SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. ఏపీ మంత్రి

మంత్రి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని ఆయన అన్నారు.

తెలుగు పోస్ట్ 29 Nov 2022 6:28 pm

నక్షా మార్చిండు.. నకిలీ పత్రాలు పుట్టించాడు!

తనది కాని జాగలో ఓ వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మాణం చేపడుతున్నట్లు సదరు స్థలం బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. ఆక్రమణదారుడు అసలు నక్షానే మార్చి దౌర్జన్యానికి దిగుతున్నాడని వాపోయాడు బాధితుడు పైడిపల్లికి చెందిన రాసోజుల సత్యనారాయణ.

దిశా డైలీ 29 Nov 2022 6:27 pm

ఆయిల్ ఫామ్ కు విదేశాల్లో మంచి డిమాండ్​

ఆయిల్ ఫామ్ పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నదని, ఇక్కడి రైతులు సాగుకు ముందుకు రావాలని, తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం అభినందనీయం అని విదేశీ ఆయిల్ ఫామ్​ మార్కెటింగ్ ప్రతినిధులు నికోలస్ (మలేషియా), సిల్వాయిన్ (ఫ్రాన్స్), సరూట్ (థాయిలాండ్) అన్నారు.

దిశా డైలీ 29 Nov 2022 6:24 pm

ఫలించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషి

మెదక్: ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషి ఫలించింది. మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా నుంచి దాయరరోడ్డు నిర్మాణం కోసం 7.80కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 73.72 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి 164.22కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి దాయర వరకు 2.50 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి […]

మన తెలంగాణ 29 Nov 2022 6:24 pm

Water Projects |తెలంగాణలో మూడు ప్రాజెక్టులకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత ఏడాది జులైలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేని ప్రాజెక్టుల జాబితాలో ఉన్న మూడు ప్రాజెక్టులకు మంగళవారం టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఆమోదం పొందిన ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబందించి […]

ప్రభ న్యూస్ 29 Nov 2022 6:22 pm

కాసేపట్లో అరెస్ట్‌పై ప్రకటన.. షర్మిలను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే ఛాన్స్..?

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్‌పై కాసేపట్లో పోలీసులు ప్రకటన చేయనున్నారు. అనంతరం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి...వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తర్వాత షర్మిలను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం వుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. కాగా... నిన్న నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని లింగగిరిలో వైఎస్ షర్మిలకు చెందిన బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టారు. అంతే కాదు షర్మిల పార్టీకి చెందిన వాహనాలపై దాడి చేశారు . ఈ ఘటనలో నాలుగు వాహానాలు ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణుల దాడిని వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి హైద్రాబాద్ కు తీసుకు వచ్చి రాత్రి లోటస్ పాండ్‌లో వదిలి వెళ్లిపోయారు. ALso REad: మేం ప్రభుత్వాల్ని నడపలేదా.. పోలీసులు మాకేం కొత్తా : షర్మిల అరెస్ట్‌పై వైఎస్ విజయమ్మ అయితే నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా ఇవాళ ప్రగతి భవన్ ను ముట్టడించాలని వైఎస్ఆర్‌టీపీ తలపెట్టింది. పోలీసుల కళ్లుగప్పి షర్మిల లోటస్ పాండ్ నుండి బయటకు వెళ్లారు. సోమాజీగూడ నుండి ధ్వంసమైన కారుతో ప్రగతి భవన్ వైపునకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పంజాగుట్టలో షర్మిలను అడ్డుకున్నారు. అయితే కారులో నుండి దిగకుండా ఆమె నిరసనకు దిగారు. ప్రగతి భవన్ కు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. కారు అద్దాలు కూడా దించలేదు. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తర్వాత కూడా ఆమె కారు నుండి దిగలేదు. దీంతో కారు డోర్ లాక్స్ ఓపెన్ చేసి షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనికి తీసుకెళ్లారు పోలీసులు. మరోవైపు షర్మిలకు మద్దతుగా వచ్చిన వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు, షర్మిల అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 6:22 pm

వాట్సాప్ కొత్త అద్భుతమైన ఫీచర్‌.. వేరే యాప్స్ అవసరం లేకుండా.. మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు..

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల సౌలభ్యం అండ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడానికి కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ మొదట టెస్టింగ్ కోసం విడుదల చేసింది. ఇప్పుడు దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్ ఏంటంటే 1:1 చాట్, అంటే మీ ముఖ్యమైన నోట్స్, రిమైండర్‌లు ఇంకా డాక్యుమెంట్స్ సేవ్ చేయడానికి, మీకు మీరే మెసేజ్ పంపడానికి ఉపయోగపడుతుంది. సెల్ఫ్ మెసేజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ మల్టీ డివైజ్ సపోర్ట్ కోసం పరిచయం చేసారు. ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ విడుదల చేసింది. WhatsApp ఈ కొత్త ఫీచర్ సహాయంతో మీరు చేయవలసిన లిస్ట్, షాపింగ్ లిస్ట్, నోట్స్ మొదలైనవాటిని పెట్టుకోవచ్చు. ముఖ్యమైన నోట్స్, రిమైండర్‌లు అండ్ అప్ డేట్స్ గుర్తుంచుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, వాట్సాప్ కొత్త ఫీచర్ మీరే చేయాలనుకునే పనులు లేదా రిమైండెర్స్ వాట్సప్ లో సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ ఫీచర్‌ని ఎన్నో విధాలుగా సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు నోట్స్ తీసుకోవడానికి ఇంకా లింక్‌లను బుక్‌మార్క్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు ఇందుకు మీరు ప్రత్యేకంగా ఇతర యాప్‌ని డౌన్‌లోడ్ చేయనవసరం లేదు. అలాగే, ఈ ఫీచర్ తో ల్యాప్‌టాప్, టాబ్లెట్ ఇంకా మొబైల్ నుండి ఫోటో-వీడియో అండ్ డేటాను సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ iOS అండ్ Android యూజర్ల కోసం విడుదల చేయబడింది. మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్‌ని ఉపయోగించడానికి మీరు ముందుగా మీ ఫోన్‌లో WhatsAppని ఓపెన్ చేయాలి ఇప్పుడు యాప్ స్క్రీన్ కుడి వైపున కింద మూలన ఉన్న మెసేజ్ బాక్స్ బటన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు కాంటాక్ట్స్ లిస్ట్ చూస్తారు, అయితే కొత్త అప్‌డేట్ తర్వాత మీరు మీ నంబర్ కాంటాక్ట్ చూడవచ్చు చివరగా మీ ఫోటోతో కనిపించే మీ కాంటాక్ట్ పై నొక్కండి, ఆపై మీరు చాట్‌ని స్టార్ట్ చేయవచ్చు. అంటే, మీరు మీకే మెసేజెస్ పంపవచ్చు.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 6:20 pm

అమెరికాలో బియ్యం ధర ఎంతో తెలిస్తే, అన్నం తినడం మానేస్తారు..అగ్రరాజ్యంలో చుక్కలను తాకుతున్న నిత్యావసర ధరలు

ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతోంది. మాంద్యంలో కూరుకుపోయిన బ్రిటన్‌లోని సామాన్యులకు నిత్యావసరాల ధరలు వెన్నుపోటు పొడుస్తున్నాయి. యుఎస్‌లో, అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం రేటు తగ్గింది, అయితే నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికీ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో అమెరికా వెళ్లాలనుకునే భారతీయుల కలలపై అమెరికా ద్రవ్యోల్బణం నీళ్లు చల్లింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత కారణంగా అమెరికాకు వెళ్లాలన్న భారతీయుల కలలు కల్లలుగా చేస్తున్నాయి. కాఫీ ధర రెట్టింపు భారతదేశంలోని ముంబై నగరంలో విక్రయించే నిత్యావసర వస్తువుల ధరలను అమెరికాలోని న్యూయార్క్ నగరానికి పోల్చి చూస్తే, భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ముంబైలోని ఒక ఖరీదైన రెస్టారెంట్లో ఒక కప్పు కాఫీ సగటు ధర రూ.203.15 కాగా, న్యూయార్క్‌లో కాఫీ ధర రూ. 439.06గా ఉంది. అంటే ముంబైలో కంటే న్యూయార్క్‌లో కాఫీ ధర 116 శాతం ఎక్కువ. భారతదేశంలో 1 కేజీ బియ్యం ధర సగటున రూ. 31.38 ఉంటే అదే సమయంలో అమెరికాలో ఒక్క కేజీ బియ్యం ధర రూ.294.68గా ఉంది. సినిమా టిక్కెట్ ధర రూ. 1500 న్యూయార్క్‌లో టాక్సీలో 2 కిలో మీటర్లు ప్రయాణించడానికి రూ.244. అదే సమయంలో, మీరు భారతదేశంలో ఆ దూరానికి రూ.40.23 మాత్రమే చెల్లిస్తారు. అంటే అమెరికాలో ట్యాక్సీ చార్జీలు భారత్ కంటే 508 శాతం ఎక్కువ. న్యూయార్క్‌లో సినిమా చూడటానికి రూ. 1470 ఖర్చు చేయాలి, భారతదేశంలో మల్టీ ప్లెక్స్ లో గరిష్టంగా రూ. 350 ఖర్చు చేయాలి. అంటే ఇండియాలో కంటే అమెరికాలో సినిమాలు చూడాలంటే 320 శాతం ఎక్కువ చెల్లించాలి. భారతదేశంలో మీరు లగ్జరీగా జీవించాలి అంటే రూ. 23 లక్షలు అవసరం అవుతాయి. ఇందుకోసం అమెరికాలో 80 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అంటే భారత్‌తో పోలిస్తే అమెరికాలో నాలుగు రెట్లు ఎక్కువ. నివేదిక ప్రకారం, మీరు అమెరికాలో కొనుగోలు చేసే వస్తువు ధర 50 డాలర్లుగా ఉంది ( అంటే దాదాపు 4 వేల రూపాయలు). ప్రస్తుతం, మీరు భారతదేశంలో సగటున రూ.1150కి అదే వస్తువును పొందవచ్చు. అయితే అమెరికాలో సంపాదించిన డబ్బును ఇండియాలో ఖర్చు చేస్తే.. మునుపటి కంటే ఎక్కువ మేలు జరుగుతుంది. ద్రవ్యోల్బణం రేటు అమెరికాలో అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం 7.7 శాతానికి తగ్గింది. అంతకుముందు సెప్టెంబర్ నెలలో ఇది 8.2 శాతంగా ఉంది. భారతదేశం కూడా అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం తగ్గింది. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్థిర సంఖ్య కంటే ఎక్కువగా ఉంది.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 6:19 pm

కొత్త ఫీచర్ తీసుకొచ్చిన స్నాప్ చాట్

కొత్త ఫీచర్ తీసుకొచ్చిన స్నాప్ చాట్

v6 వెలుగు 29 Nov 2022 6:19 pm

BJP అధికారంలోకి రాగానే భైంసా పేరు మారుస్తాం: బండి కీలక వ్యాఖ్యలు

భైంసా సమీపంలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీ- బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశా డైలీ 29 Nov 2022 6:18 pm

ఉప్పల్ టీఆర్ఎస్‌లో భగ్గుమంటున్న వర్గపోరు.. తెరపైకి కుల రాజకీయాలు

కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంటోంది. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిల మధ్య గత మూడేళ్లుగా

దిశా డైలీ 29 Nov 2022 6:18 pm

మిషన్ భగీరథ ఎయిర్ వాల్వ్​ను ఢీకొని యువకుడు మృతి

మండల కేంద్రానికి చెందిన బండ్రవల్లి మహేష్ మంగళవారం మిషన్ భగీరథ ఏర్ వాల్వ్​ను ఢీకొని మృతి చెందాడు.

