రంప్ సమర్థించారు. ఆయన న్యూయార్క్ మాజీ గవర్నర్ కూడా. ఒక దశలో ట్రంప్ మమ్దానీ మేయర్ గా గెలిస్తే, ఫెడరల్ నిధులను నిలిపివేస్తామని బెదిరించారు కూడా. ఇక వర్జీనియాలో 61 ఏళ్ల గజాలా హష్మి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికల్లో గెలిచి మరో చరిత్ర సృష్టించారు. ఆ పదవికి ఎన్నికైన భారతీయ -అమెరికన్, మొదటి ముస్లిం మహిళ కూడా. హష్మి రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ రీడ్ పై విజయం సాధించారు. సిన్సినాటి మేయర్ గా ఎన్నికైన అఫ్తాబ్ పూరేవాలా ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి కోరీ బౌమాన్ ను ఓడించి రెండోసారి ఆ పదవి చేపట్టారు. కోరీ బౌమాన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ సవతి సోదరుడు. ట్రంప్ సన్నిహితుడు. ఈ ఎన్నికలు ట్రంప్ పనితీరు పట్ల మెజారిటీ ఓటర్ల అసంతృప్తికి అద్దం పడుతున్నాయి. వర్జీనియా తో సహా చాలా స్టేట్ లలో సగం కంటే ఎక్కువమంది ఓటర్లు తమ ఓటుతో ట్రంబ్ కు ఘాటైన మెసేజ్ పంపారని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు, సుంకాలు వలస విధానాలను ఓటర్లు తిరస్కరిస్తున్నట్లు కన్పిస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతీయ మూలాలు ఉన్న ముగ్గురు ముస్లిం అభ్యర్థులు ముఖ్యంగా డెమోక్రాట్లు రిపబ్లికన్ పార్టీ జోరుకు బ్రేక్ వేశారు. ఇది 2026 మధ్యంతర, 2028 ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఆధిక్యానికి ఏ విధంగా దెబ్బకొడుతుందో చూడాలి.. జోహ్రాన్ మమ్దానీ జనవరి 1న న్యూయార్క్ మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్న జోహ్రాన్ మమ్దానీ తల్లిదండ్రులు భారతదేశంలో మూలాలు కలిగిన వారు. మమ్దానీ ఉగాండాలోని కంపాలా లో జన్మించారు.ఆయన బాల్యం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో సాగినా, 7 ఏళ్ల వయస్సులో న్యూయార్క్ నగరానికి చేరారు. కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు 2018 లో అమెరికన్ పౌరసత్వం పొందారు. మమ్దానీ భార్య రామా దువాజీ సిరియన్ - అమెరికన్ కళాకారిణి, ఈ ఏడాదే వారి వివాహం జరిగింది. న్యూయార్క్ లోని క్వీన్స్ లో కలిసి ఉంటున్నారు. 34 ఏళ్ల మమ్దానీ స్టేట్ అసెంబ్లీ సభ్యుడు డెమోక్రటిక్ సోషలిస్ట్. జూన్ లో డెమోక్రటిక్ ప్రైమరీలో ఆండ్రూ క్యూమోను ఓడించారు. గజాలా హష్మీ హైదరాబాదీయే గజాలా హష్మీ 1964లో హైదరాబాద్‌లో జన్మించారు. బాల్యంలో పాతబస్తీ ప్రాంతంలోని మలక్‌పేటలో తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు. నాలుగేళ్ల వయసులోనే తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా హష్మీ అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆమె తండ్రి ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేసేవారు. చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్‌షిప్పులు, ప్రోత్సాహకాలు అందుకున్న గజాలా, జార్జియా సదరన్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ కోర్సు చదివారు. గజాలా హష్మి వర్జీనియాకు తొలి ఇండియన్ - అమెరికన్, ముస్లిం లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఆమె రిచ్మండ్ కు చెందిన రిపబ్లికన్ జాన్ రీడ్ ను ఓడించారు. హష్మి ప్రస్తుతం స్టేట్ సెనెటర్. సౌత్ రిచ్మండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఓడించి వర్జీనియా రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. హష్మి 4 ఏళ్ల వయస్సులో తన కుటుంబంతో సహా భారతదేశం నుంచి అమెరికాకు చేరారు. ఆమె జార్జియా సదరన్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ బిఏ, ఎమోరీ యూనివర్సిటీ నుంచి పిహెచ్ డి పట్టా పొందారు. అఫ్తాబ్ పురేవాల్ భారతీయ సంతతికి చెందిన సిన్సినాటి మేయర్ అఫ్తాబ్ పురేవాల్ (43) గతంలో 2021లో నగరానికి తొలిసారి ఆసియా - అమెరికన్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు రెండో సారి మేయర్ గా ఎన్నికయ్యారు. పురేవాల్ తల్లిదండ్రులు ఒహియోకు వలస వచ్చిన వారు. ఆయన తండ్రి పంజాబ్ కు చెందిన వారు. పురేవాల్ కు చిన్ననాటి నుంచి రాజకీయాలంటే మక్కువ . విద్యార్థి దశలోనే నాయకుడిగా ఎదిగారు. సిన్సినాటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి పట్టాపొందిన పురేవాల్ 2008 లో వాషింగ్టన్ డిసి కి చేరుకుని అక్కడ ఓలా సంస్థలో పనిచేశారు. తర్వాత అమెరికా న్యాయశాఖలో అటార్ని ప్రత్యేక అసిస్టెంట్ గా పని చేశారు. 2016లో రాజకీయ కెరీర్ ప్రారంభించారు. మాజీ ప్రెసిడెంట్ ఒబామా శుభాకాంక్షలు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా డెమోక్రటిక్ విజేతలకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. వారి విజయం భవిష్యత్ లో డెమోక్రటిక్ పార్టీ విజయాలకు నాంది కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హష్మీకి సీఎం రేవంత్, కెటిఆర్ అభినందనలు  వర్జీనియా గవర్నర్‌గా హైదరాబాదీ గజాలా హష్మీ - ఎన్నిక కావడం పట్ల సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ఆమె తొలి ముస్లిం మహిళగా రికార్డు పొందారని, అమెరికాలో గవర్నర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా హష్మీ రికార్డు సొంతం చేసుకున్నారని చెప్పారు. - అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు నేతలు సత్తా చాటారని, అందులో భాగంగా వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమోక్రాట్ నాయకురాలు గజాలా హష్మీ ఘన విజయం సాధించారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు పేర్కొన్నారు. 

