తీవ్రరూపంలో 'బిపర్జోయ్ తుఫాన్'.. ఐఎండీ హెచ్చరికలు
Cyclone Biparjoy: బిపర్జోయ్ తుఫానుకు ముందు గుజరాత్ తీరంలోని వల్సాద్ లోని తిథాల్ బీచ్ వద్ద అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వల్సాద్ యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యగా టిథాల్ బీచ్ ను పర్యాటకుల కోసం మూసివేసింది. తుఫాను దృష్ట్యా సముద్రంలో ఉన్న గుజరాత్ మత్స్యకారులను తీరానికి పిలిపించారు. అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు మత్స్యకారులు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకెళ్తే.. రానున్న 24 గంటల్లో బిపర్జోయ్ తుఫాను మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం తెలిపింది. “చాలా తీవ్రమైన తుఫాను బైపార్జోయ్ జూన్ 9వ తేదీ 23:30 గంటల IST వద్ద తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా 16.0N & పొడవైన 67.4E సమీపంలో ఉంది. రాబోయే 24 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి.. ఉత్తర-ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది” అని ఐఎండీ ఒక ట్వీట్లో పేర్కొంది. బిపర్జోయ్ తుఫాన్ నేపథ్యంలో అరేబియా సముద్ర తీరంలోని వల్సాద్ లోని టిథాల్ బీచ్ వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా తిథాల్ బీచ్ ను జూన్ 14 వరకు పర్యాటకులకు మూసివేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని చెప్పామనీ, వారంతా తిరిగి వచ్చారని సంబంధిత అధికారులు చెప్పారు. అవసరమైతే ప్రజలను సముద్ర తీరంలోని గ్రామాల నుంచి తరలిస్తామని చెప్పారు. వారి కోసం షెల్టర్లు ఏర్పాటు చేసిన విషయాలు వెల్లడించారు. జూన్ 14 వరకు పర్యాటకుల కోసం తిథాల్ బీచ్ ను మూసివేస్తున్నట్టు కూడా సంబంధిత అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని గంటల్లో బిపర్జోయ్ తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నందున కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరంలోని సముద్రాల్లో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ మత్స్యకారులకు సూచించింది. కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, కోజికోడ్, కన్నూర్ జిల్లాల్లో శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తుఫాను పాకిస్తాన్ వైపు కదులుతోందని భారత వాతావరణ శాఖ తన తాజా బులెటిన్ లో పేర్కొంది. అంతకుముందు జూన్ 9న పాకిస్తాన్ వాతావరణ శాఖ కూడా తమ ప్రాంతంలో కదలికలు, తీరం దాటే అవకాశాలపై ట్విటర్ ద్వారా అప్డేట్ ఇచ్చింది.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులకు పవర్స్ ఉన్నట్లా..? లేనట్లా..? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.
బాబుతో భేటీ.. టీడీపీలో ఆనం చేరికకు రంగం సిద్దం.. నెల్లూరులో కీలక పరిణామాలు..!!
నెల్లూరు: మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేశారనే ఆరోపణలపై ఆయనను ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు నుంచే అధికార వైసీపీ విధానాలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక, వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని మరింతగా పెంచారు. ఆయన టీడీపీలో చేరనున్నారనే ప్రచారం కూడా కొంతకాలంగా సాగుతుంది. తాజాగా తన రాజకీయ భవిష్యత్తుపై ఆనం రామనారాయణరెడ్డి ఓ క్లారిటీకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం రోజున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్‌లో కలిశారు. దాదాపు గంటకు పైగా వీరి సమావేశం జరిగింది. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి పలు అంశాలపై ఆనం రామనారాయణరెడ్డి ఈ సమావేశంలో చంద్రబాబుతో చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకున్న ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. టీడీపీ నేత సోమిరెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులతో ఆయన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇందకోసం వారికి ఆహ్వానం కూడా పంపారు. వారితో కలిసే జిల్లా టీడీపీ కార్యాలయానికి కూడా వెళ్లనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించే సమయంలో చేయాల్సిన స్వాగత ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు. అయితే ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరతారా?.. రాజీనామా చేయకుండా టీడీపీ కండువా కప్పుకుంటారా?(వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు కనుక రాజీనామా అవసరం లేదని భావిస్తారా?).. అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోకుండా ఆ పార్టీకి మద్దతుగా కొనసాగుతారా?.. అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఆనం రామనారాయణరెడ్డి కూతురు కైవల్యా రెడ్డి అత్తగారి కుటుంబం ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వారి కుటుంబం.. వైస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉంది. బద్వేలు టీడీపీ మహిళా నేత విజయమ్మకు కైవల్యా రెడ్డి కోడలు.
బల్దియా అధికారులు, సిబ్బందితో కేటీఆర్ ఇంటరాక్షన్..
గ్రేటర్ పరిధిలో త్వరలో తీసుకురానున్న వార్డు పాలన వ్యవస్థపై మున్సిపల్ మంత్రి కే. తారకరామారావు నేడు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇంత నీచమా??.. కేటీఆర్ పై విరుచుకుపడ్డ తెలంగాణ దిగ్గజం బి. నర్సింగరావు
హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు, ఫిలాంత్రోపిస్ట్.. దాసి, మా భూమి, రంగులకల సినిమాలతో దశాబ్దాల క్రితమే తెలంగాణ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు బి నరసింగరావు. ఆయన.. ఇప్పుడు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మీద నిప్పులు చెరిగారు…సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.. ఆ లేఖ సారాంశం ఇది.. ‘వాడు నచ్చాడా కేటీఆర్ నీకు నేను నచ్చలేదా ఏ రకంగా నిన్ను అంచనా వేయవచ్చు 40 రోజుల నుండి, ప్రతి రెండు రోజులకు ఒకసారి నిన్ను అపాయింట్మెంట్ అడిగితే.. నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వవా..? నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి నాకు రెండు చిల్లి గవ్వలు కూడా కావు.. రాజ్యం ఏలడమే కాదు, రాజ్యంలో ఎవరు, ఏమిటి అన్న విజ్ఞత కూడా ఉండాలి. అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణిచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు.. అంత గొప్ప హీనులు నీ సలహాదారులు. అంత గొప్ప ఏలిక నీది. ఏ సంస్కృతి నుండి వెలసిన కమలాలు మీరు. మీ గత జాడల (అడుగుల) ఆనవాళ్ళు ఏమిటి? ఇవన్నీ రేపు రేపు బహిరంగంగా మాట్లాడుకుందాం.. బి నర్సింగరావు.. ’ అని కేటీఆర్ కు ఆయన రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత ఆగ్రహం వెనక కారణమేంటని పలువురు చర్చించుకుంటున్నారు. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ.. నగదు, మద్యంబాటిళ్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. ప్రపంచ చలన చిత్రపటంపై తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా బి నర్సింగరావు పేరు తెలియని తెలంగాణ వ్యక్తి ఉండరు. నిర్మాతగా, నటుడిగా, దర్శకుడిగా, ఆర్టిస్టుగా, కవిగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలంగాణ సినిమాకు దశాదిశాలాంటి చిత్రాలను రూపొందించారు. ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం గతంలో బి.ఎన్.రెడ్డి జాతీయ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఇప్పటివరకు ఆయనకు నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డులు.. అనేక అంతర్జాతీయ గౌరవాలు దక్కాయి. ఆయన రూపొందించిన మాభూమి సినిమాను 1979లోనే కైరో, సిడ్నీఫిలిం ఫెస్టివల్స్ లో.. కార్లోవీ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. 1989లో దాసి, 1991లో మట్టి మనుషులు.. సినిమాలు మాస్కో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో మెరిట్ అవార్డు డిప్లమాను గెలిచాయి. మా ఊరు అనే సినిమా హంగేరీ అంతర్జాతీయ ఉత్సవంలో మీడియా వేవ్ అవార్డును గెలుచుకుంది. 2003లో జరిగిన 56వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బి నరసింగరావు దర్శకత్వం వహించిన హరివిల్లు సినిమా ప్రదర్శనకు ఎంపికైంది. ఆయన తీసిన రంగుల కల, దాసి, మట్టి మనుషులు సినిమాలకు తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డులు వరించాయి. ఉత్తమ మానవ శాస్త్ర ఎత్నోగ్రాఫిక్ సినిమాగా మా ఊరు సినిమా జాతీయ సినిమా పురస్కారాన్ని దక్కించుకుంది. మాభూమి సినిమా 1979లో ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును దక్కించుకుంది. హరివిల్లు అనే బాలల చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా నంది అవార్డు తీసుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత ఆర్ట్ ఎట్ తెలంగాణ, బోనాలు, మేడారం జాతర వంటి తెలంగాణ ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని చాటే కాఫీ టేబుల్ సంకలనాలు ప్రచురించారు. తెలంగాణ ప్రచురణల పేరిట అనేక సాహిత్య గ్రంథాలు వెలువరించారు.
సారూ.. వాసాలమర్రి దిక్కు చూడరు?
ఓ వైపు తెలంగాణ అంతటా దశాబ్ది ఉత్సవాలను సర్కారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండగా.. మరోవైపు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యాన్ని కొనుగోలు
మాయాపేటికలో..మంచి విజువల్స్, ఆకట్టుకునే పాటలు
మాయాపేటికలో..మంచి విజువల్స్, ఆకట్టుకునే పాటలు
It’s a destination wedding for Varun Tej
Mega Prince Varun Tej got engaged to his love Lavanya Tripathi in a private ceremony last night. The engagement took place in Naga Babu’s residence and was attended by the families of Chiranjeevi, Ram Charan, Allu Aravind, Allu Arjun and others. The wedding date will be finalized and announced soon. Varun Tej and Lavanya Tripathi […] The post It’s a destination wedding for Varun Tej appeared first on Telugu360.com .
