యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచాలి: వెంకట్ రెడ్డి
నల్లగొండ: యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచాలని అధికారులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. అన్ని ఐకెపి కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు పెంచాలని అధికారులకు సూచించారు. నల్గొండ ఆర్ అండ్ బి శాఖ క్యాంప్ కార్యాలయం ఇందిరా భవన్ లో జిల్లా కలెక్టర్, అధికారులతో రబీ ధాన్యం సేకరణ పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సమీక్షలు జరిపారు. రాత్రి ,పగలు లైట్లు ఏర్పాటు చేసి ధాన్యం కొని మిల్లుల కు పంపాలని, ధాన్యం ఎక్కువగా వచ్చే గ్రామాలను గుర్తించి అక్కడికి ఎక్కువ లారీలు పంపాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సలహా ఇచ్చారు. రోడ్లపై ధాన్యం పోయకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాల్స్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తెలియజేశారు. రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగు నీరు,నీడ ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. నల్గొండ నియోజక వర్గంలో 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
Chandrababu : చంద్రబాబును అక్కడికే పరిమితం చేశారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక రాష్ట్రానికే పరిమితమయ్యారు.
Kavitha : కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై కవిత ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ మారవని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత అన్నారు
ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు.. కిలో రెండు వందలు
ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని గూడూరు మార్కెట్లో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్కడ 50 కిలోల నిమ్మకాయల బస్తా ధర ఏకంగా 10 వేల రూపాయల వరకు పలుకుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరడం గమనార్హం.గత వారంతో పోల్చితే నిమ్మకాయల ధరలు గణనీయంగా పెరిగాయి. క్రితం వారం కిలో నిమ్మకాయలు 130 నుంచి 150 రూపాయల మధ్య […] The post ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు.. కిలో రెండు వందలు appeared first on Visalaandhra .
ఫ్యాక్ట్ చెక్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని సీ-ఓటర్ సర్వే చెప్పలేదు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని సీ-ఓటర్ సర్వే చెప్పలేదు
తమిళనాడు ఎన్నికల వేళ.. రూ.1200 కోట్లకు పైగా సొమ్ము సీజ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.ఇప్పటివరకు పట్టుబడిన నగదు, వస్తువుల మొత్తం విలువ రూ.1200 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు.ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.మిగిలిన మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖతో పాటు ఇతర అమలు […] The post తమిళనాడు ఎన్నికల వేళ.. రూ.1200 కోట్లకు పైగా సొమ్ము సీజ్ appeared first on Visalaandhra .
NTR నీల్ బిగ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఖరారు.. పుట్టినరోజు కానుకగా ఫస్ట్ గ్లింప్స్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న మెగా బడ్జెట్ చిత్రం పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, ఇప్పుడు ఒకేసారి బిగ్ అప్డేట్స్ వెలువడ్డాయి. పవర్ఫుల్ ప్రీ లుక్ పోస్టర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్ మరియు ఫస్ట్ గ్లింప్స్ డేట్ రెండూ ఒకేసారి అఫీషియల్‌గా అనౌన్స్ అయ్యాయి. రిలీజ్ డేట్ ఖరారు ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 11న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు […] The post NTR నీల్ బిగ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఖరారు.. పుట్టినరోజు కానుకగా ఫస్ట్ గ్లింప్స్! appeared first on Telugu Bullet .
Balayya |డింపుల్ ఉన్నట్టా..? లేనట్టా..?
Balayya | డింపుల్ ఉన్నట్టా..? లేనట్టా..? Balayya | సోషల్ మీడియాలో వైరల్
సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు
ఏపీలో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులు సమ్మె బాట పట్టారు. మార్చి నెల జీతాలు ఇప్పటికీ అందకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకటించింది.తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొన్ని ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆరోపించారు.మార్చి నెల […] The post సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు appeared first on Visalaandhra .
ప్రజల ఆరోగ్య సమస్యలు మంత్రి దృష్టికి
ప్రజల ఆరోగ్య సమస్యలు మంత్రి దృష్టికి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జహీరాబాద్
ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలి
ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలి తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : విద్యార్థులకు
ఈశాన్యంలో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు
మణిపూర్‌లోని కామ్‌జాంగ్ కేంద్రంగా 5.2 తీవ్రతతో ప్రకంపనలుఈశాన్య రాష్ట్రాలను మరోసారి భూప్రకంపనలు వణికించాయి. ఈరోజు ఉదయం మణిపూర్ కేంద్రంగా భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో మణిపూర్‌తో పాటు నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. తెల్లవారుజామున ప్రజలంతా నిద్రలో ఉండగా ఈ ఘటన జరగడంతో భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈరోజు ఉదయం 5:59 గంటలకు ఈ భూకంపం […] The post ఈశాన్యంలో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు appeared first on Visalaandhra .
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ.. రిలీజ్ డేట్ ఇదే
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం విడుదలకు రెడీ అయింది
అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు
వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. సత్తెనపల్లి లక్కీడ్రా, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యల కేసుల నుంచి ఇప్పుడిప్పుడే కొంత రిలాక్స్ అవుతున్న ఆయనపై మరో కొత్త కేసు నమోదైంది.కేసు వివరాల్లోకి వెళితే… తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షే ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదుకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ […] The post అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు appeared first on Visalaandhra .
తిరుమలలో భక్తురాలు అదృశ్యం... పారిపోయిందా?
తిరుపతి: తిరుమలలో భక్తురాలు అదృశ్యమయ్యారు. గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మ (27) అనే యువతి శ్రీవారి దర్శన కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. హెచ్ విసి 694ఎ గది నుంచి మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు బయటకు వెళ్లారు. అప్పటి నుంచి యువతి కనిపించకపోవడంతో పోలీసులు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇటీవలే సదరు యువతికి పెద్దలు వివాహం కుదిర్చారు. పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Ambait Rambabu : అంబటి రాంబాబుపై మరో కేసు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది
Jr Ntr |లైనప్ మామూలుగా లేదుగా..
Jr Ntr | లైనప్ మామూలుగా లేదుగా.. Jr Ntr | ఎన్టీఆర్
దేశంలో తొలి ప్రైవేట్ బంగారు గని
దేశంలో తొలి ప్రైవేట్ బంగారు గని కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ): ఆంధ్రప్రదేశ్ ఖనిజ
చర్చలు విఫలమైతే : ట్రంప్ హెచ్చరిక
అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.
Krrish 4 puts Hrithik Roshan Puzzled
Top Bollywood actor Hrithik Roshan has been working on Krrish 4 from the past few months. His last films Fighter and War 2 failed to make big money in theatres. Krrish 4 has been put on hold due to budget constraints. Hrithik Roshan was focused on this project and he did not sign any new […] The post Krrish 4 puts Hrithik Roshan Puzzled appeared first on Telugu360 .
Karate Kalyani Files Police Complaint Against Prakash Raj Over Ramayana Remarks
Film actress Karate Kalyani has filed a police complaint against actor Prakash Raj, accusing him of making offensive remarks about the Ramayana and hurting religious sentiments. Kalyani approached the Panjagutta police in Hyderabad and submitted a formal complaint to Inspector M Ramakrishna. She alleged that Prakash Raj made derogatory comments about Lord Sri Rama during […] The post Karate Kalyani Files Police Complaint Against Prakash Raj Over Ramayana Remarks appeared first on Telugu360 .
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు
జిల్లా పర్యాటక శాఖ అధికారికి ఘన సత్కారం
ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామంలోని శ్రీ బాల పార్వతీ సమేత శ్రీ
గిల్ గడ్డంపై హార్థిక్ హావబావాలు చూడాల్సిందే
హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. జిటిపై ఎంఐ 99 పరుగులతో తేడాతో గెలుపొందింది. తొలుత ముంబయి బ్యాటింగ్ చేసి 200 పరుగుల లక్ష్యాన్ని జిటి ముందు ఉంచింది. జిటి 15.5 ఓవర్లలో వంద పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ ముంబయి బౌలర్ అశ్విన్ కుమార్ నాలుగు వికెట్లు జిటి నడ్డి విరిచాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ సందర్భంగా సరదా సన్నివేశం జరిగింది. శుభ్‌మన్ గిల్ ఎప్పుడు క్లీన్ షేవ్‌తో కనిపిస్తాడు. గిల్ గడ్డం పెంచుకోవడంతో హార్ధిక్ పాండ్యా సరదాగా ఆటపట్టించారు. గడ్డం ఎందుకు పెంచుకున్నావన్నట్టు పాండ్యా హావబావాలు ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పొంగిపొర్లుతున్న డ్రైనేజీ…పట్టించుకోని అధికారులు
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధు కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ
కుమార్తె లేదని... వేలమందికి కన్యాదానం#Shirdi#Kanyadanam#MassMarriage#Maharashtra
Telangana : సర్కార్ కు ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక
తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించాయి
ఫసల్ బీమా అమలు చేసి ఉంటే రైతులకు నష్టం తప్పేది
ఫసల్ బీమా అమలు చేసి ఉంటే రైతులకు నష్టం తప్పేది నార్సింగి, ఆంధ్రప్రభ
Andhra Pradesh : నేడు ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె
నేడు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారు
Tollywood Actors Stuck with Production Delays
All the big-budget films are delayed due to various reasons and most of them are missing the release deadlines. Even actors like Nani who never missed a release date and delivered 2-3 releases every year are now struggling to complete his film on time. His upcoming film The Paradise faced several delays. From summer, the […] The post Tollywood Actors Stuck with Production Delays appeared first on Telugu360 .
అందుకోసమే రేవంత్, కెసిఆర్ తిట్టుకుంటున్నారు: బండి
హైదరాబాద్: మహిళలు ఉన్నత స్థాయికి వెళ్లాలన్నదే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యం అని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం మూర్ఖత్వం అని అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్ సభ సభ్యురాలు ప్రియాంకగాంధీకి పదవి ఇస్తే మొత్తం మహిళలకు పదవులు ఇచ్చినట్టు భావిస్తున్నారని, కాంగ్రెస్, ఎస్పి, డిఎంకే కుటుంబంలోని మహిళలకే సీట్లు ఇచ్చారని బండి విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే సిఎం రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్ తిట్టుకుంటున్నారని, రేవంత్ రాహువు అని కెసిఆర్ కేతువు అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎటిఎంలా మారిందని, కాళేశ్వరంపై సిఎం రేవంత్ మాట మార్చారని మండిపడ్డారు. లక్షకోట్ల స్కామా? రూ.9 వేల కోట్ల స్కామా క్లారిటీ ఇవ్వాలని సూచించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీపై టూర్ పై ఒక్కొ విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. తేజస్వీ సూర్య తప్పుగా మాట్లాడలేదని, ఏం మాట్లాడారో క్లారిటీ ఇచ్చారని తెలియజేశారు. తేజస్వీసూర్య వ్యాఖ్యలను వక్రికరించారని ధ్వజమెత్తారు. కేంద్రానికి రేవంత్ రాసిన లేఖలో ఏముంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
NTR and Neel: The New Date Arrives
Young Tiger NTR is working with KGF fame Prashanth Neel for a high voltage action entertainer. The film is titled Dragon and the announcement arrives soon. The film was initially planned for a June 2026 release but the delay in the shoot has pushed the schedules. The makers today announced that Dragon releases in theatres […] The post NTR and Neel: The New Date Arrives appeared first on Telugu360 .
సింగపూర్ కు చేరుకున్న మంత్రుల బృందం
సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం లభించింది
America - Iran - Talks అమెరికా - ఇరాన్ చర్చలకు బ్రేక్..రేపటితో కాల్పుల విరమణ గడువు?