మన తెలంగాణ 6 Nov 2025 6:00 am

వలసలపై అమెరికన్ల గురివింద నీతి

వలసలపై అమెరికాలో ఇప్పుడు కొనసాగుతున్న వ్యతిరేకత చాలా చిత్రమైనది. నిజానికి వలసలపై వారి వైఖరి, ధోరణిపై అర్థమే లేదు. అమెరికన్లు అంతా ఇలాగే లేరు కాని, ప్రస్తుతం ఈ ధోరణిదే ఆధిపత్యం. వలసలపై మాట్లాడే చర్చించే నైతిక అర్హతలు ప్రస్తుతం అమెరికన్లుగా చలామణి అవుతున్న వారికి కనీస మాత్రంగా కూడా లేవు. చదువు, బతుకు దెరువు కోసం ఇతర దేశాలనుంచి అమెరికాకు వలస వచ్చిన విద్యార్థులు, యువతపై తీవ్రమైన వ్యతిరేకత, కోపం, ద్వేషం వ్యక్తం కావడం చాలా చిత్రమైన సంగతి. ఆశ్చర్యకరంగా ఇప్పుడు అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దొరవారు ఈ నినాదంపైనే గద్దెనెక్కారు. ఆయనతో సహా వలసలను వ్యతిరేకిస్తున్న వాళ్లు తన మూలాలు ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే వారి నోరు పెగిలే అవకాశం ఏమాత్రం లేదు. గొంతులో పచ్చి వెలక్కాయ పడిపోయి ఒక్కరికి కూడా మాటపెగలదు. 90 శాతానికి పైగా ప్రస్తుత అమెరికన్ పౌరుల మూలాలు అమెరికా భూభాగం వెలుపలివే. వీరెవ్వరు కూడా అమెరికా భూమి పుత్రులు ఎంత మాత్రంకారు. ఎక్కువగా యూరోపియన్ దేశాలకు చెందిన వీళ్ళ తాతలు, ముత్తాతలు ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి యూరప్ దేశాలకు చెందిన వారు. దాదాపుగా వీళ్లంతా తెల్లతోలు కలిగిన ప్రజలే. ఆఫ్రికా నుంచి వచ్చిన నల్లతోలు ప్రజలు వారంతట వారుగా అమెరికాకు వచ్చిన వారు కాదు. బలవంతంగా తీసుకు రాబడిన వారే ఇప్పటి అమెరికన్ నల్లజాతీయులు. యూరప్ నుంచి అమెరికాకు వలస వచ్చిన తెల్లతోలు యూరోపియన్లు తమ వ్యక్తిగత సేవలు, ఆక్రమించిన వ్యవసాయ భూముల్లో వెట్టి కూలీలుగా పని చేయడానికి ఆఫ్రికా నుంచి బలవంతంగా బానిసలుగా తరలించబడిన వారే నల్లజాతీయులు. అసలైన భూమి పుత్రులు, నిజమైన అమెరికన్లు కేవలం రెడ్ ఇండియన్ల మాత్రమే. స్థానికులు, భూమి పుత్రులు అయిన ఈ రెడ్ ఇండియన్లు ఇప్పుడు అమెరికాలో కడు దయనీయ జీవితాలను వెళ్ల బుచ్చుతున్నారు. కేవలం కూలీలుగా, నాల్గవ తరగతి ఉద్యోగులుగా మాత్రమే వీళ్లు బతుకులను వెళ్లదీస్తున్నారు. వారి భూములు, అడవులను ఆక్రమించిన తెల్లతోలు యూరోపియన్లు మాత్రం ఆధిపత్యం చేస్తూ అమెరికన్లుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు అమెరికన్లుగా చలామణి అవుతున్న వారిలో 90 శాతం వాళ్లే. ఇలాంటి వారికి ప్రస్తుత వలసలను ప్రశ్నించే నైతిక అర్హత ఎలా ఉంటుంది? ఒక్కమాటలో చెప్పాలంటే వారిది గురివింద తన కింది నలుపును కనపడనీయకుండా దాచుకొని నేను ఎర్రని దాన్ని, అందమైన దాన్ని అని విర్రవీగే గురివింద నీతి మాత్రమే అవుతుంది. అలాంటి వలస మూలాలున్న తెల్లతోలు అమెరికన్లు ఇప్పుడు చదువు కోసం, ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులు, యువతపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. వారి ఉపాధికి అడ్డుపడుతున్నారు. భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఆ ధోరణిని రాజకీయ అస్త్రంగా మార్చుకున్న రిపబ్లికన్ పార్టీ నిన్నటి ఎన్నికల్లో ఏకంగా గద్దెనే స్వాధీనం చేసుకోగలిగింది. దీంతో ఇటీవల కాలంలో ఆ నేల వెలుపలి నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. నిజానికి అమెరికాలో ఉపాధి పొందగలుగు తున్నది అత్యంత ప్రతిభావంతులైన యువత మాత్రమే. స్థానిక అమెరికన్లు ఇతర దేశాల యువత ప్రతిభతో పోటీ పడలేని ఫలితంగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతున్నారనేది సత్యం. స్వయం కృషి, ప్రతిభలతో మాత్రమే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందే విదేశీ విద్యార్థులపై ఇలాంటి ధోరణి వ్యక్తం కావడం న్యాయమైతే కాదు. వ్యక్తమవుతున్న వలస వ్యతిరేక ధోరణి కారణంగా అమెరికా వెలుపల ఉన్న వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎంతో మానసిక క్షోభకు లోనవుతున్నారు. అమెరికా వెళ్లడం చదువుకోవడం, ఉపాధి సంపాదించడం అంత సులభమైన పని ఏమీకాదు. ఎంతో ప్రయాసతో కూడుకున్నది. డబ్బుతో ముడిపడింది. అత్యంత ప్రతిభావంతులు మాత్రమే అక్కడికి వెళ్లడానికి అర్హులు. తమ తమ దేశాల్లో మంచి ర్యాంకులతో రాణించి, అవసరమైన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తరువాత మాత్రమే అమెరికాకు వెళ్లే అనుమతి పత్రమైన వీసాను పొందగలుగుతారు. అంతేకాదు, ప్రతిభ మాత్రమే చాలదు. ఒక్కొక్క విద్యార్థి కనీస పక్షంగా రూ. 