ఏ మాయ చేశావే.. ఇంత ముద్దుగా ఉన్నావ్
గత కొంత కాలం నుంచి సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాడుతుందని మన అందరికి తెలిసిందే
బీఆర్ఎస్కు రెండు ఆఫీసులు అవసరమా: టీడీపీ సిటీ అధ్యక్షుడు సాయిబాబా
బీఆర్ఎస్కు రెండు ఆఫీసులు అవసరమా: టీడీపీ సిటీ అధ్యక్షుడు సాయిబాబా
తూర్పులో ట్రయాంగిల్ వార్..టికెట్లు రాకముందే పోటాపోటీగా ప్రచారం
తూర్పులో ట్రయాంగిల్ వార్..టికెట్లు రాకముందే పోటాపోటీగా ప్రచారం
వాహనదారులకు భారీ ఊరట.. 2017-2021 మధ్య ఉన్న ట్రాఫిక్ చలాన్లు రద్దు
2017 నుంచి 2021 వరకు ప్రైవేట్, వాణిజ్య వాహనాల యజమానులకు పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. వాహన రకంతో సంబంధం లేకుండా జనవరి 1, 2017 నుంచి డిసెంబర్ 31, 2021 మధ్య జారీ చేసిన అన్ని చలాన్లకు రద్దు వర్తిస్తుంది. ఇందులో ప్రస్తుతం వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి. దారుణం.. వితంతువుపై దొంగ అత్యాచారం.. అనంతరం నగలు ఎత్తుకెళ్లిన దుండగుడు 2023 జూన్ నాటి ఉత్తరప్రదేశ్ ఆర్డినెన్స్ నెం.2కు అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది చలాన్ల మాఫీకి మార్గం సుగమం చేసిన యూపీ ప్రభుత్వ నిర్ణయంతో కోట్లాది మందికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు బెదిరింపులు.. హోం మినిస్టర్ జోక్యం చేసుకోవాలి - సుప్రియా సూలే కాగా.. ప్రభుత్వం పేర్కొన్న వ్యవధి తరువాత ఉన్న చలాన్ లను చెల్లించేందుకు వాహన డ్రైవర్లు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ‘‘పాత పెండింగ్‌లో ఉన్న చలాన్లను రద్దు చేసినందున, ఈ వ్యవధి తర్వాత డ్రైవర్లు భయపడాల్సిన అవసరం లేదు. వారు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించవచ్చు. యూపీ ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వారంతా వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు. దీని కోసం వాహనం నంబర్ మాత్రమే అవసరం’’ అని రవాణా కమిషనర్ పేర్కొంది. Perhaps India is only nation in the world where you can mess around with traffic rules, without paying fines. @UPGovt cancels all pending challans from 2016-21. Disgusting & bogus decision. When will appeasement for votes stop? @myogiadityanath Motorists have absolute immunity. pic.twitter.com/R2cGR5E2YR — Chirag Jain (@jainchirag) June 9, 2023 తప్పుడు చలాన్ జారీ చేసినట్లు వాహన యజమాని భావిస్తే ఫిర్యాదు చేయవచ్చని రవాణా కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ తెలిపారు. వాహనం చలానా మినహాయించినప్పుడు మొబైల్ నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పారు. దీని కమ్యూనికేషన్ సులభం అవుతుందని పేర్కొన్నారు.
పొమ్మన్నా పోరు.. కుర్చీ వదలరు..ప్రమోషన్ ఇచ్చినా వద్దంటారు!
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొంత మంది ఉద్యోగులు ఏళ్లుగా పాతుకుపోయారు
శనివారం .. రష్ ఏమాత్రం తగ్గలేదు
శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి శనివారం..
బీసీ గురుకుల టెండర్లలో అధికారుల ఇష్టారాజ్యం..
బీసీ గురుకులాలలో పలు రకాల సరుకుల కోసం నిర్వహించిన టెండర్లలో అధికారులు ఇష్టా రాజ్యంగా వ్యవహిరస్తున్నారు.
నీటిపండుగకు సింగూరు దూరం..ఏళ్లుగా మొదలేకాని సంగారెడ్డి కాల్వ నిర్మాణం
నీటిపండుగకు సింగూరు దూరం..ఏళ్లుగా మొదలేకాని సంగారెడ్డి కాల్వ నిర్మాణం
న్యూమరాలజీ:ఆందోళనకు దూరంగా ఉండాలి
న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారికి ఈ రోజుప్రతికూల పరిస్థితులను సహనంతో,సులభంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. అజాగ్రత్త వల్ల ఏదైనా లక్ష్యం మీ చేతుల్లోంచి జారిపోతుంది. సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19 , 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు) చాలా వరకు పనులు సకాలంలో పూర్తవుతాయి.విద్యార్థులు, యువత తమ చదువులు, వృత్తిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఈ సమయంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. మీ మానసిక, శారీరక శక్తిని కాపాడుకోవడానికి ఒత్తిడి , ఆందోళనకు దూరంగా ఉండటం చాలా అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతారు. వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఒక బ్యూరోక్రాట్ తన పనిని చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే లోపం సంభవించే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ఉంటుంది. స్నేహితులతో ప్రయాణం కూడా సరదాగా ఉంటుంది. సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు) రోజులో కొంత సమయం మీ ఆసక్తికరమైన పనిలో, స్వీయ ప్రతిబింబంలో గడపండి. ఇది మీకు శారీరకంగా,మానసికంగా రిఫ్రెష్ ,శక్తినిస్తుంది. ఆధ్యాత్మిక ఆనందం కూడా పెరుగుతుంది. మీ సాధారణ పనులను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది. ఎటువంటి కారణం లేకుండా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి; మీ కోపం, మాటలను నియంత్రించండి. ప్రతికూల పరిస్థితులను సహనంతో,సులభంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. అజాగ్రత్త వల్ల ఏదైనా లక్ష్యం మీ చేతుల్లోంచి జారిపోతుంది. ఫీల్డ్‌లో మీ పోటీదారులను ప్రదర్శించే ధోరణిని నివారించండి. జీవిత భాగస్వామి మీ పనిలో పూర్తి మద్దతు పొందుతారు. మారుతున్న వాతావరణం వల్ల అలసట, నీరసం వంటివి కనిపిస్తాయి. సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు) ఇంటి సంరక్షణ , క్రమాన్ని కాపాడుకోవడంలో రోజు గడుపుతుంది. సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి చూపడం పరిచయాల సర్కిల్‌ను కూడా విస్తరిస్తుంది. విద్యార్థులు తమ పరీక్షల తయారీపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. అధిక బిజీ కారణంగా, మీ స్వంత ముఖ్యమైన పనిలో కొన్ని అసంపూర్తిగా ఉండవచ్చు. ఇది మీ విశ్వాసం, సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రత్యేక సమావేశం ఉంటే, ఈరోజు వాయిదా వేయండి లేదా చాలా జాగ్రత్తగా చేయండి. ఈ సమయంలో ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలపై మాత్రమే దృష్టి పెట్టండి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. అధిక బిజీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు) మీరు ఈ రోజు ఒక నిర్దిష్ట విషయంపై సమాచారం పొందడానికి గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీ వ్యక్తిత్వ పురోభివృద్ధికి కొన్ని కొత్త మార్గాలు సుగమం కానున్నాయి. ఏదైనా ప్రత్యేకమైనది దొంగిలించబడవచ్చు లేదా పోగొట్టుకునే అవకాశం ఉంది, కాబట్టి మీ వస్తువులను సురక్షితంగా ఉంచండి. ఇతరుల ప్రభావం వల్ల మీరు తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. మీ ప్రణాళికలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. వ్యాపార రంగంలో మీ సిబ్బంది మరియు సహోద్యోగుల సలహాలపై కూడా మీరు శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితంలో భావోద్వేగ సంబంధాలు బలంగా ఉంటాయి. శారీరక అలసట కారణంగా, బలహీనత అనుభూతి చెందుతుంది. సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు) రోజు ప్రారంభంలో మీ దినచర్యను వివరించండి. మీ పని సామర్థ్యాన్ని నమ్మండి. దీంతో పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా జరుగుతున్న ఏ పనిలోనైనా ఆటంకాలు కూడా ఈరోజు తొలగిపోతాయి. ఈరోజు ఎలాంటి ఉద్యమాన్ని సస్పెండ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పూర్తి దృష్టిని మీ పని స్థలంపై ఉంచండి. మీరు మీ సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకోవాలి, అది మీకు సరైన సలహా ఇస్తుంది. మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి, అలసట మీ పనితీరును ప్రభావితం చేయవచ్చు. సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 ,24 తేదీలలో జన్మించిన వ్యక్తులు) మీ గత తప్పులను ప్రతిబింబించడం, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం వల్ల మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టడం ద్వారా ఏదైనా సాధించవచ్చు. ఒక చిన్న విషయంలో పొరుగువారితో లేదా స్నేహితునితో విభేదించే పరిస్థితి ఉండవచ్చు. తల్లిదండ్రులను, సీనియర్లను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి అనుభవజ్ఞులైన , వృత్తిపరమైన వ్యక్తుల సామర్థ్యం, అనుభవాలపై దృష్టి పెట్టండి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఒత్తిడి, నిరాశను నివారించడానికి ధ్యానం, యోగా సహాయం తీసుకోండి. సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు) ఈ రోజు వ్యక్తిగత లేదా ఆస్తికి సంబంధించిన ఏవైనా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చు. దీని కారణంగా మీరు చాలా వరకు ఉపశమనం పొందుతారు. మీరు మీ కుటుంబ, సామాజిక బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించగలరు. మీ ప్రతిభకు ప్రజలు కూడా ఆకట్టుకుంటారు. దగ్గరి బంధువుకి సంబంధించిన కొన్ని అసహ్యకరమైన వార్తల వల్ల మనస్సు కలత చెందుతుంది. మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు. ఈరోజు కోర్టుకు సంబంధించిన పనులు చేయకుంటే మంచిది. మీరు ప్రేమ భాగస్వామితో డేటింగ్ చేసే అవకాశం పొందుతారు. మారుతున్న వాతావరణం మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు) మీ పూర్తి శ్రద్ధ మీ పని, ఆర్థిక కార్యకలాపాలపై కేంద్రీకరిస్తుంది, దాని కారణంగా బిజీగా ఉంటుంది కానీ ఫలితాలు కూడా మంచిగా ఉంటాయి. స్నేహితునితో ఆహ్లాదకరమైన సమావేశం కూడా ఉంటుంది. ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోకండి లేదా అయాచిత సలహా ఇవ్వకండి. ఇది కూడా మీకు హాని కలిగించవచ్చు. ఏదైనా ప్రతికూల పరిస్థితిలో, సహనం మరియు ప్రశాంతతను కలిగి ఉండండి, ఇది త్వరలో పరిస్థితిని సాధారణీకరిస్తుంది. సీనియర్లు తమ ఆరోగ్యంపై మరింత అవగాహన కలిగి ఉండాలి. కార్యాలయంలో అన్ని కార్యకలాపాలను నియంత్రించడం అవసరం భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితులు మిమ్మల్ని అతలాకుతలం చేయనివ్వవద్దు. సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు) సామాజిక లేదా సామాజిక సంబంధిత కార్యక్రమాలలో మీ ఉనికిని తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇది మీ సర్కిల్‌ను పెంచుతుంది. ఇల్లు,వ్యాపారంలో కూడా సరైన సామరస్యం ఉంటుంది. యువకులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాన్ని పాడుచేయవద్దు ఎందుకంటే ఇది మీ వ్యాపార కార్యకలాపాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి.