దిశా డైలీ 29 Nov 2022 6:17 pm

ఆలీ కుమార్తె వివాహ రిసెప్షన్ లో జగన్

సినీనటుడు ఆలీ కుమార్తె వివాహ రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు

తెలుగు పోస్ట్ 29 Nov 2022 6:17 pm

ముందస్తు ఎన్నికలపై RS ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సిద్ధాంత బలం లేదని, ఒక ప్రత్యేక రాష్ట్ర ఎజెండాతో ఏర్పాటైన పార్టీ అని ఈ పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా ఆదరిస్తారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

దిశా డైలీ 29 Nov 2022 6:17 pm

పశు వైద్య విధానంలో దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు : మంత్రి తలసాని

పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, పశు వైద్య విధానంలో దేశంలోనే తెలంగాణ ప్రత్యేక గుర్తింపు సాధించిందని పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

దిశా డైలీ 29 Nov 2022 6:13 pm

పోలీస్ జాబ్‌కు ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి

సిద్దిపేట: పోలీస్ జాబ్‌కు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ పిజి కళాశాలలో టీఎస్ ఎస్సీ స్టడి సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సిద్దిపేట ఎస్సీ స్టడి సర్కిల్ ద్వారా 194 మంది ఎస్సీ మహిళా అభ్యర్ధులకి పోలీస్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్‌ను సీపీ శ్వేతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫిజికల్ పరీక్షలు దగ్గరలో ఉన్నందున అందరు ఒక క్రమ […]

మన తెలంగాణ 29 Nov 2022 6:11 pm

వివేకా హత్యకేసు తెలంగాణకు బదిలీ.. సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసును హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రయల్ కోర్టులో జరుగుతున్న నేర విచారణ నిష్పాక్షికంగా, స్వతంత్రంగా జరగడం లేదన్న పిటిషనర్ సునీత వాదనతో న్యాయస్థానం ఏకీభవిస్తూ.. హత్య వెనుక […]

ప్రభ న్యూస్ 29 Nov 2022 6:09 pm

ప్రభుత్వం రద్దు చేస్తే రాష్ట్రపతి పాలనే

అసెంబ్లీ రద్దు చేస్తే ముందస్తు ఎన్నికలు రావని, రాష్ట్రపతి పాలన వస్తుందని బీజేపీ నేతలు అన్నారు

తెలుగు పోస్ట్ 29 Nov 2022 6:06 pm

కొవిడ్‌ వారి జీవితాలను కూడా కంటతడి పెట్టించాయి: Aahana S Kumra

బాలీవుడ్ నటి ఆహానా కుమ్రా కొవిడ్ ఐసోలేషన్ తన తెలివిని ప్రశ్నించినట్లు తెలిపింది.

దిశా డైలీ 29 Nov 2022 6:05 pm

AP News: రాష్ట్రానికి కొత్త సీఎస్.. రేపే బాధ్యతల స్వీకరణ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి డా.కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు.

దిశా డైలీ 29 Nov 2022 6:04 pm

అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చెప్పుతో కొట్టిన మహిళ

అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చెప్పుతో కొట్టిన మహిళ

v6 వెలుగు 29 Nov 2022 6:04 pm

Interesting twist in HIT 2

Adivi Sesh stepped as the lead actor in the second instalment of thriller franchise HIT. The film directed by Sailesh Kolanu is hitting the screens on December 2nd. The trailer comes with an interesting cut and the lead antagonist’s identity is not revealed. HIT 2 is a crime thriller and Adivi Sesh investigates about the […] The post Interesting twist in HIT 2 appeared first on Telugu360.com .

తెలుగు 360 29 Nov 2022 6:03 pm

భారత్ అభివృద్ధి టెక్నాలజీతో ముడిపడి ఉంది : జైశంకర్

న్యూఢిల్లీ : భారత్ ఎదుగుదల దేశీయంగా టెక్నాలజీ అభివృద్దితో ముడిపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ , కార్నెగి ఇండియా సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహిస్తోన్న ది గ్లోబల్ టెక్నాలజీ సదస్సులో ఆయన ప్రసంగించారు. మన శక్తిని బట్టి సామర్ధాలను నిర్ణయించే విభిన్నమైన ప్రపంచంలో మనం ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రపంచంలో డేటా ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తూ బ్రిటన్ గణిత శాస్త్రవేత్త క్లైవ్ హంబీ వ్యాఖ్యలను జైశంకర్ ఉటంకించారు. […]

మన తెలంగాణ 29 Nov 2022 6:00 pm

ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఎగిరేది కాషాయం జెండానే.. బండి సంజ‌య్

ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో ఎగిరేది కాషాయం జెండానేన‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. భైంసాలోని గ‌ణేష్ ఇండ‌స్ట్రీస్ లో నిర్వ‌హించిన స‌భ‌లో బండి సంజ‌య్ మాట్లాడుతూ… తాము అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా మారుస్తామని బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బైంసాను దత్తత తీసుకుంటామన్నారు. బైంసాకు భరోసా ఇవ్వడానికే ఈ యాత్ర చేపట్టామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే బైంసాలోని బీజీపే కార్యకర్తలపై నమోదైన అక్రమ […]

ప్రభ న్యూస్ 29 Nov 2022 6:00 pm

ధాన్యం కొనుగోలు కేంద్రంలో పక్షపాతం

ద్దూరు మండల కేంద్రంలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన నారదాసు బాలకృష్ణ, కుక్కల లక్ష్మయ్య, కుక్కల కనుకవ్వ, పైస పోశవ్వ, రైతులు మంగళవారం రోజు ధాన్యం తీసుకువచ్చి తాసిల్దార్ కార్యాలయం ముందు కుప్ప పోసి నిరసన వ్యక్తం చేశారు.

దిశా డైలీ 29 Nov 2022 5:59 pm

మోడీకి రావణుడిలా 100 తలలు ఉన్నాయా?: ఖర్గే

మోడీకి రావణుడిలా 100 తలలు ఉన్నాయా?: ఖర్గే

v6 వెలుగు 29 Nov 2022 5:58 pm

క‌డుపునొప్పి అని హాస్పిట‌ల్‌కు వెళ్తే.. 187 నాణేలు బ‌య‌ట‌ప‌డ్డ‌య్‌!

చిన్నపిల్లలు డబ్బులు దాచుకునే హుండీలను పగులగొడితే చిల్లర నాణేలు బయటపడినట్లు.. ఓ వ్యక్తి కడుపులో పెద్ద సంఖ్యలో నాణేలు పయటపడ్డాయి. అదెట్లా? అని ఆశ్చర్యపోకండి. అతనికి విచిత్రంగా నాణేలు మింగే అలవాటు ఉంది. మీరు విన్నది నిజమే.. ఇప్పటి దాకా అతను రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు మింగేశాడు. ఇవన్నీ కడుపులో అలా ఉండిపోయాయి. ఒకటిన్నర కేజీ దాకా చేరుకున్నాయి. చివరికి డాక్టర్లు ఆపరేషన్‌ చేసి అతని కడుపులో నుంచి మొత్తం 187 నాణేలను […]

ప్రభ న్యూస్ 29 Nov 2022 5:57 pm

వెలుగులోకి వచ్చిన 48వేల 500 ఏళ్ల నాటి జాంబీ వైరస్

వెలుగులోకి వచ్చిన 48వేల 500 ఏళ్ల నాటి జాంబీ వైరస్

v6 వెలుగు 29 Nov 2022 5:57 pm

జిన్‌పింగ్‌ ఉక్కిరిబిక్కిరి!

కరోనాని పూర్తిగా నిర్మూలించేందుకు చైనీస్‌ ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.ఈ విధానం పర్యవసానంగా అనేక నగరాల్లో లాక్‌డౌన్‌లు ప్రకటిం చారు. నిరవధిక లాక్‌డౌన్‌ల వల్ల ప్రజలు అనేక ఇబ్బం దులకు గురవుతున్నారు.వారిలో సహనం నశిం చింది.అందుకే, లాక్‌డౌన్లకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన సాగిస్తు న్నారు. దేశాధ్యక్షునిగా జిన్‌పింగ్‌ మూడోసారి ఎన్నికైన రోజునే ఆయన ప్రయాణించే మార్గంలో జనం గుమిగూడి ఆందోళన సాగించారు.ఆందోళనలు మొదట తక్కు వస్థాయిలోనే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు […]

ప్రభ న్యూస్ 29 Nov 2022 5:55 pm

ఇకపై చదువు ఒక్కటే పని.. టీచర్లకు ఇతర విధులు బంద్ : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఉపాధ్యాయుల విధులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఉపాధ్యాయేతర విధుల నుంచి టీచర్లకు మినహాయింపునిచ్చింది. దశాబ్ధాలుగా ఉపాధ్యాయులు చేస్తున్న ఎన్నికల విధులు, జనగణన వంటి విధుల నుంచి వారిని తప్పించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు వర్చువల్‌గా సంతకాలు చేశారు. తమను విద్యాయేతర విధుల నుంచి తప్పించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉపాధ్యాయులు పూర్తిగా విద్యార్ధుల చదువుపై దృష్టి కేంద్రీకరించనున్నారు. Also REad: ఇకపై హైస్కూల్ విద్యార్ధులకూ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ఇకపోతే.. హైస్కూల్ విద్యార్ధుల అటెండెన్స్ విషయంలో కీలక మార్పులు తీసుకురానుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యార్ధులకు కూడా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయించింది. డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ నెలాఖరు లోగా విద్యార్ధులందరిని యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తోంది. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి అన్ని కోర్సుల్లోనూ ఇదే తరహాలో అటెండెన్స్ తీసుకోనున్నారు. ఇప్పటికే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు సైతం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే హాజరు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జియో ట్యాగింగ్ సాంకేతికత ద్వారా ఆయా కాలేజీల్లో మాత్రమే యాప్ పనిచేసే విధంగా యాప్ డిజైన్ చేసింది ప్రభుత్వం. కేవలం రెండు నిమిషాల్లోనే విద్యార్ధుల హాజరు నమోదు చేసేలా యాప్ రూపొందించినట్లుగా తెలుస్తోంది.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:54 pm

లాంచ్‌కు ముందే మహీంద్రాఎక్స్‌యూ‌వి 400 ఫీచర్స్ లీక్.. ఫీచర్స్ ఇంకా ఎన్ని వేరియంట్‌లలో వస్తుందో తెలుసా..?

దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి ఎక్స్‌యూ‌వి400 వేరియంట్‌లు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. లీకైన సమాచారం ప్రకారం, ఎక్స్‌యూ‌వి 400లో ఎన్ని వేరియంట్‌లు రావచ్చు, ఎలాంటి ఫీచర్లను కంపెనీ అందించబోతుందో చూద్దాం... ఎన్ని వేరియంట్లు ఉంటాయంటే మీడియా కథనాలు, ఇంటర్నెట్‌లో లీక్ అయిన సమాచారం ప్రకారం, మహీంద్రా ఎక్స్‌యూ‌వి400 ఎలక్ట్రిక్‌ మూడు వేరియంట్లలో రావచ్చు. ఈ మూడు వేరియంట్లు బేస్, ఈ‌పి ఏ‌ఎన్‌డి ఈ‌ఎల్. ఫీచర్లు ఎలా ఉంటాయంటే నివేదికల ప్రకారం, మహీంద్రా XUV400 టాప్ వేరియంట్ Adreno X సాఫ్ట్‌వేర్‌తో ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పొందుతుంది. దీనితో పాటు, SUVకి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్‌బ్యాగ్‌లు, డిస్క్ బ్రేక్‌లు, ABS, EBD, చైల్డ్ సీట్ యాంకర్లు, ట్రాక్షన్ కంట్రోల్, లెథెరెట్ అప్హోల్స్టరీ, ఆటో డిమ్మింగ్ IRVM, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ సిస్టమ్, హీటెడ్ ORVMలు, TPMS, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ కెమెరాతో సహా ఎన్నో ఫీచర్లు XUV400లో అందుబాటులో ఉంటాయి. ఈ SUVలో 378 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంది, అంటే టాటా నెక్సాన్ కంటే ఎక్కువ బ్యాటరీ అండ్ మోటార్ ఈ XUV 400 ఎలక్ట్రిక్ 39.4 kWh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ కారణంగా SUV ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత 456 కి.మీల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. SUVలోని శక్తివంతమైన బ్యాటరీతో పాటు అందించబడే మోటార్ SUVకి 150 bhp శక్తిని, 310 న్యూటన్ మీటర్ టార్క్‌ ఇస్తుంది. ఈ మోటారుతో SUV కేవలం 8.3 సెకన్లలో సున్నా నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకుంటుంది. వీటితో పాటు, SUVలో డ్రైవింగ్ కోసం మూడు మోడ్‌లు ఉంటాయి- ఫన్, ఫాస్ట్ అండ్ ఫియర్‌లెస్. ధర ఎంతంటే ఈ సమాచారాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.15 లక్షలు ఉండవచ్చని అంచనా.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:53 pm

జోరుగా వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా.. డెలవరీకి ఐదురోజులా?

నిత్య అవసరాలకు వాడుకునే వంట గ్యాస్ కమర్షియల్‌గా వాడుతున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి పడుకునే వరకు ఒక ఇంట్లో గ్యాస్ తో పని ఉంటది.

దిశా డైలీ 29 Nov 2022 5:53 pm

ఇన్ స్టా గ్రామ్ లో రామ్ చ‌ర‌ణ్ కి 10మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్.. పండ‌గ చేసుకుంటోన్న ఫ్యాన్స్

త‌న అభిమానుల అభిరుచుల‌కు అనుగుణంగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. కాగా సోషల్ మీడియాలో అరుదైన మైల్‌స్టోన్ చేరుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఇన్‌స్టాగ్రామ్‌లో రాంచరణ్ ఫాలోవర్ల సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంది. ఈ మార్క్‌ను చేరుకున్న అతికొద్ది మంది యాక్టర్లలో రాంచరణ్‌ కూడా ఒకడు కావడం విశేషం. రాంచరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఆర్‌సీ 15 సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఈ చిత్రంలో […]

ప్రభ న్యూస్ 29 Nov 2022 5:52 pm

FIFA: వేషాలేస్తే జైళ్లో వేస్తాం.. కుటుంబాలకు నరకయాతన తప్పదు.. ఆటగాళ్లకు ఇరాన్ ప్రభుత్వం హెచ్చరికలు..!

ప్రపంచకప్ ఆడేందుకు ఖతర్‌కు వచ్చిన ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మ్యాచ్ కు ముందు గానీ.. ఆట జరిగే సమయంలో గానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేశానికి ఆడుతున్నారనే కనికరం కూడా లేకుండా అందరినీ తీసుకెళ్లి జైళ్లల్లో పడేస్తామని, కుటుంబాలకు టార్చర్ అంటే ఏంటో చూపెడతామని హెచ్చరించింది. గెలిచినా ఓడినా నోరు మూసుకుని ఉంటేనే మంచిదని.. కథలు పడితే కటకటాలు తప్పవని ఆదేశించినట్టు ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా ఆ దేశపు ఆటగాళ్లు ఇంగ్లాండ్ తో ఆడిన తమ తొలి మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా మౌనం దాల్చారు. ఇరాన్ ప్లేయర్స్ చేసిన ఈ నిరసనతో ఇన్నాళ్లు అక్కడికే పరిమితమైన ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ పై అంతర్జాతీయ సమాజం తీవ్ర విమర్శలకు దిగుతున్నది. ఈ మ్యాచ్ అనంతరం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్సీజీ) తమ జట్టు ఆటగాళ్లందరితో మీటింగ్ ఏర్పాటు చేసినట్టు సీఎన్ఎన్ పేర్కొంది. ఈ మీటింగ్ లో ఐఆర్సీజీ ప్రతినిధులు.. ఫుట్‌బాల్ ప్లేయర్లను మందలించారని, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు తెలుస్తున్నది. Iran’s footballers were summoned to a meeting with the Iranian Revolutionary Guard Corps (IRGC) after Eng game and informed their families would face “violence and torture” if they did not sing the national anthem or if they joined any political protest https://t.co/nTnbfzIZah — Colin Millar (@Millar_Colin) November 28, 2022 మ్యాచ్ కు ముందు అన్ని జట్ల మాదిరిగానే నిబంధలను పాటించాలని, నిరసనలు, మౌనం వహించడం వంటి చర్యలకు దిగితే అలా చేసినవారికి జైలు శిక్ష తప్పదని, అలాగే వారి కుటుంబాలకు కూడా నరకం చూపిస్తామని హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బెదిరింపులతోనే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా నిరసన తెలిపిన ఇరాన్.. తర్వాత వేల్స్ తో మ్యాచ్ లో మాత్రం యథావిధిగా జాతీయ గీతాలపన చేసింది.ఇక గ్రూప్ స్టేజ్ లో భాగంగా బుధవారం (నవంబర్ 30) ఆ జట్టు యూఎస్ఏతో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో సక్రమంగా ఉండాలని, గెలిచినా ఓడినా ఫర్వాలేదు గానీ పిచ్చి వేషాలేస్తే మాత్రం తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐఆర్సీజీ ప్రతినిధులు ఆటగాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఇరాన్ నిరసన తెలిపిన తర్వాత వేల్స్ తో మ్యాచ్ లో ఐఆర్సీజీకి చెందిన గార్డ్స్ ప్రేక్షకుల్లో కలిసిపోయి మ్యాచ్ ను వీక్షించినట్టు తెలుస్తున్నది. ఆటగాళ్లు ఎవరైనా ‘గీత దాటితే’వారిని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నారని.. యూఎస్ఏతో మ్యాచ్ లో కూడా వాళ్లు వస్తారని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే అందరికీ మంచిదని సున్నితంగా మందలించినట్టు పలు అంతర్జాతీయ వెబ్ సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. Source tells CNN that after Iranian players refused to sing the national anthem in their opening match against England the players were called to a meeting with members of the Iranian Revolutionary Guard Corps. — Faytuks News Δ (@Faytuks) November 28, 2022

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:51 pm

ఎలుకను చంపిన వ్యక్తి.. కేసు నమోదు చేసి, జైలులో పెట్టిన పోలీసులు

క్రూరమైన రీతిలో ఎలుక ప్రాణాలు తీసిన మనోజ్ కుమార్ పై పోలీసులు సెక్షన్ 429, సెక్షన్ 11 (1) (1)ల కింద కేసు నమోదైంది.

తెలుగు పోస్ట్ 29 Nov 2022 5:51 pm

Kaloji University Alert : ఖాళీగా ఉన్న సీట్ల కోసం వెబ్‌ ఆప్షన్లు, ఎప్పటినుండి అంటే ….

పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజి హెల్త్‌ యూనివర్సిటీ ‌తెలిపింది. ఈ మేరకు హెల్త్‌ యూనివర్సిటీ నేడు స్ట్రె (STRAY) విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చెసింది. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను ఈ చివరి విడత కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. నేడు రాత్రి 7 గంటల […] The post Kaloji University Alert : ఖాళీగా ఉన్న సీట్ల కోసం వెబ్‌ ఆప్షన్లు, ఎప్పటినుండి అంటే …. first appeared on TeluguMirchi.com .

తెలుగు మిర్చి 29 Nov 2022 5:50 pm

'కశ్మీర్ ఫైల్స్'పై కామెంట్స్ తో పెను దుమారం.. ఎవరీ నడవ్ లాపిడ్, ఏ దేశం ?