అమెరికా - ఇరాన్ ల మధ్య చర్చలు జరిగే అవకాశం కనిపించడం లేదు
మల్కాజిగిరి ఏప్రిల్ 21(జనంసాక్షి) మౌలాలి సర్కిల్ పరిధిలోని సుధా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద సోమవారం అక్షయ తృతీయ పురస్కరించుకుని మజ్జిగ …
వాళ్లు తెలంగాణపై విషం చిమ్ముతున్నారు... చంద్రబాబు స్పందించాలి: పొన్నం
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష బాబుకు తెలియంది కాదని, 1948లో నిజాం పాలన నుంచి విముక్తి పొందిన నాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా విశాలాంధ్రలో విలీనం చేశారని, 1956 నుంచి జరుగుతున్న పరిణామాలు, అభివృద్దిలో వివక్ష, ఇక్కడి ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాలు, ముల్కీ-నాన్ ముల్కీ ఆందోళనలు, తొలి-మలి దశ ప్రత్యేక ఉద్యమాలు, వందలాది మంది అమర వీరుల ప్రాణత్యాగాలు ప్రపంచానికి తెలిసిన విషయమేనని పొన్నం చెప్పారు. నీళ్లు, నిధులు, నియమకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని 2000 తొలి దశకమంతా జరిగిన పోరాటాలకు, ఉద్యమాలకు బాబు ప్రత్యక్ష సాక్షి అని, చుక్క రక్తం నేల చిందొద్దు అన్న నినాదం, నిబద్దతతో తాము అన్ని అణచివేతల్ని ఎదుర్కొని, కష్ట నష్టాల్ని తట్టుకొని, బాట తప్పకుండా గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటాలు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమకాలీన రాజకీయాల్లో ఎంతో సీనియర్, అనుభవజ్ఞులు అయిన బాబుకు హృదయపూర్వక నమస్సులతో కొన్ని విషయాలు దృష్టికి తీసుకురావడం ఎంతో అవసరం అని భావించి చొరవతో తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నానని స్పష్టం చేశారు. 2009 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎంపిల కన్వీనర్‌గా తాను తెలంగాణ అంశాన్ని ఎన్నో స్థానిక, జాతీయ వేదికల మీద ప్రస్తావించడం చంద్రబాబు తెలిసిందేనని, ఆనాడు ‘రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలుసుందాం’ అనుకున్నాం. దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ అగ్రనేత, తల్లి సోనియా గాంధీ సారథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో రాజ్యాంగబద్దంగా, పార్లమెంట్ వేదిక మీద అందరి ఆమోదంతో రాష్ట్రం విడిపోయిందని గుర్తు చేశారు. ఇందులో ప్రతి చర్య చట్టబద్దం, రాజ్యాంగబద్దం. లోకసభ, రాజ్యసభ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం తో గెజిట్ విడుదల చేసిందని, ఇలా అన్ని పక్షాల ఆమోదంతో తెలంగాణ,`ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటిందని, దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నామని. తెలంగాణ వారు ఆంధ్రకి.. ఆంధ్రవారు తెలంగాణకి నిత్యం ఎలాంటి అభద్రతా భావం లేకుండా వివిధ పనుల నిమిత్తం వెళ్తున్నారని పొన్నం తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరుగుతున్నాయని, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయని, దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, తెలుగువారమంతా సహృదయంతో, పరస్పరం మంచి కోరుకుంటే రెండు రాష్ట్రాలు తక్కువ కాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా అభివృద్ది చెందుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే మనందరికీ కావాల్సిందని, ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు అని, ఇది బాబుకు తెలియని విషయం కాదన్నారు. భాగస్వామ్య పక్షాలైన భారతీయ జనతా పార్టీ నాయకులొకవైపు, జనసేన అధినేత మరోవైపు అక్కడక్కడ మీ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సముచితంగా లేవని, రాష్ట్ర విభజన ఏదో అనుచితంగా జరిగినట్టు, అసమంజసంగా తెలంగాణ ఏర్పడ్డట్టు చేస్తున్న అసందర్భపు వ్యాఖ్యలు తెలుగువారి మధ్య అనవసరమైన స్పర్థలు, వైషమ్యాలు, ద్వేషాలు రగిలించేవిగా ఉన్నాయని హెచ్చరించారు. ఇతరులకు లేని అపోహలు కలిగిస్తున్నాయని, మనసు కలత చెందుతోందని, ఇది ఎవరికీ మంచిది కాదు అని, ఎపిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పెద్దగా మీరు చొరవ తీసుకొని మీ భాగస్వామ్య పక్షాలైన బిజెపి, జనసేన నాయకులకు చెప్పాలని, భారత్ - పాకిస్తాన్ విభజనలా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలను విడగొట్టారని, బిజెపి ఎంపి తేజస్వి సూర్య పార్లమెంట్ ప్రత్యేక భేటీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై విషం చిమ్మే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఆంధ్ర ప్రగతికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ బాబు భాగస్వామి ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మనోభావాల్ని కలతకు గురిచేశాయన్నారు. ఇవి తెలుగు వారి మధ్య వైషమ్యాలు పుట్టించేవే అని, అలా మాట్లాడటం తప్పని మీ మంత్రివర్గ సహచరునికి చెప్పాలన్నారు. ఇవన్నిటికీ మూలం బిజెపి సీనియర్ నాయకుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలే అనుకుంటాన్నానని, రాష్ట్ర విభజన ద్వారా తల్లి-బిడ్డను విడగొట్టారని ఒకమారు, బిడ్డను సంరక్షించడానికి తల్లిని చంపారని, మరొకమారు ఆయన అనుచితంగా మాట్లాడారన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాల’ని 1997లోనే తీర్మానం చేసిన పార్టీ బిజెపి అని బహుషా ప్రధాని మోదీకి తెలియదేమో అని పొన్నం చురకలంటించారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఆయనకన్న సీనియర్ కనుక కూటమి భాగస్వామిగా ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పాలని నిలదీశారు. మరే పార్లమెంటు సభ్యుడూ రాష్ట్ర విభజనపై అనుచిత, అసందర్భ, అన్యాయపు మాటలు మాట్లాడకుండా కట్టడి చేయాలని బిజెపి ఎంపి తేజస్వి సూర్య రాష్ట్ర విభజనపై మాట్లాడిన మాటలు లోక్ సభ రికార్డులనుండి తొలగించేలా లోక్‌సభ స్పీకర్‌కు మీరు లేఖ రాయాలని చంద్రబాబును కోరారు. రాష్ట్ర విభజనను భారత్ - పాకిస్తాన్ తో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ను పోల్చడం ఇది రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చడమేనని, తేజస్వి సూర్య చెప్తున్నట్లు భారత్ పాకిస్థాన్ అంటే రెండు రాష్ట్రాల్లో భారత్ ఎవరు...? పాకిస్తాన్ ఎవరు..? రెండు దేశాల మధ్య ఉన్నట్టు రెండు రాష్ట్రాల మధ్య ఏమైనా బార్డర్ సమస్య ఉందా? అని నిలదీశారు. రెండు రాష్ట్రాలుగా ఉన్నా తెలుగువారం అందరం ఐక్యంగా, సామరస్యంతో, పరస్పర సహకారంతో అభివృద్ది పథంలో సాగటం నేటి తక్షణ అవసరం ఉందన్నారు. ఎపి సిఎం చంద్రబాబు సంపూర్ణ సహకారం కావాలని, సహృదయంతో తన వినతిని అర్థం చేసుకుంటారని, దీనికి తగు విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నాననని పొన్నం చెప్పారు.
చిన్నారి అభిమానానికి KCR ఫిదా..#telugupost #kcr #fangirl #viralvideo #viralnews
Summer Effect : ఉక్కపోత.. ఉష్ణోగ్రత... మాడిపోతామేమో మామా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అనుభవాలే కెరీర్‌ను తీర్చిదిద్దాయి- కంగనా రనౌత్
అవకాశాలు రాకపోతేనే ఎక్కువ నేర్చుకుంటాం హైదరాబాద్: అవకాశాలు రాకపోతేనే ఎక్కువగా నేర్చుకుంటామని, అనుభవాలే తన కెరీర్‌ను తీర్చిదిద్దాయని అంటోంది బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. వైవిధ్యభరితమైన పాత్రలు, కథలతో సినీప్రియుల్ని ఆకట్టుకుంటుంది. గతేడాది ‘ఎమర్జెన్సీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం ‘భారత్ భాగ్య విధాత’ అనే సినిమా చిత్రీకరణలో బిజీగా గడుపుతోందీ తార. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన సినీ రంగంలో తన తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటూ అభిమానులతో కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ‘ముంబైలో […] The post అనుభవాలే కెరీర్‌ను తీర్చిదిద్దాయి- కంగనా రనౌత్ appeared first on Visalaandhra .
Andhra Pradesh : డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళా సంఘాలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
మోదీయే మహిళా బిల్లును చంపేశారు
డీలిమిటేషన్ బిల్లును మాత్రమే మేం వ్యతిరేకించాం: ఖడ్గే కూచ్ బిహార్(పశ్చిమబెంగాల్): పునర్విభజన బిల్లునే విపక్షం వ్యతిరేకించిందని, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును చంపేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఆరోపించారు. ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుల్ని వ్యతిరేకించడం ద్వారా విపక్షం ‘భ్రూణహత్య’కు పాల్పడిందని ప్రధాని ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. మహిళా కోటాను తాము వ్యతిరేకించలేదని, విపక్షాల పోరాటమంతా డీలిమిటేషన్ బిల్లుపైనే అని స్పష్టంచేశారు. పశ్చిమబెంగాల్లోని కూచ్ బిహార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో […] The post మోదీయే మహిళా బిల్లును చంపేశారు appeared first on Visalaandhra .
అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమం..
అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమం.. హుజూర్ నగర్, ఆంధ్రప్రభ : హుజూర్
ఉపాధి హామీ పనుల్లో కొత్త నిబంధనలివే.. మే 1 నుంచి అమలు
ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 1వతేదీ నుంచి కొత్త నిబంధనలను తీసుకురానుంది
ముంబయికి విజయ తిలకం#MumbaiIndians#TilakVarma#IPL2026#GTvsMI#MumbaiIndiansWin#AshwaniKumar
నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె#TGSRTC#RTCStrike#Telangana#BusStrike#RTC
Lemon Prices : పెరిగిన నిమ్మధరలు
తెలుగు రాష్ట్రాల్లో నిమ్మకాయలు ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి
Tollywood has High Hopes on May 2026
Half of the summer season has come to an end and we are into the third week of April. Not a single Telugu release impressed the audience in the recent weeks. All the new releases from March to the mid of April under performed. The exhibition is in a struggling phase. The scorching heat and […] The post Tollywood has High Hopes on May 2026 appeared first on Telugu360 .
TGRTC : నేటి అర్థరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు.. చర్చలు సఫలమయితే?
ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచి సమ్మెకు దిగనున్నారు
టీఎఫ్‌డీఏ కోసం 30 కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ
ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (టిఎఫ్‌డిఎ) ఆధ్వర్యంలో ముప్పై కోట్ల బడ్జెట్‌తో పది సినిమాల్ని నిర్మించనున్నారు. ఈ మేరకు టీఎఫ్‌డీఏ సోమవారం నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చదలవాడ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య, కార్యదర్శి సాయి రాజేష్, ఉపాధ్యక్షులు సముద్ర, ప్రముఖ దర్శకులు నవీన్ మేడారం, అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ తదితరలు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ “చదలవాడ శ్రీనివాసరావు వారి బ్యానర్ మీద ముప్పై కోట్లతో పది సినిమాల్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా పది మంది దర్శకుల కంటే.. వంద, నూట యాభై మంది అసిస్టెంట్ దర్శకులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ సినిమాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో సీనియర్ దర్శకులు అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ వంటి వారు కీలకంగా వ్యవహరిస్తారు” అని అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ “ఇప్పుడు సినిమా పరిశ్రమలో అన్నీ పెరిగాయి.. థియేటర్లు మాత్రం తగ్గుతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకి కూడా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మంచి విలువలు, మంచి కథలు, కమర్షియల్ అంశాలుండే గొప్ప సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నాను. క్వాలిటీ సినిమాలు తీయాలి.. క్రమశిక్షణతో కచ్చితంగా ఉదయం ఏడు గంటలకు షాట్ తీయాలి. మంచి సినిమాలు తీసి.. వాటి ద్వారా హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడితే నాకు అదే చాలు’ అని తెలిపారు.
ఉద్యోగుల గురించి ప్రశ్నించినందుకే నన్ను జాబ్ నుంచి తొలగించారు: వెంకట్రామిరెడ్డి
అమరావతి: తాను తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, ఉద్యోగుల కోసం నిలదీస్తున్నందుకే తనపై కక్ష కట్టారని సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 22 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తుండడంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపిలోచంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తనని సస్పెండ్ చేశారని వివరించారు. న్యాయ పోరాటం చేసి తన ఉద్యోగం దక్కించుకుంటానని, చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చి మోసం చేసిందని, ప్రభుత్వం ఉద్యోగులకు చేస్తున్న ద్రోహంపై నిలదీస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పి ఆర్ సి లేదు, ఐఆర్ ఇవ్వలేదని, ఇప్పటివరకు నాలుగు డిఎలు ఇవ్వలేదని, సిపి ఎస్ ఉద్యోగుల సమస్య పరిష్కరించలేదని వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యోగులకు సకాలంలో కూడా జీతాలు ఇవ్వడం లేదని, ఇవన్నీ అడిగినందుకు తనని భయపెట్టాలని డిస్మిస్ చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నందుకే తనని ఉద్యోగం నుంచి తొలగించారన్నారు. మూడు లక్షల మంది అభ్యర్థులతో పోటీపడి ఉద్యోగం సంపాదించానని, ఎవరు ఉత్తగానే ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఒక్క ఆధారం లేదని, తాను ఎన్నికల ప్రచారం చేసినట్లుగా ఏఒక్క ఆర్టీసీ డిపో మేనేజర్ రిపోర్ట్ ఇవ్వలేదని, ప్రశ్నించే ఉద్యోగులను బెదిరించేందుకే తనపై చర్యలు తీసుకున్నారని, తాను భయపడనని, న్యాయ పోరాటం చేస్తానని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో వెంకట్రామిరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నాడు.
విస్తృతంగా హనుమాన్ మాలధారణ పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం మల్లక్క పేట
యాపిల్‌కు కొత్త బాస్#Apple#TimCook#JohnTernus#Nvidia#CEO#TechNews#AI#AppleCEO
డిసీసీ నూతన బ్రాంచ్ ప్రారంభం హసన్ పర్తి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాలలో
Gold Prices Today : గుడ్ న్యూస్.. కొనుగోలు దారులూ..కొనేసేయండిక
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది
శ్మశాన వాటికలో లైట్లు ఏర్పాటు చేయాలి
శ్మశాన వాటికలో లైట్లు ఏర్పాటు చేయాలి ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఢిల్లీ కాపిటల్స్ తలపడుతుంది
Tirumala : తిరుమలకు వస్తున్నారా.. వేసవి రద్దీ మొదలయింది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తన నాయకత్వంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. 15 ఏళ్లుగా కంపెనీకి సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ‘జాన్ టర్నెd’tకు కొత్త సీఈఓగా పగ్గాలు అప్పగించింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆయన ఈ పదవిని చేపడతారు.ఇక ఇప్పటివరకు సీఈఓ స్థానంలో ఉన్న టిమ్ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఈఓగా కుక్ 2011లో […] The post యాపిల్ సీఈఓగా జాన్ టర్నెస్ appeared first on Visalaandhra .