గులాబీ బాస్‌కు మళ్లీ ఆహ్వానం అందలే.. విపక్షనేతలు కేసీఆర్‌ను నమ్మట్లేదా?
పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలు వేగం పెంచాయి. హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని కమలదళం ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఉమ్మడి కార్యాచరణకు రెడీ అయ్యాయి. 23న విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా బిహార్
రైలు కింద పడి బీఆర్ఎస్ రాష్ట్ర నేత మృతి
రైలు కింద పడి బీఆర్ఎస్ రాష్ట్ర నేత మృతి
Intinti Gruhalakshmi: అత్తకి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన దివ్య.. కోర్టులో అడ్డంగా బుక్కైన లాస్య!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తన కాపురాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న అత్తకి చుక్కలు చూపిస్తున్న కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో బాగా నీరసంతో ఆఖరి బిందెతో నీళ్లు తెస్తుంది దివ్య. ఇదే ఆఖరి బింద దివ్య ఓపిక తెచ్చుకో అని చెప్తాడు విక్రమ్. దివ్య జాగ్రత్త అంటూ ఎంతో అభిమానం వలకబోస్తుంది రాజ్యలక్ష్మి. ఆకలి బిందువు కూడా అభిషేకం అయిపోవడంతో అమ్మ..అభిషేకం పూర్తయింది ఇప్పుడు హోమం చేయాలి. అఖండ దీపం చేత్తో పట్టుకోండి. హోమం అయిన వరకు దానిని చేత్తో పట్టుకొని హోమం పూర్తయిన తర్వాత హోమంలో వేయాలి అప్పుడు పూర్తిగా దోష నివారణ జరుగుతుంది అంటారు పంతులుగారు. అఖండ దీపాన్ని చేత్తో పట్టుకొని ఓపిక లేక తూలిపోతూ ఉంటుంది దివ్య. దివ్య పడుతున్న బాధ చూడలేకపోతున్నాను ఇక ఈ పూజని పక్కన పెట్టేద్దాము అంటుంది రాజ్యలక్ష్మి. తల అత్తగారి భుజం మీద పెట్టి పోసి నా పిచ్చి అత్త నేను పూజ చేస్తున్నది నీ కోసం కాదు మా నాన్న కోసం అయినా జైలు నుంచి విడుదల అవ్వాలని అంటూ చిన్నగా చెప్తుంది దివ్య. ఒక్కసారిగా షాక్ అవుతుంది రాజ్యలక్ష్మి. ఇక పూజ ఆపేయండి ఇక ఈ పూజ దివ్య చేయలేదు అంటుంది రాజ్యలక్ష్మి. నేను చేయగలను నాకు ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు అని మొండిగా చెప్తుంది దివ్య. విక్రమ్ కూడా దివ్య నే సపోర్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే కోర్టులో సాక్షి కోసం జడ్జితో సహా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అతను ఎంతకీ రాకపోవడంతో కోర్టు టైము వేస్ట్ అవుతుంది అని చెప్పి కేసు క్లోజ్ చేయడానికి సిద్ధపడతారు జడ్జ్. సరిగ్గా అదే సమయానికి శేఖర్ కోర్టులోకి వచ్చి తన సాక్ష్యం వినిపిస్తాడు. నందుని ట్రాప్ చేసి తన వైపు తిప్పుకుందని, నా కొడుకుని నాకు ఇవ్వటం లేదు తను పట్టించుకోవడం లేదు అని చెప్తాడు శేఖర్. అవును సార్ లాస్య ప్లాన్ ప్రకారం నందుని రెచ్చగొట్టి తనని కొట్టేలాగా చేసింది అప్పుడే వీడియో తీసి సాక్షానికి వాడుతుంది అంటాడు మాధవి భర్త. అవును సార్ అది నిజమే అందుకు నేనే సాక్ష్యం అంటూ లాస్య కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది భాగ్య. లాస్యనే బోనులోకి పిలిచి వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు నిజమేనా అని అడుగుతాడు జడ్జ్. ఇక వేరే దారి లేక తన తప్పు ఒప్పుకుంటుంది లాస్య. నందు తనకి ఎక్కడ దూరమైపోతాడో అని ఇదంతా చేశాను నందు లేకపోతే నేను బ్రతకలేను నాకు నందుతో కలిసి బ్రతికే అవకాశాన్ని ఇవ్వండి అని బ్రతిమాలుతుంది లాస్య. తనని నా జీవితంలోకి రానివ్వకండి నేను ఆ టార్చర్ భరించలేను దయచేసి మాకు విడాకులు ఇప్పించండి అని బ్రతిమాలితాడు నందు. నందగోపాల్ గారి మాటల్లో ఆవేదన ఆయన పడిన బాధ తెలుస్తుంది. కానీ మూడుముళ్ల బంధం అంత తేలికగా వదులుకునేది కాదు అందుకే లాస్యని నందగోపాల్ గారిని కలిసి నెల రోజులు ఉండమని తీర్పు ఇస్తున్నాము. అప్పటికీ కుదరకపోతే అప్పుడు విడాకులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి.. ఆడవాళ్ళ రక్షణ కోసం ఉపయోగించే చట్టాలని స్వార్థానికి వాడుకున్నందుకు మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాము. మళ్ళీ ఇలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని లాస్యకి చివాట్లు పెడతాడు జడ్జి. నందగోపాల్ ని జైలు నుంచి విడుదల చేస్తూ తీర్పు ఇస్తాడు. అందరూ ఎంతో ఆనందిస్తారు. అదే సమయంలో అఖండ దీపం హోమంలో వేస్తుంది దివ్య. అదే సమయంలో విక్రం కి ఫోన్ చేసి నందు విడుదలైనట్లుగా చెప్తారు తులసి వాళ్ళు. అదే విషయాన్ని దివ్యకి చెప్తాడు విక్రమ్. సంతోషంతో అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది దివ్య. పూజ నీకోసం చేస్తే రిజల్ట్ అక్కడ వచ్చింది ఏంటి అని అక్కని అడుగుతాడు. ఆ తాటకి పూజ చేసింది వాళ్ళ నాన్న కోసమే అని కోపంగా చెప్తుంది రాజ్యలక్ష్మి. ఒక్కసారిగా షాక్ అవుతాడు బసవయ్య. అమ్మవారి నిదర్శనాన్ని మొదటిసారి చూస్తున్నాను. అమ్మ.. ఇంక నీ ప్రాణానికి కూడా ఎలాంటి ప్రమాదము ఉండదు అని చెప్పి భార్యని లోపలికి తీసుకెళ్లి పోతాడు విక్రమ్. తరువాయి భాగంలో తన దగ్గరికి వచ్చిన భర్తతో అత్తయ్య అన్ని సమస్యలకి పరిష్కారం వెతుకుతున్నారు కానీ మన శోభనం విషయంలో ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేయటం లేదు మనసుతో ఆలోచించండి అని చెప్తుంది దివ్య.
క్యాన్సర్‌తో తండ్రి చనిపోతాడని.. కొడుకు ఆత్మహత్యాయత్నం
క్యాన్సర్‌తో తండ్రి చనిపోతాడని.. కొడుకు ఆత్మహత్యాయత్నం
రూ.50 వేల కోట్లు సేకరించనున్న ఎస్బీఐ
రూ.50 వేల కోట్లు సేకరించనున్న ఎస్బీఐ
తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరిగింది
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర
ఎమ్మార్వో టు సెక్రటేరియట్ అస్తవ్యస్త పాలన!
అవినీతి మరకలు, పాలనా పరమైన లోపాలు ప్రభుత్వ తీరును వేలెత్తి చూపుతున్నాయి.
పవన్‌కు చెక్మేట్గా ముద్రగడ.. జగన్ నయా ప్లాన్!
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో
టిక్కెట్ల పంపిణీ పై కాంగ్రెస్ కసరత్తు.. త్వరలో ఢిల్లీకి నివేదిక
టీ కాంగ్రెస్‌పార్టీ టిక్కెట్ల పంపిణిపై కసరత్తు మొదలైంది. అసెంబ్లీ సెగ్మెంట్ ల వారీగా టీ పీసీసీ వివరాలు సేకరిస్తుంది. ఇన్‌చార్జ్‌లతో పాటు ఆశావహుల లిస్టును క్రోడీకరించి హైకమాండ్ కు పంపనుంది. ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్సిగ్నల్రాగానే
వెంబడించి, వేధిస్తున్నాడని.. పోకిరీని చెప్పుతో కొట్టిన కాలేజీ విద్యార్థిని.. వీడియో వైరల్...
బెంగళూరు : అమ్మాయిలను వెంటబడి వేధించడం.. అల్లరి పెట్టడం.. ప్రేమ పేరుతో అఘాయిత్యాలకు పాల్పడడం తరచుగా కనిపిస్తుంది. ఈ వేధింపులు తట్టుకోలేక చదువులు మానేసేవారు కొందరైతే.. పోలీసులకు ఫిర్యాదు చేసేవారు మరికొందరు.. ఎదిరిస్తే ఏమవుతుందో అనే భయంతో మౌనంగా భరించే వారు ఇంకొందరు. కానీ ఓ విద్యార్థిని అలా ఊరుకోలేదు. తన వెంటబడి వేధించిన వాడిని నలుగురిలో చెప్పుతో కొట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్తున్న బాలికను ఆ వ్యక్తి వెంబడించి, వేధించాడం మొదలు పెట్టాడు. దీంతో ఆ బాలిక గట్టిగా కేకలు వేసి స్థానికులను అప్రమత్తం చేసింది. టెన్త్ లో 35% శాతం మార్కులతో పాసైన కొడుకు.. సంబరాలు చేసుకున్న తల్లిదండ్రులు.. వీడియో వైరల్.. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకున్నారు. ఆ తరువాత బాలిక ఆ వ్యక్తి ముఖంపై బహిరంగంగా చెప్పుతో కొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ వీడియోలో, అమ్మాయి అతని తలపై, ముఖంపై తన కాలి చెప్పులతో కొడుతుండడం.. తనను విడిచిపెట్టమని ఆ వ్యక్తి స్థానికులను అభ్యర్థిస్తుండడం కనిపిస్తుంది. అమ్మాయి కొడుతుంటే ప్రతిగా ఏమీ చేయకుండా.. దెబ్బలు తిన్నాడు. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్తున్న బాలికను ఆ వ్యక్తి వెంబడించి వేధించాడని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత అతడిని పోలీసులకు అప్పగించారు.