కశ్మీర్ ఫైల్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో.. అంతే స్థాయిలో వివాదాలు కూడా సృష్టిస్తోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్లపై జరిగిన నరమేధం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో.. అంతే స్థాయిలో వివాదాలు కూడా సృష్టిస్తోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్లపై జరిగిన నరమేధం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైనకశ్మీర్ ఫైల్స్ ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయం అందుకుంది. కశ్మీర్ పండిట్లపైజరిగిన హత్యాకాండని కళ్ళకి కట్టినట్లు చూపించారు అంటూ కొందరు ప్రశంసించగా.. ఇది రాజకీయ ప్రేరేపిత చిత్రం అంటూ విమర్శలు కూడా వినిపించాయి. ఈ చిత్రం వెనుక బీజేపీకి రాజకీయ అజెండాఉందంటూ ఇతర పార్టీలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిజంగా చరిత్ర తెలిసిన వాళ్ళు, వాస్తవాలు ఎరిగిన వాళ్ళు ఈ చిత్రాన్ని రాజకీయ అజెండామూవీ అని విమర్శించరుఅంటూ చిత్ర యూనిట్ కౌంటర్ ఇస్తోంది. ఇదిలా ఉండగా గోవా వేదికగా జరిగిన అంతర్జాతీయ భారత చలన చిత్ర వేడుకల్లోకశ్మీర్ ఫైల్స్ చిత్రం దుమారం రేపింది. జ్యూరీ అధ్యక్షుడిగా నడవ్ లాపిడ్ ప్రసంగిస్తూ.. ఇలాంటి ప్రఖ్యాత సినిమా వేడుకలోకశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాన్ని ప్రదర్శించడం విచారకరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది వల్గర్ మూవీ, హింసాత్మక చిత్రం. రాజకీయ ప్రేరేపితకారణాలతోనే ఈ చిత్రం తెరకెక్కినట్లు అనిపిస్తోందిఅంటూ నడవ్ లాపిడ్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. దీనితోఅసలు ఇంతకీ ఈ నడవ్ ఎవరు ? ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటూ నెటిజన్లు సెర్చింగ్ మొదలు పెట్టారు. నడవ్ లాపిడ్ ఇజ్రాయెల్ కి చెందిన రచయిత, దర్శకుడు. 1975లో జన్మించిన నడవ్ ఆ దేశంలోనేఫిలాసఫీ చదివారు. అనంతరం ప్యారిస్ లో లిటరేచర్ పూర్తి చేశారు. 2011లో నడవ్ తెరకెక్కించిన పోలీస్ మెన్ చిత్రానికి లోకర్నో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. 2014లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాతోనడవ్ కి అనుబంధం ఏర్పడింది. ఆ ఏడాది నడవ్ తెరకెక్కించిన 'ది కైండర్గార్టెన్ టీచర్' చిత్రానికి ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు లభించింది. లాపిడ్ ఇజ్రాయెల్ లో సినిమా కోసం అనేక పోరాటాలు చేశారు. దర్శకుడిగా ఆయన.. ది స్టార్, అహెడ్స్నీ, సినోనిమ్స్, లవ్ లెటర్ టూ సినిమా లాంటి ఎన్నో చిత్రాలు తెరకెక్కించారు. ఇలాంటి ప్రఖ్యాత అంతర్జాతీయ దర్శకుడు అంతర్జాతీయ భారత చలనచిత్ర వేడుకలోఈ రకమైన కామెంట్స్ చేయడం దుమారం రేపుతోంది. నడవ్ లాపిడ్ కామెంట్స్ కి అదే స్థాయిలో కౌంటర్లుకూడా పడుతున్నాయి. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ.. నిజాలు చాలా ప్రమాదకరమైనవి.. అవివ్యక్తుల చేత అబద్దాలు కూడా చెప్పిస్తాయి.. అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. కశ్మీర్ ఫైల్స్ లో కీలక పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్ కూడా నడవ్ కి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. యూదులపై దారుణమైన మారణహొహంఅనుభవించిన వర్గానికి చెందిన దర్శకుడు ఈ రకంగా మాట్లాడడం సిగ్గు చేటు. యూదులపై జరిగిన మారణ హోమం నిజమైతే.. కశ్మీర్ పండిట్లపై జరిగిన నరమేధం కూడా నిజమే.. ఆయనకిదేవుడు తెలివి ప్రసాదించాలి అని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:49 pm

సరికొత్త గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్ సూచీలు

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం వరుసగా ఆరవ రోజున సరికొత్త జీవన గరిష్ఠాలను నమోదు చేశాయి. ఫార్మా, మెటల్, ఎఫ్‌ఎంసిజి రంగాల షేర్లలో కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. స్టాక్ మార్కెట్ మంగళవారం ముగిసే సమయానికి సెన్సెక్స్ 177.04 పాయింట్లు లేక 0.28 శాతం పెరిగి 62681.84 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 55.30 పాయింట్లు లేక 0.30 శాతం పెరిగి 18618.05 వద్ద ముగిసింది. మొదట మార్కెట్ ఫ్లాట్ […]

మన తెలంగాణ 29 Nov 2022 5:49 pm

మహిళలు కాలికి మెట్టెలు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లయిన మహిళలు కాలికి మెట్టెలు పెట్టుకోవడం మనం చూస్తుంటాము. అయితే ఇలా మెట్టెలు పెట్టుకోవడం సాంప్రదాయమే కాకుండా దీని వెనుక సైన్స్ దాగివుంది. హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పెళ్లైన మహిళ మెడలో మంగళసూత్రంతో పాటు కాలికి మెట్టెలు కూడా పెట్టుకుంటారు. ఈ విధంగా కాలికి మెట్టెలు పెట్టుకోవడం కేవలం సాంప్రదాయం మాత్రమేనని చాలామంది భావిస్తారు. అయితే ఇలా మెట్టెలు పెట్టుకోవడం వెనుక ఎంతో సైన్స్ దాగి ఉందని చాలామందికి తెలియదు. పెళ్లి తర్వాత మహిళలు మెట్టలు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి ఈ మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని వస్తే... వివాహం అనంతరం మహిళలు కేవలం సాంప్రదాయబద్ధంగా మాత్రమే కాకుండా మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మన శరీరంలో ఉండే అన్ని అవయవాలకు సంబంధించి ప్రధాన నాడులు ఉంటాయి. అయితే ప్రధాన నాడీ వ్యవస్థను అలాగే ఇతర నాడుల కొనల్ని మనం ప్రేరేపించినప్పుడు ఆనాడుల ద్వారా ఆ శరీర భాగాలు ఉత్తేజితమవుతుంటాయి. ఈ క్రమంలోనే మన కాలి బొటనవేలు మధ్యలో గుంతగా ఉండటం వల్ల మనం నడిచేటప్పుడు మన బొటన వేలు నేలను తాకదు. అందువల్ల కాలికి మెట్టెలు తొడుగుతారు. ఇలా మెట్టెలు తొడిగి మనం నడిచిన ప్రతిసారి వేళ్ళు భూమిని తాకుతూ అక్కడ ఉన్నటువంటి నాడులు ప్రేరేపితం అవుతాయి. ఇలా మన అరికాలలో ఒక్కో భాగం మన శరీరంలో ఒక్కో వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. ఇలా మెట్టెలు ధరించి మనం పాదాన్ని నేలకు తాకుతూ నడవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు ఉత్తేజితం అవడం కోసమే ఇలా కాలికి మెట్టెలను తొడుగుతారు. మనం నేలను తాకుతూ నడవడం వల్ల అక్కడున్నటువంటి నాడులో ప్రధానంగా గర్భాశయాన్ని ప్రేరేపించడం వల్ల గర్భాశయ సమస్యలు తొలగిపోవడమే కాకుండా తొందరగా సంతానోత్పత్తి కలగడానికి దోహదపడుతుంది. అందుకే పెద్దవాళ్లు పెళ్లి తర్వాత కాలికి మెట్టెలు తొడిగే సాంప్రదాయాన్ని తీసుకువచ్చారు. అదేవిధంగా మన ఒంట్లో ఉన్నటువంటి వేడిని మొత్తం గ్రహించే శక్తి కూడా వెండికి ఉంటుంది.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:49 pm

ఈ సంక్రాంతి పండగ వేళ ఇంటిని సర్వాంగ సుందరంగా అలంకరించడానికి పలు సూచనలు!

మనం 2023 సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ మకర సంక్రాంతి పండుగకు కౌంట్‌డౌన్‌ కూడా అంతే వేగంగా కొనసాగుతుంది.

దిశా డైలీ 29 Nov 2022 5:48 pm

దమ్ముంటే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలి: MP Arvind ఛాలెంజ్

సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని తక్షణమే రద్దు చేయాలని బీజేపీ నేత, ఎంపీ ధర్మపురి అరవింద్ ఛాలెంజ్ చేశారు.