Zodiac Signs : ఈ రాశి వారికి నేడు అనూహ్యంగా లాభం వస్తుందా?
భారత దేశంలో జాతకాలను విశ్వసిస్తారు
ప్రకాశ్ రాజ్‌పై కరాటే కళ్యాణి ఫిర్యాదు
హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ శ్రీరాముడిని, హిందువుల మనోభావాలు దెబ్బతిసే విధంగా మాట్లాడారని సినీ నటి కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హిందూ ధర్మాన్ని కించపరిచారని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు స్వీకరించామని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రామాయణం, హిందువుల జోలికి వస్తే ఊరుకోమని మెచ్చరించారు. ప్రకాశ్ రాజ్ నటించిన సినిమాలో భవిష్యత్‌లో ఎలా ఆడుతాయో చూస్తామని ఘాటుగా విమర్శించారు. సెలబ్రిటీలు హిందూ దేవుళ్లను లక్షంగా చేసుకొని మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిందని చురకలంటించారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రకాశ్ రాజ్‌పై హిందు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి.
పవన్ ఆరోగ్యం మెరుగుపడాలని నేడు మృత్యుంజయ హోమం
మోపిదేవిలో నేడు జనసేన నేతలు మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నారు
Akkinenis and their Best Sankranthi Bet
Akkineni Nagarjuna has delivered several memorable films for Sankranthi. Soggade Chinni Nayana stands as the best one and is the highest grosser in the career of Nagarjuna. Kalyan Krishna Kurasala made his directorial debut with this family entertainer packed with a village drama. Nagarjuna has locked Kalyan Krishna once again. Nagarjuna will reprise the role […] The post Akkinenis and their Best Sankranthi Bet appeared first on Telugu360 .
ప్రజాప్రతినిధుల కోటాలో కో ఆప్షన్ పదవి ఇవ్వాలి
ప్రజాప్రతినిధుల కోటాలో కో ఆప్షన్ పదవి ఇవ్వాలి మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్
KCR Vows to Abolish HYDRAA as First Act Upon Returning to Power
Jagtial: In a scathing attack on the ruling Congress government, BRS President K. Chandrashekar Rao (KCR) declared that his first signature upon returning to power would be to scrap HYDRAA, which he labeled as a tool of destruction. Addressing a massive gathering at the Praja Ashirvada Sabha in Jagtial, KCR asserted that the state is […] The post KCR Vows to Abolish HYDRAA as First Act Upon Returning to Power appeared first on Telugu360 .
BRS ఢిల్లీ పర్యటనలో బీఆర్ఎస్ బృందం
ఢిల్లీ పర్యటనలో బీఆర్ఎస్ త్రిసభ్య బృందం సుప్రీంకోర్టు న్యాయవాదులను కలుస్తోంది
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పై దుష్ప్రచారం
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పై దుష్ప్రచారం ఆలేరు, ఆంధ్రప్రభ: బీజేపీ రాజకీయ
Ys Jagan : నేటి నుంచి జగన్ పులివెందులలో
వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వర్సటైల్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం అన్ని భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్... జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బద్రీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పూరి జగన్నాథ్, ఆ సినిమా విడుదలై 26 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి తన దర్శకుడిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
IPL 2026 : గెలుపు బాటన ముంబయి.. తిలక్ వర్మ సూపర్ సెంచరీ
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ముంబయి ఇండియన్స్ అద్భుత మైన విజయాన్ని సాధించింది
Japan : జపాన్ కు ‘మెగా’ భూకంపం .. అధికారుల వార్నింగ్
జపాన్ ఉత్తర తీరానికి సమీపంగా సోమవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది
స్థానికత నిబంధనల్లో మార్పులు.. కొత్త జోనల్ విధానం అమలు
స్థానికత నిబంధనల్లో మార్పులు.. కొత్త జోనల్ విధానం అమలు ఆంద్రప్రభ వెబ్ డెస్క్
- కాచిగూడ రైల్వే స్టేషన్ పార్సిల్ ఆఫీసు వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్.. - తీవ్ర అవస్థలు పడుతున్న వాహన దారులు, రైల్వే ప్రయాణికులు - పట్టించుకోని రైల్వే అధికారులు మన తెలంగాణ/కాచిగూడ : కాచిగూడ రైల్వే స్టేషన్ పార్సెల్ ఆఫీస్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సత్యనగర్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్ళే రహదారిలో పార్సెల్ ఆఫీస్ వద్ద వివిధ దూర ప్రాంతాలకు బైకులు, వివిధ వస్తువులను పార్సెల్ చేసి పంపిస్తుంటారు. అయితే ఇదే చనువు చేసుకొని పార్సెల్ ఆఫీస్ సిబ్బంది రోడ్డును పూర్తి స్థాయిలో ఆక్రమించి తమ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకుం టున్నారు. దీంతో వివిధ దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్ల కుంట ఫీవర్ హాస్పిటల్, రత్నన గర్, సత్యనగర్ మీదుగా రైల్వే స్టేషన్ కు త్వరగా చేరుకోవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో వెళ్లడంతో పార్సల్ ఆఫీస్ వద్ద ప్రతి నిత్యం పద్మవ్యూహాన్ని తలపి స్తోంది. తద్వారా పాదచారులు, వాహన దారులు, ఈ రోడ్డుపై రాక పోకలు సాగిం చలేని పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్లపైనే నడక, ప్రయా ణం సాగిస్తూ ప్రమాదాలకు గురవుతు న్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం, సా యంత్రంతో పాటు రద్దీ వేళల్లో అవస్థలు తప్పడం లేదని వారంతా చెబుతున్నా రు. రైల్వే అధికారు లు.... ఆయా అధికా రుల సమన్వయంతో పార్సిల్ ఆఫీసు వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని పలువురు వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
ఐక్యరాజ్యసమితిలో అమెరికా కొత్త పిలుపు
అమెరికా ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో “సహాయం కంటే వాణిజ్యం” అనే కొత్త కార్యక్రమానికి ఇతర దేశాలు మద్దతు ఇవ్వాలని కోరుతోంది
21staprileditorial |అమెరికా-ఇరాన్ చర్చలు నిలిచిపోయాయి.. కారణాలేమిటి?
21staprileditorial | అమెరికా-ఇరాన్ చర్చలు నిలిచిపోయాయి.. కారణాలేమిటి? 21staprileditorial | అమెరికా-ఇరాన్ చర్చలకు
21staprilsplstory |పశ్చిమ ఆసియా యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
21staprilsplstory | పశ్చిమ ఆసియా యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం 21staprilsplstory
హ్యాట్రిక్‌పై సన్‌రైజర్స్ కన్ను.. నేడు ఢిల్లీతో పోరు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగే కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదుంది. ఢిల్లీని కూడా ఓడించి హ్యాట్రిక్ విజయాన్నిఅందుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై భారీ ఆశలు పెట్టుకుంది. కిందటి మ్యాచ్‌లో అభిషేక్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్స్నే హైదరాబాద్ ఆశిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ చెలరేగితే సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరు ఖాయం. అయితే అభిషేక్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరోదాంట్లో తేలిపోతున్నాడు. ఇది జట్టును కలవరానికి గురి చేస్తోంది. హెడ్ కూడా ఈ సీజన్లో తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భారీ స్కోరు సాధించలేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా హెడ్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు కెప్టెన్ ఇషాన్ కిషన్ కూడా అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. చెన్నైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అతని బ్యాటింగ్‌లో కూడా నిలకడ కనిపించడం లేదు. కాగా, హెన్రిచ్ క్లాసెన్ మాత్రం ప్రతి మ్యాచ్‌లో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా అతను జట్టుకు కీలకంగా మారాడు. అనికేత్ వర్మ, సలీల్ అరోరా, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక మలింగ, సకిబ్, ప్రఫుల్ హింగే, ఉనద్కట్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఢిల్లీని కూడా తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు. పాథుమ్ నిసాంకా, రాహుల్, సమీర్ రిజ్వి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ తదితరులతో ఢిల్లీ బలోపేతంగా ఉంది.
21stAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
21stAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’ 21stAprilCartoon | అమెరికాలో సుంకాల రీఫండ్
Bengal Bjp |హిందుత్వ పార్టీల వైఫల్య కారణాలు
Bengal Bjp | హిందుత్వ పార్టీల వైఫల్య కారణాలు Bengal Bjp |
ప్రజా పాలన పోయి పాపాలభైరవుడు రావాలా?
మన తెలంగాణ/హైదరాబాద్/కాటారం: పాపాల బైరవుడు మళ్లీ రావాలి, ప్రజా పాలన పోవాలి అని ఒక పెద్ద మనిషి అంటున్నారని ఫాంహౌస్‌లో పడుకునే పాపాల బైరవుడు మళ్లీ ఎందుకు రావాలి, లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోస్తే ఈ ప్రభుత్వం వచ్చిందని, పాపాల బైరవుడు ఎందుకు రావాలో పార్టీ మారుతున్న పెద్ద మనిషి చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కెసిఆర్ భ్రమల్లో ఉన్నారని, ఆ కుటుంబాన్ని ఎప్పటికీ అధికారంలోకి రానివ్వనని సిఎం రేవంత్‌రెడ్డి శపథం చేశారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బిఆర్ఎస్కు ఘోరీ కట్టామని, 2029లో కూడా అదే పునరావృతం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ నీ ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటానని కార్యకర్తల సాక్షిగా ఇదే నా సవాల్ అని, 2029లో నువ్వో నేనో తేల్చుకుందామని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. జగిత్యాలలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా వందమీటర్ల లోతు గోతిలో పాతరేసి పాతిపెడతానని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో నిన్ను ఓడగొట్టినా, 2024లో నీకు గుండుసున్నా చేసినా, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్లో మీక గోరీ కట్టిన, వచ్చేసారి ఈ ఘోరీ మీ మా కాంగ్రెస్ కార్యకర్తలు జెండా ఎగురవేస్తారని జయశంకర భూపాలపల్లి కాటారం మండలం నస్తూర్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చేసారి కెసిఆర్‌కు ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, పార్టీ మారిన జీవన్ రెడ్డిలపై సిఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. జీవన్ రెడ్డి బిఆర్‌స్‌లో చేరడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఒక మాదిగ బిడ్డ అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకనే జీవన్ రెడ్డి పార్టీ మారారని, కాంగ్రెస్ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా, కుట్రపూరితంగా బిఆర్ఎస్లో చేరారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. జీవన్‌రెడ్డి చరిత్ర ఆయన వెనుకున్న మచ్చలన్నీ నాకు తెలుసనీ, 40 ఏళ్ల పాటు తన కుటుంబానికి ఎన్నో పదవులు ఇచ్చుకున్నారని, 14 సార్లు కాంగ్రెస్ బి ఫామ్ ఇస్తే మోసం చేసి వెళ్లిపోయారని, ఓడిపోయినా ఎన్నోసార్లు పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను గౌరవించిందని ఏడాదిపాటు పదవి లేకపోతే జీవన్‌రెడ్డి కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రువు పంచన చేశారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వచ్చేసారి కెసిఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని, అప్పుడు జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారో చూస్తానని ఆయన ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది కొన్ని నెలల్లోనే కూలేశ్వరం అయ్యిందని, తెలంగాణను పదేళ్లు లూటీ చేసిన కెసిఆర్‌ను ఉరి తీసినా తప్పులేదని సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భ్రమల్లో కెసిఆర్.