ఐఐఎఫ్ఎల్ బాండ్ల ఇష్యూ ప్రారంభం
ఐఐఎఫ్ఎల్ బాండ్ల ఇష్యూ ప్రారంభం
హైదరాబాద్ ఆన్ వీల్స్’ బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్
దారుణం.. వితంతువుపై దొంగ అత్యాచారం.. అనంతరం నగలు ఎత్తుకెళ్లిన దుండగుడు
మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. దివ్యాంగులు, వితంతువులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా తమిళనాడు లోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ వితంతవుపై దొంగ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఔరంగజేబును పొగుడుతూ సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టిన 14 ఏళ్ల బాలుడు.. మహారాష్ట్రలోని బీడ్ లో ఉద్రిక్తత తమిళనాడులోని మదురై జిల్లా చింతామణి ప్రాంతంలో ఓ మధ్య వయస్కురాలైన వితంతువుపై గుర్తుతెలియని యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె నగలను దోచుకెళ్లాడు. ప్రాణాలతో బయటపడిన 54 ఏళ్ల మహిళ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. చింతామణి ప్రాంతంలో 54 ఏళ్ల మహిళ నివసిస్తోంది. ఆమె భర్త గతంలో చనిపోయారు. నిర్మానుష్య ప్రాంతంలో ఉండే ఆమె ఇంటి గోడపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కూర్చొని ఉన్నాడు. దీనిని ఆమె గమనించింది. అలా గోడపై కూర్చున్నది ఎవరో అని తెలుసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి అతడి వద్దకు చేరుకుంది. ఎక్కడి నుంచి వచ్చావని, గోడపై ఎందుకు కూర్చున్నావని అతడి వివరాలు ఆరా తీసింది. కానీ ఆ యువకుడు ఆమెకు ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు బెదిరింపులు.. హోం మినిస్టర్ జోక్యం చేసుకోవాలి - సుప్రియా సూలే కొంత సమయం తరువాత ఆ దుండగుడు మహిళను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలి బంగారు గొలుసును లాక్కొని వెళ్లిపోయాడు. ఘటన జరిగిన ఇల్లు నిర్మానుష్య ప్రాంతంలో ఉండటంతో అతడిని ఎవరూ గమనించలేదు. అయితే సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని మదురై జిల్లా ఎస్పీ ఆర్.శివప్రసాద్ పరిశీలించారు. కాగా.. ఇలాంటి ఘటనే ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో వెలుగు చూసింది. ఓ బాలుడు 14 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె తలపై సుత్తితో మోది.. ఉరేసి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లడంతో.. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఓ బాలుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె మీద అత్యాచారం చేశాడు. హిజాబ్ వివాదం.. పాఠశాలల్లో మత మార్పిడికి పాల్పడితే ఊరుకోబోము - మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అంతటితో ఊరుకోకుండా.. ఆమె తలపై సుత్తితో కొట్టాడు. ఆ తర్వాత ఫ్యాన్ కు ఉరి వేశాడు. సాయంత్రం పనుల నుంచి ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు ఓ బాలుడు వరండాలో నిల్చుని ఉండడం గమనించారు. దీంతో అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే.. తల్లిదండ్రులను చూసిన బాలుడు తప్పించుకున్నాడు. వారికి అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా.. బాలిక ఫ్యానుకు వేలాడుతూ శవంగా కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడు కోసం గాలిస్తున్నారు.
ఎస్సై కాలర్ పట్టుకున్న యువకుడు చావబాదిన పోలీసులు?
ఎస్సై కాలర్ పట్టుకున్న యువకుడు చావబాదిన పోలీసులు?
సీడ్ పత్తికి ఎండల ఎఫెక్ట్... ఆరు ఇంచులే పెరగడంతో రైతుల్లో ఆందోళన
సీడ్ పత్తికి ఎండల ఎఫెక్ట్... ఆరు ఇంచులే పెరగడంతో రైతుల్లో ఆందోళన
పంద్రాగస్టు పోటీలో..తెలుగు సినిమాలు
పంద్రాగస్టు పోటీలో..తెలుగు సినిమాలు
జీహెచ్ఎంసీలో 10 రోజులుగా నిలిచిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
జీహెచ్ఎంసీలో 10 రోజులుగా నిలిచిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
ధాన్యం కొనుగోలులో జాప్యం.. వడ్ల పైసలొస్తలేవ్!
దిశ, రంగారెడ్డి బ్యూరో: ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు ధాన్యం అమ్ముకోవాలంటే సవాలక్ష రూల్స్ అడ్డొస్తున్నాయి.
సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ..
హైదరాబాద్ : హైదరాబాద్ లో ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. ఆయన ఆఫీసులో పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి 50 వేల నగదు, 11 ఖరీదైన మద్యం బాటిళ్లు చోరి చేశారు. ఒక్కో మద్యం బాటిల్ ఖరీదు రూ. 28 వేలు ఉంటుందని చెబుతున్నారు. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆఫీసులో చోరీ జరగడం కలకలం రేపింది. ఆఫీసులో నిలిపి ఉంచిన కారు అద్దాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయలేరా? : జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయలేరా? : జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
వైఎస్ జగన్‌తో విరోధమా?.. నో అంటున్న బీజేపీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేసినప్పటికీ భారతీయ
బీకేర్ ఫుల్ : ఈ రెండు రోజులు జాగ్రత్త
మృగశిర కార్తె ప్రారంభమైనా, ఎండలు దంచికొడుతున్నాయి. కాగా, నేడు, రేపు తెలంగాణలో కొన్ని చోట్ల వడగాలలు వీచే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
జూన్-10: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.
ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కారులో చోరీ
సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ కలకలం సృష్టించింది.
అమెరికాలో 10 లక్షల రాగి నాణేలు లభ్యం
అమెరికాలో 10 లక్షల రాగి నాణేలు లభ్యం
ఏంటి ‘బ్రో ‘70 కోట్లా..రికవరీ కాస్త కష్టమేనే?!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టార్ మూవీగా బ్రో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగులో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. దానికి తోడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటించడంతో మెగా ఫాన్స్ లో ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ మరింత పెరిగాయి. . ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో మొదలైంది. అయితే ఈ సినిమాకు రేట్లు ఓ రేంజిలో చెప్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఏరియాకు కి గాను 70 కోట్లు అడుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అంత పెట్టి సినిమా తీసుకుంటే రికవరీ ఏ మాత్రం ఉంటుందనే లెక్కలు వేస్తున్నారు. ఆంధ్రాలో టిక్కెట్ రేట్లు తక్కువ...పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి పెంచే అవకాసం లేదు. మరి అలాంటప్పుడు 70 కోట్లు పెడితే ఏ స్దాయ హిట్ కావాలి. సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే బ్రేక్ ఈవెన్ ఒక వారంలో వస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ వీకెండ్ లో వచ్చిందే మిగులు అని లెక్కలు వేస్తున్న నేపధ్యంలో ఓపినింగ్స్ వస్తేనే ఏ పెద్ద సినిమా కు అయినా వర్కవుట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇంకా ప్రమోషన్స్ పూర్తి స్దాయిలో మొదలెట్టలేదు. అప్పుడు కానీ అంచనాకు రాలేమని ప్రమోషన్స్ కోసం బయ్యర్లు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రోజుకు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఈ సినిమా కోసం పవన్ దాదాపు 20 నుంచి 25 రోజులు వర్క్ చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ దాదాపు 50 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ మూవీకి అందరి రెమ్యునరేషన్ లతో కలుపుకొని రూ. 120 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. అంటే ఆ స్దాయిలనే అమ్మాలి. ఇక ఈ సినిమా తమిళంలో వచ్చిన వినోదయ సీతం సినిమాకు రీమేక్. దర్శకుడు త్రివిక్రమ్ ,రైటర్ సాయి మాధవ్ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి పవన్ క్రేజ్ కి తగ్గట్టుగా ఆయన పాత్రను మలిచారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ మొత్తంలో ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందే దాదాపు 50 కోట్ల లాభాలు పీపుల్స్ మీడియా కళ్ల చూసే అవకాసం ఉందంటున్నారు.
బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తున్నరు...ఈడీకి బీజేపీ ఎంపీ ఫిర్యాదు
బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తున్నరు...ఈడీకి బీజేపీ ఎంపీ ఫిర్యాదు
టెన్త్ లో 35% శాతం మార్కులతో పాసైన కొడుకు.. సంబరాలు చేసుకున్న తల్లిదండ్రులు.. వీడియో వైరల్..