దిశా డైలీ 29 Nov 2022 5:48 pm

డిసెంబర్ 1 నుంచి ఇక సామాన్యుల చేతికి డిజిటల్ రూపాయి: ఆర్బీఐ బిగ్ అనౌన్స్ మెంట్...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ 1 నుండి రిటైల్ రంగంలో డిజిటల్ రూపాయిని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రిటైల్ డిజిటల్ కరెన్సీ కోసం ఇది పైలట్ ప్రాజెక్ట్. అంతకుముందు, నవంబర్ 1 న, సెంట్రల్ బ్యాంక్ హోల్ సేల్ లావాదేవీల కోసం డిజిటల్ రూపాయిని ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్‌లో ప్రకటించిన డిజిటల్ రూపాయి ఎట్టకేలకు సాకారమయ్యేలా కనిపిస్తోంది. డిసెంబర్ 1 నుంచి ప్రాక్టికల్ ప్రాతిపదికన రిటైల్ డిజిటల్ రూపీలను ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది. డిజిటల్ టోకెన్ రూపంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) డిజిటల్ రూపాయి , అధికారిక జారీదారుగా ఉంటుందని RBI తెలిపింది. అయితే అన్ని ప్రాంతాలలో ప్రాక్టికల్ అసైన్‌మెంట్‌లు అందుబాటులో లేవు. దీని పైలట్ ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే నిర్వహించనున్నారు. ఇందులో భాగస్వాములయ్యే కస్టమర్‌లు, వ్యాపారుల క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (CUG) ఉంటుంది, అని విడుదల తెలిపింది. ఈ డిజిటల్ రూపాయి విషయానికి వస్తే ప్రస్తుతం ఇవి పేపర్ కరెన్సీ నోట్లు, నాణేల విలువతో సమానం.వీటిని బ్యాంకుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆర్బీఐ అధికారులు తెలిపారు. కస్టమర్లు డిజిటల్ వాలెట్లు, మొబైల్ ఫోన్లు లేదా బ్యాంకు ధృవీకరించిన పరికరాల ద్వారా డిజిటల్ రూపాయి లావాదేవీలు చేసుకోవచ్చని ఆర్‌బీఐ ఇప్పటికే తెలిపింది. లావాదేవీలు వ్యక్తి నుండి వ్యక్తికి , వ్యక్తి నుండి వ్యాపారికి చేయవచ్చు. ప్రజలు దుకాణంలో ఉంచిన క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించి దుకాణదారునికి కూడా చెల్లించవచ్చని ఆర్బీఐ అధికారులు తెలిపారు. డిజిటల్ రూపాయి అంటే ఏమిటి?: సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) లేదా డిజిటల్ రూపాయి అనేది ఇప్పటికే RBI ద్వారా జారీ చేయబడిన కరెన్సీ, ఇదిల ఫిజికల్ రూపంలోని కరెన్సీ నోట్స్, నాణేలకు డిజిటల్ వేరియంట్. డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ రూపీ అనేది డబ్బు యొక్క ఎలక్ట్రానిక్ రూపం. కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు. కేంద్ర బడ్జెట్ 2022ను సమర్పిస్తున్నప్పుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెంట్రల్ బ్యాంక్ తన డిజిటల్ కరెన్సీని విడుదల చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. డిజిటల్ రూపాయి ఫీచర్లు: డిజిటల్ రూపాయి భౌతిక నగదు లక్షణాలను కూడా అందిస్తుంది. నగదు విషయంలో, ఇది ఎటువంటి వడ్డీని పొందదు , బ్యాంకుల్లో డిపాజిట్లు వంటి ఇతర రకాల డబ్బుగా మార్చబడుతుంది. పైలట్ ప్రాజెక్ట్‌లో, డిజిటల్ రూపాయిలను జారీ చేయడం, జారీ చేయడం , ఉపయోగించడం వంటి మొత్తం ప్రక్రియను పరీక్షిస్తారు. 8 బ్యాంకుల గుర్తింపు: దశలవారీగా డిజిటల్ రూపాయి లావాదేవీల కోసం ఆర్‌బీఐ ఇప్పటికే ఎనిమిది బ్యాంకులను గుర్తించింది. ఇది మొదటి దశలో నాలుగు బ్యాంకులతో ప్రారంభమవుతుంది. అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, యెస్ బ్యాంక్ , ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్. దేశంలోని నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయి లావాదేవీలను నిర్వహించనుంది. మిగిలిన నాలుగు బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ తరువాత పైలట్ స్కీమ్‌లో చేరనున్నాయి. తొలి దశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ అనే నాలుగు నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. తరువాత, డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్ అహ్మదాబాద్, గాంగ్టాక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా , సిమ్లాలలో నిర్వహించబడుతుంది. మరిన్ని బ్యాంకులు, వినియోగదారులు , అవసరమైన ప్రదేశాలను చేర్చడానికి పైలట్ పథకం , పరిధిని క్రమంగా విస్తరించవచ్చని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:47 pm

స్లీవ్ లెస్ అందాలతో రవితేజ హీరోయిన్ రచ్చ.. కొంటె నవ్వుతో కుర్ర హృదయాలను కొల్లగొట్టిన మాళవికా శర్మ!

యంగ్ హీరోయిన్ మాళవికా శర్మ నెట్టింట అందాలను విందు చేస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. గ్లామర్ పోజులతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేస్తోంది. ‘బ్యాచిలర్ ఆఫ్ లా’ పట్టా పొందిన మాళవికా శర్మ మోడల్ గా మారి హీరోయిన్ గా తెలుగు తెరపై మెరిసింది. మోడల్ గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ.. హీరోయిన్ గా తెలుగు చిత్రంతోనే వెండితెరకు పరిచయం అయ్యింది. మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటించిన చిత్రం ‘నేల టిక్కెట్టు’లో హీరోయిన్ మాళవికా శర్మ అవకాశం దక్కించుకుంది. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత రామ్ పోతినేని సరసన ‘రెడ్ చిత్రంలో నటించినా అదే పరిస్థితి. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి తొలిరెండు చిత్రాలు కలిసి రాలేదు. దీంతో పక్క ఇండస్ట్రీల వైపు చూడసాగింది. ఇప్పటికే తమిళంలో ‘కాఫీ విత్ కాదల్’ చిత్రంలో నటించింది. ఈనెల 4నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతోనూ పెద్దగా క్రేజ్ సంపాదించలేకపోయింది. సోషల్ మీడియాలో మాత్రం మాళవికా శర్మ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. గ్లామర్ విందుతో కుర్రాళ్లను తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో వరుసగా ఫొటోషూట్లు చేస్తూ ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తోంది. తాజాగా మాళవికా పంచుకున్న ఫొటోల్లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. నేవీ బ్లూ చుడీదార్ లో, ఎల్లో కలర్ దుప్పట్టాలో మెరిసిపోయింది. ప్రకాశంవతమైన రూపసౌందర్యం, మదిని మీటే చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది. కొంటె చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా.. బాలీవుడ్ లోనూ ఆఫర్లు దక్కించుకుంటోంది యంగ్ బ్యూటీ మాళవికా శర్మ. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salmaan Khan) నటిస్తున్న ‘కిసి కా బాయ్ కిసికా జాన్’చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీతోనైనా మాళవికా శర్మ కేరీర్ మలుపు తిరుగుతుందని భావిస్తోంది.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:45 pm

బల్దియా టౌన్‌ ప్లానింగ్‌ బర్బాత్‌!

వరంగల్‌ మహానగర పాలక సంస్థ పాలనపై అంతులేని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా బల్దియా అధికారుల తీరు, పాలకుల వ్యవహారం మాత్రం మారడం లేదు. అక్రమాలు వెలుగు చూసినా, అవినీతి బట్టబయలైనా నిండ మునిగాక చలి ఉండదనే సామెతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.

దిశా డైలీ 29 Nov 2022 5:45 pm

'Pushpa: The Rise' Russian trailer out

కొంతకాలంగా మన తెలుగు సినిమాల రేంజ్ పెరిగిపోతుంది. భాషతో సంబంధం లేకుండా విదేశాల్లో దూసుకుపోతున్నాయి.

దిశా డైలీ 29 Nov 2022 5:43 pm

అసెంబ్లీని రద్దుచేసిన మరుక్షణమే రాష్ట్రపతి పాలన... దమ్ముంటే ఆ పని చేయ్: కేసీఆర్‌కు ఎంపీ అరవింద్ చాలెంజ్

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పథకంలో పేదలకు ఇచ్చే డబ్బులో కూడా టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భీంగల్ పట్టణంలో బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి.. జనంతోనే మనం పాదయాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కొందరు అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారని విమర్శించారు. ఉ మ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు మరుక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని అన్నారు. గవర్నర్ కూడా రెడీగా ఉన్నారని.. తాను దీని గురించి ఎక్కువగా మాట్లాడనని అన్నారు. సీఎం కేసీఆర్ కి దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని సవాల్ విసిరారు. నిజాలు మాట్లాడితే తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల పైసలు తిన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇటీవల బేగంపేటలో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని అన్నారు.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:43 pm

య‌శోద‌లో ఈవా ఐవీఎఫ్ పేరు మార్పు.. ఓటీటీ రిలీజ్ కి లైన్ క్లియ‌ర్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన య‌శోద చిత్రంపై ఈవా ఐవీఎఫ్ హాస్ప‌ట‌ల్ వారు కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. యశోద చిత్రానికి మణిశర్మ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ అందించారు. యశోద చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ తెరకెక్కించారు. హీరోయిన్ స‌మంత‌.. ఉన్ని ముకుందన్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. యశోద చిత్రంలో తమ ఆస్పత్రిని […]

ప్రభ న్యూస్ 29 Nov 2022 5:41 pm

1న సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు జాబ్‌మేళా

సంగారెడ్డిః ఎస్‌ఐఎస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల కొరకు డిసెంబర్1న ఇంటర్వూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి వందన తెలిపారు. జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో 1వ తేదీన సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల కొరకు బైపాస్ రోడ్డులోని పాత వెలుగు ఆఫీస్‌లో జాబ్‌మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు వయస్సు 21నుండి 35సంవత్సరాలలోపు ఎత్తు 167.5సెంమీటర్లు ఉండాలని, విద్యార్హతలు పదవతరగతి పాస్, ఫెయిల్ అయిన వారు అర్హలన్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఒక నెల […]

మన తెలంగాణ 29 Nov 2022 5:40 pm

భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేకు వర్షం ముప్పు

భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేకు వర్షం ముప్పు

v6 వెలుగు 29 Nov 2022 5:40 pm

అల్లర్లకు పాల్పడే దమ్ము ఎవరికీ లేదు: అమిత్ షా

అల్లర్లకు పాల్పడే దమ్ము ఎవరికీ లేదు: అమిత్ షా

v6 వెలుగు 29 Nov 2022 5:40 pm

48 గంటల్లో 100 మిలియన్ వ్యూస్.. ఒటీటీలో దూసుకుపోతున్న దుల్కర్ మూవీ ‘చుప్’

మలయాళీ సూపర్ స్టా్ర్ దుల్కర్ సల్మాన్ తెలుగు ఆడియన్స్ కు సుపరిచితమే. సీతారామం లాంటి రోమాంటిక్ లవ్ స్టోరీతో సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక సీతారామం తర్వాత దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్. లవ్ జోన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా తరువాత డైరెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిినిమాతో యాక్టింగ్ లో వేరియేషన్స్ చూపిస్తున్నారు దుల్కర్ సల్మాన్. కాగా, ఈ […]