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డి.శ్రీనివాస్ కలిసి కాంగ్రెస్‌ను ఎలా అధికారంలోకి తెచ్చారో ఇప్పుడు తాను, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కలిసి రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పాలకుల తీరుపై కెసిఆర్ చేసిన చిల్లర మాటలు అనే విమర్శకు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని, వారి తీర్పును గౌరవించకుండా ఇంకా అహంకారంతో మాట్లాడటం కెసిఆర్ భ్రమలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బిఆర్ఎస్ శకం ముగిసిందని, ఇకపై రాష్ట్రంలో కాంగ్రెస్ హవా మాత్రమే కొనసాగుతుందని సిఎం ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాయని, అభివృద్ధి పనులే తమను మళ్లీ గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిగతా రూ.3,300 కోట్లు వచ్చే నెలలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఏడాదిలోపే చేసి చూపించామని, 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద రూ.22 వేల కోట్లు వేశామని ఆయన తెలిపారు. గత విడతలో రైతుభరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు వేశామని ఈరోజు రెండోవిడతలో రూ.5,700 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మిగతా రూ.3,300 కోట్లు వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో వేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని పేదలకు సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన గతంలో ఎవరికైనా వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. 45 లక్షల 11 వేల 947 మంది రైతుల ఖాతాల్లో అనంతరం రైతు భరోసా రెండో విడత నిధులను సిఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా విడుదల చేశారు. రైతు భరోసా రెండో విడత నిధులను రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందిస్తోంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. గత నెల 23న మొదటి విడత సాయాన్ని పంపిణీ చేసింది. మొదటి విడతలో సుమారు రూ.3,590 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడతలో 45 లక్షల 11 వేల 947 మంది రైతుల ఖాతాల్లో రూ.5,563 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
ఇరాన్-అమెరికా మధ్య మరో దఫా చర్చలు ఇప్పటిలో కాకపోవచ్చు. చర్చల్లో అమెరికా, ఇరాన్ మధ్య పురోగతి లభిస్తేనే కానీ ప్రస్తుత ప్రపంచ సంక్షోభం సమసిపోదు. వాషింగ్టన్ నుంచి వైరుధ్యపూరిత చర్యలు ఎదురవుతుండడంతో రెండో దఫా చర్చలపై ఇప్పటివరకు తామెలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘ్రేయి సోమవారం స్పష్టం చేయడం ఈ సందర్భంగా ప్రస్తావించడం ముఖ్య అవసరం. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ అమెరికా కూటమి యుద్ధం ప్రారంభించడం వల్ల ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురవుతున్నాయో అమెరికా, ఇజ్రాయెల్‌తోపాటు ప్రపంచ దేశాలన్నీ అనుభవిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయ చమురు రవాణా స్తంభించింది. గ్రీక్, లైబీరియాకు చెందిన చమురు ట్యాంకర్లు వెనక్కు మరలాల్సి వచ్చింది. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 119 డాలర్లకు తాకాయి. ప్రపంచవ్యాప్తగా చమురు సరఫరాకు ముప్పు వాటిల్లుతోంది. ఇంట్రాడేలో క్రూడాయిల్ ధరలు 8% వరకు పెరిగి సుమారు 97.81 డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసింది. గత 50 రోజులుగా చమురు, గ్యాస్, గల్ఫ్ నుంచి దొంగచాటుగా హర్మూజ్ ద్వారా బయటకు పంపవలసి వస్తోంది. చమురు, గ్యాస్ ఉత్పత్తులను గల్ఫ్ దేశాలు తగ్గించుకున్నాయి. ఒక అంచనా ప్రకారం 50 బిలియన్ డాలర్ల విలువైన 500 మిలియన్ బ్యారెల్స్ చమురు అమెరికాకు ఒక నెల వరకు సరిపోతుంది. దీనికి తోడు ఎరువులు, అల్యూమినియం, హీలియం, సల్ఫర్ కొరత తీవ్రమైంది. ఫలితంగా దీని ప్రభావం రాగి, నికెల్ ఉత్పత్తిపై పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ వృద్ధి రేటు 2 శాతం వరకు మాంద్యం ఎదుర్కోక తప్పదు. ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణ తరువాత గతవారం అమెరికా ఇరాన్ మధ్య చర్చలు సజావుగా ప్రారంభమై హర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరవడానికి వీలు కల్పించాయి. అయితే ఇరాన్‌తో పూర్తిగా ఒప్పందం కుదిరేవరకు అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగుతుందని, ఇరాన్ నౌకలపై ఆంక్షలు ఉంటాయని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. అమెరికా దిగ్బంధనానికి వ్యతిరేకంగా ఒక్కరోజులోనే హార్ముజ్ జలసంధిని తిరిగి ఇరాన్ మూసివేసింది. ట్రంప్‌కు అత్యంత అభిమానపాత్రుడైన పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మున్నీర్ కూడా ఇరాన్ రేవులను అమెరికా ముట్టడించడమే రెండో దఫా చర్చలకు ప్రధాన అడ్డంకిగా వ్యాఖ్యానించడం గమనార్హం. దీనికి సాక్షంగా ఇరాన్‌ను రెచ్చగొట్టేలా ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా నావికాదళాలు కాల్పులు జరిపి స్వాధీనం చేసుకున్నాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులు చేపట్టింది. ఇరాన్ వద్ద నష్టం కలిగించే గన్బోట్లు చాలా ఉన్నాయి. గత శనివారం నాడు భారత పతాకం కలిగిన రెండు నౌకలపై కూడా ఇరాన్ కాల్పులు జరపడం ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైంది. సైనిక చర్యలు లేదా ఒత్తిళ్ల వల్ల ఇంధన సరఫరా వెంటనే తిరిగి ప్రారంభం కాకపోవచ్చు. మరో నెల లేదా ఆరు నెలల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చు. కానీ ఏదేమైనా చర్చల ద్వారానే ఉద్రిక్తతలు సడలి సానుకూల పరిస్థితి ఏర్పడుతుందని అందరి అభిప్రాయం. కానీ ఇరాన్ బోట్ గన్ దాడులతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. బుధవారం నాటికి కాల్పుల విరమణ గడువు ముగిసి చర్చలు పురోగతి సాధిస్తాయని అమెరికా, ఇరాన్ వర్గాల నుంచి ఆశాభావం వ్యక్తమవుతున్నా అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో చెప్పలేం. చర్చల్లో ‘ఇరాన్ యురేనియం నిల్వలే’ ప్రధాన అడ్డంకిగా మారింది. గత ఏడాది అమెరికా మిలిటరీ ఇరాన్లో ధ్వంసం చేసిన అణుక్షేత్రాల కింద శుద్ధిచేసిన యురేనియం నిల్వలు 440 కిలోగ్రాముల వరకు నిక్షిప్తమై ఉండవచ్చని, ఆ నిల్వలన్నీ అమెరికా స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్ వెళ్తుందని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ ఆ ప్రకటనను తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితిలోనూ శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించేది లేదని ఇరాన్ విదేశాంగ ఉపమంత్రి సయీద్ ఖతిబ్‌జడేహ్ స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద 450 కిలోల 60శాతం సుసంపన్న యురేనియం నిల్వలు ఉండడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న సంగతి వాస్తవమే. ఈ నిల్వలను 90 శాతం ఆయుధ స్థాయికి సులభంగా మార్చవచ్చని, తద్వారా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసి ప్రపంచ భద్రతను పణంగా పెట్టగలదనే భయం నెలకొంది. ఇరాన్ వద్ద 11 అణుబాంబులకు సరిపడా యురేనియం ఉందనే అంచనాల నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ అణు కేంద్రాలపై నిఘా ఉంచింది. శుక్రవారం ఇరాన్ వెనక్కి తగ్గితే అమెరికా కీలక పాత్ర వహిస్తుందా? అన్నదే ప్రశ్న. ప్రత్యర్థిని నిరంతరం అవమానించడం ఒప్పందాన్ని ఖరారు చేసే మార్గం ఎంతమాత్రం కాదు. ఇరాన్ యురేనియాన్ని పొందే ప్రయత్నంలో హర్మూజ్ జలసంధి ద్వారా ట్రాఫిక్ సాధారణ స్థితికి రావడం ముఖ్యం అన్న విషయం అమెరికా మరిచిపోకూడదు. అంతవరకు గల్ఫ్ దేశాలు పాత రేట్లకు చమురును ఉత్పత్తి చేయలేవు. అల్యూమినియం, సర్ఫర్, తదితర అవసరాల నిల్వలు సమకూరవు. మే నెల మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. చైనా నుంచి తనకు ఘనస్వాగతం లభిస్తుందన్న భావనలో ట్రంప్ ఉన్నారు. వీరిద్దరి చర్చల్లో హర్మూజ్ జలసంధి ముట్టడి ప్రధాన అంశం కానున్నది. అలాగే ఇరాన్‌కు చైనా మిత్రదేశంగా ఉంటోంది. అందువల్ల హర్మూజ్ జలసంధి రవాణా సంక్షోభం పరిష్కారం అవుతుందన్న ఆశలు కనిపిస్తున్నాయి.
21stApril2026 |మంగళవారం నేటి పంచాంగం
21stApril2026 | మంగళవారం నేటి పంచాంగం 21stApril2026 | ఈరోజు తిథి, నక్షత్రం
చరిత్ర సృష్టించాలంటే వేగం మాత్రమే చాలదు
నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వేగంగా, ప్రభావవంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఒక ప్రత్యేక గుర్తింపుగా మారింది. 2016లో నోట్ల రద్దు, 2019లో ఆర్టికల్ 370 రద్దు, ప్రస్తుతం మహిళల రిజర్వేషన్, శాసనసభ స్థానాల విస్తరణ, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రతిపాదనలు.. ఇవన్నీ ప్రభుత్వ నిర్ణయాలలో వేగం, విస్తృతిని ప్రతిబింబిస్తున్నాయి. ఇవి సాధారణ విధాన మార్పులు కాకుండా, దీర్ఘకాలిక నిర్మాణాత్మక సమస్యలకు చారిత్రాత్మక పరిష్కారాలుగా ప్రదర్శిస్తున్న మార్పులు. అయితే, భారతదేశం వంటి విస్తారమైన, విభిన్నమైన, అసమానతలతో కూడిన ప్రజాస్వామ్యంలో ప్రశ్న కేవలం ‘ఏం చేస్తున్నారు?’ అన్నదే కాదు, ‘ఎలా చేస్తున్నారు?’ అన్నదీ కీలకమే. తీర్మానాత్మక పాలనకు ఆకర్షణ ఉండటం సహజమే.. కానీ తరచూ నిష్క్రియగా విమర్శించే వ్యవస్థలో ధైర్యమైన నిర్ణయాలు, ఉద్దేశం, అధికారాన్ని, దిశను సూచిస్తాయి. అయితే ప్రజాస్వామ్యం, వేగానికి అనుకూలంగా పనిచేసే సాధనం కాదు. అది చర్చలు, సర్దుబాట్లు, సమ్మతి నిర్మాణం మీద ఆధారపడిన వ్యవస్థ. సంస్థల నిర్మాణాన్ని, ప్రజా ప్రతినిధిత్వాన్ని(ప్రాతినిధ్యాన్ని) ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తక్కువ కాలవ్యవధిలో, పరిమిత సంప్రదింపులతో తీసుకుంటే, ప్రజాస్వామ్య ప్రక్రియలు అందించే న్యాయ సమ్మతత దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, ఇక్కడ ఆందోళన.. సంస్కరణల అవసరంపై కాదు, వాటిని అమలు చేసే విధానంపై ఉంది. త్వరిత నిర్ణయాలు తీసుకోవడం, విస్తృత చర్చల తర్వాత నిర్ణయాలకు రావడం మధ్య ఉన్న ఈ ఉద్రిక్తత భారతదేశానికి ప్రత్యేకమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. సంస్కరణల పేరుతో వేగంగా, కేంద్రీకృతంగా నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలు అనుకోని పరిణామాలను ఎదుర్కొన్నాయి. టర్కీలో అత్యవసరంగా అమలు చేసిన రాజ్యాంగ మార్పులు కార్యనిర్వాహక అధికారాన్ని కేంద్రీకరించినప్పటికీ, సంస్థల మధ్య సమతుల్యతను బలహీనపరిచాయి. హంగేరీలో వేగవంతమైన చట్టపరమైన, ఎన్నికల సంస్కరణలు ప్రతిపక్ష స్వరాలను అణచివేసి, ప్రజాస్వామ్య రక్షణ వ్యవస్థలను క్రమంగా దెబ్బతీశాయి. బ్రెజిల్లో కూడా ఆర్థిక, పరిపాలనా మార్పులు ఆకస్మికంగా అమలు కావడం వల్ల విస్తృత సమ్మతి లేకపోవడంతో సామాజిక అస్థిరతకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఉదాహరణలు ఒక స్పష్టమైన పాఠాన్ని చెబుతున్నాయి.. చర్చల ప్రక్రియలను పక్కన పెట్టిన సంస్కరణలు తక్షణ రాజకీయ ఫలితాలను ఇవ్వవచ్చు, కానీ దీర్ఘకాలంలో సంస్థలను బలహీనపరచడం, ప్రజల విశ్వాసాన్ని తగ్గించడం వంటి పరిణామాలకు దారితీస్తాయి. భారతదేశంలో కూడా ఈ ధోరణి క్రమంగా స్పష్టమవుతోంది. నోట్ల రద్దును అకస్మాత్తుగా ప్రకటించడం ద్వారా నల్లధనం, అవినీతిపై కఠిన చర్యగా చూపించారు. అయితే అమలులో, నగదు ఆధారిత అనౌపచారిక ఆర్థిక వ్యవస్థలో ఉన్న బలహీనతలు బహిర్గతమయ్యాయి. లక్షలాదిమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి, జీవనోపాధులు కుదేలయ్యాయి. దీర్ఘకాల ప్రయోజనాలపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అలాగే ఆర్టికల్ 370 రద్దును జాతీయ సమగ్రత చర్యగా ప్రదర్శించినప్పటికీ, జమ్మూ-కశ్మీర్లో సాధారణ ప్రజాస్వామ్య కార్యకలాపాలు నిలిపివేసిన పరిస్థితుల్లో ఇది అమలైంది. స్థానిక ప్రజల భాగస్వామ్యం లేకపోవడం, సమాఖ్య సూత్రాలు, ప్రజాసమ్మతి పాత్రపై ప్రశ్నలను లేవనెత్తింది. ఈ రెండు సందర్భాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి- విస్తృత చర్చల కంటే వేగం, నియంత్రణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని. ప్రస్తుతం ప్రతిపాదిత మార్పులు గత చర్యలకంటే మరింత ముందుకెళ్తున్నాయి. మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా శాసన ప్రాతినిధ్యాన్ని పునఃరూపకల్పన చేయాలనే ప్రయత్నం కేవలం విధాన మార్పు మాత్రమే కాదు; రాజకీయ అధికార నిర్మాణాన్ని మళ్లీ చిత్రీకరించే ప్రక్రియగా మారుతోంది. ఈ మార్పులు అత్యంత ప్రభావవంతమైనవి. ఎందుకంటే ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? నియోజకవర్గాలు ఎలా రూపుదిద్దుకుంటాయి? ప్రాంతాల మధ్య రాజకీయ ప్రభావం ఎలా విభజించబడుతుంది? అనే అంశాలను ఇవే నిర్ణయిస్తాయి. అందువల్ల, ఇలాంటి కీలక మార్పులకు మరింత విస్తృత చర్చ, సమ్మతి అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజా జనాభా గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, పాత జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే నిర్ణయం, ప్రతినిధిత్వం, ఖచ్చితత్వం, న్యాయబద్ధతపై సందేహాలను రేకెత్తిస్తోంది. భవిష్యత్తు ఎన్నికల చక్రాలకు అనుగుణంగా ఈ సంస్కరణల సమయాన్ని నిర్ణయించడం, సంస్థాగత మార్పుల్లో రాజకీయ ప్రయోజనాల పాత్రపై అనుమానాలను పెంచుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరసమాజంతో సమగ్ర చర్చలు జరపకపోవడం, ఈ ప్రక్రియ కార్యనిర్వాహక నిర్ణయాల ఆధారంగా ముందుకు సాగుతోందనే భావనను బలపరుస్తోంది. ఇవి సాధారణ విధానపరమైన అభ్యంతరాలు మాత్రమే కావు; ప్రజాస్వామ్య న్యాయబద్ధతకు సంబంధించిన కీలక అంశాలు. ఇలాంటి విధానానికి అనేక పార్శ్వాలలో ప్రమాదాలు ఉన్నాయి. మొదటిగా, ప్రజల విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. పెద్ద స్థాయి మార్పులు ఏకపక్షంగా లేదా రాజకీయ ప్రయోజనాలతో చేపట్టినట్లు భావిస్తే, ప్రజలు, రాజకీయ వర్గాల్లో అనుమానాలు మరింత పెరుగుతాయి. ఒకసారి నమ్మకం కోల్పోతే, దాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది. ఇది ప్రజాస్వామ్య సంస్థల పనితీరును కూడా బలహీనపరచగలదు. రెండవది, సమాఖ్య వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమతుల్యతపై భారత రాజ్యాంగ నిర్మాణం ఆధారపడి ఉంటుంది. ప్రతినిధిత్వంలో మార్పులు ఈ సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. రాష్ట్రాలపై నిర్ణయాలు రుద్దుతున్నట్లుగా అనిపిస్తే, సహకార సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. మూడవది, కార్యనిర్వాహక అధికార ప్రాబల్యం క్రమంగా సాధారణమవుతుంది. పార్లమెంట్ చర్చల వేదికగా కాకుండా కేవలం నిర్ణయాలను ఆమోదించే స్థాయికి పరిమితమైతే, శాసన పర్యవేక్షణ, కార్యనిర్వాహక అధికారాల మధ్య గీత మసకబారుతుంది. ఈ అంశాలు ప్రాంతీయ ప్రభావం కోణంలో చూస్తే మరింత గంభీరంగా కనిపిస్తాయి. జనాభా నియంత్రణ, విద్య, ఆరోగ్య రంగాల్లో మెరుగైన ప్రగతి సాధించిన దక్షిణ రాష్ట్రాలు, జనాభా ఆధారిత పునర్విభజనలో వెనుకబడే ప్రమాదం ఉంది. జనాభా వృద్ధిని నియంత్రించిన రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యం స్థిరంగా ఉండటం లేదా తగ్గడం చూడవచ్చు. అదే సమయంలో అధిక జనాభా వృద్ధిగల రాష్ట్రాలకు ఎక్కువ రాజకీయ ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. దీనివల్ల మంచి పాలనకు తక్కువ ప్రభావం, అధిక జనాభాకు ఎక్కువ ప్రాధాన్యం లభించే విరుద్ధ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సమాఖ్య వ్యవస్థలో న్యాయబద్ధత, ప్రోత్సాహక వ్యవస్థలపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇలాంటి పరిణామాలు ఆర్థిక పంపిణీ, రాజకీయ ప్రాతినిధ్యంపై ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచి, దేశంలోని విభిన్న ప్రాంతాల మధ్య అసమతుల్యత భావనను పెంచే ప్రమాదం ఉంది. ఈశాన్య ప్రాంతంలో ఈ మార్పుల ప్రభావం మరింత సున్నితంగా ఉంటుంది. అక్కడి రాజకీయ పరిస్థితులు సంక్లిష్ట జాతి నిర్మాణాలు, చారిత్రక ఒప్పందాలు, నాజూకైన జనాభా సమతుల్యతలపై ఆధారపడి ఉంటాయి. నియోజకవర్గాల పునర్విభజనలాంటి చర్యలు ఈ సమతుల్యతలను మార్చే అవకాశం కలిగిస్తాయి, కొన్ని సందర్భాల్లో ఇవి అనూహ్య పరిణామాలకు దారితీయవచ్చు. గుర్తింపు (ఐడెంటిటీ), ప్రాతినిధ్యం బలంగా అనుసంధానమైన రాష్ట్రాల్లో చిన్నమార్పులు కూడా పెద్ద రాజకీయ ప్రతిస్పందనలకు దారితీస్తాయి. గతంలో పౌరసత్వం, ఓటరు జాబితాల వంటి అంశాలపై జరిగిన అనుభవాలు చూపించినట్లుగా, తగిన సున్నితత్వం, సంప్రదింపులు లేకుండా చేపట్టిన పరిపాలనా చర్యలు ఆందోళనలు, అసంతృప్తిని పెంచుతాయి. ఈ నేపథ్యంలో, సరైన సమన్వయం, ప్రజాభాగస్వామ్యం లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశమే ఆందోళనకు కారణమవుతోంది. త్వరిత నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్న వాదన, సంస్కరణలకు వ్యతిరేకం కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలోని సంస్థలను పునర్వ్యవస్థీకరించడం అవసరం. ముఖ్యంగా శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం అత్యవసరమైన, ఆలస్యమైన లక్ష్యమే. అయితే, ఈ సంస్కరణలను అమలు చేసే విధానం కూడా అంతే ముఖ్యమైనది. ప్రజాస్వామ్యం బలంగా ఉండేది కేవలం తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రమే కాదు; ఆ నిర్ణయాలు ఎలా తీసుకున్నామనే ప్రక్రియ కూడా ముఖ్యమే.. సంప్రదింపులు అనేవి అధిగమించాల్సిన అడ్డంకులు కావు; అవే ప్రజాస్వామ్య న్యాయబద్ధతను నిర్మించే, నిలబెట్టే పునాది. మోడీ ప్రభుత్వం భారీ ఆలోచనలు, ధైర్యమైన చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని ఇప్పటికే చూపించింది. ఇప్పుడు అవసరమైనది అదే స్థాయిలో ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల కట్టుబాటు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం, దానితో కొనసాగనున్న చర్చలను నిర్ణయ ప్రక్రియ ముగింపుగా కాకుండా, విస్తృత జాతీయ సంభాషణ ప్రారంభంగా చూడాలి. భారతదేశం వంటి సంక్లిష్ట దేశంలో చరిత్ర సృష్టించడం అంటే కేవలం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు; ఆ నిర్ణయాలకు సమూహ సమ్మతి బలం కల్పించడం కూడా అంతే ముఖ్యమైనది. త్వరితంగా ముందుకు సాగి సంస్థలను పునఃవ్యవస్థీకరించాలనే తపన తక్షణ రాజకీయ లాభాలను ఇవ్వవచ్చు. కానీ ప్రజాస్వామ్యం దీర్ఘకాల దృష్టిని కోరుతుంది. ప్రతినిధిత్వ నిర్మాణాన్ని మార్చే నిర్ణయాలు ప్రభుత్వాల గడువు, ఎన్నికల చక్రాలను మించి కొనసాగుతాయి. అందువల్ల, అవి రాజకీయ, ప్రాంతీయ విభేదాలపై విశ్వాసాన్ని పెంచే విధానాలపై ఆధారపడాలి. చరిత్ర మార్పుల పరిమాణాన్ని గుర్తుంచుకుంటుంది. కానీ ప్రజాస్వామ్య ఆరోగ్యం మాత్రం ఆ మార్పుల సమగ్రత, చర్చ, సమ్మతిపై ఆధారపడి జరిగాయా లేదా వేగం, ఏకపక్ష నిర్ణయాల ఫలితమా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. గీతార్థ పాఠక్