ముంబై : మన దేశంలో పోటీ ఎక్కువ. మార్కులు అందరికంటే ఎక్కువ రావాలనే ఒత్తిడి పిల్లలపై ఎక్కువ. అనుకున్నదానికంటే ఒక్కమార్కు తక్కువ వచ్చినా.. తట్టుకోలేక ఆత్మహత్యలకు చేసుకునే చిన్నారులున్నారు. దీనికి కారణం.. అకడమిక్ మార్కులతోనే మంచి భవిష్యత్ అనే మూస ధోరణిని తల్లిదండ్రులు పిల్లల మెదడ్లలోకి చొప్పించడమే. పదికి పది మార్కులతో ర్యాంకులు కొట్టాలి.. టాపర్ గా నిలవాలి.. చదవాలి.. చదవాలి.. అది తప్ప వేరే లేకపోవడం.. పిల్లలకు పుస్తక పరిజ్ఞానం తప్ప లోకజ్ఞానం అలవడకపోవడం మామూలుగా కనిపిస్తూనే ఉంటుంది. అయితే, ఈ మూసధోరణిని బద్దలు కొట్టారు ఓ తల్లిదండ్రులు. వారి కొడుకు పదోతరగతి పరీక్షల్లో కేవలం 35 శాతం మార్కులతో అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడు. అది చూసిన తల్లిదండ్రులు కోపానికి రాలేదు. అతడి మీద కేకలు వేయలేదు. అన్ని సబ్జెక్టులూ పాస్ అయ్యాడని సంతోషించారు. అతని ఉత్తీర్ణతను వేడుక చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు విద్యార్థి 10వ తరగతి, మరాఠీ మీడియం పాఠశాలలో చదువుకున్నాడు. మొత్తం 6 సబ్జెక్టులలో 35 చొప్పున మార్కులు సాధించాడు. బాలుడి తల్లిదండ్రులు గర్వంగా, ఆనందంగా అతని మార్కులను ప్రదర్శించారు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ షేర్ చేశారు. ''ముంబయికి చెందిన 10వ తరగతి విద్యార్థి పరీక్షలో 35% మార్కులు సాధించాడు. కానీ అతని తల్లిదండ్రులు విచారంగా లేదా కోపంగా కాకుండా, అతని విజయాన్ని జరుపుకున్నారు, అని ఈ వీడియోకు క్యాప్షన్ రాశారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో నెటిజన్ల మనసు దోచుకుంది. ఎలాంటి ఒత్తిడీ పెట్టని తల్లిదండ్రుల హృదయపూర్వక స్పందనను చూసి ఆశ్చర్యపోయారు. సంతోషించారు. ఇలాంటి తల్లిదండ్రులు ప్రతీ ఒక్కరికీ అవసరం.. అబ్బాయి చదువు పూర్తి చేసినందుకు అభినందనలు’ అని ఒకరు స్పందించగా.. మరొకరు, ''గొప్ప పని. తల్లిదండ్రులు పిల్లలను మంచి గ్రేడ్లు సాధించాలని ఒత్తిడి చేయకూడదు. సానుకూలంగా ఉండాలి. తల్లిదండ్రుల ఒత్తిడి తరచుగా పిల్లలను ఒత్తిడి, ఆందోళనకు గురి చేస్తుంది. వారు అసురక్షితంగా, వారి సొంత సామర్థ్యాన్ని అనుమానించే అవకాశం ఉంది’ అని కామెంట్ చేశాడు. మరొకరు తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు.. ''నేను 10వ తరగతిలో 46.7% స్కోర్ చేసాను. మా అమ్మ 1 కిలో బేసన్ లడ్డూల ప్యాకెట్‌ని మా పొరుగువారందరికీ పంచింది. నన్ను నన్నుగా నమ్మినందుకు ధన్యవాదాలు అమ్మ.'' అని రాశారు. ఇంకొకరు రాస్తూ.. ''తల్లిదండ్రులు ఇచ్చే మద్దతు వల్ల ఆ అబ్బాయి మంచి మనిషిగా, భవిష్యత్తులో విజయవంతమవుతాడు’ అని పేర్కొన్నాడు. मुंबई के रहने वाले 10वीं के एक छात्र ने परीक्षा में 35% मार्क्स हासिल किए. लेकिन उसके माता-पिता ने दुखी या नाराज होने की बजाय उसकी सफलता को सेलिब्रेट किया. pic.twitter.com/fAa6szayiF — Awanish Sharan (@AwanishSharan) June 8, 2023
మూఢనమ్మకాలపై విరుచుకుపడే బాబు గోగినేని ఆదిపురుష్ చిత్రాన్ని కెలుకుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ ముహూర్తాన ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం మొదలైందో కానీ.. మొదటి నుంచి వివాదాల్లో ఈ చిత్రం నలిగిపోతోంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్స్‌తో ఆదిపురుష్ చిత్రానికి మంచి బజ్ వచ్చింది. కానీ విమర్శకులు మరోసారి ఆదిపురుష్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆదిపురుష్ చిత్రం రామాయణాన్ని గుర్తు చేసేలా.. భక్తి పారవశ్యం నింపేలా కనిపించడం లేదని కొందరు వాదిస్తున్నారు. కానీ ప్రముఖ హ్యూమన్యాక్టివిస్ట్ బాబు గోగినేని స్టైల్ వేరు. మూఢనమ్మకాలపై విరుచుకుపడే బాబు గోగినేని ఆదిపురుష్ చిత్రాన్ని కెలుకుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదిపురుష్ చిత్రం రిలీజ్ సాఫీగా జరుగుతుందనిభావిస్తున్న తరుణంలో ఓం రౌత్, కృతి సనన్ తిరుమలలో చేసిన వ్యవహారం తీవ్ర విమర్శలకు కారణం అయింది. అయితే ఈ చిత్ర ప్రచారం కోసం మత విశ్వాసాల్నివాడుకుంటున్నారు అనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. అందులో మొదటిది ప్రతి ఆదిపురుష్ థియేటర్ లో హనుమంతుడికోసం ఒక సీటు కేటాయించడం. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు వస్తాడని హిందువుల నమ్మకం. ఆ నమ్మకంతోనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై బాబు గోగినేని సెటైర్స్ వేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా హాల్ ని గుడిగా మార్చేస్తున్నారు. దీనికి మీకు పర్మిషన్ ఉందా ? సినిమా చూడడానికి వచ్చిన వారికీకొబ్బరి కాయలు కొట్టే సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారా ? అంటూ సెటైర్లతో విరుచుకుపడ్డారు. బహిష్టులోఉన్న లేడీస్ ఆదిపురుష్ సినిమా గుడికి ప్రవేశించవచ్చా?పరమతస్థులు సినిమా చూడాలంటే ముందుగా రిజిస్టర్ లో సంతకం పెట్టాలాఅంటూ బాబుగోగినేనివరుసగా ప్రశ్నలు సంధించారు. అలాగే పాప్ కార్న్, చిప్స్ బదులుగా ప్రసాదం, అన్నదానం ఏర్పాటు చేయండి. ప్రతి థియేటర్ కి ఒక పూజారిని, ఆవుని, హుండీని కూడా ఏర్పాటు చేయండి. రాహుకాలంలో సినిమా షో మొదలైతే పరిస్థితి ఏంటి. హాలు వాస్తు ప్రకారం ఉందొలేదో చూసుకున్నారా అంటూ బాబు గోగినేని వరుసగా తన ప్రశ్నలు సంధించారు. ఆదిపురుష్ చిత్రంపైఈ స్థాయిలో విరుచుకుపడ్డ బాబు గోగినేనిపై ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో. జూన్ 16న ఆదిపురుష్ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది.
మే నెలలో పెరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు.. ఏప్రిల్‌తో పోలిస్తే 31 శాతం ఎక్కువ
మే నెలలో పెరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు.. ఏప్రిల్‌తో పోలిస్తే 31 శాతం ఎక్కువ
వస్తావా? రేటెంత? నైట్ టైంలో మహిళా జర్నలిస్టుకు వేధింపులు (వీడియో)
రాత్రి సమయంలో మహిళలు కనిపిస్తే పోకిరీలు రెచ్చిపోతున్నారు.
ఈ రెండు రాశుల వారికి కీడు జరగనుంది.. మీరున్నారా?
వచ్చే వారంలో కుంభరాశిలో శని తిరోగమనం చేయబోతున్నాడు.