50 లక్షలు ఖర్చు చేయగలిగేతే తప్ప అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ (ఎమ్‌ఎస్) పొందలేరు. అలా పొందిన డిగ్రీతో అక్కడ ఉపాధి పొంది చదువు కోసం చేసిన రూ. 50 లక్షల అప్పును క్రమంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అప్పు తీరిన తరువాత కొంత మెరుగైన జీవితాన్ని పొందగలుగుతారు. ఇలా అక్కడికి వెళ్లిన ప్రతిభావంతులైన యువత మేధోశ్రమ ఫలితంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. అమెరికన్ యువతలో మేధస్సు, ప్రతిభా సామర్థ్యాలు ఉండి ఉంటే విదేశీ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావు కదా. ఈ వాస్తవాన్ని పక్కన బెట్టి వలస వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టింది అక్కడి తెల్ల తోలు అహంకారం. ఈ ధోరణి తోడుగా అధ్యక్ష దొరవారు చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవన్నీ విదేశీ యువతకు పెద్ద ప్రతిబంధకాలుగా మారిపోయాయి. ఈ వలస వ్యతిరేక ధోరణి ప్రబలిపోయిన ఫలితంగా ఉపాధి అవకాశాలు చాలా వరకు అడుగంటాయి. ట్రంప్ నిర్ణయాల ఫలితంగా ఇప్పుడు అమెరికాలో షట్ డౌన్ (ప్రభుత్వ ఆర్థిక కార్యక్రమాల్లో స్తంభన) నడుస్తున్నది. 35 రోజులుగా షట్ డౌన్ కొనసాగుతున్నది. షట్‌డౌన్ ఫలితంగా ఇప్పటికే ఎన్నో బిలియన్ల డాలర్లను అమెరికా కోల్పోయిందని అమెరికా ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనసాగుతున్న ట్రంప్ మూర్ఖ ధోరణి కారణంగా షట్‌డౌన్ ఇంకెన్నాళ్లు ఉంటుందో తెలియని అనిశ్చితి అమెరికాలో ఇప్పుడున్నది. ఈస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ త్వరలో కుప్పకూలిపోయే ప్రమాదం సైతం ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే ఆయన గద్దెపై కూర్చొని తొమ్మిది నెలలు గడిచిపోయాయి. మరో 40 నెలల పాటు ఆయనకు పాలనా అధికారం ఉంటుం ది. ఆయన తీరు ఇంకా ఇలాగే కొనసాగితే 250 యేళ్ల మేధస్సు, శ్రమల ఫలితంగా నిర్మించబడిన అమెరికా ఆర్థిక వ్యవస్థ పాలిట ట్రంప్ భస్మాసురుడిగా మారిపోతాడని కూడా అంటున్నారు. ఎంఎజిఎ/ మాగా (మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్) నినాదం అర్థం లేనిదై పోవడం ఖాయం అని చెబుతున్నారు. వలస వెళ్లిన చోటు అమెరికా అయినా, యూరప్ దేశాలు అయినా, పెట్రోలియం వనరులు అధికంగా లభించే అరబ్ దేశాల్లోనైనా శ్రమించి నాలుగు డబ్బులు సంపాదించవలసిందే తప్ప మరోమార్గం మాత్రం లేదు. తాను ఉన్న చోట లభించే వేతనం కంటే కొంత మెరుగైన వేతనం, ఇంకొంత మెరుగైన జీవితం లభించే ప్రాంతానికి వలస వెళ్లడానికే ఏ మనిషిఅయినా మొగ్గుచూపుతాడు. దాన్ని తప్పుగా చూడడం, అభ్యంతరం వ్యక్తం చేయడం అనుచితం. మానవ సమాజాలు దేశాలుగా మారిన తరువాత ఏ దేశానికి ఆ దేశం కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, చట్టాలు ఏర్పరచుకున్నాయి. వాటిలో భాగమే వీసాల లాంటి అనుమతి పత్రాలు. అలాంటి అనుమతి పత్రాలను ఒక్కో దేశం ఒక్కో రీతిలో తమ తమ దేశాల అవసరాలకు అనుగుణంగా రూపొందించుకున్నాయి. తమ దేశ ఆర్థిక, సాంకేతిక అవసరాలను తీర్చుకునేందుకు ఇతర దేశాల పౌరులను రప్పించే, ఆకర్షించే అనేక ప్రయత్నాలను చాలా దేశాలు చేశాయి. అలా అనేక దేశాల మేధస్సును విస్తృతంగా ఆకర్షించింది అమెరికా. అలా అనేక దేశాల జాతుల ప్రజల రెండున్నర శతాబ్దాల నిరంతర శ్రమ, కృషి, మేధస్సుల వల్ల మాత్రమే నేటి అమెరికా నిర్మాణం సాధ్యమైంది. ప్రపంచం నలుమూలల నుంచి అనేక దేశాల ప్రజల వలసల శ్రమతో మాత్రమే ఆధునిక అమెరికా నిర్మాణం సాధ్యమైందనేది అందరూ అంగీకరించవలసిన సత్యం. నేటి అమెరికా అనేది ఎంతమాత్రం ఒక ఒకే ఒక్క జాతి సమూహం ఎంతమాత్రం కాదు. భిన్నజాతుల మిశ్రమం అయిన నానా జాతి సమితి లాంటి ఒక సంకరజాతి మానవ సమూహమే నేటి ఆధునిక అమెరికా. అలా అమెరికా ఒక గొప్ప దేశంగా మారిపోయింది.  గోవర్ధన్ గందె 93470 56621

మన తెలంగాణ 6 Nov 2025 5:50 am

అవినీతికి అడ్డుకట్ట సాధ్యమేనా?