ప్రభ న్యూస్ 29 Nov 2022 5:39 pm

ముంబయ్ రోడ్లపై సైకిల్ సవారీ చేస్తోన్న రణ్ బీర్ కపూర్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ముంబయ్ రోడ్లపై సైకిల్ పై షికారు చేస్తున్నాడు బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్. బయటకు రావాలంటే సెలబ్రిటీలు బయటపడే ఈరోజుల్లో.. కూల్ గా.. కామ్ గా సైకిల్ పై దర్జాగా బయటకు బయలుదేరాడు రణ్ బీర్. సినిమావాళ్ళకు రోడ్డుమీద తిరిగే అదృష్టం ఉండదు. ఏ సైకిల్ మీదతో... బైక్ మీదనో షికారు చేసే ఛాన్స్ అస్సలు ఉండదు. అందుకే ఎప్పుడైనా అర్ధరాత్రుల్లో కార్లు వేసుకుని అలా తిరుగుతుంటారు స్టార్ సెలబ్రిటీలు. ఒక వేళ పగటిపూట ఏ సెలబ్రిటీ అయినా బయటకు వస్తే.. ఇక అయిపోయినట్టే.. జనాలను ఆపడం ఎవ్వరివల్లాకాదు. అటు సెలబ్రిటీ సెక్యూరిటీ కూడా కష్టం అవుతుంటుంది. అందుకే స్టార్స్ కూడా అంత త్వరగా బయటకు రారు. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్.. అలా ముంబయ్ వీధుల్లో సందడి చేసి అందరికి షాక్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ముంబయి వీధుల్లో సైకిల్‌పై కనిపించి షాక్ ఇచ్చారు. ఎలక్ట్రీక్ సైకిల్ నడుపుకుంటూ.. ముంబయ్ వీధుల్లో తెగతిరిగారు. బాంద్రా నుంచి పాలీ హిల్స్‌ కు సైకిల్ మీద వచ్చారు రణ్ బీర్. పాలీ హీల్స్ తో తమ కలల సౌధం.. సొంత ఇంటి నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ కొత్త ఇంటి నిర్మాణ పనులను పరిశీలించడానికి ఈ-బైక్‌పై వచ్చిన రణ్‌బీర్.. తిరిగి అక్కడి నుంచి ఈ-బైక్ పైనే సరదాగా రైడ్‌ చేస్తూ వెళ్లారు. View this post on Instagram A post shared by @varindertchawla ఇక సెలబ్రిటీలను చూస్తు జనం ఆగుతారా.. ఆపటంసాద్యమయ్యేపనేనా...? రణ్‌బీర్‌ను చూసిన స్థానికులు ఫొటోలు తీసుకునేందుకు ఆయన వెంట పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వచ్చే ఏడాది తమ కొత్త ఇంటి గృహప్రవేశం గ్రాండ్ గా చేయాలని అనుకుంటున్నాడట రణ్ బీర్. ఇక రీసెంట్ గా బ్రహ్మాస్త్ర మూవీతో హిట్ కొట్టాడు ఈ యంగ్ హీరో. తనతో పాటు తన భార్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ సినిమాలో రణ్ బీర్ సరసన సందడి చేసింది. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ దాదాపు ఐదేళ్లు డేటింగ్ చేసుకున్నారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ 14న కొద్దిమంది ఫ్యామిలీ సభ్యులు, కొద్ది మంది ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే. పెళ్లైన రెండు నెలలకే 3 నెల ప్రెగ్నెస్సీ అంటూ.. షాక్ ఇచ్చింది ఈ జంట. ఆలియా తన ప్రెగ్నెన్సీని స్వయంగా వెల్లడించింది. ఇక నవంబర్‌ 6న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా రణ్‌బీర్‌, అలియా జంటగా నటించిన బ్రహ్మస్త్ర ఇటీవలే రిలీజై సంచలన విజయం సాధించింది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ.430 కోట్ల కలెక్షన్‌లను సాధించింది. ప్రస్తుతం రణ్‌బీర్‌.. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్‌ మూవీలో నటిస్తున్నాడు.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:39 pm

చేతులు పైకెత్తి పరువాల విందుతో సెగలు రేపుతున్న శివాత్మిక రాజశేఖర్‌.. స్టయిలీష్‌ లుక్‌లో కవ్విస్తూ రచ్చ

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ డస్కీ అందాలతో కనువిందు చేస్తుంటుంది. ఓ వైపు నెమ్మదిగా సినిమాల జాబితాని పెంచుకుంటూ మరోవైపు తన గ్లామర్‌ ఫోటోలతో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ హాట్‌ అందం. శివాత్మిక మరోసారి సోషల్‌ మీడియాలో సందడి చేసింది. తనస్టయిలీష్‌ ఫోటోని షేర్‌ చేసింది. బ్లాక్‌ స్టయిలీష్‌ డ్రెస్‌ వేసి టూ మచ్‌ హాట్‌గా మారిపోయిందీ స్టార్‌ కిడ్‌. అంతేకాదు చేతులు పైకెత్తి పరువాల విందు వడ్డించింది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లని హంట్‌ చేస్తుందీ తెలుగు అందం. లేటెస్ట్ గా పంచుకున్న థ్రో బ్యాక్‌ ఫోటోతో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది శివాత్మిక. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ పెంచేస్తుంది. వణికే చలిలోనూ చెమటలు పట్టించేలా శివాత్మిక పోజు ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు ఆమెని తదేకంగా చూస్తూ అందాలను ఆస్వాదిస్తున్నారు. హీరో రాజశేఖర్‌ రెండో కుమార్తె శివాత్మిక అనే విషయం తెలిసిందే. `దొరసాని` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దొరసానిగా, దొర కూతురు పాత్రలో సెటిల్డ్ యాక్టింగ్‌ని కనబరించింది. పాత్రలో జీవించింది. దొరకూతురు ఇలానే ఉంటుందా? అనేట్టుగా పాత్రని రక్తికట్టించింది శివాత్మిక. అయితే తాను రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయిన్ కాదనే విషయాన్ని కూడా ఆ పాత్రతోనే వెల్లడించింది. దీంతో ఈ బ్యూటీకి హీరోయిన్‌గా రొటీన్‌ సినిమాలు రావడం లేదు. బలమైన పాత్రలు కలిగిన హీరోయిన్‌ పాత్రలు వస్తున్నాయి. మరోవైపు హీరోయిన్‌గానే చేయాలనే కండీషన్‌ కూడా పెట్టుకోలేదు. బలమైన పాత్ర లభిస్తే కీ రోల్స్ చేసేందుకు సిద్ధమే అనేలా సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. ఇటీవల శివాత్మిక `ఆకాశం` అనే తమిళ చిత్రంలో నటించింది. దీంతో తెలుగు ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంది. ఇందులో మీనాక్షిగా ఇంటెన్స్ రోల్‌లో మెరిసింది. బోల్డ్ గా కనిపించి షాకిచ్చింది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. సినిమా పెద్దగా ఆదరణ పొందకపోయినా ఆమె పాత్రకి మాత్రం మంచి ఆదరణనే దక్కింది. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది శివాత్మిక. `పంచతంత్రం` సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్‌ రెండో వారంలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు `రంగమార్తాండ` చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా కూడా డిసెంబర్‌లోనే సందడి చేయబోతుంది. ఇలా ఒకే నెలలో రెండు సినిమాలతో సందడి చేయబోతుంది శివాత్మిక.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:38 pm

అసైన్డ్ భూములకు పంట రుణం ఇవ్వాలి : పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

బీర్పూర్ మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. బీర్పూర్ మండలంలోని

దిశా డైలీ 29 Nov 2022 5:35 pm

శభాష్ Arshdeep Singh.. ఆ ఒక్క మాటకు ఫ్యాన్స్ ఫిదా..!

ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ బౌలర్ అర్షదీప్.. తన అద్భుత బౌలింగ్‌తో అనతి కాలంలోనే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.

దిశా డైలీ 29 Nov 2022 5:35 pm

ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ

ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ చెక్కుల పంపిణీలో నాల్చర్ రాజు బిచ్కుంద నవంబర్ 29 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల ఖత్గాం గ్రామంలో మంగళవారం నాడు లబ్ధిదారులకు ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ నాల్చర్ భారతీ రాజు కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ … వివరాలు →

జనం సాక్షి 29 Nov 2022 5:34 pm

శ్రద్ధా వాకర్ కోసం కార్యక్రమం.. వ్యక్తిపై మహిళ చెప్పుతో దాడి.. ‘నా బిడ్డ అతని కొడుకుతో వెళ్లిపోయింది’

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్యా ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. శ్రద్ధా వాకర్ కేసులో న్యాయం జరగాలని దక్షిణ ఢిల్లీలోని ఛతర్‌పూర్‌లో హిందూ ఏక్తా మంచ్‌పై మహాపంచాయతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి లోనైంది. వేదిక పై ఉన్న ఓ వ్యక్తిపై చెప్పు విసిరేసింది. వేదిక పై ఉన్న ఆ వ్యక్తి కుమారుడితో తన కూతురు వెళ్లిపోయింది. కానీ, తన కూతురికి ఇప్పటికీ పెళ్లి అయిందా? లేదా? అనే విషయం వారికి తెలియదు. ఇప్పటికీ కూతురి కోసం ఆ కుటుంబం క్షోభిస్తున్నది. అలాంటి తరుణంలో.. తన కూతురిని తీసుకెళ్లిన యువకుడి తండ్రి కనిపించడం, అదీ ప్రేమ పేరిట బయటకు తీసుకెళ్లి అమ్మాయిని కిరాతకంగా చంపేసిన శ్రద్ధా వాకర్ కోసం నిర్వహించిన వేదికపై కనిపించడంతో ఆమెకు పట్టలేని కోపం వచ్చింది. వేదిక పై ఉన్న ఆ వ్యక్తిపై స్లిప్పర్ విసిరేసింది. Also Read: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. ఆఫ్తాబ్ పూనావాలాపై పాలిగ్రాఫ్ పాలీగ్రాఫ్ పరీక్ష పూర్తి.. డిసెంబర్ 1న నార్కో టెస్టు పారిపోయిన ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. ఇండియా టుడే మీడియా సంస్థతో ఆ మహిళ మాట్లాడింది. ‘ఆ అబ్బాయి తల్లిని నేను తరుచూ తన కూతురితో కలిపించాలని అడిగాను. కానీ, ఆమెను డిస్టర్బ్ చేయవద్దని నన్ను బెదిరించింది. నా బిడ్డకు పెళ్లి అయిందా? లేదా? అని నాకు తెలియదు. నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను’ అని అన్నారు. ఈ మహాపంచాయతీని శ్రద్ధా వాకర్‌ను హతమార్చిన ఏరియాలోనే నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి పారిపోయి ఢిల్లీకి వచ్చిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా, శ్రద్ధా వాకర్‌లు ఇదే ఏరియాలో అద్దెకు దిగారు. అక్కడే శ్రద్ధా వాకర్‌ను 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జీలో దాచి పెట్టాడు. ఆ తర్వాత ఆ ముక్కలను మెహరౌలీ అడవీ ప్రాంతాల్లో పలు చోట్ల పడేసి వచ్చాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:34 pm

వరంగల్‌ బల్దియా అధికారులు కాళ్లు కదపరు.. కళ్ళు తెరవరు

రంగల్‌ బల్దియా అధికారుల తీరు ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది.ఆఫీస్ కుర్చీలను అంటిపెట్టుకుని అధికారం వెలగబెడుతుండడం నగరవాసులకు శాపంగా పరిణమిస్తోంది.ముఖ్యంగా టౌన్‌ ప్లానింగ్‌ విభాగం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు సమస్యల్లో చిక్కు కోవాల్సిన దుస్థితి నెలకొంది.