రహస్య పత్రాల కేసులో.. ట్రంప్‌కు సమన్లు
రహస్య పత్రాల కేసులో.. ట్రంప్‌కు సమన్లు
రైతు చనిపోయినా బతికున్నట్టే రికార్డు
రైతు చనిపోయినా బతికున్నట్టే రికార్డు
Covid Effect –ఎంపీ పదవికి బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా
లండన్ – బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంటు సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. తాను అన్ని రకాల కొవిడ్ నియమాలు పాటించినట్లు చెప్పిన బోరిస్ జాన్సన్ హౌస్ ఆఫ్ కామన్స్ ను తప్పుదారి పట్టించాడంటూ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాను పార్లమెంటును విడిచిపెట్టడం చాలా విచారకరం అంటూ జాన్సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు .”నేను కొద్దిమంది వ్యక్తుల వల్ల బలవంతంగా బయటకు వెళుతున్నాను” అని ఆయన […]
స్పెషల్ టికెట్ భక్తుల కోసం.. పేదల క్యూ లైన్లు ఇర్కుటం
స్పెషల్ టికెట్ భక్తుల కోసం.. పేదల క్యూ లైన్లు ఇర్కుటం
వాక్చాతుర్యం ఎక్కువ.. వాస్తవాలు తక్కువ.. : కాంగ్రెస్, బీజేపీల మధ్య లేఖల యుద్ధం
BJP Congress Letter War: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటి. దీంతో ఈ ఘటనపై రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఈ ప్రమాదం తర్వాత రైల్వేల నిర్వహణ లోపాలను లేవనెత్తుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ట్రిపుల్ రైలు ప్రమాదంలో 275 మందికి న్యాయం జరిగేలా ప్రమాదానికి గల అసలు కారణాన్ని బయటకు తీసుకురావాలని ఈ లేఖ ద్వారా కోరారు. ఈ లేఖకు ప్రతిస్పందనగా.. నలుగురు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ అధ్యక్షుడికి లేఖ రాశారు. లేఖ రాసిన బీజేపీ ఎంపీల్లో తేజస్వి సూర్య, పీసీ మోహన్, ఎస్ మునిస్వామి, సదానంద గౌడ ఉన్నారు. ఖర్గే లేఖలో వాక్చాతుర్యం ఎక్కువ, వాస్తవాలు తక్కువ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే .. ప్రధాని మోదీకి రాసిన లేఖను బీజేపీ ఎంపీలు తీవ్రంగా విమర్శించారు. ఖర్గే లేఖలో “వాక్చాతుర్యం ఎక్కువ, వాస్తవాలు తక్కువ” అని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మీరు రాసిన లేఖలో రాజకీయ రౌడీయిజం ఎక్కువగా ఉందని, మీరు లేవనెత్తిన ప్రశ్నల్లో వాస్తవాలు లేవని చెప్పాల్సి వస్తోందని లేఖలో పేర్కొన్నారు. రైల్వేలో నియామకాల కొరతను బీజేపీ ఎంపీలు తిరస్కరించారు. గత తొమ్మిదేళ్లలో రైల్వేలో 4.58 లక్షల నియామకాలు జరిగాయని, ప్రస్తుతం దాదాపు 1.52 లక్షల మంది నియామక ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఈ విధంగా 10 సంవత్సరాలలో తాము 6.1 లక్షల మంది అభ్యర్థులను నియమించబోతున్నామనీ, ఇది UPA నియమించిన 4.11 లక్షల మంది అభ్యర్థుల కంటే దాదాపు 50% ఎక్కువ అనీ, అలాగే కొత్తగా 5,518 మంది అసిస్టెంట్ లోకో పైలట్లను నియమించామని, ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్న మీ ఆరోపణను తోసిపుచ్చుతున్నామన్నారు. వాట్సాప్ యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వాస్తవాలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ ఆరోపణలు చేయకూడదనీ, 2023 ఫిబ్రవరిలో ప్రస్తావించిన ఘటనపై రైల్వేశాఖ క్షుణ్ణంగా విచారణ జరిపిందని లేఖలో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నామనీ, నిర్వహణను ఖచ్చితంగా అమలు చేయడంపై సిబ్బందిందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారని బీజేపీ ఎంపీలు పేర్కొన్నారు. ఖర్గే(మీ) లేఖలో పేర్కొన్నట్లు మైసూర్లో ఎలాంటి ఘర్షణ జరగలేదని, వాట్సాప్ యూనివర్సిటీ లో వచ్చిన కథనాల ఆధారంగా ప్రధానమంత్రికి లేఖ రాయడం మీ స్థాయి నాయకుడికి సరిపోదనీ, కానీ బహుశా WhatsApp విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా మీరు నకిలీ వార్తలను వాస్తవంగా రూపొందించవలసి వచ్చిందని ఏద్దేవా చేశారు. కాంగ్రెస్ అధినేత ఖర్గేకు చురకలంటిస్తూ..మీరు రైల్వే మంత్రిత్వ శాఖ బాధ్యతను నిర్వహించారు. కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ స్వతంత్ర,చట్టబద్ధమైన అథారిటీ అని మీరు తప్పక తెలుసుకోవాలి, ఇటీవల 2022లో CRS పోస్ట్‌ను అత్యున్నత స్థాయికి అప్‌గ్రేడ్ చేయడం ద్వారా కమిషన్ మరింత బలోపేతం చేయబడిందని తెలిపారు. అసంపూర్ణ గణాంకాలు బడ్జెట్లో కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించలేదని కాగ్ నివేదికను ఉటంకిస్తూ కాంగ్రెస్ ఆరోపించిందని, భద్రతకు సంబంధించిన ముఖ్యమైన పనుల కోసం బీజేపీ హయాంలో రాష్ట్రీయ రైల్ సురక్షా కోష్ (ఆర్ఆర్ఎస్కే)ని ఏర్పాటు చేశారని బీజేపీ ఎంపీలు తెలిపారు. 2017-18 నుంచి 2021-22 మధ్య రైల్వేలు RRSK కోసం రూ. 1 లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఫిబ్రవరి 2022లో ప్రభుత్వం RRSK యొక్క చెల్లుబాటును 2022-23 నుండి మరో ఐదేళ్లపాటు పొడిగించింది. మీరు రైల్వే మంత్రిగా ఉన్నారని, ఈ మొత్తం మీ వాదనలు తప్పని రుజువు చేస్తున్నాయని ఎంపీలు రాశారు. గత తొమ్మిదేళ్లలో రైల్యే మొత్తం భద్రతా వ్యయం రూ. 1,78,012 కోట్లు, ఇది మీ పదవీకాల వ్యయం కంటే 2.5 రెట్లు ఎక్కువ. UPA 10 సంవత్సరాలలో ఇంత కంటే పేలవంగా పనిచేసిన తర్వాత కూడా రైలు భద్రతపై మాకు ఉపన్యాసాలు ఇవ్వగల విశ్వాసాన్ని మీరు ఎలా కలిగి ఉన్నారనేది ఆసక్తికరంగా ఉందని విమర్శించారు. ఆ లేఖలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ యాంటీ కొలిజన్ డివైస్‌పై ఎంత సీరియస్‌గా మాట్లాడుతుందనేది ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ సీబీఐ విచారణను ఖర్గే వ్యతిరేకించడంపై బీజేపీ ఎంపీలు మాట్లాడుతూ.. రైల్వే సేఫ్టీ కమిషనర్ ప్రమాదంపై మాత్రమే దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనలో చిక్కుముడి వీడడంతో సీబీఐ విచారణ చేపట్టిందని తెలిపారు. అదేవిధంగా రైల్వేలో మూడు లక్షల ఖాళీ పోస్టుల ప్రశ్నపై బీజేపీ ఎంపీలు మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో రైల్వేలో ఆరు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇది మాత్రమే కాదు, కొత్తగా నియమితులైన 5518 లోకో పైలట్లు ఖర్గే ఆరోపణలను తిరస్కరించారు. రైల్వే బడ్జెట్‌ను ప్రతి ఏటా తగ్గిస్తున్నారనే ఆరోపణలను బీజేపీ ఎంపీలు తోసిపుచ్చారు. తొమ్మిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వ కృషితో రైల్వేశాఖకు కొత్త బలం చేకూరిందని అన్నారు. విద్యుదీకరణలో రికార్డు పురోగతి సాధించిందనీ, వందే భారత్ రైళ్లు ప్రారంభించబడ్డాయనీ, దాదాపు 1,275 స్టేషన్లు ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేయబడుతున్నాయని తెలిపారు. ఖర్గే తీవ్ర ప్రశ్నలు రైల్వేలను ప్రాథమికంగా బలోపేతం చేయడానికి బదులుగా, వార్తల్లో నిలిచేందుకు మాత్రమే మార్పులు చేస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తరచూ తప్పుడు నిర్ణయాల వల్ల రైలు ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఖర్గే ఆరోపించారు. రైల్వేలో మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఖర్గే ఆరోపించారు. ఘటన జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కూడా 8,278 ఖాళీలు ఉన్నాయి. చాలా మంది సీనియర్ పోస్టులు కూడా ఇవ్వలేదని ఖర్గే పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఈ ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదని ఖర్గే ప్రశ్నించారు. సిబ్బంది కొరత కారణంగా లోకో పైలట్లు ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తోందన్న వాస్తవాన్ని రైల్వే బోర్డు స్వయంగా అంగీకరించిందని ఖర్గే లేఖలో రాశారు. రైల్వే భద్రతకు లోకో పైలట్లే ముఖ్యమని, అయితే ..ఆ ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ఖర్గే ప్రశ్నించారు. ఫిబ్రవరి 8, 2023న మైసూర్లో జరిగిన ప్రమాదం తర్వాత.. రైల్వే సిగ్నల్ సిస్టమ్‌ను సరిచేయాలని సౌత్ వెస్ట్ జోనల్ రైల్వే ఆపరేషన్స్ అధికారి చెప్పారని, అయితే ఆ హెచ్చరికను రైల్వే మంత్రిత్వ శాఖ ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు నిలదీశారు. రైల్వే సేఫ్టీ కమిషన్ సలహాను రైల్వే బోర్డు విస్మరించిందని ప్రధాని మోదీకి రాసిన లేఖలో కాంగ్రెస్ పార్టీ అధినేత పేర్కొన్నారు. కేవలం 8-10 శాతం రైలు ప్రమాదాలను మాత్రమే కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సిఆర్ఎస్) విచారిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. సీఆర్ఎస్ను పటిష్టంగా, స్వయంప్రతిపత్తిగా మార్చేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఖర్గే ప్రశ్నించారు. ట్రాక్ నిర్వహణ పట్టించుకోలేదని ఖర్గే ఆరోపించారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో ఎందుకు విలీనం చేశారని ఖర్గే ప్రశ్నించారు. ఇది రైల్వేల స్వయంప్రతిపత్తిని, నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసిందని ఖర్గే అన్నారు. సీబీఐ దర్యాప్తుపై కూడా ప్రశ్నలు ఒడిశా రైలు ప్రమాదానికి మూలకారణాన్ని కనుగొన్నామని రైల్వే మంత్రి చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణ ఎందుకు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. రైల్వేలో సాంకేతిక, భద్రత, సిగ్నలింగ్ నిపుణుల కొరత ఉందని ఖర్గే అన్నారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని, అయితే రైలు ప్రమాదం సాంకేతిక, సంస్థాగత , రాజకీయ వైఫల్యమని, ఈ విషయంలో సీబీఐ విచారణతో జవాబుదారీతనం సరికాదని ఖర్గే అన్నారు. శుక్రవారం (జూన్ 2) సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్నాయనే విషయం తెలిసిందే.. ఈ ప్రమాదంలో 288 మంది మరణించగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఇదొకటి.
లక్షల్లో లాభాలంటూ కోటిన్నర కొట్టేసిన్రు: సైబర్‌నేరగాళ్ల బాధితులు
లక్షల్లో లాభాలంటూ కోటిన్నర కొట్టేసిన్రు: సైబర్‌నేరగాళ్ల బాధితులు
ఫాంహౌస్ కేసు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్! ఈసారి అసెంబ్లీ టికెట్లు డౌటే?
బీఆర్ఎస్లోని ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందంటూ నమోదైన కేసు అప్పట్లో సంచలనంగా మారింది.
డెడ్ బాడీలు ఉంచిన బడిని కూల్చేస్తున్నరు
డెడ్ బాడీలు ఉంచిన బడిని కూల్చేస్తున్నరు
బీఆర్ఎస్తోనే తెలంగాణ రాలే.. త్యాగాల్లేకుండా రాష్ట్రం ఏర్పాటయ్యేదా?
బీఆర్ఎస్తోనే తెలంగాణ రాలే.. త్యాగాల్లేకుండా రాష్ట్రం ఏర్పాటయ్యేదా?
ప్రైమ్ స్టేషన్లకు ఫుల్ గిరాకీ.. పోటాపోటీగా పోలీస్ ఆఫీసర్ల పైరవీలు
ప్రైమ్ స్టేషన్లకు ఫుల్ గిరాకీ.. పోటాపోటీగా పోలీస్ ఆఫీసర్ల పైరవీలు
జూన్ 10 : ఈరోజు పెట్రోల్,డీజిల్ ధరలు
గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ముడిచమురు ధరలు పెరగడమో, లేక తగ్గడమో జరిగేవి కానీ, కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు
పొట్టిగా ఉండడం వల్ల పెళ్లి కావట్లేదని మనస్తాపం.. యువతి ఆత్మహత్య..