భూకబ్జాలు, కమీషన్లు, దౌర్జన్యాలకు పాల్పడే రాజకీయ నాయకులు, నకిలీ, కల్తీసరుకులు అమ్ముతూ, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులు, చేతులు తడపందే ఫైల్ వైపు చూడని ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ మూడు వర్గాలు కూడబలుక్కొని దేశాన్ని పందికొక్కుల్లా మేస్తున్నారు. దృఢమైన గొలుసులా ఏర్పడి సొంత ఆస్తులను గుట్టలుగా పోగు చేసుకుంటున్నారు. వీరి ధనదాహం, అధికార అహం వల్ల దేశంలో వంద కోట్లకు పైగా సామాన్యుల జీవితాలు కష్టాల ఊబిలోకి జారుతున్నాయి. పని చేసి పెట్టేందుకు లంచంకోసం చేయి చాచే ఉద్యోగి ప్రజలకు ప్రత్యక్షంగా కనబడతాడు. వ్యాపారి మోసాలు మాత్రం సామాన్యుడి కంటికి అగపడవు. ఇక రాజకీయ నాయకుడు పెద్ద మాయలోడు. వారి సంపాదన అండర్ గ్రౌండ్ డ్రైనేజిలా ఎటునుంచి ఎటు వెళుతుందో అంతుపట్టదు. ఉద్యోగి పట్టుబడితే కష్టాలే. వ్యాపారి నష్టపోతే తిప్పలే. నాయకుడు ఓడిపోయినా దివాళా తీయడు. ఈ పోలిక ఆధారంగా దేశ సంపద, పౌరుడి శ్రమ ఈమేరకు ఎవరి జేబులోకి వెళుతుందో ఊహించవచ్చు. ఈ మూడింటిలో అత్యంత బలమైనది వ్యాపార వర్గమే. ఒక రకంగా రాజకీయ, ఉద్యోగ వర్గాలు వ్యాపారికి ఊడిగం చేసేవే. వ్యాపారులు ఇచ్చే విరాళాలు రాజకీయ పార్టీలకు ఇంధనంలా పనికొస్తాయి. ఒక పరిశ్రమ తమ రాష్ట్రానికి రావడానికి పాలకులు పడే ఆరాటం చూస్తుంటే పారిశ్రామికవేత్తలు ఎంత శక్తిమంతులో అర్థమవుతుంది. మంత్రులను తమ కనుసన్నలపై ఆడించే వ్యాపారుల ఇంటి గేటు తాకడానికి కూడా అధికారులు వణికిపోతారు. ప్రభుత్వ బ్యాంకుల్లోంచి తీసుకొన్న వేల కోట్ల అప్పును గుర్తుచేయడానికి కూడా అధికారికి సాహసమే కావాలి. బ్యాంకుల్లోని ప్రజల పొదుపు సొమ్మును వేల కోట్ల దాకా ఎగ్గొట్టిన మన వ్యాపారులు విదేశాలకు వెళ్లి రాజాల్లా బతకగలరు. ఆ అప్పులకు మాఫీ చేస్తున్నట్లు మంత్రులతో ప్రకటనలు ఇప్పించగలరు. రాజకీయ, వ్యాపార వర్గాల చెప్పుచేతల్లో నడిచేవారు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు. ప్రతి దొంగపనిని చూసీచూడనట్లు ఉన్నందుకు వీరి టిప్పు వీరికి అందుతుంది. రెస్టారెంట్లు, బ్రాందీ షాపులు, పబ్బుల నుండి పోలీసులకు, మున్సిపాలిటీకి, కార్మిక, వాణిజ్య పన్నుల శాఖలకు నెలవారీగా లంచం సొమ్ము టంచనుగా అందుతుంది. పరిశ్రమల, వ్యాపారుల అక్రమ దందాలు ఎలాంటి అడ్డంకి లేకుండా యథేచ్ఛగా సాగడానికి ఎన్నో విభాగాల తనిఖీ అధికారులకు లంచం ముడుతుంది. డిపార్ట్‌మెంట్ వారీగా అందిన సొమ్ము హోదాల క్రమంగా జేబులోకి చేరుకుంటుంది. ఇలా నిశ్శబ్దంగా రోజుకు కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. రోజుకు సగటున లక్ష రూపాయలు ఇంటికి తీసికెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క రాష్ట్రంలో వేలల్లో ఉంటారు. మాఫియాలో బ్లాక్ మనీ, స్మగ్లింగ్, హత్యలు ఉంటాయి. లంచగొండి వ్యవస్థ కూడా వైట్ కలర్ మాఫియానే. వారానికి ఒకరిద్దరు లంచగొండి అధికారులు అవినీతి శాఖకు చిక్కుతున్నారనే వార్తలు కనబడుతుంటాయి. అవినీతి నిరోధక శాఖ బాగా పనిచేస్తుందని చర్చ సాగుతుంది. వాస్తవానికి ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే ఎసిబి స్పందిస్తుంది. ఊర్లో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటుందో అందరికీ తెలుసు. అవినీతి నిరోధక స్టేషన్ మాత్రం ఎక్కడా కనబడదు. ఆ సిబ్బంది కూడా అందులోనే ఉంటే బయట బోర్డుపెట్టాలి. దాని మార్గం విడిగా ఉండాలి. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కౌంటర్ కనబడేలా పెట్టినట్లు లంచాలు అడిగే ఆఫీసుల వద్ద ఎసిబి కౌంటర్లు పెట్టాలి. ఈ వ్యవస్థ లేకపోవడం వల్లనే తమను లంచం అడిగారని ఆ శాఖ దృష్టికి తీసుకువెళ్లే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోంది. సిబ్బంది కోరిన ప్రకారం సమర్పించుకొని తమ పనులు పూర్తి చేసుకొని బయట పడడానికే జనం ఇష్టపడుతున్నారు. చాలా సందర్భాల్లో అధికారుల అత్యాశే విషయం ఎసిబి దాకా వెళ్లేలా చేస్తుంది. బిల్లు మంజూరుకు అధికారి లక్ష డిమాండ్ చేస్తాడు. అంత ఇవ్వలేము, 70 వేలతో సరిపెట్టుకోండి అని వేడుకుంటారు. ససేమిరా కుదరదు. లక్ష ఇవ్వాల్సిందే అని అధికారి మొండికేస్తాడు. చిర్రెత్తిన లబ్ధిదారు ఎసిబిని ఆశ్రయిస్తాడు. శ్రమలేకుండా ఎసిబి వారికి ఓ చేప పడుతుంది. దానికో వార్త. ఇదేం పెద్ద నేరమన్నట్లు ఉద్యోగి దర్జాగా ఫోటోకి పోజు ఇస్తాడు.లంచం తీసుకోవడం తప్పు అనే భావన సమాజంలోంచి ఎగిరిపోయింది. బాధితుల ఫిర్యాదుపైనే కాకుండా, ఉద్యోగుల ఇళ్లపై దాడి చేసి కూడా అవినీతి ఉద్యోగులను ఎసిబి పట్టుకుంటుంది. ఆ ఉద్యోగులకు ఆదాయాన్ని మించిన ఆస్తులున్నాయని లెక్కలేసి మరీ చెబుతుంది. మిగతా వారికి అక్రమాస్తుల లేవా అంటే వారికీ ఉన్నాయనే సమాధానం వస్తుంది. చాలా డిపార్ట్‌మెంట్లు పూర్తిగా అవినీతిలో మునిగేవే. వాటిపై చర్యలు తీసుకుంటే ఆఫీసులే ఖాళీ అవుతాయి. జైళ్లు సరిపోవు. బలమైన ఈ చక్రవ్యూహంలో సామాన్యుడు సర్దుకు బతకడమే తప్ప మరో మార్గం లేదు.   బి.నర్సన్, 9440128169