దిశా డైలీ 29 Nov 2022 5:34 pm

మాజీ ఎంపీపీ అమృతమ్మకు నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

మాజీ ఎంపీపీ అమృతమ్మకు నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మకూర్ (ఎం) నవంబర్ 29 (జనంసాక్షి) ఆత్మకూరు స్వర్గీయ మాజీ ఎంపీపీ జన్నాయికోడే అమృతమ్మ శంకరయ్య 13వ వర్ధంతి సందర్భంగా స్వగృహంలో వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులు వారు … వివరాలు →

జనం సాక్షి 29 Nov 2022 5:32 pm

కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం : ప్రభుత్వ విప్ బాలరాజు

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేశారు.

దిశా డైలీ 29 Nov 2022 5:32 pm

తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు ఆమోదం..

తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం లభించింది. రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం తెలిపింది. ఇవాళ జరిగిన కేంద్ర జల్‌శక్తిశాఖ సాంకేతిక సలహా మండలి భేటీలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముక్తేశ్వర ఎత్తిపోతల పథకానికి ఆమోదం లభించింది. అలాగే చనకా-కొరాట ఆనకట్టకు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతలకు ఆమోదం లభించింది.

ప్రభ న్యూస్ 29 Nov 2022 5:32 pm

నేడే అడ్వకేట్ మాచర్ల మహేష్ చంద్ర జన్మదిన వేడుకలు

నేడే అడ్వకేట్ మాచర్ల మహేష్ చంద్ర జన్మదిన వేడుకలు కాజిపేట్ 20నవంబర్ జనంసాక్షి హన్మకొండ జిల్లా కాజిపేట మండలంలో టేకులగూడెం గ్రామానికి చెందిన మాచార్ల మహేష్ చంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతున్నట్లు గ్రామ యువత తెలిపారు. అంతేకాకుండ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కై మహేష్ చంద్ర తన స్వయం కృషి తో … వివరాలు →

జనం సాక్షి 29 Nov 2022 5:30 pm

ఉపాధ్యాయ ఓటరు జాబితాలో అనర్హులను గుర్తించి తొలగించాలి : ఎస్‌ టి యు

విశాలాంధ్ర`ఆస్పరి : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న అనర్హులను గుర్తించి తక్షణమే తొలగించాలని ఎస్టియు జిల్లా కార్యదర్శి నాగేంద్రప్ప డిమాండ్‌ చేశారు మంగళవారం స్థానిక తాసిల్దార్‌ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో ఎస్‌ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు డిప్యూటీ తాసిల్దార్‌ రమణ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారము ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేసే […] The post ఉపాధ్యాయ ఓటరు జాబితాలో అనర్హులను గుర్తించి తొలగించాలి : ఎస్‌ టి యు appeared first on విశాలాంధ్ర .

విశాలాంధ్ర 29 Nov 2022 5:28 pm

'గొత్తి కోయల పట్ల వివక్ష తగదు.. గ్రామసభ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలి'

చండ్రుగొండ మండలం లోని బెండల పాడు గ్రామ పంచాయతీ ఎర్రబోడు గ్రామ ఆదివాసీలను గ్రామ బహిష్కరణ చేయడం సరికాదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వజ్జా సురేష్, సరియం కోటేశ్వరరావు లు డిమాండ్ చేశారు.

దిశా డైలీ 29 Nov 2022 5:27 pm

తండ్రి కాబోతున్న రాహుల్ రామ‌కృష్ణ‌.. ప‌ర్ఫెక్ట్ ఫాద‌ర్‌గా ఉండాలంటే టిప్స్ చెప్పాలని పోస్ట్

‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్.. యాక్టర్‌ రాహుల్‌ రామకృష్ణ తాజాగా ఓ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. రాహుల్‌, తన భార్య గర్భాన్ని చూపిస్తూ ‘పర్ఫెక్ట్ ఫాదర్ గా ఉండటానికి టిప్స్ ఇవ్వండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటీజన్‌లు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rahul Ramakrishna (@weirddivide)

ప్రభ న్యూస్ 29 Nov 2022 5:26 pm

EVల కోసం ఒక్కటైన టాటా మోటార్స్, HDFC బ్యాంక్‌

దేశంలో EV స్వీకరణను పెంచే ప్రయత్నంలో, భారతదేశపు ప్రముఖ ఆటోమోటివ్ తయారీదారు టాటా మోటార్స్, భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన HDFC బ్యాంక్‌తో చేతులు కలిపి

దిశా డైలీ 29 Nov 2022 5:24 pm

దివ్యాంగులకు బస్ పాస్ జారీ మేళాలో పాల్గొన్న ఎంపీపీ రాథోడ్ సజన్

దివ్యాంగులకు బస్ పాస్ జారీ మేళాలో పాల్గొన్న ఎంపీపీ రాథోడ్ సజన్. నేరడిగొండనవంబర్29(జనంసాక్షి):ఆర్టీసీ రీజనల్ పరిధిలో దివ్యంగుల బస్ పాస్ జారి కోసం మంగళవారం రోజున మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వద్ద నిర్వహించిన మేళాలో ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ రాథోడ్ సజన్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న టీఆరెస్ పార్టీ కన్వీనర్ … వివరాలు →

జనం సాక్షి 29 Nov 2022 5:24 pm

బీజేపీ పాలనలో పేదలకు ఉచితంగా విద్య, వైద్యం: జేపీ నడ్డా

బీజేపీ పాలనలో పేదలకు ఉచితంగా విద్య, వైద్యం: జేపీ నడ్డా

v6 వెలుగు 29 Nov 2022 5:24 pm

ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి..

జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జనం సాక్షి /కొల్చారం మండల కేంద్రం కొల్చారం లోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు.బోధన తరగతుల గదుల్లోకి వెళ్లిన అదనపు కలెక్టర్ తొలి మెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్య విధానాన్ని స్వయంగా … వివరాలు →

జనం సాక్షి 29 Nov 2022 5:23 pm

అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై విచారణ: బైంసా సభలో కిషన్ రెడ్డి

నిర్మల్:తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ సర్కార్ చేసిన అవినీతిపై విచారణ చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ దోచుకున్న సొమ్మును స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచుతామని కిషన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత ప్రారంభాన్ని పురస్కరించుకొని భైంసా సమీపంలో మంగళవారంనాడు సభను నిర్వహించారు.ఈ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసులను టీఆర్ఎస్ ఏజంట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.పోలీసులు కళ్లు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. .కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ పోలీసులు తప్పులు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యబద్దంగా పనిచేస్తున్న పార్టీలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన టీఆర్ఎస్ నేతలకు సూచించారు. కేసీఆర్ సర్కార్ పతనం ప్రారంభమైందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే జైలుకు కూడా వెళ్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్రను కూడా అడ్డుకొనే ప్రయత్నించారని కేసీఆర్ సర్కార్ పై ఆయన మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కదని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి బీజేపీని అడ్డుకొంటానని కేసీఆర్ కలలు కంటున్నాడని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వెయ్యి మంది కేసీఆర్ లు, వెయ్యి మంది అసదుద్దీన్ ఓవైసీలు వచ్చినా కూడ మోడీని ఓడించలేరన్నారు. కేసీఆర్ కు రాజకీయ పార్టీలపై గౌరవం ఉండదన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులంటే గౌరవం లేదన్నారు. ఉద్యమాలను అణచివేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధానికి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదన్నారు.తెలంగాణ గవర్నర్ మహిళా అని చూడకుండా ఆమెను అవమానిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.యాత్రలను అడ్డుకుంటున్నారని కేసీఆర్ తీరును కిషన్ రెడ్డి తప్పుబట్టారు. అంతేకాదు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. also read: ప్రతిపక్షాల గొంతు నొక్కడమే: వైఎస్ షర్మిలపై పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇసుక , గ్రానైట్, సున్నపు క్వారీలు కల్వకుంట్ల కుటుంబం చేతుల్లోనే ఉన్నాయన్నారు. ఎక్కడ భూములు కన్పిస్తే ధరణి పేరుతో ఆక్రమించుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ దళిత బంధును తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:22 pm

దీక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా పండ్ల పంపిణీ చేసిన:అనిల్ గౌడ్

దీక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా సతీష్ అన్న అభిమాన సంఘం అధ్యక్షులు మార్క అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర స్థాపనకు 2009 నవంబర్ 29వ తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి ప్రాణాలను ఫణంగా … వివరాలు →

జనం సాక్షి 29 Nov 2022 5:21 pm

'బాసర విద్యార్ధులకు హాట్సాఫ్.. దెబ్బకు కేటీఆర్ దిగి వచ్చాడు'

బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులకు హ్యాట్సాఫ్.. వారికి ఉద్యమ స్ఫూర్తి బాగుందని దెబ్బకు కేటీఆర్ దిగివచ్చాడని, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

దిశా డైలీ 29 Nov 2022 5:20 pm

వీర్యకణాల సంఖ్య పెరగాలా? అయితే ఇవి తినండి..