ఝార్ఖండ్ : పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జార్ఖండ్‌లో వెలుగు చూసింది. తాను ఎత్తు తక్కువగా ఉండడంవల్ల వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతున్నాయి అని మనస్థాపానికి గురైంది. ఇప్పటికే మూడు పెళ్లి సంబంధాలు తప్పిపోయాయి. దీంతో బెంగ పెట్టుకున్న శ్వేత (22) అనే యువతి ఝార్ఖండ్‌లో రాంచి సమీప పుండగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బలవన్మరణానికి పాల్పడింది. ఆ మూడు పెళ్లి చూపుల్లోనూ.. చివరిదాకా వచ్చి చెడిపోయాయి. దీనికి కారణం తాను పొట్టిగా ఉండడమే. తన ఎత్తు కారణంగా సంబంధాలు తప్పిపోతుండడంతో శ్వేత తీవ్రమనస్థాపానికి గురైంది. తీవ్ర ఆవేదనకు లోనయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు ఎంతగానో నచ్చ చెప్పారు. కానీ ఆమె ఆ బాధ నుంచి కోలుకోలేకపోయింది. బీహార్ లోని అరవల్ లో తల్లిదండ్రులు ఉంటున్నారు. జార్ఖండ్ లోని రాంచీలో అక్క శిల్పతో కలిసి శ్వేత ఉంటుంది. కాగా, పనిమీద తాను గురువారం రాత్రి బయటికి వెళ్లారని శిల్ప చెప్పింది. ఆ తర్వాత తమ పొరిగింటి వారు ఫోన్ చేసి శ్వేతా ఆత్మహత్య చేసుకుందామని తెలిపారని శిల్ప చెప్పింది విషయం పోలీసులకు తెలియడంతో అక్కడిచేరుకున్న పోలీసులు శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కూతురి ప్రేమను కాదన్నందుకు తల్లిని హత్య చేసిన ప్రియుడు... ఇదిలా ఉండగా, గతంలో ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో వెలుగు చూసింది. చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెందడం. ఆత్మహత్యలకు పాల్పడడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి ఓ విషాద సంఘటన నగరంలోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది. వయసు మీరుతున్నా పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్ లో విజయ లక్ష్మీ (26) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. ఆమెకు గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే చాలామంది వచ్చి చూసి పోతున్నారే కానీ.. సంబంధం కుదరడం లేదు. తనకు పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా… వివాహం మాత్రం కావడంలేదని ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో జీవితంపై విరక్తితో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయలక్ష్మి మృతి చెందింది.
అంతొద్దు లోకేషా.. ఫస్ట్ క్షమాపణలు చెప్పు: ఎమ్మెల్యే గడికోట
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో
ఆఫీసర్లు చెక్కులు పంపిణీ చేయడంపై శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆగ్రహం
ఆఫీసర్లు చెక్కులు పంపిణీ చేయడంపై శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆగ్రహం
తరచుగా మూత్రం, మూత్రంలో రక్తం.. మగవాళ్లు దీన్ని లైట్ తీసుకున్నారో..!
పురుషులకు తరచుగా మూత్రం రావడం, మూత్రంలో రక్తం పడటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ప్రోస్టేట్ గ్రంధికి సంబంధించింది. నిపుణుల ప్రకారం.. ఇవి ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో ప్రొస్టేట్ గ్రంథి ప్రధాన అవయవం. ఇది మూత్రాశయం అడుగున, పురీషనాళం ముందు ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథి ప్రధాన విధి సెమినల్ ద్రవాన్ని ఉత్పత్తి చేయడం. అలాగే వీర్యం సరైన పనితీరుకు సహాయపడటం. prostate cancer /> అయితే ప్రస్తుతం చాలా మంది ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. పురుషులను ప్రభావితం చేసే క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఒకటిగా మారింది. వృద్ధులకే కాదు, యువకులకు కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పురుషులు ఈ క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నిపుణుల ప్రకారం.. వయస్సుతో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అయితే ఈ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా చికిత్స చేయొచ్చు. కానీ ప్రారంభ దశలో కొన్నిసార్లు ప్రొస్టేట్ క్యాన్సర్ ఎలాంటి లక్షణాలను చూపించదు. తరచుగా మూత్రవిసర్జన, మూత్ర విసర్జన చేసేటప్పుడు వచ్చే సమస్యలు, మూత్ర విసర్జనలో నొప్పి, అసౌకర్యం, మూత్రం లేదా వీర్యంలో రక్తం, పురీషనాళంలో ఒత్తిడి, తుంటి, కటి లేదా మల ప్రాంతంలో నొప్పి ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు. వెన్నెముక, ఎముకలలో నొప్పి, ఎముక పగుళ్లు , బలహీనమైన మూత్రపిండాలు కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలే. అలాగే అలసట, బరువు తగ్గడం కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలే కావొచ్చంటున్నారు నిపుణులు. ప్రోస్టేట్ క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ పురుషులు మూత్రాన్ని ఆపుకోలేరు. అలాగే మూత్రవిసర్జనలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లడం, అంటువ్యాధులు వస్తాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాప్తి లక్షణాలలో ఒకటి కాలులో మంట. క్యాన్సర్ శోషరస కణుపులకు వ్యాపిస్తే కాళ్లలో విపరీతమైన మంట వస్తుంది. అయితే ఈ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే వ్యాధిని తిప్పికొట్టొచ్చు. కానీ దీనిపై అవగాహన లేకపోవడం వల్ల ఇది ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. ఎందుకంటే ఇది చాలా లేట్ గా నిర్దారణ అవుతుంది. కొన్ని రకాల ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటి లక్షణాలను చూపించదు. ప్రోస్టేట్ క్యాన్సర్ మొదట్లో ఎలాంటి లక్షణాలను చూపించకపోవచ్చంటున్నారు నిపుణులు.ఎందుకంటే అవి గ్రంథి బయటి భాగంలో ఉంటాయి.
అభివృద్ధి అంటే అప్పులు చేసుడా.. ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకే దశాబ్ది ఉత్సవాలు
అభివృద్ధి అంటే అప్పులు చేసుడా.. ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకే దశాబ్ది ఉత్సవాలు
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు.. 36 మందిపై చార్జ్‌షీట్
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు.. 36 మందిపై చార్జ్‌షీట్
దళారుల చేతుల్లో ధరణి...అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తం
దళారుల చేతుల్లో ధరణి...అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తం
Prema Entha Madhuram: పేలైన మాన్సీ ప్లాన్.. ఆర్య ను చేరుకున్న అను!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ భార్యాభర్తల అనురాగానికి ప్రతీకగా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. తన భర్తకి ఏదో అయిపోతుంది అని భయపడి భర్తకి దూరమై మళ్లీ భర్తకి చేరువైన ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో సమస్యలు ఎదురైతే పరిష్కరించుకోవాలి అంతేకానీ సమస్య నుంచి పారిపోకూడదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అయినా ఆ బాబుకి ఏదో అవుతుంది అని అనుకుంటే పాపతో పూజ చేయించిన రోజే ఏదో అయ్యి ఉండేది. మనసులో పిచ్చిపిచ్చి ఆలోచనలు ఏవి పెట్టుకోవద్దు ఇంకా నువ్వు దూరంగా ఉంటేనే ఆ బాబు మీకోసం ఆలోచిస్తూ ఏమైనా అయిపోగలడు అంటుంది బామ్మ. అలా అనొద్దు అంటూ కంగారు పడుతుంది అను. మరేంటమ్మా.. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నువ్వు బాధపడి ఆ బాబుని బాధ పెట్టొద్దు. మీరు చాలా మంచివారు మీకు ఎందుకు చెడు జరుగుతుంది. నేను చెప్పినట్లు విను పద మీ ఇంటికి వెళ్దాం. నామకరణం ఆ బాబు చేతుల మీదుగానే చేయిద్దాం అంటూ అనుని తీసుకొని బయలుదేరుతుంది బామ్మ. మరోవైపు అనుకి ఇష్టమైనవన్నీ రెడీ చేయమని వంట వాళ్లకి చెప్తుంది శారదమ్మ. నేను చేస్తాను ఆంటీ..ప్రాసెస్ మీరు చెప్పండి అంటూ ఉత్సాహంగా శారదమ్మ దగ్గర నేర్చుకుని మరీ వంటలు చేస్తుంది అంజలి. వీళ్ళ నమ్మకమే నిజమే అను తిరిగి వచ్చేస్తే నా పరిస్థితి అంతే.. అని మనసులో కంగారుపడుతుంది మాన్సీ. మరోవైపు ఆటోలో వస్తున్న అను వాళ్ళని చూస్తుంది మాన్సీ మనిషి. ఫోటో తీసి మాన్సీ కి పంపిస్తుంది. ఫోన్ చేసి అను మీ ఇంటికి వస్తుంది మీకు ఫోటో తీసి పంపించాను చూడండి అని మాన్సీ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. తను దర్జాగా ఇంటికి వస్తుంటే మీరేం చేస్తున్నారు సినిమా చూస్తున్నారా.. తనని ఇంటికి రాకుండా ఆపండి అంటూ కోప్పడుతుంది మాన్సీ. అలాగే మేడం అంటూ రౌడీలని తీసుకొని అనుని వెంబడిస్తుంది మాన్సీ మనిషి. అదృష్టం కొద్దీ కాస్తలో తప్పించుకొని అను వాళ్ళ వీధిలోకి వెళ్ళిపోతుంది. అదే విషయాన్ని మాన్సీ కి ఫోన్ చేసి చెప్తుంది మాన్సీ మనిషి. ప్లాన్ ఫెయిల్ అయినందుకు కోపంతో రగిలిపోతుంది మాన్సీ. ఆ తరువాత గుమ్మం ముందు ఆటో ఆగితే అనుమానంగా చూస్తాడు జెండే. ఆటోలో నుంచి దిగుతున్న అను ని చూసి షాక్ అవుతాడు. తర్వాత ఆనందంతో ఆర్య ని కేక వేసి పిలుస్తాడు.నీరజ్ ఆటో దగ్గరికి వచ్చి వదినమ్మ.. అని పలకరించి పాపని ఎత్తుకుంటాడు. జెండే ఒక పాపని ఎత్తుకుంటాడు. జెండే పిలుపుకి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆర్య అనుని చూసి ఎమోషనల్ అవుతాడు. దాదాపు అను ఆర్య ఇద్దరు కన్నీరు పెట్టుకుంటారు ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటారు. ఎందుకు వెళ్లిపోయావు నావల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అని అడుగుతాడు ఆర్య. అలాంటిదేమీ లేదు అంటూ జరిగిందంతా చెప్తుంది అను. మళ్లీ మీకు జీవితంలో కనిపించకూడదని అనుకున్నాను కానీ మిమ్మల్ని వదిలి ఉండలేకపోయాను అందుకే వచ్చేసాను. బామ్మ కూడా నేను చేసింది మంచి పని కాదని చెప్పి ఇక్కడికి తీసుకు వచ్చింది అని చెప్తుంది అను. బామ్మా అంటూ అనుమానంగా చూస్తాడు ఆర్య. బామ్మ ని చూసిన ఆర్య అంటే.. ఆరోజు గుడిలో పూజ చేయించిన పాప నిన్న ఇంట్లో చూసిన పాప.. అంటూ ఎమోషనల్ అవుతాడు ఆర్య. మన పాపే మనటంతో కన్నీరు పెట్టుకుంటూ జండే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లి పిల్లలిద్దర్నీ ఎత్తుకొని ముద్దాడుతాడు.ఈ క్షణం కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూశానో తెలుసా.. మరి ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు మన ప్రేమే మనకి రక్ష అంటాడు ఆర్య. మరి ఇప్పుడు ఇలా చేయను క్షమించమని అడుగుతుంది అను. వాళ్ళిద్దరూ అలా ఎమోషనల్ అవుతూ ఉండగానే సుబ్బు దంపతులు వస్తారు కూతుర్ని చూసి ఎమోషనల్ అవుతారు పిల్లల జర్నీ ఎత్తుకొని ముద్దాడుతారు.శారదమ్మ కూడా పిల్లల్ని ముద్దాడుతుంది. ముద్దులు మురిపాలు అన్ని ఇంటిబయటేనా.. ముందు వాళ్ళని లోపలికి రానీయండి అంటుంది అంజలి. ఆ దంపతులకి హారతి ఇస్తుంది అంజలి. కుడికాలు ముందు పెట్టి దంపతులిద్దరూ లోపలికి వస్తారు తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.