మన తెలంగాణ 6 Nov 2025 5:40 am

కాంగ్రెస్ అంటే ముస్లింలు

మన తెలంగాణ/హైదరాబాద్ : “మీకు చేతనైతే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థినవీన్ కుమార్‌ను ఓడించండి...”అని సిఎం రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సవాల్ విసిరారు. ప్రధాని మోడీ, కెసిఆర్ ఒకవైపు, తాను, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాం ధీ, మజ్లీస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోవైపు నిలబడ్డామని అన్నారు. కాంగ్రెస్ అం టేనే ముస్లింలని, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉ ప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం సిఎం రేవంత్ రోడ్-షో నిర్వహించారు. షేక్‌పేట డివిజన్‌లో జరిగిన రోడ్-షోలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కౌసర్, కాంగ్రెస్ అభ్యర్థి నవీ న్ కుమార్, స్థానిక కార్పోరేటర్ ఫరహత్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సిఎం షేక్‌పేటలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక ప్రార్థన చే శారు. ఈ సందర్భంగా రోడ్-షోలో పాల్గొన్న వారినుద్ధేశించి ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ బిజెపి, బిఆర్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు. బిఆర్‌ఎస్ సహకారం వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి బిఆర్‌ఎస్ సహకరించినందువల్లే బిజెపికి ఎనిమిది సీట్లు వచ్చాయని, బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు రాలేదని ఆయన తెలిపారు. అందుకే కెసిఆర్‌ను, కెటిఆర్‌ను అవినీతి కేసుల్లో బొక్కలో వేయలేదని ఆయన విమర్శించారు. ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో సహా అనేక మందిపై ఈడి కేసులు పెట్టారు కానీ తండ్రీ-కొడుకును బొక్కలో వేసి, చిప్పకూడు ఎందుకు తినిపించలేదని ఆయన ప్రధాని మోడీని, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతి విషయంలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కోరితే, ఒక్క రోజులోనే కెసిఆర్‌పై సిబిఐ విచారణ చేపట్టి, జైలుకు పంపిస్తామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని తాను మంగళవారం రోడ్-షోలో కిషన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తే, మా ఇంటికి వచ్చి చర్చిస్తానంటూ మళ్ళీ తనను ఎదురు ఛాలెంజ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. తన ఇంటికి రావాల్సిన అవసరం లేదని, గజదొంగ కెసిఆర్‌ను అరెస్టు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి తెచ్చుకోవాలని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్‌లో బిజెపికి డిపాజిట్ దక్కదన్నారు. డిపాజిట్ తెచ్చుకుంటే కిషన్ రెడ్డి గెలిచినట్లేనని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కారు టైర్లు పీకేసి గ్యారేజీకి పంపించారని, కొడితే కెసిఆర్ ఫాం హౌస్‌లో బొక్కా బొర్లా పడ్డారని అన్నారు.వేల కోట్లతో కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్, కవిత వేర్వేరు చోట్ల ఫాం హౌస్‌లు కట్టుకున్నది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి నేతలు బిఆర్‌ఎస్ గుర్తు అయిన కారు గుర్తుతో ఓట్లు అడుగుతున్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే బిజెపికే వేసినట్లు అవుతుందని ఆయన తెలిపారు. నాణేనికి రెండు వైపులా బిజెపి, బిఆర్‌ఎస్ అని ఆయన విమర్శించారు. సర్కార్‌కు రెండు కళ్ళు.. హిందూ-ముస్లింలు తమ సర్కారుకు రెండు కళ్ళ వంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అజహరుద్దీన్‌ను తన సహచర మంత్రిగా తీసుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏమి ఇబ్బంది అయ్యిందని ఆయన ప్రశ్నించారు. ‘నీ అయ్య జాగీరు ఏమైనా అడిగామా? లేక గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ భూములేమైనా అడిగామా?’ అని ఆయన ప్రశ్నించారు. అమిత్ షా వచ్చి అడ్డు చెప్పినా అజహర్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే వాడినని ఆయన తెలిపారు. ముస్లింలకు వివిధ కార్పొరేషన్ పదవులు ఇచ్చానని, క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చామని ఆయన వివరించారు. షెక్‌పేట్ డివిజన్ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి పదిహేను వేల మెజారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. సబర్మతి నదీ, యమునా నదీ అభివృద్ధి చేసినట్లు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయరాదని ఆయన ప్రశ్నించారు. ఏకగ్రీవం సంప్రదాయానికి తిలోదకాలు ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయానికి కెసిఆర్ తిలోదకాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. గతంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణిస్తే, ఆ కుటుంబం నుంచి ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తే సెంటమెంట్ ఏమీ లేదని కెసిఆర్ అభ్యర్థిని పోటీకి దించారని ఆయన తెలిపారు. ఇప్పుడేమో కెటిఆర్ సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్‌కు రాని సన్నాసులు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కృష్ణానగర్ నంది అవార్డులు తెచ్చింది, ఇప్పుడు ఆస్కార్ అవార్డులు తెచ్చిందని ఆయన తెలిపారు. సినీ కార్మికులకు చిత్రపురి కాలనీలో భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది అవార్డు ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గద్దర్ అవార్డులు ఇచ్చిందని ఆయన తెలిపారు. కెటిఆర్ మాత్రం గెస్ట్ హౌస్‌ల్లో సినీ నటులతో తిరిగారు తప్ప ఏనాడూ సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఈ ప్రాంతాలో ఉండే కార్మికులకు ఆరోగ్య భద్రత, జీవిత భీమా, ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి, లంచ్ కూడా ఏర్పాటు చేయిస్తానని అన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రి అయిన తర్వాత సన్న బియ్యం ఇస్తున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దొడ్డు బియ్యం బర్లకు కూడా పెట్టేవారు కాదన్నారు. దసరా పండుగకు ఆడబిడ్డలు వెళ్ళాలనుకుంటే ఉచితంగా వెళ్ళేందుకు బస్సు సౌకర్యం కల్పించామన్నారు. డ్బ్బై వేల ఉద్యోగాలు కల్పించి పత్రాలు స్టేడియంలో అందించామన్నారు. సన్న బియ్యం, ఉచిత బస్సు సౌకర్యం, రేషన్ కార్డులు కెసిఆర్ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ-కార్ల కేసులో యాభై కోట్ల అవినీతికి పాల్పడిన కెటిఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ రోడ్-షోలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