దేశవ్యాప్తంగా భూకేంద్రీకరణ, సాగు భూవ్యత్యాసాలు, భూమిలేని పేదల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది. జనాభాలో కొద్దిమంది కుటుంబాల వద్ద భూమి అత్యధికంగా ఉంది. భూసంబంధాల్లో మౌలికమైన మార్పులు కన్పించడం లేదు. ఈ విషయాన్నే ‘వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ తాజాగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో పెద్దఎత్తున భూఅసమానతలు ఉన్నాయి, దేశంలోని 10% కుటుంబాల చేతుల్లో 44 శాతం భూమి ఉంది. అందులో ఒక శాతం కుటుంబాల ఆధీనంలో 18% భూములు ఉన్నాయి. దేశంలో 2.7 లక్షల గ్రామాల్లో 65 కోట్ల మందిపై ఆధారపడి ఈ నివేదిక తయారు చేయబడింది. దేశంలో ఏ మాత్రం భూమి లేని కుటుంబాలు 46%గా ఉన్నాయి. ప్రతి గ్రామంలో బడా భూస్వామి 12.4% భూమిపై ఆధిపత్యం కలిగి ఉండగా, 3.8% గ్రామాల్లో ఒకే వ్యక్తి 50% కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నాడు. వ్యవసాయానికి అనువైన అత్యంత సారవంతమైన భూముల విషయంలో ఈ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంది. సమృద్ధిగా నీటి వనరులు, అనుకూల వాతావరణం ఉన్న ప్రాంతాల్లో సహజంగా భూమి విలువ పెరుగుతుంది. ఈ భూములను బడా భూస్వాములు పెద్దఎత్తున కొనుగోలు చేస్తుండటంతో ఈ అసమానత మరింత పెరుగుతూ ఉంది. అదేక్రమంలో చిన్న రైతులు భూమిని కోల్పోతున్నారు. వివిధ ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులు ఇతర కార్యక్రమాలు సరిగ్గా అమలు చేయని పక్షంలో బడా భూస్వాములకే ఎక్కువ మేలు జరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఇది కూడా అసమానతలకు కారణంగా ఉంది. బ్రిటిష్ కాలం నాటి జమీందారీ వ్యవస్థ ఆనవాల్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయని వరల్డ్ ఇనిక్వాలిటి ల్యాబ్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. జమీందారీ ప్రాంతాల్లో కొద్దిమంది బడా భూస్వాముల చేతిలో పెద్ద మొత్తంలో భూమి పోగుబడి ఉందని, వలస పాలన పోయినా, ఇప్పటికీ ఆ ప్రభావం కొనసాగుతూనే ఉందని వెల్లడించింది. దేశంలో భూమి యాజమాన్యం విషయంలో కల్పిస్తున్న తీవ్రమైన వ్యత్యాసాలను పరిష్కరించడానికి ఆర్థిక అభివృద్ది ఒక్కటే సరిపోదని, సమగ్రమైన భూసంస్కరణలు, వాటి పకడ్బందీ అమలుతోపాటు, బలహీనవర్గాలకు తగిన రక్షణ కల్పించాలని, ఇప్పటికే పాతుకుపోయిన సామాజిక వర్గాల నిర్మాణంలో మార్పులు రానిదే ఈ అసమానతలు తగ్గవని నివేదిక స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భూవ్యత్యాసాలు: దేశవ్యాప్త భూకమతాల వ్యత్యాసాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోను అది కొనసాగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన భూ పోరాటాలు ముఖ్యంగా తెలంగాణ రైతాంగసాయుధ పోరాటం, శ్రీకాకుళం గిరిజన ప్రజల పోరాటం నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం 1973లో భూకమతాలపై పరిమితి విధిస్తూ భూ సంస్కరణల చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం ఐదుగురు సభ్యుల ఉన్న కుటుంబానికి రెండు పంటలు పండే సారవంతమైన భూమి 10 నుండి 18 ఎకరాల పరిమితి విధించింది. మెట్ట భూమి 54 ఎకరాలుగా ప్రకటించింది. ఈ చట్టంలోని నిబంధనలను ఉపయోగించుకుని తమ భూములను చట్టపరిధిలోకి రాకుండా భూస్వాములు కాపాడుకున్నారు. నామమాత్రంగానే భూములను పంపిణీ చేశారు. భూసంబందాల్లో మౌలిక మార్పురాలేదు. భూకేంద్రీకరణ కొనసాగుతూనే ఉంది. ప్రజలు పోరాడి సాధించుకున్న అసైన్డ్ భూములు కూడా అన్యాక్రాంతం అయ్యాయి. నేడు తెలంగాణలో మొత్తం సాగు భూమి 1.48 కోట్ల ఎకరాలు. సుమారు 69 లక్షల మంది రైతులు ఉన్నారు. 10 శాతంగా ఉన్న బడా రైతుల వద్ద 50% భూమి ఉంటే, 90శాతంగా ఉన్న చిన్న, సన్నకారు రైతుల వద్ద ( 5 ఎకరాల లోపు) కేవలం 50% భూమి ఉంది. కొద్ది మంది భూస్వాములు, రాజకీయ నాయకులు, ఫామ్‌హౌజ్ యజమానుల వద్ద వందల ఎకరాల భూములు ఉన్నాయని సర్వేనివేదికలు తెలుపుతున్నాయి. ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను, 22ఎ నిషేధిత భూములుగా మార్చారు. అలా మార్చిన భూములు 20 లక్షల ఎకరాల ఉన్నాయని రెవిన్యూ శాఖ చెబుతున్నది. ఈ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టనుంది. మొత్తంగా చూస్తే తెలంగాణలో ఎక్కువ భూమి బడారైతుల వద్ద ఉంటే, అత్యధికంగా ఉన్న చిన్న, సన్న కారు రైతుల వద్ద తక్కువ భూమి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో సాగు భూమి 1.48 కోట్ల ఎకరాలుగా ఉంది. 60 నుంచి 70 లక్షల మందికి పైగా రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 85% మంది (ఐదు ఎకరాల లోపు) చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. ఇందులో రెండున్నర ఎకరాల లోపు ఉన్న సన్న కారు రైతులు 50లక్షల పైగా ఉన్నారు. 10 శాతం మంది బడా భూస్వాముల వద్ద సుమారు 40% సాగు భూమి ఉంది. 22ఎ నిషేధిత జాబితాలో 1.95 కోట్ల ఎకరాలను ప్రభుత్వం చేర్చడం ద్వారా లక్షలాది మంది రైతులు, పేదలు సాగు హక్కులు కోల్పోయారు. 1973 భూసంస్కరణల చట్టం ఆచరణలో అలంకారప్రాయంగా మారింది. అసైన్డ్, నిషేధిత భూములను కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు పంపిణీ చేసే విధానాలు అమలు జరుపుతున్నది. ఫలితంగా ఎపి లోను భూ సంబంధాల్లో మౌలిక మార్పులు జరగలేదు. కౌలు రైతులు: తెలంగాణలో సుమారు 22లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. ప్రతి ముగ్గురు రైతుల్లో ఒకరు కౌలురైతుగా ఉన్నాడు. వీరిలో సుమారు 19% (4లక్షలు) మంది భూమి లేని కౌలు రైతులు ఉన్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 35 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో 10లక్షల మంది భూమి లేని పేద కౌలురైతులు. రాష్ట్రంలో జరుగుతున్న సాగు లో 70పైగా కౌలు రైతుల వాటా ఉందని సర్వేలు తెలుపుతున్నాయి. రెండు రాష్ట్రాల కౌలు రైతులకు కౌలు భూమిపై కౌలు హక్కులు లేకపోవడం వల్ల వారికి సంస్థాగత రుణాలు, రైతు భరోసా, పంట నష్ట పరిహారాలు అందడం లేదు. తెలంగాణలో అసలు కౌలు రైతులను గుర్తించడం లేదు. రెండు రాష్ట్రాల్లో కౌలు రైతులు అనేక సమస్యలతో, సంక్షోభాన్ని ఎదుర్కొంటూ అప్పు ఊబిలో కూరుకుపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో భూసంస్కరణల చట్టాన్ని సక్రమంగా అమలు జరిపితే లక్షలాది ఎకరాల మిగులు భూములు లభిస్తాయి. వీటితోపాటు నిషేధిత భూములు, దేవాలయ, బంజరు, వివిధ మత సంస్థల కింద ఉన్నలక్షలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని గ్రామీణ పేదలకు పంపిణీ జరిగినప్పుడే భూకమతాల్లో మౌలిక మార్పులు వస్తాయి. ఇందుకోసం గ్రామీణ పేదరైతులు, కౌలురైతులు ఐక్యంగా ఉద్యమించాలి. బొల్లిముంత సాంబశివరావు 98859 83526
పశ్చిమబెంగాల్ రాజకీయాలు మరోసారి జాతీయ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం మొత్తం ఒక రాజకీయ యుద్ధభూమిలా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య జరుగుతున్న ఈ పోరు కేవలం అధికార మార్పిడికే పరిమితం కాదు.. అది ప్రాంతీయ గౌరవం, జాతీయ రాజకీయాల ప్రభావం, సామాజిక సమీకరణాల మధ్య జరుగుతున్న ఒక కీలక సమరంగా మారింది. ఈసారి ఎన్నికలపై ఆసక్తిని పెంచుతున్న అంశాలు అనేకం. మమతా బెనర్జీ ఇప్పటికే వరుస విజయాలతో తన స్థాయిని నిరూపించుకున్నారు. మరోవైపు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి, ఈసారి ఎలాగైనా బెంగాల్లో అధికారాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఈ పోరు కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఇటీవల కృత్రిమ మేధస్సు ఆధారిత అంచనాలు కూడా ఎన్నికల చర్చను మరింత వేడెక్కించాయి. పలు ఎఐ ప్లాట్ ఫార్మ్ తృణమూల్ కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం చూపుతున్నప్పటికీ, పోటీ మాత్రం హోరాహోరీగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అంచనాలను పూర్తిగా నిజమని భావించడం కంటే, వాటిని ఒక ట్రెండ్ సూచికగా చూడటం సముచితం. ఎందుకంటే బెంగాల్ రాజకీయాల్లో చివరి క్షణం వరకు పరిస్థితులు మారే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ కూడా ఆసక్తికరంగా ఉంది. రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, ఉత్తరబెంగాల్ నుంచి దక్షిణబెంగాల్ వరకు ప్రాంతాలవారీగా రాజకీయ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రాంతాల్లో బిజెపి ప్రభావం కొంత బలంగా ఉండగా, దక్షిణ బెంగాల్.. ప్రత్యేకంగా కోల్‌కతా పరిసరాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు పట్టు గట్టిగానే ఉంది. బిజెపి ఎదుగుదలకు ప్రధాన కారణాల్లో ఒకటి మత, సామాజిక సమీకరణాల్లో వచ్చిన మార్పు. హిందూ ఓటర్లలో, ముఖ్యంగా మటువా కమ్యూనిటీ వంటి వర్గాల్లో బిజెపికి పెరుగుతున్న మద్దతు గమనించదగ్గది. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలు ఈ వర్గాలపై ప్రభావం చూపాయి. మరోవైపు ముస్లిం ఓటర్లు అధికంగా తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే, జంగల్ మహల్ ప్రాంతం, ఉత్తర బెంగాల్ జిల్లాల్లో బిజెపి బలం పెంచుకుంది. కానీ గ్రామీణ దక్షిణ బెంగాల్, పట్టణ పేదవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఇంకా ప్రభావవంతంగా ఉన్నాయి. మహిళా ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం కూడా టిఎంసికి కీలక బలం. పార్టీల బలహీనతల విషయానికి వస్తే, తృణమూల్ కాంగ్రెస్‌కు అవినీతి ఆరోపణలు, స్థానిక స్థాయిలో నాయకత్వంపై అసంతృప్తి ప్రతికూలంగా మారుతున్నాయి. బిజెపి విషయంలో స్థానిక నాయకత్వ లోపం, రాష్ట్రస్థాయి కేడర్ బలహీనత వంటి అంశాలు ఇంకా సవాళ్లుగా ఉన్నాయి. అలాగే బెంగాల్ సంస్కృతిని కేంద్రంగా చేసుకుని టిఎంసి చేస్తున్న రాజకీయ ప్రయోగాలు, బిజెపి వైపునుంచి ధీటైన రాజకీయాలను ప్రేరేపిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలు కూడా ఓటర్ల నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకవైపు తృణమూల్ సంక్షేమ పథకాల విస్తరణపై దృష్టి పెట్టగా, మరోవైపు బిజెపి అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పెంపుపై దృష్టి సారిస్తోంది. కానీ చివరకు ఓటర్లు ఎవరిని ఎంచుకుంటారన్నది కేవలం వాగ్దానాలకే పరిమితం కాదు.. స్థానిక సమస్యలు, అభ్యర్థుల ప్రభావం, ప్రాంతీయ భావోద్వేగాలు కీలకంగా మారుతాయి. ఇక మరో ముఖ్య అంశం.. ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న వివాదం. ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల సంఘం పాత్ర పై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఎన్నికల పారదర్శకతపై చర్చను తెరపైకి తెచ్చాయి. ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అంశంగా మారే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్ ఎన్నికలు ఈసారి కేవలం ఓట్ల పోటీ కాదు..ఇది భావజాలాల పోరు, ప్రాంతీయత వర్సెస్ జాతీయత మధ్య సమరం, సంక్షేమం వర్సెస్ అభివృద్ధి మధ్య ఎంపిక. ఎఐ అంచనాలు ఒక వైపు సూచన ఇస్తున్నప్పటికీ, వాస్తవ ఫలితాన్ని నిర్ణయించేది చివరకు ఓటర్లే. బెంగాల్ ఓటరు ఎప్పుడూ అనూహ్య నిర్ణయాలతో రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తాడు. ఈసారి కూడా అదే జరుగుతుందా? లేక ఇప్పటికే ఉన్న ధోరణినే కొనసాగిస్తాడా? అన్నది తేలాల్సి ఉంది. ఏది జరిగినా ఒక విషయం మాత్రం అనివార్యం.. బెంగాల్ తీర్పు కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే నిర్ణయించదు, అది జాతీయ రాజకీయాల్లో కొత్త సందేశాన్ని పంపిస్తుంది. 2026 ఎన్నికల తర్వాత దేశరాజకీయ చర్చలు ఏ దిశగా తీసుకెళ్తాయో నిర్ణయించే కీలక మలుపుగా ఈ తీర్పు నిలవడం ఖాయం.