సామాజిక న్యాయం జరగాలంటే..బీసీ డిక్లరేషన్ అమలు కావాలి
సామాజిక న్యాయం జరగాలంటే..బీసీ డిక్లరేషన్ అమలు కావాలి
ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో శర్వానంద్, రక్షిత జంట స్టైలిష్ గా చూడ ముచ్చటగా కనిపించారు.వెడ్డింగ్ రిసెప్షన్ లో టాలీవుడ్ తారలంతా మెరిశారు. చాలా మంది హీరోలు సతీసమేతంగా హాజరయ్యారు. టాలీవుడ్ లో శర్వానంద్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఎలాంటి ఎమోషన్ అయినా పండించగల నటుడిగా శర్వానంద్ కి గుర్తింపు ఉంది. శర్వానంద్ చివరగాఒకే ఒక జీవితం అనే టైంట్రావెల్ మూవీలోనటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ ఇటీవల జైపూర్ లో జరిగిన వివాహ వేడుకలో రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు. శర్వానంద్ పెళ్ళికి టాలీవుడ్ నుంచి కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరై ఆశీర్వదించారు. శర్వా బెస్ట్ ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా పెళ్లి వేడుకలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ లో లాస్ట్ నైట్ జూన్ 9న శర్వానంద్, రక్షిత రెడ్డి రిసెప్షన్ వేడుక గ్రాండ్ గా జరిగింది. శర్వానంద్ తన రిసెప్షన్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో శర్వానంద్, రక్షిత జంట స్టైలిష్ గా చూడ ముచ్చటగా కనిపించారు. శర్వానంద్ వెస్ట్రన్ స్టైల్ లో వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించగా.. రక్షిత రెడ్డి పింక్ కలర్ డిజైనర్ శారీలోమెరిసింది. ఇక వెడ్డింగ్ రిసెప్షన్ లో టాలీవుడ్ తారలంతా మెరిశారు. చాలా మంది హీరోలు సతీసమేతంగా హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు కూడా శర్వా వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరు కావడం విశేషం. హీరోలు, నిర్మాతలు, దర్శకులు, నటీమణులు ఇలా టాలీవుడ్ ప్రముఖులు శర్వా వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేశారు. దీనితోశర్వా, రక్షిత వెడ్డింగ్ రిసెప్షన్ కనుల పండుగలా సాగింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఉపాసనతో కలసి ఈ వేడుకకి హాజరయ్యారు. ఉపాసన నిండు గర్భిణి కావడంతో ఆమెని జాగ్రత్తగా చేయి పట్టుకుని చరణ్ నడిపించుకుని వస్తున్న దృశ్యాలు ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక యంగ్ హీరోలు నితిన్, నిఖిల్, అల్లరి నరేష్ వారి వారి సతీమణులతోమెరిశారు. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన భార్య తేజస్వినితో కలసి వచ్చారు. అలాగే నందమూరి బాలకృష్ణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ శర్వా వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడున్న వారంతా కేటీఆర్‌తో ముచ్చటించడం, సెల్ఫీలుతీసుకోవడం చేశారు. అక్కినేని అమల, యంగ్ బ్యూటీ రీతూ వర్మ, జీవిత రాజశేఖర్ వారి కుమార్తెలు, రానా దగ్గుబాటి, మంచు లక్షిఇతర నటీనటులు శర్వానంద్ రిసెప్షన్ లో సందడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత రాజ్యాంగం ఇలా చెప్పింది, అలా సూచించింది, ప్రజలందరికీ సమాన హక్కులిచ్చింది, వారిలో శాస్త్రీయ చైతన్యాన్ని పెంచాలని నిర్దేశించింది, బాల్య వివాహాలను నిషేధించింది అని ఇలా ఆ మహద్గ్రంధంలోని మంచిని గురించి పదే పదే చెప్పుకోడం అర్ధంలేని పని అనిపిస్తున్నది.తిరోగామి శక్తులు, అభివృద్ధి నిరోధక వర్గాలు పని కట్టుకొని రాజ్యాంగ సదాశయాలకు, దాని మతాతీత గుణానికి వ్యతిరేకంగా నడచుకొంటూ ప్రచారం సాగిస్తున్న విషాద దృశ్యం ఒక వైపు భయపెడుతుండగా, మరోవైపు రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసి ఉన్నత […]
చెప్పులతోనే రావాలె!..గ్రూప్1 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచన
చెప్పులతోనే రావాలె!..గ్రూప్1 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచన
కూతురి ప్రేమను కాదన్నందుకు తల్లిని హత్య చేసిన ప్రియుడు...
వయసులో పెద్దవాడితో కూతురు ప్రేమలో పడడం తల్లి ఇష్టపడలేదు. దీంతో కోపానికి వచ్చిన ఆ ప్రియుడు ఆ తల్లినే హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్ : ప్రేమను నిరాకరిస్తే ప్రియురాలినో, ప్రియుడినో చంపడం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనలో.. తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని ప్రియురాలి తల్లిని దారుణంగా చంపేశాడు ఓ ప్రేమికుడు. తమ ప్రేమకు అడ్డు చెబుతోంది అన్న కోపంతో ప్రియురాలి తల్లిని ఓ యువకుడు పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపేశాడు. అయితే తల్లిని ఇలా చంపడం వెనక ఆమె మైనర్ కూతురు పాత్ర కూడా ఉందని ప్రాథమిక అంచనాలో పోలీసులు గమనించారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలోని భావన అరోమా హౌసింగ్ సొసైటీ పరిధిలో ఈ దారుణం జరిగింది. మృతురాలు అంజలి బజాజ్. బుధవారం రాత్రి నుంచి ఆమె కనిపించడం లేదు. ఉదిత్ బజాజ్, అంజలి బజాజ్ దంపతులు. వీరికి ఓ కుమార్తె ఉంది. ఉదిత్ బజాజ్ ఫుట్‌వేర్ వ్యాపారి. ఉత్తరప్రదేశ్ లోని సికంద్రా పోలీస్ స్టేషన్ లో బుధవారం రాత్రి నుంచి భార్య కనిపించడం లేదంటూ ఉదిత్ ఫిర్యాదు చేశాడు సమీపంలోని మహాదేవ్ ఆలయానికి వెళ్లిన అంజలి మళ్లీ తిరిగి రాలేదని తన ఫిర్యాదులో ఉదిత్ తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అంజలి మృతదేహాన్ని మహాదేవ్ ఆలయ సమీపంలో కనిపెట్టారు. గుడికని వెళ్లిన తన భార్య శవంగా మారడం.. అసలు ఆమెను ఎవరు? ఎందుకు? చంపారో తెలియక ఉదిత్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అంజలిని చంపింది.. కూతురి ప్రియుడుగా తేలింది. దీని గురించి వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కుమార్తె తల్లిని మహాదేవ్ ఆలయానికి వచ్చేలా చేసింది. ఆమెకు తోడుగా తండ్రి కూడా వచ్చాడు. దీంతో తన తెలివిని ఉపయోగించి తండ్రికి ఫోన్ చేసి ఆయన మరోచోటికి వెళ్లేలా చేసింది కూతురు. అలా కాసేపు తర్వాత తిరిగి వచ్చేసరికి ఆలయం దగ్గర భార్య కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. భార్య మృతి వెనక కూతురి హస్తం ఉందని తెలియడంతో షాక్ అయ్యాడు. తన టీనేజ్ కూతురు వయసులో చాలా పెద్దవాడైన ప్రాకర్ గుప్తాతో ప్రేమలో పడింది. ఈ ప్రేమను అంజలి ఒప్పుకోలేదు.దీంతో అంజలి మీద కోపం పెంచుకున్న ప్రాకర్ ఆమెను హత్య చేశాడు. ఈ హత్యలో ప్రాకర్ తో పాటు అతని స్నేహితుడు, అంజలి కూతురు పాత్రలు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి కోసం గాలిస్తున్నారు.