మన తెలంగాణ 6 Nov 2025 5:30 am

సత్తా ఎవరిదో.. చెత్త ఎవరిదో తేల్చుకుందాం

మన తెలంగాణ/హైదరాబాద్: దమ్ముంటే సిఎం రేవంత్‌రెడ్డి గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలు చెప్పి ఓట్లు అడగాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. దీనిపై ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి తా ము సిద్ధమని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో దమ్ముంటే చర్చ కు రావాలన్నారు. చర్చించడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్లేస్, టైమ్ వాళ్లు చెప్పినా సరే..తమను చెప్పమన్నా స రే అని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటరైనా.. గాంధీభవన్ అయినా, అసెంబ్లీలో చర్చ పెట్టినా తాము ఈ విషయాలపై చర్చించడానికి రెడీగా ఉ న్నామని తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగతి నివేదికను విడుదల చే శారు. తెలంగాణ భవన్ లో నివేదికను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జూ బ్లీహిల్స్‌లో ఓడిపోతామనే రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశా రు. రేవంత్ రెడ్డికి ఆయన భాషలో ఆయనకు అ ర్థమైయేటట్లు చెప్పే సత్తా తమకు ఉందని అన్నా రు. కానీ రేవంత్‌రెడ్డి  మమ్మల్ని తిట్టినా తాము మాత్రం గౌరవంగానే మాట్లాడుతామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏం చేసిందో, రెండేళ్లలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించిన ఆయన దీంతో చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేలి పోతుందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. హైదరాబాద్‌లో 42 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించామని, తమ హయాంలో స్టార్ట్ చేసిన వాటికే కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేసిందని వివరించారు. అవి కాకుండా కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డు అయినా నిర్మించారా అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. కొత్త రోడ్ల సంగతి తర్వాత, కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా అని నిలదీశారు. నగర ప్రజలకు మళ్లీ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు : హైదరాబాద్‌లో శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ కూడా సీఎంగా ఒక ఏరియాను ఎంచుకొని అక్కడ శానిటేషన్ పనులు పర్యవేక్షించారని గుర్తు చేశారు. స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వేలాది స్వచ్ఛ్ ఆటోలను ప్రవేశపెట్టామని అన్నారు. ఇప్పుడు కనీసం ఒక్క ఆటోనైనా ప్రవేశపెట్టారా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతి రోజు 7.5 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించామని వెల్లడించారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో 34 అవార్డులు సాధించామని తెలిపారు. బెస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్‌కు అవార్డు వచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్‌ఎన్‌డిపిని కూడా స్టార్ట్ చేసినట్లు తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా మారిస్తే ఇప్పుడు దానిని కాంగ్రెస్ ప్రభుత్వం మురికికూపంగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు : పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిదని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టారా అని ప్రశ్నించారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఇల్లు కట్టకపోగా వేలాది ఇళ్లను హైడ్రా పేరుతో ప్రభుత్వం కూలగొట్టిందని ఫైరయ్యారు. హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది కూడా తమ ప్రభుత్వమేనని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మెట్రో సీఎఫ్‌వో, ఎల్ అండ్ టీ సీఎఫ్‌వోలను బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బాధ తట్టుకోలేక, వాళ్ల బెదిరింపులకు తాళలేక ఎంత మంది పారిశ్రామికవేత్తలు పారిపోయారో చర్చకు సిద్ధమా అని నిలదీశారు. కరెంటు విషయంలోనూ కాంగ్రెస్ తీరును కేటీఆర్ ఎండగట్టారు. కాంగ్రెస్ హయాంలో వారానికి రెండు, మూడు రోజులు పవర్ హాలిడేస్ ఉంటే తాము అధికారం చేపట్టిన తర్వాత 24 గంటలు కరెంటు ఇచ్చామని గుర్తు చేశారు. ఎల్‌ఈడీ బల్బులతో తెలంగాణను దేదీప్యమానంగా చేశామని, రెండేళ్లలో రేవంత్ సర్కార్ ఒక్క ఎల్‌ఈడీ అయినా పెట్టిందా అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో విద్యుత్ వెలుగులు కొనసాగాయో, ఎవరి హయాంలో విద్యుత్ కోతలతో ఇబ్బంది పడ్డారో చర్చిద్దామా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఉన్న చెట్లను నరికేశారు : కాంక్రీట్ జంగిల్‌లో కొత్తగా లంగ్ స్పేస్‌లు ఏర్పాటు చేసిన ఘనత తమదే అని కేటీఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టి 16వేల నర్సరీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క నర్సరీ కూడా పెట్టకపోగా ఉన్న చెట్లను నరికేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రూ.10వేల కోట్లకు కక్కుర్తిపడి హెచ్‌సియులో జీవవైవిధ్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. ఐటీ ఉద్యోగాలను కూడా మూడు లక్షల నుంచి 9 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. శాంతిభద్రతల విషయంలోనూ కాంగ్రెస్ పనితీరు ఏంటో కేటీఆర్ బయటపెట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో సీసీ కెమెరాలు పెట్టి కేసీఆర్ హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పెంపొందిస్తే ఇప్పుడు సైబరాబాద్‌లో 41 శాతం, హైదరాబాద్‌లో 60 శాతం క్రైమ్ రేటు పెరిగిందని, డే లైట్ మర్డర్లు పెరిగాయన్నారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు హైదరాబాద్‌లోని చర్లపల్లిలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారంటే అంతకంటే అవమానం ఉంటుందా అని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూటిగా సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, మోదీ మధ్య ఫెవికాల్ బంధం : సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య మంచి ఫెవికాల్ బంధం ఉందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్- బీజేపీ జాయింట్ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాహుల్ గాంధీ విమర్శిస్తే అదే సంస్థలను రేవంత్ నమ్ముతారని వెల్లడించారు. ఇక మైనార్టీలను అవమానించినందుకు గాను రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే కాంగ్రెస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కెటిఆర్ హెచ్చరించారు. అటు ఫార్ములా ఈ కేసులోనూ గవర్నర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినా, చార్జ్‌షీట్‌లో విషయం లేకపోవడం వల్ల దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని తేల్చిచెప్పారు. తనపై చేసిన ఆరోపణల విషయంలో దమ్ముంటే ఈ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలని చెప్పారు. అంతేకాకుండా తాను లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమే అని..రేవంత్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. దీంతో ఎవరు దొంగనో తేలిపోతుంది కదా అని చెప్పారు. ప్రతి విషయంలోనూ పచ్చి అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 6 Nov 2025 5:00 am