హైడ్రా ఎత్తివేతపైనే తొలి సంతకం
మన తెలంగాణ/హైదరాబాద్/కాటారం/జగిత్యా ల ప్రతినిధి: బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే హై డ్రాను ఎత్తి అవతల పడేస్తామని బిఆర్ఎస్ పార్టీ అ ధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించా రు. రాష్ట్రంలో నూటినూరు శాతం మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి రాగా నే తొలి సంతకంతోనే హైడ్రాను తీసి అవతల పారేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో హైడ్రా అని పెట్టి అన్యాయంగా పేదల ఇళ్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. పిల్లల పుస్తకాలు తీసుకోవడానికి కూడా అనుమతించకుండా పేదల ఇళ్లు కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా తరహాలో నిజామాబాద్‌లో నిడ్రాను తీసుకువస్తామని పిసిసి చీఫ్ ప్రకటించారని అన్నారు. జగిత్యాలలో జిడ్రా నా? అంటూ ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చుతామని అంటున్నారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ చెయ్యాల్సిందే అని, ఇం డ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయాలని చెప్పారు. మూ సీ పేరుతో 15వేల ఇండ్లు కూలగొడుతున్నారని, అన్ని వేల ఇం డ్లు ఎందుకు కూలగొట్టుడని ప్ర శ్నించారు. జగిత్యాల మాజీ ఎంఎల్ఎ జీవన్‌రెడ్డి అధినేత కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్లో చేరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ జీవన్‌రెడ్డికి గులాబీ కం డువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సుమారు 40 మంది తన ముఖ్య అనుచరులతో కలిసి ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, కీలక ప్రకటన చేశారు. జీవన్‌రెడ్డిని బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి జీవన్‌రెడ్డి అని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బిఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. తాను, జీవన్‌రెడ్డి భిన్న రాజకీయ వేదికల వల్ల వేర్వేరుగా పని చేశామని, వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ తాము 40 -45 ఏళ్లుగా మంచి స్నేహితులమని చెప్పారు. జీవన్‌రెడ్డి, తాను కలిసి ఎంతో పని చేశామని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్లో సభ పెడితే అక్కడికి ప్రజాప్రతినిధిగా జీవన్ రెడ్డి తన వద్దకు వచ్చి బోర్నపల్లి దగ్గర గోదావరిపై బ్రిడ్జి కావాలని అడిగారని గుర్తుచేశారు. అక్కడి నుంచే ఆదేశాలిచ్చి, 70 కోట్లు మంజూరు చేసి బ్రిడ్జి కట్టించానని తెలిపారు. తన నియోజకవర్గం పట్ల జీవన్ రెడ్డికి ఉన్న ప్రేమ అద్భుతమని కొనియాడారు. అందుకే జీవన్ రెడ్డికి మంచి పేరు ఉందని అన్నారు. జీవన్‌రెడ్డి బిఆర్ఎస్లో చేరితే ఇతర నియోజకవర్గాల్లో కూడా ప్రభావం ఉంటుందని సర్వేలు చెప్పాయని అన్నారు. జీవన్ రెడ్డి బిఆర్ఎస్లో చేరారంటేనే ఒక ఊపు వస్తుందని తెలిపారు. జగిత్యాల జిల్లా మాత్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలని కెసిఆర్ జీవన్‌రెడ్డిని కోరారు. జీవన్‌రెడ్డి నిఖార్సయిన నేత అని, ఆయనకు పదవులు కొత్తకాదు అని పేర్కొన్నారు. అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని తాను ఆయనతో చెప్పానని అన్నారు. తాను, జీవన్‌రెడ్డి కలిసి పనిచేస్తామని చెప్పారు. జగిత్యాల యుద్ధం మీ వంతు.. తెలంగాణ యుద్ధం మావంతు అంటూ సభికులకు ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆయన బ్రహ్మాండమైన పదవి వస్తుందని హామీ ఇచ్చారు.జీవన్ రెడ్డికి 75 ఏండ్లు వచ్చాయని, తనకు కూడా 72 ఏళ్లు వచ్చాయని తెలిపారు. ఇక్కడ దరిద్రం పోయేదాకా, టాప్ టు బాటమ్ అన్ని వర్గాల వారు.. ఇది మా తెలంగాణ, మేం గర్వంగా బతుకుతాం.. మేం సంతోషంగా బతుకుతామని తలెత్తుకుని చెప్పేదాకా మనం సేవ చేయాల్సిందేనని జీవన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. చివరి శ్వాస దాకా తెలంగాణకు సేవ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 75 ఏళ్లు వచ్చాయంటే నడవడదని జీవన్ రెడ్డిని ఉద్దేశించి కెసిఆర్ అన్నారు. మీకు ఇప్పుడు 50 ఏళ్లే.. ఇప్పుడు మీ వయసు 25 ఏళ్లు తగ్గిపోయిందని చమత్కరించారు. యువకునిలా, అంతటి ఉత్సాహంతో ముందుకు దూసుకుపోదామని సూచించారు. ఈ ఎదవలు కెసిఆర్ చావాలంటే ఛస్తాడా : రేవంత్ రెడ్డికి కెసిఆర్ కౌంటర్ సిఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు తనపై చేస్తున్న విమర్శలపై బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పొద్దున లేస్తే కెసిఆర్ చావాలని అంటున్నారని మండిపడ్డారు. “నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ.. నా కొడకా ఏం అనుకుంటున్నావో” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎదవలు చావాలంటే కెసిఆర్ ఛస్తాడా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో చేశామని తెలిపారు. చెరువులను బందోబస్తు చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని మిషన్ కాకతీయ చేపట్టామని పేర్కొన్నారు. రైతులు కూడా ఒక ఉద్యమంలా ఇందులో పాల్గొన్నారని చెప్పారు. అక్కడి నుంచి మొదలుపెడితే పదేళ్లలో ఎన్నో చేశామని తెలిపారు. వట్టి మాటలు, గఫ్ఫాలు కొట్టుడు కాకుండా ఎన్నో చేశామని తెలిపారు. ఈ ఐదేళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేసి, ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచి నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో నిలబడం, ఓట్లు అడగమని శాసనసభలో నిలబడి చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నారా..? అని అడిగారు. తాను చెప్పి.. ఐదేళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి మారుమూల పల్లెల్లకు కూడా నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఐదేళ్లు మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా వచ్చాయని తెలిపారు. మరి ఇప్పుడు ఏం రోగం పుట్టిందని ప్రశ్నించారు. నీళ్లు రావాలంటే.. లాగులు పలిగేదాకా సంపాలని సూచించారు. మంచి మాటకు కాకపోతే అంతే చేయాలన్నారు. పొద్దున లేస్తే కెసిఆర్ సావాలని అంటారని మండిపడ్డారరు. ఈ సందర్భంగా కెసిఆర్ ఒక కథ చెప్పారు. “ఇళ్లలో ఉట్టి మీద ఎండిపోయిన చేపలు, రొయ్యలు దాచిపెడతారు...ఆ ఉట్టి పిల్లికి అందదు...అందుకే పిల్లి శాపం పెడతది... తాడు తెగాలి... ఉట్టి పడాలి” అని పిల్లి శాపం పెడుతుందని, పిల్లి శాపానికి ఉట్టి పడతదా..? అని ప్రశ్నించారు. ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వాదం ఉండగా.. ఈ ఎదవలు కెసిఆర్ చావాలంటే కెసిఆర్ చస్తాడా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవి ఒకప్పుడు తెలంగాణలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండేదని కెసిఆర్ అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంఎల్ఎలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేని, మాట్లాడలేని పరిస్థితి ఉండేదని, అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన రోజులు ఉండేవి అని గుర్తు చేసుకున్నారు. మన బతుకు, మన భాష, ఉద్యోగాల మీద దాడి ఉండేదని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు తాను తెలంగాణ కోసం పోరాడతానని హెచ్చరించానని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో కరెంట్ చార్జీల పెంపుదల వాపసు తీసుకోవాలని, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరుగదని తాను తెలంగాణ ఉద్యమానికి పోవాల్సి వస్తదని చెప్పానని గుర్తు చేశారు. ఆయన కరెంట్ ఛార్జీల పెంపును వాపస్ తీసుకోలేదని, కొంతమంది రైతులు పోరాటానికి హైదరాబాద్‌కు వస్తే పట్టపగలు 11.30 గంటలకు విచ్చలవిడిగా కాల్చి చంపేస్తే ముగ్గురు రైతులు అక్కడికక్కడే చనిపోయారని చెప్పారు. ఇక లాభం లేదని భావించి ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎదురు తిరిగితే వీళ్లు కాల్చి చంపారు... జెండా ఎత్తడం తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమానిక శ్రీకారం చుట్టామని తెలిపారు. వెంబడి ఎవరు వచ్చినా రాకున్న ప్రజలు ఉన్నరు.. యువకులు ఉన్నరు అని బయలుదేరానని అన్నారు. తెలంగాణ కోసం తాను బయలుదేరితే అవహేళనలు చేశారని మండిపడ్డారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తే.. ఉద్యమ కెరటంగా తయారై తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. గంజి కేంద్రాలు పెట్టేవాళ్లు.. తెలంగాణలో ఒకప్పుడు రైతాంగం ఆగమాగమైపోయి చెట్టుకొకలు పుట్టుకొకరు అయిపోయారని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కాలువ ఉన్నట్వంటి జగిత్యాల, మెట్పల్లి, చొప్పదండి ప్రాంతాల నుంచి కూడా దుబాయికి, బొంబాయికి వలసలు, పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు ఉండేవని అన్నారు. కొన్ని పార్టీలు చేసే పని చూస్తే బాధ కలిగేదని అన్నారు. మహబూబ్ననగర్ జిల్లాలో నూటికి 90 మంది యువకులు వలసపోయేవారని, బతుకాలంటే బతుకపోవాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. అక్కడ ఉన్న ముసలోళ్లకు వలస వెళ్లిన వాళ్లు డబ్బులు పంపిస్తే కంట్రోల్ బియ్యం కొనుక్కొని తిని బతికే పరిస్థితి ఉండేదని అన్నారు. కొన్ని పార్టీల వాళ్లు తామేదో గొప్పతనం చేసినట్టు గంజి కేంద్రాలు పెట్టేవాళ్లు అని, అంత అద్వాన్న స్థితికి ఆనాటి పాలకులు తెలంగాణను దిగజార్చారని పేర్కొన్నారు. అది కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వం ఏదైనా తెలంగాణకు మంచినీళ్లు ఇయ్యలె.. కరెంట్ ఇవ్వలేదని చెప్పారు. మన నాయకులు అందరూ ఆ పార్టీలకు కట్టుబానిసలైపోయారని అన్నారు. మూడో విడత రైతుబంధు రావాలంటే మరో సభ పెట్టాలా..? బిఆర్ఎస్ హయాంలో రైతులు ఎంతో ఆనందంగా ఉండేవాళ్లు అని, కాంగ్రెస్ వచ్చాక రైతులకు అన్నీ బాధలే అని కెసిఆర్ విమర్శించారు. ఇప్పుడు ఎరువులు కావాలంటే యాప్‌లో చూసుకోవాలని, షాప్‌లో లేని ఎరువులు యాప్‌లో ఉంటాయా..? అని ప్రశ్నించారు. రైతుబంధు కోసం రైతులు ఆకాశం వైపు చూడాల్సి వస్తుందని అన్నారు. ఒక్కసారే వేయాల్సిన రైతుబంధు డబ్బులను ఒక్కో ఎకరానికి ఒకసారి వేస్తున్నారని విమర్శించారు. జగిత్యాలలో కెసిఆర్ సభ అనగానే ఈరోజు మళ్లీ రైతుబంధు డబ్బులు విడుదల చేస్తున్నారని, మూడో విడత రైతుబంధు రావాలంటే కెసిఆర్ మరోసారి సభ పెట్టాలా.. ఇది ప్రభుత్వమా..? అని ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళీ మొదలు కావాల్సిందే రాష్ట్రంలో ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఒక రకమైన దోపిడి, గుండాగిరి చేస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం తీరు కూల్చివేతలు,కాల్చివేతలు తప్ప ఏమీ లేదని విమర్శించారు. కరెంట్ మోటార్లకు మీటర్ పెట్టమని ఆనాడు మోడీ తన మెడపై కత్తి పెట్టినా, రైతుల కోసం మీటర్ పెట్టనియ్యలేదని అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బుల కోసం ఈ ప్రభుత్వం మీటర్ పెట్టే నిబంధనపై సంతకం పెట్టిందని చెప్పారు. కులవృత్తులు బాగుండాలని తమ హయాంలో కొన్ని పథకాలు ప్రారంభించామని, కానీ, ఈ ప్రభుత్వం యాదవులకు గొర్రె పిల్లలు, ముదిరాజ్‌లకు చేప పిల్లలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. బిఆర్ఎస్ హయంలో ఎవరు అడగకపోయినా బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చామని తెలిపారు. 6 గ్యారెంటీలు, 420 హామీలుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను పండబెట్టిందని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చెయ్యకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళీ మొదలు కావాల్సిందే అని అని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల జై యాత్ర నుంచే మొదలు కాబోతుందని కెసిఆర్ అన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మె ల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు హస్తిన పర్యటనకు వెళ్ళడం రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని బిఆర్ఎస్లో చేర్చుకోవడం హరీశ్‌కు ఇష్టంలేకే బిజెపి నేతలతో కలిసి రహస్యంగా హస్తినకు వెళ్ళారని ఇరువురు మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడి చేశారు. ఈ ప్రకటనలు ప్రకంపనలు సృష్టించాయి. అయితే ఈ ఆరోపణలను, అ నుమానాల వ్యాఖ్యలను బిఆర్ఎస్ అధినాయక త్వం తోసిపుచ్చింది. బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం మేరకు హరీశ్‌రా వు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినో ద్ కుమార్ ఢిల్లీ వెళ్ళారని పార్టీ అధినాయకత్వం సో మవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాళేశ్వ రం ప్రాజెక్టుపై కమిషన్ వెలువరించనున్న తీర్పు పై చర్చించేందుకు త్రిసభ్య కమిటీలో భాగంగా హరీశ్‌రావు వెళ్ళారని పార్టీ స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడు తూ హరీశ్‌రావు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు ఢిల్లీలో ఏ పార్టీని సంప్రదిస్తున్నారన్న విషయాలు బయటకు రావాలన్నారు. బిఆర్ఎస్ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ డబ్బుతో జగిత్యాలతో జనసమీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని తిట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కుట్ర, అక్కసు, కుతంత్రం ఎందుకని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. బిఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఒక్కరోజే విఐపిః చామల కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికి బిఆర్ఎస్లో చేరిన ఒక్క రోజే విఐపిగా ఉంటారన్నారు. బిఆర్ఎస్లో ముసలం మొదలైందన్నారు. జీవన్ రెడ్డిని చేర్చుకోవడం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదన్నారు. జీవన్ రెడ్డిని హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. కెటిఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు హరీష్ రావు వెళ్ళలేదని ఆయన తెలిపారు. రెండవ సారి జగిత్యాలకు వెళ్లినప్పుడు కెటిఆర్ హరీష్ రావును బ్రతిమిలాడి జీవన్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్ళారని ఆయన చెప్పారు. కెసిఆర్ నివాసానికి జీవన్ రెడ్డి వచ్చినప్పుడు హరీష్ రావు వెళ్ళలేదన్నారు. కెసిఆర్ సంవత్సరం తర్వాత బయటకు వస్తుంటే హరీష్ రావు ఢిల్లీకి ఎందుకెళ్ళారని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ భవిష్యత్ అంధకారంలో ఉందన్నారు. హరీష్ రావు ఢిల్లీలో ఎవరెవరిని కలిసారన్నది త్వరలో బయటకు వస్తుందన్నారు. హరీష్ రావు భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనేది ప్రజలకు తెలుసునని అన్నారు. జీవన్ రెడ్డి బిఆర్ఎస్లో చేరడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని ఆయన తెలిపారు. జీవన్ రెడ్డిని చేర్చుకుని కాంగ్రెస్ బలహీన పడిందని చెప్పే ప్రయత్నం బిఆర్ఎస్ చేస్తోందని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్లో ముసలం మొదలైందని, అది మునిగిపోయే పడవ అని ఎంపీ చామల అన్నారు. రహస్యంగా ఢిల్లీకి..ః అద్దంకి ఆరోపణ కౌన్సిల్లో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరిక ఆ పార్టీ చీలికకు దారీ తీస్తుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డిని చేర్చుకోవడాన్ని హరీష్ రావు వ్యతిరేకించారని ఆయన తెలిపారు. ఎర్రవల్లిలోని కెసిఆర్ ఫాం హౌస్‌కు జీవన్ రెడ్డి వెళ్ళినప్పుడు హరీష్ రావు అక్కడ లేరని ఆయన చెప్పారు. బిజెపి నేతలతో కలిసి హరీష్ రావు రహస్యంగా ఢిల్లీ వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు. హరీష్ రావు అలక వెనుక కారణాలు ఏమిటీ?, పార్టీ చీలికకు హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారా?, అందుకే ఢిల్లీ వెళారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అద్దంకి అన్నారు. హరీష్ రావు పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి జీవన్ రెడ్డి చేరిక వల్ల ఏర్పడిందన్నారు. ఏడాది తర్వాత కెసిఆర్ జగిత్యాల సభకు వెళితే ఆ సభకు హరీష్ రావు ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. ఖండించిన బిఆర్ఎస్ నాయకత్వం.. ఇదిలాఉండగా కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను బిఆర్ఎస్ ఖండించింది. తమ పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్లిందని ఆ పార్టీ నాయకత్వం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్ ఉన్నారని తెలిపింది. ఈ నెల 22న హైకోర్టులో కాళేశ్వరం కమిషన్‌పై వెలువడనున్న తుది తీర్పు, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన కార్యాచరణను సిద్ధం చేసేందుకు వీరు ఢిల్లీ వెళ్లారని వివరించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఈ కమిటీ ప్రత్యేకంగా చర్చిస్తుందని తెలిపింది. కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై లాయర్లతో చర్చించనున్నట్లు పేర్కొంది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వివరణ ఇదిలాఉండగా హరీష్ రావుతో వెళ్ళిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు, ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో మాట్లాడేందుకు వచ్చామన్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించి హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పొద్దున కాంగ్రెస్ తరపున మాట్లాడి రాత్రి బిజెపి నేతలతో చర్చలు జరపడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటేనని ఆయన విమర్శించారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు ..కాంగ్రెస్ నేతలకు అందరూ రేవంత్ లాగానే ఉంటారనిపిస్తోందని ఆయన దుయ్యబట్టారు. బిఆర్ఎస్ ఏదో కలకలం జరగాలని కాంగ్రెస్ నేతలు గుంత కాడి నక్కల్లా ఎదురుచూస్తున్నారని, వారి ఆశలు ఎప్పటికీ నెరవేరవని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు మంత్రులు హరీష్ రావుపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. మంత్రి తుమ్మలకు కౌంటర్ ఇదిలాఉండగా అంతకుముందు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేసిన ఆరోపణలను ఎంపీ వద్దిరాజు ప్రస్తావిస్తూ అవి నిరాధారమైనవని, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడి జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో తమ పార్టీలో చేరడాన్ని తామంతా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు.చాలా రోజుల తర్వాత కెసిఆర్ సభ పెడుతుండడంతో కాంగ్రెస్ నాయకులు దిక్కుతోచని స్థితిలో భీతిల్లిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరడం వెనుక ఉద్దేశమేమిటో విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని ఎంపీ వద్దిరాజు వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ రాజకీయ పునర్జన్మ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి మంత్రి మాట్లాడారని, బిఆర్ఎస్, కెటిఆర్, హరీష్ రావులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల తరహాలో డబుల్ గేమ్ ఆడడం, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడం తమకు రాదని, ప్రభుత్వం తీసుకునివచ్చిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూనే కేంద్ర మంత్రి ఇంట్లో జరిగిన విందుకు హాజరు కావడాన్ని ఎంపీ వద్దిరాజు ప్రశ్నించారు.