స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఒక్కటేమిటీ ఎన్నో కారణాలుంటాయి. కారణమేదైనా.. దీనివల్ల పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. దీనివల్ల గర్భధారణ అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అయితే కొన్ని ఆహారాలను తింటే వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతుంది. ఈ రోజుల్లో చాలా మంది మగవారు తక్కువ వీర్య కణాల సంఖ్య సమస్యను ఫేస్ చేస్తున్నారు. ఇది చిన్న సమస్యగా అనిపించినప్పటికీ.. ఇది పిల్లలు పుట్టే అవకాశాలను తగ్గిస్తుంది. వాయు కాలుష్యం, వ్యాయామం లేకపోవడం, పర్యావరణ కాలుష్యం, పురుగుల మందులు అవశేశాలు, స్మోకింగ్, డ్రింకింగ్, ఆరోగ్యాన్ని పాడు చేసే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల పురుషుల్లో స్మెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుంది. వీర్యం నాణ్యత కూడా తగ్గుతుంది. నిద్రలేమి, ఒత్తిడి, మధుమేహం వంటివి కూడా వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి. వీర్యకణాల సంఖ్య పెరగాలంటే మందును ఎక్కువగా తాగడకూడదు. స్మోకింగ్ మానేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కంటినిండా నిద్రపోవాలి. ఒత్తిడికి గురికాకూడదు. రక్తపోటును కంట్రోల్ లో ఉంచుకోవాలి. ముఖ్యంగా సుఖవ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి. వీటితో పాటుగా కొన్ని రకాల ఆహారాలు కూడా స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు సహాయపడతాయి. అవేంటంటే.. గుడ్లు: గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఇవి వీర్యాన్ని ప్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అందేకాదు వీర్యకణాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు సహాయపడతాయి. పాలకూర: పాలకూరలో ఐరన్ కంటెంట్ తో పాటుగా ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ వీర్యకణాల సంఖ్య పెరిగేందుకు, ఎదిగేందుకు సహాయపడుతుంది. అరటిపండ్లు: అరటిపండ్లు కూడా వీర్యకణాల సంఖ్యను పెంచేందుకు ఇవి యాక్టీవ్ గా కదిలేందుకు సహాయపడతాయి. అరటిలో విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ఇతర పోషకాలతో పాటుగా బ్రొమిలేన్ అనే ఎంజైమ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్ ను పెంచడమే కాదు.. స్పెర్మ్ నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. గుమ్మడి గింజలు: గుమ్మడి గింజల్లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వీటిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచే ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి వీర్యకణాల సంఖ్యను పెంచుతాయి. అలాగే రక్త ప్రసరణను పెంచుతుంది. దానిమ్మ: దానిమ్మ మన శరీరంలో రక్తాన్ని పెంచడమే కాదు.. పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను కూడా పెంచుతుంది. అంతేకాదు ఈ గింజలు వీర్యం నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రీరాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. టమాటాలు: టమాటాలు స్పెర్మ్ నాణ్యతను ప్రోత్సహిస్తాయి. అలాగే వీర్యకణాల సంఖ్యను పెంచడానికి కూడా సహాయపడుతుంది. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది సంతాన సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్స్: డార్క్ చాక్లెట్లు కూడా సంతానలేమి సమస్యను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీనిలో పుష్కలంగా ఉండే ఎల్ ఆర్గినైన్ హెచ్ సీఎల్ అనే అమైనో ఆమ్లం వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. అలాగే స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:18 pm

ఏపీ ప్రభుత్వ కొత్త సీఎస్‌గా కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఉత్తరువులు జారీ !

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్‌ జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. జవహర్‌ రెడ్డిని సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ సమీర్‌శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్‌ 1 నుంచి కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి బాధ్యతలు తీసుకుంటారు. జవహర్‌ రెడ్డి ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సీఎం జగన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పని చేశారు. The post ఏపీ ప్రభుత్వ కొత్త సీఎస్‌గా కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఉత్తరువులు జారీ ! first appeared on TeluguMirchi.com .

తెలుగు మిర్చి 29 Nov 2022 5:18 pm

బాబా రీ రిలీజ్.. నేటి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా కొత్త సీన్లు.. డబ్బింగ్ చెప్పిన రజనీకాంత్

త‌మిళ సూప‌ర్ స్టార్ నటించి..నిర్మించిన చిత్రం బాబా. ఈ చిత్రంలో హీరోయిన్ గా మ‌నిషా కొయిరాలా న‌టించింది.కాగా ర‌జ‌నీకాంత్ ఈ చిత్రానికి కథ అందించి మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు . తాజాగా బాబా సినిమా మరోసారి తెరపైకి రాబోతుంది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్‌ చేయబోతున్నారు. ఇందులో కొన్ని కొత్త సీన్లు యాడ్‌ చేయబోతున్నారు. నేటి ట్రెండ్‌కి తగ్గట్టు కొన్ని సీన్లు జోడించారట. […]

ప్రభ న్యూస్ 29 Nov 2022 5:17 pm

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం మండల అధ్యక్షులు బంటు విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఉప తహశీల్దార్ రాజీ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు విశ్వనాధ్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం … వివరాలు →

జనం సాక్షి 29 Nov 2022 5:17 pm

ఏపీ నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి.. రేపు సమీర్ శర్మ పదవీవిరమణ

రేపు ప్రస్తుత సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం కొత్త సీఎస్ గా ఎవరు నియమితులవుతారని

తెలుగు పోస్ట్ 29 Nov 2022 5:17 pm

అయ్యంపల్లిలో ఎలుగుబంటి హల్చల్‌

విశాలాంధ్ర`కళ్యాణదుర్గం : అనంతపురం జిల్లా కంబదూరు మండలం అయ్యంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఎలుగుబంటి హల్చల్‌ చేసింది. ఇక్కడికి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి తరచూ ఎలుగుబంట్లు గ్రామంలో ప్రవేశిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ప్రతిరోజు గ్రామంలోకి రాత్రిపూట ఎలుగుబంట్లు వస్తున్నాయని వాటి బారిన పడి తమ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయంటూ బిక్కుబిక్కు మని జీవనం సాగిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఎలుగుబంట్లు రాక గమనించిన స్థానికులు కంటిమీద కునుకు లేకుండా జాగరణ చేస్తున్నారు. […] The post అయ్యంపల్లిలో ఎలుగుబంటి హల్చల్‌ appeared first on విశాలాంధ్ర .

విశాలాంధ్ర 29 Nov 2022 5:16 pm

వర్క్‌ ఫ్రమ్ పెళ్లి మండపం..

కరోనా కారణంగా అనేక పెద్ద, చిన్న కంపేనీలు అన్ని తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సదుపాయం కల్పించింది.

దిశా డైలీ 29 Nov 2022 5:15 pm

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు.. సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్యకు ప్రభుత్వంబాధ్యతలను అప్పగించింది. వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ అండ్ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సెలవుపై ఉన్న బుడితి రాజశేఖర్‌ను.. తిరిగివచ్చిన తర్వాత జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీకాలం ఈ నెల 30తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం నూతన సీఎస్‌ నియామకం చేపట్టింది. ఇప్పటి వరకు జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1990 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో సహా అనేక కీలక పదవులను నిర్వహించారు.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:14 pm

పంత్ ఫామ్ లో కి రావాలంటే, ఆటకు దూరంగా ఉండాల్సిందే!

పంత్ ఫామ్ లో కి రావాలంటే, ఆటకు దూరంగా ఉండాల్సిందే!

v6 వెలుగు 29 Nov 2022 5:13 pm

అసలు ఏ దేశంలో ఉన్నాం..? ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన MP Bandi Sanjay

భైంసాకు భరోసా కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్ర అని టీ-బీజేపీ చీఫ్, ఎంపీ బండి పేర్కొన్నారు.

దిశా డైలీ 29 Nov 2022 5:12 pm

అధికారంలోకి రాగానే బైంసాను మైసాగా మారుస్తం : బండి సంజయ్

అధికారంలోకి రాగానే బైంసాను మైసాగా మారుస్తం : బండి సంజయ్

v6 వెలుగు 29 Nov 2022 5:12 pm

క్రియా విశ్వవిద్యాలయంలో 2023-26 UG ప్రొగ్రామ్‌కి అడ్మిషన్లు ప్రారంభం

స్కూల్ ఆఫ్ ఇంటర్వొవెన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఎస్ఐఎఎస్), క్రియా విశ్వవిద్యాలయంలో బిఎ(ఆనర్స్), బిఎస్‪సి(ఆనర్స్) అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రాముల్లో 2023-26 గాను మొదటి రౌండ్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి.

దిశా డైలీ 29 Nov 2022 5:10 pm

సాలరీ అకౌంట్లోంచి లక్షలు మాయం... ఏకంగా డిఈవోనే బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు

మచిలీపట్నం : అమాయకులనే కాదు ఉన్నత విద్యావంతులను సైతం సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా డిఈవో (జిల్లా విద్యశాఖ అధికారి) తాహిరా సుల్తానాను కూడా సైబర్ కేటుగాళ్లు మోసం చేసారు. ఆమె సాలరీ అకౌంట్ (ఎస్బిఐ బ్యాంక్) నుండి గత ఏడాదికాలంగా పలు దఫాలుగా డబ్బులు మాయం చేసారు. ఇలా మొత్తంగా 4,90,000 రూపాయలను డిఈవో అకౌంట్ నుండి తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాన్ని గుర్తించిన డిఈవో అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలపూడి పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా వుండాలని... బ్యాంక్ అకౌంట్, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, ఫోన్ కు వచ్చే ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఆసియ నెట్ న్యూస్ 29 Nov 2022 5:09 pm

Gujarat |అసెంబ్లీ ఎన్నికల్లో సంపన్నులకే చాన్స్.. బీజేపీ అభ్యర్థుల్లో 154 మంది కోటీశ్వరులు!​

గుజరాత్​లో 27 ఏళ్లుగా పాలనలో ఉన్న బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరో 3 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అన్ని రకాల అస్త్రాలను ఉపయోగిస్తోంది. గతానికంటే భిన్నంగా ఈసారి ఎక్కువ మంది సంపన్నులకు టికెట్లు ఇచ్చినట్టు పొలిటికల్​ అనలిస్టులు చెబుతున్నారు. బీజేపీతో పాటు కాంగ్రెస్​ పార్టీ సైతం సంపన్నులకే చాన్స్​ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఒక్కో అడుగు వేస్తూ పంజాబ్​ని కైవసం చేసుకున్న ఆప్​ కూడా గుజరాత్​లో పాగా […]

ప్రభ న్యూస్ 29 Nov 2022 5:08 pm

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే..షర్మిల ఘటనపై కిషన్ రెడ్డి

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే..షర్మిల ఘటనపై కిషన్ రెడ్డి

v6 వెలుగు 29 Nov 2022 5:08 pm

కెసిఆర్ పాలనలో చారిత్రాత్మక ప్రగతి

పల్లెల అభివృద్ధికి రూ. కోట్లాది నిధులు వెచ్చింపు బాల్కొండ సెగ్మెంట్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడి నిజామాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే ఇదివరకెన్నడూ జరగలేదని అన్నారు. బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి మంగళవారం […]

మన తెలంగాణ 29 Nov 2022 5:07 pm

మాదాసి కురువలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

మాదాసి కురువలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మంత్రి సభ దగ్గర మాదాసి కురువలు ధర్నా చేపట్టారు.

దిశా డైలీ 29 Nov 2022 5:07 pm

ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌ రెడ్డి నియామకం..

సీఎం స్పెషల్‌ సీఎస్‌ గా పూనంకు అవకాశంపాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్‌ ప్రకాశ్‌ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జవహర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన జవహర్‌ రెడ్డి… ప్రస్తుతం ఏపీ వాటర్‌ రీసోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత వైద్య, ఆరోగ్య […] The post ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌ రెడ్డి నియామకం.. appeared first on విశాలాంధ్ర .

విశాలాంధ్ర 29 Nov 2022 5:06 pm