కాళేశ్వరం సరే..మీ హామీల మాటేమిటి?

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి, కాంగ్రెస్‌పార్టీల మధ్య మాటల తూ టాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిలదీతలతో బిజెపి, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు మా టల దాడి చేసుకుంటున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇత ర రాష్ట్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావులను సీబీఐ అరెస్ట్ చేయడం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11లోగా వీరిద్దరిని సీబీఐతో అరెస్ట్ చేయించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా 'ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి కేంద్రంపై ధ్వజమెత్తారు. ఇందుకు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం తన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి ముందు మీడియాతో మాట్లాడుతూ అంతే ధీటుగా రేవంత్‌రెడ్డికి సమాధానం ఇచ్చారు. బిజెపి ఎన్నికలకు ముం దు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఎటువంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డే కేసీఆర్, హరీశ్‌లను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు వారిని అరెస్టు చేయలేదని కిషన్‌రెడ్డి నిలదీశారు. తమకు సంబంధం లేని విషయాలను ఆపాదించడం సరికాదని అన్నారు. అరెస్టులు సం గతి పక్కన పెట్టి రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన డిక్లరేషన్లు, 420 హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తమపై అకారణంగా ఆరోపణలు చేయడం సరికాదని, ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభు త్వం దృష్టిసారించాలని కిషన్‌రెడ్డి హితవు పలికారు. అవినీతి పెరిగిందే తప్ప తగ్గలేదు తెలంగాణలో కెసిఆర్ పోయి, రేవంత్‌రెడ్డి వచ్చినా అవినీతి పెరిగిందే తప్ప తగ్గలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అడుగడుగునా రాష్ట్రం లో అవినీతి తాండవిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులతో సహా అన్ని వర్గాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మో సం చేసిందని ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి మద్దతుగా బుధవారం సా యంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కిషన్‌రెడ్డి గత కెసిఆర్ ప్రభుత్వం, ఇప్పటి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎం పదవిలోకి కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చినా అవినీతి తగ్గలేదని, ఇంకా ఏ ముఖం పెట్టుకుని రేవంత్ ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. మైనార్టీ ఓట్లతో కాంగ్రెస్ ఈ ఎన్నికలో విజ యం సాధించాలని చూస్తోందని విమర్శించారు. పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగితే మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్సు గురించి మాట్లాడి దాట వేత వైఖరిని అవలంభిస్తున్నారని అన్నారు. జాబ్‌క్యాలెండర్, బంగారం కానుకలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. వెంకటగిరి, యూ సుఫ్ గూడా డివిజన్‌లలో బిజెపి కార్యకర్తలతో కలి సి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సాయంత్రం బోరబండ డివిజన్, ఎర్రగడ్డ డివిజపలో బిజెపి అభ్యర్థి దీపక్‌రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 

మన తెలంగాణ 6 Nov 2025 4:00 am

ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 6-11-2025

ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 6-11-2025

ప్రభ న్యూస్ 6 Nov 2025 1:00 am

గురువారం రాశి ఫలాలు (06-11-2025)

మేషం: సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు ఇది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూసంభందిత క్రయవిక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు. వృషభం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం. ఆకస్మిక ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీకోలేరు. మిధునం: ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకుపరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం: బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబసభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. సింహం: కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. కన్య: దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. తుల:  ఋణదాతలనుండి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారా, ఉద్యోగాలు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృశ్చికం: చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తికావు. ఆత్మవిశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ధైర్యముగా నిర్ణయాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ధనస్సు: ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులకు నచ్చే విధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటాయి. మకరం: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంభందిత వివాదాలు కొలిక్కి వస్తాయి. శుభవార్తలుఅందుతాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభం: చేపట్టిన పనులు నత్తనడక సాగుతాయి. కత్తులు తగినంత ఆదాయం లభించదు. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారమున భాగస్తులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు కలిగే సూచనలున్నవి. మీనం: అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహయ సహకారాలు అందుతాయి. ధనదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతాన విద్యవిషయాలు పట్ల సంతృప్తికరంగా సాగుతాయి.  