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న జెఇఇ మెయిన్ 2026 రెండో విడత ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ), సాయం త్రం పేపర్ -1 పరీక్ష తుది ఫలితాలను ప్రకటించింది. జెఇఇ మెయిన్ తుది విడత ఫలితాల్లో తె లుగు విద్యార్థులు సత్తాచాటారు. ఈ పరీక్షలో దేశవ్యాప్తంగా 26 మందికి 100 పర్సంటైల్ స్కోరు రాగా వీరిలో ఏకంగా 10 మంది తెలు గు విద్యార్థులే ఉండటం విశేషం. తెలంగాణకు చెందిన డి.భవితేశ్ రెడ్డి, మంథా శివ కామేశ్, సాయి రిత్విక్ రెడ్డి, వివాన్ శరద్ మహిశ్వరి, రిషి ప్రేమ్‌నాథ్ వంద శాతం పర్సంటైల్ సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి, నరేంద్ర బాబు గారి మ హిత్, తుంగా దుర్గా సుప్రభాత్, పసల మోహి త్, బిజ్జం వెంకట చంద్ర శేఖర్ రెడ్డి 100 శాతం పర్సంటైల్‌తో సత్తా చాటారు. పరీక్ష రాసిన 10,34,330 మంది విద్యార్థులు జెఇఇ మెయిన్ -2026 తుది విడత పరీక్షను దే శవ్యాప్తంగా 304 నగరాలలో 566 పరీక్షా కేం ద్రాలతోపాటు విదేశాలలోని 14 నగరాలలో నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 8 వరకు జెఇఇ మెయిన్ 2 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 11వ తేదీన ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. కాగా, సోమవారం మధ్యాహ్నం ఎన్‌టిఎ జెఇఇ మెయిన్ తుది కీ విడుదల చేసి, సాయంత్రం ఫలితాలు విడుదల చేసింది.ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 11,10,904 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 10,34,330 మంది(93.11 శాతం) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్ 1 (బిఇ/బి.టెక్ కోర్సులు) పరీక్షకు హాజరైన వారిలో 3,26,167 మంది అమ్మాయిలు, 7,08,163 మంది అబ్బాయిలు ఉన్నారు. జెఇఇ మెయిన్ సెషన్ 1, సెషన్ 2 పరీక్షల్లో రెండింటిలో విద్యార్థుల ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకుంటారు.జెఇఇ మెయిన్ అర్హత సాధించిన వారిలో టాప్ 2.50 లక్షల మంది విద్యార్థులకు జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. మే 17న జరిగే ఈ పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 4వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు 1.ఆరుష్ సింఘాల్(ఛండీఘర్) 2. జొన్నల రోషన్ మనిదీప్‌రెడ్డి(ఆంధ్రప్రదేశ్) 3. శ్రీయాస్ మిశ్రా(ఢిల్లీ ఎన్సిటి) 4. మంత శివ కామేష్(తెలంగాణ) 5. సిద్ధార్థ్ శ్రీకాంత్ అథలె(మహారాష్ట్ర) 6. నరేంద్రబాబు బారి మహిత్(ఆంధ్రప్రదేశ్) 7. తుంగ దుర్గా సుప్రభాత్(ఆంధ్రప్రదేశ్) 8. అర్నవ్ గాంధీ(హర్యానా) 9. శుభమ్ కుమార్(బీహార్) 10. ఆదిత్య గుప్త (ఢిల్లీ ఎన్సిటి) 11. తమ్మిన గిరీష్(ఢిల్లీ ఎన్సిటి) 12. కబీర్ ఛిల్లార్(రాజస్థాన్) 13. చిరంజీబ్ కర్(రాజస్థాన్) 14. భావేష్ పాత్ర(ఒడిషా) 15. అనయ్ జైన్(హర్యానా) 16. అతర్వ పంజాబీ(ఢిల్లీ ఎన్సిటి) 17. అర్నవ్ గౌతమ్(రాజస్థాన్) 18. దొరనాల భవితేష్‌రెడ్డి(తెలంగాణ) 19. పసల మొహిత్(ఆంధ్రప్రదేశ్) 20. మాధవ్ విరాదియా(మహారాష్ట్ర) 21. పురోహిత్ నిమయ్(గుజరాత్) 22. సాయి రిత్విక్‌రెడ్డి వెంకట్రెడ్ వల్ల(తెలంగాణ) 23. వివన్ శరద్ మహీశ్వరి(తెలంగాణ) 24. బిజ్జమ్ వెంకట చంద్రశేఖర్‌రెడ్డి(ఆంధ్రప్రదేశ్) 25. యశ్వర్ధన్(రాజస్థాన్) 26. రిషి ప్రేమ్‌నాథ్(తెలంగాణ)
సిబిఐ భయంతోనే హస్తినకు హరీశ్ పరుగులు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ నుంచి తప్పించుకునేందుకే మాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీకి ప రుగెత్తారని, జగిత్యాలలో మాజీ సిఎం కెసిఆర్ బహిరం గ సభ పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. సిబిఐ విచారణ ప్రారంభం కాకముం దే బిఆర్ఎస్ నాయకులు న్యాయవాదులను కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తారని ముందే తెలిసి, బిజెపి నేతల కాళ్లు పట్టుకునేందుకు హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హరీష్‌రావు ఢిల్లీకి వెళ్లారని మీడియా బయటపెట్టినా బిఆర్ఎస్ నుం చి ఎలాంటి ప్రకటన లేదని, హరీష్‌రావు రహస్య పర్యటన వెనుక ఉన్న మతలబు ఏమిటో, ఎవరెవరిని కలిశా రో తెలంగాణ ప్రజలకు చెప్పాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణను అడ్డుకునేందుకు హరీష్‌రావు ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపడం ప్రమాదకరమని ఎన్డిఎస్ఏ చెప్పిందని, నిర్మాణంలో ఘోరతప్పిదాలు జరిగాయని పిసి ఘోష్ జ్యూడిషయల్ కమిషన్ కూడా చెప్పిందని సిఎం గుర్తు చేశారు. సోమవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిన పి ల్లర్లను పరిశీలించిన అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బిజెపిని అడ్డుపెట్టుకొని కేసుల నుంచి బయటపడతామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊ రుకోదని, కాళేశ్వరం దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిజాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బిఆర్ఎస్ నేతలు లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించిన కాళేశ్వరం ప్రాజెక్టు ను ఊరికే వదిలిపెట్టబోమని, దానికి మరమ్మతులు చేసి ప్రజలకు నీరు అందిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి నెల రోజుల క్రితమే అధికారుల తో, సాంకేతిక నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసుకు న్నా మన్నారు. ప్రాజెక్టు పునరుద్ధరణపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాము ఇప్పటికే సాంకేతిక నిపుణులు, మూడు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చర్చించామని, శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతులు మొదలుపెట్టామని సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు, ఇరిగేషన్ నిపుణు లు పాల్గొని బ్యారేజీ స్థితిగతులను నిశితంగా పరిశీలించా రు. అయితే, ప్రాజెక్టుకు సంబంధించిన నిజాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బిఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా నేడు రాజకీయ సభలు పెట్టుకున్నార ని, అయినా రాష్ట్ర ప్రభుత్వం వారికి అనుమతులు ఇచ్చిందని సిఎం పేర్కొన్నారు. అవసరమైన ప్రణాళికలతో ముం దుకు వెళతామని, తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించి తీరుతామని ఆయన తేల్చి చెప్పారు. గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు 1975లో అప్పటి సిఎం జలగం వెంగళరావు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారని రేవంత్‌రెడ్డి గు ర్తు చేశారు. ఆ తర్వాత 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.38,063 కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రా రంభించి రూ. 11,700 కోట్లు ఖర్చు చేశారన్నారు. అ యితే, ప్రాణహిత-చేవెళ్ల ద్వారా ఆర్థిక, రాజకీయ ప్రయోజనం లేదన్న ఉద్దేశంతోనే కెసిఆర్ రీడిజైనింగ్ పేరుతో దానికి పేరు, ఊరు మార్చేశారని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. అంచనాలను ఏకంగా రూ.లక్షా 50 వేల కోట్లకు పెంచారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డా రు. 2016లో మొదలుపెట్టిన మేడిగడ్డను అద్భుతమని భ్రమలు కల్పించి 2018లో రాజకీయ లబ్ధి పొందారని, తీరా 2023లో బ్యారేజీ కుప్పకూలడంతో ఎన్నికల కోసం ఆ నిజాలను దాచిపెట్టాలని చూసినా ప్రకృతి బ యటపెట్టిందని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కెసిఆర్, హరీశ్‌రావులను జైల్లో వేయాలని, సిబిఐకి కేసు అప్పగించాలని ప్రాజెక్టులో సమస్యలు రాగానే 2023 నవంబర్ 1న అప్పటి సిఎం కెసిఆర్ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం దోపిడీపై పిసి ఘోష్ కమిటీ సంపూర్ణ నివేదిక ఇచ్చిందని, దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం పంపిందని ఆయన తెలిపారు. కెసిఆర్, హరీశ్ రావులను జైల్లో వేయాలని, సిబిఐకి కేసు అప్పగించాలని గతంలో డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పుడు ఎందు కు మౌనంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని సిఎం ప్రశ్నించారు. రాష్ట్రం పదే పదే లేఖలు రాస్తున్నా సిబిఐ స్పందించకపోవడాన్ని సిఎం రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వా రా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారని ముఖ్యమంత్రి విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు శ్రీపాద ఎల్లంపల్లే ప్రాణవాయువు అని, హరీశ్‌రావు నిక్కర్ వేసుకోకముందే ఆ ప్రాజెక్టు ఉందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్లంపల్లి నీటితోనే రాష్ట్రంలో అత్యధిక పంటలు పండించారని స్పష్టం చేశారు.

37 C