మన తెలంగాణ 6 Nov 2025 12:10 am

రశ్మిక, దీక్షిత్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్ కాకుండా మరో టైటిల్ ఈ సినిమాకు చెప్పమంటే నీ జీవితమంతా నేనే అని చెప్పాలి. అమ్మాయి, అబ్బాయి తమ జీవిత భాగస్వామి గురించి ఇలాగే అనుకుంటూ అతి సున్నితంగా సాగే ఈ సినిమా చివరకు అతి ఘాటుగా ముగుస్తుంది. ఈ సినిమా చూశాక చాలామంది ఆ రాత్రి నిద్రపోరు. అంతగా ఈ మూవీ వారిని వెంబడిస్తుంది. రశ్మిక ఈ సినిమాలో జీవించేసింది”అని అన్నారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ సినిమానే ప్రపంచంగా జీవించే డైరెక్టర్ రాహుల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని తెలియజేశారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా నా కెరీర్ లో ఒక బ్యూటిఫుల్ జర్నీగా మిగిలిపోతుంది. అల్లు అరవింద్ ఓకే చెప్పకుంటే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదు. ఈ సినిమాలో రశ్మిక, దీక్షిత్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దీక్షిత్ శెట్టి, ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి, హేషమ్ అబ్దుల్ వాహబ్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 5 Nov 2025 11:35 pm

ఒక్కటైన 10 వామపక్షాలు

. నేపాల్‌లో ఏకీకృత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం. సమన్వయకర్తలుగా ప్రచండ, నేపాల్‌ ఏకగ్రీవం ఖాట్మండు: నేపాల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 10 వామపక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. సీపీఎన్‌ (మావోయిస్టు సెంటర్‌), సీపీఎన్‌ (ఏకీకృత సోషలిస్టు), నేపాల్‌ సోషలిస్ట్‌ పార్టీ, సీపీఎన్‌ (సోషలిస్ట్‌), జన సమాజ్‌వాదీ పార్టీ, నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్ట్‌`సోషలిస్ట్‌), సీపీఎన్‌ (సమాజ్‌వాదీ)తో పాటు వామపక్ష పార్టీలన్నీ కలిసి ఐక్య పార్టీ ఏర్పాటునకు అంగీకారం తెలిపాయి. దీనికి సంబంధించి 18 అంశాల ఒప్పందంపై సంతకాలు చేశాయి. […] The post ఒక్కటైన 10 వామపక్షాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Nov 2025 11:23 pm

ట్రంప్‌ పాలనకు ఛీత్కారం

. న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు జొహ్రాన్‌ మమ్దానీ. స్థానిక పోరులో డెమొక్రాట్ల ప్రభంజనం. వర్జీనియాలో భారత సంతతి ముస్లిం ఎన్నిక. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, సిన్సినాటిలోనూ రిపబ్లికన్లు చిత్తు న్యూయార్క్‌: ట్రంప్‌ సర్కారుకు స్థానిక ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తిగిలింది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో రిపబ్లికన్లు ఘోర పరాభవాన్ని చవిచూశారు. 2024 ఎన్నికలప్పుడు ట్రంప్‌ హవాలో కొట్టుకుపోయిన డెమొక్రాట్‌ పార్టీకి ఈ ఎన్నికలతో కొత్త ఊపిరి లభించింది. ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయాలతో చరిత్ర సృష్టించారు. […] The post ట్రంప్‌ పాలనకు ఛీత్కారం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Nov 2025 11:18 pm

సీపీఐ నూతన కార్యదర్శివర్గం ఇదే

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన కార్యదర్శివర్గాన్ని విజయవాడ దాసరిభవన్‌లో పి.రామచంద్రయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర సమితి సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్యతోపాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా జేవీ సత్యనారాయణమూర్తి, పి.హరినాథరెడ్డి, కేవీవీ ప్రసాద్‌, డి.జగదీశ్‌, జంగాల అజయ్‌కుమార్‌, డేగా ప్రభాకర్‌, తాటిపాక మధు, పి.దుర్గాభవాని, కె.రామాంజనేయులు, శాశ్వత ఆహ్వానితులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ ఎన్నికయ్యారు. The post సీపీఐ నూతన కార్యదర్శివర్గం ఇదే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Nov 2025 11:13 pm

అధ్వాన పాలనను అడ్డుకోకపోతే అధోగతే

పన్‌డీఏ విధానాలపై రామకృష్ణ, వెంకటరెడ్డి . ప్రైవేటీకరణ, అప్పులు, అవినీతితో అరాచకం. తీవ్ర పేదరిక నిర్మూలనలో కేరళ విధానం స్ఫూర్తిదాయకం. బీహార్‌ పన్నికల్లో పన్‌డీఏకు పరాభవం తప్పదు. డిసెంబరు 26న ‘చలో ఖమ్మం’. 18న సామాజిక న్యాయం కోసం ఆందోళనలు. ఉద్యమాలు ఉధృతం చేస్తాం: జి.ఈశ్వరయ్య విశాలాంధ్ర- విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలనతో ప్రజల జీవన పరిస్థితులు దయనీయంగా మారిపోయాయని, బలమైన ఉద్యమాలు నిర్మించడం ద్వారా ఈ అధ్వాన పాలనకు చరమగీతం పలకాల్సిన […] The post అధ్వాన పాలనను అడ్డుకోకపోతే అధోగతే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Nov 2025 11:02 pm